breaking news
Shahi imam of Jama Masjid
-
శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం
లక్నో: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలన్న అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) శుక్రవారం కొట్టేసింది. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి నేపథ్యంగా సాగుతున్న కేసులో భాగంగా.. ఈ పిటిషన్ సైతం దాఖలైంది.షాహీ ఈద్గా అక్రమ కట్టడమని, కాబట్టి వివాదాస్పద స్థలంగా ప్రకటించాలని, ఈ కేసు విచారణ ముగిసే దాకా కోర్టు రికార్డుల్లో అలాగే ప్రస్తావించేలా కోర్టు సిబ్బందిని ఆదేశించాలని హిందూ సంఘాల తరఫున మహేంద్ర ప్రతాప్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. అయితే ముస్లిం సంఘాల తరఫు లాయర్ ఈ అభ్యర్థనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టేసింది.శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో వివిధ హిందూ సంఘాలు కోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లో శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో,కోర్టు పత్రాల్లో భవిష్యత్ విచారణలలో షాహీ ఈద్గా మసీదు అనే పదాన్ని ఉపయోగించకుండా, దాని స్థానంలో వివాదాస్పద నిర్మాణం అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశించమని పేర్కొన్నారు. ఇదే పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టంది. తదుపరి విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది. #WATCH | Prayagraj, Uttar Pradesh: On Allahabad High Court dismissing an application seeking to substitute the term 'Shahi Idgah Mosque' with 'disputed structure,' Advocate Saurabh Tiwari says, "The High Court has rejected the application of considering it as the disputed… pic.twitter.com/uXy4TXyvZi— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2025 -
షాషీ జామా మసీదులో సర్వే కొనసాగుతుంది: అలహాబాద్ హైకోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో ఉన్న షాషీ జామా మసీదు సర్వేలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలన్న 2024 నవంబర్‌లో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.షాహీ జామా మసీదు సర్వే నిర్వహించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరుతూ ముస్లీం సంస్థ ప్రతినిధులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (మే19) అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులు నిలిపివేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసింది. సర్వే కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
ఆలయం బావిలో విగ్రహాలు
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌లో దాదాపు 46 ఏళ్ల తర్వాత గత వారం తెరుచుకున్న ఆలయం సమీపంలోని బావిలో దెబ్బతిన్న మూడు దేవతా విగ్రహాలు లభించాయి. నవంబర్‌లో షాహి జామా మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు ప్రయతి్నస్తుండగా హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని ఖగ్గూ సరాయ్లోనే శ్రీ కార్తీక్ మహదేవ్(భస్మా శంకర్)ఆలయం ఉంది. అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో అక్కడే 1978 నుంచి మూతబడి ఉన్న ఆలయం విషయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉండగా, పక్కనే ఉన్న బావి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో సోమవారం అధికారులు పూడిక తీత మొదలుపెట్టారు. సుమారు 15 అడుగుల లోతులో దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతి, గణేశ్, లక్ష్మీ దేవతా విగ్రహాలు లభించాయని అధికారులు చెప్పారు. ఆలయం ప్రాచీనతను కాపాడే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకు ధ్వంసం చేసి ఉంటారనే విషయపై వివరాలను సేకరిస్తున్నామని అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా చెప్పారు. ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు కూడా జరుగుతోందన్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షతో ఆలయంతోపాటు బావి ప్రాచీనతను నిర్థారించాలని కోరుతూ పురావస్తు శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తున్నారు. అధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆప్‌కు మద్దతివ్వాలంటూ ముస్లింలకు బుఖారీ పిలుపు
-
బుఖారీ ఆఫర్‌ని చీపురుతో ఊడ్చిన ఆప్
న్యూ ఢిల్లీ : జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇచ్చిన ఆఫర్‌ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. ఢిల్లీలో నివసించే ముస్లింలందరూ ఆప్‌కి ఓటు వేయాలని బుఖారీ పిలుపునిచ్చారు. మసీదులో ప్రార్థనలకి వచ్చిన ముస్లింలందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒకే పార్టీకి ఓటు వేయాలన్నారు. మతతత్వ పార్టీలకి కాకుండా లౌకిక పార్టీలని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించాలని చూస్తుందని ఆయన విమర్శించారు. ముస్లింల అభివృద్ధికి సహకరించే లౌకిక పార్టీ అయిన ఆప్‌కి ఓటు వేయాలని సూచించారు. కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బుఖారీ ఆప్‌కి వ్యతిరేకంగా మట్లాడి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు. బుఖారీ భావజాలానికి ఆప్ వ్యతిరేకం అని తమకి ఆయన మద్దతు అవసరం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. బుఖారీ తన కుమారున్ని జామా మసీదు తదుపరి షాహీ ఇమామ్‌గా పట్టాభిషేకం చేసే కార్యక్రమానికి భారత ప్రధానిని ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని పిలిచి బుఖారీ తన అసలు రంగు బయట పెట్టుకున్నారని సంజయ్ సింగ్ విమర్శించారు.