
‘కాల్పుల విరమణ’లో ట్రంప్ జోక్యంపై విపక్ష సభ్యుల ఆగ్రహం
భారత్‌కు సంబంధం లేదు
కేంద్ర ప్రభుత్వం స్పష్టికరణ
ఆ ఒప్పందంలో అమెరికా పాత్ర ఎంతమాత్రమూ లేదని వెల్లడి
‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాలను ప్యానెల్‌కు నివేదించిన విక్రం మిస్రీ
న్యూఢిల్లీ: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు, తర్వాత నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, తదనంతర పరిణామాలు, పూర్వాపరాలపై విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘంలో సోమవారం జరిగిన చర్చ చివరకు విపక్ష, అధికార పక్షాల వాదనలతో వాడీవేడిగా ముగిసింది. కేంద్రం తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరై సమగ్ర వివరాలను వెల్లడించగా విపక్ష కూటమి సభ్యులు ట్రంప్ జోక్యంపై ప్రధానంగా ప్రస్తావించి కేంద్ర నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు.
తన కారణంగానే కాల్పులు ఆగిపోయాయని, కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదకొచి్చందని ట్రంప్ దాదాపు ఏడు సార్లు సొంత డబ్బా కొట్టుకున్నా ప్రధాని మోదీ ఎందుకు ఆయనను నిలువరించలేదని విపక్ష సభ్యులు నిలదీశారు. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాను కోరలేదని ప్రభుత్వ వైఖరిని మిస్రీ స్పష్టంచేశారు.
అమెరికా అధ్యక్షుడే ఉద్దేశపూర్వకంగా సొంతంగా కలుగజేసుకునేందుకు ప్రయతి్నంచారని, జోక్యంపై ట్రంప్ కనీసం భారత్ నుంచి అనుమతి కూడా తీసుకోలేదని మిస్రీ చెప్పారు. ట్రంప్ ప్రకటనలను విపక్ష సభ్యులు ప్రస్తావించడం, మోదీ ప్రభుత్వానికి ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని మిస్రీ వాదించడంతో కొద్దిసేపు సమావేశంలో వాడీవేడి చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రికార్డ్ స్థాయిలో 24 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశం ఏకంగా మూడు గంటలపాటు సాగింది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున అభిõÙక్ బెనర్జీ, కాంగ్రెస్ తరఫున రాజీవ్ శుక్లా, దీపేందర్ హూడా, ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున అపరాజితా సారంగి, అరుణ్ గోవిల్‌లు పాల్గొన్నారు. ‘‘ కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు. మధ్యవర్తిగా ఉండాలని కోరలేదు. కాల్పుల విరమణ కేవలం ద్వైపాక్షికమే. తొలుత ఉద్రిక్త పరిస్థితులున్నా తర్వాత సద్దుమణిగాయి. అవి దాదాపు అణుయుద్ధానికి దారి తీశాయన్న వాదనల్లో ఎలాంటి నిజంలేదు’’ అని మిస్రీ చెప్పారు
ఆయనే కావాలనే దూరారు
‘‘తాను మధ్యవర్తిత్వం చేయడం వల్లే అణుయుద్ధ మేఘాలు విడిపోయాయని, జమ్మూకశ్మీర్ సమస్యలను పరిష్కరిస్తానని పదేపదే ట్రంప్ చెబుతున్నా మోదీ సర్కార్ ఎందుకు ఆయనను నిలువరిస్తూ ప్రకటనలు చేయలేదు?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ‘‘ఇంత జరుగుతున్నా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి పాక్ నిధునెలా సంపాదించింది?. భారత్ ఎందుకు నిధులను అడ్డుకోలేకపోయింది. ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతుంటే ప్రభుత్వం ఎందుకు వెంటనే స్పందించలేకపోయింది?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. వీటికి మిస్రీ సమాధానమిచ్చారు.
‘‘జోక్యం మాటున ట్రంపే స్వయంగా భారత్, పాక్ మధ్యలో దూరిపోయారు. ట్రంప్ జోక్యం విషయంలో భారత ప్రమేయం లేదు. ఉద్దేశపూర్వకంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు’’ అని మిస్రీ స్పష్టంచేశారు. చైనా తయారీ సైనిక ఉపకరణాలను పాకిస్తాన్ వినియోగించిందన్న విపక్షాల వాదనలను మిస్రీ తోసిపుచ్చారు. ‘‘వాళ్లు ఏ దేశానికి చెందిన ఆయుధాలు వాడారనేది ఇక్కడ ప్రధానం కాదు. మనం వాళ్లను ఎంత బలంగా దెబ్బకొట్టామనేదే ముఖ్యం’’ అని మిస్రీ అన్నారు. పరస్పర సైనిక చర్యల్లో మనం ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయామన్న విపక్షాల ప్రశ్నకు మిస్రీ సమాధానం ఇవ్వలేదు.
ఇది జాతీయ భద్రతతో ముడిపడిన అంశమైనందున వివరాలు వెల్లడించట్లేదని పేర్కొన్నారు. మీపై దాడి చేయబోతున్నామని పాకిస్తాన్‌కు ముందే భారత్ అధికారికంగా తెలియజేసిందన్న వార్తలను మిస్రీ తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, ఆర్మీ బేస్‌లు, జనావాసాలపై దాడులు చేయలేదని మాత్రమే, దాడుల తర్వాత పాక్‌కు తెలిపామని మిస్రీ స్పష్టంచేశారు. ఈ విషయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన ప్రకటనను కొందరు వక్రీకరించారని మిస్రీ తెలిపారు. తుర్కియే మొదట్నుంచీ భారత్‌కు దూరంగానే ఉంటోందని గుర్తుచేశారు. అయితే దాడులను భారత్ ఆపేశాక ఆగ్రహంతో సామాజిక మాధ్యమాల్లో మిస్రీపై జరుగుతున్న ట్రోలింగ్‌ను స్థాయీ సంఘం సభ్యులంతా ఏకగ్రీవంగా ఖండించడం విశేషం.