Standing Committe
-
ట్రంప్‌నెందుకు నిలువరించలేదు?
న్యూఢిల్లీ: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు, తర్వాత నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, తదనంతర పరిణామాలు, పూర్వాపరాలపై విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘంలో సోమవారం జరిగిన చర్చ చివరకు విపక్ష, అధికార పక్షాల వాదనలతో వాడీవేడిగా ముగిసింది. కేంద్రం తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరై సమగ్ర వివరాలను వెల్లడించగా విపక్ష కూటమి సభ్యులు ట్రంప్ జోక్యంపై ప్రధానంగా ప్రస్తావించి కేంద్ర నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు. తన కారణంగానే కాల్పులు ఆగిపోయాయని, కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదకొచి్చందని ట్రంప్ దాదాపు ఏడు సార్లు సొంత డబ్బా కొట్టుకున్నా ప్రధాని మోదీ ఎందుకు ఆయనను నిలువరించలేదని విపక్ష సభ్యులు నిలదీశారు. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాను కోరలేదని ప్రభుత్వ వైఖరిని మిస్రీ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడే ఉద్దేశపూర్వకంగా సొంతంగా కలుగజేసుకునేందుకు ప్రయతి్నంచారని, జోక్యంపై ట్రంప్ కనీసం భారత్ నుంచి అనుమతి కూడా తీసుకోలేదని మిస్రీ చెప్పారు. ట్రంప్ ప్రకటనలను విపక్ష సభ్యులు ప్రస్తావించడం, మోదీ ప్రభుత్వానికి ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని మిస్రీ వాదించడంతో కొద్దిసేపు సమావేశంలో వాడీవేడి చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రికార్డ్ స్థాయిలో 24 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశం ఏకంగా మూడు గంటలపాటు సాగింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున అభిõÙక్ బెనర్జీ, కాంగ్రెస్ తరఫున రాజీవ్ శుక్లా, దీపేందర్ హూడా, ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున అపరాజితా సారంగి, అరుణ్ గోవిల్‌లు పాల్గొన్నారు. ‘‘ కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు. మధ్యవర్తిగా ఉండాలని కోరలేదు. కాల్పుల విరమణ కేవలం ద్వైపాక్షికమే. తొలుత ఉద్రిక్త పరిస్థితులున్నా తర్వాత సద్దుమణిగాయి. అవి దాదాపు అణుయుద్ధానికి దారి తీశాయన్న వాదనల్లో ఎలాంటి నిజంలేదు’’ అని మిస్రీ చెప్పారుఆయనే కావాలనే దూరారు ‘‘తాను మధ్యవర్తిత్వం చేయడం వల్లే అణుయుద్ధ మేఘాలు విడిపోయాయని, జమ్మూకశ్మీర్ సమస్యలను పరిష్కరిస్తానని పదేపదే ట్రంప్ చెబుతున్నా మోదీ సర్కార్ ఎందుకు ఆయనను నిలువరిస్తూ ప్రకటనలు చేయలేదు?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ‘‘ఇంత జరుగుతున్నా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి పాక్ నిధునెలా సంపాదించింది?. భారత్ ఎందుకు నిధులను అడ్డుకోలేకపోయింది. ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతుంటే ప్రభుత్వం ఎందుకు వెంటనే స్పందించలేకపోయింది?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. వీటికి మిస్రీ సమాధానమిచ్చారు. ‘‘జోక్యం మాటున ట్రంపే స్వయంగా భారత్, పాక్ మధ్యలో దూరిపోయారు. ట్రంప్ జోక్యం విషయంలో భారత ప్రమేయం లేదు. ఉద్దేశపూర్వకంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు’’ అని మిస్రీ స్పష్టంచేశారు. చైనా తయారీ సైనిక ఉపకరణాలను పాకిస్తాన్ వినియోగించిందన్న విపక్షాల వాదనలను మిస్రీ తోసిపుచ్చారు. ‘‘వాళ్లు ఏ దేశానికి చెందిన ఆయుధాలు వాడారనేది ఇక్కడ ప్రధానం కాదు. మనం వాళ్లను ఎంత బలంగా దెబ్బకొట్టామనేదే ముఖ్యం’’ అని మిస్రీ అన్నారు. పరస్పర సైనిక చర్యల్లో మనం ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయామన్న విపక్షాల ప్రశ్నకు మిస్రీ సమాధానం ఇవ్వలేదు. ఇది జాతీయ భద్రతతో ముడిపడిన అంశమైనందున వివరాలు వెల్లడించట్లేదని పేర్కొన్నారు. మీపై దాడి చేయబోతున్నామని పాకిస్తాన్‌కు ముందే భారత్ అధికారికంగా తెలియజేసిందన్న వార్తలను మిస్రీ తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, ఆర్మీ బేస్‌లు, జనావాసాలపై దాడులు చేయలేదని మాత్రమే, దాడుల తర్వాత పాక్‌కు తెలిపామని మిస్రీ స్పష్టంచేశారు. ఈ విషయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన ప్రకటనను కొందరు వక్రీకరించారని మిస్రీ తెలిపారు. తుర్కియే మొదట్నుంచీ భారత్‌కు దూరంగానే ఉంటోందని గుర్తుచేశారు. అయితే దాడులను భారత్ ఆపేశాక ఆగ్రహంతో సామాజిక మాధ్యమాల్లో మిస్రీపై జరుగుతున్న ట్రోలింగ్‌ను స్థాయీ సంఘం సభ్యులంతా ఏకగ్రీవంగా ఖండించడం విశేషం. -
అనంతపురం నగరపాలక సంస్థలో సత్తా చాటిన YSRCP
-
లీజుల విషయం తేల్చండి
స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా? ఎస్టేట్ అధికారులపై మండిపడిన సభ్యులు విజయవాడ సెంట్రల్ : ‘ఒకసారి వాయిదా వేసిన అంశాన్ని ఆ తర్వాత కమిటీ దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదు. ఇదేం పద్ధతి. ఇలా అయితే నగరపాలక సంస్థకు ఆదాయం ఎలా వస్తుంది. స్టాండింగ్ కమిటీ అంటే లెక్కలేదా. లీజుల విషయం తేల్చండి..’ అంటూ ఎస్టేట్ అధికారులపై సభ్యులు మండిపడ్డారు. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు కాకు మల్లిఖార్జున యాదవ్, కొరకాని అనూరాధ మాట్లాడుతూ గత సమావేశంలో వాయిదా వేసిన 105 షాపుల రెన్యూవల్ అంశాన్ని ఏం చేశారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారుల నుంచి సమాధానం కరువైంది. కాకు మల్లిఖార్జున్ మాట్లాడుతూ కమిటీ సభ్యులుగా తమ పదవీ కాలం పూర్తయ్యాక నిర్ణయం తీసుకుందామనుకుంటున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశం నాటికి లీజుల విషయం ఏం చేశారో చెప్పాలన్నారు. మరీ అంత తక్కువా.. సింగ్‌నగర్‌లోని గుజ్జల సరళాదేవి కల్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్‌ను రూ.8,55,999కు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేకించారు. సత్యనారాయణపురంలోని కర్మల భవనాన్ని రూ.6.40 లక్షలకు లీజుకు ఇచ్చారు. దీంతో పోలిస్తే సరళాదేవి కల్యాణ మండపం విస్తీర్ణం చాలా ఎక్కువన్నారు. గ్రౌండ్, మొదటి అంతస్తును కలిపి లీజుకు ఇచ్చేందుకు మరోసారి టెండర్ పిలవాలని సూచించారు. రాజీవ్‌గాంధీ పార్కులో బంగీ జంప్, క్రికెట్ నిర్వహించుకునేందుకు ఏడాదికి రూ.1,65,457కు పద్ధతిపై లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనను వాయిదా వేశారు. టెండర్ పిలిస్తే ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. పలు షాపుల లీజుకు స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల మెడికల్ రియింబర్స్‌మెంట్, బకాయిల చెల్లింపునకు అంగీకరించారు. కమిటీ సభ్యులు చెన్నుపాటి గాంధీ, సహేరాభాను, నాగోతు నాగమణి, అదనపు కమిషనర్ అరుణ్‌బాబు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, ఎస్టేట్ అధికారి కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, అకౌంట్స్ ఎగ్జామినర్ ఎంవీ ప్రసాద్, ఆకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ పాల్గొన్నారు. -
స్టాండింగ్ కమిటీకి ఎదురు దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైలు మార్గాల్లో రహదారుల అభివృద్ధి పనులకు హైదరాబాద్ మెట్రోరైలు(హెచ్ఎంఆర్ ) నిధులివ్వాలన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాల్ని ప్రభుత్వం తిరస్కరించింది. మెట్రోరైలుకు ప్రకటనలు, వాణిజ్య కార్యకలాపాల ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయంలో సగం వాటా ఇవ్వాలన్న ప్రతిపాదననూ హెచ్ఎంఆర్ కొట్టిపడేసింది. ఈ నేపథ్యంలో.. ఎంపికచేసిన ఏడు ప్రాంతాల్లో రహదారి అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ నిధులతోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెట్రో రైలు పనులు జరుగుతున్న ఏడు ప్రాంతాల్లో దీర్ఘకాలం మన్నికగా ఉండే సీసీ రోడ్లు వేయాలని అధికారులు భావించారు. అనుమతి కోసం సదరు ప్రతిపాదనను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుంచారు. మెట్రోరైలు కోసం అవసరమయ్యే రోడ్ల విస్తరణకు జీహెచ్ఎంసీ నిధులు వెచ్చించడమేంటంటూ 2011 నవంబర్ 24న జరిగిన సమావేశం తిరస్కరించింది. ఆ నిధుల్ని హెచ్ఎంఆర్ వర్గాల నుంచే ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. నగరంలో రహదారుల్ని వేస్తున్నదీ, నిర్వహిస్తున్నదీ జీహెచ్ఎంసీయే అయినందున.. మెట్రోరైలుకు వచ్చే ప్రకటనల ఆదాయంలో సగం వాటా తమకిచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా సదరు రహదారుల విస్తరణ చేయాల్సింది స్థానిక సంస్థ(జీహెచ్ఎంసీ)యేనని, రహదారుల నిర్వహణ తదితర బాధ్యతలు కూడా దానివే అయినందున ఆ వ్యయం జీహెచ్ఎంసీయే భరించాలని హెచ్ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా ఆస్తుల సేకరణకు నష్టపరిహారం తామే చెల్లిస్తున్నందున, ఆమేరకు జీహెచ్ఎంసీపై భారం తగ్గిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని ప్రభుత్వం అంగీకరించకపోగా కమిటీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి తలొగ్గని స్టాండింగ్ కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. పాత నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. మెట్రో రైలుకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో తమ వాటా ఇస్తేనే రహదారుల అభివృద్ధికి నిధులు వెచ్చిస్తామని స్పష్టం చేసింది. ఆమేరకు, గత సెప్టెంబర్ 12న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మరోమారు తీర్మానం చేశారు. ఆ వ్యవహారంపై తిరిగి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్రోరైలు కోసం జీహెచ్ఎంసీ అదనంగా ఎలాంటి రోడ్డు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయలేదని, పీపీపీ ప్రాజెక్టుల్లోని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) స్కీం మార్గదర్శకాల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని మెట్రోరైలు వర్గాలు పేర్కొన్నాయి. అన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చట్టం మేరకు తనకున్న అధికారాలను వినియోగించి స్టాండింగ్ కమిటీ తీర్మానాన్ని రద్దు చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ సోమవారం జీవో జారీ చేసింది.