Top Stories
ప్రధాన వార్తలు

విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్–2025 సీజన్ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్ సీజన్లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్ నుంచి నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
రాజేంద్రనగర్/మణికొండ/బంజారాహిల్స్: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్ అగర్వాల్ తన భార్య రజనీ అగర్వాల్ (45), కొడుకు కుషాల్ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్ హౌస్ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్ వ్యాపారం చేసే రాజేష్ జైన్ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్ మాత్రం ప్రమాదంలో చనిపోయారు.

బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.. స్పందించిన ట్రంప్, కమలాహారిస్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధరణ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్‌కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో, పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పందించారు. బైడెన్ క్యాన్సర్ అనే విషయం తనను కలచి వేసిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడని పేర్కొన్న ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp— Kamala Harris (@KamalaHarris) May 18, 2025మరోవైపు.. బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. ‘జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ కావడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. "Melania and I are saddened to hear about @JoeBiden’s recent medical diagnosis. We extend our warmest and best wishes to Jill and the family, and we wish Joe a fast and successful recovery." –President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/6HjermTGK7— The White House (@WhiteHouse) May 18, 2025

ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.సప్తమి రా.1.34 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: శ్రవణం ప.3.54 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.7.51 నుండి 9.26 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు, అమృతఘడియలు: తె.5.14 నుండి 6.51 వరకు (తెల్లవారితే మంగళవారం); రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.21.మేషం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.వృషభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో మరింత ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.కన్య: కొన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనిభారం.తుల: మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.ధనుస్సు: పనుల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.మకరం: అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.కుంభం: మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత వ్యతిరేక పరిస్థితులు.మీనం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదాలు ఇవే.. 2002 తర్వాత..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుకాణాలు, కంపెనీలు, గోదాముల్లో ఏటా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, భారీ ప్రాణనష్టాలతో కూడిన వి మాత్రం తక్కువే. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రాణ నష్టం పరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉండేది. ఆదివారం పాత బస్తీలోని గుల్జార్‌హౌస్ వద్ద ‘మోదీ ఇంట్లో’జరిగిన ప్రమా దం దాన్ని దాటేసింది. ఒకే ప్రమాదంలో 17 మంది మృతిచెందటంతో నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కూడా ఇదే తొలిసారి. గతంలో నగరంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదాల్లో కొన్ని ఇవీ...23.10.2002:ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీం.. అందులో నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు. ఈ ఉదంతంలో ఫైర్వర్క్స్ పై అంతస్తులో ఉన్న కార్తికేయ లాడ్జిలో బస చేసిన కస్టమర్లు, సిబ్బంది మొత్తం 12 మంది చనిపోయారు.21.10.2006:సోమాజిగూడలోని మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగా, పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రించారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదంతో పెయింట్లకు నిప్పంటుకొని విడుదలైన విషవాయువుల ప్రభావానికి ముగ్గురు చనిపోయారు. 24.11.2012:పుప్పాలగూడలోని బాబానివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా మరో పదిమంది ప్రాణాలతో బయటపడ్డారు. 22.02.2017:అత్తాపూర్‌లోని ఒక చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. కూలర్లు తయారుచేసే ఈ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు చనిపోయారు. 23.02.2022:న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బిహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు 11 మంది చనిపోయారు. 16.05.2023:సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో క్యూ నెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో పని చేసే ఆరుగురు మరణించారు. 13.11.2023:నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో ఉన్న నాలుగంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది అంతస్తులో ఉన్న కార్ఖానాలో మంటలు చెలరేగి భవనం మొత్తం కాలిపోయింది.ఆ భవనాల్లో మరిన్ని జాగ్రత్తలు అవసరంఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యం నివాస భవనాలకు ఇవ్వట్లేదు. వ్యాపార సంస్థలు, గృహాలు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఫైర్ అలారమ్స్, అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయి. వీటిని ఇళ్లలోనూ ఏర్పాటు చేసుకుంటే దుర్ఘటనలు తగ్గుతాయి. ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.– వై.నాగిరెడ్డి, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ

ట్రంప్ సలహా సంఘంలో మాజీ ఉగ్రవాదులు
వాషింగ్టన్: కరడుగట్టిన అల్‌కాయిదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన మాజీ ఉగ్రవాదులకు ఏకంగా అమెరికా అధ్యక్షుని సలహా సంఘంలో చోటు దక్కింది! వారిలో ఒకరు ఉగ్రవాదం, సంబంధిత కేసుల్లో దోషిగా జైలుశిక్ష అనుభవించి విడుదలైన ఇస్మాయిల్ రాయర్ కాగా మరొకరు హమాస్, ముస్లిం బ్రదర్హుడ్లతో సంబంధాలున్న మాజీ ఉగ్రవాది షేక్ హమ్జా యూసుఫ్. వారిని రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్‌లో సభ్యులుగా ట్రంప్ సర్కారు ఎంపిక చేసింది. వారిద్దరూ అమెరికాలో ఇస్లామిక్ బోధనల్లో ప్రముఖులుగా మంచిపేరు తెచ్చుకున్నారని చెప్పుకొచి్చంది. కరడుగట్టిన ఉగ్ర చరిత్ర ఉన్న మాజీలను సలహా సంఘంలోకి కూర్చోబెడతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ రెండో హయాంలో అమెరికాలో నెలకొన్న అవ్యవస్థకు ఇది మరో నిదర్శనమంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ సలహా సంఘం మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అధ్యక్షుడికి సలహాలిస్తుంది.ఎవరీ ఇస్మాయిల్? ఇతను అమెరికా జాతీయుడు. అసలు పేరు ర్యాండల్ టోడ్ రాయర్. 1992లో ఇస్లాం స్వీకరించి ఇస్మాయిల్‌గా పేరు మార్చుకున్నాడు. లష్కరే తోయిబా, ఈజిప్‌్టలోని ముస్లిం బ్రదర్హుడ్, ‘వర్జీనియా జిహాద్ నెట్వర్క్’, పాలస్తీనాలోని హమాస్ ఉగ్ర సంస్థతో సత్సంబంధాలున్నాయి. ప్రత్యేక ఉగ్రశిక్షణ కోసం 2000లో పాక్ వెళ్లాడు. అమెరికాపై యుద్ధం కోసం పలువురికి ఉగ్ర తర్ఫీదు ఇచ్చేలా ప్రణాళికలు వేశాడు. జమ్మూ కశీ్మర్లో సైనిక స్థావరాలపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ దాడికి సహచర ఉగ్రవాదికి శిక్షణ ఇచ్చాడు. అల్ఆయిదా, లష్కరేలకు సాయపడ్డ నేరానికి 2003లో ఇస్మాయిల్‌పై కేసు నమోదైంది. దోషిగా తేలడంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డా స్రత్పవర్తన కారణంగా 2017లో విడుదలయ్యాడు. అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడం ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్‌గా ఉన్నాడు.ఎవరీ షేక్హమ్జా యూసుఫ్? అమెరికాలో తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన జేతునా కాలేజ్ సహవ్యవస్థాపకుడు. ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు. యూసుఫ్‌కు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్‌లతో లింకులున్నట్టు తేలింది. వాటితో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిన్తున్నట్టు చెబుతారు. ఇతని బోధనలకు పలువురు ఉగ్రవాదులు ఆకర్షితులైనట్టు స్పష్టమైంది. అమెరికా జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యలు చేశాడు. 1990ల నాటి శకంలో న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రహా్మన్పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు గుప్పించాడు. అమెరికా పోలీస్ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్ అల్ అమీన్ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్ ప్రసంగించాడు. తర్వాత రెండు రోజులకే అమెరికాపై 9/11 దాడి జరిగింది. దాంతో అతన్ని ఎఫ్‌బీఐ విచారించింది. ముస్లిం దేశాల్లో అత్యంత ప్రముఖ ఇస్లామిక్ విద్యావేత్తగా పేరొందాడు.

నవీన్ పోలిశెట్టికి లక్కీచాన్స్ వరించనుందా..?
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి జాక్‌పాట్ కొట్టబోతున్నారా? ఈ యువ నటుడికి డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించనుందా..? ఈ క్రేజీ చిత్రంలో ఆ స్టార్ కథానాయకి నటించి ఉన్నారా..? దీనికి సంబంధించిన వార్తనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా బుక్‌లో దర్శకుడు మణిరత్నం పేరు ఎప్పటికీ ప్రముఖంగానే ఉంటుంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో చిత్రాలు చేసి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నలకు పలు రకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్నాయి. తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి ఇంతకుముందు తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సక్సెస్ చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సాయిపల్లవి కథానాయకిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక పర్యటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్‌మైర్ (బి) తుషార్ 9; ప్రభ్‌సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్‌మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్‌ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్‌ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్‌ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్‌మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2.

ఇండియా ఇంత బలహీనమైనదా?
⇒ ప్రభుత్వం ప్రజలకు చెప్పకముందే, కాల్పుల విరమణ తనవల్లే జరిగినట్టుగా చెప్పి ట్రంప్ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి దౌత్య అనైతికతను ఈ దేశం ఎదిరించలేదా? ⇒అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల జీవితాలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేశారు. అయినా భారత ప్రభుత్వం అమెరికాను నిలదీసింది లేదు. ⇒ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదు. అమెరికా మద్దతు లేకపోతే భారత దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది?ఈ మధ్య కాలంలో ప్రపంచం యుద్ధాల భూమిగా మారింది. గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఏడాదిన్నర నుండి ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం భీకర నష్టానికి కారణమైంది. ఏప్రిల్ 22న అమా యక భారతీయులను కశ్మీర్లో టెర్రరిస్టులు దారుణంగా హత్య చెయ్యడంతో దేశం ఉడికిపోయింది. మే 7న పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపు మీద ఇండియా దాడి చేసింది. అది ఒక మినీ వార్‌కు దారి తీసింది. అందులో రెండు యుద్ధాలు టెర్రరిస్టులు అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడంతో మొదలయ్యాయి. ఒకటి భూభాగ సమస్యగా మొదలైంది.టెర్రరిజంపై యుద్ధాలుగత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిస్టులు ప్లాన్ చేసి అమాయక ప్రజలను చంపడంతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి దేశాలను సైతం ధ్వంసం చేయడానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు ఇండియా–పాకిస్తాన్ మధ్య అటువంటి టెర్రరిస్టు దాడి వల్ల నాలుగు రోజులు కాల్పులు జరిగాయి. చివరికి మే 12న విరమణ జరిగింది. అయితే దీన్ని ఇండియా–పాకిస్తాన్ అధికారులు ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అదీ యుద్ధం విరమించకపోతే ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పాననీ, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారనీ అన్నారు. ఇది చాలా తీవ్రమైన ప్రకటన.అంతేకాదు, ఆ రెండు దేశాలు ఒక తటస్థ ప్రదేశంలో కశ్మీర్ సమస్యను చర్చించి, పరిష్కరించుకోవడానికి అంగీకరించారని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని ఆపానని కూడా అన్నారు. ట్రంప్ ప్రకటనలు పాక్ కంటే ఎక్కువగా ఇండియాను ఇరకాటంలో పెట్టాయి. అయితే పాక్ కూడా ట్రంప్ మధ్యవర్తిత్వానికి పాకులాడి ఎందుకు లొంగిపోయిందని చైనా నిలదీస్తున్నది. చైనా పాకిస్తాన్‌కు చాలా ఆయుధాలను ఇచ్చిందనేది తెలిసిందే. ఈ నాలుగు రోజుల ఇండియా–పాకిస్తాన్ ఉద్రిక్తతలు... చైనా, యూరప్, అమెరికా ఆయు ధాల అమ్మకపు మార్కెట్ బలాబలాలను మార్చేసింది అనే చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.దౌత్య విలువలను మంటగలిపిన ట్రంప్ట్రంప్ భారత ప్రభుత్వానికి దగ్గరి మిత్రుడని బీజేపీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్ రెండోసారి గెలిచాక భారత్‌ను అవమానపరిచే అనేక ప్రకట నలు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనలో ఉండ గానే మన దేశ పౌరులను అక్రమ వలసదారులు అనే నెపంతో చేతు లకు బేడీలు వేసి, మిలిటరీ విమానంలో చండీగఢ్ విమానాశ్రయంలో వదిలారు.అలాగే ఇండియా–పాక్ రెండు దేశాలనూ అవమానపరిచేలా, ఆ యా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పకముందే తాను చేయబట్టే యుద్ధం ఆగిపోతోంది అని ట్వీట్ చేశారు. ఇది అన్ని విధాలుగా అంతర్జాతీయ దౌత్య విలువలకూ, యుద్ధ నీతికీ వ్యతిరేకం. ఆ యా ప్రభుత్వాలు చెప్పాల్సిన విషయమది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా దాన్ని ఆపేందుకు అటు ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), లేదా ఇతర దేశాలు రాయబారాలు జరిపి రెండు దేశాలనూ ఒప్పించి యుద్ధం ఆగేట్లు చూడటం దౌత్య నీతిలో భాగమే.అందులో ఇండియా–పాక్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు కనుక ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధం ఆపాలని చూడటం అవసరం. కానీ మొన్న యూఎన్ఓ ఎక్కడా కనిపించలేదు. అది నిజానికి ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధాలను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ఇండియా–పాక్ ఉద్రిక్తతల సమయంలో దాని ఉనికి కనిపించలేదు. యూరోపియన్ దేశాలు కూడా ఇండియా–పాక్ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంలాగా ఘోరంగా అమాయక ప్రజలను టెర్రరిస్టులు చంపడంతో మొదలైనా పెద్దగా పట్టించుకోలేదు. రష్యా కూడా బహిరంగంగా ఇండియాకు మద్దతు పలుకలేదు. చైనా, టర్కీ, ఇరాన్... పాకిస్తాన్‌కు అండగా ఉన్నాయనేది స్పష్టంగానే కనిపించింది.వీటన్నింటినీ మించి యూఎస్, ముఖ్యంగా ట్రంప్ పాత్ర అన్ని యుద్ధ సమయపు దౌత్య విలువలనూ నాశనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ కొద్ది రోజుల ముందే ఇండియా వచ్చి మిత్రగానం చేసి ‘ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం మా పని కా’దన్నాడు. కానీ పాక్‌కు 2.3 బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ద్వారా ఇప్పించారు. పైగా ట్రంప్ కశ్మీర్‌ను మళ్ళీ చర్చల తెర మీదకి తెచ్చి ఒక తటస్థ స్థలంలో ‘వెయ్యి ఏండ్ల’ సమస్యగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామనడం, కాల్పుల విరమణను వాణిజ్య లావా దేవీలతో ముడిపెట్టి ప్రకటించడం చూస్తే, అతిపెద్ద ప్రజాస్వా మ్యమైన భారతదేశాన్ని తన డొమినియన్ స్టేట్‌గా భావిస్తున్నట్టు కనబడుతుంది.ఈ ప్రశ్నలకు జవాబుందా?భారతదేశం నుండి అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్ పర్మిట్‌లో 3–5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో! ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదల్చుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి. కానీ ఆయన గెలిచే నాటికే ఆ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో, చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు.పైగా కాల్పుల విరమణ పేరుతో ట్రంప్ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి డిప్లమాటిక్ ఇమ్మోరాలిటీని ఈ దేశం ఎదిరించ లేదా? భారతదేశం ఇంత బలహీనమైనదా? జాతీయవాదం, ఆత్మగౌరవం అని చెప్పే, బలమైన ఆర్థిక వ్యవస్థగా యుద్ధశక్తిగా ఎదుగుతున్నామని చెప్పే బీజేపీ/ఆరెస్సెస్ ట్రంప్‌కు ఎందుకు భయపడుతున్నాయి? అమెరికా మద్దతు లేకపోతే దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది? భారతదేశంలోని పెద్ద వ్యాపారులందరికీ అమెరికన్ ఆర్థిక పెట్టుబడులతో ఉన్న అనుబంధంతో ఈ స్థితి వచ్చిందా? అయినా ఈ సంక్షోభ సమయంలో అమెరికా, ముఖ్యంగా ట్రంప్ పాకిస్తాన్‌కే ఎక్కువ మేలు చేసినట్టు కనిపించింది కదా! టెర్రరిజాన్ని పోషించే పాక్‌కు ఇన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి అంటే అర్థమేమిటి?గత పదేళ్ళుగా బీజేపీ/ఆరెస్సెస్ గ్లోబల్ డిప్లమసీలో మన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టామని చెబుతూ వచ్చాయి కదా! అమెరికాలోని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు ట్రంప్‌కు ఎంతో సపోర్టు చేస్తూ వచ్చాయి కదా! మరి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదే! ఆఖరికి పాక్ అక్రమ వలసదారులకు కూడా ఆ స్థితి వచ్చిన దాఖలాలే లేవే! ఇప్పుడు బీజేపీ/ఆరెస్సెస్370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ను సంపూర్ణంగా దేశంలో విలీనం చేశామని చెబుతుంటే ట్రంప్ ఆ సమస్యను మళ్ళీ ప్రపంచ సమస్య చేశారు కదా! ఇది కూడా ఆరెస్సెస్/బీజేపీ అనుకూల అంశమేనా? ఇది కూడా ఈ దేశ సమగ్రతను కాపాడే చర్చయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడుప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్

గమ్యం చేరని నిఘానేత్రం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ–సీ61 ప్రయోగం లక్ష్యాన్ని సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. నిఘా అవసరాలకు ఉద్దేశించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్ విఫలమైంది. ప్రయోగంలో తొలి రెండు దశలు విజయవంతమైనా మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇస్రో అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా భావించే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్) విఫలం కావడం అత్యంత అరుదు. ఇస్రో చరిత్రలో శ్రీహరికోట నుంచి జరిగిన ఈ 101 ప్రయోగం అనుకున్న ఫలితం ఇవ్వకపోవడం శాస్త్రవేత్తలను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ వైఫల్యం నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలు వాయిదా పడే అవకాశాలున్నాయి. 2018–2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 74 శాతం రాకెట్ ప్రయోగాల వైఫల్యానికి ప్రొపల్షన్, స్టేజ్–సపరేషన్ అంశాలే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. గతి తప్పిన రాకెట్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్–షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 110 సెకండ్ల వ్యవధిలో తొలి దశలో 70 కిలోమీటర్లు ఎత్తుకు, 261.8 సెకండ్లలో రెండో దశలో 232 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. 262.9 సెకండ్లకు మూడో దశలో ఘన ఇంధన మోటార్ మండించే సమయంలో రాకెట్ గతి తప్పింది. సరిచేసేందుకు మిషన్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. రాకెట్ సముద్రంలో పడిపోయి ఉంటుందని ఇస్రో రిటైర్డ్ అధికారి ఒకరు చెప్పారు. ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు. మోటార్ కేస్‌లోని చాంబర్ ప్రెషర్లో లోపం తలెత్తినట్లు వెల్లడించారు.విచారణకు కమిటీ పీఎస్ఎల్వీ–సీ61 వైఫల్యానికి కారణాలు తెలిస్తేనే భావి ప్రయోగాల విషయంలో మరిన్ని జాగ్రత్తలకు ఆస్కారముంటుంది. అందుకే ఇస్రో నిపుణులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మిషన్ స్పెషలిస్టులతో తొలుత ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ(ఎఫ్ఏసీ)ని వేయనున్నారు. ప్రయోగ డేటాను ఇది క్షుణ్నంగా సమీక్షించి వైఫల్యానికి కారణాలను తేలుస్తుంది. కారణం సాంకేతికమా, మానవ తప్పిదమా, ప్రతికూల వాతావరణం వంటి బాహ్య అంశాలా అనేది నిర్ధారిస్తుంది. అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.కారణం అదేనా? పీఎస్ఎల్వీ–సీ 61 వైఫల్యానికి కారణంపై ఇస్రో దృష్టి సారించింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే రాకెట్ కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాజిల్‌ను సరిచేసి ఇంధనాన్ని మండించడంలో ఈ వ్యవస్థదే కీలక పాత్ర. దీన్ని పొరలతో కూడిన ఎలాస్టోమెరిక్ మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. ప్రయోగం మూడో దశలో హైడ్రాక్సిల్–టెరి్మనేటెడ్ పాలీబ్యుటాడీన్ (హెచ్టీపీబీ) ఇంధనాన్ని ఉపయోగించారు. ఇది 240 కిలోన్యూటన్ థ్రస్ట్‌ను ఉత్పన్నం చేయగలదు.ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక ఇస్రోకు అత్యంత నమ్మకమైనది. ఎర్త్ అబ్జర్వేషన్, జియో–స్టేషనరీ, నావిగేషన్ అనే మూడు రకాల పేలోడ్లను నింగిలోకి పంపేలా పీఎస్ఎల్వీని ఇస్రో అభివృద్ధి చేసింది. దీని ఎత్తు 44.5 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు. ఒకేసారి 1,750 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. భూమి నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌కు చేరుకోగలదు. ఈ వాహక నౌక ఇస్రోకు ఎన్నో విజయాలు అందించి గెలుపు గుర్రంగా గుర్తింపు పొందింది. 2008లో చంద్రయాన్–1, 2013లో మార్స్ ఆర్బిటార్ స్పేస్‌క్రాఫ్ట్, 2023లో ఆదిత్య ఎల్1 మిషన్లను పీఎస్ఎల్వీ ద్వారానే ప్రయోగించారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో ఇప్పటిదాకా చేపట్టిన 63 ప్రయోగాల్లో ఇది కేవలం మూడో వైఫల్యం. 1993 సెపె్టంబర్లో పీఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఐఆర్ఎస్–1ఈ ఉపగ్రహాన్ని, 2017 ఆగస్టులో పీఎస్ఎల్వీ–సీ39 రాకెట్ ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయాయి.
ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
పాక్ కన్నా నరకం మేలు: జావెద్ అఖ్తర్
Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ
ఎవరెస్ట్‌పైకి 19వసారి!
భారత్‌ను చుట్టేస్తున్న... స్థూలకాయ సునామీ
ఇండియా ఇంత బలహీనమైనదా?
సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
ఉగ్రకుట్ర భగ్నం
ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి
సుప్రీంకు రాష్ట్రపతి లేఖను వ్యతిరేకిద్దాం
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. సరికొత్తగా..
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
పాక్ కన్నా నరకం మేలు: జావెద్ అఖ్తర్
Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ
ఎవరెస్ట్‌పైకి 19వసారి!
భారత్‌ను చుట్టేస్తున్న... స్థూలకాయ సునామీ
ఇండియా ఇంత బలహీనమైనదా?
సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
ఉగ్రకుట్ర భగ్నం
ఘోర అగ్నిప్రమాదం 17మంది బలి
సుప్రీంకు రాష్ట్రపతి లేఖను వ్యతిరేకిద్దాం
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. సరికొత్తగా..
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
PKL: పీకేఎల్ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే
సినిమా

'విజయ్ దేవరకొండ మొహంలా ఉంది'.. ఆసక్తిగా తెలుగు ట్రైలర్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. అరుముగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 7సీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై అరుముగ కుమార్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఏస్ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి.శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఓకే రోజు థియేటర్లలో విడుదల కానుంది. ఇంకేందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ చూసేయండి.

విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపిన సింగర్.. ఎందుకంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య కృతజ్ఞతలు తెలిపారు. తనను సోషల్ మీడియాలో అన్‌బ్లాక్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. గతంలో కోహ్లీ, అతని అభిమానులను ఉద్దేశించి జోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో సింగర్ రాహుల్‌ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కోహ్లీ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని సింగర్ కూడా వెల్లడించాడు.తాజాగా అన్‌బ్లాక్ చేయడంతో కోహ్లీపై ప్రశంసలు కురిపించారు సింగర్ రాహుల్ వైద్య. భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నన్ను అన్‌బ్లాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో మీరు ఒకరని కోహ్లీని కొనియాడారు. మీరు భారతదేశానికి గర్వకారణమని.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు దీవించాలని కోరుకుంటున్నట్లు సింగర్ రాసుకొచ్చాడు.గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..'నా భార్య, సోదరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. నా చిన్నకూతురు చిత్రాలను మార్ఫింగ్ చేశారు. నా కుటుంబానికి ద్వేషపూరిత సందేశాలను పంపిన వ్యక్తులకు ఆ దేవుడు కొంత జ్ఞానం ప్రసాదించుగాక. నేను కూడా అంతకంటే దారుణంగా స్పందించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అది మరింత ప్రతికూలతకు కారణమవుతుంది. వికాస్ కోహ్లీ (విరాట్ సోదరుడు) మీరు నాకు ఏమి చెప్పినా నాకు చెడుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు మంచివారని నాకు తెలుసు. మాంచెస్టర్ స్టేడియం వెలుపల మిమ్మల్ని కలవడం, నా పాట గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందరు ప్రేమ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన పోస్ట్‌లో వివరణ ఇచ్చారు. కాగా.. గతంలో విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు అంటూ సింగర్ కామెంట్ చేశాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv)

ఎర్రని బుగ్గలతో సుప్రీత.. రెడ్ శారీలో సంయుక్త
ఎర్రని బుగ్గలతో యంగ్ బ్యూటీ సుప్రీతచుడీదార్ లో పద్ధతిగా కనిపించిన కేతిక శర్మరెడ్ శారీలో హాట్ హాట్ గా సంయుక్త స్టిల్స్40ల్లోనూ అందంతో కేక పుట్టిస్తున్న శ్రియహైదరాబాద్ లో బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లాడ్యాన్స్ తో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్చీరలో కవ్విస్తున్న కీర్తి సురేశ్.. ఐశ్వర్య రాజేశ్ కూడా View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. 'ఏ మాయ చేశావె'లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'ఎస్ఎమ్ఎస్' మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు. (ఇదీ చదవండి: నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?) మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)
న్యూస్ పాడ్‌కాస్ట్

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం
క్రీడలు

ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్‌షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్‌కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్

కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్.. ఐదు ఓవర్ల తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 65 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.శుబ్‌మన్ గిల్‌ను దాటేసిన రాహుల్..ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో శుబ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్‌లను రాహుల్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన లిస్ట్‌లో రాహుల్(5) నాలుగో స్దానంలో నిలిచాడు. అగ్రస్ధానంలో విరాట్ కోహ్లి(8) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..8: విరాట్ కోహ్లీ7: జోస్ బట్లర్6: క్రిస్ గేల్5: కెఎల్ రాహుల్4: శుభ్‌మన్ గిల్4: షేన్ వాట్సన్4: డేవిడ్ వార్నర్

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్

రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.వధేరా, శశాంక్ మెరుపులుఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.ఆరంభం వచ్చినా..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. లక్ష్య చేధనలో రాజస్తాన్ ఓపెనర్లు(50), వైభవ్ సూర్యవంశీ(40) అద్బుతమైన ఆరంభం ఆందించారు.తొలి వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధ్రువ్‌జురెల్(53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'
బిజినెస్

EPFOలో ఐదు కీలక మార్పులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది.. తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కథనంలో ఈపీఎఫ్ఓలో 2025లో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.ప్రొఫైల్ అప్డేట్ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్డేట్ ఒకటి. ఈ అప్డేట్ ద్వారా.. ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరమైపోయింది. మీ యూఏఎన్ నెంబర్.. ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, నేషనాలిటీ, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు.పీఎఫ్ బదిలీగతంలో, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం.. చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడిది.. చాలా సులభమైపోయింది. పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీంతో పీఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు వేగంగా.. సులభంగా బదిలీ అవుతుంది.జాయింట్ డిక్లరేషన్జనవరి 16, 2025 నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్‌గా మారింది. మీ యూఏఎన్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. జాయింట్ డిక్లరేషన్‌ను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు.పెన్షన్ పేమెంట్స్ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ప్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు అయింది.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'జీతంపై పెన్షన్ ప్రక్రియఅధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం.. ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.

హై'టెక్' హోమ్: ఇంటికొచ్చే చందమామ, పైకెగసే నీటిబొట్లు
ఇంటి అందాన్ని పెంచడంలో ఎప్పుడూ ముందుండే అలంకరణ వస్తువులు.. ఎప్పుడో అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు కూడా ఈ టెక్ డెకర్ ఐటమ్స్ ఉపయోగించి మీ ఇంటిని హైటెక్ హోమ్‌గా మార్చేయండి.క్యూట్ చార్జర్రంగురంగుల వెలుగులతో ప్రకాశించే ఈ ల్యాంప్, ఒట్టి లైట్ మాత్రమే కాదు, ఇదొక వైరెలెస్ చార్జర్, బ్లూటూత్ స్పీకర్, స్లీప్ ల్యాంప్, సన్‌రైజ్ అలారం.. ఇలా మరెన్నో చెప్పుకోవచ్చు. బ్యాటరీతో పనిచేసే ఈ డివైజ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు రెండు నుంచి మూడు గంటల వరకు నిర్విరామంగా మ్యూజిక్ ప్లే చేస్తుంది. అలాగే, రంగురంగుల లైట్లతో పార్టీ థీమ్ మూడ్‌లోకి కూడా తీసుకురాగలదు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉపయోగించి క్షణాల్లో ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు. ధర రూ. 849.ఇంటికొచ్చే చందమామఇంట్లో ఊహల లోకం కావాలనుకుంటున్నారా? అయితే, ఒక్కసారి నిద్రపోయే ముందు ఈ త్రీడీ మూన్ ల్యాంప్‌ను ఆన్ చేయండి. వెంటనే గోడలపై వెలుగుల పూలు, సీలింగ్‌పై తారల మెరుపులతో గదంతా ఒక ఫెయిరీ టేల్ సినిమా మూడ్‌లోకి మారిపోతుంది. ఏ టూల్స్ అవసరం లేకుండా ‘ప్లగ్ అండ్ ప్లే’ మోడ్‌లో ఇది పనిచేస్తుంది. పిల్లలకు ఎంతో బాగా నచ్చే దీని ధర రూ. 499. ఆన్లైన్లో మరెన్నో ఇలాంటి త్రీడీ ల్యాంప్స్ ఉన్నాయి. అభిరుచిని బట్టి కొనుగోలు చేయవచ్చు.ఫొటోలు మార్చే ఫ్రేమ్స్ఇదివరకు గోడకు వేలాడదీసే ఫ్రేమ్‌లో ఏదో ఒక ఫొటో మాత్రమే ఉండేది. రకరకాల ఫొటోలను ఒకేసారి చూపిస్తుంది ‘స్మార్ట్ డిజిటల్ ఫొటో ఫ్రేమ్’. ఫొటోను ప్రింట్ తీయటం, వాటిని ఫ్రేమ్స్‌లో అతికించడం ఇలాంటి పనులేం చేయనక్కర్లేదు. ఇది మీ ఇంట్లో ఉంటే. త్రీడీ డిస్ప్లే, కలర్ కేలిబ్రేట్తో రూపొందించిన ఈ ఫ్రేమ్, ఫొటోలను అత్యంత సహజంగా కనిపించేలా చేస్తుంది. దీనిని మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోలను మార్చుకోవచ్చు. ఫ్రేమ్‌కు తగ్గట్లు ఫొటోలను ఇదే అటోమేటిక్‌గా క్రాప్ చేసి, బ్రైట్నెస్ను అడ్జస్ట్ కూడా చేస్తుంది. ధర రూ. 12,595.పైకెగసే నీటిబొట్లుపైకి విసిరిన ప్రతిదీ కింద పడాల్సిందే! కానీ, ఇక్కడ మాత్రం నీటి బొట్లు పైకి ఎగురుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తాయి. చూడటానికి డెకర్ ఐటమ్లా కనిపించే ఈ ‘స్మూత్ సెయిలింగ్ యాంటీగ్రావిటీ లైట్’లో ఎన్నో అబ్బురపరచే ఫీచర్స్ ఉన్నాయి. దీనిని నైట్ లైట్, టేబుల్ క్లాక్లాగే కాదు, అంతకు మించి దీని పనితనం ఉంటుంది. ఇది ఇందులో నింపిన నీటిని ఉపయోగించి, చల్లని గాలిని అందిస్తూ ఒక మినీ కూలర్లాగా కూడా పనిచేస్తుంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్, వర్క్డెస్క్లకు ఇది ఒక చక్కటి డెకర్ ఐటమ్. ధర రూ. 1,899.

24 గంటల్లో 8000 బుకింగ్స్.. ఒకేరోజు 150 కార్ల డెలివరీ
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇటీవల.. 'విండ్సర్ ప్రో' పేరుతో పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. మార్కెట్లో కొత్తగా విడుదలైన ఈ కారు.. కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. కంపెనీ కూడా డెలివరీలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే.. బెంగళూరులోని 150 మంది కస్టమర్లకు ఒకేసారి విండ్సర్ ప్రో డెలివరీలు చేసింది.ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్‌లను పొందిన ఎంజీ విండ్సర్ ప్రో.. ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్.. లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారుసెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ఎంజీ విండ్సర్ ప్రో.. 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది.

కొత్త మార్కెట్‌కు తెరలేపిన ఆర్బీఐ నిర్ణయం
మొబైల్ వాడకం కోవిడ్–19 తరువాత భారత్‌లో గణనీయంగా పెరిగింది. డేటా ఫర్ ఇండియా 2025 ఫిబ్రవరి నివేదిక ప్రకారం.. ఈ విషయంలో 10–19 ఏళ్ల వయసువారు ముందంజలో ఉన్నారు. మొబైల్ వినియోగంలో నైపుణ్యత పట్టణ ధనిక వర్గం పిల్లలకే పరిమితం కాలేదు. గ్రామాల్లోనూ పెరిగింది. ఇప్పటికే మైనర్లు పరిమితులతో కూడిన మొబైల్ వాలెట్స్, పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్, యూపీఐ సర్కిల్‌ను విరివిగా వాడుతున్నారు. 10 ఏళ్లకుపైబడిన మైనర్లు వారి సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను వ్యక్తిగతంగా తెరిచి, నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అనుమతించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు మరింత ఊపందుకుంటాయని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర ప్రభుత్వ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్–2024 (అసర్) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని 14–16 ఏళ్ల వయసున్న 75 శాతంపైగా పిల్లలు డిజిటల్ హోమ్ వర్క్‌ను పూర్తి చేయడానికి స్మార్ట్ఫోన్లను విజయవంతంగా వినియోగిస్తున్నారు. విద్య, వినోద అంశాలతోపాటు, యూపీఐ పేమెంట్లకు కూడా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఈ వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది. అంతేకాదు డిజిటల్ పేమెంట్స్ రంగంలో కొత్త మార్కెట్‌కు తెరలేపింది. భవిష్యత్ కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు బ్యాంకులకు మార్గం ఏర్పడింది. మైనర్లను బ్యాంకింగ్ వైపునకు తీసుకురావడానికి ఫిన్ టెక్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.తల్లిదండ్రులు/సంరక్షకుల ద్వారా మైనర్లకు బ్యాంక్ ఖాతా తెరిచే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే మైనర్లు వ్యక్తిగతంగా ఖాతాను నిర్వహించడం వల్ల గతంలో లేని పలు అదనపు ప్రయోజనాలు ఇప్పుడు ఉన్నాయి. సొంత ఖాతా ఉంటే యూపీఐ చెల్లింపులు సులభం అవుతాయి. అంతేకాదు, తరచూ చిన్నపాటి కొనుగోళ్లు జరిపే 14–18 ఏళ్ల పిల్లలు ఈ మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు. స్కూల్ లేదా ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి చేరేందుకు బైకులను యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవడం, క్యాంటీన్లో ఆహారం, స్టేషనరీ కొనుక్కోవడం.. ఇలాంటి వాటికి వీలవుతుంది. దీనివల్ల మైనర్లు చేసే డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయనేది సుస్పష్టం. కాగా, యువత రుణం అందుకోవడం, పెట్టుబడుల విషయంలో డిజిటల్ వేదికలు పెను మార్పులు తెచ్చాయి. చిన్నచిన్న రుణాలకు యువ కస్టమర్లు పెద్ద ఎత్తున ఫిన్ టెక్ కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల తలుపు తడుతున్నారు.ఇప్పటికే మైనర్ల కోసం..బ్యాంకులు ఇప్పటికే.. తల్లిదండ్రులతో కలిసి సంయుక్తంగా నిర్వహించే మైనర్ ఖాతాలకు అనుసంధానించిన డెబిట్ కార్డులు, మొబైల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. అలాగే 13–18 ఏళ్ల వయసున్న వారి కోసం గూగుల్ పే వాలెట్స్ వంటి పరిమితులతో ఉపయోగించే మొబైల్ వాలెట్స్, బ్యాంక్ ఖాతా అవసరం లేని జూనియో, ఫ్యామ్‌పే, ఫైప్ తదితర పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్ కూడా మైనర్ల కోసం కొలువుదీరాయి. ప్రాథమిక యూపీఐ వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా ద్వితీయ వినియోగదారు లావాదేవీలు నిర్వహించవచ్చు. ద్వితీయ వినియోగదారుకు స్వంత బ్యాంక్ ఖాతా లేకపోయినా.. ప్రాథమిక వినియోగదారు తరపున చెల్లింపులు చేయవచ్చు. పరిమితులు, అనుమతులను నిర్ధేశించడం ద్వారా ప్రాథమిక వినియోగదారుడు ఈ లావాదేవీలను నియంత్రించవచ్చు.ఆర్థిక అక్షరాస్యతలో..ఆర్బీఐ 2023లో చేపట్టిన సర్వేలో పెద్దవారితో పోలిస్తే 30 ఏళ్లలోపు వారిలో ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉందని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వే–2019 ప్రకారం 18–29 ఏళ్ల వయసువారిలో 30 శాతం మందికి మాత్రమే ఆర్థిక అక్షరాస్యత ఉంది. 10 ఏళ్లకు పైబడ్డ మైనర్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి అనుమతించడం ఆర్థిక అక్షరాస్యత పెంచే కార్యక్రమాల్లో ఒకటిగానే చూడాలన్నది నిపుణుల భావన. సొంత ఖాతాకు, ఆర్థిక లావాదేవీలకు చిన్నతనంలోనే యాజమాన్య హక్కులు దక్కడం వల్ల అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంతోపాటు డబ్బులు దాచుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది.
ఫ్యామిలీ

సీజనల్ సైకాలజీ: వేసవి ప్రభావం దీర్ఘకాలం..
వేసవి కాలంలో పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలనే విషయం గురించి మూడు నాలుగు వారాలుగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ కాలంలో వచ్చే మార్పులు తాత్కాలికమా? దీర్ఘకాలికమా? వేసవి మనసులో కేవలం తాత్కాలిక మార్పులు కాకుండా, దీర్ఘకాలం ప్రభావితం చేసే సైకోబయలాజికల్ ప్రాసెస్లు కూడా జరుగుతాయని సీజనల్ సైకాలజీ, న్యూరో సైన్సు పరిశోధనలు చెబుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.దీర్ఘకాలిక ఆత్మవిశ్వాసంవేసవి వేడితో పెరిగిన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోకెమికల్స్ తాత్కాలికంగా మూడ్‌ను పెంచుతాయని, శక్తిని పెంచుతాయని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’పై రోసెంథల్ (1984) చేసిన పరిశోధనను వెల్లడించింది. వేసవిలో ప్రారంభించిన ధ్యానం వంటివి మనల్ని మనం నియంత్రించుకునేందుకు రిజర్వ్‌లా పనిచేస్తాయని జపాన్‌లోని కియో యూనివర్సిటీలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనం కూడా తెలిపింది. ఉదాహరణకు నా దగ్గరకు కౌన్సెలింగ్ కోసం వచ్చిన కిరణ్ అనే ఐటీ ఉద్యోగి వేసవిలో ప్రారంభించిన ప్రాణాయామం, ఆపై ఏడాది పాటు కొనసాగించటం వలన అతని ఆందోళన స్థాయి, ఒత్తిడి 45శాతం తగ్గినట్లు తన జర్నలింగ్లో రికార్డ్ చేసుకున్నాడు. వేసవిలో వచ్చే మూడ్ బూస్ట్‌ను అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాల ఆత్మవిశ్వాసం సిద్ధమవుతుంది.అలవాటుగా మార్చుకోవాలివేసవిలో ఏర్పడిన కొత్త అలవాట్లు మెదడులో బలంగా ‘లాక్’ అవుతాయని స్మిత్, క్లీన్ 2017లో చేసిన అధ్యయనంలో తెలిపారు. ఇది కాగ్నిటివ్ సైకాలజీలోని హెబియన్ లెర్నింగ్‌తో కలిసి కాలంతో పాటు గాఢమవుతుంది. ఉదాహరణకు గత వేసవిలో నేను నిర్వహించిన వర్క్‌షాప్‌లో పొమోడోరో స్టడీ మెథడ్ గురించి చెప్పాను. సునీల్ అనే విద్యార్థి ఆ అలవాటును వేసవి తర్వాత కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది అతని ఏకాగ్రత, మార్కులు గణనీయంగా మెరుగయ్యాయి. ఒక సీజనల్ అలవాటును 21 రోజుల నుంచి 90 రోజుల వరకు కొనసాగిస్తే అది దీర్ఘకాలిక అలవాటుగా మారుతుంది. బలపడే బంధాలువేసవిలో పెళ్లిళ్లు, కుటుంబ కలయికలు ఎక్కువగా జరుగుతాయి. ఇవి ఎమోషనల్ యాంకర్స్‌గా పనిచేస్తాయి. వేసవిలో ఏర్పడే ఈ సోషల్ బాండ్స్ ఆ తర్వాత ఆరునెలల పాటు ఒంటరితనాన్ని 30శాతం వరకు తగ్గిస్తాయని బార్బీ, గ్రాఫ్మన్ 2010లో జరిపిన అధ్యయనంలో వెల్లడించారు. ఉదాహరణకు నా క్లయింట్ రామకృష్ణ గత వేసవిలో తన బాల్యమిత్రుడిని కలిశాడు. ఆ తర్వాత తరచు అతనితో మాట్లాడుతూ తమ మధ్యనున్న బంధాన్ని బలంగా నిర్మించుకున్నాడు. ఫలితంగా అతని ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిని నియంత్రించుకోగలిగాడు. పెరిగే సృజనాత్మకతవేసవిలో సృజనాత్మకత తారస్థాయిలో ఉంటుందని కాఫ్మన్ 2016లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కాలంలో కాగ్నిటివ్ ఫ్లెగ్జిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చూపించారు. దీన్ని హార్వర్డ్ క్రియేటివ్ లాబ్ 2021లో తిరిగి నిర్ధారించింది. ఉదాహరణకు సుశీల్ వేసవిలో ఆర్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఆ తరువాత అదే ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్‌లో ప్రదర్శించటానికి అవకాశం దొరికింది.భావోద్వేగ ప్రజ్ఞను బలోపేతం చేసుకోండి వేసవిలో ప్రారంభించిన జర్నలింగ్ సీజన్‌తో పాటు మారే భావోద్వేగాలను గమనించడానికి అద్భుతమైన సాధనమని కాబట్–జిన్ 2003లో జరిపిన మైండ్‌ఫుల్‌నెస్ అధ్యయనంలో వెల్లడైంది. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ప్రకారం కూడా భావోద్వేగాల నియంత్రణలో ఇంట్రాస్పెక్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు గత వేసవిలో ఎమోషనల్ డైరీ ప్రారంభించిన అనిత ఆందోళన తగ్గడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. వేసవి తర్వాత పాటించవలసిన టిప్స్...వేసవిలో మొదలైన ధ్యానం, జర్నలింగ్ను ఒక అలవాటుగా మార్చుకోండి. ప్రతినెల ఒక రోజు ఇంట్రాస్పెక్షన్‌కు కేటాయించండి. మా బంధాలను కొనసాగించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మెసేజ్ పంపించండి. వేసవిలోని నిద్ర అలవాటును ఏడాది పొడవునా కొనసాగించండి. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త పుస్తకం చదవండి.మీ భావోద్వేగాలను ఎలా తట్టుకున్నారనే విషయం జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయండి.ప్రతీ సీజన్లో 30 రోజులు డిజిటల్ డిటాక్స్ చాలెంజ్ చేపట్టండి. ఒక కొత్త స్కిల్‌ను మీ చదువులో భాగం చేసి, మాస్టర్ చేయండి. క్రియేటివ్ ప్రాజెక్ట్స్‌కు డెడ్‌లైన్స్, గోల్స్ పెట్టుకోండి. సీజనల్ రిఫ్లెక్షన్ రిపోర్ట్ రాయడం ద్వారా మీ ఇంట్రాస్పెక్షన్ను శక్తిమంతం చేయండి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: Summer Holidays: ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?)

ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!)

ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్‌ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్‌క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్‌కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్‌ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్‌లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..)

వీరవాహనుడికి వశిష్ఠుడు చెప్పిన కథ
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు. అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు. మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక! అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు. లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.∙సాంఖ్యాయన (చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!)
ఫొటోలు


వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)


తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు


అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)


పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు


చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)


ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)


బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)


చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 18-25)


Miss World 2025 : రామోజీఫిల్మ్ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.

మరో సౌరవ్యవస్థలో గడ్డ కట్టిన నీరు
వాషింగ్టన్: జీవుల మనుగడకు ప్రాణాధారమైన నీరు అంతరిక్షంలో మరెక్కడుందోననే ప్రశ్నకు సమాధానం వెతికినట్లు ప్రఖ్యాత జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ తాజాగా ప్రకటించింది. మన సౌరమండలం తరహాలోనే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గడ్డ కట్టిన స్థితిలో నీరు ఉంటుందనే వాదనకు బలం చేకూరుస్తూ నాసా వారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పలు సాక్ష్యాధారాలను సంపాదించింది. ఒక యువ నక్షత్ర మండలంలో గడ్డకట్టిన నీటి జాడలను కనిపెట్టినట్లు నాసా తాజాగా ప్రకటించింది. నక్షత్రం చుట్టూ తిరుగుతున్న దుమ్ము ధూళితో కూడిన అంతరిక్ష శిలలు, శకలాలు, శిథిలాల వలయాల్లో నీరు గడ్డకట్టి ఉందని నాసా వెల్లడించింది. మన సౌరవ్యవస్థ వయసుతో పోలిస్తే తక్కువ వయసున్న ఈ కొత్త నక్షత్ర మండలం ‘హెచ్డీ 181327’మన భూమికి 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నాసా తెలిపింది.వెబ్ టెలిస్కోప్ పంపిన ‘స్పె్రక్టా’డేటాలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విశాల అంతరిక్షంలో ఎక్కడో ఓ చోట నీరు నిక్షిప్తమై ఉంటుందని నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 2008లోనే కొంత డేటాను పంపించింది. ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా నీటిజాడలను వెతికిపట్టడం ఇదే తొలిసారి. ‘‘కేవలం నీటిని మాత్రమేకాదు మరీముఖ్యంగా స్ఫటికాకృతిలో ఉండే గడ్డ కట్టిన నీటి జాడను వెబ్ టెలిస్కోప్ కనుగొంది. ఈ ధూళి వలయాల్లోని ప్రతి దుమ్ము కణంతో నీటి అణువులు కలిసిపోయి ఉన్నాయి. ఈ అణువులను సమీప–పరారుణ స్పెక్ట్రోగ్రాఫ్ ఉపకరణంతో చూసినప్పుడు ఇవన్నీ మంచు బంతుల్లా కనిపించాయి. గతంలో ఇలాంటి క్రిస్టల్ ఐస్‌ను మన సౌరవ్యవస్థలో శనిగ్రహ వలయాల్లో, క్యూపర్ బెల్ట్‌లో చూశాం’’అని ఈ పరిశోధనా పత్రం ముఖ్య రచయిత చెన్ గ్జీ చెప్పారు. చెన్ గ్జీ.. మేరిలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ(బాలీ్టమోర్)లో అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సంబంధిత వివరాలు ‘నేచర్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నీరే కీలకం అంతరిక్షంలో నక్షత్రాల చుట్టూతా గ్రహ వ్యవస్థ పురుడుపోసుకోవడానికి నీరే ప్రధాన కారణం. యువ నక్షత్రాల చుట్టూతా పరుచుకున్న దుమ్ము, ధూళి వలయాల్లో ప్రధాన ముడి సరకు నీరే. ఒక రకంగా పట్టిఉంచే నీరు సైతం ధూళి, దుమ్మ గట్టిపడి గ్రహాల ఆవిర్భావానికి దారితీస్తుంది. తక్కువ గురుత్వాకర్షణ సందర్భాల్లో తోకచుక్కలు, గ్రహశకలాల వంటివి ఏర్పడతాయి. ఒకవేళ బలాలు బలపడితే ఇవన్నీ కలగలిసిపోయి పెద్ద గ్రహాలుగా రూపాంతరం చెందుతాయి. మన భూమి సైతం తొలినాళ్లలో ఇలాగే ఏర్పడింది. తాజాగా వెబ్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో ఇతర ఖగోళ అధ్యయనకారులు సైతం నూతన నక్షత్రవ్యవస్థల్లో కొత్త గ్రహాలు ఎలా ఏర్పడతాయి వంటి అంశాలపై మరింత శోధన చేసేందుకు అవకాశం లభించనుందని మరో రచయిత క్రిస్టీన్ చెన్ చెప్పారు. ఈ ‘హెచ్డీ 181327’నక్షత్ర వ్యవస్థ కేవలం 2.3 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన సూర్యుడు ఏకంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. వయసులో చిన్నదైనా సరే ఈ యువ నక్షత్రం మన సూరీడి కంటే బరువు ఎక్కువగా ఉంది. వేడి కూడా మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ఆపేశా..
వాషింగ్టన్: భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కోసం తానే చొరవ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ తనకే దక్కాలని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి, ఉద్రిక్తతలు ఆగిపోవడం ఇప్పటిదాకా తాను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఫాక్స్ న్యూస్ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జోక్యం వల్లే పాకిస్తాన్‌పై ఇండియా సైనిక చర్య నిలిచిపోయిందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని తెలిపారు. రెండు బలమైన దేశాలైన భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణలు అతి తక్కువ సమయంలోనే అణుయుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందని, తాను కల్పించుకోవడంతో అది ఆగిపోయిందని వివరించారు. అయితే, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ తన నోటి దురుసు తగ్గించుకోకపోవడం గమనార్హం. భారత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఏం సాధించదల్చుకున్నారో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు. టారిఫ్‌ల రద్దుకు ఇండియా సంసిద్ధత భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు నివారించి, శాంతిని నెలకొల్పడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను 100 శాతం రద్దు చేయడానికి ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరడం ఖాయమని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం కోసం తాను తొందరపడడంలేదన్నారు. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా 150 దేశాలు ఇలాంటి ఒప్పందం కోసం ముందుకొచ్చాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అంటూ ట్రంప్ మరోసారి విమర్శించారు. వ్యాపారాలు చేయడం అసాధ్యం అనే పరిస్థితులు ఇండియాలో సృష్టించారని తప్పుపట్టారు. కానీ, అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయడానికి ఇండియా సుముఖంగా ఉందని వివరించారు. కేవలం అమెరికా కోసం ఇండియా ఈ మేలు చేయడానికి సిద్ధపడిందని అన్నారు.

ట్రంప్ ‘బిగ్‌బాస్’ షో!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఏంచేసినా వినూత్నమే. వివాదాస్పదమే. అదే పరంపరను కొనసాగిస్తూ ట్రంప్ సొంతంగా సరికొత్త రియాలిటీ షోకు తెరలేపనున్నారన్న వార్త ఇప్పుడు అగ్రరాజ్యంలో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ షో తరహాలో ఇందులో పాల్గొనేవారంతా భిన్న రకాలైన పనులు(టాస్క్ లు) పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అమెరికా జాతీయత కోణం దాగి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే అనధికారికంగా అమెరికాకు పోటెత్తిన వలసదారులను మాత్రమే ఈ రియాలిటీ షోలో అభ్యర్థులుగా స్వీకరిస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెడతారు. స్వదేశంలో అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ, అనివార్య పరిస్థితుల్లో కొందరు వలసదారులు తిరిగి స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎంపిక చేసి అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపికకు రియాలిటీ షో మార్గాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో వివరాలు ఇంకా బహిర్గత కాలేదు. ఇది ఇంకా అమెరికా ప్రభుత్వ వర్గాల వద్ద ప్రతిపాదన దశలోనే ఉందని తెలుస్తోంది. అన్ని రకాల అనుమతులు దాటుకుని ఈ రియాలిటీ షో వాస్తవరూపం దాల్చితే ఈ షోకు అనూహ్య ఆదరణ లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ షోలో గెలిచిన విజేతకు మాత్రమే అమెరికా పౌరసత్వం బేషరతుగా ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవరిదీ ఆలోచన? కెనడియన్–అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. రియాలిటీ షో నియమ నిబంధనలతో సమగ్రంగా 35 పేజీల్లో ఒక రిపోర్ట్‌ను తయారుచేసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగానికి సమరి్పంచారు. రాబ్ వార్సాఫ్ గతంలో సృష్టించిన ‘డక్ డినాస్టీ’, ‘ది మిలియనీర్ మ్యాచ్‌మేకర్’రియాలిటీ షోలు విజయవంతమైంది. ‘‘రాబ్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నిజంగా ఇదొక మంచి ఆలోచన. హక్కులతోపాటు అమెరికన్లలో దేశభక్తి, పౌరవిధులను మరోసారి స్పష్టంగా స్మరణకు తెచ్చేలా షో ఉంటే బాగుంటుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీలో ప్రజాసంబంధాల మహిళా అసిస్టెంట్ సెక్రటరీ ట్రీసియా మెక్‌లానిన్ అన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎలాంటి టాస్క్ లు ఉండొచ్చు? ‘ది అమెరికన్’పేరిట జరగబోయే ఈ రియాలిటీ టీవీ షోలో వలసదారుల్లో దేశభక్తి పెంచడంతోపాటు బాధ్యతాయుత పౌరునిగా మెలగాలంటే ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను స్మరణకు తెచ్చేలా టాస్క్ లు రూపొందించనున్నారు. వీటితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండేందుకు పలు రకాల టాస్క్‌లు పెట్టనున్నారు. టెక్సాస్ లేదా ఫ్లోరిడాలో నాసా ప్రయోగకేంద్రాల వద్ద చిన్నపాటి రాకెట్ ఎగరేయడం, శాన్ఫ్రాన్సిస్కో గనిలో బంగారాన్ని తవ్వితీయడం(గోల్డ్ రష్), డెట్రాయిట్లో ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ల వద్ద మోడల్ ‘టి’కారు ఛాసిస్‌ను బిగించడం, కన్సాస్‌లో గుర్రపుస్వారీ చేస్తూ తపాలాలు భటా్వడా చేయడం వంటి వినూత్న టాస్క్‌లు వలసదారులు పూర్తిచేయాల్సి ఉంటుంది.
జాతీయం

ఆపరేషన్ సిందూర్ తడాఖా.. దేశ భక్తిపై భారత్‌లో నయా ట్రెండ్..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపించాయి. పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు సైతం దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం జరగడంతో పాక్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌పై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన టీషర్టులపై సైనిక నినాదాలు, వాయుసేన ఫొటోలు ముద్రించి దేశభక్తిని చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక, ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక యువత సైతం ఆపరేషన్ సిందూర్ గొప్పతనాన్ని చాటేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్, వాయుసేనకు సంబంధించిన ఫొటోలు ముద్రించిన టీషర్ట్స్‌ని ధరించి.. గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సైన్యానికి, భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా నినాదాలు, భారత వాయుసేనకు సంబంధించిన ఫైటర్ జెట్ ఫొటోలను ముద్రించిన టీషర్ట్స్ బయటకు వచ్చాయి. ఇవి యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి."Our job is to hit the target, not to count the body bags!"#OperationSindoor was conceptualised with a clear military aim — to punish the perpetrators and planners of terror, and to destroy their terror infrastructure. - Command pic.twitter.com/oEY3cBXwEP— Ramraje Shinde (@ramraje_shinde) May 12, 2025ఈ టీషర్ట్స్‌పై ‘లక్ష్యాలను ఛేదించడమే మా పని.. శవాల మూటలు ఎన్నో లెక్కజెప్పడం కాదు..’, ‘కినారా హిల్స్‌లో ఏముందో మాకు తెలియదు. తెలిసిందల్లా పని చేసుకుంటూ పోవడమే’ లాంటి నినాదాలు ఉన్నాయి. పలు కంపెనీలు ఇలాంటి టీషర్ట్స్‌ను విడుదల చేశాయి. దీంతో, ఇవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలు కంపెనీల ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. దేశ భక్తిని చాటేలా.. మన సైనిక శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా టీషర్ట్స్ డిజైన్ చేస్తున్నారు. యువత వీటిని ధరించి.. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.@IAF_MCC Proud to wear this. 💕💘🥰😍---@major_madhan In your operation sindoor video, explaining the sequence of events, there was a special series on Airmarshal AK Bharti., in which you spoke of his statement being printed on T-shirt. I got one today. pic.twitter.com/tA8qAmWRCZ— pandurangavittal.vn (@vittal_vn) May 17, 2025 Overnight this statement has become a rage and T shirts are getting printed now.Think and brood over it … why..!~Air Marshal AK Bharati~architect behind #OperationSindoor pic.twitter.com/StLqSazaX9— Braj Mohan Singh (@brajjourno) May 12, 2025 New India. New rules. No mercy.This is Bharat’s new normal: Strike first, strike hard.#OperationSindoor pic.twitter.com/FadCVJVRil— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 11, 2025

చైనా అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. బిగ్ షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తులు, కొన్ని ప్రాసెస్ట్ ఆహార వస్తువుల దిగుమతులపై నౌకాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది. అయితే, భారత్ మీదుగా నేపాల్, భూటాన్ మినహా ఇతర అన్ని దేశాలకు వెళ్లే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల దిగుమతులకు ఏ ల్యాండ్ పోర్టులోనూ అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిని కోల్‌కతా, నవసేవా పోర్టుల్లో మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బొనేటెడ్ డ్రింకులు, బేక్డ్ గూడ్స్, స్నాక్స్, చిప్స్, కాటన్, కాటన్ యాన్న్ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్ట్ గూడ్స్, డైస్, గ్రాన్యుల్స్, వుడెన్ ఫరి్నచర్, వంటి వాటిని చంగ్రాబంధా, ఫుల్బారీ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారాగానీ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరంలలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా గానీ అనుమతించబోమని తేల్చింది. చేపలు, ఎల్పీజీ, వంట నూనెల దిగుమతులకు పోర్టుల్లో ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ చీఫ్ యూనుస్ ఇటీవల చైనా పర్యటన సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఈ ఆంక్షలని పరిశీలకులు అంటున్నారు. నౌకల ద్వారా భారత్‌లోని పోర్టులకు తమ వస్తువులను తరలించుకుని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగు మతులు చేసుకునేలా బంగ్లాదేశ్‌కు 2020 మే నుంచి కేంద్రం వెసులుబాటు కల్పించింది. 🔴#BREAKING: India restricts garment imports from Bangladesh to Kolkata & Mumbai ports — land ports closed.Seen as a reciprocal move after Bangladesh curbed Indian cotton & rice exports.#India #Bangladesh #Trade #GarmentImports #Pakistan pic.twitter.com/3piBRtXfnh— TheWarPolitics (@TheWarPolitics0) May 17, 2025

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య
శ్రీహరికోట: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. పీఎస్ఎల్వీ-సీ61 మూడో దశలో సమస్య తలెత్తినట్టు ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం పీఎస్ఎల్వీ-సీ61ను ఆదివారం తెల్లవారుజామున చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఈ ప్రయోగంలో భాగంగా రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లిన కొంతసమయంలోనే సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ స్పందిస్తూ.. పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు చెప్పారు. ఈ మిషన్ అసంతృప్తిగా ముగిసిందని ప్రకటించారు. సమస్యపై విశ్లేషించి వివరాలను వెల్లడిస్తామన్నారు. #WATCH | Sriharikota, Andhra Pradesh | ISRO Chief V Narayanan says, "Today we attempted a launch of PSLV-C61 vehicle. The vehicle is a 4-stage vehicle. The first two stages performed as expected. During the 3rd stage, we are seeing observation...The mission could not be… pic.twitter.com/By7LZ8g0IZ— ANI (@ANI) May 18, 2025ఇక, ప్రయోగంలో అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-09)ను పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లింది.ఈ ఉపగ్రహం ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూఉపరితలాన్ని స్పష్టంగా హైరిజల్యూషన్‌తో చిత్రీకరణ చేయగలదు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పని చేయనుంది. దీని బరువు 1710 కిలోలు. EOS-09 నింగిలో నిఘానేత్రంగా పనిచేయనుంది. దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. అత్యంత చిన్న వస్తువులను కూడా గుర్తించగల అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఇందులో అమర్చారు. #WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C61, which carries the EOS-09 (Earth Observation Satellite-09) into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh. EOS-09 is a repeat satellite of EOS-04, designed with the mission objective to ensure remote… pic.twitter.com/4HVMZzXhP0— ANI (@ANI) May 18, 2025

పాక్‌పై దౌత్య యుద్ధానికి బృంద సారథులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్ దౌత్యపరంగానూ బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. పాక్ అరాచకాలను, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. ఇందుకోసం పలు పార్టిల నేతలు, ఎంపీలు, దౌత్యవేత్తలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాల్లో పర్యటించనుంది. విపక్షాల నుంచి శశి థరూర్ (కాంగ్రెస్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ–పవార్), అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన–షిండే) వాటికి సారథ్యం వహిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఈ మేరకు వెల్లడించింది. బృందాల్లో సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్ తివారీ, అసదుద్దీన్ ఒవైసీ, అమర్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్‌లాల్, సర్ఫరాజ్ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్ సాహ్నీ, సస్మిత్ పాత్ర, భువనేశ్వర్ కలితాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులు ఉంటారు. వారంతా ఈ నెలాఖర్లో ఐరాస భద్రతా మండలితో పాటు పలు కీలక దేశాల్లో పర్యటిస్తారు.ఏ బృందం ఏ దేశానికి... శశి థరూర్: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా సుప్రియా సూలే: ఈజిప్‌్ట, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా కనిమొళి: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాతి్వయా సంజయ్ కుమార్ ఝా: జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా రవిశంకర్ ప్రసాద్: ఈయూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ బైజయంత్ పండా: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా శ్రీకాంత్ షిండే: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

నమ్మించి ముంచేసిన నగల వ్యాపారి: రూ.10కోట్ల నగలతో పరార్
కేపీహెచ్‌బీ/నిజాంపేట్: బాచుపల్లి ప్రగతినగర్‌లో బంగారం వ్యాపారం నిర్వహిస్తూ నమ్మించి డబ్బులు వసూలు చేసి ఉడాయించిన మోసగాడి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. గురువారం ఇద్దరు వ్యాపారులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధరాణి అనే మహిళ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. అశోక్ కుమార్ జైన్ అనే వ్యక్తి 30 ఏళ్లుగా కేపీహెచ్‌బీ కాలనీలో రిషబ్ జువెల్లరీ పేరుతో బంగారు నగల వ్యాపారం చేస్తున్నాడు. ప్రగతినగర్‌లో చేతన్ జువెల్లరీ పేరుతో వ్యాపారం చేస్తున్న నితీష్ జైన్ నాలుగేళ్లుగా అశోక్ కుమార్ జైన్ వద్ద బంగారం తీసుకుని వ్యాపారం చేసేవాడు. గత నెల 8న, ఈ నెల 10న నితీష్ జైన్ అతని భార్య స్వీటీ జైన్లు అశోక్ కుమార్ నగల షాపుకు వచ్చి రెండుమార్లు సుమారు అరకేజీ బంగారు నగలును తీసుకున్నారు. డబ్బులు త్వరలో చెల్లిస్తామని నమ్మబలికి వెళ్లిపోయారు. ఎప్పుడు డబ్బులు అడిగినా త్వరలోనే ఇస్తామని నమ్మబలికేవారు. ఇదే కోవలో ఐడీపీఎల్ కాలనీలోనీ దీపక్ జైన్‌కు చెందిన జ్యోతి జువెల్లరీలోనూ సుమారు 860 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని నెలరోజుల్లో డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు. చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్అయితే ఈ నెల 10 నుంచి ప్రగతినగర్‌లోని నితీష్ జైన్‌కు చెందిన చేతన్ జువెల్లరీ దుకాణాన్ని తెరవకపోవడంతో అతనికి బంగారం ఇచి్చన వ్యాపారులు, బంగారం కుదువపెట్టిన వారు, వివిధ స్కీంల పేరుతో డబ్బులు కట్టినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ, ఐడీపీఎల్ కాలనీలకు చెందిన ఇద్దరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు!

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు!
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే కోపంతో ఆ అమ్మాయి భర్తను హత్యచేసిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన పంపేన అయ్యప్పస్వామి అలియాస్ పవన్ (27) చిన్నప్పుడే తల్లి చనిపోవంతో మేనత్త ఇంటి వద్ద పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాని పెళ్లి చేసుకుంటానని వాళ్ల తల్లిదండ్రులకు బంధువులతో అడిగించాడు. అతడి ప్రవర్తన నచ్చక వివాహం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారు బతుకు తెరువు కోసం భగత్‌సింగ్ నగర్ఫేస్–1లో నివాసముంటున్నారు. ఇటీవల తన సోదరీతో కలిసి శ్రావణి సంధ్య రాజమండ్రికి వివాహ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ పవన్ ఆ అమ్మాయిని చూశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలంటే ఆమె భర్తను చంపాలని పవన్ పథకం వేసి ఆ అమ్మాయి నివాసముండే సమీపంలో మకాం మార్చాడు. తరచూ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల10న అర్ధరాత్రి వెంకటరమణ తన తోడల్లుడు దుర్గాప్రసాద్‌తో ఇంట్లో బంధువులతో కలిసి ఉండగా పవన్ వచ్చి గొడవ పడ్డాడు. వెంకటరమణను హత్య చేసేందుకు పవన్ తన స్నేహితులైన గుప్పల శివరామకృష్ణ (20), రాజమహేంద్రవరం అనిల్ (19), నంబిగారి సాయికుమార్(20), మరో బాలుడిని కలిసి వచ్చి వెంకటరమణ గుండెల్లో కత్తితో పొడవగా అక్కడికక్కడే వెంకట రమణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుబ్బల శివరామకృష్ణ, రాజమహేంద్రవరం అనిల్, నంబిగారి సాయికుమార్‌ను అరెస్టు చేయగా బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు అయ్యప్పస్వామి అలియాస్ పవన్‌న్ పరారీలో ఉండగా గురువారం రిమాండ్‌కు తరలించామన్నారు.

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.
వీడియోలు


అనంతపురం జిల్లాలో భారీ వర్షం


నందిగం సురేష్ అరెస్ట్


లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు


పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది


స్పిరిట్ లో కల్కి జోడి..


ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!


కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్


కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు


రాసుకో చంద్రబాబు.. ఒకే ఒక్కడు వైఎస్ జగన్