
బీజేపీయేతర సీఎంలకు స్టాలిన్ లేఖ
సాక్షి, చెన్నై: పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదం విషయంలో తనకు గడువు విధించడంపై రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు లేఖ రాయడాన్ని ఐకమత్యంతో వ్యతిరేకిద్దామంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, సమన్వయంతో కూడిన చట్టపరమైన వ్యూహం రూపొందించుకుందామని పిలుపునిచ్చారు.
‘‘తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించడమే రాష్ట్రపతి లేఖ ఉద్దేశం. అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును ధిక్కరించలేమని తెలిసి కూడా రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చి కేంద్రమే ఆమెతో లేఖ రాయించింది. దీని వెనుక మోదీ ప్రభుత్వ దురుద్దేశం వెల్లడవుతోంది’’ అంటూ పశ్చిమ బెంగాల్, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, పంజాబ్, జమ్మూకశీ్మర్ సీఎంలను స్టాలిన్ కోరారు.