Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Top Court To Minister Vijay Shah For Colonel Qureshi Remark1
‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు(సోమవారం, మే 19) విచారణలో భాగంగా విజయ్‌ షా చెప్పిన క్షమాపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.‘క్షమాపణలు ఏమిటి..?, అవి ఏ రకమైన క్షమాపణలు. క్షమాపణలు చెబుతున్నామంటే దానికి ఎంతో కొంత అర్థం ఉండాలి. ఇది విచారణ నుంచి బయటపడటానికి కార్చే మొసలి కన్నీరా?, మీకు ఎలాంటి క్షమాపణ ఉంది?, మిమ్మల్ని కోర్టు క్షమాపణలు చెప్పమని అడిగిందా?, మరి ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?, మీరు ఆ మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు నిజాయితీగా క్షమాపణలు కోరిన సందర్భం ఏమైనా ఉందా?, మరి ఇక్కడ ఎందుకు మాకు క్షమాపణలు చెబుతున్నారు?’అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అదే సమయంలో విజయ్ షాపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన స్సెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్ ను రేపటి(మంగళవారం) ఉదయానికల్లా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఒక మహిళా అధికారిని నియమించి మే 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్‌ షా గత మంగళవారం(మే 13వ తేదీ)ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్‌ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు.అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్‌ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

TDP Leaders Attack Sakshi TV Journalist in Karempudi 2
పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్‌పై టీడీపీ గూండాల దాడి

పల్నాడు: కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్‌ వర్థన్‌పై దాడి చేశారు. అశోక్‌ వర్థన్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి దిగారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ గుండాలు అడ్డుకున్నాయి. అయితే టీడీపీ గూండాల దాడిని చిత్రీకరించేందుకు సాక్షి జర్నలిస్ట్ అశోక్‌వర్థన్ కవరేజ్‌కు వెళ్లారు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై టీడీపీ గూండాలు దాడి చేశాయి. దాడి చేసిన గూండాల్లో పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము,గొల్ల సురేష్ యాదవ్‌,గోరంట్ల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నట్లు తేలింది.

DSP shuffled across Telangana3
Telangana Police: తెలంగాణలో భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ జితేందర్‌ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మ‌ల‌క్ పేట్ ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసీపీగా ఏ యాదగిరి, ఎస్ఆర్ న‌గ‌ర్‌ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసీపీగా ఏ సుధాకర్, కూక‌ట్‌ప‌ల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీగా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్ న‌గ‌ర్ ఏసీపీగా ఎస్ లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసీపీగా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసీపీగా పి ప్రవీణ్ కుమార్‌ల‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Kommineni Srinivasa Rao Comments on Yellow Media 4
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!

ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్‌ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్‌ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్‌ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్‌ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్‌ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్‌ లెక్కల్లో వెతుకుదాం.. జగన్‌ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్‌ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్‌ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్‌ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్‌ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్‌ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Rasi Phalalu: Daily Horoscope On 20-05-2025 In Telugu5
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.అష్టమి రా.12.22 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ధనిష్ఠ ప.3.36 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా10.35 నుండి 12.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: లేవు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.21. మేషం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. నూతన వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు. వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. అందర్నీ ఆకట్టుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.మిథునం: రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడనక సాగుతాయి.కర్కాటకం: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత కష్టించినా ఫలితం శూన్యం. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.సింహం: గత సంఘటనలు నెమరువేసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత సానుకూలం.కన్య: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల: అంచనాలు తప్పుతాయి. పనులు ముందుకు సాగవు. ఆస్తివివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాపరుస్తుంది. సోదరులు, మిత్రులతో విభేదాలు వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.వృశ్చికం: రుణబాధలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రుణాలు తీరుస్తారు. ప్రయాణాలు సాపీగా సాగుతాయి.కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.మకరం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం సహకరించదు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

Teachers United talks with AP government fail6
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది ఉపా­ధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో.. ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగు­తుందని ఐక్యవేదిక నేతలు మీడియాకు వెల్లడించారు. నిజానికి.. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీనపరచ­డాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.దీంతో.. ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీ చట్టంలోని పలు అంశాలపై సోమవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాభవన్‌లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో మొత్తం 19 డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని.. కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని.. కీలక అంశమైన ఇంగ్లిష్‌కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్‌ మీడియంలను కొనసాగించి స్టాఫ్‌ పాటర్న్‌ను కొనసాగించాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని నేతలు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 1 : 35 నిష్పత్తిని అమలుచేయాలని.. 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్‌ ఏర్పాటుపైనా స్పష్టత రాలేదన్నారు.అలాగే.. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా స్కూల్‌ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయమైందని వారన్నారు. ఫౌండేషన్‌ స్కూళ్లల్లో 1 : 20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో అంగీకరించారని, అయితే ఇది జీఓ–117లో ఉన్న అంశమేనన్నారు. ఇక స్టడీ లీవ్‌లో ఉండి రెండు నెలల్లో సర్వీసులో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీల్లో ఖాళీగా చూపబోమని చెప్పడం.. కేవలం 1,400 మంది ఎస్జీటీలకు మాత్రమే పదోన్నతులిచ్చి హెచ్‌ఎంలుగా నియమిస్తామడంలో అర్థంలేదని నేతలు తెలిపారు. మరోవైపు.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యంకాదని అధికారులు తేల్చిచెప్పడంతో ఉపాధ్యాయులు గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 21న డీఈఓ కార్యాలయల ముట్టడికి సిన్నద్ధమవుతున్నారు.మంత్రి జోక్యం చేసుకోవాలి..ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకోవాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ కోరారు.

 TDP MLA Kolikapudi Srinivasa Rao Overaction at Tiruvuru Municipal Election Center7
ప్రజాస్వామ్యానికి.. టీడీపీ పాతర

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: గ్రేటర్‌ విశాఖ డిప్యూటీ మేయర్‌ సహా వివిధ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, 20 పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ పదవుల కోసం సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ.. అక్రమాల జాతర నడిపించారు. తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి మంగళవారానికి వాయిదా వేశారు. నరసరావుపేట, కారంపూడిలో దొడ్డిదారిన.. నరసరావుపేట మండల పరిషత్‌ ఉపాధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక నిర్వహించగా కోరం లేక వాయిదా పడింది. మూడోసారి సోమవారం ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్‌ వేయడానికి టీడీపీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది.మూడోసారి నిర్వహిస్తున్న ఎన్నిక సమావేశం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించి.. సమావేశానికి ఎన్నికైన ముగ్గురు ఎంపీటీసీల్లో కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. కాగా.. కారంపూడి మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇక్కడ 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు. భయానక వాతావరణం సృష్టించి టీడీపీ ఈ పదవిని తన ఖాతాలో వేసుకుంది. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల రాజకీయం చేసింది. పదవులు, డబ్బు ఎరగా వేసి.. వినని వారిని కేసులతో భయపెట్టి తమ వైపు ఓటు వేయించుకుంది. గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండగా.. డబ్బులు ఎరవేసి ముగ్గురు ఎంపీటీసీలను తనవైపు తిప్పుకుంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఎంపీపీ పదవి కట్టబెట్టింది. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి కుట్రలకు బలైంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీ నాయన ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో రాంబార్కి శరత్‌ ఎన్నికయ్యారు. గ్రేటర్‌ విశాఖలో జనసేనకు ఝలక్‌ గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో జనసేన పారీ్టకి టీడీపీ కార్పొరేటర్లు ఝలక్‌ ఇచ్చారు. ఈ పదవి జనసేనకు ప్రకటించడంతో పలువురు టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకుండా షాకిచ్చారు. గత నెల 28న నిర్వహించిన మేయర్‌ ఎన్నికకు 74 మంది సభ్యులు హాజరుకాగా.. సోమవారం నిర్వహించిన డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యా­రు. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి 56 మంది సభ్యులు హాజరుకావాలి. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి మయూర్‌ అశోక్‌ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం రెండు నెలలపాటు అధికార పార్టీ అక్రమ కేసులు, తీవ్రస్థాయి బెదిరింపులు, మానసిక వేధింపుల్ని తట్టుకుని వైఎస్సార్‌సీపీలోనే కొనసాగిన ఎంపీటీసీ ఇనుకొండ ధనలక్ష్మి పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి బలం లేకపోయినప్పటికీ అత్తిలి ఎంపీపీ స్థానాన్ని, కైకలూరు వైస్‌ ఎంపీపీ స్థానాన్ని బెదిరింపులతో దక్కించుకుంది. అత్తిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. ఆపార్టీ తీవ్రస్థాయి బెదిరింపులతో కొందరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ జయకేతనం ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకం మండల ఉపాధ్యక్షుల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మార్కాపురం వైస్‌ ఎంపీపీ–2గా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్‌ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఎన్నిక­య్యారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిషత్‌ ఉపా­ధ్యక్షుడిగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఎనుముల సోమ­శేఖర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె రెండో వైస్‌ ఎంపీపీగా చెర్లోపల్లె వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అనసూయమ్మ ఎన్నికయ్యారు.

TDP Government New Conspiracy:  Andhra Pradesh8
బాబు ప్రభుత్వ ‘చావు’ తెలివి

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్య­సమస్యలతో మర­ణా­లనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.వీటిపై అప్ప­ట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు⇒ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుమరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్‌ఎస్‌ఎల్‌ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్‌ కిశోర్, ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కేవీఎన్‌ ప్రభుకు­మార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వ­రరావుతో టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యల­ను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడిజంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...నాటి ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ విచారణలోనూ అదే వెల్లడిఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్‌వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్‌ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.

Sunrisers Hyderabad wins by six wickets, eliminates Lucknow Super Giants9
లక్నోను ముంచిన సన్‌రైజర్స్‌

లక్నో: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట ఇదివరకే ముగిసింది. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌పై గెలిచి వారి ‘ప్లే ఆఫ్స్‌’ ఆశల్ని కూడా ముంచింది. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో లక్నోపై జయభేరి మోగించింది. ముందుగా లక్నో నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పూరన్‌ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌) దంచేశారు. ఇషాన్‌ మలింగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత సన్‌రైజర్స్‌ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్‌ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. దిగ్వేశ్‌ రాఠి 2 వికెట్లు తీశాడు. సెంచరీ భాగస్వామ్యం మిచెల్‌ మార్ష్ దూకుడుతో లక్నో ఆట మొదలైంది. కమిన్స్‌ తొలి బంతికి 4, నాలుగో బంతికి 6 కొట్టాడు. ఇదే జోరుతో హర్ష్ దూబే రెండో ఓవర్లో మార్ష్ మరో సిక్స్‌ బాదాడు. మూడో ఓవర్లో బౌండరీతో మార్క్‌రమ్‌ టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్‌ తొలి బంతికే మార్క్‌రమ్‌ అవుటవ్వాల్సింది. క్రీజు వదిలి ఆడిన అతన్ని ఇషాన్‌ కిషన్‌ స్టంపౌట్‌ చేయలేకపోయాడు. ఇలా బతికిపోయిన మార్క్‌రమ్‌ 6, 4లతో రెచి్చపోయాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. మార్ష్ దంచే పనిలో ముందున్నాడు. హర్షల్, ఇషాన్‌ మలింగ ఓవర్లలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓపెనింగ్‌ జోడీ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. కాసేపటికే మార్ష్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 9వ ఓవర్లో మార్క్‌రమ్‌కు మరోమారు లైఫ్‌ వచి్చంది. జీషాన్‌ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో అనికేత్‌ వదిలేశాడు. దీంతో అదే ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. తర్వాత ఎట్టకేలకు మార్ష్ వికెట్‌ తీసిన హర్ష్ దూబే 115 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. లక్నో కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (7) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాన్‌ రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేరాడు. రెండు లైఫ్‌లను సది్వనియోగం చేసుకున్న మార్క్‌రమ్‌ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పూరన్‌ మధ్యలో పడిపోయిన రన్‌రేట్‌ పెంచేందుకు బ్యాట్‌ ఝుళిపించాడు. హర్షల్‌ 16వ ఓవర్లో సిక్స్‌ బాదిన మార్క్‌రమ్‌ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. నితీశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్‌ బాదిన పూరన్‌తో పాటు శార్దుల్‌ (4)కూడా రనౌటయ్యారు. సమద్‌ (3)ను బౌల్డ్‌ చేయగా... ఆకాశ్‌ దీప్‌ (6) సిక్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. 20వ ఓవర్లో నితీశ్‌ 20 పరుగులిచ్చాడు. అభిషేక్‌ అదరహో రెండు ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు 23/1. అప్పటికి అభిషేక్‌ ఒక పరుగే చేశాడు. ఆకాశ్‌దీప్‌ మూడో ఓవర్‌ నుంచి అతని విధ్వంసం మొదలైంది. 4, 6 బాదిన అభిషేక్‌ తర్వాతి రూర్కే ఓవర్లోనూ దీన్ని రిపీట్‌ చేశాడు. దీంతో 3.3 ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరింది. అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌కు దిగితే వరుస బౌండరీలతో జోరు కనబరచడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్‌ 72/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ఓవర్‌ వేసిన రవి బిష్ణోయ్‌కి అభిషేక్‌ చుక్కలు చూపించాడు. 6, 6, 6, 6లతో 26 పరుగులు రాబట్టాడు. మూడో సిక్స్‌ బాదేసరికే 18 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. మరుసటి ఓవర్లో అభిషేక్‌ జోరుకు దిగ్వేశ్‌ రాఠి బ్రేక్‌ వేశాడు. ఈ సందర్భంగా రాఠి, అభిషేక్‌ మాటామాట పెంచుకున్నారు. అంపైర్లు సముదాయించి పంపారు. 35 బంతుల్లోనే 82 పరుగుల ధనాధన్‌ రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇషాన్‌ కిషన్‌ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లు ధాటిని కొనసాగించడంతో సన్‌రైజర్స్‌ లక్ష్యంవైపు దూసుకెళ్లింది. కిషన్‌ అవుటయ్యాక ‘దంచే’పనిని క్లాసెన్, కమిందు మెండిస్‌ (21 బంతుల్లో 32 రిటైర్డ్‌హర్ట్‌; 3 ఫోర్లు) చక్కబెట్టారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరినా... మిగతా లాంఛనాన్ని అనికేత్‌ (0 నాటౌట్‌), నితీశ్‌ రెడ్డి (0 నాటౌట్‌) పూర్తి చేశారు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ 65; మార్క్‌రమ్‌ (బి) హర్షల్‌ 61; పంత్‌ (సి అండ్‌ బి) మలింగ 7; పూరన్‌ (రనౌట్‌) 45; బదోని (సి) నితీశ్‌ (బి) మలింగ 3; సమద్‌ (బి) నితీశ్‌ 3; శార్దుల్‌ (రనౌట్‌) 4; బిష్ణోయ్‌ (నాటౌట్‌) 0; ఆకాశ్‌దీప్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–115, 2–124, 3–159, 4–169, 5–194, 6–199, 7–199. బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–34–0, హర్ష్ దూబే 4–0–44–1, హర్షల్‌ పటేల్‌ 4–0–49–1, ఇషాన్‌ మలింగ 4–0–28–2, జీషాన్‌ అన్సారి 2–0–22–0, నితీశ్‌ 2–0–28–1. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అథర్వ తైడే (సి) దిగ్వేశ్‌ (బి) రూర్కే 13; అభిషేక్‌ (సి) శార్దుల్‌ (బి) దిగ్వేశ్‌ 59; కిషన్‌ (బి) దిగ్వేశ్‌ 35; క్లాసెన్‌ (సి) పంత్‌ (బి) శార్దుల్‌ 47; కమిందు (రిటైర్డ్‌హర్ట్‌) 32; అనికేత్‌ (నాటౌట్‌) 5; నితీశ్‌ రెడ్డి (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–17, 2–99, 3–140, 4–195. బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 3–0–33–0, రూర్కే 2.2–0–31–1, దిగ్వేశ్‌ రాఠి 4–0–37–2, అవేశ్‌ ఖాన్‌ 3–0–25–0, రవి బిష్ణోయ్‌ 1–0–26–0, మార్క్‌రమ్‌ 1–0–14–0, శార్దుల్‌ 4–0–39–1.

CM Revanth Reddy Unveils Nallamala Declaration: Telangana10
మా పాలన దేశానికే రోల్‌ మోడల్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, నాగర్‌కర్నూల్‌‘మా పాలన దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. శాంతిభద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలన, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సైతం మా పాలనను అభినందించక తప్పని పరిస్థితి నెలకొంది. మా పాలనలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాం. గత 16 నెలల్లో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచాం. మరో 1.50 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించాం. గత ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి.మా పాలనలో మాత్రం నోటిఫికేషన్లు వాయిదా వేయాలని ధర్నాలు జరుగుతున్నాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం బాగుపడుతుంది. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేసేలా ప్రణాళిక రూపొందించాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద మాచారంలోని 29 మంది చెంచు రైతులకు చెందిన 45 ఎకరాల పోడు భూముల్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.వాటిల్లో బోర్లు, సోలార్‌ పంప్‌ సెట్‌తో పాటు మామిడి, ఉద్యాన మొక్కలు నాటారు. కాగా ఆయా భూముల్లోని సోలార్‌ పంప్‌సెట్‌ను ముఖ్యమంత్రి ఆన్‌ చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటించి మాట్లాడారు. వాళ్లు భూములు గుంజుకున్నారు.. మేం పంటలు ప్రోత్సహిస్తున్నాం ‘గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోడు రైతుల భూములను గుంజుకుని వారికి బేడీలు వేసి జైలుకు పంపింది. ములుగు, తాడ్వాయి అడవుల్లో ఆడబిడ్డలను చెట్టుకు కట్టేసి కొడితే మేం వెళ్లి అండగా నిలబడ్డాం. కాంగ్రెస్‌ వచ్చాక గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జలవికాసం అమలు చేస్తున్నాం. గిరిజనుల పోడు భూముల్లో సోలార్‌ విద్యుత్, బోర్లు ఏర్పాటు చేసి వారు పంటలను పండించేలా ప్రోత్సహిస్తున్నాం. అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం నేను ఇక్కడి నల్లమల ప్రాంతానికి చెందిన వాడినని చెప్పుకునేందుకు నా గుండె ఉప్పొంగుతోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ రానున్న వంద రోజుల్లో ఉచితంగా సోలార్‌ బోర్లను ఏర్పాటు చేస్తాం. సోలార్‌ విద్యుత్‌ వినియోగంతో పాటు ఉత్పత్తి చేసి నెలనెలా రూ.ఐదారు వేల ఆదాయం కల్పించేలా చూస్తాం. నియోజకవర్గంలో ఎన్ని సోలార్‌ పంప్‌సెట్లైనా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. సన్న బియ్యంతో పేదల ఆత్మగౌరవం పెంచాం.. గతంలో రైతులు వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేసుకున్నడు. మేం వచ్చాక సన్నాలు పండించాలని చెప్పి రూ. 500 బోనస్‌ అందించాం. ఏడాదిలో 2.80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పండించి దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిపాం. రేషన్‌ బియ్యంగా సన్న బియ్యాన్ని అందించి పేదల ఆత్మగౌరవాన్ని పెంచాం.’ అని సీఎం చెప్పారు. ప్రధాని అంటే ఇందిరా గాందీలా ఉండాలి.. ‘భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ను రెండు ముక్కలు చేశారు. ఇప్పటికి 50 ఏళ్లైనా ప్రధాని అంటే ఇందిరాగాం«దీలా ఉండాలని అంటారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో మేం ప్రజల కళ్లల్లో వెలుగులు నింపేలా పని చేస్తున్నాం. అక్రమ సంపాదనతో ఎవరెన్ని కుట్రలు చేసినా, మా ఆడబిడ్డలకు అన్నీ తెలుసు. సన్నాసులంతా కలసి సోషల్‌ మీడియాలో ఎంత ప్రచారం చేసినా, మహిళలకు నిజం తెలుసు. కడుపు నిండా విషం కక్కుతూ మా ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారి దిక్కు చూడం, పట్టించుకోం..’ అని రేవంత్‌ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేదు: భట్టి విక్రమార్క భూమి కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించి నీటి సౌకర్యం కలి్పంచిన ఉదంతాలు దేశంలో ఎక్కడా లేవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నల్లమల డిక్లరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని గిరిజనుల కోసం సంకల్పం తీసుకోవడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, మేఘారెడ్డి, అనిరు««ద్‌రెడ్డి పాల్గొన్నారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో రేవంత్‌ పర్యటన సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గజమాల, పూలతో ఊరేగింపుగా వచ్చి ఘన స్వాగతం పలికారం. కాగా ముఖ్యమంత్రి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి తన సొంత ఇంట్లో భోజనం చేశారు. ఏమ్మా.. నీళ్లు పడ్డాయా?చెంచు మహిళలతో సీఎం సంభాషణ సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంబోత్సవం సందర్భంగా మాచారంలోని చెంచుల పోడు భూములను సందర్శించిన ముఖ్యమంత్రి.. అక్కడే ఉన్న చెంచు మహిళలు ఉడుతనూరి అలివేలు, లక్షమ్మలను పలకరించారు. వారితో కాసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. సీఎం: ఏమ్మా.. మీ బోరులో నీళ్లు పడ్డాయా? అలివేలు: మా భూమిలో వేసిన బోరులో నీళ్లు మంచిగా పడ్డాయి సర్‌. సంతోషంగా ఉంది. సీఎం: ఏం మొక్కలు నాటారు, వాటిని బతికించుకుంటారా? అలివేలు: మామిడి, ఆవకాడో, బత్తాయి మొక్కలు నాటాం. బాగా కాపాడుకుంటాం సర్‌. ఇన్నాళ్లు మా భూమి బీడుగానే ఉంది. ఇప్పుడు పంటలు పండించుకుంటాం. సీఎం: ఈ పథకంపై ఇతర మహిళలకు శిక్షణ ఇస్తావా? అలివేలు: నేను డిగ్రీ పూర్తి చేశాను సర్‌. తప్పకుండా మా తోటి మహిళలకు, చెంచులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తా. మీరు మా కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది ‘పోడు’కు నిధుల తోడు గిరిజన సంక్షేమం లక్ష్యంగా నల్లమల డిక్లరేషన్‌ నల్లమల డిక్లరేషన్‌లో రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు అంశాలను పొందుపర్చింది. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజనులకు 2006 ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం సంక్రమించిన సుమారు 6.69 లక్షల ఎకరాల భూములపై పూర్తి హక్కులను గుర్తించింది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల పోడు భూముల్లో నూరు శాతం ఉచితంగా బోరుబావులు, సోలార్‌ విద్యుత్‌ సౌకర్యంతో పాటు ఉద్యాన పంటల ప్లాంటేషన్‌ ఏర్పాటు చేస్తారు. పోడు భూముల్లో నీటి సౌకర్యం కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల కేటాయిస్తారు. ⇒ ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద గిరిజనులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారు ⇒ తొలుత మాచారంలో పైలట్‌ ప్రాజెక్ట్‌. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు ⇒ఈ పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు ఐదేళ్ల పాటు లబి్ధదారులతో సర్కారు సమన్వయం. ఎప్పటికప్పుడు అటవీ, విద్యుత్, భూగర్భ జలవనరులు, ఉద్యాన శాఖల పర్యవేక్షణ ⇒ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెంచులు, ఆదిమ జాతుల కుటుంబాలు అందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ⇒ రాజీవ్‌ యువవికాసం కింద ప్రత్యేకంగా గిరిజన యువతకు రూ.1,000 కోట్ల నిధులతో ఒక్కొక్కరికీ రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాలు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement