పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్‌పై టీడీపీ గూండాల దాడి | TDP Leaders Attack Sakshi TV Journalist in Karempudi | Sakshi
Sakshi News home page

పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్‌పై టీడీపీ గూండాల దాడి

May 19 2025 5:02 PM | Updated on May 19 2025 6:05 PM

TDP Leaders Attack Sakshi TV Journalist in Karempudi

పల్నాడు: కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్‌ వర్థన్‌పై దాడి చేశారు. అశోక్‌ వర్థన్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి దిగారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ గుండాలు అడ్డుకున్నాయి. 

అయితే టీడీపీ గూండాల దాడిని చిత్రీకరించేందుకు సాక్షి జర్నలిస్ట్ అశోక్‌వర్థన్ కవరేజ్‌కు వెళ్లారు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై టీడీపీ గూండాలు దాడి చేశాయి. దాడి చేసిన గూండాల్లో పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము,గొల్ల సురేష్ యాదవ్‌,గోరంట్ల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నట్లు తేలింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement