వైఎస్సార్సీపీ నిరసనలు అప్‌డేట్స్..
పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఏపీ రాష్ట్ర వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయి. వైఎస్సార్‌సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినా ఆ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నిరసన ర్యాలీలకు విధించిన భారీ ఆంక్షలను ప్రజలు తమ నిరసనల రూపంలోనే తిప్పికొట్టారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ర్యాలీలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సంఘీభావం తెలిపారు. ఈ నిరసన ర్యాలీల్లో డీఎస్సీ అక్రమాలపై నిగ్గు తేల్చాలని, సీబీఐ విచారణకు అప్పగించాలని, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్లు ప్రధానంగా వినిపించాయి.
వైయస్సార్ జిల్లా
- డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీ
- ర్యాలీని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరింపు
- వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మెుదలైన ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
- అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన పోలీసులు
- పోలీసుల బంధనాలను తెంచుకుని ముందుకు సాగిన ర్యాలీ
- ఎట్టిపరిస్థితిల్లో డీఎస్సీ ఆందోళనలు జరగడానికి వీళ్లేదంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన ఆదినారాయణరెడ్డి
- బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదేశాలతో నిన్న దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు
- ఒకరి తర్వాత ఒకరు దీక్షను కొనసాగించడంతో నేడు ర్యాలీని అడ్డుకోవాలని కుట్ర
- వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించినా ముందుకు సాగిన ర్యాలీ
- పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు..కూటమి నేతలకు చెంపపెట్టులా ప్రారంభమైన ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
వైయస్సార్ జిల్లా
- జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం
- 2025లో జరిగిన డీఎస్సీ అవకతవకలపై ర్యాలీకి సిద్ధమైన వైఎస్సార్సీపీ నాయకులు
- ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధమైన కార్యకర్తలు
- వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ భారీ గేట్లు వేసిన పోలీసు అధికారులు
- జమ్మలమడుగులో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసు బలగాలు
- ఎన్ని బలగాలు అడ్డుపడిన తగ్గేదేలే అంటున్న వైఎస్సార్సీపీ నేతలు
- ఎట్టిపరిస్థితుల్లో ర్యాలీ చేసి తీరుతాం అంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు
- ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు
చిత్తూరు జిల్లా
- పూతలపట్టు నియోజకవర్గం కేంద్రం పూతలపట్టులో మెగా డీఎస్సీ అక్రమాలు పై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..
- పోలీసులు ఆంక్షలు విధించినా భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు.
- అంబేద్కర్ విగ్రహం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ
- డీఎస్సీ నియామకాల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
తిరుపతి జిల్లా:
- శ్రీకాళహస్తిలో డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ..మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి

నెల్లూరు జిల్లా
మనుబోలులో ఉద్రిక్త పరిస్థితి
- మనుబోలులో డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాకాణి పూజిత.
- వీరభద్ర దేవస్థానం నుండి జాతీయ రహదారి వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వరకు భారీ ర్యాలీ..
- ఈ ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు,
- వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసుల తోపులాట.
కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్
- నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం కూటమి సర్కార్
- నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి..
- ప్రతిపక్ష నిరసనలపై పోలీసులతో అణచివేత, బ్యానర్లో చించి వేస్తూ తాడులకు తెగబడుతున్నారని మాజీ మంత్రి ఆరోపణ.
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న పోరాటం
విజయవాడ..
బోండా ఉమాకుదేవినేని అవినాష్ వార్నింగ్
- డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాం
- మేం నిరసనలు చేస్తుంటే కొంతమంది జోకర్లు , కమెడియన్లను మా పైకి పంపించారు
- జోకర్లు , కమెడియన్లు పులులం , సింహాలం అని బిల్డప్ ఇస్తున్నారు
- జోకర్లు , కమెడియన్లకు వైఎస్సార్‌సీపీ భయపడదు
- విద్యార్ధులకు జరిగిన అన్యాయం పై మాట్లాడమంటే మా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు
- మా కుటుంబం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు
- మా ముత్తాత దేవినేని సూర్యనారాయణ నెప్పల్లి గ్రామానికి 18 ఏళ్లు సర్పంచ్ గా పనిచేశారు
- మా తాతగారు దేవినేని రామకృష్ణ వరప్రసాద్ ఈ జిల్లాలోనే తొలి ఇండస్ట్రియలిస్ట్
- ప్రకాశం బ్యారేజ్ కు గడ్డర్లు సప్లై చేసింది మా కుటుంబం నుంచి వచ్చిన సువర్ణ ఇండస్ట్రీస్
అనంతపురం..
- మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్..
- డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్‌ను ప్రాసిక్యూట్ చేయాలి
- నీట్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేశారు
- డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?
- లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో టీడీపీ కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది
- డీఎస్సీ అభ్యర్థుల నుంచి వచ్చిన 35వేల ఫిర్యాదులను ఎందుకు బుట్టదాఖలు చేశారు.
- దీనిపై చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి
తూర్పుగోదావరి జిల్లా..
- రాజమండ్రి రూరల్ బొమ్మూరులో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ
- ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు.
కృష్ణా..
- డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ భారీ నిరసన ర్యాలీ
- పెనమలూరు నియోజకవర్గలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో ర్యాలీ
- దేవభక్తుని చక్రవర్తి కామెంట్స్
- విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై సీబీఐ విచారణ జరపాలి.
- డీఎస్సీలో జరిగిన బాగోతాలు బయటపెడుతుంటే మాపై దాడులు చేస్తున్నారు
- అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారు
- కూటమి ప్రభుత్వం ఉద్యోగులను, యువతను మోసం చేసింది
- నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనర్హుడు
- నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలి
తూర్పుగోదావరి జిల్లా..
- రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై ఆందోళన
- రాజా ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.
- పోలీసులు బయటకు వెళ్లనివ్వకపోవడంతో ఇంటివద్దే ధర్నాకు దిగిన జక్కంపూడి రాజా
- పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్న పార్టీ నేతలు, యువకులు
- డీఎస్సీ అక్రమాలపై విచారణ కొనసాగాలని లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
కాకినాడ..
- కురసాల కన్నబాబు కామెంట్స్....
- డీఎస్సీ అక్రమాలపై సీబీఎన్ విచారణ కాదు.. సీబీఐ విచారణ కావాలి.
- డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.
- ఫీజు రియింబర్స్మెంట్ , నిరుద్యోగ భృతి బకాయిలు విడుదల చేయాలి.
- డీఎస్సీపై విచారణ అంటే చంద్రబాబు వణికిపోతున్నాడు
- మంత్రి లోకేష్ భయపడుతున్నాడు
- ర్యాలీ చేయవద్దని పోలీసులు నాకు రెండు నోటీసులు ఇచ్చారు.
- పోలీసులు కేసులు పెడతామన్నా ఏడు కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీ చేశాం
వైఎస్సార్ జిల్లా...
- బద్వేలులో డీఎస్సీ అక్రమాలపై జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
- ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి ఆదిత్ రెడ్డి.
- శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకున్న పోలీసులు..
- పోలీసులకు, పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం..
- ర్యాలీ జరగనివ్వమంటూ రవీంద్రనాథ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..
- పోలీసుల తీరుపై మండిపడ్డ రవీంద్రనాథ్ రెడ్డి..
- శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలు
- పోలీసులను తోసుకుని ముందుకు దూసుకుపోయి ర్యాలీని నిర్వహించిన నేతలు
కృష్ణాజిల్లా..
- గన్నవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
- ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.
- రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డు పెట్టిన పోలీసులు.
- పోలీసులు, నాయకుల మధ్య వాగ్వివాదం.
- పోలీసులు తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగిన వైఎస్సార్‌సీపీ నాయకులు.
- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్
- కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారు.
- అధికారంలోకి వచ్చాక డీఎస్సీ తీశారు.
- చంద్రబాబు ప్రభుత్వం తీసిన మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారింది.
- అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
- డీఎస్సీ నియామకం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది.
- డీఎస్సీపై ఎందుకు సీబీఐ విచారణ వేయడం లేదు.
- గతంలో ఎన్నో నీతులు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు?.
- ఎంతో మంది యువకులు కష్టపడి చదివి ఉద్యోగం రాకపోతే..
- బ్రోకర్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారు.
- ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని చేసిన చంద్రబాబు..
- అధికారంలోకి వచ్చాక మాట్లాడిన వారిపై అక్రమ కేసులు, ఉపా కేసులు కూడా పెడుతున్నారు.
- వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే చంద్రబాబు సీబీఐ విచారణ చేయాలి.
విశాఖ..
- కదిరి బాబురావు కామెంట్స్..
- అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.
- అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం..
- శాంతియుతంగా నిర్వహించే ర్యాలీలను అడ్డుకోవడం సరికాదు.
- డీఎస్సీ అవకతవకలపై సీబిఐ విచారణ జరిపించాలి.
- మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి..
- ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అరెస్ట్..
- ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం..
- శాంతియుతంగా పోరాటం చేస్తున్నా అడ్డుకుంటున్నారు..
- పోలీసుల తీరు చాలా దారుణంగా ఉంది: కళ్యాణి
గుంటూరు..
- అంబటి రాంబాబు కామెంట్స్..
- యువగళంలో లోకేష్‌తో నడిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారు
- ఇందుకోసం పేపర్ లీక్ చేశారు
- జీవో నెంబర్ 4, 47లు తెచ్చి అక్రమాలు చేశారు
- సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు ఉద్యోగం ఇచ్చారు
- తమకు కావాల్సిన వారికి ఉద్యోగం ఇచ్చుకుని మరో జీవో తెచ్చారు
- దీనిపై మేము ఉద్యమం చేస్తే మా దీక్షా శిబిరాలపై దాడులు చేశారు
- టీడీపీ నేతలే టెంట్లు పీకటం దుర్మార్గం
- వాస్తవాలు బయటకు వస్తాయని టీడీపీ నేతలు భయపడుతున్నారు
- పోలీసులతో మా దీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేశారు
- గాంధేయ పద్దతిలో చేసే నిరసనలను అడ్డు కోవటం సరికాదు
- పొన్నూరు, చిలకలూరిపేట, విజయవాడలో పోలీసులే టెంట్లు పీకారు
- పోలీసుల పని టెంట్లు పీకటమా?
- ఇప్పటికైనా లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలి.
- డీఎస్సీ అభ్యర్దులు లేరంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కు టీడీపీ పాల్పడుతుంది.
- డీఎస్సీపై పోరాటం ఆపం.
- రాబోయే రోజుల్లో అందరూ ఉద్యమబాట పడతారు.
- వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి.
తూర్పుగోదావరి జిల్లా..
- రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఇంటి వద్ద ఉద్రిక్తత
- ర్యాలీగా పార్టీ శ్రేణులతో శాంతియుతంగా బయలుదేరిన మాజీ ఎంపీని అడ్డుకున్న పోలీసులు
- పోలీసుల తీరుపై మండిపడిన భరత్
- ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు
- డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్
- గేటు వద్దే కూర్చుని నుంచి ఆందోళన నిర్వహిస్తున్న భరత్
- పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
- లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
విశాఖ:
- విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత..
- ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు అరెస్ట్..
- పోలీసు వాహనాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..
కృష్ణాజిల్లా..
- గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ..
- ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకుంటున్న పోలీసులు..
విశాఖ..
- విశాఖలో తీవ్ర ఉద్రిక్తత..
- పోలీసులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం.
- కేకే రాజును బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు.
- పోలీసులకు పార్టీ నేతలకు మధ్య తోపులాట.
- భారీ బందోబస్తు మధ్య కేకే రాజును అరెస్టు చేసిన పోలీసులు.
విజయవాడ
- విజయవాడలో ఉద్రిక్తత
- దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- పోలీసు బారికేడ్లు తోసుకుంటూ దూసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
- డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని ఆందోళన
- దేవినేని అవినాష్ కామెంట్స్..
- చంద్రబాబు ప్రభుత్వం భయపడుతుంది
- యువత ఉద్యమాన్ని చూసి లోకేష్ భయపడుతున్నారు
- అందుకే పోలీసులు చేత ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారు
- ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
- డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయి
- పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ జరగాలి
తూర్పుగోదావరి జిల్లా..
- రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- కార్యకర్తలు ఎవరిని లోపలికి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు
- ర్యాలీకి అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు
వైఎస్సార్ జిల్లా
- పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత
- ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసుల లాఠీఛార్జ్
అనంతపురం..
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..
- తాడిపత్రి వెళ్తున్న నన్ను అడ్డుకోవడం దుర్మార్గం
- శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా?
- డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే
- లోకేష్ డైరెక్షన్‌లోనే డీఎస్సీ అక్రమాలు జరిగాయి
- ఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని లక్షల రూపాయలకు అమ్ముకున్నారు
- తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కక్ష సాధింపు చర్యలు దారుణం
- పెద్దారెడ్డి ఏ కార్యక్రమం నిర్వహించినా.. పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం
- తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీని లేకుండా చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు
- జేసీ ఆగడాలకు పోలీసులు వత్తాసు పలకడం సరికాదు.
నెల్లూరు..
- డీఎస్సీ అవకతవకలపై నెల్లూరు సిటిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ
- ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువతతో ఆందోళన
- కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి
- భారీగా పోలీసుల మోహరింపు, ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు
- అంబేద్కర్ సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు
విశాఖ..
- విశాఖ నార్త్ నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం..
- ర్యాలీకి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల బైక్ తాళాలు తీసుకున్న పోలీసులు..
- ర్యాలీ నిర్వహించకుండా భారీగా పోలీసుల బందోబస్తు.
- పోలీసులు తీరుపై జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆగ్రహం

వైఎస్సార్ జిల్లా
- పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా ఆగని పోరాటం
- పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్ధులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
- ర్యాలీలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి
- డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
చిత్తూరు జిల్లా
- కుప్పంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా డీఎస్సీ వ్యతిరేక ర్యాలీపై పోలీసుల ఆంక్షలు..
- కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ హౌస్ అరెస్ట్..
- ఇంటి ముందే నిరసన చేపట్టిన ఎమ్మెల్సీ భరత్..
- డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ భరత్
- మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి.
- వారం రోజుల ముందే కుప్పం డీఎస్పీకి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టాం.
- టీడీపీ వారు మాకన్నా ముందే పర్మిషన్ తీసుకున్నారని మాకు అనుమతి తిరస్కరించారు.
అనకాపల్లి
- నర్సీపట్నంలో నిరసన దీక్షకు పోలీసులు ఆంక్షలు
- మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి దగ్గర పోలీసులు మోహరింపు.
- గణేష్ ర్యాలీకి వెళ్లకుండా అడ్డగింత.
- నిరసన తెలిపి తీరుతామన్న మాజీ ఎమ్మెల్యే గణేష్
- ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీస్ వ్యవహరిస్తున్నారన్న గణేష్.
- రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు
- ప్రభుత్వం చేసిన తప్పులను తెలియ పరచడం ప్రతిపక్ష ధర్మం

అనంతపురం..
- తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద పోలీసుల అత్యుత్సాహం
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వాగ్వాదం
- పోలీసుల తీరుకు నిరసనగా అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- శాంతియుత ర్యాలీని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించిన పెద్దిరెడ్డి.
విజయవాడ
- మాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ..
- ర్యాలీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులు..
- మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు..
చిత్తూరు
- చిత్తూరులో ఉద్రిక్తత వాతావరణం
- గంగినేని చెరువు వద్ద నుంచి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు
- అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు.. ముందుకు సాగుతున్న నిరసన ర్యాలీ
నర్సీపట్నం..
- నర్సీపట్నంలో నిర్వహించే నిరసన ర్యాలీకి అనుమతి లేదంటే పోలీసుల ఆంక్షలు.
- మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు..
- పార్టీ నాయకులు ర్యాలీకి తరలి రాకుండా పోలీసుల ఆంక్షలు.
- నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరిస్తున్న పోలీసులు.
- ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపు
విశాఖ
- వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు..
- ర్యాలీకి రావద్దంటూ పార్టీ శ్రేణులను బెదిరిస్తున్న పోలీసులు..
- నాయకులకు ఫోన్ చేసి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు.
- ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులు ..
- బైకులు, కార్లు సీజ్ చేస్తామని హెచ్చరిక.
- నిరసన ర్యాలీలు చేపట్టే ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు..
- పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం.
తూర్పుగోదావరి జిల్లా...
- మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వైఎస్సార్‌సీపీ
- పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీలు
- ర్యాలీలకు అనుమతి లేదంటూ నేతకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
- మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద మొహరించిన పోలీసులు...
గాజువాక..
- ర్యాలీ చేసేందుకు వెళుతున్న గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..
- ర్యాలీకి అనుమతి లేదంటూ ఇంటి దగ్గరే ఆపివేసిన పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా:
- తిరువూరు నియోజకవర్గంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు హుకుం..
- తిరువూరు జెడ్పీటీసీ వై.రామచంద్రా రెడ్డి, విస్సన్నపేట లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి శిరసాని ప్రకాష్ పలువురి నేతలకు నోటీసులు..
- ర్యాలీ తలపెట్టిన ఫ్యాక్టరీ సెంటర్లో పోలీసులు మోహరింపు..
విజయవాడ
- మాజీ మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద భారీగా మొహరించిన పోలీసులు..
- ర్యాలీకి అనుమతి లేదంటూ వాట్సాప్ ద్వారా వెల్లంపల్లికి తెలిపిన పోలీసులు..
- ర్యాలీకి సిద్దమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు..
- ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామంటున్నా పోలీసులు..
అనంతపురం:
- తాడిపత్రిలో ఉద్రిక్తత
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పెద్దారెడ్డి భారీ ర్యాలీ
- తాడిపత్రిలోని స్వగృహం నుంచి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదం
- వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట
- తాడిపత్రికి వచ్చే వైఎస్సార్‌సీపీ శ్రేణుల వాహనాలను అడ్డుకున్న పోలీసులు
- డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని పెద్దారెడ్డి డిమాండ్..
చిత్తూరు జిల్లా ..
- కుప్పంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డీఎస్పీ పార్థసారథి
- ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
- టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు నోటీసులు.
- పర్మిషన్ లేకపోవడంతో నేతలు ఎవరు ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డీఎస్పీ
- ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు..
కాకినాడ..
- తునిలో వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు కూటమి కుట్ర
- పార్టీ ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
- సెక్షన్ 30 అమలులో ఉందని.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు
నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
- నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలనీ..
- మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ నిరసన ప్రదర్శనలు
- ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్‌సీపీ
- కలెక్టర్లకు వినతి పత్రాలు, టౌన్ హాలు సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహణ
- ప్రభుత్వం స్పందించేంత వరకు పోరాటం ఆపేదిలేదంటున్న వైఎస్సార్‌సీపీ.
కర్నూలు..
- డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- ర్యాలీకి అనుమతి లేదంటూ కర్నూలు టూ టౌన్ పోలీసులు ఆంక్షలు
- అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అంటూ పోలీసుల బెదిరింపులు
- కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు
- వైఎస్సార్‌సీపీ నేతలకు అర్థరాత్రి నోటీసులు అందించిన పోలీసులు.
గుడివాడలో..
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు నోటీసులు అందజేయడం గమనార్హం. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.

తాడిపత్రిలోనూ ర్యాలీకి బ్రేక్..
అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు చేశారు.
అయితే ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీగా మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రెండు వర్గాల కార్యక్రమాలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. అనుమతి నిరాకరించారు.


