breaking news
Lifestyle
-
చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది.. అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్ ..! వేరెలెవెల్..
కేరళలోని సంప్రదాయ శాస్త్రీయ నృత్యం మోహినీయాట్టం, మోడ్రన్ ర్యాప్ ట్రాక్‌ను మిక్స్ చేసి సోషల్ మీడియా సెన్షెషన్గా మారింది శ్వేత వారియర్. ఎనిమిదిమంది డ్యాన్సర్లతో కలసి ఈ వినూత్న నృత్యం చేసింది. ‘రన్ ఇన్ అప్ ర్యాప్ చూసిన తరువాత కొత్తగా ఏదైనా చేయాలనిపించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసింది శ్వేత.ఈ డ్యాన్స్ వీడియోకు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘రెఫ్రెషింగ్’ ‘ఇన్నోవేటివ్’ ‘పవర్ఫుల్’ అని స్పందించారు నెటిజనులు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన శ్వేత వారియర్ కొత్త డ్యాన్స్ స్టైల్స్‌ను క్రియేట్ చేయడంలో పేరు తెచ్చుకుంది. మూడు సంవత్సరాల వయసు నుంచే తల్లి దగ్గర భరతనాట్యంలో శిక్షణ పొందింది. భరత నాట్యం, అర్బన్ స్ట్రీట్ స్టైల్స్‌ను మిక్స్ చేసి సృష్టించిన ‘స్ట్రీట్ వో క్లాసికల్’ సూపర్‌హిట్ అయింది.రకరకాల ‘హైబ్రీడ్ డాన్స్ స్టైల్స్’తో డాన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్వేత వారియర్. సోనీ టీవి ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’లో రన్నర్–అప్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Swetha Warrier (@shweta_warrier) (చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..!
ధృఢ సంకల్పం ఎంతటి వైకల్యాన్ని అయినా అధిగమించి లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అందుకు ఎన్నో ఉదంతాలు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా ఈ పారాసైక్లిస్ట్ కూడా ఆ కోవలోకి చేరిపోయారు. ఆయన తన రాష్ట్ర అభ్యున్నతి కోసం అనితరసాధ్యమైన యాత్ర చేపట్టారు. ఆ జర్నీ అతడి శారీరక స్థితి రీత్యా అత్యంత సవాలుతో కూడినది. అయినప్పటికీ అన్ని కష్టాలను ఓర్చుకుంటూ లక్ష్యాన్ని చేధించి దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచారాయన. ఆయనే పారాసైక్లిస్ట్ రాకేష్ బానిక్. అతను తన శారీరక అసమానతలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను పలు అవాంతరాలు అధిగమించి మరి ఏకంగా ఏడు వేల కిలోమీటర్లు చుట్టొచ్చారు. అదంతా ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందామా..!.అస్సాంకి చెందిన ఆయన ఇది వ్యక్తిగత విజయం కాదని తన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నమని అన్నారు. తాను ఈ యాత్రను అస్సాం పర్యాటక మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏప్రిల్ 29న మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు, రష్యా, కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ గుండా సైకిల్ తొక్కుతూ దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంటికాలితో తొక్కుతూ ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. తాను ఈ నాలుగు దేశాలలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులతో సంభాషించారట. వారికి భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యం గురించి పరిచయం చేశారట. ఎదురైన ఇబ్బందులు..విదేశీ భూభాగంలో కృత్రిమ కాలుతో సైక్లింగ్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతికూల వాతావరణంలో చేస్తున్న కఠినమైన ప్రయాణంలా ఉందని అన్నారు. రష్యాలో మైనస్‌లలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటే..ఉజ్బెకిస్తాన్‌లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతని ఎదుర్కొంటూ సైక్లింగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ విధమైన వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ప్రయాణించడం అత ఈజీ కాదని అన్నారు. పైగా సరైన ఫుడ్ దొరకక పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదని కూడా అన్నారు. ఈ పరిస్థితులన్నింటికి తోడు చైనా వీసా తిరస్కరణ ఎంతగానో బాధించిందన్నారు. దాంతో నేపాల్ గుండా వెళ్లేలా జర్నీని ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రమోషన్ లక్ష్యంగా చేస్తున్న ఈ యాత్ర చైనా ప్రభుత్వానికి నచ్చకపోవడంతోనే టిబెట్‌లోకి అడుగుపెట్టనివ్వలేదని బానిక్ తెలిపారు. ఇక అఫ్ఘనిస్తాన్ గుండా సైక్లింగ్ చేస్తూ వెళ్లడం అన్నది అత్యంత సవాలుతో కూడినది. తాలిబాన్ నుంచి నేరుగా రాలేకపోయినా..అక్కడకు ఒక అద్దె కారులో 150 కిలోమీటర్లు ప్రయాణించి తాలిబాన్ చెక్‌పోస్ట్‌లు దాటి కాబూల్‌కి వెళ్లినట్లు తెలిపారు. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం తన ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు వివరించారు. అక్కడ ఏకంగా ఏడెంచల కట్టుదిట్టమైన భద్రత ఏదోలా అనిపించిందన్నారు. అయితే అక్కడ తాలిబాన్ల నుంచి తనకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా..హై సెక్యూరిటీ నడుమ బానిక్ని త్వరగా పంపిచేయాలన కాబోల్లోని భారత రాయబార కార్యాలయం భావంచిందట. అదీగాక ఆయన ఆహార్యం కూడా ఈజీగా విదేశీయుడని గుర్తించేలా ఉండటంతో, హోటల్ నుంచి బయటకు వెళ్లేలా కాబూల్ భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసినట్లు వివరించారు. చివరికి భారత రాయబార కార్యాలయం సురక్షితమైన వాహనంలో విమానాశ్రయానికి చేర్చిందని తెలిపారు. తాను ఇక అక్కడి నుంచి నేపాల్‌కి పయనమైనట్లు తెలిపారు. ఓ పెనువిషాదంలో..2012లో అస్సాంలోని కాలిబోర్ సమీపంలో జరిగిన ఒక విపత్కర ప్రమాదంలో రాకేష్ బానిక్ తన కాలును కోల్పోయాడు. దాంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అయితే 2014లో కృత్రిమ కాలుని పొంది.. ఆ వైకల్యాన్ని తన బలంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా పారాసైక్లిస్ట్‌గా మారి ఖార్దుంగ్ లా పాస్ (17,582 అడుగులు) ఎత్తు నుంచి బ్యాంకాక్, గౌహతి మధ్య తేమతో కూడిన మైదానాల వరకు విభిన్న యాత్రలు చేశారు. పైగా సుమారు 21 వేల కిలోమీటర్లు సైకిల్‌పైనే చుట్టొచ్చారు.(చదవండి: ఎవరీ సంధ్యారాణి మాఝి..? ఏకంగా ప్రభుత్వ వాహన మహిళా డ్రైవర్‌గా..) -
ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషం నిల్ !
28 ఏళ్ల యువకుడు ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చాడు. పలు ఓటములు చవిచూసి..స్వయంకృషితో ఎదిగాడు. ఏకంగా ఏడాదికి కోట్లు గడించే స్థాయికి చేరుకున్నాడు. చాలా కింద స్థాయి నుంచి శ్రీమంతుడిగా మారాడు. ఇంత సక్సెస్ అందుకున్నా..ఆనందించలేకపోతున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా వాపోయాడు ఓ ఎంటర్ప్రెన్యూర్. పైగా అంతకుమునుపే..చాలా ఆనందంగా ఉన్నా..అప్పుడే చాలా హెల్దీగా ఉన్నా. ఇప్పుడు మాత్రం అంతలా ఉత్సాహంగా అస్సలు ఉండలేకపోతున్నా అని బాధగా చెప్పాడు. అయితే తన తల్లిదండ్రులు మాత్రం తన విజయాన్ని ఆస్వాదిస్తున్నారని గర్వంగా చెప్పాడు. విజయం సాధించాక ఆనందం దూరమైపోతుందా అంటే.28 ఏళ్ల భారతీయ ఎంటర్ప్రెన్యూర్ రెడ్డిట్‌లో షేర్ చేసిన పోస్టు నెట్టింట పెద్ద దుమారం రేపి చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. వ్యవస్థాపకుడిగా తన జర్నీ ప్రారంభమైన విధానం గురించి వివరించారు. తనకు ఒక ప్రీమియం కారు, విదేశీ పర్యటనలు చుట్టొచ్చేంత మనీ, మంచి బంగ్లా కొనేంత డబ్బు ఉందని చెప్పుకొచ్చారు. ఐతే 12 ఏళ్ల క్రితం తానొక సాధారణ విద్యార్థినని, స్కాలర్‌షిప్‌పై సీఏ చేస్తున్నట్లు తెలిపాడు. 2017లో ఒక లక్ష పెట్టుబడితో స్టార్టప్ ప్రారంభించి పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. ఇక 2020 కోవిడ్ సమయంలో సీఏ ఫైనల్లో ఉన్నట్లు గుర్తుచేసుకున్నాడు. అయితే అది కరోనా టైం కావడంతో పరీక్ష వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. దాంతో ఆన్లైన్ సర్వీస్ ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదేనండి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం. అలా అతడు నెలకు 1 నుంచి రెండు లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. అలా వెను తిరిగి చూడకుండా కోట్లు సంపాదించే రేంజ్‌కి వచ్చేశాడు. అంతేగాదు దుబాయ్ వంటి విదేశాల్లో కూడా తన కార్యకలపాలు ప్రారభించే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా మంచి ఆదాయన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ అతడి అదృష్టం ఏంటంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే సక్సెస్ అందుకుని అంచలంచెలుగా ఎదిగాడు. కేవలం తనకు వచ్చిన లాభాల్లో కొద్ది మొత్తం డబ్బు మాత్రమే పెట్టుబడి పెడుతూ..కోట్లు గడించాడు. ఒక్క సింగిల్ లోను లేకుండా పైకొచ్చానంటూ తన వ్యవస్థాపక జర్నీని షేర్ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు అతడి పోస్ట్‌ని చూసి ప్రశంసిస్తూ..మీరు ఇప్పుడు హ్యాపీనేగా అని ప్రశ్నించగా..అందుకు ఆ వ్యక్తి చాలా మంచి ప్రశ్న వేశారంటూ సమాధాన మిచ్చాడు ఇలా. "అస్సలు సంతోషంగా లేను. ఒకప్పుడు చాలా ఉల్లాసంగా ఉండేవాడిని కానీ ఇప్పుడు ప్రతి నిమిషం టెన్షన్ పడుతున్నా. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా. ప్రయాణాలు చేయలేకపోతున్నా. ఎక్కువ పనిగంటలు. ఇప్పుడు నా వద్ద కావల్సినంత డబ్బు ఉంది కానీ సంతోషించ లేకపోతున్నా. ఐతే తన తల్లిదండ్రులు తన సక్సెస్‌ని చూసి గర్వంగా ఫీలవుతున్నారు. అలాగే ఏ వస్తువు అయినా ఈజీగా కొనేయొచ్చు.. అన్నతం ధైర్యం గుండెల్లో ఉంది. డబ్బు కేవలం భద్రతనే ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వలేదని బాధగా బదులిచ్చాడు. అందుకు నెటిజన్లు మిత్రమా ఎందరో కలల ప్రపంచాన్ని నువ్వు సాకారం చేసుకోగలిగావు. అందుకు సంతోషం. పైగా వ్యాపారాన్ని నడిపంచే స్థాయికి చేరుకున్నావు. అంటే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలవు. మంచి సంతోషాన్ని కూడా కచ్చితంగా పొందగలుగుతావు అని ఆశ్వీరదిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఇష్టమైన గులాబ్ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!) -
దంపతుల ‘మొక్క’వోని దీక్ష, ఏడాదికి రూ. లక్ష ఖర్చు
కోల్‌సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం.. ఆకట్టుకునే పచ్చని మొక్కలు.. తీరొక్కపూలు స్వాగతం పలుకుతున్నాయి. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ఆడెపు రామకృష్ణ దంపతులు తమ ఇంటిని పచ్చదనంతో నింపేసి పొదరిల్లుగా మార్చుకుని.. పర్యావరణానికి ఊపిరిపోస్తున్నారు. ఓ స్కూల్లో విద్యాబోధన చేస్తున్న గీతాశ్రీ– రామకృష్ణ దంపతులకు మొక్కల పెంపకం అంటే చాలాఇష్టం. గతంలో రామకృష్ణ ఎకో క్లబ్లో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ పొందారు. ఆ తర్వాత 24 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలోనే వివిధ రకాల పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి అందించే అనేకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఆకుకూరలూ సాగు చేస్తున్నారు. వంటగదిలోని వ్యర్థాలు, ఎండుఆకులు, కుళ్లిన కూరగాయలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేస్తున్నారు. పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, టోపీలు, బకెట్లు, పాడైన కూలర్లు, ఇంట్లోనే తయారు చేసిన సిమెంట్ కుండీలే మొక్కలకు నిలయాలుగా మార్చారు. ఏడాదికి రూ.లక్ష ఖర్చు నేను 24 ఏళ్లుగా మొక్కలు పెంచుతున్న. ఇది నాకు హాబీగా మారింది. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ శుభకార్యం జరిగినా అక్కడికి మొక్కతో వెళ్తాను. కొత్త మొక్కలు కనిపిస్తే ఖర్చుకోసం ఆలోచించకుండా కొంటాను. ఏడాదికి మొక్కల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటా. ఇంట్లోనే సేంద్రియ ఎరువు, సిమెంట్ తొట్టీలను తయారు చేస్తున్న. మొక్కల పెంపకంతో మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. – ఆడెపు రామకృష్ణ, గోదావరిఖనిఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు -
గాంధీ.. గాడ్సే.. నోబెల్ శాంతి బహుమతి!
శాంతి, అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు?. ఆయన దారిలో నడిచిన వారెందరినో వరించిన ఆ పురస్కారం.. ఆయన్నెందుకు వరించలేదు? కారణం.. నాథూరాం గాడ్సేనా?? గాంధీని చంపిన గాడ్సే.. ఆయనకు నోబెల్ దక్కే అవకాశాన్ని కూడా చంపేశాడా? అందుకే 1948లో నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదా? పైగా.. తగు యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరూ జీవించి లేనందున ఆ పురస్కారాన్ని ఇవ్వడం లేదన్న నోబెల్ కమిటీ ప్రకటన దీన్నే సూచిస్తోందా? అసలు.. గాంధీకి నోబెల్ రాకపోవడానికి గాడ్సేకు ఉన్న లింకేంటి?1930ల్లో ఏం జరిగిందంటే..నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ 5 సార్లు నామినేట్ అయ్యారు. 1937, 1938, 1939, 1947, 1948ల్లో ఆయన ఈ పురస్కారం దక్కే అవకాశం వచ్చింది. గాంధీ అహింసా మార్గం లేదా శాంతి మార్గం అన్నది తన దేశ స్వాతంత్య్రం కోసం తప్ప.. అంతర్జాతీయ శాంతి కోసం కాదని నోబెల్ కమిటీలోని కొందరు సభ్యులు ఆ టైంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడానికి ఆయన షరతులతో సమ్మతి తెలపడాన్ని వాళ్లు ఎత్తి చూపారు. నోబెల్ బహుమతులను ఇచ్చే నార్వే అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు అవార్డులు ఇవ్వకూడదని ఆ దేశం అనుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతారు. 1947 వచ్చేసరికి ఆ సమయంలో విభజన కారణంగా చెలరేగిన హింస.. మతపరమైన హింసను నిరోధించడానికి గాంధీజీ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాకపోవడం, విభజన హింస.. గాంధీ శాంతి సందేశాన్ని మరుగునపడేటట్లు చేసిందని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు. 1900 నుంచి 1960 వరకూ పురస్కారాలను గమనిస్తే మనకీ విషయం అర్థమవుతుందని గేర్ లూండెస్టాడ్ అన్నారు.1948లో ఎందుకు రాలేదంటే..1948లో గాంధీజీ మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ ఏడాది గాంధీ పేరును అమెరికాకు చెందిన శాంతి కార్యకర్త, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత ఎమిలీ గ్రీన్ బాల్చ్, బాంబే స్టేట్ తొలి సీఎం బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్, యునైటెడ్ ప్రావిన్సెస్ తొలి సీఎం గోవింద్ వల్లభ్ పంత్, లోక్‌సభ తొలి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మౌలాంకర్.. ఇలా ఎందరో ప్రముఖులు ప్రతిపాదించారు. ఆ ఏడాది మహాత్మునికే శాంతి బహుమతి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు పేర్లతో షార్ట్ లిస్ట్ (గాంధీ పేరు ఈ జాబితాలోకి రావడం మూడోసారట) రెడీ అయ్యింది. అయితే, నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ల గడువు ఇంకో రెండ్రోజుల్లో ముగుస్తుందనగా.. జనవరి 30న మహాత్ముడిని గాడ్సే పొట్టనబెట్టుకున్నాడు. తద్వారా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేకుండా చేశాడు. ఎందుకంటే.. ఆ సంవత్సరం ఎవరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం లేదని 1948, నవంబర్ 18న కమిటీ ప్రకటించింది. పైగా.. ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఆ అవార్డు పొందేందుకు తగు అర్హత కలిగిన వ్యక్తి ఎవరూ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్పటి నిబంధనల ప్రకారం.. మరణానంతరం నోబెల్ ఇచ్చే సంప్రదాయం లేదు. తర్వాతి కాలంలో దాన్ని సవరించారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మహాత్ముడు జీవించి ఉండి ఉంటే.. 1948 నోబెల్ శాంతి బహుమతి ఆయనకే దక్కి ఉండేదన్నది అత్యధికుల వాదన. పైగా.. ‘గాంధీ ఈ పురస్కారాన్ని దాదాపుగా దక్కించుకునే దాకా వచ్చారు. అయితే, ఆయన మరణం దాన్ని దూరం చేసింది’ అని 1948 నోబెల్ కమిటీ రికార్డుల్లో నమోదై ఉండటం కూడా ఆ వాదనను మరింత బలపరిచింది. గాంధీకి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం అన్నది కమిటీ చరిత్రలో అతిపెద్ద తప్పిదమని గేర్ లూండెస్టాడ్ అన్నారు. తర్వాత నోబెల్ కమిటీ కూడా మహాత్ముడికి శాంతి బహుమతి దక్కకపోవడంపై 1989, 2006లలో విచారం వ్యక్తం చేసింది. గాంధీ గొప్పోడని చెప్పడానికి ఆయనకు నోబెల్ అక్కర్లేదు.. కానీ నోబెల్ గొప్ప అవార్డు అని చెప్పుకోవడానికి మాత్రం గాంధీ కావాలి! దట్సిట్..(చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..
ఒకప్పుడు చిన్నారులకు చందమామ కథలు చెబుతూ అన్నం తినిపించేవారు అమ్మలు. ఆ కథలు వింటూ మరో లోకంలో విహరించేవి ఆ పసిహృదయాలు. చిన్న తలుపు తట్టినా చప్పట్లతో పరుగులుతీసి ఆటలాడేవారు. ఇప్పుడు ఆ రోజులు వెనక్కి పోయాయి. చందమామ చూపించే తల్లుల బదులు, యూట్యూబ్ కార్టూన్లు ప్లే చేసే అమ్మలుగా మార్పుచెందారు. బాల్యంలోనే మొబైల్‌తో స్నేహం చేస్తూ పెరుగుతున్న ఈ తరం అది లేకుండా ఉండలేని స్థితికి చేరింది. ఇది అధునాతన సాంకేతికత అందించిన సౌకర్యమే కాదు, అనేక మానసిక, శారీరక సమస్యలకు దారితీసే వ్యసనం కూడా. ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని పూర్తిగా నిరాకరించడం సాధ్యమా అంటే.. కాదనే చెబున్నాయి అధ్యయనాలు.. అలా అని అంతలా అవసరమా అంటే అదీ కాదనే చెబుతున్నారు. కానీ చిన్నారుల మెదడు అభివృద్ధి, మానసిక స్థితి, నైపుణ్యాల పెరుగుదల అన్నిటికీ స్థిరమైన అనుసంధానం కావాలంటే, మొబైల్ వినియోగాన్ని సమతుల్యంగా నియంత్రించడం తల్లిదండ్రుల బాధ్యత. వారు చూపిన దారిలోనే పసి పిల్లలు నడుస్తారు.. మనం మొబైల్ ఆఫ్ చేస్తే, వారు జీవితాన్ని ఆనందించడంలో ముందుకు వస్తారన్నది నిపుణుల మాట. ఇటీవలి కాలంలో పిల్లల్లో ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగం భారీగా పెరిగిపోతోంది. నగరాల నుంచి పల్లెలకూ ఈ విష సంస్కృతి విస్తరించింది. సహజమైన ఆటలతో అలసిపోవాల్సిన పసి హృదయాలు డిజిటల్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. దీనికి ప్రధాన కారకులు తల్లిదండ్రులేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం తినిపించడానికో.. అల్లరి తగ్గించడానికో మనం అలవాటు చేసే ఈ పద్ధతికి బాల్యం బలైపోతోంది. కొంత కాలానికి అదే అడిక్షన్‌గా మారుతోంది. చిన్నారులకు మొబైల్ వినియోగం వల్ల కలిగే నష్టాలు సాధారణమైనవి కాదు, వారు పెరుగుతూ ఉంటే ఈ వ్యసనం పోతుందని నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం చేత చిన్నారులు దీర్ఘకాలిక సమస్యల భారిన పడుతున్నారు. దృష్టి సమస్యలు : నిరంతరం మొబైల్ స్క్రీన్ చూడటంవల్ల, మరీ దగ్గర నుంచి చూస్తుండటం వల్ల చూపు బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మైల్స్ డిసార్డర్స్, డ్రై ఐ వంటి సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. నిద్రలేమి : స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే నీలి కిరణాలు(బ్లూ లైట్) నిద్రకు ఉపకరించే మెలటోనిన్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక అసంతృప్తి : ఎక్కువగా డిజిటల్ ప్రపంచంతో మమేకమవుతూ, వాస్తవ ప్రపంచానికి దూరమవ్వడం వల్ల పిల్లల్లో ఒంటరితన భావన, ఆందోళన, కొంతవరకూ డిప్రెషన్‌కు గురికావచ్చు. అవగాహనాలేమి : వీడియోలు, రీల్స్ వంటి తక్షణ వినోదం చిన్నారుల్లో సహనాన్ని తగ్గిస్తుంది. దృష్టి ఎటుపోతుందో అక్కడే ఆలోచన కూడా ఆగిపోతుంది. ఇది భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. చూడకూడనివన్నీ చూస్తూ : కొన్ని రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో పిల్లలకు అవసరం లేని కంటెంట్ ఉంటుంది. అది వారి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే దుష్ఫలితాలను కలిగిస్తుంది.పెద్దలే ఆదర్శంగా : తల్లిదండ్రులే ముందుగా మొబైల్‌కి బానిసలుగా ఉంటే.. పిల్లలు ఎలా దూరమవుతారు? ఫోన్ల వాడకాన్ని తల్లిదండ్రులే మొదట నియంత్రించాలి. తద్వారా పిల్లలకు ఆదర్శంగా మారాలి. నియంత్రిత కంటెంట్ : పిల్లలకు పూర్తిగా మొబైల్ తీసేయడం కాకుండా, వారితో ఓపెన్ డైలాగ్ పెట్టి, వారికి సేఫ్ కంటెంట్ మాత్రమే చూపించడం అవసరం. ఇతర వ్యాపకాల వైపు.. పిల్లలను మొబైల్‌కి దూరం చేయడానికి పరిష్కార మార్గాలు మనచేతుల్లోనే ఉంటాయి. వారి మానసిక స్థితికి అనుగుణంగా, వారి ఇష్టాలపై ఆసక్తి పెంచేలా ఇతర వ్యాపకాలతో మునిగిపోయేలా చేయొచ్చు. సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పిల్లలు మొబైల్ చూడకుండా ఉండేందుకు కొన్ని విడియోలు, టిప్స్, ట్రిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ‘కిట్ బ్యాగ్ ట్రిక్’, ‘బుక్స్ బిఫోర్ స్క్రీన్’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలకి యాక్టివిటీ జర్నల్స్ ఇవ్వడం, పజిల్ ఛాలెంజ్‌లు పెట్టడం ద్వారా మొబైల్ బదులుగా కొత్త అలవాట్లు పెంచుతున్నారు. ఈ డిజిటల్ తరం కాబట్టి అవసరమైనంత మేర రైమింగ్స్, కిడ్స్ ఐక్యూ వంటి వీడియోలు చూపించి వారి వ్యసనాన్ని నియంత్రించాలి. డిజిటల్ డిటాక్స్ షెడ్యూల్ : రోజులో ఒక నిర్దిష్ట సమయానికి మొబైల్ పూర్తిగా వదిలేసి, కుటుంబంతో సమయాన్ని గడపడం, ఆటలు, పుస్తకాలు, చర్చలతో సమయాన్ని గడిపేలా చేయాలి. ఆఫ్‌లైన్ వినోదాన్ని ప్రోత్సహించాలి : బొమ్మల కథలు, బోర్డు గేమ్స్, డ్రాయింగ్, సంగీత తరగతులు, నృత్యం లాంటి క్రియేటివ్ యాక్టివిటీలతో వారి దృష్టిని డైవర్ట్ చేయాలి. (చదవండి: ఆంబోప్లియా: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!) -
Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!
కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే... తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది. అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఓ కేస్ స్టడీశిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్‌గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత పారదర్శకమైన మన లెన్స్ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్ నర్వ్’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. ఏమిటీ ‘లేజీ ఐ’?మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్ విజన్’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్ విజన్’! ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్ విజన్ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్ కండిషన్‌ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది. ‘లేజీ ఐ’ కండిషన్ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే ఉండటంతో ఈ కండిషన్‌ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.ఆంబ్లోపియా విస్తృతి : మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. ఆంబ్లోపియా రకాలు అన్ ఐసోమెట్రోపిక్ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్ ఎర్రర్కూ), మరో కంటికీ తేడా ఉండటం. ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. ఐసోమెట్రిక్ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్ ఎర్రర్) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) మెరిడోనల్ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్ పవర్ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. స్టెడిస్మస్ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. డిప్రొవేషనల్ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలుఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి, ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. అయితే చిన్నతనంలోనే అంటే... రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు. ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్ పవర్, మైనస్ పవర్, సిలెండ్రికల్ పవర్. మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్ చికిత్సతో దాన్ని సరిచేయడం. డిప్రెవేషన్ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్ లెన్స్‌ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్‌కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం... క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్)విజువల్ డిప్రవేషన్ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. లైట్ డిప్రవేషన్ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్ వంటి వాటివల్ల) రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. అబ్–నార్మల్ బైనాక్యులార్ విజన్ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.అక్లూజన్ థెరపీఈ చికిత్స ప్రక్రియలో నార్మల్‌గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్ చేస్తారు. నార్మల్‌గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.పీనలైజేషన్అట్రోపిన్ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్‌లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్ థెరపీ’లోలా కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.విజన్ థెరపీపైన పేర్కొన్న అక్లూజన్ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని... మళ్లీ చూపు, బైనాక్యులర్ విజన్ పొందేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు / నిర్ధారణనిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడంక్రౌడింగ్ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికిస్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. కంటి డాక్టర్లు పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. నివారణమూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి.ఫ్యూజనల్, స్టీరియాప్టిక్ ఎక్సర్సైజెస్లేజీ ఐ తన చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్ ఎక్సర్సైజ్లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్ ఎక్సర్సైజ్లో ఈ రెండు కళ్లూ డెప్త్ / 3 డీ ఇమేజ్ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్సైజ్లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.ఫార్మకోథెరపీలీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్‌గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్‌లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025 -
సువాసనలు గుర్తించేలా అంధులకు శిక్షణ
భారతదేశంలోని ప్రముఖ ధూపద్రవ్య బ్రాండ్ అయిన ఐటీసీ మంగళ్‌దీప్ స్పెషల్లీ ఏబుల్డ్ దృష్టిలోపి ఉన్నవారికోసం సిక్స్త్ సెన్స్ ప్యానెల్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే సువాసనలను గుర్తించేలా దృష్టి లోపంతో ఉన్న వ్యక్తులను భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసింది. మంగళ్‌దీప్ సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌ను 180 మందికి విస్తరించింది. విభిన్న, విశిష్ట విద్యా, వృత్తిపరమైన నేపథ్యాల నుండి వీరిని ఎంపిక చేసింది.దృష్టి లోపం ఉన్నవారికి అధికంగా వాసనలను పసిగట్టే జ్ఞానం ఉంటుందని వైద్యపరంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో భగవంతుడికి, భక్తులకు మధ్య వారధిగా ఉండే ఒక పవిత్రమైన కార్యంలో సువాసన టెస్టింగ్‌లో అంధులకు భాగస్వామ్యం కల్పించింది. 2021లో తీసుకొచ్చిన సిక్స్త్ సెన్స్ ప్యానెల్ కార్యక్రమం కింద ప్రత్యేక సువాసన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన 30 మంది దృష్టి లోపం ఉన్న వ్యక్తులను ఇటీవల సత్కరించింది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో 180 మందికి పైగా సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు మంగళ్దీపి వెల్లడించింది. అప్పటి నుండి ఈ ప్యానెల్ ఉత్పత్తి ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది, శాండల్, రోజ్, లావెండర్, మ్యారిగోల్డ్ వంటి అనేక ప్రత్యేకమైన,సువాసన వేరియంట్లను మంగళ్‌దీప్ విడుదల చేయటంలో తోడ్పాటు అందించినట్టు తెలిపింది.ఈ కార్యక్రమం గురించి ఐటిసి లిమిటెడ్‌లోని అగర్బత్తి & మ్యాచ్‌ల వ్యాపారం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గౌరవ్ తాయల్ మాట్లాడుతూ, “సిక్స్త్ సెన్స్ ప్యానెల్ 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంపిక చేసిన సువాసలు, అభివృద్ధి, మెరుపుపర్చడం అనేది, సహజంగా వాసనలను పసిగట్టడంలో ఎక్కువ పవర్ ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్ల సాంప్రదాయ పరీక్షా పద్ధతులకు మించి విలువైన ధృక్పథం అలవడింన్నారు. రాబోయే రోజుల్లో తమ సంస్థలో మరింత మందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ధూప్ స్టిక్స్, ఫ్లోరా అగర్బత్తిస్, ప్రీమియం కప్పులు, సాంబ్రాణి స్టిక్స్ వంటి మంగళ్‌దీప్, కీలక ఉత్పత్తులతో ముడి పదార్థాలు, మిశ్రమ అనుభవాల ద్వారా ఫ్రూటీ, ఫ్లోరల్, వుడీ, హెర్బల్/మింట్ ,ఔధ్/అంబర్ వంటి ప్రధాన సువాసనలను గుర్తించడంలో శిక్షణ నిచ్చారు. ప్యానెల్ సభ్యులు నెలవారీ సువాసన పరీక్షలలోపాల్గొనడానికి, వివరణాత్మక అభిప్రాయాన్ని అందించడానికి వీలుగా నిర్మాణాత్మక ఉత్పత్తి మూల్యాంకన ప్రోటోకాల్‌లు అందిస్తారు. "ఐటిసి సిక్స్త్ సెన్స్ ప్యానెల్లో భాగం కావడం నిజంగా సాధికారత కల్పించే అనుభవమనీ,. దృష్టి లోపం ఉన్న సమాజానికి అర్థవంతమైన స్వరాన్ని అందించే ప్రాజెక్ట్‌కు సహకరించడం గౌరవంగా ఉందని మాజీ బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ విజేత & మహనవ్ ఎబిలిటీ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మహేందర్ వైష్ణ కొనియాడారు.ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రేడియో ఉడాన్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మినల్ సింఘ్వి ఐటీసీకి ధన్యవాదములు తెలిపారు. -
ఇష్టమైన గులాబ్ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!
అధిక బరువుని సులభంగా తగ్గించుకుని స్మార్ట్‌గా మారిన ఎన్నో స్ఫూర్తిదాయక కథలు విన్నాం. ఎన్నో విభిన్న డైట్లతో తేలిగ్గా కొలెస్ట్రాల్‌ని మాయం చేసుకుని ఫిట్‌గా మారారు. ఇక్కడున్న వ్యక్తి తనకిష్టమైన స్వీట్‌ని త్యాగం చేయకుండానే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అస్సలు అదెలా సాధ్యమైదనేది అతడి మాటల్లోనే తెలుసుకుందామా..!ప్రసిద్ధ యూట్యూబర్ ఆశిష్ చంచలానీకి ఎక్కువగా చిన్నారులు, యువకులు అతడి అభిమానులు. అతడు మంచి టైమింగ్ కామెడీకి ప్రసిద్ధి. అదే అతడికి వేలాది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి వ్యక్తి జస్ట్ ఆరు నెలల్లో 40 కిలోలు తగ్గాడు. ఒక్కసారిగా మారిన అతడి బాడీ ఆకృతి అదరిని ఫిదా చేసింది. అబ్బా అంతలా ఎలా బరువు తగ్గాడని ఏంటా డైట్ సీక్రెట్ అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆశిష్ స్వయంగా ఆ సీక్రెట్ ఏంటో స్వయంగా వెల్లడించారు. నిజానికి ఆయన దగ్గర దగ్గరగా 130 కిలోలు పైనే బరువు ఉండేవాడు. తన 30వ పుట్టనరోజున తన ఆరోగ్యానికి ప్రాధానత ఇచ్చేలా స్మార్ట్‌గా మారిపోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాడట. అయితే తన బరువు, ప్రకారం తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించిందట. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట ఆశిష్. దాంతో ఆహారాన్ని సర్దుబాటు చేసుకున్నాడట. అంటే..తనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిచడం అన్నమాట. తనకు నచ్చిన గులాబ్ జామ్‌లు ఆస్వాదిస్తూ డైట్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎంచుకున్నారు. తన ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడేవాడట. ఫైబర్, కార్బోహైడ్రేట్లు తన డైట్ జాబితాలో చివరి ప్రాధాన్యత అని చెబుతున్నాడు ఆశిష్. డైట్ విధానం..అల్పాహారం: ఆశిష్ కనీసం ఆరు ఉడికించిన గుడ్లు లేదా కొన్నిసార్లు వెరైటీగా ఆమ్లెట్, కాల్చిన మొలకలు తీసుకుంటాడు. లంచ్ఆశిష్ భోజనంలో 200 గ్రాముల చికెన్‌తో పాటు ఒక రోటీ ఉండేది, సలాడ్ ఎక్కువగా దోసకాయ, సెలెరీ జ్యూస్‌తో ఉంటుంది.స్నాక్స్సాయంత్రం స్నాక్స్ కోసం, ఆశిష్ వ్యాయామం చేస్తున్నందున సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పకుండా పాలవిరుగుడు ప్రోటీన్ తీసుకుంటాడు.విందుఆశిష్ విందు కూడా ప్రోటీన్‌తో నిండి ఉండేది - రోటీ లేదా రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్. బర్న్ చేసే కేలరీల సంఖ్య, తినే కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గారట. తింటున్న ప్రతిదాన్ని లెక్కించేవాడట.. అలా తన ప్లేట్‌ని చూడగానే ఎంత కేలరీల మొత్తంలో ఆహారం తీసుకోవాలో అర్థమయ్యేదట.అప్పడప్పుడు చీట్‌మీల్..ఆశిష్ తనకు బాగా ఇష్టమైన డెజర్ట్‌లు తినకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామున్లు, రసమలై వంటి స్వీట్లను వదులుకోలేదని చెప్పాడు. అయితే తన కేలరీలను కూడా పర్యవేక్షించడం ఎప్పటికీ మిస్ అయ్యేవాడు కాదట.(చదవండి: ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!) -
బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు : ఓ అందమైన ప్రేమకథ
‘‘బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు" వీరి నిజ జీవిత ప్రేమగాథ ఇది సోషల్ మీడియా ద్వారా మొదలై, సరిహద్దులు దాటిన ప్రేమగా నిలిచింది. తొలి చూపులోనే ఏదో తెలియని ఆకర్షణ, సప్త సముద్రాల అవల ఉన్నా చేరువ కావాలనుకున్నారు. నా ప్రతి శ్వాసవి నువ్వే..అన్నట్టు ఊసులాడుకున్నారు. కట్ చేస్తే.. ఇదే అందమైన ప్రేమకథగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదండి ఈ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసిన పోస్ట్ ప్రకారం సోషల్ మీడియా ద్వారానే లవ్‌బర్డ్స్ బెంగళూరుకు అబ్బాయి, అమెరికా అమ్మాయి పరిచయం, ప్రేమకు దారితీసింది.. ప్రతీక్షణం టచ్‌లో ఉన్నారు ఒకరి అభిప్రాయాలను పంచుకున్నారు. వీడియో కాల్స్ వర్చ్యవల్ డిన్నర్స్. ఇక విడిగాబతకలేమని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చేసింది. ఆఅబ్బాయి పేరే దీపక్. అమ్మాయిపేరు హన్నా. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆర్టిస్ట్ దీపక్ 2023, ఏప్రిల్‌లో ఒక ప్రదర్శన కోసం ముంబైకి వెళ్ళినప్పుడు హన్నా అమ్మాయిని చూశాడు. తొలిచూపులోనే హన్నాపై ఇష్టం పెంచుకున్నాడు. మొత్తం మీద ధైర్యం చేసి మాటకలిపాడు. ముంబైలో ఆ కాసేపటి పరిచయంతో ఆశ్చర్యంగా ఇద్దరూ స్నేహితులైపోయారు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. ఇక అప్పటినుంచి వీరి ప్రణయ గాథకు అడుగులు పడ్డాయి. తమ స్నేహం కేవలం ఆకర్షణ కాదు అంతకుమించి అని దీపక్ ఫిక్స్ అయిపోయాడు. మనుషులు దూరమైనా..మనసులు దగ్గరే!ఇంతలో ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా, వారి కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగలేదు. రోజువారీ సందేశాలు, తరచు కాల్స్, ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేశాయి. నెమ్మదిగా వారి స్నేహం ప్రేమగా వికసించింది. త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్న సమయంలో తన భావాలతో కూడిన భావోద్వేగ పెయింటింగ్‌ను అందించాడు. అంతే ఆమె కూడా ఫిదా అయిపోయింది.కానీ హన్నా అమెరికాకు వెళ్లిపోయింది. ఆ దూరం వారిద్దరి మధ్యా ప్రేమ మరింతపెరిగింది. చివరికి దీపక్ తన తల్లితో తన ప్రేమ గురించి చెప్పాడు. హన్నా ఫోటో చూడగానే తల్లి తక్షణమేఅంగీకరించింది. అటు హన్నా కూడా తన ప్రియుడిని తన కుటుంబానికి పరిచయం చేసింది. భాషా అంతరాలు ఉన్నప్పటికీ పరస్పరం అంగీకరించారు.ఒక సంవత్సరం తర్వాతఫిబ్రవరి 2024లో తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు వచ్చింది హెన్నా. విమానాశ్రయంలో ఆత్మీయంగా హెన్నాను ఆలింగనం చేసుకున్న క్షణం ఇక విడిచి ఉండటం కష్టమని నిర్ణయించు కున్నారు. ఆ హగే వారి జీవితంలో కీలక నిర్ణయానికి నాంది పలికింది. అదే ఏడాది జూలై 26న అందమైన ఎర్రచీరలో పెళ్లి కూతురిలా ముస్తాబైంది హన్నా. సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ అపురూపంగా పెళ్లి చేసుకున్నారు.జీవితంలో మొదలైన అందమైన మలుపు ఎంతో హృద్యంగా సాగిపోతోంది. ఒకరి ప్రపంచంలో ఒకరిగా మారిపోయారు. దీపక్ తల్లి హన్నాకు సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంటే, హన్నా పాశ్చాత్య వంటకాలను పరిచయం చేసింది. ఈ ప్రేమికుల పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయికను కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆచారాలు, హృదయాలను కలయిక. వీరి అందమైన లవ్‌స్టోరీకి త్వరలోనే తొలి వసంతం నిండబోతోంది. ప్రేమ పెళ్లికి దేశం, ప్రాంతం, భాషా ఇలాంటివేవీ అడ్డురావని నిరూపించారు. దీపక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం 93 వేలకు పైగా అనుచరులు ఉన్నారు. -
'వాకింగ్'పై థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ..!
ఇటీవలకాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా తమ ఫిట్నెస్కి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో కొందరు వాకింగ్, యోగా, జిమ్ వంటి ఇతరత్రా వర్కౌట్లు చేసేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా టెన్షన్‌గా పొద్దుపొద్దునే వాకింగ్‌కి వెళ్లిపోతుంటారు. ఎంతలా అంటే..ఒక్కరోజు వాకింగ్ మిస్ అయితే ఏదో పోయినట్లుగా గాభర పడిపోతుంటారు. అయితే అంతలా వాకింగ్ చేసేవాళ్లంతా ఆరోగ్యం కోసమేనా అన్న సందేహాన్ని లెవెనత్తారు శాస్త్రవేత్త-థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎ వేలుమణి. ఆయన దీనిపై స్వయంగా మూడేళ్లు అధ్యయనం చేసినట్లు కూడా వివరించారు. అలా ఉదయమే నడవడానికి వెనుకున్న ప్రధాన కారణాలేంటో సోషల్ మీడియో పోస్ట్‌లో చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. కోయంబత్తూరులోని మూడు పార్కులలో ఉదయం నడిచేవారిపై అధ్యయనం చేశారట. దాదాపు 100 నుంచి 500 మీటర్లు వాకింగ్‌కి వెళ్లే వారందరిపై ఆయన అధ్యయనం చేశానన్నారు. అయితే అది ఫిట్నెస్ కాదు, క్రమశిక్షణ అంతకంటే కాదట. మరేంటంటే..ఇది హార్మోన్ల ప్రేరేపిత నడకగా తేల్చేశారాయన. అంతేగాదు ఉదయం పబ్లిక్ పార్కుల్లో వాకింగ్ చేసేవారందర్నీ మూడు గ్రూప్‌లుగా వర్గీకరించి మరి దాని వెనుకున్న కారణాలను వెల్లడించారు.మొదటి రకం..వేలుమణి గమనించి వ్యక్తుల్లో దాదాపు 20% మంది వివిధ వయసుల వారిగా వేగంగా నడవడం, లేదా పరుగెత్తడంలో చాలా యాక్టివ్‌గా నిమగ్నమై ఉన్నవారు. ఇది కొనితెచ్చుకున్న బలవంతంపై చేసున్న వాకింగ్ అట. వారంతా శ్రేయోభిలాషులు, ఆరోగ్య నిపుణులు మార్గనిర్దేశం ప్రకారం లక్ష్యం ఆధారిత వ్యక్తులట. శారరీక రూపం, ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్‌గా స్ఫూర్తినిచ్చే కేటగిరి వ్యక్తులే వీరు అని చెప్పారు. రెండో రకం..ఆరోగ్య స్ప్రుహతో..40 ప్లస్‌లో వైద్య అవసరం రీత్యా తప్పక వాకింగ్ చేసే కేటగిరికి చెందినవారట. వీరంతా, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో వాక్ చేసే వ్యక్తులట. అంటే వీళ్లంతా స్వచ్ఛందంగా నడక కోసం వచ్చిన వాళ్లు కాదని "హర్మోన్ల బందీలు"గా వ్యాఖ్యానించారు.ప్రేమ పక్షులు..ఇక మిగతా సముహం 18 నుంచి 22 ఏళ్ల వయస్సు గల యువ జంటల సముహం. ఉదయం పార్కుల్లో వాకింగ్ చేసేవాళ్లలో దాదాపు 30 శాతం యువత కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే వాళ్లు ఫిట్నెస్ లేదా వైద్య పరిస్థితి వంటి కారణాలతో నడవడం లేదని చెప్పారు. కేవలం వాళ్లు పార్కు మూలల్లో నిశబ్దంగా కూర్చొని గడిపేందుకు వస్తుంటారని అన్నారు. ఇది కూడా హార్మోన్ల బలవంతమే అని పేర్కొన్నారు. ఎందుకంటే యుక్త వయసులో సహజంగా వచ్చే ఫీలింగ్స్‌కి కారణం హార్మోన్ల ప్రభావమనే ఉద్దేశ్యంతో వేలుమణి ఆ విధంగా వ్యాఖ్యానించారు. చివరగా తాను చేసిన ఈ అధ్యయనంలో 80% మంది ఆరోగ్యం లేదా జీవనశైలిలో భాగంగా చేయలేదు. కేవలం హర్మోన్ల ప్రభావం కారణంగానే చేసిన వాకింగ్ అని అన్నారు. ఎందుకంటే ఆ మూడు రకాల వ్యక్తుల సముహం..“లుకింగ్, డయాబెటిస్, ప్రేమ తదితర మూడు కారణాలతో వాకింగ్ చేస్తున్న వారు. ఇవన్ని హర్మోన్లతో లింక్ అప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది ఫిట్నెస్ కోసం చేసిన వాకింగ్ కాదు..హార్మోన్లతో ప్రేరేపించబడిన నడక అని పేర్కొన్నారు వేలుమణి. (చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు..!
హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై ఉండటం చూసే ఉంటాం. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ఈ హెచ్చరిక సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలా కనిపిస్తున్నా..ఎలా పొగరాయళ్లు వీటికి అలవాటు పడతారా అని తెగ అనుకునేవాళ్లు చాలామంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు దాదాపుగా అందరికి తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి జాబితాలోకి నోరూరించే ఈ చిరుతిండ్ల ఇప్పుడు చేరిపోనున్నాయి. తలుచుకుంటేనే తినాలనిపిచే ఆ స్నాక్స్ ఐటెంపై ఇలా వార్నింగ్ మెసెజ్‌లు ఉంటే ఆహారప్రియుల పరిస్థితి ఊహకందనిది..పొగాకు ఉత్పత్తులపై ఉండే హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు కూడా వచ్చేశాయి. ఇదేంటి ఎంతో ఇష్టంగా ఆ చిరుతిండ్ల అని అవాక్కవ్వకండి. ఎందుకంటే వాటిని తినే మనం చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ ఆహార పదార్థాలపై కూడా ఈ హెచ్చరిక సందేశాలు ఉండాలని ఆదేశాలు జారీ చేసిందట. త్వరలో ఇది అమలు కానుందట కూడా. నిజానికి మనదేశంలో ప్రతి నలుగులో ఒకరు ఊబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. దాన్ని నివారించేందుకు ఇలా సిగరెట్ ప్యాకట్లపై ఉన్నట్లుగానే సమోసాలు, జిలేబీలు మాదిరిగా డీప్‌ఫ్రై చేసే ఇతర స్నాక్స్‌పై కూడా హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు ఉండాలని ఆరోగ్య మత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతేగాదు కేంద్ర ఆరోగ్య సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో అమ్మే ఈ జిలేబీలు, సమోసాలు ఉన్నచోట తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ఆరోగ్య హెచ్చరికలో ఆ ఆహారాల్లో ఉండే కొవ్వు, చక్కెర శాతాన్ని హైలట్ చేస్తారట. కాబట్టి ఇది అచ్చం సిగరెట్లపై ఉండే ఆరోగ్య హెచ్చరిక లేబుల్ వలే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య మంత్రిశాఖ పేర్కొంది. ఇది అవసరమా..ఇటీవల కాలంలో భారతదేశంలో పెరుగుతున్న అనారోగ్యకరమైన జీవనశైలి, ఉద్ధృతమవుతున్న వ్యాధుల ఆందోళనల నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇలా ఆదేశాలు జారి చేసింది. ప్రస్తుతం, ఊబకాయం, చక్కెర, అధిర రక్తపోటు, గుండె జబ్బు వంటి సమస్యల బారిన ఏటా వేలాది మంది పడుతున్నారని, అందుకు ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, జీవనశైలే అని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు 2050 నాటికి సుమారు 449 మిలియన్లకు పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బ్యాన్ కాదు...ఇలా హెల్త్ వార్నింగ్ మెసేజ్‌ల పెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఆయా చిరుతిండ్లను పూర్తిగా నిషేధించడం కాదని స్ఫష్టం చేసింది ప్రభుత్వం. కేవలం ప్రజలకు ఆయా ఆహారపదార్థాలపై అవగాహన కల్పించి ఆరోగ్యంగా జీవించేలా చేయడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ చొరవ ప్రధాని మోదీ ఫిట్ ఇండియా" ఉద్యమం నుంచి వచ్చిందట. ఆయన పిలుపునిచ్చిన 10% నూనెని తగ్గించి ఆరోగ్యంగా ఉందాం..అలాగే భారతదేశాన్ని మరింత బలోపేతంగా మారుద్దాం అన్న నినాదం నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆలోచన అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.(చదవండి: దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!) -
సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్ రాక్ డే
హైదరాబాద్ శివార్లలో రెండున్నర బిలియన్ ఏళ్ల క్రితం వెలసిన అరుదైన వారసత్వ రాతి సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు కొనియాడారు. అదే లక్ష్యంగా నృత్యం, ఇకెబనా ఎగ్జిబిషన్ ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని సుందరయ్య విజాన కేంద్రంలో నిర్వహించారు. సొసైటీ టు సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్రాక్ డే సందర్భంగా పర్యావరణంలో ముఖ్య భూమికను పోషించే రాతి సంపదను ఆయా దేశాలు ఎలా కాపాడుకుంటారో వివరించారు. నయనతార నందకుమార్ అవర్ సీక్రేడ్ ప్లేస్‌కు చెందిన వారు అంతరించిపోతున్న రాతి సంపద గురించి డ్యాన్స్ రూపంలో వివరించారు. పుప్పాలగూడలోని పకృద్ధీన్ గుట్ట 400 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, గుట్టను ఎలా ధ్వంసం చేస్తున్నారో, కంచె గచ్చిబౌలిలో పురాతన రాళ్లు, పర్యావరణ విధ్వంసాన్ని వివరించారు. నగర శివార్లలో రెండున్నర బిలియన్ సంవత్సరాల క్రితం వెలసిన రాతి సంపదకు ముప్పు వాటిల్లుతోందని, పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని నయనతార వివరించారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాళ్లు, నీళ్లు, చెట్లు ఎలా మమేకమవుతాయో వివరిస్తూ ఓరా స్కూల్ ఆఫ్ ఇకెబనా హైదరాబాద్ చాప్టర్ సభ్యులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చెట్లకు రాళ్లు మినరల్స్‌ను అందిస్తాయని, రాళ్లలో పక్షలతో పాటు అనేక ప్రాణులు జీవిస్తాయని తెలియజేశారు. పర్యావరణ విచ్ఛిన్నం వల్లే గ్లోబల్వారి్మంగ్, అతి వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి అవాంతరాలు వస్తున్నాయని ఓరా స్కూల్ ప్రెసిడెంట్ నిర్మల పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రెసిడెంట్ ఫాతిమా అలీఖాన్, వైస్ ప్రెసిడెంట్ సంగీత వర్మ, జనరల్ సెక్రెటరీ ఫ్రాక్ ఖాదర్ పాల్గొన్నారు. (చదవండి: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా ‘గివ్ హిమ్ నోబెల్’ ..!) -
దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!
‘గివ్ హిమ్ నోబెల్’.. గత కొంత కాలంగా ఈ ఒక్క వాక్యం గ్లోబల్ సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలానే కొన్ని వింత వ్యాఖ్యలు చేయగానే, భారతీయ నెటిజన్లు దాన్ని వినోదాత్మకంగా తీసుకుని ట్రోలింగ్ మంత్రంగా మార్చేశారు. ఇలాంటి ట్రోలింగ్ కల్చర్ ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా నగరంలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ అతిగా వినియోగిస్తున్న క్రమంలో ఈ ట్రోలింగ్ పుట్టుకొచ్చి నానా హంగామా చేస్తోంది. సెలబ్రిటీలు, సినిమాలు, క్రీడలు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, రాజకీయాలు ఇలా ఒకటేంటి.. ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం పైనా ట్రోలింగ్ జరుగుతోంది. ఇందులో హ్యూమర్, సెటైర్, సోషల్ కామెంటరీ, ఫన్, సూచనలు తదితర అంశాలు సమ్మిళితంగా ఉంటుంది. సాధారణంగా నగరంలో లక్షల మంది సోషల్ మీడియా యాప్స్ వాడుతున్న వారు ఉండటం, అంతర్జాతీయ అంశాలకు సైతం నగరం వేదికగా ఉండటంతో ఇక్కడ కూడా ట్రోలింగ్ స్థాయి కాస్త ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్న మాట. ట్రోలింగ్ ఒక వినోద మాధ్యమంగా ప్రారంభమై, నేడు ఓ సామాజిక ప్రయోగంగా మారింది. అయినా సరే, ఇది బాధ్యతతో వినియోగించాల్సిన సాధనం. హాస్యం చాటుతూనే, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ వంటి డిజిటల్ నగరాలు ఈ మార్పులకు మార్గదర్శకంగా మారాలని నిపుణుల అభిప్రాయం. స్మార్ట్‌ఫోన్ విప్లవం, డేటా వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికల్లో (ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మొదలైనవి) ట్రోలింగ్ ఒక మోడ్రన్ కల్చర్‌లా మారింది. హైదరాబాద్‌లోని మిలీనియల్స్, జెన్–జీ తరాలు ప్రత్యేకించి ట్రోల్స్‌ను వినోదంగా తీసుకుంటూ, వాటిని షేర్ చేయడం ద్వారా మీమ్స్, సెటైర్ వంటి కళలను కొత్త రీతిలో వెలుగులోకి తెస్తున్నారు. మూడు నుంచి ఐదు గంటలు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ విడుదల చేసిన 2024 డిజిటల్ యుసేజ్ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 78 శాతం మంది యువత రోజుకు కనీసం 3–5 గంటల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్ ఓ ప్రధాన వినోదపు సాధనంగా మారింది. స్థానిక స్థాయిలో జీహెజ్‌ఎంసీ పనితీరు, ట్రాఫిక్ సమస్యలు, మినిస్టర్ స్టేట్మెంట్లు మొదలుకొని అంతర్జాతీయంగా ట్రంప్, పుతిన్, ఎలాన్ మస్్కల వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. అత్యధికంగా సినిమాలపైనే.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్ చిత్రం విడుదలైనప్పుడు ‘హనుమాన్‌కి వైఫై ఉంద’ని, థియేటర్లో హనుమాన్కు సైతం ఒక సీట్ వదిలేయాలనే ట్రోల్స్ జోరుగా సాగాయి. నాగ్‌చైతన్య, సమంత విడాకుల సమయంలో కూడా ‘వెడ్డింగ్ టార్గెట్ 2.0’ అనే పేరుతో కొందరి ఎడిటెడ్ పోస్టర్లు చక్కర్లు కొట్టాయి. నేషనల్ క్రష్‌గా మారిన రషి్మక మందన సినిమాలో నటిస్తే అది వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని, పూజా హెగ్దే నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఇలాంటి వింత వింత ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. ఈ మధ్యనే ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ విపరీతంగా ట్రోల్‌కు గురయ్యారు. తన జెర్సీ నెంబర్ 18, ఈ సారి జరిగిన మ్యాచ్ కూడా 18వ మ్యాచ్ కావడంతో ఇక ట్రోఫీ గెలవరని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే దీనికి విభిన్నంగా 18 ఏళ్ల తరువాత మ్యాచ్ గెలవడంతో ఈ ట్రోలింగ్‌కు తెలపడింది. కానీ మరుసటి రోజు బెంగళూరు వేదికగా విజయోత్సవ వేడుకల్లో భాగంగా అపశృతి జరిగి క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో మరణించడంతో మళ్లీ ట్రోలింగ్ పుంజుకుని ఒక వారం పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇదే ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ఓడినప్పుడు కూడా.. ‘బిర్యానీ తిని ఆట పై దృష్టి సారించలేరనే’ కామెంట్లతో ట్రోల్ చేశారు. సోషల్‌మీడియా రాజకీయం రాజకీయాల పరంగా సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పారీ్టల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణులను సైతం పెట్టుకుని సోషల్ మీడియా ట్రోలింగ్ మీమ్స్ తయారు చేస్తున్నారు. వీటికి ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్ వేదికల్లో ప్రత్యేక ఖాతాలు, గ్రూపులు సైతం ఆవిష్కరించారు. తెలంగాణలో బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య, ఏపీలో వైఎస్ఆర్సీపీ–టీడీపీ మధ్య ట్రోలింగ్ ఎక్కువగా ఉండగా.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బీజేపీ పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. గ్లోబల్ వేదికగా.. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో.. నువ్వు ఓకే అను ఏసేద్దాం అంటూ పోకిరి సినిమా డైలాగ్స్‌ను భారత్–ఇజ్రాయెల్ మీమ్స్‌గా తయారు చేసి పాక్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ తెలుగు మీమర్స్ చాలా ఉత్సాహంగా, క్రియేటివ్‌గా ఉన్నారు. ఇదే యుద్ధం సందర్భంగా భారత్–పాక్ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అనే ట్రంప్ స్టేట్మెంట్ ఆధారంగా.. ‘గీవ్ హిమ్ నోబెల్’ అనే ట్రోల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఎలన్ మస్క్ ‘ట్విట్టర్’లో మార్పులపై ‘ఇంతలోనే ట్విట్టర్ మేము మిస్ అవుతున్నాం మస్క్ గారు’ అంటూ ట్రోల్స్ చేశారు. ట్రోలింగ్‌లోనూ రెండు రకాలు.. పాజిటివ్ వర్సెస్ నెగెటివ్ ట్రోలింగ్. పాజిటివ్‌లో హ్యూమరస్, సెటైరిక్ ఎక్కువగా ఉంటూ.. సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విఫలతలపై క్రియేటివ్‌గా విమర్శలు, పౌరుల చైతన్యం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. నెగెటివ్ ట్రోలింగ్‌లో బులీయింగ్, మోసం వంటి అంశాలను ఎత్తి చూపుతున్నారు. ఇందులో వ్యక్తిగత జీవితాలపై దూషణలు తారా స్థాయికి చేరాయి. ట్రోల్ పేరుతో హేట్‌స్పీచ్ ఎక్కువ వ్యాప్తిచేస్తున్నారు. కుల, మత, భౌగోళిక అంశాలపైన ఈ ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. -
ఈ కళ అమ్మ కల
‘అమ్మాయే కదా ఏం చేస్తుందిలే... టచ్ చేసేద్దాం’ అనుకుంటే అనంతికా సనీల్‌కుమార్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అనంతిక’ అనొచ్చు. మనల్ని మనం రక్షించుకునే కళ తెలియాలంటోంది ఈ టీనేజ్ బ్యూటీ. అందుకే అనంతికా సనీల్‌కుమార్ ‘మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్, కేరళ ప్రాచీన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు నేర్చుకుంది. కథకళి, భరతనాట్యం, మోహినియాట్టమ్, కూచిపుడి కూడా నేర్చుకుంది. మరోవైపు సినిమాలంటే ఇష్టంతో హీరోయిన్గా కొనసాగుతోంది. ‘మ్యాడ్’, ఇంకా ఆ మధ్య విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అనంతికా సనీల్‌కుమార్ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడల్లా ‘ఓకే’ అనే సమాధానమే వచ్చింది. ఇక డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లాసికల్ మాత్రమే కాదు... హిప్ హాప్ నేర్చుకోవాలన్నా అదే రియాక్షన్. అంత సపోర్టివ్. మా అమ్మ తన కలని నాలో చూసుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లుగా చిన్నప్పుడు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఆమె పేరెంట్స్‌కి అంత స్థోమత లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉంది. అన్నీ నేర్పించి, మా అమ్మ నాలో తనని చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఫోర్త్ స్టాండర్డ్ వరకూ నేను టాపర్‌ని. ఆ తర్వాత ఆడుకోవడం, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్‌తో స్టడీస్ వైజ్ కొంచెం వీక్ అయ్యాను. ఎయిత్ స్టాండర్డ్ వరకూ ఇలానే. ఆ తర్వాత మళ్లీ గుడ్ స్టూడెంట్ అయ్యాను.క్రమశిక్షణకు కళకళ ఏదైనా సరే క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిస్ట్ (యాక్టింగ్) అంటేనే క్రమశిక్షణ ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ వల్ల నా ఆలోచనా విధానం మారింది. ఏదైనా విషయం గురించి నిదానంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే శరీరాన్ని మాత్రమే కాదు... మనసుని కూడా క్రమ పద్ధతిలో పెడుతుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే మీద పడి కొట్టడం కాదు... మనల్ని మనం రక్షించుకోవడం. ఈ ఆర్ట్ నేర్చుకున్న ఎవరైనా సరే ముందు చాలావరకు నియంత్రించడానికే ప్రయత్నిస్తారు... అయితే లిమిట్ దాటితే అప్పుడు కొడతాం.బ్యాడ్ టచ్... టీచ్ హిమ్నా చిన్నప్పుడు ఒక అబ్బాయితో చాలా గట్టిగా గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను ఏమీ అనలేదు. తను నా ఫ్రెండ్. పిల్లల గొడవలుంటాయి కదా... అలాంటిది. నేను తిరగబడి బాగా కొట్టాను. నన్ను కూడా బాగా కొట్టాడు (నవ్వుతూ). కిడ్స్ ఫైట్ అన్నమాట. ఆ తర్వాత నా టీనేజ్‌లో నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి ‘బ్యాడ్ టచ్’ చేశాడు. అమ్మాయే కదా ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనదనే ధైర్యం వారికి ఉంటుంది. నేను అతన్ని నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో లాక్ చేశాను. బ్యాడ్ టచ్ చేస్తే టీచ్ చేయాల్సిందే. అమ్మాయిలు ఇలా చేస్తే ఓ ఎవేర్నెస్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి... తిరగబడతారనే ఫీలింగ్ సొసైటీలో క్రియేట్ చేయగలిగితే దాడులు తగ్గుతాయని నా ఫీలింగ్.సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంనాకు గాయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాయాలు తగిలిన ప్రతిసారీ ‘మనం ఏదో చేస్తున్నాం’ అనే ఫీలింగ్ నాకు ఆనందాన్నిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో చాలాసార్లు తగిలాయి. ఇక కలరి అయినా, కరాటే అయినా ఏదైనా ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా స్లోగా ఉంటుంది. త్వరగా నేర్చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా... అందుకని బోర్ ఫీలవుతాం. కొంతమంది అమ్మాయిలైతే ఒకటీ రెండు క్లాసులకు వచ్చి, మా వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ నిదానం అవసరం. అయితే ఆ ఫస్ట్ స్టెప్ మనం ఓపికగా ఉంటే మన లాస్ట్ స్టెప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొందరైతే ఈ కష్టం మావల్ల కాదనుకున్నారు. కానీ, కొన్నేళ్లు కష్టపడి నేర్చుకున్న ఆర్ట్ మన జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకపోవడం అనేది ‘ఆర్థిక స్వాతంత్య్రం’ విషయంలో మాత్రమే కాదు... మన మీద జరిగే దాడుల విషయంలోనూ డిపెండ్ కాకూడదు. ‘సెల్ఫ్ డిఫెన్స్’ చాలా ఇంపార్టెంట్.రెస్ట్ నచ్చదునాకు ‘బ్లాక్ ఫ్లిప్’ అంటే ఇష్టం. ఒకసారి అది చేస్తున్నప్పుడు వెన్నెముకకి గాయం అయింది. అప్పుడు నేను ‘ప్లస్ వన్’ చదువుకుంటున్నాను. నా స్పైన్ బెండ్ అయింది. ఫలితంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి రెస్ట్ అంటే అస్సలు నచ్చదు. విశ్రాంతి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ‘8 వసంతాలు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయినా ఆ సినిమా ఒప్పుకుని, చేశాను. ఇప్పటికీ కంటిన్యూస్‌గా నిలబడితే నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఉన్నా పట్టించుకోకుండా పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను (నవ్వుతూ).రియాక్ట్ అయ్యే బలంమార్షల్ ఆర్ట్స్ అంటే... ఒంటి చేత్తో రాళ్లని పగలగొట్టడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి వేళ్లు, గోళ్లు, చేతులు, కాళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది... మన ఆత్మవిశ్వాసం పెంచే కళ. మనకు ఏం జరిగినా వేరేవాళ్ల మీద ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటారు కాబట్టి వాళ్లైతే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నవాళ్లు నేర్చుకోవాలంటా. అమ్మాయిగా నాకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువే. కానీ ఇవి నేర్చుకోవడం వల్ల రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌లో రియాక్ట్ అయ్యేంత బలం దానంతట అది వచ్చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం మనకు తెలుసు అని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ఎదురు తిరిగేలా చేస్తుంది.సైలెంట్‌గా ఉండొద్దుఅమ్మాయిలకు స్వీయ రక్షణ తెలియాలి. ఆ మాటకొస్తే ఇప్పుడు అబ్బాయిలకూ కొన్ని ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సో... ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినవాళ్లల్లో అబ్బాయిలకు కూడా సమస్యలు వచ్చాయి. ఇక అమ్మాయిలకు ఎందుకు మరీ ముఖ్యం అంటే... వాళ్లకి ఎక్కువగా వేధింపులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ఎవరైనా వచ్చి, తాకకూడని చోట తాకారనుకోండి ‘మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటే బాగుండేది’ అని అప్పుడు అనుకుంటాం. అది ప్రయోజనం లేదు. అదే ముందే నేర్చు కుంటే... ఆ టైమ్‌లో సైలెంట్‌గా ఉండకుండా బుద్ధి చెప్పగలుగుతాం.పాలిటిక్స్‌లోకి...నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే జనాల్లో ఉండటం ఇష్టం. వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంది.ప్రాపర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. చట్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘లా’ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. భవిష్యత్తులో అమ్మాయిల కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని ఉంది. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. కొంచెం టైమ్ పడుతుంది.– కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ మాత్రమే సాధించాను. వన్ నుంచి టెన్ వరకూ ఉన్నాయి. థర్డ్ కూడా సాధించాలని ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి టైమ్ దొరకడంలేదు. పదో స్టేజ్ వరకూ వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాల్లో నాకు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్ర వస్తే హ్యాపీగా చేసేస్తాను.– డి.జి. భవాని -
MorningFood పరగడుపున ఇవి తింటున్నారా?
మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపు లో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.ఉదయం వేళల్లో మసాలాలు, డీప్ ఫ్రైస్ తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా కడుపుకి మంచిదే కదా అని పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి.చాలామంది బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు ఎదురై.. ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం చాలాప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు.చదవండి : Yoga మెదడును ఉత్తేజపరిచే ఆసనాలు -
లైఫ్‌స్టైల్ ఇన్‌ప్లేషన్ : దీన్ని ఎదుర్కోవడం ఎలా?
మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులనూ పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెలనెలా మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం! జీతం పెరిగితే పొదుపు పెరగాలి. అలా కాకుండా, పెరిగిన జీతంతో సమానంగా.. పెట్టే ఖర్చూ పెరుగుతోందంటే మీ జీవన విధానం మీ చేయి దాటి పోయిందనే! ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడి పోయారనే! మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఏ నెల చెక్ చేసినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందనే! దీనినే ‘లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్’ (Lifestyle Inflation) అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే.. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’! – సాక్షి, స్పెషల్ డెస్క్ సాధారణంగా, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటాన్ని ‘ద్రవ్యోల్బణం’అంటారు. కానీ, ఈ ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది! జీతం పెరిగింది కదా అని, ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోతే సంభవించేది! ఇంకాస్త మెరుగైన తిండి. ఖరీదైన బట్టలు. సౌఖ్యమైన కారు. అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే – కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్ బ్రాండ్లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్ తప్పటమే జీవనశైలి ద్రవ్యోల్బణం.‘పెరగటం’నిజం కాదు! మెరుగైన జీవితాన్ని కోరుకోవటం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగు పరుచుకోవటం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరు గుతాయి. మెల్లగా అప్పులు మొదలౌతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుంచి మనదేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదని ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’పేర్కొంది. దీన్నిబట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే... ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప, ఖర్చుపెట్టటానికి జీతం పెరగదని భావించి జాగ్రత్తగా ఉండాలని. ఏఐ భయం పొంచి ఉంది! జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండవలసిన ప్రధాన అంశం ఏఐ (కృత్రిమ మేధస్సు). ఏఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దీన్నిబట్టి ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగటం, కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవటం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్షణంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించామని ఉద్యోగులు గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోల్చుకోవటం జీతానికి చేటు.. తోటివారితో పోల్చుకోవటం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎక్కు వ మంది సంపాదిస్తున్నారని, మెరుగ్గా జీవిస్తున్నారని, విలాసాలకు ‘అప్‌గ్రేడ్’అవుతున్నారని చెప్పి వాళ్లందరినీ అనుసరించటం అంటే.. పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవటమే. నిరంతర అశాంతి, అనారోగ్యాలు, రుణ భారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే ‘బోనస్’. చాలామంది.. విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి ‘స్థాయి’కి చేరుకోటానికి పరుగులు పెడుతుంటారు. నెలనెలా చెల్లింపులతో మన ల్ని కట్టిపడేసే ‘ఈఎంఐ’లతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతినెలా పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులూ ప్రబోధిస్తున్నారు.చిక్కుకోకుండా ఉండాలి జీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్ ఫీజులు సరేసరి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్నచోటనే కొనసాగించాలి. అలాగే, అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లడానికి ప్రిస్టేజ్ అడ్డుపడుతుంది. ఇక ఈఎంఐలను అవి తీరేవరకు కట్టాల్సిందే. క్రెడిట్ కార్డులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుంచీ వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోటానికి ఈ అనుభవం పనికొస్తుంది కానీ, అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీతం పెరిగీ ప్రయోజనం ఉండదు.ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!ముందస్తు హెచ్చరిక సంకేతాలు..జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని ముందుగా తెలియబరిచే హెచ్చరికలు కొన్ని ఉంటాయి. మొదటి హెచ్చరిక: మీ జీతం ఎంత పెరిగినా, అందులో కొంతైనా పొదుపు మొత్తంలో చేర్చలేకపోవటం. రెండో హెచ్చరిక: జీతం పెరిగిన నెల నుంచే మీరు బడ్జెట్ వేసుకోవటం మానేయటం. మూడో హెచ్చరిక : జీతం పెరిగిందన్న ధీమా మీ క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్‌ను పెంచేయటం. నాలుగో హెచ్చరిక ‘ముందు కొనండి– తర్వాత చెల్లించండి’అనే స్కీములపై ఆధారపడటం. అయిదో హెచ్చరిక ఇంటర్నెట్, ఓటీటీల సబ్బ్ స్క్రిపషన్లు పెరగటం.బయట పడే మార్గం ఉంది.. జీవనశైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్‌కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కలి్పంచండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవని ఆర్థిక నిపుణుల ఉవాచ. -
యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు! -
ప్రాణం లేకపోతేనేం బొమ్మలు నయం చేస్తాయి!
బొమ్మలు చిన్నపిల్లల కోసమే అనుకుంటారు చాలా మంది. బొమ్మలు పెద్దల్లో ఉన్న పిల్లల కోసం కూడా! బొమ్మలను చూడటం, వాటిని తాకడం, షెల్ఫ్‌లలో పెట్టుకుని దాచుకోవడంఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయని అంటారు నిపుణులు. ‘నా చిన్నప్పటి సంతోషాలను ఇప్పటికీ పొందుతున్నాను’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్ (Saylee Padwal). ముంబైలో ఉన్న శైలీ ఇంటికి వెళితే ఇంటి నిండా బొమ్మలే. వీటి సేకరణ కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే అంటున్న శైలీ పరిచయం. ‘కొత్త బొమ్మ కొన్నప్పుడల్లా నాకు ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్. ఆమె ఇంటికి వెళితే గదులు, అరలు, అల్మారాలు, గోడలు... అన్నీ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే అవేవీ దేశీయమైన బొమ్మలు కాదు. ఈ కాలపు పిల్లలు కూడా తక్కువగా చూసే ఆధునిక బొమ్మలు. చాలా మటుకు చైనా బొమ్మల తయారీ దిగ్గజం పాప్ మార్ట్ తయారు చేసి వదిలేవే. హాట్సునే మికు, స్మిస్కిస్, క్రై బేబీస్... ‘వీటన్నింటి కంటే నాకు లబుడు బొమ్మలు ఇష్టం’ అంటుంది శైలీ పాడ్వాల్.ఫ్యాషన్ డిజైనర్‌గా దేశ విదేశాలు తిరిగే శైలీ తనకు స్నేహితులెవరైనా ఉన్నారంటే బొమ్మలనే అంటుంది. ‘కొత్త కొత్త బొమ్మలను చూడటం, తాకడం వాటిని ఇంట్లో అలంకరించుకోవడం థెరపీ అనే అనిపిస్తుంది నాకు. బొమ్మలు కేవలం పిల్లలవి కాదు. బొమ్మలకు ఆకారాలుంటాయి. ప్రాణం లేకపోయినా అవి మనల్ని ఆకర్షిస్తాయి. వాటితో అనుబంధం ఏర్పడుతుంది. బొమ్మలు తోడుంటే ఒంటరితనం బాధ ఉండదు’ అంటుంది శైలీ.ఈ బొమ్మల మీద ఆసక్తి ఆమెకు బార్బీ బొమ్మల నుంచి వచ్చింది. ‘నా చిన్నప్పుడు అమ్మ ప్యాకెట్ మనీ ఇచ్చేది. వాటిని దాచి దాచి మొదటిసారి బార్బీ రెయిన్, బార్బీ సన్డాల్ అనే రెండు బొమ్మలు కొన్నాను. నా చిన్నప్పుడు అవే పెద్ద ఫ్రెండ్స్‌గా ఉన్నాయి. బొమ్మలను నేను చూసే పద్ధతి, వాటిని అలంకరించే పద్దతి, ఆకర్షణీయమైన బొమ్మలను చూసే పద్ధతి గమనించిన మా అమ్మ నేను ఫ్యాషన్ రంగంలో రాణిస్తానని ఊహించింది. ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం వల్ల బొమ్మల్లోని అంద చందాలు నాకు మరింత బాగా అర్థమయ్యాయి’ అంది శైలీ.అయితే ఇంటి నిండా బొమ్మల్ని చూసి ‘ఇన్ని ఎందుకు’ అని తెలియని వారు ఆశ్చర్యపోవచ్చు. ‘ఈ బొమ్మలు కొని పెట్టడం కూడా ఒక పెట్టుబడే. బొమ్మలు ఎప్పటికప్పుడు మారు తుంటాయి. ఒకసారి వచ్చిన బొమ్మలు మళ్లీ రావు. ఇలా కలెక్ట్ చేసి పెడితే కొన్నాళ్లకు అవి అరుదైనవిగా మారుతాయి. వాటిని భారీ రేటు ఇచ్చి కొనేవారూ ఉంటారు’ అంటుంది శైలీ.చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!పసిపిల్లలు బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోవడం అందరికీ తెలిసిందే. బొమ్మలు మానసిక ఓదార్పుని ఇస్తాయి. దేశీయ బొమ్మలు ఒకప్పుడు పిల్లలందరి దగ్గరా ఉండేవి. ఇప్పుడు ఏ బొమ్మలు లేకపోతే కనీసం టెడ్డీ బేర్‌ను అయినా పెట్టుకుంటున్నారు. ‘అది మంచిదే’ అంటుంది శైలీ.‘పిల్లలున్న ఇంట్లో బొమ్మలు లేవంటే వారు సరిగా పెరగడం లేదని అర్థం. మరొకటి పిల్లలకు బొమ్మలు ఇచ్చాక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పద్దు. వాటితో ఎలా వ్యవహరించాలో పిల్లలకు తెలుసు. వాటిపై ప్రయోగాలు జరిపినా...విరగ్గొట్టినా అదంతా ఎదుగుదలలో భాగంగా చూడాలి’ అంటుంది శైలీ. అయితే మితిమీరిన బొమ్మలను కొనడం ఒక వ్యసనంగా చూసేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే శైలిది సేకరణా... లేకుంటే వ్యసనమా... అనిపిస్తుంది. ఒకవేళ వ్యసనమైనా హాని లేని వ్యసనమే అనుకుని సరిపెట్టుకోవచ్చు. ‘మీరేమైనా అనుకుంటే నా బొమ్మల ప్రపంచం నాది’ అంటోంది శైలీ.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది.. ఆ జానపదం ఘల్లుమన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది.. అని రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. గత కొంత కాలంగా తెలుగు ఫోక్ సాంగ్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తెలుగు జానపదాలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒకప్పుడు సినిమా పాటలు వైరల్‌గా మారేవి.. కానీ ప్రస్తుతం మన జానపద పాటలు వైరల్‌గా మారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అంతేకాకుండా.. స్థానికంగానే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రముఖ కార్యక్రమాల్లో తెలుగు ఫోక్ సాంగ్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు మొదలు మిస్ వరల్డ్ పోటీలను సైతం తెలుగు ఫోక్సాంగ్స్ అలరించాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో ఈ పాటలకు మానిటైజేషన్ ఎక్కువగా జరిగి ప్రైవేట్ ఆల్బమ్స్‌కు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తుండటం విశేషం. అనాదిగా తెలుగు జానపద పాటలకున్న విశిష్టత, ప్రశస్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంప్రదాయ ప్రైవేట్ ఆల్బమ్‌లతో యువత గుండెల్లో ఒక నిర్దిష్ట స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ మధ్య ఓ మెట్టు ఎగబాకి సినిమా పాటలను సైతం దాటి వైరల్‌గా మారుతుండడం విశేషం. ఎంతలా అంటే ఒక పాటకు 40, 50 లక్షల ఆదాయం సంపాదించేంతలా..!! ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎక్కువ వ్యూయర్ప్తో రెమ్యూనరేషన్ లభించడం ఈ తరం యువతకు కలిసొచి్చంది. ఇందులో భాగంగానే సినిమా పాటల మాదిరిగానే సెట్లు వేసి మరీ ప్రైవేటు ఆల్బమ్స్ షూట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్లి బరాత్‌లు, పండుగలు, పబ్బాల్లో అలరించే ఈ పాటలు కొత్త రంగులు అద్దుకున్నాయి. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టా, ఫేస్బుక్లో ఈ పాటలు, పాటల రీల్స్ సందడి చేస్తూ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. వైరల్‌గా మారిన ఈ ఫోక్ సాంగ్స్‌లో నటించిన నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. గతంలో ఇదే దారిలో వచ్చి సినిమా అవకాశాలు పొందిన మంగ్లీ, రామ్ మిర్యాల గురించి విధితమే. కానీ ఈ తరం ఫోక్ ఆరి్టస్టులు సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్‌తోనే మంచి ఆదాయాలను పొందటం విశేషం. ఒకప్రైవేటు ఆల్బమ్‌తో కోటి రూపాయలకు పైగా వ్యూయర్షిప్ రెమ్యునరేషన్ పొందిన తెలుగు పాటలున్నాయి. ఇది ఈ తరం ఔత్సాహికులకు కళతో పాటు ఆదాయమార్గాలను చేరువ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరల్ అయినవి.. కాపోల్లింటికాడ..: 2023లో విడుదలైన ఈ పాట రీల్స్‌లో, ఫేస్బుక్, యూట్యూబ్‌లో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ పాట ఇన్‌స్టా కవర్స్, డ్యాన్స్ ఛాలెంజ్‌లకు కారణమైంది. సిటీలో ఈ ట్రెండింగ్ కల్చర్‌కు కారణమైనవాటిలో ఈ సాంగ్ కూడా ఒకటి. ఓ పిలగ వెంకటి..: 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని బీట్, లిరిక్స్ యువతతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకర్షించింది. ఈ పాటతో వేల సంఖ్యలో రీల్స్ సోషల్ మీడియాను నింపేశాయి. కమలాపూరం రోడ్డాట..: మార్చి 2025లో విడుదలైన ఈ ఫోక్ జోక్ ట్యూన్ ఈ మధ్య కాలంలో ఇన్‌స్టా రీల్స్, రీమిక్స్ వీడియోల్లో సంచలనంగా మారింది. ఇందులోని గ్రామీణ సన్నివేశాలు, బీట్ మాధ్యంలోని హుక్‌లతో ఈ పాట క్రియేటర్లు, డీజే వర్క్‌షాప్‌లలో హైలైట్‌గా నిలిచింది. రాను బొంబైకి రాను..: అద్దాల మేడలున్నవే అంటూ మొదలయ్యే ఈ పాట.. రాను ముంబైకి రాను అంటూ ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్‌గా మారింది. ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ, బాలివుడ్ షోలలోనూ వైరల్‌గా మారింది. లైఫ్‌స్టైల్.. సోషల్ స్ట్రీమింగ్.. ఈ పాటలు గతంలో టిక్‌టాక్, ప్రస్తుతం యూట్యూబ్, క్యాప్‌కట్, ఇన్స్టాల్లో వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని పాటలకు బ్రాండెడ్ వీడియో అలాగే లైవ్ ఈవెంట్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఒక్క పాటతో పార్ట్ టైమ్ సెలబ్రిటీగా మారిన క్రియేటర్లు ఎందరో. ఈ ప్రభావంతో గ్రామీణ ఆవిష్కరణలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ నిలుస్తున్నాయి. వీటికి సహకార వేదికలు, స్టేజ్ షోస్, వెబ్స్ట్రీమ్స్ ద్వారా ఆరి్టస్టులు దేశ–అంతర్జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. హైబ్రిడ్ ఫ్యూజన్‌తో ఫోక్ + ఎలక్ట్రో బ్యాండ్లుగా అవతరిస్తున్నాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ తాజాగా దేశవ్యాప్తంగా లైఫ్‌స్టైల్ ఈవెంట్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు, బాలీవుడ్ షోలు, మిస్ వరల్డ్ వేదికలపై ఫోక్ ఘనంగా ఆవిష్కృతమవుతోంది. ఈ ఆదరణ దృష్ట్యా రవితేజ వంటి సినీ హీరోలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్‌ను జతచేస్తున్నారు. మరికొందరు అన్ని పాటలూ ఫోక్సాంగ్స్ పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. -
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్‌కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్‌లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్లు, అధిక పోషకాహార డైట్లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్‌గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!) -
‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..
హైదరాబాద్ నగరం మరోసారి నవ్వుల పండుగకు వేదిక కానుంది. డిజిటల్ హాస్య తార ‘అయ్యో శ్రద్ధా’గా గుర్తింపు పొందిన శ్రద్ధా జైన్ తన అద్భుత స్టాండప్ కామెడీ షో ‘సో మినీ థింగ్స్’ పేరుతో దేశంలో చివరి సారి ప్రదర్శించనుంది. ఈ హృద్యమైన వినోద యాత్ర ఈ నెల 27న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రదర్శన కేవలం వినోదం మాత్రమే కాదు.. భారతీయ కుటుంబ జీవనాన్ని, మన ఊహల్ని, నిత్యజీవితంలో మినీ మినీ కహానీలను పరిపూర్ణంగా హాస్యంగా మలిచే ఓ అనుభూతిని ప్రదర్శించనుంది. శ్రద్ధా కామెడీ మాయాజాలం మానసిక అంతర్భావాల పరంగా అద్భుతంగా ఉంటుందని అభిమానుల మాట. ఓ చిన్న పిల్లవాడిలా జిజ్ఞాసతో, అమాయకంగా ఆలోచించే తత్వం ఆమె పండించే ప్రతి కథనంలో కనిపిస్తుంది. ‘సో మినీ థింగ్స్’ అనే పేరు కూడా ఆమె ప్రదర్శనలోని మినీ కథలు, మినీ ఎమోషన్స్, మినీ వెర్షన్లకు అద్దం పట్టినట్లే ఉండనుంది. భారతీయ కుటుంబాల్లోని సరదా సంభాషణలు, అపరిచిత సందర్భాల్లో తలెత్తే హాస్యాన్ని తన ప్రత్యేక శైలిలో మలచి ప్రేక్షకులకు అందించడం ఆమె ప్రత్యేకత. ఈ ప్రదర్శనకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న లైవ్ట్రీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోను నిగమ్, హరిహరన్ వంటి సంగీత దిగ్గజాల లైవ్ షోల వేదికగా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా షోను ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రదర్శించి, ఇప్పుడు చివరగా భారత్‌లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో భారీ ప్రేక్షకాభిమానంతో ప్రారంభమైన ఈ చివరి టూర్, ముంబై, చెన్నై, హైదరాబాద్ షోతో ముగుస్తుంది. ఈ సందర్భంగా సీఈఓ శరత్ వత్సా మాట్లాడుతూ.‘దాదాపు 90 నిమిషాలు ప్రేక్షకులు నవ్వుల ప్రపంచంలో మునిగి తేలాక వారి మనసు తేలికపడి, హృదయాన్ని హత్తుకునే అనుభూతితో బయటికి రావడం.. ఇదే మాకు సంతృప్తి. 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ‘మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ – ఫిమేల్’ అవార్డును అందుకున్న ఈ ఇంజినీర్, ఆర్జే, కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం కామెడీ ప్రపంచానికి ఒక మైలు రాయిలా మారిపోయింది’ అని తెలిపారు. -
రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..
నగరంలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు కొత్త కొత్త ట్రెండ్స్ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం హోమ్ జిమ్స్‌కు డిమాండ్ ఊపందుకుంటోంది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఇవి ప్రస్తుతం మధ్యతరగతి ఇళ్లలో సైతం సాధారణంగా మారాయి. బ్యాచిలర్ హోమ్స్‌లో, కో–లివింగ్ ఫ్లాట్స్‌లో సైతం నలుగురైదుగురు యువత కలిసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హోమ్ జిమ్ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో నగరంలో స్థిరపడుతోంది. నగరంలో హోమ్ జిమ్ ట్రెండ్ ఊపందుకోడానికి కోవిడ్ పుణ్యమాని వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒక కారణమే. ఇంట్లో అధిక సమయం గడపడం అలవాటవుతున్న పలువురు వృత్తి నిపుణులు ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాల నుంచి ప్రతికూలతల వరకూ ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిదని ఫిట్నెస్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలం ఉంటేనే ఫలం.. ఒక మోస్తరు హోమ్ జిమ్ ఏర్పాటుకు కనీసం 60–100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని అంచనా. బేసిక్ హోమ్ జిమ్ అయితే 60–80 చదరపు అడుగులు (ఉదాహరణకు బెడ్రూమ్ కార్నర్ లేదా బాల్కనీలో) అలా కాకుండా ఫుల్ సెటప్ చేసుకోవాలంటే.. 100–150 చ.అ. (ఒక ప్రత్యేక గది అయితే మరింత మంచిది) అవసరం అవుతుంది. బడ్జెట్ ఇలా.. హోమ్ జిమ్ బడ్జెట్ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవల్ హోమ్ జిమ్కైతే పెట్టుబడిగా రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య సరిపోతుంది. అదే మిడ్ రేంజ్లో వెళ్లాలనుకుంటే రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు, పూర్తి సెటప్ కోరుకుంటే రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ (బ్రాండెడ్ ఎక్విప్మెంట్ను బట్టి మారవచ్చు) వెచ్చించాల్సి ఉంటుంది.ప్రాథమిక పరికరాలు.. ఇంట్లో జిమ్‌లో ఉండాల్సిన పరికరాల్లో డంబెల్స్ సెట్స్ (రూ.3,000 నుంచి రూ.10,000) రాడ్స్, వెయిట్స్ (రూ.5,000 నుంచి రూ.15,000), బెంచ్ ప్రెస్ (రూ.8,000 నుంచి రూ.20,000) యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ (రూ.1,000 నుంచి రూ.3,000 ), ట్రెడ్మిల్ లేదా ఎలిప్టికల్ మిషన్ (రూ.20,000 నుంచి రూ.లక్ష) ఆల్ ఇన్ వన్ మల్టీ జిమ్ మిషన్ (రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకు), లాట్ మిషన్ (రూ.15,000 నుంచి రూ.25,000)లు కొనుగోలు చేయాలి. ప్రతికూలతలు.. సరైన శిక్షకులు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఇంటికి వచ్చి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్‌ను ఎంచుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తం ఆర్థిక భారంగా మారుతుంది. ఒంటరిగా చేయడం వల్ల సరిపడా మోటివేషన్ దొరకదు. వర్కవుట్స్‌ను వాయిదా వేసే అవకాశం ఎక్కువ. ఎంత వరకూ చేయాలో, ఏ వర్కవుట్ ఎలా చేయాలో తెలుసుకుని చేయకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. అద్దెకు ఉంటున్న ఇళ్లు అయితే ఇంటి యజమానులతో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా ఇళ్లు మారే సమయంలో ఈ ఎక్విప్మెంట్ భారంగా పరిణమించవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. నగర ట్రాఫిక్‌లో రాకపోకలకు పట్టే సమయం, ఎండ, వాన తదితర వాతావరణ అడ్డంకులు ఉండవు. జిమ్‌లో పదుల సంఖ్యలో ఉండే ఇతర సభ్యుల మధ్య చేయడం, కొన్ని సార్లు ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక్క హోమ్ జిమ్‌తో కుటుంబ సభ్యులందరికీ వ్యాయామం చేసే అవకాశం లభిస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చక్కని ఆరోగ్యకర వాతావరణానికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలవారీగానో, వార్షిక ఫీజు రూపంలోనో చెల్లించాల్సిన జిమ్ మెంబర్షిప్ ఖర్చును దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సన్నిహితులను కూడా కలుపుకుంటే స్వల్ప కాలంలోనే పెట్టుబడి రికవరీ అయినట్టు భావించవచ్చు. -
అప్పుడు బంజరు భూమి... ఇప్పుడు ప్లేగ్రౌండ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని మారుమూల గ్రామం... చింద్నార్. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనక ఉన్న బంజరు భూమి ఇప్పుడు వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్, క్లైంబింగ్ వాల్, లాంగ్ జంప్ పిట్... మొదలైన వాటితో అందమైన ప్లేగ్రౌండ్‌గా మారింది. ఈ గ్రామంలోనే కాదు దంతెవాడ జిల్లాలో ఎన్నో మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల వెనకాల ఉన్న బంజరు భూములు అందమైన ప్లేగ్రౌండ్స్‌గా మారి ఆహా! అనిపిస్తున్నాయి.ఈ మార్పుకు కారణం... సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్, మన్ దేశీ ఫౌండేషన్. ప్లేగ్రౌండ్స్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కోచ్‌లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్లేగ్రౌండ్ నిర్మాణ ప్రక్రియ అనేది కమ్యూనిటీ ఈవెంట్‌గా మారింది. గ్రామప్రజలు ప్లేగ్రౌండ్ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.మన దేశంలో 65–70 శాతం స్కూల్స్‌లో సరిౖయెన ప్లేగ్రౌండ్లు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రాష్ట్రాలలోనూ తన ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని సంకల్పించాయి సచిన్, మన్ దేశీ ఫౌండేషన్లు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...) -
మేని సంరక్షణ కోసం..బెల్లంతో ఇలా..!
వంటింట్లో ఉపయోగించే వాటితో ముఖానికి సంబంధించిన సమస్యలను సులభంగా మటు మాయం చేసే టెక్నిక్‌లు, చిట్కాలు చూశాం. కానీ ఆరోగ్యానికి మంచిదని చెప్పే బెల్లం చర్మ సంరక్షణకు తోడ్పడుతుందని విన్నారా..?. ఔను బెల్లంతో తయారు చేసిన ఫేస్‌వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించనియ్యదు.చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు వలయాకారంలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాలటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి.ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి. (చదవండి: అద్దమంటి ఆకృతి..! ర్యాంప్ పై రిఫ్లెక్షన్..) -
అద్దమంటి ఆకృతి..!
ముఖాన్ని మాత్రమే కాదు మన ఆత్మవిశ్వాసాన్నీ చూపుతుంది అద్దం.అద్దం లాంటి ఆకృతి కాదు, ఆకృతే అద్దంగా మారుతోంది.అద్దాన్ని ఫ్యాబ్రిక్‌కి జత చేసి, ధరించడం ఎవర్‌గ్రీన్‌గా పేరొందిన స్టైల్. వాటిలో .. అసిమెట్రిక్ మిర్రర్ స్టైల్ నేడు ఫ్యాషన్ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అద్దం కేవలం స్టైల్ కాదు ఒక స్టేట్మెంట్. ర్యాంప్ పై రిఫ్లెక్షన్ప్రముఖ డిజైనర్లు గౌరవ్ గుప్తా, వ్యాన్ హెర్పెన్ వంటి వారు మిర్రర్ వర్క్ డిజైన్స్‌తో తమ హవా కొనసాగించారు. గాలా, కాన్స్ రెడ్ కార్పెట్లలోనూ సెలబ్రిటీలు మిర్రర్ షైనింగ్ గౌన్స్‌లో మెరుస్తున్నారు. స్ట్రీట్ స్టైల్ఈ ట్రెండ్ ఫ్యాషనబుల్‌గా కనిపించడానికే కాదు, జీన్స్ టాప్స్ లో అసిమెట్రిక్ హేమ్ లైన్, మిర్రర్ బెల్ట్స్, శాలువాలు, బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ఫుట్‌వేర్ .. ఇలా అన్ని యాక్సెసరీస్ లో ఈ బిగ్ మిర్రర్ టచ్ కనిపిస్తోంది.అద్దం, డిజైన్‌తో డ్రెస్ స్పెషల్‌గా ఉంటుంది కాబట్టి ఇతర హంగులేవీ అక్కర్లేదు. మదిని మరింత మెరుపుగా సింగారించడానికి అద్దం వర్క్ కొత్తగా రూపుకడుతుంది. పర్ఫెక్ట్ షేప్‌తో డ్రెస్ అందంగా కనిపిస్తుంది అనేది ఒక కోణం మాత్రమే. నిజమైన ఫ్యాషన్ అనేది మిర్రర్ డిజైన్స్‌లోనూ ఉంటుంది. అసిమెట్రికల్ బ్యూటీని అర్థం చేసుకునే వారికి ఇది ఓ వేడుక కూడా. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంగీత్ వర్మ్ మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్‌లో మేటిగా నిలిచారు. రెడ్ కార్పెట్, వివాహ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ఈ మిర్రర్ డ్రెస్సులు మరింత అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. (చదవండి: Prajakta Koli : అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌గా ఆమె..! వన్ అండ్ ఓన్లీ..) -
మెట్రోలో ఇలాంటి అనుభవం మీకు ఎదురైందా?
ప్రస్తుత తరుణంలో మొబైల్ వినియోగం పెరిగిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, ముఖ్యంగా రీల్స్ వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ అనేకన్నా దేహంలో ఒక భాగంగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది. అయితే ఈ డిజిటల్ కల్చర్ ఇప్పుడు ప్రైవేటు స్పేస్ నుంచి బహిరంగ ప్రదేశాల్లోనూ విస్తరిస్తూ, ఇతరులకు అసౌకర్యం కలిగించే స్థితికి చేరింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ వంటి షార్ట్ వీడియోలు చూస్తూ ప్రజలు అందులో మునిగిపోతున్నారు. ఇది వారి వ్యక్తిగత విషయంగా అనిపించినా, పబ్లిక్ ప్రదేశాల్లో హెడ్సెట్ లేకుండా పెద్ద సౌండ్‌తో వీడియోలు చూడటం వల్ల అది చుట్టుపక్కల వారికి న్యూసెన్స్‌గా మారుతోంది. వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఈ నిర్లక్ష్యం మానసిక, సామాజిక ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోటెక్నాలజీ అనేది మనకు ఓ వరం. కానీ దాని వాడకంలో బాధ్యత లేకపోతే అదే వరం నాశనానికి దారి తీస్తుంది. మొబైల్ మన జీవితంలో భాగం కావొచ్చు కానీ అది ఇతరుల జీవన శైలిని దెబ్బతీయకుండా ఉండాలంటే మనకు ఒక పరిమితి, పరిపక్వత, పరివర్తన అవసరం. మొబైల్ వినియోగంలో మైండ్‌ఫుల్‌నెస్ (mindfulness) కలిగి ఉండటం కాలానుగుణంగా మారిన అవసరం. అంతే కాదు, అది మనిషిగా మన విలువల్ని చూపించే మోడరన్ మెచ్యూరిటీ కూడా. తోటివారి మనస్థితిని పట్టించుకోకుండా వారి అశాంతికి కారణమవ్వడం నిర్లక్ష్యమే కాదు.. వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే.మెట్రోలో మొబైల్ మ్యూజిక్ షో! ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. వర్కింగ్ క్లాస్, విద్యార్థులు, వృద్ధులు ప్రయాణించే మెట్రోలో కొంతమంది యువత రీల్స్ చేస్తూ చుట్టుపక్కల వారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. ఉద్యోగాల ఒత్తిడి నుంచి అలసిపోయిన ప్రయాణికులు విశ్రాంతి కోరుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న వారు పెద్దగా ఫోన్ సౌండ్‌తో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వల్ల వారి మానసిక ప్రశాంతత దెబ్బతింటోంది. సింపుల్‌గా ఒక హియర్‌ఫోన్స్/హెడ్సెట్ పెట్టుకుంటే సరిపోతుంది అనే పరివర్తన అవసరం. హెడ్సెట్ (headset) పెట్టుకున్నవారితో మరో సమస్య.. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా మెట్రో డోర్‌కు అడ్డంగా నిలబడటం, దారి మధ్యలో ఎటూ పోకుండా ఇబ్బంది కలిగించడం వంటి సమస్యలు సృష్టిస్తున్నారు.పరిష్కార మార్గాలు.. అవగాహన కార్యక్రమాలు: ప్రభుత్వం, టెక్ కంపెనీలు, మున్సిపాలిటీలు కలిసి ‘మైండ్‌ఫుల్ మొబైల్ యూజ్’ గురించి అవగాహన పెంచాలి. సైలెంట్ జోన్లు: మెట్రోల్లో, హాస్పిటల్స్‌లో, దేవాలయాల్లో మొబైల్ సైలెన్స్ జోన్లను స్పష్టంగా సూచిస్తూ బోర్డులు పెట్టాలి. యాప్స్‌తో నియంత్రణ: కొంతమంది యూజర్లు తమ మొబైల్ యూజ్ను ట్రాక్ చేసి నియంత్రించడానికి ‘స్క్రీన్ టైమ్’, ‘ఫోకస్ మోడ్’ వంటి ఫీచర్లను వినియోగించవచ్చు. స్వీయ నియంత్రణ: అన్నింటికన్నా ప్రధానమైంది స్వీయ నియంత్రణ.. ప్రతి ఒక్కరూ తమ వినియోగాన్ని బాధ్యతగా మలుచుకోవాలి. అది మన సమాజానికి, తనకు తాను ఇచ్చే గౌరవం కూడా.ప్రభావాలు.. మానసిక అసౌకర్యం: నిర్లక్ష్యంగా వినిపించే సౌండ్లు ఇతరులను డిస్టర్బ్ చేస్తాయి. ఇది ప్రత్యేకించి చదువుకునే విద్యార్థులు, శారీరకంగా అలసిపోయిన ఉద్యోగులు, మానసికంగా టెన్షన్లో ఉన్నవారికి తీవ్రంగా నష్టాన్ని, విరక్తిని కలిగిస్తుంది.పరిసరాల పట్ల బాధ్యత కోల్పోవడం: దేవాలయాల్లో, ఆసుపత్రుల్లో, థియేటర్లలో మానవీయ బాధ్యత లేకుండా మొబైల్ వాడకం వల్ల సామాజిక విలువలు మసకబారుతున్నాయి.సామాజిక దూరం: ఒకే ప్రదేశంలో ఉన్నా, తన ఫోన్లో మునిగిపోయే వ్యక్తి చుట్టూ ఉన్నవారితో కనెక్షన్ కోల్పోతాడు. దీని వల్ల సంబంధాలు బలహీనపడతాయి.ఈ నిర్లక్ష్యపు కల్చర్‌కి కారణాలు స్వీయ నియంత్రణ లోపం: వ్యక్తిగత ప్రపంచం నుంచి పబ్లిక్ స్పేస్‌లోకి వస్తున్నామంటే కొన్ని నైతిక విలువలు ఉంటాయనే స్పృహ కలిగి ఉండాలి. మన నిర్లక్ష్యం ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించినా వ్యక్తిగా విలువ కోల్పోవడమే. డిజిటల్ డోపమైన్: రీల్స్, షార్ట్ ఫార్మ్ కంటెంట్ మానసికంగా వినోదం కలిగించడంతో పాటు డోపమైన్ (dopamine) విడుదలకు కారణమవుతుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు స్క్రీన్‌కి ఆకర్షితులవుతారు. ఎంత సమయం వారు అందులో మునిగిపోయారో వారికే తెలీదు. అలాంటిది ఇతరుల ఇబ్బందులను ఎలా గుర్తించగలుగుతారు. నివేదికలు లేకపోవడం: పబ్లిక్ ప్లేస్‌లలో మొబైల్ వినియోగంపై కచ్చితమైన నియమాలు లేకపోవడం కూడా ఈ అలవాట్లను పెంచుతోంది. సామాజిక అవగాహన లోపం: ఇతరుల మనస్థితిని అర్థం చేసుకోకుండానే వ్యక్తిగత వినోదం కోసం మిగతావారిని అసౌకర్యానికి గురిచేస్తున్నారు.చదవండి: కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా? పబ్లిక్ స్పేస్‌లోనూ.. హాస్పిటల్స్, రెస్టారెంట్లు, దేవాలయాలు, పార్కులు, థియేటర్లు, ఫంక్షన్ హాల్స్.. ఇవన్నీ ప్రజలకు ఆరోగ్యం, మానసిక విశ్రాంతి, భక్తి, ఆనందం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగపడే ప్రదేశాలు. కానీ ఇక్కడ సైతం మొబైల్ స్క్రీన్ కల్చర్ తలెత్తుతోంది. రెస్టారెంట్లో ఆర్డర్ వచ్చే వరకు ఫోన్ స్క్రోల్ చేయడం, ఆలయంలో మంత్రాల మధ్యలో రింగ్టోన్లు వినిపించడం, మరీ ముఖ్యంగా హాస్పిటల్ వార్డుల్లో రీల్స్ ప్లే అవడం వంటి ఘటనలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. Full volume Tollywood beats? Not in the Metro!Idi public space mama, not your personal DJ zone.Fellow passenger's glare said it all – "Headphones pettukora babu!"🎧 Got your headphones ready for the next ride?Tell us, what’s on your Metro playlist? Drop it in the comments!… pic.twitter.com/K6wr8ath2U— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 3, 2025 -
రూ. 1.6 కోట్ల జీతం, అయినా అమెరికాలో ఇండియన్ టెకీ జీవితం ఇదీ!
అమెరికాలో కొలువు, అదీ ఐటీ కంపెనీలో ఉద్యోగం అనగానే ఏడంకెల జీతం... లైఫ్ సెట్ అనుకుంటాం. కోట్ల రూపాయలు, తక్కువలో తక్కువ లక్షల రూపాయల ప్యాకేజీ, లగ్జరీ లైఫ్ అని భావిస్తాం కదా. కానీ న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ యువతి అనుభవం వింటే మాత్రం ‘అవునా.. నిజమా’అని ఆశ్చర్యపోక తప్పదు. ప్రముఖ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్‌లో న్యూయార్క్ నగరంలో టెకీగా పనిచేస్తోంది ఇండియాకు చెందిన మైత్రి మంగళ్. ఆమె జీతం ఏడాదికి రూ.1.6 కోట్లు. పాడ్‌కాస్టర్, రచయిత కుశాల్ లోధాతో, మంగళ్ అమెరికాలో జీతం, నెలవారీ ఖర్చుల గురించి చేసిన చర్చ ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. నెల ఖర్చులు, తిండి, ఇంటి అద్దె ఖర్చులతో పోలిస్తే ఇది ఎంత అంటూ తన గోడును వెళ్లబోసుకుంది.ఈ వివరాలను లోధా సోషల్ మీడియాలో షేర్ చేశారు. "Googleలో సగటు ప్యాకేజీ ఎంత? అని Googleలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైత్రిని అడిగాను. సాధారణంగా రూ.1.6 కోట్లు ఉంటుందని పంచుకుంది" అని లోధా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్‌లో అపార్ట్మెంట్ అద్దె సుమారు రూ.2.5 లక్షలు. నెలవారీ ఖర్చురూ.4.2 లక్షలు. ఇది కాకుండా బయట తినడం, కిరాణా సామాగ్రి , ఎంటర్టైన్మెంట్ సహా ఇతర ఖర్చులు సుమారు రూ. 85,684-రూ. 1,71,368 వరకు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు మరో రూ. 8,568-రూ. 17,136 దాకా అవుతాయి. View this post on Instagram A post shared by Kushal Lodha (@kushallodha548) ఇది చూసిన నెటిజన్లు ఔరా అంటూ నోరెళ్ల బెట్టారు. భారీ జీతం, న్యూయార్క్లాంటి గ్లోబల్ నగరాల్లో అసలైన జీవితం అంటూ కమెంట్స్ చేశారు.అన్నట్టు ఈ వీడియోనుమైత్రి మంగళ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమెకు 173 వేల మంది అనుచరులు ఉన్నారు. -
డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...
మాతృత్వపు మధురిమ ఎవరికైనా అపురూపం. ఆ క్షణాలు కాబోయే తల్లులందరికీ భావోద్వేగభరితంగా ఉంటాయి. క్షణం క్షణం ఉత్కంఠ.. ఒకపక్క భరించలేని ప్రసవ వేదన..మరోవైపు వచ్చే బుడతడు కోసం ఆస్పత్రి బయట బంధువుల పడిగాపులు..అదంతా ఓ అపురూపమైన క్షణం. మర్చిపోలేని ప్రసవానుభవం కూడా. అలాంటి మధుర క్షణాలను చాలా రియలిస్టిక్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్‌ని త్వరగా చదివేయండి మరీ..మలయాళ నటుడు, బిజేపీ నాయకుడు కృష్ణ కుమార్ కుమార్తె దియా కృష్ణ నెట్టింట తన ప్రసవ అనుభవానికి సంబంధించిన వీడియోని షేర్ చేసుకున్నారు. అది కేవలం డెలివరీ సమయంలోని పరిస్థితులు కాదు..మొత్తం ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి నొప్పులు మొదలు..బిడ్డను కని డిశ్చార్జ్ అయ్యి వచ్చే వరకు మొత్తం తతంగాన్ని ఆమె చాలా చక్కగా రికార్డు చేశారు. ప్రతి దృశ్యం కదిలించేలా ఉంటుంది. ప్రసవ సమయంలో ఇలా ఉంటుందా అనే ఫీల్‌ని తెప్పిస్తుంది. ఇక్కడ దియా డెలివెరికి వెళ్లే క్షణంలో అందంగా మేకప్ వేసుకుని మరీ వెళ్తుంది. ఎందుకంటే మొటిమలతో ఉన్న ముఖంతో నా బిడ్డకు స్వాగతించడం ఇష్టం లేదంటూ చెప్పడం వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె మొటిమలు చెడ్డవి కావు గానీ..నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకే ఇలా అని చెబుతుంది వీడియోలో. ఆ వీడియోలో భర్త, ఆమె తల్లిదండ్రులు ప్రసవ వేదన సమయంలో ఓదార్చడం, వైద్య సిబ్బంది మద్దతు తదితర దృశ్యాలన్ని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. చివర్లో ఆమె చేతుల్లో బిడ్డను పెట్టే అపురూపమైన క్షణం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దియా ఇందులో ఆధునిక వైద్య విధానం ఎలా ఉందో తెలియజేసేందుకే ఇదంతా షూట్ చేసినట్లు చెప్పుకొచ్చారామె. ఇక ఇక్కడ దియాకి సుఖ ప్రసవం అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ వీడియో క్లిప్ షేర్ చేసిన మూడు రోజుల్లోనే ఆరు మిలయన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, నెటిజన్లు మాత్రం అందరిలా కాకుండా ప్రతీది రియలిస్టిక్‌గా ప్రసవ సమయంలో ఉండే ఉద్విగ్న స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారని ఆమెని ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఇలాంటివి ఎందుకు చిత్రీకరిస్తారని మండిపడుతూ పోస్టులు పెట్టారు. (చదవండి: 71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..! మనవరాలి కోసం..) -
71 ఏళ్ల వయసులో సీఏ అయ్యాడు..!
విద్యకు బ్రేక్ అనేది ఉండదు. చదవాలన్నా కోరిక బలంగా ఉంటే చాలు వయసు పెద్ద మేటర్ కాదని గతంలో చాలామంది ప్రూవ్ చేశారు. వాళ్లంతా ఏవో కారణాలతో చదువుకోలేకపోతే..ఆయా కోర్సులను పూర్తి చేసి తమ డ్రిమ్‌ని నిజం చేసుకున్నారు. ఈ తాతయ్య అలాకాదు ఏకంగా అత్యంత కఠినతరమైన సీఏని 71 ఏళ్ల వయసులో పూర్తి చేసి శెభాష్ అనిపించుకున్నాడు. అదికూడా మనవరాలి కారణంగా ఈ ఘనత సాధించాడు ఈ తాతయ్య. స్ఫూర్తిదాయకమైన అతడి స్టోరి ఏంటో చూద్దామా..!.ఆయనే తారా చంద్ అగర్వాల్. ఆ తాతయ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (SBBJ) మాజీ ఉద్యోగి. రిటైర్డ్ వయసులో అందరిలో రెస్ట్ తీసుకోకుండా, ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలు రాయాలనుకోవడం విశేషం. ఆ వయసులో ఏ పుణ్య క్షేత్రాలు, లేదా మనవరాళ్లు, మనవళ్లతో కాలక్షేపం చేస్తారు. కానీ ఈయన అలా కాదు. ఆ విశ్రాంతి సమయంలో తన డ్రీమ్ నెరవేర్చుకుని స్ఫూర్తిగా నిలిచాడు. నిజానికి ఆయన ఈ ఎగ్జామ్ రాయడానికి కారణం తన మనవరాలేనట. ఆమె సీఏ చదువు కోసం సహాయం చేసేవారట. ఆమెకు అకౌంట్స్‌పై ఉండే సందేహాలను తీరుస్తూ..తెలియకుండానే ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరిగిందట. అలా ఆ జిజ్ఞాస కాస్తా విద్యా వృత్తిగా మారి చివరకు సీఏ పరిక్షలకు ప్రిపేరవ్వాలనే సంకల్పానికి దారితీసింది. ఆ విధంగా ఆయన సీఏ అయ్యాడు. ఈ ఏడాది జులై6న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫైనల్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో తారా చంద్ వజయవంతం గాపూర్తి చేసి..అందరిని ఆశ్చర్యపరిచాడు. పైగా యువతకు ఆదర్శంగా నిలిచారాయన. చార్టర్డ్ అకౌంటెంట్ నిఖిలేష్ కటారియా స్ఫూర్తిదాయకమైన కథను లింక్డ్ఇన్లో పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఈ ఏడాది సీఏలో మొత్తం 14,247 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఐసీఏఐ వెల్లడించింది. (చదవండి: డిటాక్స్..రిలాక్స్..! కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా..!) -
డిటాక్స్..రిలాక్స్..! కాసేపు టెక్నాలజీకి బ్రేక్ ఇద్దామా..!
ఫోన్ లేదు, ల్యాప్‌టాప్ లేదు, గాడ్జెట్లు లేవు.. ప్రశాంతతను ఆస్వాదిస్తూ కామ్‌గా తోచిన పని చేసుకుంటూ.. తలచుకుంటేనే ఓహ్ అనిపిస్తోంది కదా.. ప్రస్తుతం నగరంలో కొందరు అనుసరిస్తున్న మార్గం ఇదే.. డిజిటల్ డిటాక్స్. ఫోన్లు మన జీవితంలో ఒక అనివార్యమైన భాగం అయినప్పుడు నడిపించే అవయవాల్లో ఒకటిగా మారిపోయినప్పుడు.. డిజిటల్ డిటాక్స్ ఖచ్చితంగా చాలా కష్టమైన పని అనేది నిస్సందేహం. అయితే అది అందించే ప్రయోజనాలు ఇతర మార్గాల ద్వారా అసాధ్యం అనేది కూడా నిర్వివాదమే. ‘గాడ్జెట్లు, స్క్రీన్స్ లేదా ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్ణిత సమయం వరకు ఉపయోగించకుండా ఉండటమే.. డిజిటల్ డిటాక్స్’ అని గేట్‌వే ఆఫ్ హీలింగ్ వ్యవస్థాపకులు, మానసిక వైద్యులు డాక్టర్ చాందిని నిర్వచిస్తారు. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, రీసెట్ చేయడానికి మధ్యన సాగే ఒక సంక్లిష్టమైన అభ్యాసం. సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోషల్ మీడియా ఇమెయిల్స్ నుంచి డిస్కనెక్ట్, అలాగే ఆఫ్‌లైన్ ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఉద్ధేశించింది అంటున్నారామె. అధిక డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చే మానసిక అలసటను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రయోజనాలెన్నో.. శారీరక, మానసిక ఆరోగ్యంపై డిజిటల్ డిటాక్స్ సానుకూల ప్రభావాలను చూపుతుందంటున్న క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ దినిక ఆనంద్ మాట్లాడుతూ.. ‘ఆన్లైన్లో ఎంత సమయం గడుపుతున్నారనే దానిపై ఆధారపడి డిజిటల్ డిటాక్స్ నిర్దిష్ట ప్రయోజనాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు’ అంటున్నారు. అయితే డిజిటల్ డిటాక్స్ మనకు చాలా సమయాన్ని తిరిగి ఇస్తుంది. నిర్ణిత వ్యవధిలో సమాచారం నోటిఫికేషన్స్ సహా డిజిటల్ దాడి నుంచి రక్షిస్తుంది’ అంటారామె. డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలను ఢిల్లీకి చెందిన ప్రముఖ మనస్తత్వవేత్త కౌన్సిలర్ డాక్టర్ షీనా సూద్ ఇలా వివరిస్తున్నారు. డిజిటల్ డిటాక్స్ సాధ్యమేనా? ‘స్టోర్లలో ఫోన్లతో చెల్లింపులు, ల్యాప్‌టాప్‌లు టాబ్లెట్లతో పనిపాటలు, యాప్‌ల ద్వారా సంప్రదింపులు.. కోవిడ్ తర్వాత సమూలమైన జీవిత–సాంకేతికత కనెక్షన్ ఏర్పడింది. సాంకేతికతపై పూర్తిగా ఆధారపడే నేటి ప్రపంచంలో, డిజిటల్ డిటాక్స్ హడావుడిగా ప్రారంభిస్తే గందరగోళం ఏర్పడవచ్చు. సో, చిన్నగా ప్రారంభించవచ్చు. ముందస్తుగా ఒక వారం కాకపోయినా, ఒక రోజుతోనైనా మొదలు పెట్టవచ్చు అంటున్నారు సైకాలజిస్ట్‌లు. ‘డిటాక్స్’ సక్సెస్ కావాలంటే.. కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు సహా సంప్రదించాల్సిన వారందరికీ నిర్ణయాన్ని తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యామ్నాయ సంప్రదింపు మార్గాల్ని సిద్ధం చేయాలి. డిజిటల్ కమ్యూనికేషన్ లేదా యాక్సెస్ అవసరమయ్యే వ్యాపార లేదా వ్యక్తిగత విధులు ఉంటే, వేరొకరికి కేటాయించడం లేదా డిటాక్స్ తర్వాత రోజులకి వాయిదా వేయాలి. డిజిటల్ కమ్యూనికేషన్‌కు అందుబాటులోకి వచ్చే సమయం గురించి తెలిపే ఆటోమేటిక్ ఇమెయిల్ వాయిస్‌మెయిల్ ప్రత్యుత్తరాలను సెటప్ చేయాలి. డిజిటల్ గాడ్జెట్ల వైపు ప్రలోభాలను నివారించడానికి, ఆసక్తికరమైన ఆఫ్‌లైన్ కార్యకలాపాలు, అభిరుచులు, విహారయాత్రలను ప్లాన్ చేసుకోవాలి. ఉచిత వైఫై ఉన్న కేఫ్‌లు లేదా టీవీ స్క్రీన్లతో కూడిన పబ్లిక్ ప్రాంతాలు వంటి డిజిటల్ వైపు నడిపించే ప్రదేశాలు లేదా పరిస్థితులను నివారించాలి. ప్రోత్సహించడానికి ఉత్సాహంగా ఉంచడానికి స్వల్ప వ్యవధుల్లో డీటాక్స్‌కు సంబంధించి సక్సెస్ పారీ్టలను జరుపుకోవచ్చు. కొత్త విశేషాలను కోల్పోతామనే భయంతో ఫోన్లకు అతుక్కుపోవడం ఆహారం, వ్యాయామం, నిద్ర షెడ్యూల్‌పై ప్రభావం చూపుతోంది. డిజిటల్ డిటాక్స్ ఆరోగ్యకరమైన అలవాట్లను పునరుద్ధరిస్తుంది. గాడ్జెట్లు విడుదల చేసే రివార్డ్ హార్మోన్ డోపమైన్ మంచి అనుభూతిని ఇవ్వడంతో దాన్ని పదేపదే కోరుకుంటాం. అయితే ప్రతి స్క్రోల్ మన మెదడులోని అదే ప్రాంతాలలో డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి హానికరమైన పదార్థాలకు ప్రతిస్పందిస్తాయి. డిజిటల్ డిటాక్స్ మనం ఈ వ్యసనం వలలో పడకుండా సహాయపడుతుంది.అవాంఛనీయ ప్రమాణాలను నిర్ణయించుకోడానికి, అనారోగ్యకరమైన ఎక్స్పోజర్లకు దారి తీసే సోషల్ మీడియాతో తెగతెంపులు మన స్వీయ– ఇమేజ్ను పునరుద్ధరించడానికి, నిజమైన స్వభావాన్ని అంగీకరించడానికి మనకు అవకాశం లభిస్తుంది. డిజిటల్ పరికరాలు విడుదల చేసే నీలి కాంతి శరీరపు సాధారణ నిద్ర–మేల్కొలుపు చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. నిద్ర నాణ్యత కోల్పోయేలా చేస్తుంది. డిజిటల్ డిటాక్స్‌తో ప్రశాంతమైన నిద్ర సాధ్యం. గార్డెనింగ్, బుక్ రీడింగ్.. వంటి ఆరోగ్యకర అభిరుచులను తిరిగి తెస్తుంది. (చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..) -
ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..
క్లాస్‌లో బెంచీలుంటాయి. ఫ్రంట్ బెంచ్‌లపై కూచునేవారు...బ్యాక్బెంచ్లకు పరిమితమయ్యేవారు... బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లపై అందరికీ చిన్నచూపే.వారు గొడవ చేస్తారని సరిగా చదవరని...అసలు బ్యాక్బెంచ్లు లేకుండా చేస్తే బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లు ఉండరు కదా అనిచెప్పిన సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్లను మార్చింది. ‘శనార్థి శ్రీకుట్టన్’ అనే సినిమా చూసిస్కూళ్లలో బెంచీలను సర్కిల్‌గా వేస్తున్నారు. ఇది అందరూ మెచ్చుకుంటున్నారు. దేశమంతా రావాల్సిన మార్పు ఇది. కొల్లం జిల్లాలోని ఆర్.వి.వి. సెకండరీ హయ్యర్స్కూల్కు ఆ రోజు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. రౌండ్‌గా వేసి ఉన్నాయి. పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. దానికి కారణం రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ చూస్తూ ఉండటమే. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఎందుకు?ఆ సినిమా కథ ఏమిటి?కె.ఆర్.నారాయణన్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని సెవన్త్ సి సెక్షన్లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్’. శ్రీకుట్టన్ అనే కుర్రవాడు ఇంటి పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లంతా అల్లరి గ్యాంగ్ అని క్లాస్‌లో ఫ్రంట్ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. వీరు దేనికీ పనికి రారన్నది టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్ స్కూల్ ఎలక్షన్లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. పైకి ఇదే కథ అనిపించినా ఇది కాదు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ చెప్పాలనుకున్నది. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ... దీనిని ముందు నుంచే మార్చాలి అని చెప్పదలుచుకున్నాడు దర్శకుడు.1996లో కేంద్రం చెప్పినా...క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతి΄ాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం ఆనవాయితీ. వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది. (చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు! ) -
ఆకర్షణ అశాశ్వతం... కుటుంబ బంధమే శాశ్వతం!
డాక్టరు గారు! నేను కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నాను. అతనికి కూడా వివాహం అయింది. పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాలనుండి మా ఈ బంధం కొనసాగుతోంది.. శారీరకంగా కన్నా మానసికంగా మేము ఎక్కువ దగ్గర అయ్యాము. కానీ ఈ మధ్య కాలంలో అతను వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం, నన్ను అంతగా పట్టించుకోకపోవటం నన్ను చాలా మానసిక వేదనకు గురిచేస్తోంది. ఆకలి, నిద్ర బాగా తగ్గిపోయాయి. మనసంతా చికాకుగా, ఏడుపు వస్తుంది. అశాంతితో నరకం అనుభవిస్తున్నాను. అతను నాకు ఏమీ కాడు అని తెలిసినా తట్టుకోలేకపోతున్నాను! ఆఖరికి ఆత్మహత్మ ఆలోచనలు కూడా వస్తున్నాయి. దయచేసి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను! – ఒక సోదరి, గుంటూరుమీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు తీవ్రమైన మనోవేదన (డిప్రెషన్)కు లోనయినట్లుగా అర్థం అవుతోంది. జీవితంలో ఒక్కోసారి తప్పటడుగులు వేయడం సహజం. మీకు మంచి భర్త, పిల్లలు ఉన్నా, ఆ వ్యక్తికి భార్య పిల్లలున్నారని తెలిసి కూడా సంబంధం పెట్టుకున్నారు! ఒక్కొక్కసారి భార్యా భర్తల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చి అసంతృప్తికి లోనయినవారు, ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశ ముంటుంది! ఇప్పుడా వ్యక్తి తన భార్యను, మిమ్మల్ని కాదని ఇంకా మూడోవ్యక్తితో, కొత్తగా రిలేషన్ షిప్ పెట్టుకున్నాడంటే అతని వ్యక్తిత్వమేంటో మీకీపాటికి తెలిసే ఉంటుంది. ఇప్పటికైనా మించియిందేం లేదు, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలోనే మనిషి ఔన్నత్యం బయటపడుతుంది. ఒక వేళ మీ విషయం మీ భర్తకు తెలిస్తే మీ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అంతా ‘మన మంచికే ’ అని ‘ఆత్రేయ’ గారు అన్నట్లు, ఆ మూడో వ్యక్తి వల్ల ఒక విధంగా మీకు, మీ కుటుంబానికి, మంచి జరిగినట్లయింది. మీరు మీ మనోవేదనలోంచి త్వరగా బయటపడేందుకు మీ దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ని కలిసి మీ కుంగుబాటును తగ్గించేందుకు కొన్ని మందులు అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’, మీ భార్య భర్తల మధ్య ఏదైనా అంతరాలుంటే సరిదిద్దుకునేందుకు ‘కపుల్ థెరపీ’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా మీ సమస్యలోంచి త్వరగా బయటపడి మీలో మానసిక ప్రశాంతత, సమస్యను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వచ్చేలా చేయవచ్చు. కాలమే మనసుకు తగిలిన గాయాలను మాన్పుతుంది! మనసైనా, మనిషైనా, మనది కానిది, ఎన్నటికీ మనది కాబోదనే జీవిత సత్యాన్ని గుర్తుంచుకోవాలి! ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: 'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..) -
సెలబ్రిటీల పెట్స్ : లైఫ్‌స్టైల్‌గా మారిన పెట్స్ పెంపకం
గతంలో సినిమా సెలబ్రిటీలు వారి లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, కార్లు, ఇంటీరియర్స్‌తో వార్తల్లో ఉండేవారు. కానీ ప్రస్తుతం పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల కుక్కలు ఇంటర్వ్యూలకు, షూటింగులకు, ఫొటోషూట్లకు, ఇతర ఈవెంట్లకు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీటి ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ట్రెండ్ మాత్రమే కాదు.. వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లా మారిపోయింది. – సాక్షి, సిటీబ్యూరో రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ (ఫ్రెంచ్ బార్బెట్)ను ఎంతో ప్రేమగా పెంచుతున్నారు. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన రామ్‌చరణ్ తన మైనపు విగ్రహానికి తన కుక్కతో కలిసి ఉన్న స్టైలిష్ పోజ్ మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇలా ఒక్క పెట్ డాగ్‌ను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం చరిత్రలో రెండోసారి మాత్రమని వివరించారు. ఉపాసన పలు వేదికలపై యానిమల్ థెరపీ, పెట్ పేరెంటింగ్ వంటి అంశాలపై తరచూ మాట్లాడతారు. కుక్కలతో కలిసి తీసుకున్న ఫొటోలు తరచూ ఇన్‌స్టాలో షేర్ అవుతుంటాయి. ఆత్మీయమైన అమల–నాగార్జున.. ప్రముఖ సినీతార, అక్కినేని నాగార్జున సతీమణి అమలకు మూగజీవాల పైన ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లూక్రాస్ సొసైటీతో మూగజీవాల సంరక్షణకు ఎన్నో యేళ్లుగా సేవలందిస్తున్నారు. తన ఇంట్లో కూడా కుక్కలను ప్రత్యేకంగా పెంచుతుంటారు. ఇందులో పలు బ్రీడ్ డాగ్స్‌తో పాటు స్ట్రీట్ డాగ్స్ సైతం ఉన్నాయి. నాగార్జున–అమల పెళ్లి తరువాత రెండు పప్పీలను తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనయుడు అఖిల్ కూడా ఓ ఇంటర్వ్యూల్లో కుక్కతో సందడి కుక్క, పక్షి.. ఓ పూరీ.. ఖరీదైన బ్రీడ్ కుక్కలు, పక్షులు పెంచడంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. వాటి కోసమే లక్షలు ఖర్చు చేస్తాడన్న విషయం విధితమే. పూరీ వద్ద ఖరీదైన కుక్కలు ఉన్నాయి. గతంలో తన ఆఫీస్‌లో విభిన్న రకాల పక్షులు అక్కడికి వచ్చేవారిని ఆశ్చర్యపరిచేవి. సోషల్ మీడియాలోనూ వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!రాజకీయ రంగంలోనూ.. : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన పెంపుడు కుక్కతో ఉన్న పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సాదు జంతువులు తమ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీని తీసుకుని యజమానులకు మేలు చేస్తాయని, ఈ విషయాన్ని తాను నమ్ముతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కష్టకాలంలో తనకు తోడ్పాటుగా ఉందని ఆమె వెల్లడించారు. స్టార్ డాగ్స్.. వీరితో పాటు తెలుగు సినీ రంగంలో నాని ‘స్మైలీ’తో ఉన్న అనుబంధాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. సినీతార సాయిపల్లవి, ఇతర సెలబ్రిటీలు ఇన్‌స్టాలో ప్రత్యేక ఖాతాలు కూడా మెయిటేన్ చేస్తున్నారు.సమంత ‘హష్ అండ్ శాష’.. : సమంతకు కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన రెండు డాగ్స్ హాష్ అండ్ శాషతో పలుమార్లు సందడి చేశారు. సోషల్‌మీడియాలోనూ వైరల్‌గా మారారు. తన కుక్కను కొన్ని సందర్భాల్లో షూటింగ్స్‌కు కూడా తీసుకెళ్లారు.పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్.. తన కుక్కను ‘పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్’గా పిలుచుకునే చార్మీ కౌర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూలకు కుక్కను వెంట తీసుకొచి్చన సందర్భాలున్నాయి. పెట్ డాగ్‌తో సెలీ్ఫలు, స్టైలిష్ డ్రెస్సులతో తీసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. -
పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత..! ఇంటర్ ఫెయిల్ నుంచి ఏకంగా ఐఐటీలో..
చుట్టూ దారుణమైన ఆర్థిక పరిస్థితి..అయినా బాగా చదవాలన్న గట్టి లక్ష్యం. పోనీ ఇంత కష్టపడుతుంటే..వచ్చిపడే కష్టాల కెరటాలు వెరసీ విరుచకుపడ్డ అనారోగ్యం ఇవేమి ఆ వ్యక్తి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సాధించాలేవ్ అంటూ పదేపదే అతడి గమ్యాన్ని చేరనివ్వకుండా చేస్తున్న సమస్యలకు తన గెలుపుతో గట్టి సమాధానం చెప్పాడు. ల్యాప్‌టాప్ వంటి సకల సౌకర్యాలు గానీ, ఆర్థికంగా భరోసా వంటివి ఏమి లేకపోయినా..అజేయంగా విజయతీరాలకు చేరుకోవచ్చు అని చూపించి స్ఫూర్తిగా నిలిచాడు. అతడే 19 ఏళ్ల హర్ష గుప్తా. మహారాష్ట్రలోని థానే జిల్లాకి నివాసి. అతడి తల్లిదండ్రుల జీవనాధారం పానీపూరీ బండి ఒక్కటే. వారే సంతోష్, రీతా దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు. ఆ ముగ్గురిలో పెద్దవాడే ఈ హర్ష్ గుప్లా. హర్ష తండ్రి పదికూడా పాసవ్వలేదు. అందువల్లే ఆయన తన పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివించాడు. అయితే వారికి వచ్చే ఆదాయానికి పిల్లల చదువుకి అయ్యే ఖర్చుకి పొంతన లేకపోవడంతో విపరీతమైన ఆర్థిక కష్టాలు మధ్య బతుకు సాగించేవారు. అయితే హర్ష చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడు. పదిలో 90.8 శాతం మార్కలతో పాసయ్యాడు. అయితే ఇంటర్‌కి వచ్చేటప్పటికీ రెక్టల్ ప్రోలాప్స్ అనే అరుదైన అనారోగ్య సమస్య బారినపడ్డాడు. దాంతో తరగతులకు సరిగా హాజరుకాలేకపోయాడు. ఫలితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిలయ్యాడు. పైగా చుట్టూ ఉన్న స్నేహితులు నీలాంటి వ్యక్తులు ఐఐటీ వంటి చదువులు అందుకోవడం కష్టం అని ముఖంపైనే చెప్పేసేవారు. అయినా సరే ఎందుకో హర్షకి తనకిది సాధ్యమే అని గెలిచి చూపించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే అది ఎలా అనేది అగమ్యగోచరంగా ఉండేది. ఎలాగైతేనేం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పూర్తిచేసి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌కి సన్నద్ధమయ్యాడు. అందుకోసం నితిన్ విజయ్, మోషన్ ఎడ్యుకేషన్, కోట ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నాడు. అందుకు అవసరమయ్యే డబ్బులకు కొందరు దాతలు సాయం చేయడంతో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అయితే ఎక్కడ ఉండాలన్నది మరో సమస్య. పోనీ పీజీ హాస్టల్ జాయిన్ అవుదామన్నా.. సరిపడా డబ్బులేదు. చివరికి హర్ష ఆ హాస్టల్ యజమానిని బతిమాలుకుని తక్కుడ డబ్బు చెల్లించేలా వసతి ఏర్పరుచుకున్నాడు. ఇన్ని కష్టాలు దాటుకుని జేఈఈకి సిద్ధమవుతుండగా..మరోవైపు అనారోగ్యం తిరగబెట్టింది. దాంతో హాస్టల్ ఖాళీ చేసి తిరిగి ఇంటికి వచ్చేసే పరిస్థితి ఎదురైంది. దాంతో చాలా క్లాస్‌లు మిస్సవ్వడం, మాక్‌టెస్ట్‌ల్లో వెనకబడటం జరిగింది. ఇక లక్ష్యం తనకు చాలా దూరమైపోతోందని, ఆ ఇన్స్టిట్యూట్ హెడ్‌తో తన సమస్య వివరించగా..తన అనారోగ్యానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేయడం గురించి సూచనలిచ్చారు. అలా తొలి ప్రయత్నంలో జేఈఈ మెయిన్స్‌లో 98.59 శాతం సాధించాడు. అయితే అతడి అనారోగ్య దృష్ట్యా తగినంత విశ్రాంతి తప్పని పరిస్థితి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్‌కి పూర్తి స్థాయిలో దృష్టి సారించడం సాధ్యపడలేదు. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌కి అర్హత సాధించలేకపోయాడు. అయితే హర్షకి ఎన్ఐటీ వంటి వాటిల్లో ఆఫర్ వచ్చినా కాదనుకుని ఐఐటీ జాయిన్ అవ్వడమే తన ధ్యేయమని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిపోయాడు. అందువల్లే ఓటమి నైరాస్యం కుంగదీస్తున్నా.. తగ్గేదే లే అంటూ.. మళ్లీ మరోసారి జేఈఈకి ప్రిపరయ్యేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తల్లిదండ్రలు మద్దతు అందించారు. ఈసారి తన ఇంటర్లో సాధించిన మార్కుల ఆధారంగా కోచింగ్ ఫీజ కవర్ అయ్యేలా స్కాలర్షిప్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించి మరి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. బాగా ప్రిపేరయ్యేలా మంచి హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అయితే ఈసారి ఓన్లీ ప్రిపరేషన్ కాకుండా మానస వికాసం పొందేలా పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తూ ప్రిపరేషన్ సాగించాడు. అలా JEE మెయిన్స్ 2025లో 98.94 శాతం సాధించి టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్లుగానే ఐఐటీ రూర్కీలో సీటు సంపాదించాడు.నేర్చుకున్న జీవిత పాఠాలు..చదువుకి అవసరమయ్యే నిధుల కోసం దాతలు ముందుకు వచ్చినప్పుడు కలిగిన సంతోషం తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగేలా ప్రేరేపించిందని అంటున్నాడు హర్ష్ గుప్తాఅనారోగ్యంతో హాస్టల్ వదిలి ఇంటికి బాధగా వస్తుండగా ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. దాంతో స్టేషన్ నుంచి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటే ఓ వృద్ధ దంపుతులు తన కోసం క్యాబ్ బుక్‌చేసి డ్రాప్ చేసిన ఘటన మరువలేనని చెబుతున్నాడు. నిజానికి ఆ దపంతులు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కానీ సాటి మనిషి పట్ల దయ చూపడం అంటే ఏంటో అప్పుడే తెలుసుకున్నానని చెబుతున్నాడు. అలాగే నేనే ఎదుర్కొన్న ఓటములు, అడ్డంకులు..సమస్యలను ప్రతిబంధకంగా చూడకుండా పరిష్కారం అన్వేషించాలి. ఒకవేళ పరిష్కారం తెలియకపోతే ఒత్తిడికి గురికాకుడదు మార్గదర్శకులను అన్వేషించాలి. అంతే తప్ప ఇంతే అని ఆగిపోకూడదు అని తాను తెలుసుకున్న జీవిత సత్యం అని చెబుతున్నాడు. అలాగే చుట్టూ ఉన్న సమాజం, మన స్నేహతులు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు, విమర్శించొచ్చు..కానీ అవేమి తీసుకోకుండా నీ లక్ష్యం వైపు సాగిపోవడం తెలిస్తే గెలుపుని అందుకోవడం చాలా ఈజీ అని చెబుతున్నాడు హర్ష్ గుప్తా. (చదవండి: 'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!) -
స్మృతి ఇరానీ రీఎంట్రీ : ప్రతీ డిజైన్‌లో గౌరంగ్ షా మ్యాజిక్
సుదీర్ఘ వీరామం తర్వాత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ టెలివిజన్ స్క్రీన్‌పై మరోసారి అభిమానులను అలరిస్తున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం భారతీయ టెలివిజన్ చరిత్రలో సంచలనం రేపిన సీరియల్ "క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ" (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) లో తులసి పాత్రతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇపుడు ఈ సీరియల్ సీజన్ 2 ద్వారా మళ్లీ నటించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ బాగానే ఆకట్టుకుంది.జరీ బోర్డర్‌తో కుంకుమ రంగుచీర, నుదిటిన పెద్ద బొట్టు, సాంప్రదాయ టెంపుల్ జ్యువెలరీతో ఆమె ఆమె రూపం, ఆ గంభీరమైన కళ్ళుఅచ్చం అలాగే ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసించారు. ఇది గొప్ప సీరియల్గానే కాదు, తులసి పాత్ర సాంస్కృతిక మూలస్తంభమని తులసి విరానీగా స్మృతి ఇరానీని స్వాగతించారు. అటు ఆనాటి కుంటుంబ విలువలు, బంధాల ప్రాధాన్యతను నేటి తరానికి కూడా చూపించాలన్న లక్ష్యంతో పెట్టుకుని ఈ సీరియన్ సీజన్ 2 రూపొందిస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.ఈ ఐకానిక్ రీ ఎంట్రీని పురస్కరించుకుని, హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ గౌరంగ్ షా ఫ్యాషన్‌కు మించిన వస్త్ర నివాళిని అందించారు. జామ్దానీ, చేతితో నేసిన భారతదేశ సంప్రదాయ వస్త్రాల డిజైనర్‌గా పేరుగాంచిన షా, స్వభావం, మూలాలు, బలానికి ప్రతిబింబించేలా స్మృతి ఇరానీ తులసి పాత్రకు దుస్తులను ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. "గౌరంగ్ షా కేవలం చీరలను డిజైన్ చేయడమే కాదు, ప్రతీ దారంలోనూ సంప్రదాయాలు, ఆధునికతను మేళవించి రూపొందించారు. అతని నైపుణ్యం, నేత కార్మికుల కళాత్మకత ద్వారా భారతీయ చేతిపనుల ఆత్మను సజీవంగా తీసుకువచ్చింది. వారసత్వం, సమకాలీన ఆలోచనల కలకాలం కలిసే ఆయన సృష్టి దుస్తులపై మాయాజాలం అని నటి స్మృతి ఇరానీ కొనియాడారు.తులసి పాత్రంకోసం మన దేశానికి చెందిన సంప్రదాయ చేనేత చీరలను సిద్దం చేశారట. షిఫాన్లో ఫెదర్ లైట్ కంజీవరం, సింబాలిక్ రంగుల్లో చేతితో రంగులద్దిన బంధానీ పట్టు, అరుదైన జామ్దానీ, డబుల్ ఇక్కత్ చీరలున్నాయి. ప్రతి డిజైన్‌కు దానికంటూ ఒక ప్రత్యేక అర్థం ఉంటుందనీ స్మృతి ఇరానీ తులసి పాత్ర, చాలా మంది భారతీయ మహిళ మర్యాదకు చిహ్నంగా మారిందని గౌరంగ్ షా అన్నారు. కాలంతో పాటు కదులుతున్నప్పటికీ తన విలువలకు కట్టుబడి ఉండే ప్రతి స్త్రీని తులసి సూచిస్తుందనీ ప్రతీ చీరను ‘తులసి’ కేరెక్టర్ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తగా డిజైన్ చేశామన్నారు. అంతేకాదు తులసి, స్మృతి ఇరానీ నిజ జీవిత ప్రయాణం రెండింటిలోనూ ప్రతిధ్వనించేలా వీటిని డిజైన్ చేసినట్టు డిజైనర్ గౌరంగ్ షా తెలిపారు. స్మృతి ఇరానీ కోసం వీటిని రూపొందించడం నిజంగా ఆనందంగా ఉందన్నారు.ఇదీ చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే! -
చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు అఖిల్ 14 ఏళ్లకే..!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కుమారుడు పద్నాలుగేళ్ల అఖిల్ ఆనంద్ ( Akhil Anand) గురించి తెలుసుకుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ఏడేళ్ల వయసులోనే 2018లో, తన తండ్రి ఆనంద్ 49వ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కార్డు తయారు చేసిన ఔరా అనిపించుకున్న అఖిల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకోబోతున్నాడు. యువ కళాకారుడిగా తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్, మోర్ఫోజెనిసిస్తో అరంగేట్రం చేయబోతున్నాడు.సోలో ఎగ్జిబిషన్ మోర్ఫోజెనిసిస్ (గణితం, పురాణాలు , ప్రకృతిని పొరల దృశ్య కథనాలలో మిళితంచేసే ఆర్ట్) తో తన కళాత్మక అరంగేట్రం చేయబోతున్నాడు.ఆగస్టు 1న చెన్నైలోని కల్పడ్రుమాలో తన తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నాడు భారతదేశపు గొప్ప జానపద, గిరిజన కళా సంప్రదాయాల రూపాయల్లో, ముఖ్యంగా మధుబని ,గోండ్ చెరియాల్ వార్లి , కాళిఘాట్ - అఖిల్ పవిత్ర జ్యామితి , ఫైబొనాక్సీ ఇలా అద్భుతమైన శైలులతో ఆర్ట్ స్టోరీ ఆధారిత కళాఖండాలను ప్రదర్శించబోతున్నాడు.దీనిపై అఖిల్ ఆనంద్ రాబోయే ప్రదర్శన గురించి మాట్లాడుతూ, , "నేను ప్రపంచాన్ని ఎలా చూస్తానో వ్యక్తీకరించడానికి కళ సహాయపడుతుంది. నేను విభిన్న శైలులు, ఆలోచనలతో పనిచేయడమంటే ఇష్టం. నేను సృష్టిస్తున్న వాటిని పంచుకో బోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కళాభిమానులకు నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నాడు.ఆగస్టు 1 నుంచి 7 వరకు ఈ ప్రదర్శన ఉండబోతోంది. తొమ్మిదేళ్ల వయస్సు నుండి కళాకారిణి డయానా సతీష్ వద్ద శిక్షణ పొందాడు అఖిల్. భారతదేశ వారసత్వ కళలను సంరక్షించడం, ప్రాచుర్యాన్నివ్వడం అతని కళాత్మక లక్ష్యం. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, డేవిడ్ అటెన్‌బరో, జేన్ గూడాల్ లాంటి ప్రముఖుల ప్రేరణతో విద్య- పర్యావరణ అవగాహన సాధనాలుగా తన కళను వినియోగించుకోవడం విశేషం. అంతేకాదు అఖిల్ ఆనంద్ అఖిలిజమ్స్ అనే సంస్థ ఫౌండర్ కూడా. భారతీయ కళను ధరించగలిగే , బహుమతిగా ఇచ్చే రూపాలుగా మార్చే వేదిక. బ్లాక్ ప్రింటింగ్‌లో నాడీ సంబంధిత సవాళ్లతో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతు ఇచ్చే ఫౌండేషన్ హస్తతో కలిసి, అఖిల్ క్రాఫ్ట్, సంరక్షణ , వ్యాపారాన్ని వారధిగా చేసే బెస్పోక్ దుస్తులను డిజైన్ చేస్తాడు. అలాగే ప్రకృతిలో గణిత నమూనాలను అన్వేషించే పుస్తకం ది హార్ట్ ఆఫ్ మ్యాథ్ రచయిత కూడా. -
'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ అమెరికన్ నటి, మోడల్. అమెరికాలో మోడల్‌గా పనిచేసిన ఫక్రీ 2011లో బాలీవుడ్లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం రాక్‌స్టార్ మూవీతో ఉత్తమ మహిళా నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుని దక్కించుకుని అందర్నీ ఆకర్షించింది. నటన పరంగానే గాదు, గ్లామర్ పరంగానూ తనకు సాటిలేరెవ్వరూ అన్నట్లుగా ఆకర్షణీయంగా ఉంటారామె. ఇటీవల సోహా అలీకాన్తో జరిగిన సంభాషణలో తన ఫిట్నెస్ సీక్రెట్స్ వెల్లడించి అందరిని విస్తుపోయేలా చేశారు. తన లుక్ అంతలా ఉండటానికి తొమ్మిది రోజుల కఠిన ఉపవాసమేనని అంటోంది. దాని వల్ల తన ముఖంలో గ్లో వస్తుందని చెబుతోంది. నిజానికి అలాంటి ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా..?. నిపుణులు ఏమంటున్నారంటే..సోహా అలీఖాన్ సంభాషణలో తన లైఫ్‌స్టైల్ గురించి వెల్లడించింది. కెటిల్‌బెల్ వంటి వ్యాయామాలు చేస్తానని, 8 గంటలు నిద్ర తప్పనిసరి అంటూ తన బ్యూటీ రహస్యాలు షేర్ చేసుకున్నారు. అయితే తాను ఏడాదికి రెండుసార్లు కఠిన ఉపవాసం ఉంటానని ఆ సమయంలో అస్సలు ఏమి తినని చెప్పుకొచ్చింది. కేవలం నీళ్లు మాత్రమే తాగుతానని అంటోంది. దాని వల్ల ముఖం పీక్కుపోయినట్లు కనిపించినా..ఒక విధమైన గ్లో వస్తుందని చెప్పుకొచ్చిందామె. అయితే ఇది కాస్తా కష్టమైనదని, ఎవ్వరూ ప్రయత్నించొద్దని సూచించారామె. ఇంకా తనకు బట్టర్ చికెన్, బిర్యానీ వంటి భారతీయ వంటకాలన్నా మహా ఇష్టమని తెలిపింది. అలాగే చర్మం ఆరోగ్యం కోసం హైడ్రేటెడ్‌గా ఉంటానని, మంచి నిద్ర, మినరల్స్, విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారమే తీసుకుంటానని చెప్పుకొచ్చారు నర్గీస్ ఫక్రీ. వాటర్ ఫాస్టింగ్ మంచిదేనా..?ఇది ఒకరకమైన ఉపవాసం. ఫ్యాట్ డైట్ పరంగా చేసే క్రేజీ ఫాస్టింగ్ అని చెబుతున్నారు. ఈ విధానంలో కేవలం నీటిని మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ఇది బాగా ట్రెండింగ్‌లో ఉంది. అలాగే పరిశోధనల్లో కేవలం నీటినే ఆహరంగా తీసుకుని ఉపవాసం ఉండే ఈ ప్రక్రియతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎంతలా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. సరైన విధంగా చేయకపోతే అంతే స్థాయిలో ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దుష్ప్రభావాలు..దీని వల్ల నీటి ఉపవాసం నిర్జలీకరణం, కండరాల నష్టం, రక్తపోటు మార్పులు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆహారం లేకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. పైగా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కండరాల నష్టం, రోగనిరోధక శక్తి తగ్గడం, అలసట, తలతిరగడం,, మతిమరుపు, జీవక్రియ మందగించడం తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే అందరి వ్యక్తుల శరీర తీరు విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికి సరిపడదని అన్నారు. ఇలాంటివి ఆరోగ్య నిపుణుల సమక్షంలో ఏ మేరకు చేయాలో నిర్ణయించి పాటిస్తేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఐరన్ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..) -
'డిటెక్టివ్'.. బీ సెలెక్టివ్..!
ఒకప్పుడు సినిమాల్లో చాలా బాగా, బలంగా కనిపించిన డిటెక్టివ్ పాత్రలు.. ప్రస్తుతం తెరపై పెద్దగా కనిపించకపోవచ్చు.. కానీ ఆధునికుల నిజ జీవితంలో మాత్రం కీలకంగా మారాయి. వివాహ పూర్వపు దర్యాప్తుల నుంచి కార్పొరేట్ ఫ్రాడ్స్ వరకూ.. ఎన్నో రంగాల్లో వీరి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, లివిన్ మొదలు ప్రతిదానికీ వీరిపై ఆధారపడుతున్నారు కొందరు.. అయితే అలాంటి ఏజెన్సీలను ఎన్నుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆర్థిక సంస్కరణల ఫలితంగా పలు ప్రైవేటు రంగాలు పుంజుకున్నాయి. దీంతోపాటు వ్యక్తిగత గోప్యత, భద్రత, సత్వర న్యాయం కోసం స్వతంత్ర విచారణలు అవసరమయ్యాయి. అయితే అప్పటికే ముంబయి వంటి నగరాల్లో ఉన్నప్పటికీ.. ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్కసారిగా డిటెక్టివ్ ఏజెన్సీలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మన నగరంలోనే దాదాపు 30కి పైగా ప్రైవేటు విచారణ సంస్థలు సేవలందిస్తున్నాయి. పెళ్లికి ముందు.. పరిశోధన.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో మోసాలు పెరిగిపోయాయి. దీంతో పాత సంబంధాల సమాచారం దాచిపెట్టడం వంటివి తెచ్చిపెట్టే సమస్యల పరిష్కారంగా డిటెక్టివ్ సేవలు బాగా అవసరం అవుతున్నాయి. కొన్ని మ్యాట్రిమోని సంస్థలు సైతం దీని కోసం డిటెక్టివ్స్‌ను ఆశ్రయిస్తున్నాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు పరస్పరం అనుమానాలతో ఈ సంస్థల సేవల్ని కోరుకుంటున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ఇలాంటి స్వతంత్ర విచారణలు కూడా ఓ కారణమేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సదరు సంస్థలు చేసిన విచారణలో లోపం కారణంగా అందిన నివేదికలతో అనేకమంది విడిపోతున్నారని చెబుతున్నాయి అధ్యయనాలు. ప్రేమలు, లివిన్లలోనూ.. ఇక ప్రేమికులు కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. ‘పారీ్టలు, పిక్నిక్లు, కొలీగ్స్‌తో చనువుగా ఉండడం వంటి వన్నీ ప్రస్తుతం తప్పని అవసరం. అయితే ఇవే అనుమానాలకూ దోహదం చేస్తున్నాయి. తమ లవర్స్ మీద అనుమానాలతో మమ్మల్ని నెలకు కనీసం 25 మందైనా సంప్రదిస్తుంటారు’ అంటూ నగరంలో పేరున్న ఓ డిటెక్టివ్ సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రేమికులు కేవలం కబుర్లు, షికార్లతో కాలక్షేపం చేసే కాలం పోయి ఏకంగా లివిన్ రిలేషన్ షిప్స్‌లో ఉండడం సర్వసాధారణం అయ్యింది. ఇలాంటి ట్రెండ్ ఈ పరిస్థితికి దారి తీస్తోందని ఫ్యామిలీ కౌన్సిలర్ సుజాత అంటున్నారు.డివోర్స్‌కు ఫోర్స్.. ‘వివాహేతర సంబంధం కారణంగా విడాకులు ఇవ్వాలంటే మమ్మల్ని కలవాలి. ఆ తర్వాత విడాకులు ఇచి్చన మహిళకు ఆదాయం ఉందని భరణం ఇవ్వనక్కర్లేదని నిరూపించాల్సినప్పుడు కూడా మమ్మల్నే కలవాలి’ అంటూ చెప్పారు నగరంలోని లక్డీకాపూల్‌లో డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న ఓ మహిళ. గతంలో ఈ తరహాలో తమ భార్య/భర్తల నేరాన్వేషణ సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ ఉండేదని, అయితే ప్రస్తుతం దాదాపుగా అన్ని రకాల ఆదాయవర్గాల్లోనూ కనిపిస్తోందని అన్నారామె. కార్పొరేట్ వెరిఫికేషన్ కోసం.. కార్పొరేట్ రంగంలో అవినీతి కార్యకలాపాలను గుర్తించేందుకు కూడా డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల కోసం చేసే బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ నుంచి ఉద్యోగుల వర్గీకరణ, ఇంటర్నల్ లీకులు, మేనేజ్మెంట్ లెవెల్ మోసాల నిర్ధారణకు సంస్థలు ఈ సేవలను వినియోగిస్తున్నాయి. ఎస్సెట్ ట్రేసింగ్, ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ వంటివి వీరు చేస్తున్నారు. అంతే కాకుండా లోన్ రికవరీ/విత్‌హోల్డింగ్ కేసుల్లో ఆస్తుల వివరాల కోసం పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా జై డిటెక్టివ్ అంటున్నారు. ఈజీ..టెక్నాలజీ.. ప్రస్తుతం డిటెక్టివ్ సేవల్లో టెక్నాలజీ కీలక భూమిక పోషిస్తోంది. వాహనాల పర్యవేక్షణ, వ్యక్తుల స్థల నిర్ధారణకు ఆధునిక పరికరాల సహాయంతో ట్రాకింగ్ సులభంగా మారింది. అలాగే సర్వైలెన్స్, డేటా అనాలసిస్ మరింత ప్రభావవంతంగా మారాయి. సోషల్ మీడియా మానిటరింగ్, డిజిటల్ ట్రెయిల్స్ ఆధారంగా వివరాల సేకరణ, ప్రత్యక్ష సాక్ష్యాల కోసం సీక్రెట్ కెమెరాలు, ఆడియో రికార్డర్లు ఉపకరిస్తున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంక్ లావాదేవీలను విశ్లేషించేందుకు డేటా అనలిటిక్స్, అనుమతి మేరకు హ్యాకింగ్, బగ్ డిటెక్షన్, మొబైల్ ట్రాకింగ్ వంటివీ చేస్తున్నారు. వ్యవస్థాపకులు వీరే.. చాలా వరకూ ఈ తరహా ఏజెన్సీల స్థాపకులు మాజీ భద్రతా విభాగాలకు చెందినవారే కావడం గమనార్హం. రిటైర్డ్ పోలీస్ అధికారులు, సైనిక లేదా నిఘా విభాగాల మాజీ ఉద్యోగులు, లాయర్లు, క్రిమినాలాజీ విద్యార్థులు ఈ సంస్థల స్థాపన, నిర్వహణల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరికి న్యాయపరమైన అవగాహన, విచారణ పద్ధతులపై ట్రైనింగ్ ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం నగరంలో షార్ప్ డిటెక్టివ్, హైదరాబాద్ డిటెక్టివ్ ప్రై లిమిటెడ్, డీడీఎస్ డిటెక్టివ్, థర్డ్ ఐ ఇన్వెస్టిగేషన్స్, పారామౌంట్, లింక్స్, యారో, రియల్ ఐ, తదితర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త..ఇలాంటి డిటెక్టివ్ ఏజెన్సీల సంస్థల్ని సేవల కోసం ఆశ్రయించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కార్పొరేట్ సంస్థలు, న్యాయవాదులు, బ్యాంకులు వంటి ఆర్గనైజ్డ్ వ్యవస్థలకు ఫర్వాలేదు కానీ.. వ్యక్తిగత అవసరాలకు సంప్రదించేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత రహస్యాలను సేకరించిన అనంతరం బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలూ నగరంలో లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. -
Beauty Tip: పాలతో సౌందర్యం..
పాల నురుగులా తెల్లగా ఉండాలంటే మేనుకి పాల మీగడతో మర్దన చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. ముఖం కాంతిమంతంగా, మృదువుగా ఉండాలంటే కాచిన పాలపై ఉండే మీగడ అంద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ పాల మీగడను ముఖానికి ఎలా అప్లై చేస్తే చక్కటి ఫలితం పొందగలమో సవివరంగా చూద్దామా..!. రెండు టేబుల్ స్పూన్ల ΄పాల మీగడలో ఒక టీస్పూను ఆల్మండ్ ఆయిల్, నాలుగైదు చుక్కల రోజ్ ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇది పొడిబారి, గరుకుగా ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.చర్మం తెల్లగా మారాలంటే... చిన్న చందనం ముక్కను పాలతో పేస్టు చేసి అందులో చిటికెడు స్వచ్ఛమైన పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లయ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికి మూడు సార్లు ప్యాక్ వేస్తుంటే ఫలితం ఉంటుంది.ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్లో ఒక టీ స్పూన్ పెసలను ఎర్రగా వేయించాలి. వీటిలో పాలను కలుపుతూ పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి ఆరాక వలయాకారంగా రుద్దుతూ ప్యాక్‌ను వదిలించాలి. ఇలా చేయడం వల్ల ప్యాక్‌లోని సుగుణాలు చర్మానికి పట్టడంతోపాటు మృతకణాలు రాలిపోతాయి. తరవాత చన్నీటితో కడిగితే సరిపోతుంది. (చదవండి: పెళ్లి అంటే డబ్బు, హోదా కాదు..! అంతకటే ముందు..: ఉపాసన కొణిదెల) -
ట్రెండ్ 'షేరెంటింగ్'! ఇది ఎంతవరకు సమంజసం..?
కొందరు పేరెంట్స్ తమ పిల్లల ఫోటోలు, వీడియోలు, వారికి సంబంధించిన విషయాలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యం నుంచి వచ్చిందే... షేరెంటింగ్(షేరింగ్ + పేరెంటింగ్)‘చిన్న పిల్లల వీడియోలే కదా... షేర్ చేస్తే ఏమిటి అనుకుంటారుగానీ దీని వల్ల ప్రైవసీ, సేఫ్టీ కోణంలో ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి’ అంటున్నారు నిపుణులు.ఇక మరో ట్రెండ్... పాపింగ్ ఇమోజీఈ ట్రెండ్ ప్రత్యేకత ఏమిటంటే పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ వారి ముఖాలను ఇమోజీలతో కవర్ చేయడం. మొదట్లో ఈ ఫేస్ ఇమోజీ ట్రెండ్ సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు సామాన్యుల వరకు వచ్చింది.‘ముఖాలను ఇమోజీలతో కవర్ చేసినంత మాత్రాన ఎలాంటి సమస్యలు ఉండవు అనుకోవడం భ్రమ మాత్రమే’ అంటున్నారు ఆన్లైన్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌లు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ఇమోజీ–కవర్డ్ ఫోటోల ఫేస్‌లను రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు అని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లు.పిల్లలు ఫోటోలు, వీడియోలు, వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరిౖయెనదా? కాదా? అనే చర్చ మాట ఎలా ఉన్నా అతిగా షేర్ చేయడం తప్పు అంటున్నారు నిపుణులు. (చదవండి: -
డోపమైన్ లోపం వణికిస్తుందా..?
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వాళ్లలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తించి, మొదట్లో దానికి ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... వ్యాధినిమొదట గుర్తించిన ఫిజీషియన్ పేరిట ఇది ప్రాచుర్యం పొందింది. కొందరిలో మెదడులోని డోపమైన్ అనే రసాయనం ఉత్పిత్తి తగ్గడం వల్ల, శరీర కదలికలను అదుపులో ఉంచే నాడీకణాలు తగ్గిపోతాయి. దాంతో దేహం వణకడం మొదలై పార్కిన్సన్స్ వ్యాధి మొదలువుతుంది. ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం...పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లలోతొలుత నడకతో మొదలై... తర్వాత అన్ని రకాల కదలికలూ ప్రభావితమవుతాయి. ఇలా ఒక వ్యక్తి కదలికలు తగ్గిపోయే గుణాన్ని ‘హైపోకైనేసియా’ అంటారు. తర్వాత చెయ్యి వణకడం మొదలవుతుంది. ఈ వణకడమనేది ఏ పనీ చేయని దశలో... అంటే ఓ వ్యక్తి ఏ పనీ చేయకుండా పూర్తిగా రెస్ట్‌లో ఉన్నప్పుడు కూడా వస్తుంది ఉంటుంది. కాబట్టి ఈ వణుకుడును ‘రెస్ట్ ట్రిమర్స్’గా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు పక్కకు తిరగబోయే ప్రయత్నంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతూ ఉంటారు. ఇలా బ్యాలెన్స్ కోల్పోవడాన్ని పోష్చురల్ ఇన్‌స్టెబిలిటీ’ అంటారు. ఇవన్నీ ఈ జబ్బుకు ఉన్న ముఖ్యమైన లక్షణాలు. ఇవేగాక ఇంకా చాలా అనుబంధ లక్షణాలూ కనిపిస్తుంటాయి.కారణాలు... నిర్దిష్టంగా కారణం ఇదీ అని చెప్పలేనప్పటికీ కొన్ని పరిశీలనల ద్వారా పార్కిన్సన్ జబ్బు రావడానికి అనేక కారణాలు ఉన్నాయన్నది వైద్య శాస్త్రవేత్తల మాట. అందులో ముఖ్యమైనది జన్యులోపం. ఈ జన్యులోపం ఉన్నవారిలో ఒక వయసు దాటాక ఈ జబ్బు తప్పనిసరిగా బయటపడుతుంది. అలాగే కొందరిలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా డోపమైన్ సరిగా వెలువడక జబ్బు వస్తుంది. మరి కొందరిలో వారు తీసుకునే పానియాల్లో లేదా పీల్చే గాలిలో కొన్ని రకాల విషపదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) ఉన్న కారణంతో... ఆ విషాలు డోపమైన్ విడుదల చేసే కణాలను దెబ్బతీనందువల్ల డోపమైన్ సరిగా విడుదల కాకపోవడంతో ఈ జబ్బు వస్తుంది. అంతేకాకుండా మరికొందరిలో తలకు పదే పదే దెబ్బలు తగలడం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. ఇంకొందరిలో మెదడుకు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఈ జబ్బు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ ఈ జబ్బుకు కారణమయ్యే అంశాలు. అయితే ఈ జబ్బుకు గురైన దాదాపు 50 శాతం మందిలో మాత్రం ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఈ జబ్బు ఎలాంటి చెడు అలవాట్లు (అంటే స్మోకింగ్, ఆల్కహాల్) లేకపోవడం లేదా కనీసం కాఫీ, టీలు తాగని వారిలోనూ కనిపించడమన్నది చాలామంది వైద్యశాస్త్రవేత్తలూ, అధ్యయనవేత్తల దృష్టికి వచ్చిన ఆశ్చర్యకరమైన అంశం. ఏ వయసు వారిలో... పార్కిన్సన్స్ వ్యాధికి గురైన వారిలో 98 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వారే. కేవలం రెండు శాతం లోపు వారిలోనే ఇది 50 ఏళ్లలోపు వారిలో కనిపించింది. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో మరీ యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుడటంతో దీన్ని వంశపారంపర్యంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు.ఎందుకు వస్తుందీ జబ్బు? మన మెదడు నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నది తెలిసిందే. అందులోని ఒక చిన్న భాగం పేరు ‘సబ్‌స్ట్రాన్షియా నైగ్రా’. దీని నుంచి డోపమైన్ అనే రసాయనం (బయోకెమికల్) వెలువడుతుంది. ఇది మన దేహం కదలికలను నియంత్రిస్తుంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు కొందరిలో ఈ రసాయనం సరిగా వెలువడదు. ఆ రసాయనం లోపించడం వల్లనే కదలికల్లో లోపాలు కనిపించడం మొదలవుతుంది.వ్యాధి నిర్ధారణ ఇలా... మెదడు ఎమ్మారై పరీక్ష, అయోఫ్లుపేన్ సింగిల్ ఫొటాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (స్పెక్ట్) పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు ∙ఎఫ్–డోపల్–6 ఫ్లూరో –3, 4 డై హైడ్రాక్సీ ఫినైల్ అలనైన్ (18 ఎఫ్– డో΄ా) పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్) స్కాన్ పరీక్ష. కొన్ని నివారణ పద్ధతులు వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో వచ్చే పాషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని రకాల మానసిక సమస్యలు రావడంతో పాటు అవే సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉన్నందున సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ కూడా అవసరం కావచ్చు. జబ్బు గురించి కొన్ని కొత్త విషయాలు : ఈ జబ్బుతో బాధపడేవారి జీవన పరిస్థితులను (క్వాలిటీ ఆఫ్ లైఫ్) మెరుగుపరిచేందుకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. మెదడులో డోపమైన్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి జబ్బు ఉన్నవారిలో ఇదే పదార్థాన్ని బయట నుంచి టాబ్లెట్ల రూపంలో ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ.కొన్ని ప్రధాన చికిత్స ప్రక్రియలు : మెదడులో తగ్గిన డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతోపాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూపోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్‌గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గించి, ఉపశమనాన్నిస్తాయి. ఎమ్మారై ఇమేజింగ్ సమయంలో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీతో థలామస్లో కొన్ని లీజన్స్ కల్పించడమూ ఓ చికిత్సగా చెప్పవచ్చు. ఇదొక నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే... కత్తి కోత గానీ లేదా గాటు గానీ పడకుండా చేసే చికిత్స.పై చికిత్సలతో పాటు గత పది పదిహేనేళ్ల వ్యవధిలో దీనికి అనేక కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. డీబీఎస్ : డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే రూపానికి ఇంగ్లిష్ పొడి అక్షరాలే డీబీఎస్. ఇదో శస్త్రచికిత్స ప్రక్రియ. ఇందులో చాలా మోతాదులో తక్కువ కరెంట్‌ను పంపి డోపమైన్ కణాలను ఉత్తేజపరుస్తారు. జబ్బు బాగా ముదిరిపోయి, ఇక మందులు ఎలాంటి ప్రభావం చూపని దశలోనే ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ కరెంట్ పంపే పరికరం గుండెకు అమర్చే పేస్‌మేకర్‌లా ఉంటుంది. మెదడు లోపల ‘సబ్‌స్ట్రాన్షియా నైగ్రా’ అనే ప్రాంతంలో దీని తాలూకు ఎలక్ట్రోడ్‌ను అమర్చుతారు. బయట దాన్ని అనుసంధానించడానికీ, మోతాదు నియంత్రించడానికీ ఒక బటన్‌ను అమర్చుతారు.మందుల దుష్ప్రభావాలు మొదలైతే ప్రత్యామ్నాయం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ...పార్కిన్సన్ వ్యాధిలో వాడుకునే మందులు మూడు నుంచి ఐదేళ్ల వరకు సమర్థంగా పనిచేసినా... ఆ తర్వాత రెండు రకాల దుష్ప్రభావాలు మొదలవుతాయి. కొందరిలో టాబ్లెట్ ప్రభావం కొనసాగినంతసేపు బాగానే ఉన్నా... దాని ప్రభావం తగ్గగానే లక్షణాలు బయటపడుతుంటాయి. దీన్నే ‘ఆన్ ఆర్ ఆఫ్ ఫినామెనా’ అంటారు. మరికొందరిలో మాత్ర వేసుకున్నప్పుడు వ్యాధి తీవ్రత పెరిగినట్లుగా... దేహంలో కదలికలు మరింత పెరిగి΄ోతూ ఉంటాయి. ఈ రెండు రకాల దుష్ప్రభావాలూ సుదీర్ఘకాలం మందులు వాడినవారిలో కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందుల్ని ఆపలేక... కొనసాగించలేక బాధితులు ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అన్నది ఓ వరప్రదాయని అనుకోవచ్చు. డీబీఎస్ సర్జరీకి ముందు పరీక్ష... పార్కిన్సన్ వ్యాధి మందులతో అదుపు కావడంలేదని నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యులు ఓ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో బాధితులకు మొదట మందులు ఇవ్వకుండా వారి చేత కొన్ని పనులు చేయిస్తారు. వాటితో మందు ప్రభావమూ, దుష్ప్రభావాల తీవ్రత తెలుస్తాయి. మందులతో ఇక ఏమాత్రమూ ప్రయోజనం కనిపించని బాధితులను మాత్రమే సర్జరీకి ఎంపికచేస్తారు. అంతేకాదు... వాళ్లకు ఎలాంటి మానసిక రుగ్మతలూ ఉండకూడదు. సర్జరీ తర్వాత కొందరిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీకి ముందు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని సైకియాట్రిస్ట్ తొలుత నిర్ధారణ చేయాలి. డీబీఎస్ సర్జరీలో ఏంజరుగుతుందంటే... డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కోసం మెడిట్రానిక్స్, బోల్టన్ సైంటిఫిక్, సెయింట్ జ్యూడ్ మొదలైన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే ఈ శస్త్రచికిత్సలో భాగంగా... ఎలక్ట్రోడ్లను కలిగిన లీడ్లను మెదడులో అమర్చుతారు. వాటికి విద్యుత్తును అందించే పల్స్ జనరేటర్‌ను ఛాతీలో అమర్చుతారు. ఈ రెండూ వైర్‌తో అనుసంధానమై ఉంటాయి. బ్యాటరీతో నడిచే ఈ పల్స్ జనరేటరు నిరంతరం పనిచేస్తూ, విద్యుత్ ప్రసారాన్ని వెలువరిస్తూ ఉండటం వల్ల మెదడుకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా జరుగుతూ ఉంటుంది. దాంతో లక్షణాలు అదుపులోకి వస్తాయి. బ్యాటరీతో పనిచేసే ఈ పల్స్ జనరేటర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీటిలో రీచార్జ్, సింగిల్ యూజ్ అనే రెండు రకాల బ్యాటరీలు ఉంటాయి. సింగిల్ యూజ్ బ్యాటరీలు ఏకంగా మూడు నుంచి ఐదేళ్ల వరకు పనిచేస్తాయి. కాలం చెల్లిన తర్వాత చిన్న సర్జరీతో బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. అదే రీచార్జ్ బ్యాటరీ అయితే 15 నుంచి 20 ఏళ్ల వరకు పనిచేస్తాయి. వీటిని ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్లుగా, ఓ వైర్లెస్ ఛార్జర్‌ను ఛాతీకి కట్టుకుని బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే..? డోపమైన్‌ను బయటి నుంచి అందించకుండానే... ఆ న్యూరోట్రాన్స్మిటర్ శరీరంలో ఉందనే భావనను మెదడుకు కలిగించేలా చేసే సర్జరీ ఇది. ఇందుకోసం... మెదడులో శరీర కదలికలను నియంత్రించే ‘న్యూక్లియస్’లలోకి ఓ లీడ్‌ను అమర్చుతారు. దాన్ని బ్యాటరీకి అనుసంధానిస్తారు. శస్త్రచికిత్స ద్వారా ఆ బ్యాటరీని ఛాతీలో ఉంచుతారు. ఆ బ్యాటరీ నుంచి వెలువడే ‘ఎలక్ట్రిక్ ఇంపల్స్’ మెదడును ప్రేరేపిస్తాయి. దాంతో న్యూక్లియస్లన్నీ గాడిలో పడి, డోపమైన్ ఉన్నట్లుగా మెదడుకు భ్రమ కలిగిస్తాయి. ఫలితంగా పార్కిన్సన్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాదు... మందుల తాలూకు దుష్ప్రభావాలలో కనిపించే ‘ఆన్ అండ్ ఆఫ్ ఫినామినా’ కండిషన్ తొలగిపోతుంది. బ్యాటరీ నుంచి విద్యుత్తు నిరంతరాయంగా మెదడుకు ప్రసరిస్తూ ఉండటం వల్ల లక్షణాలు పెరగడం / తగ్గడం లాంటివి కూడా ఉండవు. అలాగే సర్జరీ తర్వాత మందుల మోతాదు కూడా తగ్గిస్తారు. దాంతో అదనపు కదలికలూ తగ్గుతాయి. డీబీఎస్ సర్జరీ ఫలితం ఇలా...ఈ శస్త్రచికిత్సతో పార్కిన్సన్ వ్యాధిని మరింత పెరగకుండా అక్కడికి అదుపుచేయవచ్చు. అయితే గతంలో జరిగి΄ోయిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం సాధ్యం కాదు. బాధితులు ఒకింత నాణ్యమైన జీవితం గడపడం కోసమే ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ చికిత్స ఉపయోగపడుతుంది తప్ప... ఇది పూర్తిగా వ్యాధిని నయం చేయలేదని గ్రహించాలి. సర్జరీ సమయానికి రోగి శారీరక స్థితి ఎలా ఉందో, అదే పరిస్థితి కొనసాగడం లేదా అంతకంటే దిగజారకుండా ఉండటానికి మాత్రమే డీబీఎస్ ఉపయోగపడుతుంది.స్టెమ్‌సెల్ థెరపీ: పార్కిన్సన్ డిసీజ్‌కు శాశ్వత చికిత్స అందించే ప్రయత్నాల్లో ఈ చికిత్స ప్రక్రియను మొదటిదిగా పేర్కొనవచ్చు. మన శరీరంలోని వేర్వేరు అవయవాల్లో ఉండే కణాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదా: మెదడు కణాలను న్యూరాన్లుగా, రక్తకణాల్లో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌గా, కాలేయకణాలు హెపటోసైట్స్, కండరకణాలు మయోసైట్స్గా, ఎముకకణాలు ఆస్టియోసైట్స్గా ఉంటాయి. అయితే ఈ కణాలన్నీ ఉత్పత్తి అయ్యే మూల (ప్రిమిటివ్) కణాన్ని ఇంగ్లిష్‌లో ‘స్టెమ్‌సెల్’ అంటారు. ప్రస్తుతం బొడ్డుతాడునుంచి సేకరించిన కణాలను కొన్ని ప్రక్రియలు, దశల తర్వాత స్టెమ్సెల్గా మార్చి అమర్చితే... అది అమర్చిన ప్రదేశాన్ని బట్టి... అది సదరు అవయవానికి సంబంధించిన కణంగా మారి΄ోతుంది. ఈ తరహా చికిత్సనే స్టెమ్‌సెల్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో భాగంగా స్టెమ్‌సెల్స్‌ను మెదడులో సబ్‌స్ట్రాన్షియా నైగ్రా (ఎస్.ఎన్.) ఉన్న ప్రాంతంలో ప్రవేశపెడతారు. అక్కడ అవి కొత్త ఎస్.ఎన్. కణాలుగా తయారవుతాయి. దాంతో ఆ కొత్త కణాలనుంచి మళ్లీ శరీరానికి కావాల్సిన డోపమైన ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి ఈ జబ్బు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గి΄ోయేందుకు అవకాశముంది. స్టెమ్‌సెల్స్ ఉత్పత్తి ఇలా : మన శరీరంలో ఏదో ఒక శాంపుల్ నుంచి కణాలను సేకరిస్తారు. (ప్రధానంగా రక్తం లేదా బొడ్డు తాడులో ఉన్న రక్తంలో స్టెమ్‌సెల్స్ ఎక్కువగా ఉంటాయి). ఈ శాంపుల్‌ను ఒక యంత్రంలో ఉంచి మరిన్ని కణాలు ఉత్పత్తి అయి వాటి సంఖ్య పెరిగేలా ఇంక్యుబేట్ చేస్తారు. ఇలా ఒక మూలకణం... కణవిభజన ప్రక్రియ ద్వారా మరెన్నో కణాలుగా విభజన అయి చాలా కణాలు తయారవుతాయి. వాటినే మనం మూలకణాలుగా అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ గురించి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత పురోగతిని బట్టి ఈ ప్రక్రియ ద్వారా రానున్న కొన్నేళ్లలో ఇవి కచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని తప్పక చెప్పవచ్చు. ఫీటల్ సెల్ట్రాన్స్ప్లాంటేషన్ : ఈ ప్రక్రియలోనూ అనుసరించే విధానం ఇంచుమించు పైన పేర్కొన్నట్లుగానే ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఆ చిన్నారి బొడ్డుతాడును, దాంతోపాటు కొద్దిగా రక్తాన్ని (ఫీటల్ బ్లడ్)ను సేకరించి, ప్రత్యేకమైన ల్యాబ్‌లో ప్రాసెస్ చేసి, మూలకణాలను తయారు చేస్తారు. వాటిని అవసరమైనప్పుడు కావాల్సిన చోట వాడుకుంటారు. అప్పుడు ఆ ప్రదేశంలో కొన్ని మూలకణాలను అమర్చగానే అది పూర్తి అవయవంగా రూపుదిద్దుకోవాలన్నదే ఈ ప్రక్రియ లక్ష్యం. జీన్ థెరపీ : ఈ ప్రక్రియపై గత 15–20 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఈ జబ్బు... పార్క్’ అనే ఒక జన్యువు లోపం కారణంగా వస్తుంది. కాబట్టి ఈ జన్యువులో వచ్చే లోపాలను నివారిస్తే అసలు జబ్బు రాకుండానే నివారించే అవకాశం ఉంది. ఇలా అరికట్టడం అనే ప్రక్రియ రాబోయే దశాబ్దకాలంలో అందరికీ అందుబాటులోకి రావచ్చని ప్రస్తుతం ఉన్న పురోగతిని బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రాసావిన్ చికిత్స : ప్రాసావిన్ అనే పదార్థాన్ని మెదడుభాగంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ బయోమెడికా సంస్థలో ఈ చికిత్స ప్రక్రియపై పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రైట్‌లైట్ : ఒక ఫ్రీక్వెన్సీలో ఉండే కాంతి తరంగాలను ప్రసరింపజేయడం వల్ల మెదడులో ఉండే మెలటోనిన్‌ను తగ్గించి డోపమైన్ ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చనే అంశం ఆధారంగా జరిగే చికిత్స ఇది. ట్రాన్స్ క్రేనియల్ ఆల్టర్నేట్ కరెంట్ స్టిమ్యులేషన్స్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరెంట్ ఇచ్చి, నైగ్రల్ సెల్స్‌ను ఉత్తేజపరచి, డోపమైన్ ఉత్పత్తి జరిగేలా తమ ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. పైన పేర్కొన్న చికిత్స ప్రక్రియలతో పాటు న్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్, జీడీఎన్‌ఎఫ్ (గ్లయల్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్) వంటి కొన్ని అంశాలను రక్తంలోకి ప్రవేశింపజేయడం వల్ల అవి మళ్లీ మెదడులోకి ప్రవేశించి అక్కడ నైగ్రల్ సెల్స్‌ను అభివృధ్ధి చేసేలా చూస్తే ప్రక్రియలపైన చాలా విస్తృతమైన అధ్యయనం జరుగుతోంది. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పార్కిన్సన్స్ డిసీజ్‌ను తగ్గించేందుకు కొంతమేర మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయని, కొన్నాళ్లలో ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు. డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరో సర్జన్(చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..) -
300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు
మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు శ్రమ ఉంటుంది. అలాగే ఎంతో ఆనందంగా ఆస్వాదించే ప్రతీ చాక్లెట్, చాక్లెట్ బార్ వెనుక ఒక రైతు కథ ఉంటుంది. చాక్లెట్లలో చెప్పుకోదగ్గది మన దేశానికి చెందిన, వెరీ వెరీ స్పెషల్ ఏంటి అంటే చెప్పుకోవాల్సింది ‘మనం’ చాక్లెట్ గురించే. హైదరాబాద్‌లో ఉన్న భారతదేశపు చాక్లెట్ బ్రాండ్. వరల్డ్ చాక్లెట్ డే సందర్భంగా ఆ విజయ గాధ ఏంటో తెలుసుకుందాం పదండి. ‘మనం’ కథ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలోని కోకో పొలాలలోమొదలువుతుంది. ఈ ఆంధ్రా-ఆధారిత చాక్లెట్ బ్రాండ్ 300+ మంది రైతులకు సాధికారత కల్పించి తొలి ఏడాదిలో సంవత్సరంలో రూ. 8.7 కోట్లు సంపాదిండం విశేషం. అంతేకాద గత ఏడాది ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాలో చోటు సంపాదించుకుంది. స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందంటూ ‘మనం చాక్లెట్’ను కొనియాడింది. భారత్‌లో పండించే కోకోతో చాక్లెట్ల తయారు చేసి ‘మనం చాక్లెట్’ పాపులర్ అయింది. ఈ చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పాల చైతన్య స్థాపించారు. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. < View this post on Instagram A post shared by Manam Chocolate® (@manamchocolate) హైదరాబాద్‌లో పుట్టినా, చైతన్య బాల్యంలో ఎక్కువ భాగం పూణేలో గడించింది. అక్కడ సహ్యాద్రి స్కూల్ KFI (జిడ్డు కృష్ణమూర్తి బోర్డింగ్ స్కూల్)లో పెరిగాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని సౌడర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డెవలపింగ్ ఎకానమీస్ నుండి స్టాన్ఫోర్డ్ సీడ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత తండ్రి అనారోగ్యం కారణంగా ఇండియా తిరిగి వచ్చారు. తండ్రి నిర్వహించే ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం బాధ్యతలు చేపట్టారు. ఒకే ఒక్క దుకాణంతో ఉన్న చిన్న వ్యాపారంలోని లోపాలను పరిష్కరించుకుంటూ, తనదైన శైలిలో అభివృద్ది చేశారు. గత 10 సంవత్సరాలలో దానిని చాలా పెద్ద వ్యాపారంగా విస్తరించారు. దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కంపెనీ మొదటి సంవత్సరంలోనే రూ. 8.79 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని సాధించడం విశేషం.బీన్స్ పట్ల ఆయనకున్న మక్కువే తన సొంత బ్రాండ్‌ను రూపొందించేలా చేసింది. చాక్లెట్ వస్తువులు అందుబాటులో లేకపోవడం, ఆ సమయంలో చాక్లెట్ గురించి మాకు ఏమీ తెలియదు ఎందుకంటే చాక్లెట్ ఎల్లప్పుడూ సరఫరాదారు నుండి కొనుగోలు చేసేవాళ్లమని, అదే చాక్లెట్ మార్కెట్లోకి ప్రవేశించాలనే ఆలోచన అతని ఆసక్తిని రేకెత్తించింది అంటారు. మనం చాక్లెట్‌ను ప్రవేశపెట్టిన సంస్థ డిస్టింక్ట్ ఆరిజిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DOPL) CEO చైతన్య ముప్పాల. తాము సంవత్సరానికి 150శాతం వృద్ధి చెందుతున్నామని, ఇది తమ విజయవంతమైన మార్కెట్ వ్యూహానికి నిదర్శనమన్నారు. కోకో బీన్స్ పొలం నుంచి చాక్లెట్ టాబ్లెట్‌గా రూపాంతరం చెందే ప్రయాణంలో రైతుల అమూల్యమైన మద్దతు లేకుండా తమ సాధ్యం కాదు అని తెలిపారు.ఎన్నో వెరైటీలుడార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి. -
ఆశ్రిత లక్షణం
తమకు జీవితాన్ని ప్రసాదించి, తాము చేసే పనికి ఎంతోకొంత సొమ్మును పారితోషికంగా ఇచ్చి రక్షించే యజమానిని ఆశ్రితులు సైతం రక్షించడం పరమ విధి. అసలు ఆశ్రితులు అంటే ఎవరు? బాధల్లో ఉన్నప్పుడు గానీ, మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ‘‘నేనున్నాను’’ అని చెంత నిలిచి ఆదరించేవాడు మిత్రుడు, ఆ రకంగా విపత్తులో మేలు పొందినవాడు ఆశ్రితుడు. పెద్ద అర్థంలో తీసుకుంటే, జగతిలోని జీవులందరూ ఆశ్రితులే..!! అందరినీ రక్షించేది ఆ పరంధాముడే..!!ఈ విశాల విశ్వంలో ఏదో ఒక అవసరాన్ని తీర్చుకునేందుకు మనం మరొకరి మీద ఆధారపడక తప్పదు. ఆ విధంగా ఆపత్కాలంలో మనను ఆదుకున్నవాళ్ళను వదిలి వేయకుండా, వీలున్నంతగా సహాయం చేయగలగడమే ఉత్తమ ఆశ్రిత లక్షణం. ఇక, ప్రస్తుత ప్రపంచంలో విభిన్న రకాలవ్యాపకాల్లో, ఉద్యోగాల్లో తమ విధులు నిర్వహించే ఉద్యోగులందరూ ఆశ్రితుల కోవలోకే వస్తారు. తమ సంస్థ ఒక్కొక్కసారి అభివృద్ధిలో ఉన్నతస్థానంలో నిలువవచ్చు, మరొకసారి ఊహించని ఇబ్బందుల్లో కూరుకుపోవచ్చు. అయితే, సంస్థ ఉత్థానంలో ఏ విధంగా ఉద్యోగులు ఆనందించి, తమ వ్యక్తిగత ప్రగతికి బాటలు వేసుకున్నారో, ఆ సంస్థ కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు, సంస్థను వీడకుండా, తమ వంతు సహకారాన్ని అందించాలి. తాము సంస్థకు వెన్నెముకగా ఉన్నామని, ఏ ఇబ్బందినైనా దాటడంలో తాము అహరహం కృషి చేస్తామని యాజమాన్యానికి భరోసా యివ్వాలి. ఎక్కడ తమకు ఎక్కువ జీతం, సదుపాయాలు ఉంటాయో, అక్కడికి తక్షణమే మారిపోయే ప్రస్తుత తరానికి చెందిన యువతీ యువకులు ఈ మాటలు వింటే నవ్విపోతారు. వారి దృష్టిలో ఈ విధంగా నడుచుకోవడం దాదాపుగా అసాధ్యం. కానీ, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో తోడుగా నిలిచి, ఉత్తేజాన్ని అందించే ఈ ఉత్తమ లక్షణం సంస్థకు భవితను చూపడంలో అత్యంత అవసరం. ఏ సంస్థ మనుగడకైనా నమ్మకస్తులైన ఉద్యోగులు చాలా అవసరం. వారి అంకితభావం, సంస్థ తమ సొంతం అన్న బలీయమైన అనుబంధం వల్లనే ఆ సంస్థ లేక వ్యవస్థ నాలుగు కాలాలపాటు పచ్చగా నిలబడుతుంది. శతాబ్దాలుగా వ్యాపార వ్యవహారాలను అచ్చెరువొందేలా నిర్వహిస్తూ, చెదరని నమ్మకానికి నమూనాగా నిలిచిన అగ్రగామి సంస్థల రహస్యం ఆ సంస్థను ఆశ్రయించి ఉండడమే గాక, సర్వకాల సర్వావస్థల్లో తమ సహకారాన్ని అందించే ఉద్యోగులే..!!ఇక, రామాయణ కథలోనూ అత్యంత విశ్వసనీయులైన ఆశ్రితులు మనకు తారసపడతారు. ముందుగా చెప్పుకోవలసింది సుగ్రీవుడు. అన్నయైన వాలిపట్ల భయంతో కొండల్లో తలదాచుకున్న సుగ్రీవుడు, శ్రీరాముని శరణు వేడి, రఘువీరుని పరాక్రమంతో వాలి నిహతుడు కాగా, తాను కిష్కింధకు రాజయ్యాడు. సీతాన్వేషణ ఘట్టంలో నలుచెరగులకు వానరులను పంపి, శ్రీరామునికి ప్రీతిని కలిగించాడు. అదే విధంగా చెప్పుకోవలసిన మరొక అద్భుత పాత్ర విభీషణునిది. అన్న ధర్మవిహితమైన తన మాటలను పెడచెవిని పెట్టడంతో రాముని శరణు వేడాడు. రావణుని తమ్ముడైన విభీషణునికి శరణాగతిని ప్రసాదించి, ఆశ్రయమిచ్చాడు. రాముని నీడలో ఆశ్రితుడైన విభీషణుడు రామునికి యుద్ధ సమయంలో లంకలోని రాక్షసుల బలాబలాలను, బలహీనతలను తెలియజేసి, దుష్ట సంహారానికి బాటలు వేశాడు. ఆఖరికి అయోధ్య త్వరగా చేరాలన్న రాముని ఆతృతను గమనించి, శ్రీరాముని తన పుష్పక విమానంలో సాగనంపి, తన శుభ లక్షణాలను లోకాలన్నిటికీ ఘనంగా తెలియజేశాడు. అధునాతన యుగంలోనూ ఆశ్రితులు ఈ విధంగా తమకు ఆశ్రయమిచ్చిన వారికి సహకరిస్తే, సంస్థలు ఇతోధికంగా వృద్ధి చెందుతాయని, దేశ పురోగతికి బంగరు బాటలు ఏర్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.పచ్చటి కోరికభారతీయ పురాతన కాలానికి చెందిన ఒక కథను ఈ సందర్భంలో పరికించడం సమంజసం. కాశీదేశంలో ఒక వేటగాడు విషపూరితమైన బాణాన్ని లేడిపై ప్రయోగించగా అది పచ్చటి ఫలవృక్షానికి తాకింది. దాని ప్రభావం వల్ల ఆ చెట్టు కొద్ది కాలానికి పూర్తిగా ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో కొంతకాలంగా ఒక చిలుక నివసిస్తూ ఉండేది. ఎండిపోయినా, ఆ చెట్టును వీడిపోకుండా చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివాసం ఉండసాగింది. ఒకానొక సందర్భంలో దేవరాజైన ఇంద్రుడు ఆ చిలుకతో సంభాషిస్తూ, ‘‘ఓ చిలుకా.. ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. ఈ చెట్టు తొర్రలో ఉండడంవల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, పచ్చగా ఉన్న మరొక చెట్టును ఆశ్రయించి, నీవు ఆనందంగా గడుపు’’ అని సలహా యిచ్చాడు. ఇంద్రుని మాటలకు ప్రత్యుత్తరమిస్తూ, ఆ చిలుక ‘‘చెట్టు పండినపుడు ఉండడం, ఎండినపుడు విడిచిపోవటం కృతఘ్నత కదా.. ఈ చెట్టు ఎండిపోయినా, నేను ఇక్కడే ఉంటాను..’’ అంది. దేవేంద్రుడు ఆ చిలుక మాటలకు ఎంతగానో సంతోషించాడు. చిలుకను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చిలుక ‘‘స్వామీ..! ఈ చెట్టుకు పూర్వ వైభవాన్ని అనుగ్రహించు’’ అని కోరింది. ఆ చిలుక కోరిన విధంగానే దేవేంద్రుడు ఆ చెట్టు మళ్ళీ పచ్చగా ఉండేలా కటాక్షించాడు. ఆ విధంగా ఆశ్రితురాలైన ఆ చిలుక వల్ల ఆ చెట్టుకు మేలు జరిగి, పునర్వైభవాన్ని పొందింది. ఆశ్రితుల లక్షణం ఇంత చక్కగా ఉంటే, యజమాని లేక సంస్థకు ఎంతో మేలు జరుగుతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది.– తత్వ ప్రవచన సుధాకరవెంకట్ గరికపాటి -
మాసిడోనియా జిలేబీ, మొఘలాయ్ పరోటా ట్రై చేయండిలా..!
కోల్‌కతా మొఘలాయ్ పరోటాకావలసినవి: మైదా పిండి– 2 కప్పులు, ఉప్పు– అర టీస్పూన్, నీళ్ళు– తగినన్ని, గుడ్లు– 4 , ఉల్లిపాయ– 1 (మీడియం సైజు, చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 3 (చిన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్– 1 టీస్పూన్, కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు– తగినంత, చిల్లి ఫ్లేక్స్, మిరియాల పొడి, గరం మసాలా– అర టీస్పూన్ చొప్పున, కీమా– అర కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తరువాత, కొద్దికొద్దిగా నీళ్ళు కలుపుతూ, చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దకు నూనె రాసి, ఒక తడి క్లాత్‌తో కప్పి కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పక్కన ఉంచాలి. ఇలా చేయడంతో పిండి బాగా నాని, పరోటాలు సాఫ్ట్‌గా వస్తాయి. ఈలోపు ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకుని, వేడి కాగానే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, చిల్లి ఫ్లేక్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, మైదా పిండి జల్లుకుంటూ, దీర్ఘచతురస్రాకారంగా, బాగా పలుచటి చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పరోటాలో, నాలుగు టేబుల్ స్పూన్ల కీమా–మసాలా మిశ్రమాన్ని నింపుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని, చివర్లు చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి పరోటాను అలానే చేసుకుని, పాన్ లో కొద్దికొద్దిగా నూనె పోసుకుని, ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.తూలుంబా మాసిడోనియా జిలేబీకావలసినవి: పంచదార– 3 కప్పులు, ఏలకుల పొడి– అర టీ స్పూన్నిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్, నీళ్లు, నూనె– సరిపడామైదాపిండి– 2 కప్పులు, బేకింగ్ పౌడర్– ఒక టీస్పూన్, గుడ్లు– 6తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు నీళ్లు, అర కప్పు నూనె వేసుకుని, బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ చిన్న మంట మీద పెట్టి, మరుగుతున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. ముద్దలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. తర్వాత గుడ్లు కొట్టి అందులో వేసుకుని బాగా గిలకొట్టినట్లుగా, క్రీమ్‌లా మారేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కవర సాయంతో, కేక్స్‌పైన డిజైన్స్ వాడే కోన్స్‌లా చేసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె కాచి, దానిలో ఈ కోన్స్ తో గట్టిగా నొక్కి, ముక్కలుగా కత్తెరతో కట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈలోపు పంచదార, సరిపడా నీళ్లు, ఏలకుల పొడి, నిమ్మరసం వేసుకుని లేత పాకం పట్టుకుని.. ఆ పాకంలో వేగిన ముక్కలను వేసుకుని నాననిచ్చి సర్వ్ చేసుకోవాలి.పనీర్ బర్ఫీకావలసినవి: పనీర్ తురుము– ఒక కప్పుమిల్క్ క్రీమ్– పావు కప్పు, పంచదార పొడి– రుచికి సరిపడాఏలకుల పొడి– చిటికెడు, నెయ్యి– 4 లేదా 5 టేబుల్ స్పూన్లుపిస్తా, కుంకుమపువ్వు– కొద్దికొద్దిగా (గార్నిష్ కోసం, సన్నగా తరిగినవి)తయారీ: ముందుగా నాన్–స్టిక్ పాన్‌లో నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. అనంతరం దానిలో పనీర్ తురుము, మిల్క్ క్రీమ్, ఏలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉంచి, ఆ మిశ్రమంలో పంచదార పొడి వేసుకుని, సుమారు 5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం దగ్గరపడగానే చిన్న చిన్న పేపర్ కప్స్‌లో నింపుకుని చేత్తో ఒత్తుకుని నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవాలి. (చదవండి: అప్పుడు ఆశ్చర్యపరిచాయి..ఇప్పుడు అలవాటుగా మారింది..! విదేశీ మహిళ ప్రశంసల జల్లు) -
అప్పుడు ఆశ్చర్యపరిచాయి.. ఇప్పుడు అలవాటుగా మారింది..!
మన దేశంలో జీవించడమే మంచిది ఇక్కడే హాయిగా ఉంటుందని పలువురు విదేశీయలు భారతదేశాన్ని మెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక విదేశీయురాలు తన పిల్లలను ఇక్కడే పెంచుతానని చెప్పగా, మరొకరు ఇక్కడ జీవిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ విదేశీ మహిళ ఏకంగా మన భారతీయుల అలవాట్లు నచ్చాయి, వాటికి అలవాటు పడిపోయాను అని చెబుతుండటం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టిట తెగ వైరల్ మారింది. మరి ఇంతకీ ఆమె అనుసరిస్తున్న భారతీయ అలవాట్లు ఏంటంటే..బెంగళూరులో నివశిస్తున్న కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా అనే రష్యన్ మహిళ భారతీయ అలవాట్ల గురించి షేర్ చేసుకుంది. మొదట్లో ఆ అలవాట్లు చూసి ఆశ్చర్యపోయానని, ఇప్పుడు అవి తన దైనందిన జీవితంలో భాగమైపోయానని చెప్పుకొచ్చింది. పైగా వాటిని తాను కూడా పాటిస్తున్నానని చెప్పడం విశేషం. అందుకు సంబంధించిన మొత్తం ఎనిమిది అలవాట్లను లిస్ట్ ఔట్ చేసింది. అవేంటో వరసగా చూద్దామా..! ఈ అలవాట్లు వింతగా ఉన్నప్పటికీ, తన దినచర్యలో భాగమై కొండంతా సంతోషాన్ని మద్దతుని ఇస్తున్నాయని అంటోంది యులియా. ఇంతకీ అవేంటంటే..అత్తమామలతో జీవించడం: ఇంటిని తాను నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదొక వరంలా భావిస్తోందామెచేతులతో తినడం: ఇది ఎంతో కంఫర్ట్‌బుల్‌గా ఉందంటోంది. పైగా ఇలా తింటేనే ఆహారం రుచిగా అనిపిస్తోందట. కొంచెం ఆలస్యమైనా పట్టించుకోను: ఎవరైనా వ్యక్తులు ఆలస్యంగా వచ్చినా..అందుకు తగ్గట్టుగా తాను ఇతర పనులు ప్లాన్ చేసుకుంటోందట, సమస్యగా ఫీల్ కాలేదట. ఎక్కువ మంది పనిమనుషులు ఉండటం: ఇది చూడటానికి వింతగా అనిపించినా..ఇదేరాను రాను సౌకర్యవంతంగా, స్మార్ట్‌గా అనిపిస్తోందిచర్చలు: భారతదేశం నుంచి నేర్చుకున్నది ఇదే. దీన్ని సూపర్ పవర్‌గా అభివర్ణించింది.మసాలా చాయ్ తాగడం: ఈ టీ తనకెంతో మనశ్శాంతినిస్తుందట. దీన్ని ఆమె మంగోలియన్ చాయ్‌తో పోల్చారామె. ప్రేమ విలువ: భారతీయ జీవితం సినిమాలు , సంభాషణలు, ప్రేమ చుట్టూ తిరుగుతాయని చెప్పుకొచ్చింది. బహుళ భాషలు మాట్లాడటం: ఇక్కడ ఉండే బహుళ భాషలు నచ్చాయట. అలాగే త్వరలో హిందీ నేర్చుకోవాలని భావిస్తోందట.భారతీయ జీవితంలో ప్రేమ చాలా గాఢంగా ఉంటుందని, సినిమాల్లో లేదా రోజువారీ సంభాషణలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. భారతదేశం చాలా భావోద్వేగ దేశం. అందువల్ల ఇక్కడ ప్రతీది అద్భుతంగా ఉంటుంది. యులియా పోస్ట్‌ని చూసిన నెటిజన్లు.. భారతదేశ రియల్ స్ఫూర్తిని తెలుసుకున్నారు, స్వీకరించారు కూడా. అలాగే అత్తమామలతో కలిసి ఉండటంపై మీ అభిప్రాయం అత్యంత హర్షాతిరేకంగా ఉందంటూ యులియాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: పేరెంట్స్ త్యాగాలకు ఫలితం ఏంటో చూపిస్తున్నా..! కుమారుడి భావోద్వేగం..) -
ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు..! కానీ నాటి పెద్దాళ్లు..
అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు.కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం.. ప్రెషర్ కుక్కర్లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పెనవేసుకునే ఉమ్మడి బంధంఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ సిటిజెన్స్ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అప్పుడే బాగుండేదిమేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి. – నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్కలిసిమెలిసి ఉండేవాళ్లంమేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి.– లద్దునూరి తిరుపతి, నారాయణపూర్ఎవరి పనిలో వారు బిజీఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. – ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట -
పచ్చబొట్టు చెరిగిపోదులే కాదు.. ఈజీగా పోతుందట..!
‘పచ్చబొట్టు చెరిగిపోదులే’ అన్న పాట ఈరోజుల్లో చెల్లదు. ఏదో ఒక ఎమోషన్లో, ఏదో ఒక మూమెంట్లో ఇష్టపడి వేయించుకున్న పచ్చబొట్టు– కష్టమైనా ఉంచుకోక తప్పని రోజులు పోయాయి. టాటూలను శాశ్వతంగా తొలగించడానికి లేజర్ టాటూ రిమూవల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ప్రక్రియలో, అధిక తీవ్రత కలిగిన లేజర్ కిరణాలు చర్మంపై ఉన్న టాటూ ఇంక్‌ను చిన్న చిన్న కణాలుగా విడగొడతాయి. ఈ చిన్న కణాలను శరీరం తన సహజ ప్రక్రియతో తొలగిస్తుంది. లేజర్ చికిత్సకు సాధారణంగా అనేక సెషన్లు అవసరం అవుతాయి. టాటూ పరిమాణం, ఇంక్ రంగు, టాటూ వేయించుకున్న కాలం, చర్మపు తీరును బట్టి సెషన్ల సంఖ్య మారుతుంది. కొన్నిసార్లు వాపు రావడం, చర్మం కందిపోవడం, బొబ్బలు రావడం వంటి సమస్యలు తలెత్తినా పచ్చబొట్టు మచ్చ పోగొట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్. చర్మవ్యాధి నిపుణుల పర్యవేక్షణలో ఈ చికిత్స చేయించుకోవడం ఉత్తమం. (చదవండి: మెడనొప్పి 'పీకల' మీదకు...! ఎందువల్ల ఈ పరిస్థితి) -
ఉత్సుకతను రేకెత్తించే పర్యాటక ప్రదేశాలు.. కానీ అక్కడకు నో ఎంట్రీ..
నిషిద్ధ ప్రదేశాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా, ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల్లోకి అడుగు పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే, అవి నిషిద్ధ ప్రదేశాలు. ప్రపంచంలోని కొన్ని ప్రసిద్ధి పొందిన నిషిద్ధ ప్రదేశాల గురించి, వాటి నిషేధ కారణాల గురించి తెలుసుకుందాం.బొహీమియన్ గ్రోవ్అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని మాంటిరియోలో ఉన్న రహస్య ప్రదేశం ఇది. ఇదొక ‘పెద్దమనుషుల’ క్లబ్. సభ్యులకు తప్ప అన్యులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం. చాలా క్లబ్బుల కార్యకలాపాలు అప్పుడప్పుడు వార్తా కథనాల ద్వారా ప్రపంచానికి తెలుస్తూ ఉంటాయి. ఈ క్లబ్బు గురించిన వార్తలేవీ బయటకు రావు. హెన్నీ ఎడ్వర్డ్స్ అనే రంగస్థల నటుడు 1872లో ఈ క్లబ్బును నెలకొల్పాడు. దాదాపు 2700 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ క్లబ్బులోకి సభ్యులు కానివారు ప్రవేశించడానికి వీల్లేదు. ఈ క్లబ్బులో 2500 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సభ్యత్వం కోసం చాలామంది ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు. ఇందులో సభ్యులు బస చేయడానికి, విందు వినోదాలు జరుపుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, అమిత సంపన్నులైన వ్యాపారవేత్తలు, హాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఇందులో సభ్యత్వం పొందగలరు. ఈ క్లబ్బులో క్లింట్ ఈస్ట్‌వుడ్, రొనాల్డ్ రీగన్, జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు. సామాన్య పౌరులకు, పర్యాటకులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం.సర్పద్వీపంబ్రెజిల్ తీరానికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ సర్పద్వీపం. ఇక్కడ అసంఖ్యాకంగా విషస్పరాలు తిరుగుతూ ఉంటాయి. ఈ దీవి అసలు పేరు ‘ఇలా ద క్వీమాడా గ్రాండె’. ఈ దీవిలో అడుగడుగునా పాములు ఉండటం వల్ల దీనికి ‘స్నేక్ ఐలండ్’ అనే పేరు వచ్చింది. ఈ దీవి విస్తీర్ణం 4.30 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ప్రతి చదరపు అడుగుకు ఒక పాము చొప్పున కనిపిస్తాయి. ఇక్కడ తిరిగే పాముల్లో ‘పిట్ వైపర్’ వంటి అత్యంత ప్రమాదకరమైన పాములు కూడా ఉంటాయి. ‘పిట్ వైపర్’ కాటు వేస్తే, గంట లోపే ప్రాణాలు పోవడం ఖాయం. పాముల కారణంగానే ఈ దీవిలోకి మనుషులకు ప్రవేశం నిషిద్ధం. బ్రెజిల్ పౌరులు గాని, పర్యాటకులు గాని పొరపాటుగానైనా ఈ దీవి వైపుగా వెళ్లరు.సర్‌ట్సీ దీవిభూమ్మీద కొత్తగా ఏర్పడిన దీవి ఇది. ఐస్లండ్ దక్షిణ తీరానికి ఆవల అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి 1963లో సముద్ర గర్భంలో సంభవించిన అగ్నిపర్వతం పేలుడు ఫలితంగా ఏర్పడింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలినప్పుడు దాదాపు ముప్పయివేల అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మింది. ఇది జరిగిన నాలుగేళ్లకు సముద్రజలాల ఉపరితలంపై లావా గడ్డకట్టి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ చిన్నదీవి ఏర్పడింది. ఐస్లండ్ ప్రభుత్వం దీనిని ప్రకృతి సంరక్షణ కేంద్రంగా ప్రకటించి, ఈ దీవిలో మొక్కలు, జంతువుల పెరుగుదలపై పరిశోధనలు చేపడుతోంది. యునెస్కో దీనిని 2008లో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించింది. అగ్నిపర్వతం పేలుడు కారణంగా ఈ దీవి ఏర్పడటంతో, దీనికి ‘నార్స్’ ప్రజల అగ్నిదేవుడైన ‘సర్‌ట్సీ’ పేరు పెట్టారు. ఇందులో పర్యాటకులకు, పౌరులకు ప్రవేశం నిషిద్ధం.గ్లోబల్ సీడ్ వాల్ట్ఇది ప్రపంచదేశాల విత్తనాల ఖజానా. నార్వే దేశానికి, ఉత్తర ధ్రువానికి మధ్య మంచుకొండలతో నిండి ఉండే స్వాల్బార్డ్ దీవిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనాల ఖజానా. వేలాది తిండిగింజలు, ఇతర పంటలకు చెందిన విత్తనాలు, నాలుగువేలకు పైగా వృక్షజాతులకు చెందిన విత్తనాలు ఇందులో భద్రంగా పదిలపరచి ఉన్నాయి. ప్రకృతి బీభత్సాల వల్ల గాని, యుద్ధ వినాశనాల వల్ల గాని ప్రపంచంలో ప్రళయోత్పాతంలాంటి పరిస్థితులు ఏర్పడితే, దీనిలో భద్రపరచిన విత్తనాలను పంపిణీ చేయడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. నార్వే ప్రభుత్వం 12.7 మిలియన్ డాలర్ల (రూ. 110.2 కోట్లు) ఖర్చుతో దీనిని మరింతగా పటిష్టపరచింది. సంబంధిత శాస్త్రవేత్తలు, రక్షణాధికారులకు తప్ప మరెవరికీ దీనిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు.రెడ్ జోన్ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశాలను అక్కడి ప్రభుత్వం ‘రెడ్ జోన్’గా ప్రకటించింది. కొద్దిమంది సైనిక సిబ్బంది తప్ప ఇతరులెవరూ ఈ ప్రదేశాల్లోకి అడుగుపెట్టడం నిషిద్ధం. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ పచ్చని పంట పొలాలతో కళకళలాడేవి. మొదటి ప్రపంచయుద్ధంలో ఈ ప్రాంతంలో బాంబు దాడులు, ఫిరంగి దాడులు జరగడంతో ఇక్కడ ఉన్న చెట్టూ చేమా కూడా తీవ్రంగా నాశనమైపోయాయి. ఇక్కడ పడిన బాంబుల్లో కొన్ని పేలనివి కూడా ఉంటాయి. ఇవి ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. మొదటి ప్రపంచయుద్ధం 1918లో ముగిసిన తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వం ఇక్కడి గ్రామస్థులను ఇతర ప్రదేశాలకు తరలించి, ఈ ప్రాంతాన్ని ‘రెడ్ జోన్’గా ప్రకటించి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలోని నేలను తిరిగి యథాతథ స్థితికి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు సాగిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న పనులు ఇలాగే కొనసాగితే, ఈ ప్రాంతంలోని భూమి వ్యవసాయయోగ్యంగా మారడానికి మరో మూడు నుంచి ఏడు శతాబ్దాలు పట్టవచ్చని అంచనా.మిర్నీ వజ్రాల గనిరష్యాలోని తూర్పు సైబీరియా ప్రాంతంలో ఉన్న వజ్రాల గని ఇది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ నిర్మిత బిలం. దీనిని ‘మిర్ మైన్’ అని కూడా అంటారు. దీని లోతు 1700 అడుగులు. సోవియట్ హయాంలో ఈ ప్రదేశంలో 1955లో వజ్రాల నిక్షేపాలు బయట పడ్డాయి. అప్పటి సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ఇక్కడ గని తవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు. సోవియట్ 1991లో విడిపోయిన తర్వాత ఏర్పడిన రష్యా ప్రభుత్వం కూడా ఇక్కడ 2001 వరకు ఉపరితల ఖనిజ నిక్షేపాల వెలికితీత కొనసాగించింది. రష్యా ప్రభుత్వం ఇప్పటికీ ఇక్కడ భూగర్భంలో గని తవ్వకాలను రహస్యంగా కొనసాగిస్తోందని చెబుతారు. ఈ ప్రదేశం గురించి రకరకాల వదంతులు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ గనికి ఎగువనున్న గగనతలం మీదుగా విమానాలు గాని, హెలికాప్టర్లు గాని ఎగరవు. ఇదివరకు దీని మీదుగా ఎగిరిన హెలికాప్టర్లు కొన్ని దిగువవైపుగా సాగే గాలి ఒత్తిడి వల్ల గని లోపలికి లాక్కుపోయాయని చెప్పుకుంటారు. అయితే, దీనికి సంబంధించిన ఆధారాలేవీ లేవు. ఈ గని పరిసరాల్లోకి అడుగుపెట్టడానికి గని కార్మికులకు, సంబంధిత అధికారులకు తప్ప ఇతరులెవరికీ అనుమతి ఉండదు. సామాన్యులకు ఇది నిషిద్ధ ప్రదేశం. (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం అనాథగా ఆ చిట్టితల్లి..) -
బుక్స్, బ్యాగ్స్ కాదు... మనసు సిద్ధం చేయాలి!
ప్రతి ఏడాది జూన్‌లో పాఠశాలలు మొదలవుతాయి. పుస్తకాలు, యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు కొనడంలో తల్లిదండ్రులు దుకాణాల వద్ద బిజీగా ఉంటారు. కాని, ఈ హడావుడిలో మర్చిపోయే విషయం ఒక్కటే– ‘స్కూలుకు బిడ్డ మనసు సిద్ధంగా ఉందా లేదా?’వేసవి సెలవుల సరదాను వదిలి బయటకు రావడం, కొత్త క్లాసులో కొత్త టీచర్లు ఎలా ఉంటారో? అనే ఆందోళన, మళ్లీ మార్కుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం చిన్నారుల మనసులో ఆందోళన రేకెత్తిస్తుంటాయి. పిల్లలు భయపడ్డప్పుడు వారి మెదడులోని అమిగ్డాలా (భయ కేంద్రం) తీవ్రంగా స్పందిస్తుంది. అది వారు నిర్ణయం తీసుకునే, జ్ఞాపకాలను నిలుపుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను బంధించి వేస్తుంది. ఫలితంగా వారి మెదడు కొత్త విషయాలను గ్రహించలేదు.భావోద్వేగ భద్రత ఉన్న పిల్లలు మాత్రమే చదువులో, స్వభావంలో, జీవిత గమ్యంలో ముందుకు వెళ్లగలుగుతారని ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలోని డెవలపింగ్ చైల్డ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది. అందుకోసం ఈ ఐదు సూత్రాలను పాటించండి... 1. వాళ్ల భయాలను గౌరవించండికొత్త విషయాలు మొదలయ్యేప్పుడు భయపడటం సర్వసాధారణం. అది తప్పు కాదు. భావోద్వేగాలను పేరు పెట్టి పలకడం వల్ల మెదడులోని ఎమోషనల్ కేంద్రం శాంతిస్తుందని డాక్టర్ డ్యాన్ సీగల్ చెప్పారు. అందుకే స్కూల్ గురించి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టండి. ∙‘‘ఈసారి స్కూలుకు సంబంధించి ఏది బాగా నచ్చింది?’’∙‘‘ఏమైనా భయంగా ఉందా?’’∙‘‘ఈసారి నిన్ను నీవు ఎలా మెరుగుపరచు కోవాలని అనుకుంటున్నావు?’’2. ఉదయాల్ని రణరంగం చేయకండిప్రతిరోజూ ఉదయం ‘‘త్వరగా లే! బ్రష్ చేయి! బస్ మిస్ అవుతాం!’’ అని అరవకండి. ఇంటిని రణరంగంగా మార్చకండి. పిల్లల నెర్వస్ సిస్టమ్‌ను శాంతంగా ఉంచేందుకు ఈ చిట్కాలు ఉపయోగించండి. లైట్ మ్యూజిక్ ప్లే చేయండిరెండు నిమిషాలు పక్కన కూర్చుని, ప్రేమను పంచండి. ‘‘ఈరోజు నీ స్టైల్లో మెరిసిపోతావ్’’ అని సానుకూల వాక్యాన్ని పలకండి.3. పాత ఫ్రెండ్స్ ను రీకనెక్ట్ చేయండి‘‘మా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపెట్టుకుంటారా?’’, ‘‘ఎవరైనా తోడు ఉంటారా?’’ అనేదే పిల్లలకు ముఖ్యమైన భయం. ఈ భయాన్ని అధిగమించేందుకు ఈ పనులు చేయండి. ఇవి వారి మెదడులో ఆక్సిటోసిన్‌ను పెంచుతాయి. భావోద్వేగ భద్రతను పెంపొందిస్తుంది. స్కూల్ మొదలయ్యే ముందు ఒక ప్లే డేట్ ఏర్పాటు చేయండిఒకరిద్దరు క్లాస్మేట్లతో ఫోన్ ద్వారా మాట్లాడనివ్వండిక్లాసులో నడిచే కొన్ని సన్నివేశాలను రోల్ ప్లే చేయండి4. భావోద్వేగ లక్ష్యాలు కూడా పెట్టండిచాలామంది తల్లిదండ్రులు పిల్లలను ‘‘ఎన్ని మార్కులు వస్తాయి?’’ అని అడుగుతుంటారు. దీనికి బదులుగా భావోద్వేగ లక్ష్యాలను పెట్టండి. అది పిల్లల్లో అంతర్గత ప్రేరణను పెంచుతాయి.‘‘ఈ సంవత్సరం నువ్వు ఎలా అనిపించుకోవాలని అనుకుంటున్నావు?’’‘‘ఎలాంటి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావు?’’‘‘నీ గురించి నువ్వు గర్వపడేలా ఏం చేస్తావు?’’5. మీ స్కూల్ అనుభవాలను పంచుకోండిమీరు కూడా స్కూలుకు వెళ్లేటప్పుడు భయపడ్డారని చెప్పండి. ఉదాహరణకు:‘‘ఒకసారి టీచర్ నన్ను బాగా కొట్టింది. అప్పట్లో చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ సంఘటన వల్ల నేను మరింత మృదువుగా మాట్లాడటం నేర్చుకున్నాను’’ అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల బిడ్డ ‘‘నా భావోద్వేగాలు తప్పు కావు’’అన్న భద్రతను పొందుతాడు.ప్రతి రోజు అడగాల్సిన మూడు ప్రశ్నలుమీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ప్రతిరోజూ ఈ మూడు ప్రశ్నలూ అడగండి. ఇవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగ పరిణతిని, అనుబంధాన్ని పెంచుతాయి.1. ‘‘ఈ రోజు నీకు ఏం నచ్చింది?’’2. ‘‘ఏదైనా బాధించిందా?’’3. ‘‘ఏ విషయం పట్ల నీకు గర్వంగా అనిపించింది?’’చేయకూడనిమూడు పొరపాట్లు1. ‘‘అన్నయ్య/చెల్లెలు ఎలా టాపర్ అయ్యారో చూడు!’’ అంటూ పోల్చవద్దు. ఇది అవమానాన్ని కలిగిస్తుంది.2. ‘’90 శాతం మార్కులొస్తే ఫోన్ కొనిస్తా’’ అని చెప్పొద్దు. ఇది పిల్లల్లో బాహ్య ప్రేరణను పెంచుతుంది. బహుమతుల కోసమే చదవడం అలవాటవుతుంది. 3. పిల్లలను అతి ఎక్కువ ట్యూషన్లతో నింపొద్దు. వారిలో మానసిక అలసట పెరుగుతుంది.సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: ఆ చేదు అనుభవమే స్టార్టప్‌గా అంకురార్పణ..! ఇవాళ అమెరికాలో..) -
ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
మిస్ ఇండియా ట్యాగ్ ఉన్నా, ఆమె స్టయిల్ మాత్రం ‘హే, నేను మీ పక్కంటి అమ్మాయినే!’ అనే నేచురల్ స్వాగ్తో ఉంటుంది. అదే మీనాక్షి చౌదరి మ్యాజిక్! స్కిన్‌కి మేకప్ కంటే, మినిమలిజమే బెస్ట్ ఫిల్టర్ అంటూ, చిన్న చిరునవ్వుతో మెరిసే మీనాక్షి చెప్పిన కొన్ని స్టయిలింగ్, బ్యూటీ సీక్రెట్స్ మీకోసం.. సింపుల్‌గా ఉంటూనే ప్రతి లుక్‌లోనూ ప్రత్యేకతను కోరుకుంటా. అలాగే, మేకప్ కంటే, స్కిన్కేర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. రోజూ నీళ్లు తాగడం, హెల్దీ డైట్, పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేయడం– ఇవే నా బ్యూటీ సీక్రెట్స్. ఎమరాల్డ్ గ్రీన్, రాయల్ బ్లూ, ఫైరీ రెడ్ రంగులు నా ఫేవరెట్. ఇవి వేసుకుంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. – మీనాక్షి చౌదరి.సింగిల్ కింగ్! సాంప్రదాయానికి స్టయిలిష్ లుక్ కావాలంటే, స్టేట్మెంట్ చోకర్ ఉండాల్సిందే!. ఇది మెడకు ఒక మినీ ఆటిట్యూడ్ ఇచ్చే హారం. సాధారణ చోకర్స్ కంటే వివిధ రకాల పూసలు, రత్నాలతోపాటు వైవిధ్యమైన కళాత్మక డిజైన్స్‌తో ఉంటుంది. చూడటానికి చిన్నదిగా కనిపించినా, దీన్ని వేసుకున్న వెంటనే అద్దం ముందు నాలుగు రౌండ్లు తిరగాల్సిందే! ఎందుకంటే, ఈ హారం మిమ్మల్ని ప్రతి యాంగిల్లోనూ చాలా కొత్తగా చూపించగలదు. దీనిని చీరలతో ధరించాలి అనుకుంటే గాఢమైన ముదురు రంగుల చోకర్స్ను ఎంచుకోండి. ఇక ప్లెయిన్ డిజైన్, లైట్ కలర్స్ లెహంగా, కుర్తీలపై కూడా ఇది బాగా నప్పుతుంది. జడ లేదా హై బన్, స్లీకీ బన్ హెయిర్ స్టయిల్‌తో చోకర్స్ని మరింత హైలైట్ చేయొచ్చు. అలాగే మేకప్ మినిమమ్ ఉంటే చోకర్ మరింత బ్రైట్‌గా కనిపిస్తుంది. అయితే, ఈ చోకర్ను వేరే హారాలతో కలపకుండా స్టయిలింగ్ చేసుకోవడంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే, ఇది సింగిల్‌గానే రాయల్‌గా కనిపిస్తుంది. అందుకే, ఇది వేసుకున్న వారి వద్దకు ‘అందంగా లేనేమో’ అనే అనుమానం దరిదాపుల్లోకి కూడా రాదు. జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ధర: రూ. 17,000చీర బ్రాండ్: జాన్కీ ఇండియా, ధర: రూ. 44,800బ్లౌజ్ ధర: రూ. 17,000 (చదవండి: నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళ ఆమె..!) -
Infertility : అధిక బరువు ఉంటే ప్రెగ్నెన్సీ రాదా..?
నా బరువు వంద కిలోలు. పెళ్లైయి రెండు సంవత్సరాలు అవుతుంది. కాని, ప్రెగ్నెన్సీ రావటం లేదు. ప్రెగ్నెన్సీ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– లలిత, కర్నూలు. ఊబకాయం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన సమస్య. మరీ ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పయ్యేళ్ల మధ్య వయస్సు మహిళలలో అధిక బరువు వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నెలసరి క్రమంగా రాకపోవడం, వచ్చినా ఎక్కువ, తక్కువ బ్లీడింగ్ అవటం ఉంటుంది. దీనితో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి ఇతర జబ్బులు కూడా చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. వీటితో ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. దీనికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అంటే జంక్ ఫుడ్, ఫాస్టఫుడ్, బేకరీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. వీటితో పాటు రోజుకు కనీసం ముప్పయి నుంచి నలభై నిమిషాలు వ్యాయామం లేదా యోగా వంటివి చేస్తూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు థైరాయిడ్, డయాబెటిస్, హిమోగ్లోబిన్ వంటివి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ సూచించిన మందులను వాడాలి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు నుంచే ఉపయోగించడం వలన అధిక బరువు, ఊబకాయం వలన వచ్చే సమస్యలను అధిగమించి ఆరోగ్యకరంగా గర్భందాల్చి, ఆరోగ్యకరమైన శిశువును పొందవచ్చు.ప్రెగ్నెన్సీలో ఓబెసిటీ వల్ల కలిగే సమస్యలు, వాటి పరిష్కారాలను వివరించండి? – శ్రీలలిత, వైజాగ్ఊబకాయంతో బాధపడుతున్న స్త్రీలు గర్భధారణకు ముందు నుంచే తమ బరువును నియంత్రణలోకి తెచ్చుకోవాలి. లేకపోతే ఓబెసిటీ కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. ఫలితంగా గర్భం దాల్చే ప్రక్రియలో ఆటంకం ఏర్పడుతుంది. బరువు నియంత్రణలో లేకపోతే తల్లి ఆరోగ్యంపైనే కాకుండా శిశువు అభివృద్ధిపైనా కూడా ప్రభావం పడుతుంది. గర్భధారణ మొదటి మూడునెలల్లో గర్భస్రావం జరగడం, శిశువులో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, తల్లికి గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. వీటివలన శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పుట్టబోయే బిడ్డ ఎక్కువ లేదా తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు కాన్పు సమయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఉదాహరణకు, బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం వలన సాధారణ కాన్పు సాధ్యపడక, శస్త్రచికిత్స అవసరమవుతుంది. ప్రసవ సమయంలో ఎక్కువ రక్తస్రావం, కుట్లు సరిగ్గా మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అనస్థీషియా సంబంధిత ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా తల్లి అధిక బరువు కారణంగా భవిష్యత్తులో మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శిశువు నెలలు నిండక ముందే పుట్టి, కొంతకాలం ఇన్‌క్యుబేటర్‌లో ఉంచాల్సి రావచ్చు. అందుకే, గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవం తరువాత కూడా బరువును నియంత్రించాలి. గర్భం దాల్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు, అవసరమైన రక్తపరీక్షలు, శిశువు ఎదుగుదలపై తగిన స్కానింగ్‌లు చేయించుకోవాలి. పోషకాహార సప్లిమెంట్లు, అవసరమైన మందులు డాక్టర్ సూచించిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇతర నిపుణుల సలహాలు పాటిస్తూ, ఆరోగ్యవంతమైన ప్రెగ్నెన్సీ జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు. డా‘‘ ప్రియదర్శిని, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..) -
నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళ ఆమె..!
‘నావల్ ఏవియేషన్‌లో కొత్త అధ్యాయం మొదలైంది’ అని సగర్వంగా, సంతోషంగా ప్రకటించింది భారత నౌకాదళం. లింగ సమానత్వం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళుతున్న భారత నౌకాదళం మరో చారిత్రక ఘట్టానికి తెర తీసింది. భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా చరిత్ర సృష్టించింది...తొలి స్వాతంత్య్ర పోరుకేక వినిపించిన ప్రాంతంగా మీరట్‌కు చరిత్రలో ప్రత్యేకస్థానం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఆస్తా పూనియా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్ల గురించి విని ఉండవచ్చు.ఇప్పుడు తానే ఒక ఫైటర్ (పైలట్)గా చరిత్ర సృష్టించింది. నావిక విమానయానం (నావల్ ఏవియేషన్)లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అనేది లక్ష్యంగా ఉంటుంది. నావిక విమాన యానంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల శక్తిసామర్థ్యాలు, అంకితభావానికి ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం ప్రధాన మైలురాయి. విశాఖపట్టణంలో జరిగిన ఐఎన్ఎస్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డు అందుకుంది ఆస్తా పూనియా. పూనియాకు ఎలాంటి సైనిక కుటుంబ నేపథ్యం లేదు. బీటెక్ చేసిన తరువాత నేవీకి ఎంపికైంది. ఫైటర్‌గా భవిష్యత్‌లో మిగ్–28,కె నౌకాదళ రఫెల్ యుద్ధ విమానాలను ఆస్తా పూనియా నడిపే అవకాశం ఉంది. ఇప్పటివరకు మహిళా అధికారులు భారత నావికాదళంలో పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్లుగా సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్లలో విధులు నిర్వహిస్తున్నారు. నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళగా పూనియా చరిత్ర సృష్టించింది. ‘నౌకాదళ వైమానిక విభాగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే నిబద్ధతకు ఈ చారిత్రక ఘట్టం అద్దం పడుతుంది. ఆస్తా పూనియా అనేక అడ్డంకులను అధిగమించి నూతన శకానికి నాంది పలికింది’ అని ‘ఎక్స్’ వేదికగా భారత నౌకాదళం ప్రకటించింది.త్రివిధ దళాలలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2016లో తొలిసారిగా మహిళలను ఫైటర్ స్ట్రీమ్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫైటర్లు ‘ఐఏఎఫ్’లో రాఫెల్, సు–30ఎంకెఐ, మిగ్–29ఎస్ నడుపుతున్నారు. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మేజర్ అభిలాష ఫస్ట్ ఉమెన్ కాంబాట్ ఏవియేటర్‌గా చరిత్ర సృష్టించింది.2023లో తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్‌ను నియమించి భారత నౌకాదళం చారిత్రక నిర్ణయం తీసుకుంది. 2020 నుంచి భారత నౌకాదళంలో మహిళా అధికారుల నియామకం 15 శాతం పెరిగింది. త్రివిధ దళాలలో గత కొన్ని సంవత్సరాలుగా మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, లింగ సమానత్వం వైపు వేస్తున్న అడుగులు చూస్తుంటే ‘అన్నీ మంచి శకునములే’ అనిపిస్తోంది.వింగ్స్ ఆఫ్ గోల్డ్‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అనేది నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన పురస్కారమే కాదు... ప్రతిష్ఠాత్మకమైన పుస్తకం కూడా! యూఎస్ నావల్ ఏవియేషన్‌లో చరిత్ర సృష్టించిన ఆరుగురు మహిళల గురించి రాసిన పుస్తకం ఇది (వింగ్స్ ఆఫ్ గోల్డ్–ది స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ ఉమెన్ నావల్ ఏవియేటర్స్) నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడపడంలో మహిళలకు శిక్షణ ఇవ్వాలని నావల్ ఆపరేషన్స్ చీఫ్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నో వెక్కిరింపు మాటలు వినిపించాయి. ‘వారు నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా సైన్యంలో పనిచేయలేరు’ అనే మాట బలంగా వినిపించింది. ఇలాంటి పురుషాధిపత్య భావజాలాన్ని తుత్తునియలు చేస్తూ ఈ ఫైటర్ పైలట్లు దూసుకెళ్లారు. చరిత్రలో నిలిచిపోయారు. బార్బరా ఆలెన్ రైని ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డ్ అందుకున్న తొలి మహిళ. ఆమె సి–1 ట్రేడర్, టి–39 శేబర్లినర్లాంటి యుద్ధ విమానాలను నడిపేది. అమెరికా నావికాదళానికి సంబంధించి తొలి మహిళా ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్లలో ఆమె ఒకరు. 1982లో ఒక ట్రైనింగ్ ఫ్లైట్ ప్రమాదంలో మరణించింది. (చదవండి: -
మెడనొప్పి 'పీకల' మీదకు...
మెడనొప్పి అనే సమస్య జీవితకాలంలో ప్రతి వ్యక్తీ ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొనేదే. అయితే అదేపనిగా నొప్పి వస్తుంటేనో లేదా మెడ నుంచి అది భుజానికీ లేదా చేతుల చివరలకో పాకుతుంటే మాత్రం కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. మెడనొప్పికి కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం. తీవ్రమైన మెడనొప్పి కారణంగా కొన్నిసార్లు కొంతమందిలో నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్రవిసర్జనలో సైతం తేడాలు వచ్చి ఇతర సమస్యలకూ దారితీయవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి వచ్చే నొప్పిని మినహాయించి, పదే పదే నొప్పి వస్తున్నా లేదా దీర్ఘకాలంగా బాధిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.ఎందుకీ మెడనొప్పి... మెడ భాగంలో ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటిదాన్ని అట్లాస్ అనీ, రెండో వెన్నుపూసను యాక్సిస్ అంటారు. ఈ తర్వాత ఉండే పూసలను వరసగా సి3, సి4, సి5, సి6, సి7 అని పిలుస్తారు. ఈ వెన్నుపూసల మధ్య ఉండే ప్రదేశాన్ని స్పైనల్ కెనాల్ అంటారు. దానిలోంచి వెన్నుపాము వెళ్తూ మెదడు నుంచి చేతులు, కాళ్ల చివరి వరకు నరాలను తీసుకెళ్తుంది. వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్యనున్న ‘వర్టిబ్రల్ ఫొరామినా’ అనే రంధ్రాల నుంచి వెన్నుపాము తాలూకు నరాలు బయటకు వచ్చి అన్ని అవయవాలకూ వ్యాపించి ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యన కుషన్‌లా, షాక్ అబ్జార్బర్‌లా డిస్క్‌లు ఉంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్య కుషన్‌లా ఉండే డిస్క్‌లు పక్కకు జారడం వల్లనో లేదా బాగా అరగడంతో నరాలపై (ప్రధానంగా చేతులకి సప్లై అయ్యే నరాలపై) ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంటుంది. మెడదగ్గర ఉండే నరాలు భుజం వరకు ఉండటంతో ఈ నొప్పి మెడ నుంచి భుజం మీదుగా చేతుల వరకు పాకుతూ బాధిస్తుంటుంది.నిర్ధారణ ఇలా... మెడనొప్పి వచ్చే వారికి తొలుత ఎక్స్–రే పరీక్ష చేయిస్తారు. ఇందులో మెడ వెన్నుపూసలలో ఏమైనా తేడాలు వచ్చాయా అని తెలుస్తుంది. మరింత సునిశితమైన అంశాల కోసం ఎమ్మారై కూడా చేయించాల్సి రావచ్చు. ఏ నరంపై ఎంత ఒత్తిడి ఉంది, దేనివల్ల కలుగుతోంది, ఎముక ఏదైనా ఫ్రాక్చరైందా, నరాల్లో వాపు, గడ్డలు ఉన్నాయా... లాంటి అనేక విషయాలు ఎమ్మారైలో తెలుస్తాయి. ఉపశమనం కోసం... మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్లలో మెత్తటి గుడ్డను ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టాలి. ఐస్ ముక్కను బట్టలో చుట్టి కాపడం పెట్టడం కూడా మంచిదే. ఈ కాపడాల వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెడ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా మెడకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో మెడ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అలా విశ్రాంతి ఇవ్వకపోతే నొప్పి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నొప్పి ఉన్న సమయంలోనే గాక... మామూలు వేళల్లోనూ ఒకే భుజానికి బరువైన బ్యాగ్‌ల వంటివి తగిలించుకోకూడదు. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. నడిచే సమయంలో ఒకేవైపునకు ఒంగడం సరికాదు. చికిత్స...సాధారణ మెడనొప్పి అయితే పెయిన్‌కిల్లర్ ఆయింట్మెంట్లను రోజుకి ఐదు నుంచి ఆరుసార్లు పూయాలి.నొప్పి నివారణ కోసం దీర్ఘకాలం పెయిన్‌కిల్లర్స్ ఉపయోగించడం సరికాదు. ఒకవేళ పెయిన్‌కిల్లర్స్‌తో ఒకటి రెండు రోజుల్లో రిలీఫ్ రాకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను / ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.డిస్క్ తన స్థానం నుంచి పక్కకు జరగడం లాంటిది జరిగితే శస్త్రచికిత్సతో సరిదిద్దాల్సిన అవసరం పడవచ్చు. డాక్టర్ రవితేజా రెడ్డి, కారుమూరి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..) -
హీరో సల్మాన్‌ఖాన్ సైతం అల్లాడిపోయాడు ఆ వ్యాధితో..!
ఇదో నరాలకు సంబంధించిన సమస్య. బాలివుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ సమస్యతో బాధపడటంతో ఇటీవల ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది. నరం తాలూకు సమస్య కావడంతో ఒకేచోట మాటిమాటికీ షాక్ తగులుతున్నట్టు, కనిపించని పదునైన కత్తితో పదే పదే పొడుస్తున్నట్టు బాధించే సమస్య ఇది. తానెదుర్కొన్న ఇతర వైద్య సమస్యలైన బ్రెయిన్ అన్యురిజమ్స్, ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ల గురించి చెబుతూనే... తన ఇతర సమస్యలతో పోల్చినప్పుడు ‘‘ట్రైజెమినల్ న్యూరాల్జియా అనేది మనిషి అనుభవించే నొప్పులలో అత్యంత చెత్త నొప్పి’’ అంటూ తన బాధను వెల్లడించాడు. మొదట 2007లో ఆ తర్వాత 2011లో ఈ సమస్యతో సతమతమైన అతడు ఇటీవల మళ్లీ తాజాగా ఈ సమస్య తనను బాధించినట్లు వార్తలు వెలువడ్డాయి. మొదట కాస్త అరుదైనదిగా పరిగణించే ఈ వ్యాధి తాలూకు కేసులు మునపటితో పోలిస్తే ఇటీవల కాస్త ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ‘ట్రైజెమినల్ న్యూరాల్జియా – (టీఎన్)’ గురించి తెలుసుకుందాం...మొదట్లో ట్రైజెమినల్ న్యూరాల్జియా బాధ చెంప భాగంలో నొప్పితో మొదలవుతుంది. కొన్ని సెకన్ల పాటు భయంకరంగా వచ్చే ఈ వ్యాధి కొన్ని సెకన్లు మొదలుకొని రెండు నుంచి కొన్ని నిమిషాలు బాధిస్తూ ఉంటుంది. ఓ పదునైన కత్తితో పొడుస్తున్నట్లు, భయంకరంగా షాక్ కొడుతున్నట్టు వచ్చే ఈ వ్యాధిలో... సమయం గడుస్తున్న కొద్దీ బాధించే వ్యవధి పెరుగుతూ పోతూ చాలా భరించలేనంత వేదనాభరితంగా ఉంటుంది. రోజులో 10 నుంచి 15 సార్లవరకూ రావచ్చు. మాట్లాడేటప్పుడు, నమిలేటప్పుడు, చల్లటి నీళ్లు తాగేటప్పుడు చాలా బాధాకరమైన రీతిలో బాధిస్తుంటుంది. ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే... మన దేహంలో మెదడు నుంచి వెన్నుపాము నుంచి అన్ని శరీర భాగాలకు నరాలు ఒక నెట్వర్క్లా వ్యాపించి ఉంటాయి. ఈ నరాల ద్వారానే మెదడు తన అన్ని శరీర భాగాలను నియంత్రిస్తుంటుంది. ముఖాన్నీ, ముఖ భాగాలను నియంత్రించే నరాన్ని ‘ట్రైజెమినల్ నర్వ్’ అంటారు. ఈ నరం నుంచి వచ్చే నొప్పిని ‘ట్రైజెమినల్ న్యూరాల్జియా’ అంటారు. మెదడులోని బ్రెయిన్ స్టెమ్ నుంచి వచ్చే ఈ నరం లోపలి చెవి (ఆడిటరీ కెనాల్) పక్క నుంచి వచ్చి ముఖంలోని చెంప దగ్గర మూడు భాగాలుగా విడిపోతుంది. ఎందుకీ నొప్పి..? కొందరిలో ట్రైజెమినల్ నరం పక్కన ఉండే రక్తనాళం మెలిదిరగడంతో అది ‘డీమైలినేషన్’ అనే ప్రక్రియకు గురవుతుంది. ప్రతి నరం చుట్టూతా ఉండే మైలిన్ అనే పొర దెబ్బతినడాన్ని్న డీమైలినేషన్ అంటారు. దాంతో నరం వాచి, ఈ సమస్య వస్తుంది. కొందరిలో హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ కారణంగా కూడా నొప్పి వస్తుంది. ఈ వైరస్ నరం లోపల ఉన్న గాసేరియన్ గాంగ్లియాన్ అనే భాగంలో ఈ వైరస్ నిద్రాణంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ వైరస్ ఉత్తేజితం కావడంతో ఈ నొప్పి తీవ్రతరమవుతుంది. చికిత్స... దాదాపు 90 శాతం కేసుల్లో మందులతో ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే పది శాతం మందిలో నొప్పి తగ్గిన తర్వాత కూడా మళ్లీ నొప్పి తిరగబెట్టేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు వాడుకలో ఉన్న మందులు (ముఖ్యంగా కార్బమాజిపిన్, ఆక్స్కార్టమాజిపిన్, అమైట్రిప్టలిన్, గాబాపెంటిన్, ప్రిగాబాలిన్, బాక్లోఫిన్, వాల్‌ప్రోయేట్ వంటి మందులను) సరైన మోతాదులో వాడటం వల్ల దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు.చికిత్స సాధారణంగా కార్బమాజెపైన్ వంటి యాంటీకన్వల్సెంట్ మందులతో మొదలవుతుంది. మందులు పనిచేయకపోతే లేదా వాటితో తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. మైక్రోవాస్క్యులర్ డీకంప్రెషన్ అనే పిలిచే ఈ శస్త్రచికిత్సలో నరానికి వెళ్లే రక్తనాళాన్ని మెలితిప్పి వదిలేస్తారు. ఫలితంగా చాలాకాలం పాటు ఉపశమనం పొందవచ్చు. రిస్క్ తక్కువగా ఉండే రైజాటమీ, లేదా స్టీరియో టాక్టిక్ రేడియోసర్జరీ వంటి చికిత్సల్లో నర్వ్ ఫైబర్లను అడ్డుకుని తద్వారా నొప్పిని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. చివరగా... ట్రెజెమినల్ న్యూరాల్జియా నొప్పి కారణంగా జీవిత నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) చాలా తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ నొప్పిని తట్టుకోలేక డిప్రెషన్‌కు లోనయ్యే ముప్పు కూడా ఉంటుంది. అందుకే ఆ వ్యక్తికి సంబంధించిన తీవ్రత... మందులతో కలిగే ఉపశమనం వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత చికిత్స ప్రణాళికతో చికిత్స అందించాల్సిన అవసరముంటుంది.ట్రైజెమినల్ న్యూరాల్జియాలాగే అనిపించే ఇతర జబ్బులుట్రైజెమినల్ ఆటోనామిక్ సెఫాలాల్జియా : ఇది ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంటుంది. కన్ను చుట్టూ ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా. కంట్లో నీళ్లు వస్తుంటాయి. ముక్కు తడి అవుతుంది. నొప్పి చాలామట్టుకు ట్రైజెమినల్ న్యూరాల్జియా లాగే ఉండటంతో ఒక్కోసారి అదే అనుకుని పొరబడే అవకాశాలెక్కువ. గ్లాసోఫ్యారింజియల్ న్యూరాల్జియా : ఈ కండిషన్లో ముఖంలో కంటే మెడ పక్క భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. గుటక వేసేప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. పోస్ట్ హెర్పెటిక్ ట్రైజెమినల్ న్యూరాల్జియా : మొదట ముఖ మీద నీటి పొక్కులాంటివి వచ్చి, అవి ఎండిపోయాక నల్లటి మచ్చలుగా తయారవుతాయి. అవి తగ్గిపోయిన వారం రోజుల తర్వాత విపరీతమైన నొప్పి వస్తుంది. ఇది ఎక్కువగా 50 ఏళ్లు దాటినవారిలో కనిపిస్తుంది. డెంటల్ కేరిస్ : పళ్లు పుచ్చినప్పుడు గాని, పంటి చుట్టూ ఉండే చిగురుకు గాని ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముఖంలో నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి ట్రైజెమినల్ న్యూరాల్జియాలా కేవలం కొద్ది సెకన్ల పాటే ఉండకుండా రోజంతా ఉంటుంది ∙ప్రమాదవశాత్తు ముఖానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడుగాని, ముఖంలోని ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడుగాని... గాయాలు మానిన తర్వాత ముఖంలో నొప్పి రావచ్చు. గ్లకోమా : కంటికి సంబంధించిన రుగ్మత అయిన గ్లకోమాలో కంటిలోపలి ద్రవపు ఒత్తిడి లెన్స్‌పై పడినప్పుడూ ముఖంలో నొప్పి వస్తుంది.లక్షణాలు... ఇది మొహానికి ఒకవైపే వస్తుంది. ఎక్కువగా చెంప/దవడ భాగంలో వస్తుంది ∙కొన్నిసార్లు కంటి చుట్టూ వస్తుంది ∙నొప్పి చాలా తీవ్రంగా కత్తితో పొడిచినట్లుగా రావడంతో దీన్ని ‘స్టాబింగ్ పెయిన్’ అని అంటారు ఈ నొప్పి కొద్ది సెకన్లు మొదలుకొని ఒకటి రెండు నిమిషాల పాటు రావచ్చు రోజులో ఐదు మొదలుకొని 15 లేదా 20 సార్లు రావచ్చు ∙తినేటప్పుడు, నమిలేసమయంలో, మాట్లాడేటప్పుడు ఇది తీవ్రమవుతుంది ∙ఒక్కోసారి ఈ నొప్పి వచ్చినప్పుడు నోటి నుంచి కొద్దిగా లాలాజలం స్రవించవచ్చు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. (అంటే... మహిళలు, పురుషుల్లో 60 : 40 నిష్పత్తిలో కనిపిస్తుంది) ముప్పయి ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ జి. రంజిత్, సీనియర్ న్యూరాలజిస్ట్ –స్ట్రోక్ ఇంటర్వెన్షనిస్ట్ (చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?) -
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం అనాథగా ఆ చిట్టితల్లి..
ప్రకృతి వైపరిత్యాలు ఎవ్వరికి ఎలాంటి విషాదాన్ని ఇస్తుందో చెప్పలేం. అమాంతం ఉప్పెనలా విరుచుకపడే ఆ విలయం మిగిల్చే బాధ మాటలకందనిది. అందుకు సంబంధించి ఎన్నో ఉదంతాలను చూశాం. అలానే ఇటీవల కురిసిన భారీ వర్షాలు హిమచల్ ప్రదేశాన్ని ఎంతలా అతలా కుతలం చేశాయో తెలిసిందే. అయితే దాని కారణంగా అనాథగా మారిన ఓ చిట్టితల్లి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎలా బతికి బట్టగట్టకలిగిందంటే..అసలేం జరిగిందంటే..ఎడతెరపిలేని వర్షాలకు వరదలు సంభవించి హిమచల్‌ప్రదేశ్ అతలాకుతలమైన సంగతి తెలిసింది. ఈ ప్రకృతి వైరిత్యం కారణంగా భారీగా ఆస్తి, జన నష్టం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో హిమచల్ ప్రదేశ్‌లోని సిరాజ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం మొత్తం ఈ విపత్తుకు బలైపోయింది. ఆ కుటుంబానికి చెందిన 11 నెలల కూతురు ఒక్కత్తే బతికి బట్టగట్టగలిగింది. ఈ విపత్తు కారణంగా ఒరిగిపోయిన చెట్లు, భవనాల శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఆ చిన్నారి లభించడం విశేషం. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ఆ చిన్నారి ఇల్లు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమె తల్లి, తండ్రి, నానమ్మ చనిపోగా, ఆ చిన్నారి ఒక్కత్తే అనాథగా మిగిలిపోయింది. ఇవేమి ఆ చిన్నారికి తెలియక అమాయకంగా అందరిని చూస్తున్న తీరు అందరిని కలచివేస్తోంది. శిథిలంగా మారిన ఆ ఇల్లు పర్వాడ గ్రామానికి చెందని రమేష్ ఇల్లుగా గుర్తించారు. ఆ ఇల్లు డ్రెయిన్ సమీపంలో ఉండటంతో, జూన్ 30న కురిసిన వర్షాలకు నీటి ఉద్ధృతి ఎక్కువై కొట్టుకుపోయింది. అయితే దీనిని ముందుగానే గమనించి రమేష్ కూతురిని ఇంటిలోపల పడుకోబెట్టి, తన భార్య తల్లితో కలిసి ఇంటి వెనకకు వెళ్లాడు. అంతే ఆ వరద ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు. ఐతే చిన్నారి ఇంటిలోనే ఉండటంతో సురక్షితంగా శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉందని చెబుతున్నారు అధికారులు. ఆ చిన్నారి పేరు నిఖితగా గుర్తించారు. అయితే రెస్క్యూ సిబ్బంది ఆ చిన్నారి తండ్రి మృతదేహాన్ని వెలికితీశారు కానీ తల్లి, భార్య మృతదేహాలు మాత్రం కానరాలేదు. అందుకోసం ముమ్మరంగా గాలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఆ చిన్నారి మేనత్త తారాదేవి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఈ హృదయవిదారక ఘటన గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున అభ్యర్థనలు రావడం విశేషం. విత్తుల సహాయ నిర్వహాణ అధికారి స్మృతికా నేగి ఆ చిన్నారి నికితా బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి తన మేనత్త పర్యవేక్షణలో ఉందని తెలిపారు. కాగా, ఈ హిమచల్‌ప్రదేశ్ వర్ష బీభత్సానికి సుమారు 700 కోట్ల మేర ఆస్తి నష్టం తోపాటు 69 మంది దాక మృత్యువాత పడ్డారు.(చదవండి: Droupadi Murmu: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...) -
లామాకాన్..కళా 'మకాన్'!
ఇల్లు కానిది.. విలువైనది.. ‘కళ’కళ లాడేది.. అదే లామకాన్. లామకాన్ అంటే ఇల్లు కానిదని అర్థం.. బంజారా హిల్స్ రోడ్ నెం–1లో వెంగళరావు పార్క్ సమీపంలోని గల్లీలో ఉంది ఈ ‘కళా’మకాన్. ఇదొక సాంస్కృతిక నిలయం. ఇక్కడ అన్ని రంగాలకు చెందినవారు, వయోభేదం లేకుండా కళాప్రియులు, యువత అధికంగా కనిపిస్తారు. లోపలికి వెళితే సినిమాలు, నాటకాల గురించి కొందరు, సంగీతం నేర్చుకుంటూ మరికొందరు, సోషల్‌మీడిమా, కార్పొరేట్ వ్యక్తుల బిజెనెస్‌పై ఇంకొందరు చర్చిస్తూ కనిపిస్తారు. ఇక్కడికి అన్ని రంగాల ప్రముఖులు వచ్చి తమ ఆలోచనలను పంచుకుంటుంటారు. కళలను ప్రదర్శిస్తుంటారు. నగరవాసులతోపాటు తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. లామకాన్ అనేది ఒక కళాకారుడి కలల నిలయం.. నగరానికి చెందిన పెయింటర్, ఫొటోగ్రాఫర్ మొయిద్ హసన్ ఎంతో నచి్చ, మెచ్చి ఈ ఇల్లు నిరి్మంచుకున్నారు. ఆయన తన కళతోపాటు సామాజిక సమస్యలపై డాక్యుమెంటరీలను సైతం తీశారు. హసన్ జీవించినంత కాలం ఇక్కడ ఆయన కళా స్నేహితులు, సాహితీవేత్తలతో నిత్యం కళకళలాడుతుండేది. ఆయన మరణాంతరం నిలయం బోసిపోయింది. హసన్ జ్ఞాపకార్థం దీనిని లామకాన్గా మార్చారు. ప్రవేశం, వైఫై ఉచితం... లామకాన్లోకి ప్రవేశం, వైఫై ఉచితం. ఉదయం నుంచి రాత్రి వరకూ లామకాన్ సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుంది. సోమవారం సెలవుదినం. కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిర్వహణ ఖర్చును కొద్దిపాటిగా తీసుకుంటారు. సందర్శకులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ప్రదర్శనలకు టికెట్‌ను పెడతారు. ఇక్కడి క్యాంటీన్లో రుచికరమైన ఆహారం ధరలు అతితక్కువగా ఉంటాయి. చాలామంది యువత ఇక్కడికి క్యాంటీన్ ఫుడ్ కోసం వచ్చి తమ ఆలోచనలను పంచుకుంటుంటారు. యువత మెచ్చిన ప్రాంతం.. కళాకారులకు లామకాన్ ఓ ఎమోషనల్ ప్రదేశం. ఏదైనా ఆలోచనను పంచుకోవాలన్నా, తమ టాలెంట్‌ను చెప్పుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ, లామకాన్ మాత్రం వీటన్నింటికీ ప్రత్యేకం. ఈ ప్రదేశం కవి సమ్మేళనాలు, పెయింటింగ్, పుస్తకావిష్కరణ లాంటి కార్యక్రమాలకు ఉచితం. ఆలోచనలను పంచుకుంటూ ఎంతసేపైనా ఇక్కడ ఉండొచ్చు. సిటి మధ్యలో ఉండే ఈ లామకాన్ కళాకారులకు, యువతకు సుందర ప్రదేశం. ఇక్కడి ఫుడ్ కోసమే వచ్చేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో! ఇక్కడ సమోస, ఛాయ్, బజ్జీ, పలావ్‌లు ప్రత్యేకం. ఇక్కడ ఎంతోమంది తమ ప్రదర్శనలతో ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలో హనన్ మేనల్లుడితోపాటు మరికొంత మంది నిర్ణయిస్తారు. లామకాన్ పేరుకు కళంకం కాకుండా కొన్ని సమస్యాత్మక కార్యక్రమాలపై వీరు తమ అభిప్రాయాలను, అనుమతులను నిర్ణయిస్తారు. కొన్ని ఏళ్ళుగా లామకాన్ కళలకు నిలయంగా ఉంటూ వేలాది మందికి వేదికగా నిలిచింది. (చదవండి: Droupadi Murmu: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...) -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..!
మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం నుంచి పలు ముఖ్యమంత్రులను, అధికారులను కలుస్తూ అత్యంత బిజీగా ఉంటారామె. హోదా రీత్యా అత్యంత బిజీ బిజీ పనులతో సాగుతుంటుంది ఆమె జీవితం. అంతటి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఆమె చాలా చక్కటి జీవనశైలిని అవలంభిస్తారామె. క్రమశిక్షణాయుత జీవనశైలికి కేరాఫ్ అడ్రస్ ఆమె. మరి అంతలా ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే ద్రౌపది ముర్ము తన రోజుని ఏవిధంగా ప్రారంభిస్తారో తెలుసుకుందామా.. ఢిల్లీలోని ప్రాంతాలన్ని ఉయాన్ని రణగణ ధ్వనులతో బిజిబిజీగా ప్రారంభమవ్వగా ద్రౌపది ముర్ము రోజు ఉదయం ఆరుతో ప్రారంభమవుతుంది. ఆమె ఉదయం మేల్కొన్న వెంటనే రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో ఉండే అమృత ఉద్యాన్ అనే పచ్చటి తోటలో వాకింగ్‌కు వెళ్తారు. అక్కడ మంచుగడ్డిపై నడుస్తూ..చుట్టు ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కాసేపు అలా కలియదిరుగుతారు. ఆ తర్వాత ఓ రెండు గంటపాలు ధ్యాన సెషన్ ఉంటుంది. తనలోకి తాను అవలోకనం చేసుకునే ఈ ధ్యాన ప్రక్రియలో ఆ రోజు తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలకు తనను తాను సిద్ధం చేసుకుంటారామె. నిపుణుల సైతం ధ్యాన ప్రక్రియ వల్ల బాధ్యతలను చురుకైన మేధాస్సుతో వేగవంతంగా చక్కబెట్టగలరని చెప్పడమే గాక పరిశోధనల్లో కూడా వెల్లడైంది. అందుకే ప్రధాని మోదీ సైతం ప్రజలకు విజ్ఞిప్తి చేసేది ఇదే. ధ్యాన నిమగ్నులమై మన పూర్వీకుల మాదిరి దీర్ఘాయువుని పొందుదాం అని సదా పిలుపునిస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ధనవంతులు, సెలబ్రిటీలు ప్రముఖులు నుంచి అత్యున్నత హోదాల్లో పనిచేసే వారు వరకు అంతా ధ్యాన ప్రక్రియకే అగ్రతాంబులం ఇస్తున్నారు. ఇక ఆ తర్వాత ముర్ము ఆ 165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోట మొత్తం కవర్ చేసేలా రెండు కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ..అక్కడే ఉంటే నెమళ్లను పలకరించి సేద తీరతారు. ఆ తదుపరి భాద్యతల్లో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధమవుతారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి భవన్‌లోని కారిడార్ల గుండా అధ్యక్ష భవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ పలు కీలకమైన జాతీయ పత్రాలపై సంతకం చేసి, ప్రముఖులను, రాష్ట్ర అతిథులను కలవడం వంటివి చేస్తారు. అక్కడే అతిథులతో కీలకమైన చర్చలు జరపడం, సమావేశమవ్వడం వంటి పనులు జరుగుతాయి. అయితే ఈ అధ్యక్ష భవనంలోకి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందట. ఎవరెవరంటే..ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, మాజీ అధ్యక్షులు, లోక్‌సభ స్పీకర్ తదితరులు. ఒక పక్క తన వ్యక్తిగత జీవితాన్ని, బాధ్యతలను క్రమశిక్షణాయుతంగా నిర్వర్తిస్తూ ప్రశాంత చిత్తంతో ఉంటారామె. అందుకు ఉపకరించేవి కాసింత వ్యక్తిగత విశ్రాంతి సమయమే ఆమెను శక్తిమంతంగా రీచార్జ్ చేసి కార్యోన్ముఖురాలిగా మారుస్తుంది. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కి అసలైన అర్థం. పైగా సమతుల్యత తినే ఆహారంలోనే కాదు..మన జీవన విధానంలో కూడా అవసరమే అన్న సత్యాన్ని ఎలుగెత్తి చెబుతోంది కదూ..!. అంతేగాదు అత్యంత బిజీ అనే పదం ఉపయోగించే వారందరికీ ఇలాంటి మహోన్నత వ్యక్తుల దినచర్యే ఒక ప్రేరణ.(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్..) -
కంటి ఆరోగ్యం కోసం..ఆ మూడు తప్పనిసరి..!
ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగంలో చిన్న, పెద్ద అందరూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్ద వయసులో వచ్చే కార్నియా సమస్యలు సైతం వచ్చేస్తున్నాయి చిన్నారులకు. అందువల్ల ఈ మొబైల్ వ్యసనం బారినపడుకుండా చూడటమే గాక ఈ పండ్లు కూరగాయలతో కంటి సమస్యలను అధిగమించొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో చూద్దామా..! ఆకుకూరలు..పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి రక్షించి కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి.దానిమ్మదానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్డ్రై ఫ్రూట్స్... శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి నేత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. వీటిలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. (చదవండి: ఊరికే అలసిపోతున్నారా? ఐతే ఇది పొటాషియం లోపం కావచ్చు..) -
ఆషాఢమట... గోరింట ఎందుకట?
ఆషాఢమాసం వచ్చిందనగానే ఆడపడచులందరూ చేతికి గోరింటాకు పెట్టుకుని కనిపిస్తారు. ఒకవేళ వాళ్లు పెట్టుకోక΄ోతే ఆ చేతులకు కాస్తంత గోరింటాకు పెట్టుకోండమ్మా... ఆషాఢమాసం వచ్చింది కూడానూ అని బామ్మలు, అమ్మమ్మలు పోరుతుంటారు. ఇంతకీ ఆషాఢమాసానికీ, అర చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికీ సంబంధం ఏమిటో చూద్దాం...జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. ఈ ఉపద్రవాన్ని గోరింటాకు కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. అందులోనూ ఆషాఢంలో అయితే గోరింట లేత ఆకులతోచక్కగా చిగుళ్లు వేసి ఉంటుంది. ఆ ఆకు కోయడం కూడా ఒంటికి మంచిదే!.(చదవండి: ఎక్కడ చూసినా గోరింటాకు సందడి : ఈ ప్రయోజనాలు తెలుసా?) -
ఊరికే అలసిపోతున్నారా?
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం ఒకటి. పొటాషియం మన శరీరంలో బీïపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి లేక΄ోవడం, మానసిక కుంగుబాటు, తరచు వాంతులు, విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. అందువల్ల పొటాషియం లోపించకుండా చూసుకోవాలి.సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.ఎందులో లభిస్తుందంటే.. కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, విత్తనాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది.మనం ఏం చేయాలంటే...ఎవరైనా ‘మిరాకిల్ క్యూర్‘ అంటే వారి మాటలు నమ్మవద్దు. వాస్తవాలను చెక్ చేయాలి. ఇన్ఫ్లూయెన్సర్ల మాటల్ని అస్సలు నమ్మవద్దు. సోషల్ మీడియాలో చెప్పే ఔషధాలు/క్రీములు చాలావరకు నిర్ధారణ కానివే. వేళకు పోషకాహారం తినడం, నిద్ర, వ్యాయామం.. ఇవే నిజమైన యవ్వన రహస్యాలు.వయస్సు పెరిగినా యవ్వనాన్ని అవగాహనతో అందంగా, ఆరోగ్యంగా నిలుపుకోవచ్చు.ఔషధాలా, చికిత్సలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు, పూర్తి అవగాహనకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. (చదవండి: ఎప్పటికీ యవ్వనంగా.. అలాంటి చికిత్సలు తీసుకోవచ్చా..?) -
ఎప్పటికీ యవ్వనంగా.. అలాంటి చికిత్సలు తీసుకోవచ్చా..?
ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే ఔషధాలు, లేపనాలు వాడాలా? కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోవాలా? అనే ఆలోచన చాలా మంది చేస్తుంటారు. అందుకే చాలా వరకు యాంటీ ఏజింగ్ ప్రయత్నాలూ చేస్తుంటారు. అయితే, వీటిలో ఏది నిజంగా పనిచేస్తుంది? ఏది సురక్షితం? ఏది సరైనది కాదు.. ఎలా తెలియాలి.. అనే సందేహాలు కూడా ఎన్నో పుట్టుకు వస్తుంటాయి. వాటికి సమాధానమే ఈ వ్యాసం.శరీరంలోని జీవక్రియల స్థాయిలో వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాలని తీసుకునే మందులు ఉంటాయి. ఉదాహరణకు డయాబెటిస్ మందులైన మెట్ఫార్మిన్, మెటబాలిజంను ప్రభావితం చేసే పారామైసిన్ వంటి ఔషధాలు వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేయగలవా.. అనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఔఇవి బాడీలోని సెల్స్ లెవల్లో మార్పులు తేవాలని ప్రయత్నిస్తాయి. కానీ... ఇవి ఇంకా పరిశోధన దశలో ఉన్నాయి. చాలావరకు ఇవి మన శరీరానికి తగినట్టు పనిచేస్తాయో లేదో స్పష్టత లేదు. కాస్త పొరపాటైతే జీర్ణ సమస్యలు, హార్మోన్ అసమతుల్యత, లివర్ డ్యామేజ్, గుండె సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు వస్తాయన్నదే నిజం. అంతేకాదు, స్కిన్ లైట్నింగ్, మెట్బాలిజం మార్చే ఐవీ థెరపీ వంటి చికిత్సలు కూడా – పర్యవేక్షణ లేకుండా చేయడం చాలా ప్రమాదకరం.కాస్మెటిక్ ప్రొసీజర్స్...ముడతలు, డార్క్ స్పాట్స్, సాగిన చర్మం.. మొదలైనవాటిని మెరుగుపరచడం కోసం ఈ చికిత్సలు తీసుకుంటారు. వీటిలో నాన్–సర్జికల్ అయిన బోటాక్స్, ఫిల్లర్లు, లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సర్జికల్‌గా ఫేస్లిఫ్ట్స్, ఐ లిడ్ సర్జరీ, లై΄ోసక్షన్ వంటివి ఉన్నాయి. ఈ ప్రొసీజర్లు నిపుణులైన వైద్యులు చేతుల మీదుగానే జరుగుతాయి. అయినా ఇవి యవ్వనాన్ని శాశ్వతంగా నిలబెట్టవు. కానీ చూడటానికి యంగ్‌గా కనిపించేలా చేస్తాయి.మాటల మాయలో పడిపోకండి.. ‘నేచురల్ అంటే సేఫ్‘ అని చాలా మంది అనుకుంటారు. కానీ, హెర్బల్ పేరుతో ఉన్న కొన్ని పదార్థాలు కూడా హార్మోన్ లెవల్స్‌ను దెబ్బతీయవచ్చు. ‘అన్ని యవ్వన చికిత్సలు ఒకే విధంగా పనిచేస్తాయి‘ అనుకోవద్దు. మందులు లోపలికి తీసుకుంటే సెల్ లెవెల్లో పనిచేస్తాయి. ప్రొసీజర్లు చర్మం మీద పని చేస్తాయి. ‘యాంటీ ఏజింగ్‌కి మార్కెట్లో ఉన్న అనేక క్రీములు, టాబ్లెట్లు ... పరిశోధనలు లేకుండానే వచ్చి చేరుతున్నాయి. అందుకని వాటి మాయలో పడి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దు. లుక్ పరంగా తగ్గించవచ్చు...ట్రీట్మెంట్లతో యవ్వనాన్ని అలాగే ఉంచాలనుకోవడం ఆరోగ్యరీత్యా సరికాదు. తగినంత సూర్యరశ్మి మేనికి తగలాలి. ఆహారపదార్థాలలో చక్కెర పదార్థాలను తగ్గించాలి. మన జీవనశైలి సరిగా లేక΄ోతే ఇన్సులిన్ సామర్థ్యం తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు మెదడుకు పని పెడుతున్నారే తప్ప, శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వటం లేదు. మెనోపాజ్ దశలో హార్మోన్లలో సమతుల్యత ఉండదు. మనం చేయగలిగేది చర్మ సరంక్షణ విషయంలో మాయిశ్చరైజర్, సన్ప్రొటెక్షన్ను ఉపయోగించడం. వయసుతోపాటు చర్మం సాగినట్టు కనిపించడం సహజం. దీనికి ఫిల్లర్స్, స్కిన్ బూస్టర్స్ ఉపయోగించవచ్చు. ఏ యాంటీ ఏజింగ్ చికిత్స అయినా నిపుణుల సలహా అవసరం. ఏవీ పర్మినెంట్ చికిత్సలు కావు. అన్నిరకాల ఆహారం తీసుకోవాలి. అంటే, ఆ ఆహారంలో కూరగాయలు, పండ్లు ఉండాలి. నీళ్లు సరిపడినన్ని తాగాలి. జీవనశైలి బాగుంటే వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు. – డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ (చదవండి: నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..) -
నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..
హాయిగా సాగిపోతున్న జీవితాన్ని భయానక వ్యాధులు ఒక్క ఊదుటన మొత్తం జీవితాన్నే తలికిందులు చేస్తాయి. వైద్యానికి అయ్యే ఖర్చులతో కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకొచ్చేస్తాయి. వీటన్నింటికి తోడు ఆ మహమ్మారి పెట్టే భయాన్ని తట్టకోవాలంటే కొండంత ధైర్యం ఉండాల్సిందే. అలా అనితరసాధ్యమైన స్థైర్యంతో ఓ నాన్న కూతురు కోసం కేన్సర్ మహమ్మారిని ఎలా జయించాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. లెక్కలేనన్ని సర్జరీలు, బతుకుతానా లేదా అన్న నిరాశ నిస్ప్రహల నడుమ పోరాడి గెలిచిన ఓ తండ్రి కథ ఇది.అతడే 60 ఏళ్ల అర్జున్ సేన్. అతడు మార్కెటింగగ్ ఎగ్జిక్యూటివ్, పాడ్‌కాస్ట్ హోస్ట్, రచయిత, వ్యవస్థాపకుడు కూడా. కానీ అతడి జీవితం ప్రతిక్షణం మరణం అనే పంజాను విసురుతూనే ఉండేది. కానీ అది ప్రతిసారి అతడి నవ్వు ముందుకు ఓడిపోయింది. ఆయకు 1996లో, కడుపుకు మెటాస్టాసిస్ అనే స్వరపేటిక కేన్సర్ వచ్చింది. వైద్యులు వంద రోజులకు మించి బతికే ఛాన్స్ లేదని చెప్పేశారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ వ్యాధి సోకినప్పడు అర్జున్‌కి 32 ఏళ్లు. వాస్తవానికి అర్జున్ అందరిని నవ్వించేవాడే..ఈ రోజు నిరాసనిస్ప్రుహలతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. సరిగ్గా అతడి కూతురు రాకా అతడిని చూసి.." నాన్న చనిపోవడం అంటే ఏమిటి, నువ్వు చనిపోతున్నావా..? మరి నా పెళ్లిలో డ్యాన్స్ చేయవా అంటూ అమాయకంగా అడిగిన కూతురు మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకుని అప్పుడే పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నావ్ రా అనగానే కూతురు మోములోని సిగ్గు అతని ముఖంలోకి నవ్వు తెప్పించింది. పైగా కూతురిని దగ్గరకు తీసుకుని లేదు కచ్చితంగా నీ పెళ్లిలో ఈ నాన్న డ్యాన్స్ చేస్తాడు అని కూతురికి వాగ్దానం చేశాడు." అది అబద్ధమని తెలిసి కూడా అప్రయత్నంగా అర్జున్ ఆ మాటలు అనేశాడు. కానీ ఆ మాటలే ఆ తండ్రికి ఊపిరిపోశాయి..అప్పటి దాక ఉన్న బాధకు ఆ నవ్వు ఔషధంగా మారింది. తనకింకా వంద రోజుల కాదు వేల వందల 24 గంటలు ఉన్నాయన్నంత కొండంత ఆశను, ధైర్యాన్ని అందించాయి. అసలు ఈ మహమ్మారి ముందు చేతులు పైకెత్తేసి ఓడిపోవడం దేనికి పోరాడితే ఏముంది అనే శక్తిమంతమైన ఆలోచనను రేకెత్తించింది. ఆ ధైర్యంతోనే కీమోథెరపీ చికిత్సలు తీసుకునేవాడు..ప్రతిసారి ట్రీట్మెంట్కి వెళ్లినప్పుడూ తాను బయటపడతానా అనే ప్రశ్న.. వైద్యులను అడిగేవాడు..వాళ్లు కూడా బి పాజిటివ్ అనేవారే తప్ప..పర్లేదు బయటపడగలవు అనే భరోసా ఇచ్చేవారు కారు. అయినా సరే అర్జున్‌కి తన కూతురు రాకా కోసం బతికి బట్టగట్టగాలి అనే మొండి ధైర్యాన్ని కొని తెచ్చుకుని మరి చికిత్స తీసుకునేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 20 సర్జరీలు చేయించుకున్నాడు. మంచి చికిత్స తీసుకుని పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి కూతురికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేగాదు అతడి గాథని పికూ (2015), విక్కీ డోనర్ (2012) మూవీల దర్శకుడు షూజిత్ సిర్కార్ ఐ వాంట్ టు టాక్ మూవీగా తెరకెక్కించాడు. ఈ మూవీలో తండ్రి కూతుళ్ల మధ్య సైలంట్‌గా సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలందుకుంది కూడా. అసలు ముందు మనమే సమస్యకు భయపడిపోతే ఎలా మన కంటి పాపల కోసమైన మృత్యువుతో పోరాడే చిన్న ప్రయత్నమైనా.. చేయాలి అని చాటిచెప్పే భావోద్వేగ కథ ఇది.(చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?) -
ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్ యాప్ సీఈవో!
సోషల్‌మీడియాలో తరచుగా ఆసక్తికర కథనాలు, విశేషాలను పంచుకునే పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తాజాగా ఒక ఆసక్తికర కథనాన్ని షేర్ చేశారు. యువపారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తినిచ్చేలా మైగేట్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ స్ఫూర్తిదాయకమైన కథను ఆయన పంచుకున్నారుసెక్యూరిటీ అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ యాప్ మైగేట్ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ సక్సెస్ స్టోరీని హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా సక్సెస్ ఎవరికీ అంతఈజీగా రాదు.. దానికి వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఒకపుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తి ఇపుడు , కమ్యూనిటీ మేనేజ్మెంట్ యాప్ ఫౌండర్‌గా సీఈవోగా ఎదిగిన తీరును ఆయన వివరించారు.In 2016, IIT grad & ex-Goldman exec Abhishek Kumar became a security guard working 14-hour shifts.That experience of understanding pain points led to his creating MyGate: now in 25,000+ communities, 100M+ check-ins/month.Moral: To build for others, first walk in their shoes. pic.twitter.com/7UZSScpRaD— Harsh Goenka (@hvgoenka) July 3, 2025 r> IIT గ్రాడ్యుయేట్ , మాజీ గోల్డ్‌మన్ సాచ్స్ ఎగ్జిక్యూటివ్ అయిన కుమార్ ఒకప్పుడు సెక్యూరిటీ గార్డుగా 14 గంటల షిఫ్టులు పనిచేశారని గోయెంకా వెల్లడించారు. ఆ కష్టాలు,కన్నీళ్లు, ఆఅనుభవమే తరువాత ‘మైగేట్’ పునాదిగా మారిందని హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ఏదైనా ఒక పనిచేపట్టాలంటే ముందు దానిలోని లోతుపాతులను అర్థం చేసుకోవాలన్నారు. ఎవరీ అభిషేక్ కుమార్ :సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన తర్వాత ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యారు. అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి మరియు శ్రేయాన్స్ దాగా కలిసి 2016లో మైగేట్ను ప్రారంభించారు. 2022లో, అర్బన్ కంపెనీ - అకో సంయుక్తంగా నిర్వహించిన నిధుల రౌండ్లో మైగేట్ రూ. 100 కోట్లు సేకరించింది.2024 ఏప్రిల్‌లో మైగేట్ CEOగా నియమితులయ్యారు, విజయ్ అరిసెట్టి బోర్డు ఛైర్మన్‌గా మారారు. మైగేట్ అనేది గేటెడ్ కమ్యూనిటీలకు సెక్యూరిటీ కమ్యూనికేషన్, హౌస్ కీపింగ్, ఇతర రోజువారీ సేవలను అందిస్తుంది. భారతదేశంలోని 25 వేల హౌసింగ్ సొసైటీలలో ఇప్పుడు 40 లక్షలకు పైగా జనం మైగేట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రతి నెలా 100 మిలియన్లకు పైగా చెక్-ఇన్లను సులభతరం చేస్తుంది.డిజిటల్ హోమ్ సెక్యూరిటీని అందించే స్మార్ట్ డోర్ లాక్‌ల శ్రేణి మైగేట్ లాక్స్ ద్వారా మైగేట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ ఆదాయం అంతుకుముందు ఏడాదితో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.77 కోట్ల నుండి రూ.109 కోట్లకు పెరిగింది. 2025 ఏడాది గాను రూ. 165 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుందని పంచుకుంది. \2016లో అభిషేక్ కుమార్, విజయ్ అరిసెట్టి , శ్రేయాన్స్ డాగా స్థాపించిన మైగేట్, గేటెడ్ కమ్యూనిటీల నివాసితులకు ఏకీకృత యాప్ ద్వారా సందర్శకుల యాక్సెస్, భద్రత, నిర్వహణ,నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు బీమాసర్వీసులను అందించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుండి లైసెన్స్‌ను కూడా పొందింది.ఇదీ చదవండి: 7 నెలల్లో 35 కిలోలు..వాటికి దూరం: ఇదే నా సక్సెస్ అంటున్న నేహా -
Kapil Sharma: రెండు నెలల్లో 11 కిలోలు..!
బాలీవుడ్లో నవ్వుల రారాజు, రిచెస్ట్ కమెడియన్‌గా పేరుగాంచిన కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోని దిగ్రేట్ ఇండియన్ కపిల్ షోలో స్లిమ్‌గా కనిపించి.. అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఒక్కసారిగా అతడి ఆకృతి చాలా స్మార్ట్‌గా మారిపోయింది. ఇంతకీ కపిల్ అంతలా బరువు ఎలా తగ్గాడు? హెల్ప్ అయ్యిన ట్రిక్ ఏంటి.. వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.భారతీయ బ్రేక్‌ఫాస్ట్‌లలో ముఖ్యంగా బ్రెడ్ విత్ నెయ్యి, టీ సమెసా లేదా పరాఠా తప్పనిసరిగా ఉంటాయని అంటున్నారు కపిల్ శర్మ. బయటకు వెళ్లినా..ముందుగా అవే ఆర్డర్ చేస్తారని అన్నారు. ఇలాంటి ఆహార పదార్థాలే అధిక బరువుకి ప్రధాన కారణమని అన్నారు. మనం ఏంతింటున్నాం అనే దానిపై మనకు అవగాహన, నియంత్రణ ఉండటం అత్యంత ముఖ్యమని చెప్పారు.ఇటీవల ఆయనే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానెల్లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడారు. అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని, బరువుని అదుపులో ఉంచుకోవాలంటూ ఆరోగ్య స్ప్రుహ కలిగించే యత్నం చేశారు. అలాగే మన శ్వాసపై ధ్యాస పెట్టడం వల్ల మనలో మంచి మార్పులు వేగవంతంగా వస్తాయన్నారు. దీంతోపాటు మంచి జీవనశైలి అలవరచుకోవాలని సూచించారు. తాను ఫరా ఖాన్, సోను సూద్ వంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చిన ఫిట్నెస్ కోచ్ యోగేష్ భటేజా పర్యవేక్షణలో తన వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించినట్లు తెలిపారు. అయితే చాలామంది బరువు తగ్గాలంటే అధిక వ్యాయమాలు చేయాలేమోనని అపోహ పడుతుంటారని అన్నారు. కానీ అందులో వాస్తవం లేదని చెప్పారు కపిల్. తన దినచర్యకు అనుగుణంగా బరువుని తగ్గించే స్ట్రెచ్చింగ్ వంటి వ్యాయామాలను చేయాలని, అవి కూడా పరిమితంగానే అని చెప్పారు. నిజానికి వ్యాయామాలు శరీరంలో కండరాల సామర్థ్యాన్ని పెంపొందించి కదలికలకు ప్రోత్సహించడమే గాక బాడీ కూడా తేలిగ్గా ఉంటుందని అన్నారు. తన ట్రైనర్ బరువు తగ్గేలా 21-21-21 రూల్‌ని సూచించినట్టు తెలిపారు. దీనివల్లే తాను రెండు నెల్లలో సుమారు 11 కిలోలు తగ్గి మంచి మార్పులు వచ్చాయని అన్నారు. ఇది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ రూల్ అని చెప్పుకొచ్చారు కపిల్ శర్మ.21-21-21 రూల్ అంటే..ఫిట్నెస్ యోగేస్ భటేజా ప్రకారం..మొదటి 21 రోజుల శరీరాన్ని కదలించడంపై దృష్టిపెడతారు. అంటే..వ్యాయామాలు చేయడంపైనే ఫోకస్ ఉంటుంది.ఆ తర్వాత 21 రోజులు ఆహారంలో మార్పుల చేయాలి. అంటే కార్బోహ్రైడేట్లు, కేలరీలు తగ్గించాల్సిన అవసరం లేదు. బరువ తగ్గేందుకు సహకరించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.చివరి 21 రోజుల చెబు అలవాట్లను దరిచేరనియకుండా పర్యవేక్షించడం. అంటే కేవలం ధూమపానం, మద్యపానం, కెఫిన్ మాత్రేమేకాదు అతిగా తినడం, టీ లేదా కాఫీలే తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం.ఇలా ఈ రూల్‌ని ఎప్పుడైతే 21 రోజుల చొప్పున ఫాలో అవుతామో ఆటోమేటిగ్గా మనం క్రమశిక్షణతో కూడిన జీవన విధానానిక అలవాటు పడిపోతామట. ఇక తినకూడని వాటి జోలికి పొమ్మన్న పోరట.ఇలా ఈ ప్రక్రియలో 42వ రోజుకి చేరుకున్నాక..శరీరంల మంచి మార్పులను చవి చూస్తారని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణుడు భటేజా. అయితే శరీర భావోద్వేగాలను నియంత్రిచడమే అత్యంత కీలకం అని చెబుతున్నారు.అలా 63 రోజుల తర్వాత శరీరంలో పూర్తిగా మార్పుల సంతరించుకోవడమే గాక..దీన్ని కంటిన్యూ చేయలేనేమో అనే టెన్షన్ ఏ మాత్రం రాదట. అది మన దినచర్యలో ఒక భాగమైపోతుందట. <iframe width="703" height="432" src="https://www.youtube.com/embed/msEgvptkW6I" title="21-21-21 Rule for Fat Loss, Muscle Building and Fitness | Ft. Yogesh Bhateja with Gunjanshouts" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>(చదవండి: ఈ 'జీరో కేలరీ పుడ్స్'తో దెబ్బకు బరువు మాయం..! ఫిట్నెస్ కోచ్ సూచనలు) -
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్..పర్స్ వడ్డాణం..!
ఎంబ్రాయిడరీ చేసిన మ్యాచింగ్ బెల్ట్‌లు డ్రెస్‌ను అందంగా చూపుతాయి. దీంతో వడ్డాణాల స్థానంలో రకరకాల మోడల్స్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ బెల్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్స్ అంతటితో ఆగి΄ోకుండా మరింత ఉపయుక్తంగా, అందంగా పర్స్ బెల్ట్‌లను డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు. శారీ, లెహంగా, ఏ డ్రస్ అయినా అదే మెటీరియల్‌తో డిజైన్ చేసే పర్సుల బెల్ట్‌లు అదీ మ్యాచింగ్‌తో వాడటం వేడుకలలోనూ హైలైట్ అవుతున్నాయి.ముస్తాబు పూర్తయ్యాక వేడుకకు వెళ్లే ముందు ఫోన్, డబ్బులు పెట్టుకోవడానికి ΄పాట్లి బ్యాగ్స్, క్లచెస్.. వంటివి వెతుకుతుంటారు. అవి కూడా డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేవి ఉంటే బాగుండేది అని కొందరు, అదనంగా వీటిని పట్టుకెళ్లడం కష్టమే అని విసుక్కునే వారూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా బెల్ట్ పర్సుల మోడళ్లు అందంగా ఆకట్టుకుంటున్నాయి.టాప్ టు బాటమ్పాట్లి, ఇతర హ్యాండ్ బ్యాగ్స్ ధరించే డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయడం కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. వీటివల్ల విడిగా హ్యాండ్ బ్యాగ్, పర్సులను కొనుగోలు చేయనక్కర్లేదు. ఒకే రంగు, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి డ్రెస్‌తోపాటు బ్యాగ్‌నూ రూపొందించుకోవచ్చు. వేడుకలలోనే కాదు క్యాజువల్‌గానూ కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. నడుముకు పర్స్ ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్‌తో బెల్ట్, దానికి జత చేసిన పర్స్ ఈ బెల్ట్ స్పెషల్. లెహంగా, శారీ, డ్రెస్ ఏదైనా అదే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేయడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. లేసులు, టాజిల్స్, పూసలు, స్టోన్స్... ఈ పర్సులకు జత చేయడం అదనపు ఆకర్షణ. (చదవండి: అమ్మ అలా చెప్పి ఉండకపోతే ఇలా ఉండేవాడిని కాను: అమిర్ ఖాన్) -
Neha Reddy అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల
..మన కళలు మనతో ఉంటే ఏ దేశంలో ఉన్నా...మన దేశం మనలో ఉన్నట్లే! ఆ భావనతో కూచిపూడికి దగ్గరైంది నేహా. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ నేహా రెడ్డి ఆళ్లకు భారతీయ నృత్యకళలపై మంచి అవగాహన ఉంది.చిన్నవయసులోనే కూచిపూడి నృత్యకారిణిగా ‘శభాష్’ అనిపించుకుంది. తల్లిదండ్రులు శివరామిరెడ్డి, నాగమల్లేశ్వరిల చొరవ, ప్రోత్సాహంతో వర్జీనియాలోని ‘కళామండపం’ నృత్య పాఠశాలలో గురువు మృణాళిని సదానంద దగ్గర కూచిపూడి నేర్చుకుంది నేహ.రేపు శనివారం మరోసారి తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. నృత్య కళలో మరింతగా రాణించాలని, డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.ఇదీ చదవండి : Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ -
స్వరాల తోటలో...ఎవరీ గిని
ఇండియన్ పాప్‌లో తనదైన స్టైల్ సృష్టించుకొని దూసుకు పోతోంది పందొమ్మిది సంవత్సరాల గిని. ‘ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్’గా కూడా ప్రశంసలు అందు కుంటోంది.... తండ్రి ఉద్యోగ రీత్యా, గిని కుటుంబం ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండేది కాదు. అయితే ఎక్కడికి వెళ్లినా ఆమెతో స్థిరంగా ఉన్నది మాత్రం సంగీతమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నప్పుడు కుటుంబం మొత్తం కారులో వెళ్లేది. కారులో నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ప్లే అయ్యేది. భూపెన్ హజారిక నుంచి హరిహరన్ వరకు ఎంతో అద్భుతమైన గొంతులను వినే అవకాశం వచ్చేది. View this post on Instagram A post shared by Molfa Music (@molfamusic) కారు బ్యాక్ సీట్లో కూర్చున్న గిని పాట ప్లే అవుతున్నప్పుడు వారితో గొంతు కలిపేది. అలాపాటలతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత గానం ప్రాణమై పోయింది. మొదట్లో ప్రముఖ గాయకులను అనుకరించినా, ఆ తరువాత మాత్రం గానంలో తనదైన శైలిని సృష్టించుకుంది. కాలిగ్రఫీ, ఒరిగామి, గుర్రపు స్వారీ, కోడింగ్... ఏదైనా సరే, నేర్చుకోవాలనే ఆలోచన వస్తే పట్టుదలగా నేర్చుకునేది. యూట్యూట్ వీడియోలు చూస్తూ గిటారు ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాయడంలో, కంపోజ్ చేయడంలో తన టాలెంట్ నిరూపించుకుంది. -
అమ్మ అలా చెప్పి ఉండకపోతే ఇలా ఉండేవాడిని కాను: అమిర్ ఖాన్
నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ సంక్షోభ సమయాలు ఎదుర్కొంటున్నారు. సంక్షోభ సమయంలో ‘నీ కోసం నేనున్నానని’ ఎవరో ఒకరు నిలవకపోతే బయటపడటం కష్టమవుతోంది. ‘రీమాతో విడాకుల తర్వాత తాగుడు అలవాటు లేని నేను తాగుబోతుగా మారాను. సంవత్సరం పాటు లెక్కకు మించి తాగుతూ స్పృహ తప్పేవాణ్ణి. కాని అమ్మ నన్ను కాపాడింది’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు అమిర్ ఖాన్. అతడు తీసిన ‘సితారే జమీన్ పర్’ విజయవంతం కావడంతో తన జీవితంలో సవాళ్లను ఎలా అధిగమించాడో పంచుకున్నాడు.మనిషి ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, సమస్యతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ‘ఇక చాలు... బయటపడు... నిన్ను నువ్వు నిలబెట్టుకో’ అని ధైర్యం చెప్పాలి. అలా ధైర్యం చెప్పే మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. లేదంటే సంక్షోభంలో ఉన్న మనిషి తీసుకునే నిర్ణయాలు అసాధారణం అవుతాయి. నేడు పేపర్ తెరిస్తే హత్యలు, ఆత్మహత్యలు కనపడుతున్నాయి. సాటి మనిషి నుంచి సరైన సహాయం లేకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు. స్వీయ విధ్వంసం లేకుండా జీవితాన్ని నిలబెట్టుకోవడం నేడు పెద్ద సవాలుగా ఉంది. ఇలాంటి స్థితి సెలబ్రిటీలకు కూడా ఉంటుంది. కాని వారు ఎలా బయటపడ్డారో తెలిస్తే సాధారణ వ్యక్తులకు స్ఫూర్తి అందవచ్చు. తాజాగా ‘సితారే జమీన్ పర్’ సినిమాతో విజయం అందుకున్న అమిర్ ఖాన్ ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవిత విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. వాటిలో ఒకటి తన మొదటి విడాకుల సమయంలో ఎదురైన కుంగుబాటు. ‘మా అమ్మ హెచ్చరికతో నేను కోలుకున్నాను’ అంటున్నాడు.తాగుబోతుగా మారానుఅమిర్ ఖాన్ కెరీర్లో ఎదగక ముందే రీనా దత్తాను 1986లో రహస్య పెళ్లి చేసుకున్నాడు. ఇది ‘సఖి’ సినిమాలో జరిగినట్టుగానే జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు కుటుంబాలూ మెల్లగా వారిని యాక్సెప్ట్ చేశాయి. అయితే 2000 సంవత్సరం నాటికి వీరి అనుబంధంలో పగుళ్లు వచ్చాయి. అదే సంవత్సరం రీనా పిల్లల్ని తీసుకుని సమీపంలోని ఫ్లాట్‌లోకి మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అమిర్ ఇలా చెప్పాడు. ‘రీనా వెళ్లిన రోజు రాత్రి నేను ఇంట్లో ఒక్కణ్ణే ఉన్నాను. పనివాళ్లు లేరు. మా డ్రైవర్ని ఆమెకు, పిల్లలకు తోడు ఇచ్చి పంపాను. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పటికి నేను ఆల్కహాల్ ముట్టలేదు– ఒకటి రెండుసార్లు సినిమా షూటింగ్ లో భాగంగా తప్ప. అయితే స్నేహితుల కోసం మా ఇంట్లో ఆల్కహాల్ ఉండేది. ఆ రోజు రాత్రి బాటిల్ తాగి స్పృహ తప్పి పడిపోయాను. అప్పటి నుంచి రోజూ తాగుతూనే ఉండేవాణ్ణి. నాకు నిద్ర వచ్చేది కాదు. తాగి తాగి స్పృహ తప్పేవాణ్ణి అంతే. ప్రతి శనివారం పిల్లలు వచ్చేవారు. రెండు వారాలకు ఒకసారి రెండు రోజులు నాతో ఉండేవారు. ఆ రోజుల కోసం ఎదురుచూసే వాణ్ణి. అప్పుడు మాత్రం తాగేవాణ్ణి కాదు. ఆ సమయంలో నేను సినిమాలు చేయలేదు. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. సినిమా పరిశ్రమలో కేవలం ఇద్దరు ముగ్గురే నా పరిస్థితి విని చూడటానికి వచ్చారు. వారిలో జూహీ చావ్లా, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ ఉన్నారు. ఇక ఇలాగే ఉండిపోతానేమో అనుకున్నాను’ అన్నాడతను.తల్లి చెప్పిన మాటఅమిర్ తండ్రి తాహిర్ హుసేన్ ఒకప్పటి ప్రసిద్ధ నిర్మాత. తల్లి జీనత్ గృహిణి. తండ్రి 2010లో మరణించాడు. తల్లి ముంబైలోని మరో ఇంట్లో కుమార్తెలతో ఉంటోంది. అమిర్ జీవితంలో ఏం జరుగుతున్నదో ఆమెకు తెలుసు. కాని ఆమిర్‌ను ఎలా దారికి తేవాలో తెలియదు. ఆ సమయంలో ఏం జరిగిందో అమిర్ ఇలా తెలియచేశాడు. ‘నేను డిప్రెషన్లో వ్యాయామం వదిలేశాను. ఏం తింటున్నానో ఏం తినడం లేదో తెలియదు. అప్పటికి ఏడాదిన్నర అయ్యింది నేను షూటింగ్ చేసి. ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ ఫోన్ చేసింది. పేపర్లో నీ ఫొటో రాణి ముఖర్జీతో వచ్చింది చూడు అంది. నా ఫొటో రాణిముఖర్జీతో ఎందుకు వచ్చింది అని పేపర్ చూశాను. ఆ రోజుల్లో చాలా లావుగా ఉండే ఒక యాక్టర్‌తో రాణి ముఖర్జీ ఫొటో ఉంది. నేను తిరిగి అమ్మకు కాల్ చేశాను– నీ ఫొటో కూడా అలా చూస్తానేమోనని బెంగగా ఉందిరా అంది. వెంటనే నాకు షాక్ తగిలింది. సాధారణంగా అమ్మలు తమ పిల్లల్ని ఎంత లావుగా ఉన్నా చిక్కిపోయాడనే అంటూ ఉంటారు. ఇక్కడ మా అమ్మ మాత్రం నేను లావుగా అయిపోతున్నానని బాధ పడుతోంది. అమ్మ ఇలా బాధపడటం నా అరాచకానికి అంతిమస్థాయి అనిపించింది. అంతే. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను... మళ్లీ పూర్వపు మనిషి కావాలని. అలా మా అమ్మ నన్ను నిలబెట్టింది’ అన్నాడు. అమిర్, రీనా 2002లో విడాకులు తీసుకున్నారు.(చదవండి: ప్రధాని మెచ్చిన రొట్టె! ఆ ఒక్క మాటతో..) -
ప్రధాని మెచ్చిన రొట్టె!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కర్నాటకలోని కలబుర్గి రొట్టెల గురించి ప్రస్తావించడం ఒక విశేషం అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే కలబుర్గి రొట్టెల ఉత్పత్తి సహకార సంఘానికి 60కి పైగా అమెజాన్ ఆర్డర్లు రావడం మరో విశేషం. కలబుర్గి జిల్లాలోని వందలాది మహిళలకు ఈ సంఘం ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాల మహిళల నుంచి రొట్టెలను సేకరించి ఇ–కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తుంటుంది.‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించడం వల్ల ఎంతోమంది పేద మహిళలకు మేలు జరుగుతోంది. ఒకప్పుడు మేమందరం ఇంటిపనులకే పరిమితమయ్యేవాళ్లం. రొట్టెల తయారీ ద్వారా వ్యాపారంలోకి అడుగుపెట్టాం’ అంటుంది కొట్నూరు గ్రామంలోని ‘నంది బసవేశ్వర రొట్టి కేంద్ర’కు చెందిన నింగమ్మ.‘కలబుర్గి రొట్టెల గురించి ప్రధాని మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. దీని వల్ల మా రొట్టెలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది’ అంటుంది చిట్టాపూర్ గ్రామానికి చెందిన శరణమ్మ. ఆమె ‘మాతా మల్లమ్మ రోటీ కేంద్ర’ నిర్వాహకురాలు.(చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!) -
గుండెను గుచ్చే అందమైన ముల్లు
‘కాంటా లగా’ మ్యూజిక్ ఆల్బమ్ ఫేమ్, ప్రముఖ బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఓ ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందిన సంఘటన ఇటీవల చాలా సంచలనం రేపింది. షెఫాలీ అనేక ఏళ్లుగా ఈ చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోజు ఆమె ఉపవాసంలో ఉండి... ఇంజెక్షన్ తీసుకున్నందున ఇలా జరిగిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా నటీనటులతో పాటు ఇతరులు తీసుకునే బ్యూటీ చికిత్సలనూ అలాగే... గుండెపై వాటి ప్రభావాలను చూద్దాం...‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం’ అంటూ తెలుగు కవులు వినిపించారూ... వివరించారు. అందం ఆనందాన్నిస్తుంది. దానికి ప్రాణాల్ని మూల్యంగా చెల్లించాలా అన్నది సమాజం అడుగుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అసలు బ్యూటీ చికిత్సలో జరిగేదేమిటి, వాటి పర్యవసానాలేమిటి, గుండెపైన వాటి ప్రభావాలేమిటో తెలుసుకుందాం. మొదట్లో సినీతారలు... తర్వాత్తర్వాత క్రమంగా బాగా ధనవంతులు మొదలు... నేడు సామాన్యుల వరకూ సౌందర్య కాంక్ష చేరింది. ఇప్పుడు పార్లర్‌కు వెళ్లడమన్నది మధ్యతరగతీ, దిగువ మధ్యతరగతికీ సాధారణమైంది. మెరుస్తున్న మేని నిగారింపు, యూత్‌ఫుల్ లుక్‌తో కనిపించడం అందరికీ ఇష్టమైన అంశమైంది. బ్యూటీ థెరపీ లేదా ఈస్థటిక్ ట్రీట్మెంట్ అని పిలిచే సౌందర్య చికిత్సల్లో రక్తనాళం ద్వారా నేరుగా రక్తంలోకి పంపించే గ్లుటాథియోన్ డ్రిప్స్ మొదలుకొని రకరకాల మీసోథెరపీ (మీసో థెరపీ అంటే చర్మంలో ఉండే మూడు పొరల్లోని మధ్యపొరపై ప్రభావం చూపేవి) మందులూ, కొలాజెన్ ΄ పౌడర్లు, చర్మం నిగారింపుతో ఫెయిర్‌గా కనిపించేందుకు వాడే ఇంజెక్షన్లు, పైపూతగా వాడే క్రీములు, ΄ పౌడర్లు... ఇలా రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. పైకి మిలమిలా మెరుస్తూ ఉండే చర్మం వెనక కొన్ని నల్లటి చిక్కటి చీకటి రహస్యాలూ ఉంటాయి. కొన్నింటిపైన ఓ మేరకు నియంత్రణలు ఉన్నప్పటికీ... మరికొన్నింటి విషయంలో అసలు ఎలాంటి అదుపూ లేకుండా ఏమాత్రం శిక్షణ లేనివారూ, తమకు ఎలాంటి పరిజ్ఞానమూ లేనివారూ చేసేవి కూడా ఉంటాయన్నది ఓ నగ్న సత్యం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ బ్యూటీ చికిత్సల్లో ఎన్నెన్నో రకాలు... వ్యక్తులు అందంగా కనిపించేందుకు చేసే చికిత్సల్లో పలు రకాలైనవి ఉంటాయి. ఉదాహరణకు... → పెరుగుతున్న వయసు ఛాయలు చర్మంపై కనిపించకుండా... ముడుతలూ, లోతైన గీతలు కనిపించకుండా చేసేందుకు యాంటీ ఏజింగ్ చికిత్సగా బొటాక్స్ ఇంజెక్షన్లు, ఇతర డర్మల్ ఫిల్లర్స్ → మార్కెట్లో యాంటీ ఏజింగ్ మందులు, డీ–టాక్స్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్స్‌గా పిలుస్తూ... రక్తనాళం ద్వారా రక్తంలోకి మందును ఎక్కించే గ్లుటాథియోన్, నికొటినెమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ+) మందులు → రక్తంలోని ప్లాస్మాను వేరు చేసి చర్మంలోకి ఎక్కించే పీఆర్పీ (ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా) థెరపీ, (జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (జీఎఫ్‌సీ) చికిత్స, ఎగ్జోసోమ్స్, చర్మాన్ని ఉత్తేజితం చేసే పాలీ డైయాక్సీ రైబో న్యూక్లియోటైడ్ (పీడీఆర్ఎన్) వంటి చికిత్సలు → కొలాజెన్ పెపై్టడ్స్, బయోటిన్, చర్మాన్ని తెల్లగా మార్చే గుట్లాథియోన్ లాంటి పిల్స్‌తో పాటు కొన్ని హార్మోన్ థెరపీలు. ఇవన్నీ ఆహారంలోని సప్లిమెంట్స్ కాగా... వీటిలో కొన్నింటిని నోటిద్వారా (ఓరల్‌గా) ఇస్తారు → ఇక పైపూత లేపనాలు (టాపికల్)గా వాడే పెపై్టడులూ, రెటినాయిడ్స్ ఉండే క్రీములు... ఇవి సౌందర్య ఔషధ రూపాల్లో ఇస్తుండటం వల్ల వీటిని ‘కాస్మస్యూటికల్స్’గానూ చెబుతారు.మన దేశంలోఅనుమతిఉన్నవి కొన్నే...మన దేశంలో ఇలాంటి మందులకు అనుమతి ఇచ్చే అత్యున్నత అథారిటీ ‘సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్సీఓ) అనే సంస్థ. దీనితో పాటు అమెరికన్ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతించిన వాటిని మనదేశంలోనూ అనుమతిస్తుంటారు. వాటిల్లో కొన్నింటికే అనుమతులున్నాయి → ఉదాహరణకు రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్, హై–డోస్ విటమిన్ సి, ఎన్ఏడీ+ లేదా మరికొన్ని మిశ్రమ మందులు (కాక్టెయిల్స్)కు పై సంస్థల అనుమతి లేదు → చర్మంలో ఉండే మూడు పొరల్లో మధ్యపొరపై పనిచేసే మరికొన్ని చికిత్సలను ‘ఎక్సోజోమ్ బేస్డ్’ చికిత్సలు అంటారు. వీటితో పాటు స్టెమ్‌సెల్ థెరపీల వంటివాటిని శిక్షణ పొందిన క్వాలిఫైడ్ నిపుణులు అందిస్తేనే సురక్షితం.ప్రమాదాలూ / అనర్థాలు ఎప్పుడంటే... ముందుగా చెప్పిన ప్రకారం... అత్యంత సుశిక్షితులూ, అన్ని విధాలా తగిన విద్యార్హతలు ఉన్న డర్మటాలజిస్టుల వంటి నిపుణులు మాత్రమే ఈ చికిత్సలను అందించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం చాలాచోట్ల అనధికారిక సెలూన్లు, స్పాలు ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల ఇళ్లలో కూడా అనధికారికంగా ఈ ఔషధాలనూ, ఇవ్వకూడని సప్లిమెంట్లను ఇస్తున్నారు. పైగా ఇళ్లలో ఇచ్చే ఈ చికిత్సల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే... వాటి పర్యవసానాలేమిటీ, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న పరిజ్ఞానం అనర్హులైన చికిత్సకులకు ఉండదూ, అలా ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులూ ఉండవు. అయినప్పటికీ చాలామంది వీటిని యధేచ్ఛగా ఇస్తున్నారూ... అలాగే అందంపై ఆసక్తి ఉన్న యువతీయువకులు తీసుకుంటున్నారు.చదవండి: క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!ఇవీ నమోదైన (డాక్యుమెంటెడ్) ప్రమాదాలు / అనర్థాలు → అలర్జిక్ రియాక్షన్లు, అనాఫిలాక్సిస్ అనర్థాలు (అదుపు చేయలేని విధంగా చాలా తక్కువ వ్యవధిలో వచ్చే తీవ్రమైన రియాక్షన్లు వీటి ద్వారా ఒక్కోసారి షాక్ కూడా కలిగితే దాన్ని అనాఫిలెక్టిక్ షాక్‌గా కూడా వ్యవహరిస్తారు). ఈ రియాక్షన్లు అరుదుగా ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలు లేక΄ోలేదు → రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ ఇంజెక్షన్లతో అనాఫిలెక్టిక్ షాక్, అసెప్టిక్ మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాములో ఉండే పొరల వాపు) వంటివి చాలా అరుదు. అయితే కొన్నిసార్లు ఇలాంటి రియాక్షన్స్ కనిపించిన దాఖలాలు ఉన్నాయి → హై–డోస్ విటమిన్ బి కాంప్లెక్స్ ఇచ్చిన కొన్ని సందర్భాల్లో అవి వికటించి, ప్రాణాంతకంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి చాలాకాలం నిల్వ చేయడానికి అందులో వాడే ప్రిజర్వేటివ్స్ వల్ల ఇలాంటి రియాక్షన్లు కనిపించాయి → కొన్ని సందర్భాల్లో బ్యూటీ మందులు వాడాక ఇన్ఫెక్షన్లు, రక్తానికి ఇన్ఫెక్షన్ (సెప్సిస్) కనిపించాయి → స్టెమ్ సెల్ చికిత్సల్లో కొంతమేరకు కనిపించే ముప్పు (రిస్క్)→ స్టెమ్‌సెల్స్‌తో చేసే చికిత్సల్లో ఇమ్యూన్ రియాక్షన్స్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉన్నందున నిజానికి బ్యూటీ చికిత్సల్లో స్టెమ్‌సెల్స్‌కు అనుమతి లేదు.ప్రజలు తెలుసుకోవలసిన అంశాలు... → బ్యూటీ చికిత్స అందించేవారికి వాస్తవంగా ఆ అర్హత ఉందా, వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకోవాలి → చాలా త్వరగా ప్రభావం చూపుతాయన్న ‘క్విక్ ఫిక్స్ మార్కెటింగ్’ ప్రచారాలను నమ్మడం సరికాదు. మెల్లగా వచ్చే ప్రభావాలే దీర్ఘకాలం నిలుస్తాయి. ఇవి చాలావరకు నిరపాయకరమని గుర్తించాలి → ఆ సౌందర్యసాధనాలకూ, ఉత్పాదనలకు ఎఫ్‌డీఏ లేదా సీడీఎస్‌సీవో సంస్థల ఆమోదం ఉందా అని చూడాలి→ గ్లుటాథియోన్ వంటి మందులు ఇచ్చే సమయంలో అది నిరపాయకరమైన మోతాదులోనే ఉందా అని చూడాలి. అంటే వారానికి 600 నుంచి 1200 ఎంజీకి మించి మందు తీసుకోకూడదు. (అనర్థాలు సంభవించిన కొన్ని కేసులను చూసినప్పుడు కొందరు అవసరమైన మోతాదుకు ఐదు రెట్లు ఇచ్చిన దాఖలాలనూ గుర్తించారు) చివరగా... అందం చాలా ఆకర్షణీయమైదే. అందరూ కోరుకునేదే. అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ప్రాణాలు కాకూడదు. అందంగా ఉండటం కంటే ఆరోగ్యంగా జీవించి ఉండటం ముఖ్యం.ఎందుకీ అనర్థాలు... ఈ అనర్థాలకు చాలా కారణాలు ఉంటాయి. → చట్టపరంగా వీటిని అదుపు చేసే యంత్రాంగం కొరవడటం → యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ తరహా క్లినిక్లూ, చికిత్సల గురించి విపరీత ప్రచారం → ఏమాత్రం అర్హతా, పర్యవసానాలపై అవగాహన లేని అనర్హులు చికిత్సలందించడం. అన్నిటికంటే ముఖ్యంగా వినియోగ దారుల్లో కొరవడిన అవగాహన : ఈ ఉత్పాదనల విషయంలో ప్రజల్లో ఎలాంటి అవగాహన లేక΄ోవడం వల్ల కూడా ఈ తరహా అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ‘స్వాభావికమైన, ప్రకృతిసిద్ధమైన (నేచురల్)’ వంటి మాటలు ఉపయోగించినప్పుడు అవేవీ ప్రమాదకరం కానివిగా భావిస్తూ చాలామంది ప్రమాదకరమైన సింథసైడ్ రసాయనాలనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.వసతులన్నీ హాస్పిటల్స్‌లోనే... బ్యూటీ చికిత్సలు తీసుకునే సమయంలో అది పెద్ద హాస్పిటల్ అయి ఉండటం, ఎమర్జెన్సీ సౌకర్యాలూ కలిగి ఉండేలా చూసుకోవడం ముప్పును తప్పిస్తుంది. వాస్తవానికి రక్తంలోకి ఎక్కించే గ్లుటాథియోన్ వంటివి తగిన మోతాదులో ఇచ్చినప్పుడు గుండె΄ోటు రావడం, గుండె ఆగి΄ోవడం (కార్డియాక్ అరెస్ట్), అనాఫిలెక్టిక్ షాక్‌కు గురికావడం వంటి సందర్భాలు చాలా అరుదు. అయితే అన్ని వసతులూ, ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రితో తగిన విద్యార్హతలూ, చికిత్స అర్హతలూ కలిగిన డాక్టర్ల ఆధ్వర్యంలో బ్యూటీ చికిత్సలు తీసుకుంటే... ఒకవేళ ఏవైనా రియాక్షన్స్, అనాఫిలెక్టిక్ రియాక్షన్స్ వచ్చినా తక్షణం చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడటానికి అవకాశముంటుంది. -
'చేత్తో తినడం' ఇది ఎప్పటి అలవాటంటే..!
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ చేతులతో బిర్యానీ తింటున్న వైరల్ వీడయో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉంటూ ఇలా చేత్తో తినడం అనాగరికం అని, మీరు థర్డ్ వరల్డ్‌లోనే బతకండి అంటూ మామ్దని తీరుని తప్పుపట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచి చేత్తో తింటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చేత్తో తినడం అనే అలవాటు ఏనాటిది? పాశ్చాత్యులు తొలి నుంచే ఫోర్క్‌లు, స్పూన్లు,చాకులతోనే తినేవారా అంటే..చేతులతో తినడం అనేది పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన అలవాటు కాకపోయినా..ఇది మన భారతీయ ఆచారం. అది మన సంస్కృతిలో భాగం కూడా. సింపుల్‌గా చెప్పాలంటే భారతీయులకు కేవలం పోషణ కాదు ఒక విధి విధానం. చరిత్ర ప్రకారం ఆదిమానవుల కాలం నాటిది ఈ అలవాటు. ఈజిప్షియన్లు, గ్రీకులు, మెసొపొటేమియన్లు, సింధులోయ నాగరికత ప్రజలు అంతా చేత్తోనే తినేవారు. ఇది మైండ్‌ఫుల్‌గా తినేందుకు చిహ్నం.అంతేగాదు జీర్ణక్రియకు నేరుగా ఆహారాన్ని అందించే ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భారతీయ గ్రంథలు, ఉపనిషత్తులు కూడా చేతులతో తినడం అనేది శరీరాన్ని ఆత్మకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియగా పేర్కొన్నాయి. ఎందుకంటే చూడటం, వాసన రుచి, స్పర్శతో కూడిన ఇంద్రియానుభవమే భోజనం అని పురాణాలు చెబుతున్నాయి. మన భారతీయ భోజనం బియ్యం, కూరలు కలయిక. కాబట్టి వాటిని తినాలంటే చేతులతో కలుపుకుని తింటే చక్కటి రుచిని ఆస్వాదించగలరు. అదే పాశ్చాత్యులకు రోస్ట్‌లు, గ్రిల్డ్ మాంసం, పాస్తా, బ్రెడ్ వంటివి ఆహారాలు. వాటిని తినాలంటే వాళ్లు చాక్‌లు, ఫోర్క్‌లు ఉపయోగించి తినాల్సిందే. ఎందుకంటే వాటిని అలానే తినేయం సాధ్యం కాదు. అయినా భారతీయుల ఆహారం అంతలా ఘనపదార్థాలుగా ఉండదు కాబట్టి ఆ అవసరం మనకు రాలేదు. పైగా ఇది మన సంస్కృతిలో భాగం. చాప్‌స్టిక్స్ సంగతేంటి?చైనా, జపాన్‌లోని ప్రజలు చాప్‌స్టిక్‌లను ఉపయోగిస్తారు. వాళ్లు వీటిని క్రీశ 400 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నారట. ఇటీవలే వాళ్ల భోజన విధానంలో ఫోర్క్‌లు, చాక్‌లు వచ్చాయట. ప్రస్తుతం అది ఆదునికతకు గుర్తుగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా, జపాన్‌లో చాప్‌స్టిక్‌తో తినడానికి కారణం.. బుద్దిపూర్వకంగా మనసుపెట్టి తినాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అదీగాక వాళ్ల ఆహారం చాలామటుకు చిన్ని చిన్న ముక్కులుగానే ఉంటుంది. వాళ్లకు భోజనం అనేది ఏకాగ్ర చిత్తంతో చేసే ప్రక్రియ. ఈ విధానంలో తింటే మాటలు దొర్లవు, తింటున్న దానిపై ఫోకస్ ఉంటుదంట. అందులోనూ ఆకలితో ఉంటే..స్పీడ్‌గా తినాంటే ఆ చాప్స్టిక్లపై ఫోకస్ పెడితేనే తినగలరు లేదంటే వాటి మధ్య నుంచి ఆహారం జారిపోతుంది. పైగా అలా గనుక ఆహారం పారేస్తుంటే చైనా పెద్దలు తిట్టడమే గాక మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తినమని ఆదేశిస్తారట.చేత్తో తినడం మంచిదేనా.. చేత్తో తినడం పరిశభ్రకరమైనదా అని పాశ్చాత్యులు ప్రశ్నిస్తుంటారు. కాని ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశమని నొక్కిచెబుతున్నారు శాస్త్రవేత్త అదితి. ఎందుకంటే భోజనానికి ముందు తర్వాత చేతులు తప్పక కడుక్కుంటారు. అలాగే కుడిచేయి అనేది పవిత్రమైన పనులకే ఉపయోగిస్తారు భారతీయులు. తిలకం పెట్టుకోవడం దగ్గర నుంచి ఇతరులకు డబ్బులు ఇవ్వడం, శుభాకార్యలకు అన్నింటికి కుడి చేతినే ప్రధానం ఉపయోగిస్తారు. అలాగే ఎడమ చేతిని వ్యక్తిగత పరిశుభ్రతకే కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక చేత్తే తినడం వల్ల మనసారా తింటున్న అనుభూతి తోపాటు జీర్ణక్రియ నేరుగా వెళ్లి సులభంగా అరిగిపోయేలా చేయడంలో దోహదపడుతుందట. చేత్తో తింటేనే త్వరితగతిన అరిగిపోతుందని, ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైందని చెప్పుకొచ్చారు వైద్యులు.(చదవండి: Zohran Mamdani: పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!) -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్' ఇవే..
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..పూల్‌మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలుస్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలుపుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలుబ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలుక్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలుటమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలుకీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలుకాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుక్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలుపైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలుయాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలుఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలుకొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలుఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలునిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలుపాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుకాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలుక్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుప్రయోజనాలు..వీటిలో ఎక్కువగా నీరు, పైబర్ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్నెస్ కోచ్ సామ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
ఆ టీచర్ కోసం యావత్తు గ్రామమే కన్నీళ్లు పెట్టుకుంది!
గురువు అన్న పదమే ఎంతో గౌవరనీయమైనది. ఇక ఆ స్థానాన్ని అలకంరించి.. ఎందరో విద్యార్థులను మేధావులగా తీర్చిదిద్దే వాళ్ల సేవ అజరామరం. అలాంటి వ్యక్తులు బదిలీ నిమిత్తం లేదా వ్యక్తిగత కారణాల రీత్యా దూరంగా వెళ్లిపోతున్నారంటే ఏదో కోల్పుతున్నంత బాధ కలగడం సహజం. అలా విద్యార్థుల ప్రేమను పొందిన ఉపాధ్యాయులెందరో ఉన్నారు. కానీ ఇక్కడ అనుకోకుండా బదిలిపై వెళ్తుతన్న ఓ మహిళా టీచర్‌కి విద్యార్థుల తోపాటు యావత్తు గ్రామం కన్నీటి వీడ్కోలు పలికి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే..బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక చిన్న గ్రామంలోని ఆదర్శ విద్యాలయంలో రేఖ అనే టీచర్ 22 ఏళ్లుగా టీచర్ పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థులను మంచి విద్యను బోధించడమే గాక ఆ గ్రామంలోని గ్రామస్తులుకు విద్య ప్రాముఖ్యత అవగాహన కల్పించేవారామె. గత 22 ఏళ్లుగా ఆ గ్రామంలో తన బోధన సేవతో గ్రామస్తులు, విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. అలాంటి ఆమె ఇప్పుడు బదిలిపై స్కూల్‌ని వీడక తప్పని పరిస్థితి. అయితే ఆమె లాస్ట్ వర్కింగ్ డే రోజున విద్యార్థుల తోపాటు పెద్ద ఎత్తున్న గ్రామస్తులు కూడా వచ్చి కన్నటి సంద్రంతో భారంగా వీడ్కోలు పలికారు. అంతేగాదు ఆ రోజు ఫంగ్షన్ ఏర్పాటు చేసి..గ్రామస్తులంతా ఆమె సేవలను కొనియాడుతూ సన్మానించడం కూడా జరిగింది. అలాగే విద్యార్థులు కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గురించి షేర్ చేసుకున్నారు. ఇక వీడ్కోలు సమయానికి అంత ఆమె చుట్టుచేరి ఐ మిస్ యూ రేఖ మేడమ అంటూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. మొత్తం గామ్రమే ఆమె వెళ్లిపోతుంటే కన్నీటి సంద్రంలో మునిగిపోయి నిట్టూర్చింది. ఆ ఘటన మొత్తం కంటెంట్ క్రియేటర్ రీకార్డ్ చేసి పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా అవసరం లేదు మన సేవాతత్పరత మనల్ని అందరికి చేరవయ్యేలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుపెడుతుందంటూ సదరు టీచర్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై) -
కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
రిలేషన్షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్‌లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్‌ను నేటితో ముగిస్తున్నాం! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరుపెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్ ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?గ్యాప్ పెరిగిపోతోంది పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్‌ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతలపేరెంట్స్కూ కౌన్సెలింగ్ అవసరంపెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్‌లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్‌లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్‌కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్‌కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ పైపై బంధంగానే ఉంటుంది పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్‌లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్‌ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్మ్యారీడ్గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్పరిణతే ప్రామాణికం పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి. – కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్ -
జంతు ప్రేమికులూ.. జర జాగ్రత్త..!
వర్షాలు ముసురుకుంటున్న సమయంలో కుక్కలకు ర్యాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కలతో పాటు మనుషులకూ ఈ వ్యాధి వ్యాప్తిచెందొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో పేద, మధ్యతరగతి, ఉన్నత శ్రేణి అనే తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వివిధ జాతుల కుక్కలను, ఇతర జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ పెట్స్ కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మూగజీవాలకు కొంత సమయం కేటాయిస్తూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒత్తిడిని జయించడానికి కొంత సమయం వాటితో ఆడుకోవడం అలవాటుగా మారుతోంది. ఈ సమయంలో ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకితే పెట్స్‌తో సహా మనుషులకూ ముప్పు పొంచి ఉంది. వీధి కుక్కలతో జర జాగ్రత్త.. వీధి కుక్కలు చిన్ననాటి నుంచి పుట్టి పెరిగిన, సంచరించే ప్రాంతానికి సరిహద్దులు (టెరిటరీ) నిర్ణయించుకుంటాయి. వాటి పరిధిలోకి వేరే కుక్కలను రానీయవు. ఇవి వాటి పరిధి దాటి వెళితే ఆందోళనకు గురవుతాయి. దీంతో కొత్త వ్యక్తులను చూసినప్పుడు భయంతో దాడి చేయడానికి ప్రయతి్నస్తాయి. అటువంటి వాటని ఐ కాంటాక్ట్ (కళ్లలోకి కళ్లుపెట్టి చూడటం) చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లలు సహజంగానే కుక్కలు కనిపించినపుడు వాటి తోక, చెవులు పట్టుకుని లాగుతుంటారు. ఒక రకమైన ఇరిటేషన్లో ఉన్న కుక్కలను ఇలా చేస్తే అవి వెంటనే కరిచే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ వీధుల్లో వాటిని పట్టుకుని చికిత్సలు చేస్తున్నారు. అనంతరం ఎక్కడ నుంచి తెచ్చినవి అక్కడ విడిచిపెట్టకుండా ఏదో ఒక చోటు వదిలేస్తున్నారు. ఇది కూడా కుక్క కాట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మెదడును ప్రభావితం చేస్తుంది.. పెట్స్‌కు ర్యాబిస్ సోకినప్పుడు వైరస్ అనేది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో కుక్క ఏం చేస్తుందనేది దానికి తెలియకుండానే నియంత్రణ కోల్పోతుంది. కోపం, దూకుడుగా, పచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంది. మనుషులకు వచ్చినట్లే కుక్కలకు సైతం విషజ్వరాలు వస్తాయి. లక్షణాలు గుర్తించినపుడు వైద్యులను సంప్రదించడం మేలు. రేబిస్ వ్యాధి అనేది కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందుకు ముందుగానే జాగ్రత్త పడాలి. సొంగ కార్చే సమయంలో దాన్ని మనం చేతితో ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. కుక్క పిల్లలు ఆరు వారాల నుంచి 8 వారాల వయసులో పారో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రివెంటివ్ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. – డా.డీ.అశోక్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్.ఈ సీజన్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వైరస్ వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటో పెంచుకునే పెట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కళ్లు ఎర్రబడటం, జ్వరం రావడం, గొంతు కండరాలు బిగుసుకుపోయి నీళ్లు తాగడానికి ఇబ్బంది పడటం, నాలుగైదు రోజుల పాటు సొంగ కార్చడం, నురగలు కక్కడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ర్యాబిస్ వైరస్‌కు సంబంధించిన లక్షణాలుగా పరిగణించాలి. ప్రాథమికంగా గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించినట్లైతే పెట్స్‌ను రక్షించుకోవచ్చు.నివారణ చర్యలు.. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. తద్వారా ర్యాబిస్ వ్యాప్తిని అరికట్టవచ్చు..దీంతో పాటు పెంపుడు జంతువులను నియంత్రణలో ఉంచాలి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇళ్లలో పెంచుకునే వాటికి టీకాలు వేయించాలి. ఏదైనా జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. పెంపుడు జంతువులు లేదా బయటి జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినా.. అవి కాటు వేసినా.. గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. ర్యాబిస్ సోకిన జంతువు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుని సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవాలి. ర్యాబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు, లేదా తరచూ జంతువులతో నివాసం ఉండాల్సిన పరిస్థితులు ఉన్న వ్యక్తులు ముందస్తుగా ర్యాబిస్ టీకా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో గబ్బిలాల నివాసం లేకుండా చూసుకోవాలి. ర్యాబిస్ సోకిన తర్వాత, లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స తీసుకోవడం చాలా కష్టం.. కాబట్టి నివారణా చర్యలు పాటించడం ఉత్తమం.. ఆరోగ్యకరం. (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
పదేపదే చెవుల్లో మ్యూజిక్ వినిపించడం మానసిక సమస్య..?
నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. నేను సెలూన్ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!– గురునాథం, కరీంనగర్ మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్‌ని ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్‌లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్ మెషిన్ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్’ మందులు, అలాగే మీ డిప్రెషన్ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై) -
దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి..
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్. శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్‌కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ‘ఏ మదర్: ఏ మైల్స్టోన్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్. స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది. View this post on Instagram A post shared by Skyhigh (@skyhighindia) (చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? ) -
మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? శుభాంశు మిషన్..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన చరిత్రాత్మక మిషన్ యాగ్జియం-4లో భాగంగా పలు పరిశోధను చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పరిశోధనల్లో ఏటా వేలా మంది బాధపడుతున్న దీర్థకాలిక వ్యాధి మధుమేహంపై కూడా అధ్యనం చేయనున్నారట. అంతేగాదు ఒక రకంగా ఈ అధ్యయనం ఆ వ్యాధిని ఎలా నిర్వహించాలో తెలియజేయడమే గాక మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో కొండంత ఆశను రేకెత్తించే అవకాశం కూడా ఉందని సమాచారం. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తన యాగ్జియమ్ మిషన్4లో భాగంగా సుమారు 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొనన్నారు. వాటిలో డయాబెటిస్ వ్యాధిపై అధ్యయనం కూడా ఉంది. ఈ వ్యాధిని ఎలా నిర్వహించొచ్చు లేదా బయటపడొచ్చు అనే దిశగా అధ్యయనాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వ్యక్తులు అంతిరిక్షంలోకి వెళ్లొచ్చా..? లేదా అనే దిశగా కూడా పరిశోధనలు చేయనుంది శుభాంశు బృందం. ఎందుకంటే జీరో గ్రావిటీలో రక్తంలోని చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందని మధుమేహం ఉన్న వ్యోమగాములను అంతరిక్ష కార్యకలాపాలను పూర్తిగా మినహాయించారు. ఆ నేపథ్యంలోనే ఈ యాగ్జియ-4 మిషన్ సూట్రైడ్ అనే పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈ దీర్ఘకాలిక వ్యాధిపై పరిశోధన చేస్తోంది. మధుమేహం ఉన్నవారు అంతరిక్షంలో నివశించడానికి, అక్కడి కార్యకలాపాల్లో పాల్గొనడానకి అనుకూలమా కాదా అనేదే ప్రధాన ధ్యేయం అని ఈ పరిశోధనకు సారథ్యం వహిస్తున్న డాక్టర్ మొహమ్మద్ ఫిత్యాన్ వెల్లడించారు. ఒకరకంగా ఈ పరిశోధన గురుత్వాకర్షణ ప్రభావం లేకుండా జీవక్రియను అధ్యయనం చేసే వీలు కల్పిస్తోందన్నరు. అంతేగాక ఇన్సులిన్ నిరోధకతపై కొత్త మార్గాన్ని అందిస్తుందని చెప్పారు.ఈ పరిధనలోని ముఖ్యాంశాలు..రెండలు వారాల మిషన్ సమయంలో ఒకరు లేదా ఇద్దరు వ్యోమగాములు కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్లు (CGM)లను ధరిస్తారు. ఈ పరికరాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ డేటాను భూమికి పంపిస్తాయి. ప్రతిక్షణం ఆ వ్యోమగాముల రీడింగ్‌లు పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు డాక్టర్ ఫిత్యాన్. ఈ మైక్రోగ్రావిటీలో ఆరోగ్యకరమైన జీవిక్రియ ఎలా మార్పులు సంతరించుకుంటోంది తెలుసుకోవడమేగాక భవిష్యత్తులో డయాబెటిస్ ఉన్న వ్యోమగాములు ఈ సీజీఎం(CGM)లను ధరించి వెళ్లడం సురక్షితం కాదో తెలుసుకోవడంలో హెల్ప్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన భూమిపై మారుమూల ప్రాంతాలు లేదా ఎలాంటి సదుపాయాలు లేని ప్రదేశాల్లో ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ఈ పరిశోధన భవిష్యత్తు అధ్యయనాలకు మార్గం సుగమం చేస్తుందని ధీమాగా చెప్పారు. కాగా, ఈ పరిశోధన అనంతరం డయాబెటిస్ ఉన్న తొలి వ్యొమగామిని అంతరిక్షంలోకి పంపి పరిస్థితిని అంచనా వేయడం వంటి మరిన్ని పరిశోధనలు కూడా చేయనున్నట్లు ఫిత్యాన్ వెల్లడించారు.(చదవండి: 'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం) -
Shefali Jariwala: గ్లూటాతియోన్, విటమిన్ సీ ఇంజెక్షన్లు అంత ఖరీదా..?
గత కొన్ని రోజులుగా, నటి-మోడల్ షెఫాలి జరివాలా అకాల మరణం రకరకాల ప్రశ్నలకు తెరలేపింది. ప్రాథమిక దర్యాప్తులో కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుందనే అనుమాతనం తోపాటు ఆమె గదిలోనే అవన్ని దొరకడం మరింత అనుమానాలకు ఊతమిచ్చింది. దీంతో అందం వ్యామోహం ఖరీదు ప్రాణామా..అని సర్వత్ర చర్చలు మొదలయ్యాయి. పైగా యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్లు గ్లూటాతియోన్, విటమిన్ సీల ఖరీదు ఎంతుంటుందనే ఆరాలు కూడా మొదలయ్యాయి. ఇంతకీ ఆ కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సలకు ఎంత ఖర్చు అవుతుందంటే..? నటి మోడల్ షెఫాలి గత ఎనిమిదేళ్లుగా ఈ మందులు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ఇంటి నుంచి యాంటీ-ఏజింగ్ మాత్రలు, మల్టీవిటమిన్లు, గ్లూటాతియోన్ ఇంజెక్షన్ల నిల్వలు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రయోజనాలు..భారత్‌లో గ్లూటాతియోన్, విటమిన్సీ ఇంజెక్షన్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు నివేదికల్లో తేలింది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడం, పిగ్మెంటేషన్ నిరోధించడం, వృద్ధాప్యా సంకేతాలను దరిచేరనీయకుండా చేయడం వంటి ప్రయోజనాల రీత్యా టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో మార్కెట్లో అమ్ముడవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో దీని విలువ ఏడాదికి సుమారు రూ. 2 వేల కోట్లుగా ఉండగా, అది 2032 నాటికి రూ.5 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. వెద్య నిపుణుల ప్రకారం..దీర్ఘకాలికంగా వినియోగించడం వల్ల పలు దుష్పరిణాముల తప్పవనేది సమాచారం. ఒక్కోసారిగా ప్రాణంతకంగా కావొచ్చని కూడా చెబుతున్నారు వైద్యులు.ఈ చికిత్సల ఖరీదు..ఈ కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ చికిత్సలు వాళ్లు ఎంచుకున్న సెషన్లు ఆధారంగా ఉంటాయట. ఒక్కో సెషెన్ రూ. 5 వేల నుంచి 7 వేల వరకు చార్జ్ చేస్తారట. అంటే 5 సెషన్ల ప్యాకేజ్ దాదాపు రూ. 60 వేలు ఖర్చు అవుతుందట. కొంతమంది వీటిని టాబ్లెట్ల రూపంలో తీసుకుంటారట. ఇలా అయితే గనుక ప్రామాణికంగా 30 ప్యాక్‌లు వినియోగిస్తారట. అంటే ప్యాక్‌కి 15 ఉంటాయట. వాటి ధర రూ. 5,000. అంటే 30 ప్యాక్‌లకు రూ. 7,800 ఖర్చవుతుందని సమాచారం. అయితే మరికొందరూ ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండానే స్వీయంగా తీసుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులునిపుణులు ఏమంటున్నారంటే..చర్మ వ్యాధి నిపుణులు ఈ చికిత్సలు ప్రమాదకరం అని, ముఖ్యంగా వైద్య పర్యవేక్షణ లేకుండా తీసుకోవడం మరింత ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి నిపుణులు అందుబాటులోలేని బ్యూటీ సెలూన్లో అందిస్తుండటం బాధకరమని అన్నారు. ఇవి గనుక ప్రతిచర్యలకు దారితీస్తే చర్మ సమస్యల తోపాటు గుండె లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, యువత గ్లామర్ వెంటపడి ఈ ప్రమాదకరమైన ఫెయిర్‌నెస్ చికిత్సలు తీసుకునిప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు.(చదవండి: అందం ముఖ్యమే.. కానీ, ఆ బలహీనతకు లొంగిపోకూడదు!) -
ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్!
బరువు తగ్గాలంటే తిండిమానేస్తే సరిపోదు? ఫ్యాడ్ డైట్,ఉపవాసం అంటూ కడుపుమాడ్చుకుంటే సరిపోదు. ఇంట్లో పని అంతా చేస్తున్నాంగా.. ఏదో కొద్దిగా వాకింగ్ చేస్తున్నాంగా అంటే సరిపోదు. ఊపికి సలపని పనులు అసలు టైమే దొరకడం లేదు.. ఇంకెక్కడి ఎక్స్ర్సైజులు అంటూ నిట్టూరిస్తూ సరిపోదు.. మరి అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి. పదండి..కొన్ని ముఖ్యమైన చిట్కాలతో సహా, ఇంట్రస్టింగ్ సీక్రెట్స్ తెలుసుకుందాం.ముందు అసలు బరువు ఎందుకు తగ్గాలి దీనిపై అవగాహన ఉంది. మనశరీరం, మన ఆరోగ్యం, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి? ఫిట్‌గా ఉండాలనే సంకల్పం ఉండాలి. ఎంత బరువు అధికంగా ఉన్నాం, ఎంత తగ్గాలి మన బీఎంస్మాస్ ఇండెక్స్ ఎంత అనే లెక్కలు గమనించుకోవాలి. చివరిగా తగ్గాల్సిన బరువు, సమయం దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్లాన్ చేసుకోవాలి. ఇది నిపుణుల ద్వారాగానీ, వ్యక్తిగత అవగాహన ద్వారా గానీ చేసుకోవచ్చు.బరువు తగ్గడానికి కారణమైన అలవాట్లను మార్చుకోవాలనే బలమైన కోరిక ఉందాలేదా అనేది నిర్ధారించు కోవాలి. నా శారీరక శ్రమ ,వ్యాయామ అలవాట్లను మార్చడానికి సిద్ధంగా ఉన్నానా? అనేది ప్రశ్నించుకుని, నిర్ణయించుకుని ముందుకు సాగాలి.ఇదీ చదవండి: ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!అలాగే ఏదో మంత్రం వేసినట్టు బరువు తగ్గడం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. మన బరువును బట్టి ఎంత సమయంలో ఎంత బరువు తగ్గవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓపిగ్గా దీర్ఘకాలం పాటు బరువు తగ్గాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దీన్ని యాక్షన్ గోల్, రిజల్ట్ గోల్ అనే రెండు రకాలు డివైడ్ చేసుకోవాలి.ప్రతిరోజూ 30 నిమిషాలు నడవాలి ఇది యాక్షన్ గోల్. 4.5 కిలోగ్రాముల తగ్గాలి అనేది రిజల్ట్ గోల్.టాప్ టిప్స్జీవనశైలిలో మార్పులు చేసుకోవడం. తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టడం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతీ రోజూ నడకతోపాటు, యోగా, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. అవసరమైతే జిమ్ ట్రైనర్ శిక్షణలో కొన్ని కఠినమైన వ్యాయామాలు కూడా చేయాలి.లోకాలరీ ఫుడ్, హై ప్రొటీన్డ్, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడిని నియంత్రించుకోవడానికి అవసరమైతే ఆరోగ్య సంరక్షణ నిపుణుడితో మాట్లాడండి. ఒత్తిడిని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు. చక్కని నిద్ర చాలా అవసరం.దీర్ఘకాలంలో వారానికి 0.5 -1 కిలోగ్రాము) తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీని ప్రకారం ప్రతి రోజు తీసుకునే కేలరీలతో పోలిస్తే 500 - 750 కేలరీలు ఎక్కువగా బర్న్ చేయాలి.ఎక్కువగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు తినాలి. కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండేలా కడుపు నిండా తినవచ్చు. ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు.రోజుకు కనీసం నాలుగు సార్లు కూరగాయలు,మూడు సార్లు పండ్లు తినండి. భోజనాల మధ్య మీకు ఆకలిగా అనిపిస్తే పండ్లు ,కూరగాయల సలాడ్ తినవచ్చు. (ట్రంప్ పెర్ఫ్యూమ్స్ : ‘విక్టరీ 45-47’ లాంచ్.. సీక్రెట్ ఏంటంటే..!)బ్రౌన్ రైస్, బార్లీ , హోల్-వీట్ బ్రెడ్ , మిల్లెట్స్‌తో చేసిన ఆహారం, ఇంకా ఆలివ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, అవకాడో, నట్స్, నట్స్ బటర్స్ , నట్స్ ఆయిల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలి.చక్కెర పదార్థాలకు పూర్తిగా నో చెప్పాలి. ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్‌ను అసలే ముట్టు కోవద్దు. ప్రతి ఆహారం ముద్దను ఆస్వాదిస్తూ, రుచిని ఎంజాయ్ చేస్తూ చక్కగా నమిలి మింగండి. అంతే తప్ప హడావిడిగా అస్సలు ఆహారం తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు టీవీని ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ఇదీ చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నోట్ : నాలుగు రోజులు చేసి ఫలితం రాలేదని నిరాశ పడకూడదు. పట్టుదలగా బరువు తగ్గిన వారిని చూసి ఇన్ స్పైర్ అవ్వాలి. బరువు తగ్గడం వలన అందం మాత్రమే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. అనేక రకాల, ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్స్ నుంచి బయటపడవచ్చు. కీళ్ల నొప్పులు,గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించే ముందు, వైద్యుడిని సంప్రదించి అంతర్లీనంగా ఏవైనా సమస్యలున్నాయా? అనేది తనిఖీ చేసుకొని తగిన సలహాలు, సూచనలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. -
అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ స్థానం ..! హాట్‌టాపిక్‌గా అమెరికా వంటకాలు..
కొన్ని వంటకాలు యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ పొందుతాయి. అంతేగాదు ఆ వంటకాల కారణంగా ఆ దేశం పేరు, అక్కడ ప్రజల ఆహార విధానాలు ఫేమస్ అవుతాయి కూడా. అంతేగాదు వంటకాల కారణంగా దేశాధినేతలు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాక నైపుణ్యంతో మహామహులనే మనసుదోచుకోవచ్చనే సామెత ఉండనే ఉంది కూడా. అందుకు చరిత్రలో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ట్రావెల్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యుత్తుమ వంటకాల జాబితాను విడుదల చేసింది. అయితే ఆ జాబితాలో అమెరికా చేరడమే నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఆ జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..ప్రపంచవ్యాపంగా ఉన్న ఆహారప్రియులు ఇష్టపడే వంటకాల ఆధారంగా ర్యాంకుల ఇచ్చి మరీ జాబితాను అందించింది. ఆ జాబితాలో గ్రీస్ 4.60 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటలీ, మెక్సికో, స్పెయిన్, పోర్చుగల్ నిలిచాయి. వైవిధ్యభరితమైన ఆహార సంస్కృతికి నిలయమైన భారత్ 12వ స్థానం దక్కించుకుంది. భారతదేశంలోని వంటకాలే అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలగా నిర్ణయించి మరి ఈ ర్యాంకు ఇచ్చిందట. అలాగే మన దేశంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్‌ని కూడా ఇచ్చింది. అందేలె..రోటీ, నాన్, చట్నీ, బిర్యానీ, పప్పు, బటర్ చికెన్, తందూరి చికెన్ వంటి ప్రముఖ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో మన భారతీయులు సైడ్ డిష్‌గా తినే పచ్చడి(చట్నీ) కూడా ఆ జాబితాలో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు భారతదేశంలో ఆయా వంటకాలను ఎక్కడ ఆస్వాదించాలో వంటి వాటి వివరాలను కూడా టేస్ట్ అట్లాస్ అందించడం విశేషం. అయితే ఈ సారి ది బెస్ట్ రెసిపీల్లో అమెరికా వంటకాలు చేరడమే సర్వత్ర చర్చనీయాంశమైంది. పైగా అది ఏకంగా భారత్ తర్వాతి స్థానంలో అమెరికా(13) చోటుదక్కించుకోవడం మరింత వివాదాస్పదమైంది. ఎందుకంటే పెరూ(14), లెబనాన్ (26), థాయిలాండ్ (28), ఇరాన్ (41) వంటి దేశాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఉండటంతో నెట్టింట రకరకాల చర్చలకు దారితీసింది. అసలు యూఎస్ వంటకాలంటే ఏంటి అంటూ సెటైర్లు వేస్తు కామెంట్లు చేయగా, మరికొందరు బ్రో ఉందిగా మెక్‌డొనాల్డ్స్ అని కామెడీ మీమ్స్‌తో పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: పుట్టగొడుగులను అలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు నిల్..! నిపుణుల షాకింగ్ విషయాలు..) -
వర్క్ ఫర్ హోమ్..కార్పొరేట్ థీమ్..!
ఇటీవల కాలంలో ఇంటి స్వరూపం మారిపోతోంది. కార్పొరేట్ ఉద్యోగాల పుణ్యమాని ఇంట్లో కొత్త హంగులు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. వర్క్ ఫ్రం హోమ్‌తో ప్రతి ఇంట్లో ఓ వర్క్ స్పేస్.. తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవడం అంటే కల సాకారం కావడం లాంటిది అనేవారు.. అయితే ఇప్పుడు అదే ఇల్లు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌తో కెరీర్ కలల సాకారానికి సాధనంగా మారిపోతోంది. మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో ఇంటి స్వరూపంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్క్ స్పేస్‌లో కార్పొరేట్ థీమ్ ఆక్రమిస్తోంది. కోవిడ్ పుట్టించిన వర్క్ ఫ్రమ్ హోమ్ దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతోపాటు మన నగరంలోనూ స్థిరపడిపోయింది. దీనికితోడు ఆఫీస్ స్పేస్ ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కల్చర్ నగర జీవనశైలిలో భాగమైంది. కార్యాలయ పని పాటల తీరు తెన్నులనే మార్చేసిన ఈ కల్చర్ ఇంటినీ ఇంటి అంతర్గత నిర్మాణాన్ని (ఇంటీరియర్ డిజైన్)ని సైతం సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. నగరంలో కొత్త ఇంటి కొనుగోలుపై మాత్రమే కాదు.. ఇంటి మోడిఫికేషన్, ఫర్నిచర్ ఎంపికలపై స్పష్టమైన ప్రభావం చూపుతోంది. అచ్చం..ఆఫీస్ లా.. ఇంట్లో ప్రత్యేకంగా ఒకటి లేదా రెండు గదులను హోమ్ ఆఫీస్‌గా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ అవకాశం లేకుంటే హాల్ లేదా బెడ్రూంలో విడిగా కొన్ని చిన్న చిన్న ఏరియాలను వాడుకుని అక్కడ వర్క్ స్పేస్ సెటప్ చేస్తున్నారు. ఉదాహరణకు బెడ్రూమ్లో ఒక వారగా చిన్న టేబుల్, కుర్చీ పెట్టి, ఒక షెల్ఫ్ అమర్చడం, అలాగే హాల్లోని ఒక మూలలో వాల్ మౌంటెడ్ డెస్క్, అక్కడ ల్యాప్‌టాప్, లైటింగ్ సెట్ చేసుకోవడం. చిన్న బాల్కనీ ఉంటే గ్లాస్ డోర్‌తో మూసి, మినీ ఆఫీస్‌గా మార్చడం చేస్తున్నారు. ఇలా కొద్దిపాటి వర్క్‌ప్లేస్ ఉంటే ‘మినీ కౌనర్‘ లేదా ‘వర్క్ నుక్’, ‘కాంపాక్ట్ ఆఫీస్ స్పేస్‘ అంటున్నారు. ట్రెండీ పార్టీస్.. టెర్రస్ గార్డెన్స్..వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వృత్తి నిపుణులు ఇంట్లో గడిపే సమయాన్ని పెంచడంతో సహజంగానే ఇంట్లో మరిన్ని వసతులు, సౌకర్యాలు తప్పనిసరి అవుతున్నాయి. వ్యాయామ సాధనాలను అమర్చుకుని వర్కవుట్స్ చేయడం దగ్గర నుంచి చిన్న చిన్న పారీ్టలకు వీలుగా మార్పు చేర్పులు చేస్తున్నారు. మీటింగ్స్ కోసం టెర్రస్ గార్డెన్స్ వాడకంతో వాటర్‌ప్రూఫ్ మెటల్ ఫ్రేములు, వూన్ డిజైన్లతో కూడిన ఔట్‌డోర్ ఫర్నీచర్‌కు డిమాండ్ ఏర్పడింది. ఫర్నీచర్.. ఫర్ ఛేంజ్.. వర్క్ డెస్క్, ఎర్గోనామిక్ చైర్, బుక్ షెల్ఫ్, మంచి లైటింగ్, సౌండ్ ప్రూఫింగ్ వంటివి కూడా అమర్చుకుంటున్నారు. వర్చువల్ మీటింగ్స్‌కు అనువైన విధంగా కూడా ఇంటీరియర్‌లో మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. ఇంట్లో హై–స్పీడ్ ఇంటర్నెట్, వై–ఫై బూస్టర్లు, ఇంటెలిజెంట్ ప్లగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు అరకొరగా కనిపించిన సోఫా కమ్ బెడ్ లాంటి మల్టీ పర్పస్ ఫరి్నచర్ ఉత్పత్తుల వినియోగం భారీగా పెరిగింది. యుఎస్బీ ఛార్జింగ్, కేబుల్ హోల్డర్స్ వంటి పలు వస్తువులను ఇముడ్చుకోగల టెక్ ఇంటిగ్రేషన్ ఫర్నీచర్ వాడకం ఊపందుకుంది. ‘ఫర్నిచర్ ఉత్పత్తుల రూపకల్పనను ఈ డబ్ల్యూఎఫ్‌హెచ్ బాగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పనిచేసేందుకు, అదే సమయంలో విశ్రాంతి కోసం కూడా వేర్వేరు మోడ్స్ మార్చుకునే నూతన డిజైన్లతో మల్టీఫంక్షనల్ ఫరి్నచర్, మాడ్యూలర్ బుక్‌షెల్ఫ్‌లు అందుబాటులో ఉన్నాయి’ అని ప్రముఖ ఫర్నీచర్ బ్రాండ్ రాయల్ ఓక్ షోరూమ్ ప్రతినిధి చెప్పారు. గతంలో లుక్, డెకరేషన్‌కు ప్రాధాన్యత ఉండేదని, అయితే ఇప్పుడు ఫంక్షనల్, మినిమలిస్టిక్ డిజైన్లకు ప్రాధాన్యం పెరిగిందని చెబుతున్నారు. ఫర్నీచర్ ఉత్పత్తులపై ప్రభావం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మా ఉత్పత్తుల డిజైనింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. కార్పొరేట్ ధోరణులకు, వర్కింగ్ స్టైల్స్‌కు అనుగుణంగా హోమ్ ఫర్నీచర్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌లో అందించాల్సి వస్తోంది. – రాయల్ ఓక్ సంస్థ ప్రతినిధి.సొంతిట్లో కార్నర్ ఏర్పాటు చేసుకున్నా.. గత కొంత కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఈ వర్కింగ్ స్టైల్ అందుబాటులోకి రావడం వల్ల నగరానికి దూరంగా రాంపల్లిలో విల్లా కొనుగోలు చేసి ఉంటున్నా. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇబ్బంది లేకుండా ఉంది. ప్రస్తుతం ఇంట్లోనే తాత్కాలికంగా చిన్నపాటి కార్నర్లో కాంపాక్ట్ ఆఫీస్ సెట్ చేసుకున్నా. త్వరలోనే ఇంటి టెర్రస్ మీద పూర్తి ఆఫీస్ ఏర్పాటు చేసుకోనున్నా. – కుమార్, ఐటీ ఉద్యోగి. (చదవండి: ట్రాన్స్ ఈక్వాలిటీ ఫర్ సొసైటీ..!) -
ట్రాన్స్ ఈక్వాలిటీ ఫర్ సొసైటీ..!
సమాజం తమను చిన్న చూపు చూస్తున్నా.. మిగతావారితో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నా వారంతా. ఆత్మగౌరవంలోనూ, ఆత్మవిశ్వాసంలోనూ ఇతరులకు దీటుగా బతికి చూపిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాల తమ కష్టానికి ఫలితం లభించింది. తమతో పాటు తోటి ట్రాన్స్జెండర్లు కూడా తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి అండగా నిలబడుతున్నారు. అనుకున్నతదే తడవుగా ఆలోచనలను ఆచరణలో పెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఆ కార్యాచరణకు ఇతర సంస్థలు సైతం మేమున్నామంటూ మద్దతు తెలిపి భుజం తట్టాయి. ట్రాన్స్‌జెండర్స్ అనుకున్న లక్ష్యం నేరవేరేలా చేశాయి. నలుగురూ వారిని ఎగతాళి చేసినా.. అవహేళనకు గురవుతున్న ట్రాన్స్జెండర్లు తామేమీ తక్కువ కాదంటూ ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. సూరారం కాలనీకి చెందిన ట్రాన్స్‌జెండర్ రాపేటి జాస్మిన్. తన తోటివారికి అండగా నిలిచేందుకు ‘ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ’ అనే సంస్థను 2020లో స్థాపించి ట్రాన్స్జెండర్లను డ్వాక్రా గ్రూప్, స్కిల్ డెవలప్మెంట్, టైలరింగ్, బ్యుటీషియన్, కంప్యూటర్ కోర్స్, జ్యూట్ మేకింగ్ వంటి వివిధ రంగాల్లో రాణించేందుకు కార్యాచరణ రూపొందించారు. ముంబై నుంచి ట్రైనర్స్.. ముంబైకి చెందిన గౌరవ్, ఫ్రాంక్లిన్ టెంప్లేషన్ సంస్థలు తోడుగా నిలవడంతో ‘సాక్ష్యం 3.0 ఫ్రైడ్ ఈవెంట్’ అనే ప్రాజెక్టు పేరిట వందరోజుల పాటు శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని సోమవారం సూరారం కాలనీ ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు, స్థానిక ఎస్ఐ రాజు చేతుల మీదుగా 100 మంది సర్టిఫికెట్లను అందుకున్నారు. అనంతరం అపోలో ఆస్పత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పదిమందికి ఉపాధి కల్పిస్తా..ఇటీవల శిక్షణలో భాగంగా బ్యుటీషియన్లో నూతన విధానాలను నేర్చుకున్నా. స్థానికంగా సొంత బ్యూటీ పార్లర్ ఏర్పాటుచేసి పదిమందికి ఉపాధి కల్పించాలనేదే నా ఉద్దేశం. నగరంలో ఇతర కార్యక్రమాలకు ఎక్కడైనా బ్యుటీషియన్ ఈవెంట్స్‌కు వెళ్లేలా మా టీమ్ తయారు చేస్తా. మాకు కూడా సంఘంలో మహిళలతో సమానంగా గౌరవం అందాలి. – అంజలి బ్యుటీషియన్కంప్యూటర్పై పట్టు సాధించా..కంప్యూటర్ శిక్షణలో పలు మెళకువలు నేర్చుకున్నా. టైపింగ్ నుండి మొదలుకొని ఫొటో ఎడిటింగ్ వరకూ నేర్చుకున్నా. ఇప్పుడు నేను పదిమందికీ నేరి్పంచే విధంగా పట్టు సాధించా. నా కాళ్లపై నేను నిలబడగలననే ధైర్యం వచ్చింది. మున్ముందు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మరింత తెలుసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడతా. – నవీన లేటెస్ట్ మోడల్ టైలరింగ్ నేర్చుకున్నా.. క్రమం తప్పకుండా టైలరింగ్‌లో శిక్షణ ద్వారా పట్టుసాధించా. లేటెస్ట్ మోడల్ డిజైనింగ్‌లోనూ ప్రావీణ్యం పొందాను. సొంతగా టైలరింగ్ షాపు ఏర్పాటు చేసి తోటి వారికి ఉపాధి కల్పిస్తా.. – శరణ్య, టైలర్ (చదవండి: 35 మంది ఆడబిడ్డల తండ్రి..! 'దయ'కు సరైన నిర్వచనం..) -
అలాంటి సమస్యలపై మీరు పిల్ వేయచ్చు..!
మా ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల మరమ్మతు దగ్గర నుంచి శ్మశాన వాటికను ఆక్రమించే వరకు ఎన్నో సమస్యలపై సంబంధిత అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేశాము. కానీ ప్రయోజనం లేదు. పిల్ దాఖలు చేస్తే బాగుంటుంది అని తెలిసిన వాళ్ళు సలహా ఇచ్చారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వగలరు. – రాఘవులు, అనకాపల్లిసమాజంలో జరిగే వివిధ అన్యాయాలపై, అక్రమాలపై, ప్రభుత్వానికి – ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాధనానికి, పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి అంశాలపై ప్రతి పౌరుడు హైకోర్టును, అలాగే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించగలిగే హక్కు ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా కల్పించింది అత్యున్నత న్యాయస్థానం. సాధారణ కేసులలో అయితే మీకు, మీ కేసుకు సంబంధం ఏమిటి అని కోర్టుకు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పని పక్షంలో మీ కేసును కోర్టు పరిగణించవలసిన అవసరం లేదు. కానీ మీకు నేరుగా వ్యక్తిగత సంబంధం – లబ్ధి లేని అంశాలపై – ప్రజాప్రయోజనం ఉన్నది అని చూపించగలిగిన అంశాలపై పిల్ దాఖలు చేయచ్చు. నిజానికి మీకు నేరుగా ఎటువంటి లబ్ధి లేదు అని కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించ వలసి ఉంటుంది. అంతేకాక కేసు దాఖలు చేసే ముందు మీరు పూర్తిగా అధ్యయనం చేసిన విషయాన్ని నిర్ధారిస్తూ ఎలాంటి పరిణామాల మధ్య మీరు ఆ కేసు వేయవలసిన అవసరం వచ్చిందీ, అలాగే కేసుకు అయ్యే ఖర్చు మీరు భరిస్తున్నట్లు చెప్తూ మీ పాన్‌కార్డు నకలు కూడా సమర్పించవలసి ఉంటుంది. వీటన్నిటి వెనుక గల ఉద్దేశం: వ్యక్తిగత కారణాలవల్ల కాకుండా నిజమైన ప్రజాప్రయోజనం కోసం మాత్రమే మీరు కోర్టును ఆశ్రయించారు అని కోర్టు పరిశీలిస్తుంది. పనిచేసే ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 రావడానికి కారణమైన ‘విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్’, రోడ్డు ప్రమాదాలు /ప్రాణాపాయం వంటి అత్యవసర సమయాలలో ΄ోలీసు వారి కోసం వేచి చూడకుండా హాస్పిటల్ వారు చికిత్స అందించాలి అని చెప్పిన ‘పరమానంద కట్టారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ వంటి ఎన్నో కేసులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా వచ్చినవే! ఇది ఒక బలమైన హక్కుగా మనకు రాజ్యాంగం – సుప్రీం కోర్టు కల్పించినవి. ఇక మీ కేసుకి వస్తే. మీ సమస్యలన్నీ మీ గ్రామానికి సంబంధించినవి. అందులో మీకు నేరుగా లబ్ధి ఏమైనా ఉందా అనే విషయం చూడవలసిన అవసరం ఉంది. అయితే సరైన రోడ్లు లేక΄ోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లయితే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములలో /మీ ఊరి శ్మశాన వాటికలో ఆక్రమణలు జరుగుతున్నట్లు రుజువులు సేకరించినట్లయితే మీరు కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయవచ్చు. ప్రతి అంశానికి వేరు వేరు వ్యాజ్యాలు వేయాలా లేక కొన్ని అంశాలను కలిపి కోరవచ్చా అనేది కేసు పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పగలము. మీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హైకోర్టు లాయరును సంప్రదించి వారి ద్వారా వ్యాజ్యం వేయడం లేదా మీరే సొంతంగా వ్యాజ్యాన్ని వాదించుకుంటాను అని ప్రత్యేక దరఖాస్తు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. మీరు ఇదివరకే ప్రభుత్వ అధికారులకు సమర్పించిన అర్జీలను, మీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను, వీలైతే ఫోటోలు వీడియోలు తదితర కీలకపత్రాలను హైకోర్టుకు సమర్పించవలసి ఉంటుంది. హైకోర్టు మీ కేసును పరిశీలించిన తర్వాత సరైన న్యాయాన్ని కచ్చితంగా అందిస్తుంది.(చదవండి: ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్: పెళ్లి పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి) -
35 మంది ఆడబిడ్డల తండ్రి..!
‘మీకు ఎంతమంది పిల్లలు?’ అని ఎవరైనా అడిగితే... ‘35 మంది ఆడపిల్లలు’ అని చెబుతాడు హరే రామ్ పాండే. నిజానికి వారు ఆయన సొంతబిడ్డలు కాదు. సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారికి తండ్రి ప్రేమను పంచుతున్నాడు హరే రామ్ పాండే. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌కు చెందిన పాండే అనాథ అమ్మాయిల కోసం ఆశ్రమాన్ని నడుపుతున్నాడు...కొన్ని సంవత్సరాల క్రితం....ఒక అడవిలో చిన్న పాప ఏడుస్తూ ΄పాండేకు కనిపించింది. పాపను చీమలు కుడుతున్నాయి. దయనీయస్థితిలో ఉన్న పాపను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. 21 రోజుల పాటు చికిత్స జరిగింది. ఆ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ‘తాప్సీ’ అని పేరు పెట్టాడు. ఇలాంటి ఎంతోమంది తాప్సీల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు హరే రామ్పాండే. భార్య భావని కుమారితో కలిసి దేవ్‌ఘర్‌లో ‘నారాయణ్ సేవా ఆశ్రమం’ నడుపుతున్నాడు పాండే. చెత్త కుండీలో, అడవుల్లో, ముళ్ల పొదల్లో దీనస్థితిలో కనిపించిన ఎంతోమంది పసిబిడ్డలను రక్షించి వారికి తన ఆశ్రమంలో ఆశ్రయం కనిపిస్తున్నాడు పాండే.‘నేను తాప్సీని మొదట చూసినప్పుడు ఏడుపు ఆగలేదు. ఈ పసిబిడ్డను అడవిలో వదిలి వెళ్లడానికి వారికి మనసు ఎలా వచ్చింది అని కోపం వచ్చింది. అయితే దుఃఖంతో, కోపంతో సమస్యకు పరిష్కారం దొరకదు. నేను చేయాల్సింది ఉంది అనుకున్నాను. చేశాను’ గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు పాండే. కొన్ని సంవత్సరాలుగా రైల్వే పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల నుంచి పాండేకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారి నుంచి సమాచారం అందుకున్న వెంటనే దీనస్థితిలో ఉన్న బిడ్డను ఆశ్రమానికి తీసుకువచ్చి అన్ని వసతులు కల్పిస్తుంటాడు పాండే. సహాయం మాట ఎలా ఉన్నా మొదట్లో ఇరుగు పొరుగు వారి నుంచి అసహనం ఎదురయ్యేది.‘ఎక్కడెక్కడో నుంచి పిల్లలను తీసుకువస్తున్నారు. వారు ఏ కులం, ఏ మతం అనేది తెలియదు. వారి తల్లిదండ్రులకు లేని ప్రేమ మీకెందుకు?’... ఇలాంటి మాటలు ఎన్నో వినిపించేవి. అయినప్పటికీ కోపం తెచ్చుకోకుండా... ‘వారు నా బిడ్డలు. చివరి శ్వాస వరకు నా పిల్లలను నేను కాపాడుకుంటాను’ అనే మాట పాండే నోటి నుంచి వచ్చేది.ఆశ్రమంలో పెరిగిన తాప్సీ, ఖుషీలు ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనేది వారి లక్ష్యం. ఆశ్రమాన్ని నడిపించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పాండే సంపన్నుడు కాదు. అయితే ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా దాతల సహాయ సహకారాలతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు పాండే. దయాగుణ శక్తిచేసే పని మంచిదైతే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవి తొలగిపోతాయి. నా పనికి అయిదు మంది అడ్డు పడితే పదిమంది సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు. ఇది నా ఘనత కాదు. దయాగుణానికి ఉన్న శక్తి. మనకు ఎదురైన అనుభవాలను చూసి ‘అయ్యో!’ అని బాధపడడం మాత్రమే కాకుండా ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచిస్తే ఎన్నో మంచి పనులు జరుగుతాయి.– హరే రామ్ పాండే (చదవండి: ఎయిమ్స్‌కు తొలి మహిళా డైరెక్టర్ ఆమె..! నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ క్షణాల్లో..) -
పిల్లలకు స్నాక్స్.. ‘సింపుల్ వీక్లీ ప్లాన్’ ఇదే
స్కూళ్ల సీజన్ ప్రారంభమైపోయింది. తల్లిదండ్రులందరికీ.. తమ పిల్లలను చక్కగా తయారుచేయడం ఒక యజ్ఞమైతే.. వారికి బాక్సుల్లో చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనానికి ఏమేం పెట్టాలో నిర్ణయించి, తయారుచేయడం లేదా కొనిపెట్టడం మరో యజ్ఞం. పిల్లలకు మంచి పోషకాహారం పెట్టాలని చాలామందికి ఉంటుంది గానీ తెలియక కొందరు, సమయం లేక మరి కొందరు పెట్టలేరు. అలాంటి వాళ్లందరి కోసం.. ‘అసలు రోజువారీ భోజనంలో అన్ని పోషకాలూ అందాలంటే ఏయే పదార్థాలు పెట్టాలి.. మాంసకృత్తులు ఎంత ఇస్తే మంచిది.. చిరు ధాన్యాలను పిల్లలకు పెట్టవచ్చా..’ ఇలాంటి ఎన్నో విలువైన విషయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) డైరెక్టర్ డా. భారతి కులకర్ణి.ప్ర: స్కూళ్ల సీజన్ మళ్లీ ప్రారంభమైంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ పిల్లల, ముఖ్యంగా బడుల్లో చదువుకుంటున్న పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సమస్యపై ఎన్ఐఎన్ ఇటీవల చేసిన అధ్యయనాలేమైనా ఉన్నాయా?జ: ఉన్నాయి. అధికంగా కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఇలాంటి ఆహార పదార్థాల వల్ల మన పిల్లల ఆరోగ్యానికి జరుగుతున్న నష్టం గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కి అనుబంధంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) అనేక అధ్యయనాలు నిర్వహించింది. వీటి ఫలితాలను ఫాట్ స్టడీ రిపోర్ట్స్, ఎఫ్.ఓ.పి.ఎన్.ఎల్. స్టడీ 2023, డైటరీ గైడ్‌లైన్స్ 2024 వంటి అనేక నివేదికల్లో పొందుపరచి జాతీయ విధాన చర్చల కోసం అందించింది.ప్ర: ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే స్కూలు పిల్లలకు ఉదయపు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం, రాత్రి ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులను ఎంతెంత పాళ్లలో అందించాలి?జ: పిల్లలు ప్రతి రోజూ నీరసం లేకుండా శక్తిమంతంగా గడపడానికి, ఆరోగ్యంగా ఎదగడానికి పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులతో కూడిన సమతులాహారం అందించాలి. ఈ కింద పేర్కొన్న విధంగా పెడితే బాగుంటుంది:ప్ర: ప్రతి కిలోగ్రామ్ శరీర బరువుకు 1 గ్రాము మాంసకృత్తులు తినాలని చెబుతూ ఉంటారు కదా! ఊబకాయం ఉన్నా, లేకున్నా స్కూలు పిల్లలకు, పెద్దలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? జ: అవును. ఈ సూత్రం స్కూలుకెళ్లే పిల్లలతో పాటు జనాభాలో చాలామందికి వర్తిస్తుంది. వారు మామూలుగా ఉన్నా, ఊబకాయంతో ఉన్నా సరే.. ఇందులో మార్పేమీ లేదు. అయితే, ఊబకాయంతో ఉన్న పిల్లలు ఎంత మాంసకృత్తులు తినాలనేది లెక్క వేసేటప్పుడు ఇప్పుడు వారున్న బరువును లెక్కలోకి తీసుకోకూడదు. వారి వయసు/ఎత్తును బట్టి వారు ఎంత బరువుంటే బాగుంటుందో దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. మాంసకృత్తులు శరీరం, మెదడు ఎదుగుదలకు ఉపకరిస్తాయి. ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, పప్పులు, చేపల నుంచి లభించే నాణ్యమైన మాంసకృత్తులు ఇవ్వటం ముఖ్యం.ప్ర: కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు వంటి మిల్లెట్లతో వండిన వంటకాలను రోజువారీ ప్రధానాహారంగా తీసుకుంటే పిల్లలకైనా, పెద్దలకైనా పోషకాల లభ్యత సమస్య వచ్చే అవకాశం ఉంటుందా?జ: స్మాల్ మిల్లెట్లలో పీచు, ఇనుము, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలోని ఫైటేట్స్ అనే యాంటీ–న్యూట్రియంట్స్ కారణంగా వాటిలోని పోషకాలను పూర్తి గా వంట పట్టించుకోవటం సాధ్యపడదు. వీటిని సరైన పద్ధతిలో.. అంటే.. నానబెట్టి, పులియబెట్టి, మొలకలు వచ్చేలా చేసి తింటే వాటిలోని పోషకాలను వంట పట్టించుకోవచ్చు. వరి అన్నానికి బదులుగా చిరుధాన్యాల అన్నాన్ని ఒకేసారి 100% తినటం కాకుండా.. కొంత శాతంతో ప్రారంభించటం మంచిది. చిరుధాన్యాలు పిల్లలకైనా పెద్దలకైనా ఉపయోగకరమైనవే. ఇవి జీర్ణశక్తిని పెంపొందించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి, ఊబకాయాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి.ప్ర: ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకునే పిల్లలు వారం రోజుల్లో తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుతిండ్లను సూచించగలరా?జ: స్కూల్ టిఫిన్/స్నాక్స్ బాక్సుల్లో పెట్టడానికి ‘సింపుల్ వీక్లీ ప్లాన్’ ఈ కింది విధంగా ఉంటే బాగుంటుంది. చిన్నపిల్లల వైద్యురాలు.. శాస్త్రవేత్తడాక్టర్ భారతి కులకర్ణి ఎంబీబీఎస్ చదివి.. శాస్త్రవేత్తగా మారారు. పుణే యూనివర్సిటీలో చిన్నపిల్లల వైద్యశాస్త్రంలో పీజీ చేశారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ చదివారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టోరల్ డిగ్రీ పొందారు.చిన్న పిల్లల ఆహారానికి సంబంధించిన జాతీయ ప్రమాణాల రూపకల్పనపై ప్రత్యేక కృషి చేశారు.ఏ రోజైనా సరే.. నీరు, పండ్లు, పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలనే పిల్లలకు పెట్టాలి. నూనెలో వేపిన వంటకాలు రోజూ పెట్టొద్దు. ప్యాకెట్లలో దొరికే స్నాక్స్, చిప్స్, చాక్లెట్లు, తీపి పానీయాలు ఇవ్వొద్దు.1. ఉదయపు అల్పాహారం: 50% పిండి పదార్థాలు – శక్తి కోసం ఉదా: ఇడ్లీ, పోహా, చపాతి, హోల్ గ్రెయిన్ బ్రెడ్ వంటివి25% ప్రొటీన్ – శరీరం ఎదుగుదల కోసం ఉదా: పాలు, గుడ్లు, మొలకలు, పప్పు వగైరా25% ఆరోగ్యకరమైన కొవ్వులు–మెదడు పెరుగుదల కోసం ఉదా: వేరుశనగలు, బాదం పప్పులు వంటి నట్స్, కొద్ది పరిమాణంలో నెయ్యి2. మధ్యాహ్న భోజనం: వరి అన్నం లేదా రొట్టెతో పాటు పప్పు లేదా పెరుగు, ఆ సీజన్లో పండే కనీసం ఒక రకంకూరగాయ, ఒక పండు.చదవండి: అమ్మతనం ఇచ్చిన 'బ్రహ్మా'నందం3. రాత్రి భోజనం: మధ్యాహ్న భోజనం మాదిరిగానే ఉండొచ్చు. కాకపోతే కాస్త లైట్‌గా ఉంటే మంచింది. అంటే, తక్కువ నూనె, ఎక్కువ కూరగాయలు పెట్టాలి. మరీ రాత్రి ఆలస్యంగా కాకుండా, ముందే భోజనం చేసేయాలి. ఇలా ఆహారం తీసుకునే పిల్లలు స్కూల్లో పాఠాలపై దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. చురుగ్గా ఉంటారు. ఆరోగ్యంగా తగినంత బరువుతో ఎదుగుతారు. -
సివిల్స్‌లో మూడుసార్లు ఓటమి..! మూడేళ్లు మొబైల్ లేకుండా..
సివిల్స్ విజేతల గాథలు ఎప్పటికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అందులో గెలుపొందడం అనేది అసాధారణమైనది. దశల వారిగా నెగ్గుకుంటూ రావాల్సిన ఈ ప్రతిష్టాత్మక ఎగ్జామ్‌లో ఏ దశలో తప్పినా..మళ్లా మొదటి నుంచే రావాలి. అలాంటి కఠినతరమైన ఎగ్జామ్‌లో గెలవడం అనేది యువతకు అతిపెద్ద డ్రీమ్. దాన్ని సాధించే క్రమంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, చేసిన త్యాగాలు వింటే విక్టరీ కోసం తపన ఇలా ఉండాలా అనే ప్రేరణను కలుగజేస్తాయి. అలాంటి కోవకు చెందిందే రాజస్థాన్‌కి చెందిన నేహా బయాద్వాల్. తండ్రిలానే ప్రభుత్వం ఉద్యోగం పొందాలని సివిల్స్ ఎంచుకుంది. ఆ క్రమంలో ఆమె వరుస ఓటములు ఎదురైనా.. వెనుదిరగక చావో రేవో అనేలా కష్టపడింది. చివరికి తన కల సాకారం చేసుకుంది. మరీ ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!.రాజస్థాన్‌కి చెందిన నేహా బయాద్వాల్ బాల్యంమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే సాగింది. ఆమె తొలిసారి వైఫల్యం చూసింది ఐదోతరగతిలో. ఎందుకంటే తన తండ్రికి భోపాల్ ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడ స్కూల్లో ఐదోతరగతి చదవాల్సి వచ్చిందట. అయితే అక్కడ కేవలం ఇంగ్లీష్‌లో మాట్లాడాలట. పొరపాటున హిందీలో మాట్లాడితే జరిమానా విధిస్తారట. దీంతో భాషాపరమైన ఓటమిని తొలిసారిగా చవిచూశానని చెప్పుకొచ్చింది. ఎట్టకేలకు అందులోనే నైపుణ్యం సంపాదించి శెభాష్ అనిపించుకున్నట్లు కూడా తెలిపింది. ఆమె తండ్రి సీనియర్ ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారి కావడంతో ఆయన అడుగుజాడల్లోనే వెళ్లాలని నిశ్చయించుకుని యూపీఎస్సీకి సిద్ధమైంది. అయితే వరుసగా మూడుసార్లు ఓటముల చవిచూడగా చిర్రెత్తికొచ్చి..మొబైల్‌కే దూరంగా ఉండాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయిందట. అలా మూడేళ్లు ఫోన్‌కి దూరంగా ఉంటూ..ఆహర్నిశలు కష్టపడి చదివింది. అంతేగాదు ఆమె రోజుకు సుమారు 17 నుంచి 18 గంటలు చదివేదట. చివరికి తన డ్రీమ్‌ని సాధించి ఐఏఎస్ అధికారి అయ్యింది. ఇక నేహా మాట్లాడుతూ..పిల్లల కోరికలను తీర్చడమే త్యాగం కాదని, ఎంత బిజీగా ఉన్న పిల్లల ఆలనాపాలనా పట్టించుకుంటూ..వారికి చదువులో సాయం చేయడమే నిజమైన త్యాగం అని అంటోంది. తన తండ్రి ఎంత బిజీగా ఉన్నా..ఇంటికి రాగానే తనకు కనీసం 30 నిమిషాలు గణితం బోధించడానికి సమయం కేటాయించేవారని అంటోంది. అలాగే ఈ ఐఏస్ కలనే నెరవేర్చుకోవడలంలో మొత్తం కుటుంబమే తోడ్పాటును అందించిందని చెప్పుకొచ్చింది. చివరగా నేహా..ఈ ఐఏఎస్ ప్రిపరేషన్లో ఎదురయ్యే ఓటములు కసిసి పెంచి, టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పించడం తోపాటు వివేకంతో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుందని చెబుతోంది. (చదవండి: పుట్టగొడుగులను అలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు నిల్..! నిపుణుల షాకింగ్ విషయాలు..) -
పుట్టగొడుగులను అలానే వండేయొద్దు..! నిపుణుల షాకింగ్ విషయాలు
పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ రుచికరమే కాకుండా ఆరోగ్యకరం కూడా. అయితే వీటి నుంచి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలనుకుంటే..అలా నేరుగా వండకూడదట. ఈ పుట్టగొడుగులు విటమిన్ డీకి సంబంధించిన ఆహారాల్లో ఒకటి. అందువల్ల వాటి నుంచి సమృద్ధిగా విటమిన్‌డీ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఫ్రిజ్ నుంచే లేదా మార్కెట్ నుంచి కొనుగోలు చేసి నేరుగా వండేయకూడదని పోషకాహార నిపుణుల చెబుతున్నారు. మరి ఎలా వండాలంటే..పుట్టగొడుగులు(Mushrooms)ను వండడానికి ముందు కొద్దిసేపు ఎండలో వదిలేసి వండితే విటమిన్ డీని గణనీయంగా పొందగలుగుతామని చెబుతున్నారు నిపుణుడు. సుమారు 15 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతికి గురి చేస్తే విటమిన్ డీ స్థాయిలు అనూహ్యంగా పెరుగుతాయని పరిశోధనల్లో కూడా తేలింది. ఎందుకంటే వీటిలో ఎర్గోస్టెరాల్ ఉంటుందట. ఇది సూర్యకాంతికి గురవ్వడంతో విటమిన్ డీగా మారడాన్ని గుర్తించారట. అందువల్ల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డీ కోసం కొద్దిసేపు సూర్యకాంతిలో ఉంచి వండమని సూచిస్తున్నారు. కలిగే లాభాలు..బరువుని అదుపులో ఉంచుతుంది. పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి హెల్ప్ అవుతుందిమెదుడు ఆరోగ్యం తోపాటు దృష్టిని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందిఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఎముకల వ్యాధులు దరిచేరవుఎలా ఎండబెట్టాలంటే.. వీటిని కాంతికి దూరంగా నిల్వచేసినా లేదా ప్రిజ్ నుంచి నేరుగా ఉడికించిన ఈ విటమిన్‌ని సమృద్ధిగా పొందలేరటఈ పుట్టగొడుగులను ముక్కలుగా కోసి సూర్యకాంతిలో అంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో ఓ 30 నుంచి 60 నిమిషాలు ఉంచితే చాలట. ఏ రోజు వండాలనుకుంటున్నామో ఆ రోజే ఎండలో ఉంచి వండితే మరి మంచిదటకేవలం 100 గ్రాముల సూర్యరశ్మికి గురైన పుట్టగొడుగులు 10–15 మైక్రోగ్రాముల విటమిన్ డి 2 లభిస్తుందట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఎయిమ్స్‌కు తొలి మహిళా డైరెక్టర్ ఆమె..! నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంతిమ క్షణాల్లో..) -
కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియో
బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడితే..ఏ తండ్రి అయినా చూస్తూ ఉరుకుంటాడా..? తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు దూకేస్తాడు. సరిగ్గా అదే చేశాడో తండ్రి. తన కళ్లముందే బిడ్డ సముద్రంలో పడిపోవడాన్ని చూసి క్షణం ఆలోచించకుండా దూకేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. డిస్నీ క్రూయిజ్ షిప్ లోని 4వ డెక్ నుంచి ఒక పాప పొరపాటున జారి పడబోయింది. ఇది చూసిన తండ్రి క్షణం ఆలోచించుండా ఆమెను కాపాడటానికి సముద్రంలోకి దూకాడు. జూన్ 29న బహామాస్ - ఫోర్ట్ లాడర్డేల్ మధ్య ఓడ ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. బహామాస్ చుట్టూ నాలుగు రాత్రుల షిప్లో గడిపిన తరువాత ఓడ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్కు తిరిగి వస్తోంది. చదవండి: కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్"ఓడ వేగంగా కదులుతోంది. సముద్రపు హోరును, నీటి మెరుపులను చూస్తూ ప్రయాణికులుఎంజాయ్ చేస్తున్నారు. తన అయిదేళ్ల కమార్తెకు తండ్రి రైలింగ్ దగ్గర ఫోటో తీస్తున్నాడు. ఇంతలోనే ఆ పాప పడిపోయింది. వెంటనే తండ్రి కూడా దూకేశాడు. దీంతో ఓడ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. కెప్టెన్ వెంటనే ఓడను స్లో చేశాడు. ఇంతలో క్రూ సభ్యులు లైఫ్సేవర్లను నీటిలోకి విసిరారు. క్రూయిజ్ షిప్ నుంచి రెస్క్యూ బోట్ ద్వారా తండ్రీ కూతుళ్లను రక్షించారు. ఇది కళ్లప్పగించి చూస్తున్న ప్రయాణికులు బిగ్గరగా హర్షధ్వానాలు చేశారు. అటు ప్రయాణీకులు, ఇటు డిస్నీ సిబ్బంది తండ్రి ధైర్యాన్ని ప్రశంసించారు.హీరో అంటూ నెటిజనులు కూడా తండ్రిని అభినందనల్లో ముంచెత్తారు. ఈ సంఘటనను రికార్డ్ చేసిన ట్రేసీ రాబిన్సన్-హ్యూస్, "బిడ్డను కాపాడటానికి దూకిన ఒక హీరో’’ అంటూ ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. NEW: Father jumps overboard to save his 5-year-old daughter, who fell off a Disney cruise ship from the 4th deck into the ocean.The ship was heading back to South Florida when the intense rescue was made."The ship was moving quickly, so quickly, it's crazy how quickly the… pic.twitter.com/PTGmAzZJ7O— Collin Rugg (@CollinRugg) June 30, 2025మరోవైపు డిస్నీ క్రూయిజ్ లైన్ తమ సిబ్బంది స్పందించిన తీరు, ప్రయాణీకులను రక్షించిన తీరును ప్రశంసిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం తెల్లవారుజామున ఆ ఓడ సురక్షితంగా పోర్ట్ ఎవర్గ్లేడ్స్కు తిరిగి వచ్చింది.ఇదీ చదవండి: 5 వేల కిలోమీటర్ల దూరంనుంచి రెండుగంటల్లో సర్జరీ : విప్లవాత్మక అడుగు -
అందం ముఖ్యమే.. కానీ, ఆ బలహీనతకు లొంగిపోకూడదు!
కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) ఆకస్మిక మరణం రకరకాల చర్చలకు తెరలేపింది. యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ల కారణంగా గుండెపోటు వచ్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో గ్లామర్ ప్రపంచంలో విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలు, యువత అందం, నాజుకుతనంపై ఫోకస్ పెట్టి ప్రాణాలు పణంగా పెడుతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం హాట్‌టాపిక్ మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయంపై నటి ఖుష్బూ సుందర్ కూడా స్పందించారు. యువత, యువ నటీనటులు ఎదుర్కొంటున్న ఆందోళనల గురించి నటి ఖష్బూ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అందరూ గ్లామర్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది మంచి విషయమై అయినప్పటికీ కొన్ని విషయాలను గుర్తించుకోవాలంటూ అందానికి సంబంధించిన అమూల్యమైన సలహాలు సూచనలు అందించారామె. అవేంటంటే.. ఇది గ్లామర్ ఫీల్డ్‌కు పరిమితమైన సమస్య మాత్రమే కాదని.. సాధారణ యువతీయుకులు కూడా బాహ్య అందం అనే ఉచ్చులో పడిపోతున్నారని అన్నారామె. ‘‘ఏం చేస్తున్నారో..ఎలాంటి చికిత్సలు తీసుకుంటున్నాం అనే దానిపై పెద్దగా ఫోకస్ లేదు, ఆరోగ్యంపై జాగ్రత్త కూడా లేదని మండిపడ్డారు. ముఖ్యంగా తమ అందం తరిగిపోతే ఐడెంటిటీ ఎక్కడ కనుమరుగైపోతుందో అనే ఫోమో( FOMO) భయంతో చేసే తప్పులే ఇవి’’.. ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో డిసైడ్ చేసేస్తోందన్నారు. దాన్ని ఎప్పుడైతే వాటిని మనం సీరియస్ తీసుకుంటామో అప్పుడే సమస్యల వలయంలో చిక్కుకుంటామని అంటున్నారు ఖుష్బూ. ముందుగా బయటి ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిళ్లను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవాలి. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ముఖ్యమే..ఎంత వరకు తీసుకోవాలి అనేది మనపైనే ఆధారపడి ఉంది. అంతేగాదు మనం ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించుకోవలే గానీ ఎదుటి వారి మాటలకు, కామెంట్లకు తలొగ్గే బలహీనతకు లొంగిపోకూడదని చెబుతున్నారు. "ఇది మన జీవితం మనకు నచ్చినట్లుగా ఉండాలే గానీ..ఎవ్వరో నిర్ణయించినట్లు కాదనేది గుర్తరెగాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఏజ్‌తోపాటు వచ్చే వృద్ధాప్యాని ఆనందంగా ఆహ్వానించగలుగుతారు. దాన్ని కూడా అందంగా ఆరోగ్యవంతంగా నిర్వహించగలుగుతారు " అని చెబతున్నారామె. బాలనటిగా సినీ ప్రపంచంలోకి వచ్చిన తకు ఇలాంటి ఒత్తిళ్లు లేవని, ఇండస్ట్రీలో సహృద్భావంతో కూడిన వాతావరణం ఉండేదని అన్నారు. తాము ఆరోజుల్లో బయటకు ఏ డ్రెస్స్‌లో అయినా ధైర్యంగా వెళ్లేవాళ్లం. ఎందుకంటే అప్పుడు ఇలాంటి ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల ట్రోలింగ్ భయం లేదు. సినిమాలో దర్శకుడి చెప్పినట్లుగా నడుచుకున్నా..బయట మాకు నచ్చిన శైలిలో బతకగలిగే స్వేచ్ఛ మాకుంది. నేటి యువ హీరో హీరోయిన్లకు, యుతకు ఆ అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరం అన్నారు. అంతెందుకు నా పిల్లలు ఫేస్బుక్లో, ఇన్‌స్టాలో ఎలాంటి ట్రోలింగ్ బారినపడ్డారో తెలుసు. ఎందుకంటే వాళ్లు బాగా పొడుగ్గా ఉండటంతో.. ఖుష్బూ కూతుళ్లు ఇలా ఉండటం ఏంటని అనే మాటలు చాలా బాధించాయంటూ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. తల్లిగా వాళ్ల బాగా పొడుగ్గా ఉండటం నన్ను ఇబ్బందిపెట్టలేదు కానీ, బయటి నుంచి వాళ్ల ఎదుర్కొన్న ఒత్తిడిని తాఉ చాలా దగ్గరగా చూశానన్నారు. అయితే తన పిల్లలకు దాన్ని ఎలా అధిగమించాలో కూడా నేర్పానని అన్నారు. ముందు మనం స్ట్రాంగ్ ఉంటే పిల్లలు కూడా అలాంటి వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తాని అన్నారు. అలాగే తనకు ప్రత్యేక మేకప్ ఆర్టిస్ట్ గానీ, డిజైనర్ గానీ లేరని, అవన్నీ తానే స్వయంగా చేసుకుంటానని అన్నారామె. యాంటీ-ఏజింగ్ చికిత్సలు మంచివేనా..వృద్ధాప్య వ్యతిరేక చికిత్సలు మంచివనే అంటోంది ఖుష్బూ. ఎందుకంటే ఎప్పటికీ 20 ఏళ్లలా కనిపించేలా ఎలాంటి మ్యాజిక్ ఉండదని గుర్తించుకోండని అంటున్నారామె. మన శరీరంలో వయసు రీత్యా వచ్చే మార్పులను అంగీకరించండి, అందంగా ఉండేలా ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. అయితే అది ఎంత వరకు అనేదానిపై నియంత్రణ ఉండాలంటున్నారు. ఏదైనా ప్రారంభించండి..కానీ దాన్ని ఎక్కడ ఆపాలో కూడా కచ్చితంగా తెలియాలి అని చెబుతున్నారామె. తాను కూడా వృద్ధాప్య వయసులోకి వచ్చానని, కానీ దాన్ని తాను అందంగా నిర్వహిస్తున్నా అని అన్నారు. "తన ముఖంపై ముడతలు ఉన్నాయి, కళ్లకు కళ్లజోడు పెట్టుకోవాల్సి వచ్చింది..అయితే వాటన్నింటిని స్టైలిష్‌గా నిర్వహిస్తున్నా. అందుకోసం రెగ్యులర్ షేషియల్స్ చేయించుకుంటా..స్కిన్ బాగుండేలా చూస్తా..అలా అని మితీమీరిన బ్యూటీ చికిత్సల జోలికి వెళ్లిపోను. ఎందుకంటే ఎక్కడ ఆపాలి అన్నదానిపై క్లారిటీ ఉంది" అని నొక్కి చెబుతున్నారు ఖష్బూ. అలాగే బాహ్య అందం తోపాటు..లోపాల అంతర్గతంగా కూడా బాగుండాలని చెప్పారామె. బయటన ఎంత అందంగా ఉన్నా..లోపాల అంతర్గత శరీరం అనారోగ్యం పాలుకాకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారామె. అమ్మాయిలంతా మిస్ అయ్యేది ఇక్కడేనని, బాహ్య రూపం కంటే.. అంతర్గత ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని పిలుపు ఇచ్చారామె. (చదవండి: గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..) -
నావనెక్కి.. 'నేవీకి చేరి'..!
చిన్ననాటి విషాదాలను, పేదరికాన్ని జయించి సెయిలింగ్‌లో అద్భుత ప్రతిభను కనబరిచిన ముగ్గురు తెలుగు యువకులు భారత నౌకాదళంలోని స్పోర్ట్స్ కంపెనీలో చేరనున్నారు. ఈ ముగ్గురు నవీన్, సాత్విక్ ధోకి, రిజ్వాన్ మహమ్మద్.. వారి జీవితం ఎలా ఉన్నా అద్భుతమైన సెయిలింగ్ ప్రతిభతో భవిష్యత్ ప్రయాణాన్ని సుగమం చేసుకున్నారు. ఈ యువ హైదరాబాదీ సెయిలర్లు గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ (ఎంవైఎస్సీ)కి ఎంపికయ్యారు. తార హోమ్ నుంచి యువ తారగా.. ప్రకాశం జిల్లాలోని లక్ష్మప్ప గ్రామానికి చెందినవాడు 13 సంవత్సరాల నవీన్. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తప్పిపోయి నగరంలోని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు దొరికాడు. అక్కడి నుంచి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా తార హోమ్ అనే అనాథ శరణాలయానికి చేరుకున్నాడు. ఇలాంటి దయనీయమైన గతం నుంచి ఈ తరం యువతకు స్ఫూర్తి నింపేలా తను భవిష్యత్తును రూపుదిద్దుకున్నాడు. జాతీయ స్థాయి మేటి సెయిలర్‌గా.. 15 ఏళ్ల రిజ్వాన్ మహమ్మద్ ప్రస్తుతం దేశంలోనే నెం.1 సెయిలర్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌లోని పాట్టిగడ్డ ప్రాంతంలో ఒక చిన్న గుడిసెలో నివసించే రిజ్వాన్ ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో వంట మనిషిగా పనిచేస్తుంది. కాసింత ప్రోత్సాహం అందితే చాలు అనుకునే పరిస్థితి నుంచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ సెయిలర్‌గా మారడంలో తన కృషి, నిబద్ధత, అంకితభావం ఎలాంటిదో ఊహించవచ్చు. కూలీ కుటుంబం.. వరంగల్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామం నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందినవాడు 14 సంవత్సరాల సాత్విక్. అతని తండ్రి హైదరాబాద్ మోండా మార్కెట్లో కూలీగా, తల్లి ఓ ఇంటి పనిమనిషిగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన సాత్విక్ భారత నౌకాదళంలో చేరనుండటం తనకే కాదు తన కుటుంబానికి సైతం గర్వకారణం. నేనున్నాననీ..ఈ ముగ్గురు యువకుల ప్రస్థానంలో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) కీలక పాత్ర పోషించింది. ఆరేళ్ల నవీన్ తప్పిపోయి అనాథ శరణాలయం ‘తార హోమ్’కు చేరుకున్న సమయంలో.. వైసీహెచ్ అతన్ని గుర్తించి సెయిలింగ్ శిక్షణ కోసం ఎంపిక చేసింది. నవీన్ లాగే, పేద కుటుంబాల నుంచి వచ్చిన సాత్విక్, రిజ్వాన్ కూడా వైసీహెచ్ మార్గ దర్శకత్వంలోనే శిక్షణ పొందారు. కోచ్ సుహీమ్ షేక్ పర్యవేక్షణలో ఈ యువకులు సెయిలింగ్‌లో కఠోర శిక్షణ తీసుకున్నారు. అంకితభావం, పట్టుదల జాతీయ స్థాయి పోటీల్లో ఉన్నత స్థానాలకు చేర్చాయి. రిజ్వాన్ మహమ్మద్ అయితే స్థిరంగా పతకాలను సాధిస్తూ, అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఈ యువకుల అసాధారణ ప్రతిభ, క్రీడా స్ఫూర్తిని గుర్తించిన నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ, వారిని తమ జట్టులోకి తీసుకుంది. (చదవండి: గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..) -
గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..
కొన్ని ఘటనలు మానవత్వం ఇంకా ఉందా అనే సందేహానికి తావిస్తే, మరికొన్ని.. ఇంకా మంచితనం బతికే ఉంది అనిపించేలా ఉంటాయి. అలాంటి హృదయవిదారక ఘటనే నవీ ముంబైలో చోటుచేసుకుంది. ఆ సంఘటన అందరిని మానవత్వంపై ఆలోచింప చేయడమే గాక, తోటివారికి చేతనైనా సాయం చేయాలి అనే స్పుహని కలిగించేలా చేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..55 ఏళ్ల టెకీ అనూప్ కుమార్ జీవితం గత మూడేళ్లుగా ఓ ఫ్లాట్ గదిలోనే ఒంటరిగా సాగింది. తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన అనంతరం తీవ్ర మానసిక ఆందోళనకు గురైయ్యారు. దాంతో బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. అంతేగాదు తన రోజువారీ అవసరాల కోసం పూర్తిగా ఆన్లైన్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడ్డారు. ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. ఇంట్లో చెత్త బయటన పారయేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం తదితరాల వల్ల కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అంతటి పరిస్థితి ఎదురైనా అనూప్ దాన్ని పట్టించుకోకుండా అదే దుర్భరమైన పరిస్థితుల్లో జీవించసాగాడు. అంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పందించిన అప్పార్ట్మెంట్ వాసులు..అనూప్ విషాదకర పరిస్థితిని గుర్తించిన అపార్ట్మెంట్ సొసైటీ వాసులు వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, ముంబైలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్.ఈఏఎల్ (Social & Evangelical Association for Love) కు సమాచారం అందించారు. వారి చొరవతో అనూప్‌ను అపార్ట్మెంట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ప్రస్తుతం అనూప్‌కు మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల అవసరమైన చికిత్స అందిస్తున్నారు. SEAL సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఆయనకు పునరావాసం కల్పించి, మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించింది. మన చుట్టూ ఉన్నవారి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం, కష్టాల్లో ఉన్నవారికి మానవతా మనసుతో స్పందించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తోంది. ఒకరి బాధను గమనించి, చేయగలిగినంతలో చేయూత ఇవ్వగలిగితేనే నిజమైన మానవత్వం ప్రకాశిస్తుంది.మనం మన పరిసరాలను నిశితంగా పరిశీలిస్తే, అనూప్ వంటి వారు మన మధ్యనే ఉండవచ్చు. వారికి అండగా నిలబడి, సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. సాటి మనిషి పట్ల కరుణ, ప్రేమను చూపడం ద్వారానే మనం బలమైన సమాజాన్ని నిర్మించగలం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది ఈ ఘటన.(చదవండి: కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..) -
డాక్టర్ హార్ట్ బీట్ : అమ్మతనం ఇచ్చిన‘బ్రహ్మా’నందం
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్‌కు లైఫ్‌కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్‌లో సక్సెస్‌తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్‌ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని భావోద్వేగాలు వాళ్ల మాటల్లోనే...మదర్ హుడ్అమ్మతనపు కమ్మదనం కోసం అర్రులు సాచే అమ్మాయిలెందరో! అలాంటి అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. అప్పటికే ఆ అమ్మాయికి నాలుగు అబార్షన్లు అయ్యాయి. ఆ గర్భస్రావాల్లో ఒకట్రెండు దాదాపు పూర్తికాలం గర్భం మోసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ ఏ ప్రసవంలోనూ బిడ్డ జీవించి పుట్టలేదు. ఈసారి ఐదో ప్రసవం సమయంలో ఆ దంపతులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లకు ఇది ఐదోసారి గర్భధారణ. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో ఏదో తేడా ఉంది. వాళ్లలో ఉండే వేదన ఎంతో ఎవ్వరైనా అంచనా వేయవచ్చు. చదవండి: ఐఏఎస్ కల: మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!మా దగ్గర రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాం. మొదటిది క్రోమోజోముల్లో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకునే క్యారియోటైపింగ్ టెస్ట్. రెండోది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి గల అవకాశాలను తెలిపే ప్రాంబబిలిటీ పరీక్ష. వాళ్లు రెండోది కోరుకున్నప్పటికీ... అప్పటికే ఉన్న ప్రతికూలతల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే... ఒకవేళ పుట్టబోయే బిడ్డకు శారీరక అవయవాల్లో లోపాలో లేదా మానసికంగా బిడ్డ ఎదుగుదల బాగుండదనో తెలిస్తే జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి... ‘ఇదీ పరిస్థితి. ఇక మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెబుతాం. ఇక ఆ తర్వాత నిర్వహించిన క్యారియోటైపింగ్ పరీక్షల్లో బిడ్డలో ‘క్రోమోజోమల్ ట్రాన్స్ లొకేషన్’ జరిగినట్లు తేలింది. అంటే... క్రోమోజోముల్లోని ఒకచోట ఉండాల్సినవి అక్కడినుంచి మారి మరోచోట చేరాయి. కానీ చూడ్డానికి అంతా బాగానే ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఆరోగ్య కరంగానే పుడుతుందా అంటే చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ఓ పని చేస్తుంది. అనారోగ్యకరమైన బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేసేందుకు మూడు నెలలలోపు స్వాభావికంగా దానంతట అదే బిడ్డ పడిపోయేలా చేస్తుంది. అంటే నేచురల్ అబార్షన్ జరిగిపోతుందన్నమాట. అదే ఒకవేళ మూడు నెలలు గడిచిపోయాయంటే ఇక బిడ్డ పూర్తిగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి సస్పెన్సు కాలమైన ఆ మూడు నెలలూ గడిచిపోయాయి. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోఇప్పుడు రెండో సస్పెన్సు మొదలైంది. ఇప్పటికే నిండు చందమామలాంటి బిడ్డలు నలుగురు ఆ అమ్మ ఒడినుంచి జారిపోయారు. కడుపున మరో బంగారం పెరుగుతోందిగానీ... ఆ కొంగుబంగారమూ కొంగుజారిపోతే? అమ్మో!! అందుకే మేమంతా కాబోయే ఆ అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం. క్రోమోజోమల్ ట్రాన్స్‌లొకేషన్ జరిగిందంటే ఏదో జరిగిందనే అర్థం. కాకపోతే అదెక్కడో, ఎలాగో, దాని పర్యవసానాలేమిటో తెలియదు. జాగ్రత్తగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు అల్లరిపిడుగు పుట్టనే పుట్టింది. ఆ బంగారుతల్లి ఒడిలోకి బంగారుకొండ చేరింది. అంతా సుఖాంతం. బిడ్డకు పూర్తి ఆరోగ్యం. మా అందరిలోనూ కొండంత ఆనందం. నేను చెప్పేదేమిటంటే... ప్రతి ఒక్కరికీ జెనెటిక్ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. కానీ ఎలాంటి బిడ్డ పుడుతుందో... పుట్టి జీవితాంతం తల్లిదండ్రులను క్షోభపెడుతుందో తెలియని పరిస్థితుల్లో జన్యుపరీక్షలు అవసరం. ఓ సీనియర్ జన్యువైద్య పరిశోధకురాలిగా, జెనెటిక్స్ వైద్యురాలిగా ఇదీ నా సూచన.డాక్టర్ యానీ క్యూ హసన్, సీనియర్ జెనెటిక్ – మాలెక్యులార్ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్ -
కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..
కళ కోసం తపించే మహానుభావులెందరినో చూశాం. తమ సర్వస్వం దానికే అర్పించి..భావితరాలకు వాటి గొప్పతనం తెలియజేసిన మహానుభావులెందరో ఉన్నారు. అయితే ఇక్కడొక పోలీసు అంతలా కాకపోయినా..చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు కళకారుడిగా మారిన కథ ఇది. కుటుంబ భాద్యతల నడుమ మరుగున పడ్డ తన కలకు ప్రాణం పోసి శెభాష్ అనిపించుకుంటున్నాడు.అతడే కర్ణాటకకు చెందని పోలీసు బి ఎస్ శివరాజు. ఆయన తన తల్లి గౌరమ్మతో కలిసి ఒక్కఫోటో కూడా దిగలేదు. తన స్నేహితులు, బంధువులు ఇంటికి వెళ్లినప్పుడూ..గోడలపై కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు చూసి కలత చెందేవాడు. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుచేసుకుంటూ శివ..తన తాత తనను, తన తల్లిని తీసుకుని ఫోటోస్టూడియోకి తీసుకువెళ్లి..ఫోటో తీయించుకోకుండానే బాధగా ఎలా వెనుతిరిగి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్పటి తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం, పైగా స్టూడియో అతను తక్కువ డబ్బులకు తీయడం కుదరదనడంతో నాటి ఫోటో ముచ్చట నీరుగారిపోయిందని బాధగా చెప్పుకొచ్చాడు శివ. ఆ విధంగా ఫోటో తీసుకోలేకపోయిన వెలితి శివ మనసులో అలానే బలంగా ఉండిపోవడంతో..2017లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఫోటో స్టూడియో పెట్టుకుని..ఆల్బమ్‌లు డాక్యుమెంటేషన్ చేస్తున్నాడు. ఈ పనిని ఆయన తన తల్లి రగౌరమ్మతో కలిస చేస్తుండటం విశేషం. బాల్యంలో అమ్మతో కలిసి ఫోటో దిగలేకపోయిన లోటుని ఇలా భర్తీ చేసుకుంటున్నాడు శివ. ప్రస్తుతం బెంగళూరులో జాషువా ముయివా నిర్వహిస్తున్న నో లాంగర్ ఎ మెమరీ, పాతకాలపు స్టూడియో-షాట్ ఫోటో ఆల్బమ్‌ల నోస్టాల్జియా గ్యాలరీ సుముఖ ప్రదర్శనలో అతడి ఫోటో డాక్యుమెంట్లు సందడి చేస్తున్నాయి. ఆ ఫోటోల ఆల్బమ్లన్నింటిల్లోనూ తన తల్లితో కలసి రకరకాల వేషాల్లో కనిపిస్తాడు.ప్రతి ఒక్క ఫోటో అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుంది. సెల్ఫోన్లు, కెమెరాలు లేని ఫోటో స్టూడియా ముచ్చట్లు కదలాడేలా ఆ గ్యాలరీ ప్రదర్శన ఉంటుంది. ఆ ఆల్బమ్‌ని శివ ప్రాణం పెట్టి తీర్చిదిద్దాడు. 21 ఏళ్లకు పోలీసు ఉద్యోగం సంపాదించాడు శివ. సహజంగా ఆ వృత్తిపరంగా టెన్షన్‌తో కూడిన కాఠిన్యం ఎక్కడ శివ ముఖంలో మచ్చుకైన కానిరాని విధంగా ఆ ఫోటోల్లో కనిపిచడం విశేషం. ఇలా ఈ కళను ఎంచుకోవడానికి కారణాన్ని కూడా వివరించాడు శివ. "నాటక సంప్రదాయం అంతరించిపోతోంది. ప్రస్తుత వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఫోటో స్టూడియోలు గతంలో ఉన్నట్లుగా లేవు. అందువల్ల నేను నా జ్ఞాపకాలతో, నా ప్రజలతో, నా సంస్కృతితో పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఒకరకంగా నా జీవితంలోకి తిరిగి వచ్చిన ఫీల్‌ని అందిస్తోంది. ఇంకా ఇలాంటివి మరిన్ని డాక్యుమెంట్లు చేయాలి అదే తన ఆకాంక్ష అని నవ్వుతూ చెబుతున్నాడు". ఈ మాజీ పోలీస్ శివ.(చదవండి: 'బంగారంలాంటి ఇల్లు' అంటే ఇదే..! స్విచ్ బోర్డుల నుంచి...) -
కొడుకు స్నేహితుడితో పెళ్లి, త్వరలో బిడ్డ : వ్యాపారవేత్త లవ్ స్టోరీ వైరల్
50 ఏళ్ళ వయసులో ఒక చైనా మహిళ తన కొడుకు స్నేహితుడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఇపుడు ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథేంటో తెలుసుకుందాం పదండిఆగ్నేయ చైనాకు చెందిన ఈ-కామర్స్ వ్యవస్థాపకురాలు "సిస్టర్ జిన్". తన కొడుకు రష్యన్ క్లాస్‌మేట్‌ను పెళ్లాడింది. 30 ఏళ్ళ వయసులో మొదటి భర్తనుంచి విడాకులు తీసుకున్న ఆమె కొడుకు, కుమార్తెను స్వతంత్రంగా పెంచి పెద్ద చేసింది. సబర్బన్ విల్లా, చెఫ్, డ్రైవర్ ఇలా సకల హంగులతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆమె చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 13,000 మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.ఆరేళ్ల ప్రేమ తరువాత పిల్లల ఆమోదంతో కొడుకు కైకై రష్యన్ ఫ్రెండ్ డైఫును పెళ్లి చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా కొడుకు తన ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించినపుడు డైఫుతో పరిచయం ఏర్పడింది. సిస్టర్ జిన్ వంటలకు ఆతిథ్యానికి ఫిదా అయిన డైఫు తన సెలవులను పొడిగించుకున్నాడు. చైనాలో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత చైనీస్ భాషను కూడా మాట్లాడే డైఫు, జిన్‌తో టచ్‌లో ఉంటూ, అనేక గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకున్నాడు. అచ్చమైన ప్రేమికుల్లాగానే వీరిద్దరి మధ్య అనేక సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. 20 ఏళ్ల వయసు తేడా, ఎత్తులో తేడా, గతంలో విఫలమైన వివాహం తదితర కారణాల రీత్యా జిన్ తొలుత వ్యతిరేకించినా, ఆ తరువాత ఇవేవీ వీరి ప్రేమకు అడ్డంకి కాలేదు. కొడుకు ప్రోత్సాహంతో అతడి ప్రేమను స్వీకరించింది. ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అధికారికంగా తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. చైనా అంతటా విస్తృతంగా పర్యటించారు. (యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?)చివరికి జూన్8న తన ప్రెగ్రెన్నీని ప్రకటించింది. లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ప్రమాదమే కానీ, డైఫుతో జీవితం చాలా బావుంది అంటూ సిస్టర్ జిన్ సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన గర్భధారణను ప్రకటించింది ఆన్లైన్ వినియోగదారులు వీరి వివాహ చట్టబద్ధతను ప్రకశ్నించారు. అయితే కాలమే తమ ప్రేమను రుజువు చేస్తుందని సమాధానమిచ్చింది. పుట్టబోయే బిడ్డను స్వాగతించేందుకు ఉత్సాహంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
అల్యూమినియం పాత్ర.. ‘అతి’ వాడకంతో ముప్పు!
ఒకప్పుడు వంట చేయాలంటే మట్టి పాత్రలే వినియోగించేవాళ్లు. ఆ తర్వాత కాలక్రమేణా వంటింట్లోకి రాగి, ఇత్తడి, స్టీల్, అల్యూమినియం, నాన్‌స్టిక్ పాత్రలు చొచ్చుకొచ్చేశాయి. ప్రస్తుతం వీటిలో అత్యధిక మంది ఉపయోగించేవి అల్యూమినియం పాత్రలే. అన్నం, కూర, పిండివంటలు.. వంటకం ఏదైనా అల్యూమినియం గిన్నెలు ఉండాల్సిందే. ఈ పాత్రలు ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా.. వాటిని సుదీర్ఘ కాలం వాడటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వంట పాత్రలకూ ఎక్స్‌పెయిరీ ఉంటుందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) వెల్లడించింది. రెండేళ్లకు మించి వాడొద్దు..1938లో ఇండియన్ అల్యూమినియం కంపెనీ మన దేశంలో ఉత్పాదకత ప్రారంభించింది. అనంతరం అల్యూమినియం వంట పాత్రల తయారీ కుటీర పరిశ్రమగా మారింది. దేశంలో ఈ పాత్రలు లేని వంట గది ఉండదు. అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో ప్రజలు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని సుదీర్ఘకాలం ఉపయోగించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి తయారీ నాణ్యతను బట్టి 12 నుంచి 24 నెలలకు ఒకసారి పాత్రలను మారుస్తుండాలని బీఐఎస్ సూచించింది. తేలికైన వంట పాత్రలను ఏడాదికి మించి వాడకూడదని తెలిపింది. సూపర్ గ్రేడ్ వంట సామగ్రి సైతం అధిక ఉష్ణోగ్రతల్లో వేడికి గురై నెలల వ్యవధిలోనే పాడై పోతుంటాయని పేర్కొంది. ఈ క్రమంలో వీటిని రెండేళ్లకు మించి వినియోగించకపోవడం ఉత్తమమని సూచించింది.ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..ఈ పాత్రల్లో టమాటా, చింతపండు, నిమ్మకాయ వంటి పుల్లటి పదార్థాలతో వంటలు చేయడం వల్ల అల్యూమినియం కరిగి ఆహారంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారం శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఎముకలు, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని వివరించారు.త్వరలో కొత్త నిబంధనలు అమల్లోకి..అల్యూమినియం వంట పాత్రల తయారీ ప్రమాణాలను బీఐఎస్ సవరించింది. వంట పాత్రల తయారీలో సీసం, కాడ్మియం, పాదరసం, హెక్సావాలెంట్ క్రోమియం వంటివి 0.05 శాతం కంటే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి దేశంలోని చిన్న పరిశ్రమలు, అక్టోబర్ నుంచి సూక్ష్మ పరిశ్రమల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అలాగే వంట పాత్రలపై అల్యూమినియం గ్రేడ్‌ను లేబులింగ్ చేయడం తప్పనిసరి చేసింది.(చదవండి: డయాబెటిస్‌ని జయించిన జర్నలిస్ట్ స్టోరీ..! ఐసీయూలో ఉండాల్సిన స్టేజ్ నుంచి..) -
బెజోస్‌తో పెళ్లి, ఆ పోస్ట్లన్నీమాయం, పేరు మార్చేసిన లారెన్ సాంచెజ్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంతవిలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీలు విచ్చేశారు.. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వివాహ ఖర్చు, ముఖ్యంగా లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ దుస్తులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో విషయం ట్రెండింగ్‌లో నిలిచింది.జెఫ్ బెజోస్‌తో పెళ్లి తరువాత లారెన్ సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత, సాంచెజ్ తన పాత ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను "లారెన్ సాంచెజ్ బెజోస్" గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) జెఫ్ బెజోస్ ఏకంగారూ.548 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా, సాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా, భారత్‌కు ఫ్యాషన్ ఐకాన్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనా వాలా తదితరులు హాజరయ్యారు. -
ప్రాణాంతక 'డయాబెటిక్ కోమా స్టేజ్'..! కానీ ఆమె జస్ట్ రెండు నెలల్లో..
ప్రతి ఏడాది వేలాది మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని మందులతోనే నిర్వహించగలం తప్ప నివారిణి ఉండదు. అయితే కొందరూ ఈ సమస్యను చక్కటి జీవనశైలితో అధిగమించి స్ఫూర్తిగా నిలుస్తారు. ఇక్కడ కావల్సింది తాను ఈవ్యాధి నుంచి బయటపడి మెరుగైన ఆరోగ్యంతో ఉండాలనే 'గట్టి పట్టుదల'. అది ఉంటే డయాబెటిస్ ఎంతటి ప్రమాదకర స్టేజ్‌లో ఉన్న అవలీల అధిగమించగలరు అనేందుకు ఉదాహారణ ఈ 57 ఏళ్ల మాజీ జర్నలిస్ట్ ఉషా రాచెల్ థామస్. ఆమెకు శరీరంలో చక్కెర స్థాయిలు ఏ రేంజ్లో ఉన్నాయో..? ఆమె పరిస్థితి ఎంత క్రిటికల్‌గా ఉందో తెలిస్తే విస్తుపోతారు. మరీ అంతటి ప్రమాదకరస్థితిలో ఉన్న డయాబెటిస్‌ని జయించి ఎలా ఆరోగ్యవంతురాలిగా మారిందో సవివరంగా చూద్దామా..!.సీనియర్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అండ్ కమ్యూనికేషన్స్ లీడర్ ఉషా రాచెల్ థామస్ అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో ఉండేది. చెప్పాలంటే.. తన ఆరోగ్యంపై ధ్యాస పెట్టేది కాదు. తాను డయాబెటిస్ పేషెంట్‌నని తెలిసి కూడా లైట్ తీసుకుంది. ఉత్తిపుణ్యానికే అలసట, విపరీతమైన దాహం, భోజనం చేసిన వెంటనే అలిసిపోవటం వంటి శరీర సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఆమె శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోయాయి. ఒకరోజు అనుకోకుండా ముంబైలోని ఒక ప్రముఖ డాక్టర్ని సందర్శించింది. ఆయన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే గ్లూకోమీటర్ ఏకంగా 500 నుంచి 538 పైనే రీడింగ్ చూపిస్తోంది. అంటే..ఇది ఒక షుగర్ పేషెంట్‌కి ఉండాల్సిన దానికంటే ఐదు రెట్లు ప్రమాదకర స్థాయిలో ఉందని అర్థం. ఆ వైద్యుడు ఉషతో మీరు ఐసీయూలో ఉండాలని చెప్పారు. ఆ మాటలు విని ఉషకు గుండె ఆగినంత పని అయ్యింది. ఆయన ఉషను డయాబెటిక్ కోమా స్టేజ్‌లో ఉన్నట్లు తేల్చి చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే..ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అన్నారు. అందువల్ల ఉషా అనునిత్యం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండటం మంచిది అని సూచించారాయన. ఆ డాక్టర్ మాటలు చెంప చెళ్లుమనిపించినట్లయ్యింది ఉషకు. ఒక్కసారి తన అనారోగ్యకరమైన అవాట్లు అన్ని కళ్లముందు కదలాడాయి. చేజేతులారా తానే ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నానని కుమిలిపోయింది. మూడెళ్ల నుంచి తన శరీరం ఇస్తున్న సంకేతాలను తాను ఎలా నిర్లక్ష్యం చేసిందో గుర్తు తెచ్చుకుంది. కాళ్లలో వచ్చిన బెణుకులు, శరీరంలోని అసాధారణ మార్పులను గమనించడం ప్రారంభించింది. తన అధిక బరువుపై కూడా ఫోకస్ పెట్టింది.మార్పుని బలంగా స్వాగతించడం..వెంటనే అధిక బరువుని నియంత్రణలోకి తెచ్చుకుంటే గనుక తాను ఎదుర్కొనే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను అధిగమించొచ్చు అని భావించింది ఉష. ఆ దిశగా వర్కౌట్లు, తీసుకునే ఆహారంపై ధ్యాస పెట్టడమే గాక మంచి జీవనశైలిని అనుసరించింది. ఎలాగైన డయాబెటిస్‌ని తన శరీరం నుంచి తరిమి కొట్టాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. జస్ట్ 60 రోజుల్లో మాయం...క్రహశిక్షణాయుతమైన జీవనశైలి మార్పులతో కేవలం రెండు నెలల్లోనే తన రక్తంలో చక్కెరస్థాయిలను నార్మల్‌కి తీసుకొచ్చింది. అంతేగాదు పదినెలలు ఎలాంటి మందులు లేకుండా డయాబెటిస్‌ని సమర్థవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం అత్యంత తక్కువ మోతాదులో డయాబెటిక్ మందులు తీసుకుంటూ..నాన్ డయాబెటిక్‌గా ఉన్నారామె.వర్కింగ్ విమెన్స్ మేల్కోండి..ఇద్దరు పిల్లలు తల్లి అయిన ఉషా తన శరీరంతో చక్కటి సంబంధాన్ని ఏర్పరుచుకోకపోవడంతో ఇలాంటి ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తనలా ప్రతి వర్కింగ్ ఉమెన్ ఆలోచనా తీరు ఉంటుందన్నారు. ఒక ఏడాది క్రితం నాన్న చనిపోవడంతో అమ్మ ఒంటిరితనం పోగొట్టేలా ధైర్యం చెప్పడం. అలాగే పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో ఏర్పడి ఒంటరితనం అనే సిండ్రోమ్. దీనికి తోడు తాను పనిచేసే 24*7 మీడియాలో లేట్‌నైట్ డిన్నర్లు వంటి చెడు ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసిందని చెప్పుకొచ్చారామె. అలాగే మోనోపాజ్ దశలోకి వచ్చిన ప్రతి మహిళ సులభంగా అనారోగ్య సమస్యల బారినపడుతుందని గ్రహించకపోవడం వంటి తప్పిదాలే కారణాలని చెప్పుకొచ్చారు ఉషా. వర్కింగ్ విమెన్స్ ఎవ్వరూ తనలా అంతటి పరిస్థితి తెచ్చుకోవద్దని..ఉద్యోగ కెరీర్ తోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని సూచించారామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమ ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే..) -
900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు
లేటు వయసులో లేటెస్ట్గా అంటూ లవ్ బర్డ్స్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్,లారెన్ సాంచెజ్ (Lauren Sanchez and Jeff Bezos) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటలీలోని వెనిస్లో శనివారం రాత్రి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ , వినోద రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరైనారు. ఈ సందర్భంగా 55 ఏళ్ల వధువు వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.మాజీ టీవీ యాంకర్ , పైలట్ లారెన్ సాంచెజ్, డోల్స్ & గబ్బానా ఆల్టా మోడా రూపొందించిన గౌనులో మెరిసింది. ఈ పెళ్లి గౌను తయారీకి 900 గంటలు పట్టిందట. అలాగే చేతితో తయారు చేసిన ఇటాలియన్ లేస్,180 సిల్క్ చిఫ్ఫోన్-కవర్డ్ బటన్లుకూడా ఉన్నాయట. హౌస్‌బోట్ చిత్రంలో నటి సోఫియా లోరెన్ ధరించిన 1950ల నాటి లుక్ ప్రేరణగా దీని డిజైన్ రూపొందించారు. దీని ధర దాదాపు 12 కోట్లు అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. అన్నట్టు ఈ గౌను తయారీ వెనుక పెద్ద కథే ఉందట. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos)వోగ్ కథనం ప్రకారం ఏప్రిల్‌లో, సాంచెజ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్స్ స్పేస్ ఫ్లైట్ కంపెనీలో అంతరిక్ష అంచుకు వెళ్లింది. ఈ అనుభవం తనను అనేక విధాలుగా మార్చిందని, అదే తన జీవితంలో మధురమైన క్షణాల సమయంలో ఎలా కనిపించాలో నిర్ణయం తీసుకునేలా చేసిందని తెలిపింది. అంతకుముందు తాను స్ట్రాప్‌లెస్ డ్రెస్ ధరించాలని ఊహించుకున్నానని సాంచెజ్ చెప్పింది. కాలాతీతంగా, అర్థవంతంగా తన డ్రెస్ ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగే తన పెళ్లి రోజున తన గ్లామ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది, ఇది గౌను కాదు, కవితా భాగం, మీ మ్యాజిక్కు ధన్యవాదాలు అంటూ మేకర్స్‌కు ధన్యవాదాలు తెలిపింది.తానేంటో, తన స్టోరీ ఏంటో తెలియజేయాలనే కోరికతోపాటు, 11 నిమిషాలు తన అంతరిక్ష యాత్రకు ప్రత్యేక జ్ఞాపకంగా కొంచెం నీలిరంగులో,ముఖ్యంగా పెళ్లి కూతుళ్లు అదృష్టంగా భావించే వివాహ సంప్రదాయాన్ని జోడించేలా ఈ స్పెషల్ వెడ్డింగ్ గౌన్‌ను ఎంచుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఈ డ్రెస్‌ను ముందే చూడాలిన జెఫ్ బెజోస్ చాలా వేడుకున్నాడట. కానీ బిగ్ సర్ప్రైజ్గా ఉండాలని లారెన్ సాంచెజ్ దీనికి సున్నితంగా తిరస్కరించిందిట. కాగా 2019నుంచి డేటింగ్లో ఉన్న లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్, గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 27న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vogue (@voguemagazine) -
ఆద్యంతం.. ఆసక్తికరం ఈ ఆరు రోజుల టూర్..!
మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం. ప్రాచీన కోటల సందర్శనం. సాంచి బౌద్ధ స్థూపం వీక్షణం. ఇండోర్ లాల్బాగ్ ప్యాలెస్. ఉజ్జయిని మహాకాలేశ్వరుడు. భోపాల్ ఆదివాసీ ఆద్యకళల నిలయం. నర్మద తీరాన అహిల్యాబాయి కోట. ఇంకా... ఇంకా ఈ టూర్లో.1వ రోజుసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (12707) సాయంత్రం నాలుగన్నరకు కాచిగూడ స్టేషన్లో బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.2వ రోజురైలు ఉదయం 08:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రోడ్డు మార్గాన సాంచి స్థూపానికి ప్రయాణం. ఆ తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి భోపాల్‌కు రావాలి. భోపాల్‌లోని ట్రైబల్ మ్యూజియం వీక్షణం. రాత్రికి హోటల్లో బస.అశోకుడి పెళ్లి మండపం!సాంచి స్థూపం బౌద్ధ క్షేత్రాల్లో ప్రధానమైనది. మన ప్రాచీన నిర్మాణ శాస్త్ర విజ్ఞానానికి ప్రతీక. యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి 45 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటి నిర్మాణం. ఈ చారిత్రక నిర్మాణం మౌర్య, బౌద్ధ వాస్తుశైలిల సమ్మేళనం. బుద్ధుని అవశిష్టాన్ని ప్రతిష్ఠించి నిర్మించారు. స్థూపానికి దక్షిణ ముఖ ద్వారానికి దగ్గరగా సాంచి ఆర్కియలాజికల్ మ్యూజియం ఉంది. ఇందులో నాలుగు సింహాల అశోకుని రాజముద్ర, ధర్మచక్రం ఉన్నాయి. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత చేసిన గొప్ప నిర్మాణాల్లో ఇది ముఖ్యమైనది. ఇది అశోకుని భార్య దేవి పుట్టిన ప్రదేశం, వారి వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడికి పది కిలోమీటర్ల దూరానున్న విదిశ.. రెండు వందల రూపాయల కరెన్సీ నోట్‌ను వెనక్కి తిప్పి చూడండి. సాంచిలోని బౌద్ధస్థూపం కనిపిస్తుంది.భోపాల్ మ్యూజియం – ఆదివాసీల ఆద్యకళ (ఆద్యకళా నిలయం)మధ్యప్రదేశ్‌లో నివసించే ఆదివాసీలు, వారి జీవనశైలికి ఒక మీనియేచర్ రూపమే ఈ ట్రైబల్ మ్యూజియం. ఇందులో స్థానికంగా నివసించే గోంద్, భిల్, భారియా, సహారియా, కోర్కు, కోల్, భైగా ఆదివాసీ జాతుల రోజువారీ వస్తువులు, కళాకృతులు ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు తయారు చేసే ఢోక్రా శైలి ఇత్తడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆదివాసీలు ధాన్యం నిల్వచేసుకోవడానికి అడవిలోని చెట్ల తీగలతో అల్లిన పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి.భోజ్‌పూర్ ఈశ్వరుడుభోజేశ్వర మందిరం... ఉన్న ప్రదేశం పేరు భోజ్‌పుర్. ఇది చిన్న గ్రామం. పారమార రాజు భోజుడు నిర్మించిన ఆలయం ఇది. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం పూర్తయినట్లు కనిపించదు. అర్ధంతరంగా ఆగి΄ోయిందా లేక నిర్మాణం విధ్వంసానికి గురైందా అనే సందేహం వస్తుంది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా శిల్పాల విడిభాగాలు కనిపిస్తాయి. ఆ విడిభాగాలు క్షతగాత్రాలు కాదు. ఒక పెద్ద శిల్పం ఆకారం ఉంటుంది, కానీ మెరుగులు లేక అసంపూర్తిగా కనిపిస్తుంది. బహుశా ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టిన తర్వాత అనుకోని కారణాలతో నిర్మాణం ఆగి΄ోయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని నిశితంగా పరిశోధించి మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇం΄ార్టెన్స్గా గుర్తించింది. ఏటా ఇక్కడ శివరాత్రి వేడుక అంబరాన్ని తాకుతుంది.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ఉజ్జయినికి ప్రయాణం. ఉజ్జయినిలో హోటల్ చెక్ ఇన్. మహాకాలేశ్వర్ ఆలయం, హర్సిద్ధి ఆలయం, మంగళ్‌నాథ్ ఆలయం, నవ్గ్రహ శని మందిర్, శ్రీచింతామన్ గణేశ్ టెంపుల్, రామ్‌ఘాట్, శ్రీగద్కాలిక టెంపుల్ దర్శనం, రాత్రికి ఉజ్జయినిలోనే బస.క్షతగాత్ర ఉజ్జయినిప్రాచీనకాలం నుంచి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది. పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఉజ్జయిని ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగం కూడా. సతీదేవి దేహంలో పై పెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని అని చెబుతారు. మహాకాలేశ్వరుడి ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం లాగానే ఇది కూడా విధ్వంసాల బారిన పడిన ఆలయం. ఢిల్లీ పాలకుడు ఇల్టుట్మిష్ తన రాజ్యవిస్తరణలో భాగంగా ఉజ్జయిని మీద దండెత్తి విజయం సాధించిన సందర్భంగా ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని ధ్వంసం చేశాడు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసి సమీపంలోని కోటితీర్థ కుండ్‌లో విసిరివేశాడని చెబుతారు. మరాఠా రాజోద్యోగి రామచంద్ర బాబా సుఖ్తాంకర్ పునర్నిర్మాణం చేశాడు. కానీ అది కూడా జలాలుద్దీన్, అలాఉద్దీన్ ఖిల్జీల దాడికి గురైంది.ఈ శని క్షేత్రం త్రివేణీ సంగమంనవగ్రహ శని మందిర్ ఉజ్జయినికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ క్షిప్ర, గండకి, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని త్రివేణీ ఉజ్జయిని అంటారు. సాధారణంగా శివాలయం లేదా ఇతర ఆలయాల్లో నవగ్రహాల వేదిక ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల కోసమే ఓ ఆలయం ఉంది.సీతమ్మ కొలిచిన గణేశుడుఈ ఆలయం ఉజ్జయినికి ఏడు కిలోమీటర్ల దూరాన ఫతేహాబాద్లో ఉంది. స్వయంభువుగా వెలిసిన ఈ గణేశుడిని కొలిస్తే మనసులోని చింతలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రామాయణ కాలంలో సీతాదేవి ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించిందని, ఆ సమయంలో ఈ గణేశుడిని ప్రార్థించినదని చెబుతారు. ఇక్కడి క్షిప్రానది తీరాన రామ్‌ఘాట్ కూడా ఉంది. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, మహేశ్వర్‌కు ప్రయాణం. అహిల్యాదేవి కోట, నర్మద ఘాట్ దర్శనం తర్వాత ఓంకారేశ్వర్‌కు ప్రయాణం. ఓంకారేశ్వర్‌లో హోటల్ లో చెక్ ఇన్ అయిన తర్వాత నడకదూరంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవచ్చు. నదిలో పడవ ప్రయాణం చేయవచ్చు. రాత్రి బస ఓంకారేశ్వర్‌లో.రాతికి పూచిన పూలురాణి అహిల్యాబాయి కోట మహేశ్వర్ పట్టణంలో ఉంది. దాంతో మహేశ్వర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. ఇది మొత్తం గ్రానైట్ స్టోన్‌తో చేసిన మరాఠా శైలి నిర్మాణం. నర్మద నది తీరాన శత్రుదుర్భేద్యంగా నిర్మించడమే కాక అత్యంత సునిశితమైన నైపుణ్యంతో నగిషీలు చెక్కారు. కోటలోని ప్యాలెస్‌ల గోడలకు చెక్కిన పూలు అప్పుడే విచ్చుకున్నట్లున్న తాజా పూల తోరణాల్లా ఉంటాయి. రాతికి పూచిన ఈ పూలు నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని నేటి తరానికి తెలియచేస్తున్న ప్రతిబింబాలు. ఈ కోట స్త్రీసాధికారతకు ప్రతీక. రాణి అహిల్యాబాయ్ హోల్కర్ క్రీ.శ 1765 నుంచి 1796 వరకు మాల్వా రాజ్యాన్ని పాలించారు. ఈ కోటలో ఉన్న రాణి ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు. అందులో ఆమె ఆహార్యం, జీవనశైలితోపాటు పాలన రీతి కూడా కళ్లకు కడుతుంది. ఆమె వారసుడు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ ఈ కోటలోని అహిల్యాబాయి వాడాను హెరిటేజ్ హోటల్‌గా మార్చారు. మహేశ్వరలో నర్మదాతీరాన విహరిస్తూ అనేక ఆలయాలు, చారిత్రక నిర్మాణాలను దగ్గరగా వీక్షించవచ్చు. 5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ప్రయాణం ఇందోర్ వైపు సాగుతుంది. ఇందోర్‌లో లాల్బాగ్ ప్యాలెస్, ఖజ్రన గణేశ్ మందిర్ దర్శనం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఇందోర్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ట్రైన్ నంబర్ 19301 అంబేద్కర్ నగర్– యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.లాల్బాగ్ గులాబీల తోటఇందోర్లోని లాల్బాగ్ ప్యాలెస్ కూడా హోల్కర్ రాజవంశ నిర్మాణమే. యాభై ఏళ్ల కిందటి వరకు ఆ రాజవంశమే ఇందులో నివసించింది. ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని మ్యూజియంగా మార్చింది. ఈ ప్యాలెస్‌లోకి వెళ్లే ముందు మెయిన్ గేట్ నిశితంగా పరిశీలించాలి. యూరోపియన్ శైలిలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను తలపిస్తుంది. ఇక భవనంలోపలి గదులు కూడా ప్రాచ్య ప్రాచాత్య కలబోతగా ఉంటాయి. 76 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్ ప్రాంగణమంతటినీ చూడడం కష్టమే. కానీ ఇరవై ఎకరాల రోజ్ గార్డెన్‌ను మిస్ కాకూడదు. అహిల్యాబాయి వాడాను ఆమె వారసుడు హోటల్‌గా మార్చాడని చెప్పుకున్నప్పుడు అతడి పేరు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ అని చెప్పుకున్నాం. అప్పుడు కలిగిన సందేహానికి సమాధానం ఈ ప్యాలెస్‌లో లభిస్తుంది. హోల్కర్ రాజవంశానికి చెందిన తుకోజీరావ్ హోల్కర్ మూడవ భార్య అమెరికన్. పేరు నాన్సీ అన్నే మిల్లర్. తుకోజీ మరణం తర్వాత ఆమె అమెరికాకి వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ్ దర్శన్ (ఎస్హెచ్ఆర్ 097). ఇది ఆరు రోజుల యాత్ర. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇందోర్ ప్రదేశాలను సందర్శించవచ్చు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ నుంచి ట్రైన్ నంబరు 12707, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ బుధవారం సాయంత్రం నాలుగన్నరకు బయలుదేరుతుంది. ఇది వీక్లీ టూర్. కంఫర్ట్ (థర్డ్ ఏసీ)లో సింగిల్ షేరింగ్‌కి 36 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 20వేలు దాటుతుంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపుగా 16 వేలవుతుంది. నలుగురు నుంచి ఆరుగురు వరకు బృందంగా ప్రయాణం చేస్తే మరికొంత తగ్గుతుంది.స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో సింగిల్ షేరింగ్ సుమారు 34 వేలు, ట్విన్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి సుమారు 18 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్‌లో ఒక్కొక్కరికి సుమారు 14 వేలవుతుంది.టూర్ కోడ్:https://www.irctctourism.com/pacakage_descriptionpackageCode=SHR097(చదవండి: పర్యాటకుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే టాప్ 10 ప్రదేశాలివే..!) -
పచ్చదనానికి 'మియావాకీ'..
నగరంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తమ ప్రాంగణాలను పచ్చగా మార్చేందుకు శ్రద్ధ చూపిస్తున్నాయి. ఈ క్రమంలో జపనీస్ టెక్నిక్ అయిన మియావాకీ అత్యుత్తమ అనుసరణీయ విధానంగా మారింది. గత ఐదేళ్లుగా ఈ విధానం ఊపందుకోవడంతో నగరం నలుదిశలా ఇప్పుడు పచ్చగా ప్రతిఫలిస్తున్నాయి. ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు వాతావరణంలో ఏర్పడుతున్న సమతుల్యత వెరసి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పచ్చదనం ఆవశ్యకతపై అవగాహన పెరుగుతోంది.. దీంతో విస్తారంగా మియావాకీ అడవుల పెరుగుదలకు దోహదపడుతోంది. తనను తాను పోషించుకునే, పెంపొందించుకునే సత్తా ఉన్న మియావాకీకి స్వల్పకాలం మాత్రమే పోషణ అవసరం. దీంతో పచ్చని ప్రదేశాలను విస్తరణ కోసం మియావాకీ అటవీకరణ విధానం ప్రస్తుతం విస్తృతంగా ఆదరణ పొందుతోంది. జపనీస్ వృక్ష శాస్త్రజ్ఞుడు అకిరా మియావాకీ అభివృద్ధి చేసిన డెన్స్ నేటివ్ మినీ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఈ విధానంలో భాగంగా ఒక చిన్న ప్రాంతంలో వివిధ రకాల స్థానిక చెట్ల జాతులను దగ్గరగా నాటడం జరుగుతోంది. ఫలితంగా దట్టమైన, వేగంగా పెరిగే అడవులు ఏర్పడనున్నాయి. దీనిని విజయవంతంగా అనుసరిస్తూ నగరంతో పాటు చుట్టుపక్కల అనేక మియావాకీ అడవులు పచ్చగా వరి్థల్లుతున్నాయి. జయహో గ్రీనరీ.. ప్రభుత్వ హరితహారం కార్యక్రమంతో పాటు, పెద్ద ఎత్తున అటవీకరణ ప్రాజెక్టుల కోసం అనేక ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు మియావాకీ పద్ధతిని అవలంభిస్తున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఉన్నటువంటి పలు కంపెనీలు మియావాకీ తోటల పెంపకంలో తాము కూడా పాల్గొంటున్నాయి. ప్రముఖ బయోఫిలిక్ డెవలపర్ ఎకో–రియాల్టీ ఫర్మ్‌గా పేర్కొంటున్న స్టార్టప్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్, ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అటవీప్రాంతాన్ని శంషాబాద్‌లో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని అదనంగా 100 ఎకరాల్లో విస్తరించనున్నారు. రాచకొండ పోలీసులు 40,000 మొక్కలతో మియావాకీ తోటను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు దట్టమైన అడవిగా పెరిగింది. కొత్తపేటలో 10 ఎకరాల మియావాకీ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నార్త్ లాలాగూడలోని శాంతినగర్ రైల్వే కాలనీలోనూ ఈ పద్ధతిలో మొక్కలు నాటారు.. దీనిలో సే ట్రీస్ ఎరాన్మెంటల్ ట్రస్ట్ అనే ఎన్జీఓ కూడా భాగం పంచుకుంది. హైదరాబాద్ యూనివర్సిటీలో 4వేల మొక్కలతో మినీ ఫారెస్ట్‌ను సృష్టించారు. రెండేళ్లలో స్వయం పోషకంగా.. వ్యక్తిగత ఆసక్తితో బెంగళూరులో దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 15 ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్నాను. మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఇవి స్వయం పోషకాలుగా మారతాయి. ఆ తర్వాత వాటి పరిరక్షణకు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ విధానానికి తగినట్టుగా మొక్కలు పెంచే స్థలంలో పలు రకాల మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక శాస్త్రీయ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాగే ఈ విధానంలో తొలి దశలో వ్యయప్రయాసలు కూడా ఎక్కువే ఉంటాయి. – మహేష్ తలారి, ఎన్జీఓ ఎవర్గ్రీన్ ఎగెయిన్, మియావాకీ నిపుణులు మియావాకీ విశేషాలు.. మియావాకీ పద్ధతి తక్కువ సమయంలో దట్టమైన అడవులను సృష్టించగలదు. ఈ విధానంలో చెట్లు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి అంతేకాక ఈ అడవి సంప్రదాయకంగా నాటిన అడవుల కంటే 30 రెట్లు దట్టంగా ఉంటాయి. ఈ చిన్న అడవులు వివిధ జాతుల పక్షులు, సీతాకోక చిలుకలు, ఇతర వన్యప్రాణులను ఆకర్షించడానికి జీవవైవిధ్యానికి దోహదం చేస్తాయి. ప్రధాన మియావాకీ సూత్రాలను అనుసరిస్తూ స్థానిక నేల వృక్షజాతులకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తున్నారు. -
అమ్మ కోసం కుమార్తె ఆవిష్కరణ..కట్‌చేస్తే ఆమె..
తల్లి కోసం ఆ కూతురు రూపొందించిన ఆవిష్కరణ తనకు ఇంతలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందని కలలో కూడా ఊహించిలేదు ఆ కూతురు. అమ్మపై ఉన్న ప్రేమ తనలోని మేథస్సుని మేల్కొలిపి ఆవిష్కరణకు నాంది పలికేలా చేసింది చివరికి అదే తనను జపాన్ దేశానికి వెళ్లేలా చేసి..వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ అమ్మాయే కృపాలి సునీల్. కేంద్రీయ విద్యాలయ విద్యార్థినిగా కృపాలి సాధించిన అద్భుత విజయం ఇది. పదోతరగతి చదువుతున్న ఆమె వెన్నునొప్పితో బాధపడుతున్న తన తల్లికి సాయం చేయాలని రూపొందించిన ఆవిష్కరణే ఇది. తల్లి వెన్నునొప్పి కారణంగా బరువైన వస్తువులు ఎత్తలేదు కాబట్టి వాటిని సులభంగా లిఫ్ట్ చేసేలా ఒక యంత్రాన్ని తయారు చేయాలని భావించింది. అనుకుందో లేదా వెంటనే బరువైనా వస్తువులను సులభంగా ఎత్తడంలో సహాయపడే పోర్టబుల్ ఎలివేటింగ్ పరికరాన్ని రూపొందించింది. ఆ ఆవిష్కరణ జపాన్ దేశాన్ని అమితంగా ఆవిష్కరించింది. అంతే ఈ నెల జూన్ 21 నుంచి 25 వరకు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించిన సాకురా సైన్స్ హై స్కూల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు కృపాలికి ఆహ్వానం వచ్చింది. ఆమె INSPIRE MANAK ఎగ్జిబిషన్లో పాల్గొని తన ఆవిష్కరణను ప్రదర్శించడంతోనే ..కృపాలికి ఈ అపురూపమైన అవకాశం లభించింది. అంతేగాదు జపాన్‌కు వెళ్లిన 54 మంది ప్రతినిధుల బృందంలో మన కృపాలి సునీల్ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక విద్యార్థినిగా నిలవడం విశేషం. ఇక ఆ గర్వించదగ్గ క్షణంలో ఆమె తండ్రి ఇండాస్ కంపెనీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ కృపాలి, వెల్లూరు ప్రభుత్వ హయ్యర్ స్కూల్ టీచర్ ధన్య నారాయణలు కూడా ఈ పాలుపంచుకున్నారు.(చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..) -
అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..
మన భారతీయులు అమెరికాలో పనిచేసేటప్పుడు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రానురాను అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోతుంటారు. అది కామన్. అయితే కొన్ని విషయాల్లో ఎవ్వరైనా రాజీపడలేం. ఇక్కడ అలానే ఓ భారతీయ మహిళ తన వ్యక్తిగత అలవాటు రీత్యా ఆఫీసులో ఊహించిన విధంగా ఇబ్బంది పడింది. అయితే పాపం ఆమె అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో తన అనుభవాన్ని పేర్కొనడంతో నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రుంజున్ అనే భారతీయ మహిళ తన ఆహారపు అవాట్ల రీత్యా ఆఫీస్ ఈవెంట్లో పాల్గొనలేకపోతుంది. మిగతా ఉద్యోగుల్లా ఆమె తన కార్యలయం ఇచ్చిన విందు కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అస్సలు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వుతుందని ఆమె భావించలేదు. నెట్టింట ‘ది వికెడ్ వెజిటేరియన్’ మహిళగా పేరుగాంచిన ఆమె ఆఫీస్‌లో ఊహించని విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. తన వర్క్‌ప్లేస్‌లో యజమాన్యం తన సిబ్బందినందరిని మరుసటి రోజుకి భోజనాలు తెచ్చుకోవద్దని బహిరంగ ప్రకటన ఇచ్చింది. దాంతో అంతా మరుసటి రోజు ఇచ్చే విందు కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. వారిలానే ఈమహిళ కూడా కుతుహలంగా ఉంది. అయితే అక్కడ ఉద్యోగులంతా తమ కంపెనీ ఇచ్చే విందులో పాల్గొని ఖుషి చేస్తుంటే.. ఈ భారతీయ మహిళా ఉద్యోగి మాత్రం అక్కడ నుచి నిశబ్దంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఎందుకుంటే ఆ విందులో అక్కడ రకరకాల ప్లేవర్ల శాండ్విచ్లు సుమారు 60 రకాలు పైనే ఉన్నాయి. వాటిలో అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ నాన్‌వెజ్ శాండ్‌విచ్‌లే గానీ ఒక్క వెజ్ శాండ్విచ్ కూడా లేకపోవడంతో కంగుతింటుంది ఆమె. అక్కడకి వెజ్ శాండ్విచ్ కావాలని సదరు ఫుడ్ కేటరింగ్‌కి చెప్పినా..తినాలనుకుంటే..వాటి మధ్యలో ఉండే మాంసాన్ని తీసేసి తినవచ్చేనే ఉచిత సలహ ఇవ్వడంతో మరింత షాక్ అవుతుంది. అస్సలు అలా ఎలా తినగలను చాలా బాధపడింది. తనలాంటి ప్యూర్ వెజిటేరియన్లకు అది మరింత ఇబ్బందని, తింటే వాంతులు వస్తాయని వాపోయింది. తనకోసం వెజ్ శాండ్విచ్ ప్రిపేరవ్వదని భావించి ఆ ఈవెంట్ నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. అయితే అక్కడున్న వారంతా గిల్టీగా ఫీల్ అయ్యి..సదరు భారతీయ మహిళ రింజూన్‌కు మరేదైనా తెప్పిస్తామని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు తాము కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేశామంటూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. పోస్టులు పెట్టారు.(చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
వెరైటీగా రస్క్ గులాబ్ జామ్, క్యాబేజీ ఖీర్ ట్రై చేద్దాం ఇలా..!
రస్క్ గులాబ్జామ్కావలసినవి: రస్క్ పౌడర్– ఒక కప్పుమైదాపిండి– ఒక టేబుల్ స్పూన్కొబ్బరి పాలు– తగినన్నిపంచదార– అర కప్పు (పాకానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి)ఏలకుల పొడి– కొద్దిగా, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాత్రలో రస్క్ పౌడర్, మైదాపిండి వేసుకుని ఒకసారి బాగా కలపాలి. తర్వాత దానిలో కొద్దికొద్దిగా కొబ్బరి పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో పంచదార పాకం పెట్టుకుని, అందులో ఏలకుల పొడి వేసుకుని, దోరగా వేగిన ఉండలను అందులో వేసుకోవాలి. రెండు గంటలు కదలకుండా ఉంచి, చల్లారాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ముంబై క్యాబేజీ ఖీర్కావలసినవి: క్యాబేజీ తురుము– ఒక కప్పుచిక్కటి పాలు– 4 కప్పులుపంచదార– అర కప్పు పైనేసేమియా పుల్లలు– 5 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి వీటిని వేసుకోవచ్చు, అయితే ముందుగా నేతిలో వేయించాలి)నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు పైనేఏలకుల పొడి – అర టీస్పూన్డ్రై ఫ్రూట్స్ తురుము– కొద్దిగా (గార్నిష్ కోసం)తయారీ: ముందుగా తురిమిన క్యాబేజీని కొద్దిగా నేతిలో వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈలోపు మరో స్టవ్ మీద, మందపాటి గిన్నెలో పాలు పోసి, సగం అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో వేయించిన క్యాబేజీ తురుము, పంచదార, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్యలో సేమియా పుల్లలు, నెయ్యి వేసి తిప్పుతూ సుమారు 7 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.మలేషియన్ కుయ్ కారా బెర్లౌక్కావలసినవి: చికెన్ కీమా– అర కప్పు (కారం, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు అన్నీ కొద్దికొద్దిగా కలిపి, 8 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి, అనంతరం నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి)మైదా పిండి– ఒక కప్పు, గుడ్లు– 4, పసుపు– ఒక టీ స్పూన్కొబ్బరి పాలు– పావు కప్పు, నీళ్లు– సరిపడాబేకింగ్ సోడా– ఒక టీ స్పూన్, ఉప్పు,నూనె– తగినంతమసాలా, ఉప్పు, కారం కలిపి ఉడికించిన లేదా వేయించిన రొయ్యలు, కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – గార్నిష్కితయారీ: ముందుగా మైదాపిండిలో పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మరో గిన్నెలో కొబ్బరి పాలు, కొద్దిగా ఉప్పు, గుడ్లు, 2 టీ స్పూన్ల నూనె వేసుకుని బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ మైదా మిశ్రమాన్ని క్రీమీగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గంట పక్కన పెట్టుకుని, పొంగనాల ట్రేకు అడుగున నెయ్యి లేదా నూనె రాసి, మైదా మిశ్రమంతో గుంతలన్నీ సగం వరకూ నింపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా కీమా మిశ్రమాన్ని అందులో వేసుకుని, పైన మళ్లీ మైదా మిశ్రమంతో ఫిల్ చేసుకుని, బేక్ చేసుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని, ఒక్కో మైదా–కీమా బైట్ మీద ఒక్కో రొయ్యను, కొన్ని కూరగాయ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. (చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్‌లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..! నటి దీపికా పదుకొణె) -
Beauty Tips: చేయంత యంత్రం..ముఖమంతా మెరుపు..!
అందమైన, కాంతిమంతమైన చర్మం కోసం ఇప్పుడు బ్యూటీ సెలూన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ బ్రూనో ఈఎమ్ఎస్ ఫేషియల్ లిఫ్ట్ పరికరం, ఇంట్లోనే సౌకర్యవంతంగా, పూర్తి స్థాయి చర్మ సంరక్షణను అందిస్తుంది. అందం కోసం ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్ పద్ధతికి ఆధునిక హంగులు దిద్ది, ఈ పరికరం వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.ఈ డివైస్ నాలుగు ప్రత్యేకమైన ఆప్షన్స్‌ని కలిగి ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్ ఆప్షన్ ముఖ కండరాలను ఉత్తేజపరచి, చర్మాన్ని బిగుతుగా చేసి, ముడతలను తగ్గిస్తుంది. అలాగే దీనిలోని హాట్ అండ్ కోల్డ్ ఫంక్షన్ చల్లని రోజుల్లో చర్మాన్ని వెచ్చగా ఉంచడానికి, వేడి రోజుల్లో చర్మాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బూస్టర్ ఫంక్షన్ సౌందర్య ఉత్పత్తులు చర్మంలోకి లోతుగా ఇంకేలా చేసి, వాటి ప్రభావాన్ని పెంచుతుంది. మరోవైపు దీనిలోని అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ చర్మాన్ని మరింత బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఇది వాటర్‌ప్రూఫ్ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. కేవలం ముఖానికే కాకుండా, మెడ, చేతులు, కాళ్ళపై కూడా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు. సుమారు 183 గ్రాముల బరువుతో, స్టాండ్, స్టోరేజ్ బ్యాగ్‌తో లభిస్తుంది. ఇది ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని ‘త్రీ మినిట్స్ ఆటో పవర్–ఆఫ్’ ఫీచర్ వల్ల సురక్షితంగా దీనిని వాడుకోవచ్చు.సెల్యులైట్‌కు శాశ్వత పరిష్కారం!ఎందరో మహిళలను వేధించే సాధారణ సమస్య సెల్యులైట్. తొడలు, పిరుదులపై చర్మం గుంతలు పడినట్లు, నారింజ తొక్కలా వడిలిపోయినట్లుగా కనిపించడమే సెల్యులైట్ లక్షణాలు. సెల్యులైట్‌కు అసలు కారణం చర్మంలోని కొవ్వు కణజాలం కింద ఉండే ఫైబ్రస్ బ్యాండ్లు. ఇవి చర్మాన్ని లోపలికి లాగడం వల్ల గుంతలు ఏర్పడతాయి. ఆహారపు అలవాట్లతో, వ్యాయామాలతో తగ్గని ఈ సమస్యకు ఆధునిక పరిష్కారం సెల్ఫినా చికిత్స. నిపుణులు సన్నటి సూదిలాంటి పరికరాన్ని ఉపయోగించి ఫైబ్రస్ బ్యాండ్లను కత్తిరించి, వాటి ఒత్తిడిని తొలగిస్తారు. బ్యాండ్లు విడుదలైన వెంటనే, చర్మం మళ్లీ నునుపుగా మారుతుంది. కొన్నిసార్లు స్వల్పంగా నొప్పి, వాపు, గాయాలు ఉండవచ్చు, కాని, అవన్నీ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. (చదవండి: వాల్నట్స్ షెల్స్‌తో వైట్ హెయిర్‌కి చెక్‌పెడదాం ఇలా..!) -
ట్రెండ్ సెట్టర్ నిధి అగర్వాల్ స్టైలింగ్ టిప్స్ ..!
ఫ్యాషన్ ట్రెండ్స్‌కి ట్రెండ్‌సెట్టర్ తను. ప్రతి లుక్‌లోనూ ఒక డిఫరెంట్ శైలి చూపిస్తూ, మెరుపులా మెరిసే లుక్‌తో మాయ చేస్తుంది నటి నిధి అగర్వాల్. కాని, తన స్రీకెట్ ‘చాలా సింపుల్’. ఆమె స్టయిలింగ్ టిప్స్,తను ఫాలో అయ్యే ఫ్యాషన్ విశేషాలు మీకోసం.హెవీ మేకప్ నాకు అసలు నచ్చదు. నేచురల్ లుక్‌నే ఎక్కువగా ఇష్టపడతాను. ఎప్పుడూ ముఖం క్లీన్ గా, చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకుంటాను ఇదే నా సీక్రెట్. ఇక, డ్రెస్ విషయానికి వస్తే, బ్లాక్ నా ఫేవరెట్. ఏ ఫంక్షన్‌కైనా బ్లాక్ డ్రెస్‌నే ఫ్రిఫర్ చేస్తా అని చెబుతున్నారు నిధి అగర్వాల్రింగ రింగారే..‘రోజూ లేట్ అవుతుందని ఆఫీస్‌కు పరుగులు తీస్తూ, చక్కగా రెడీ కాలేకపోతున్నాం?’ అని బాధపడే ఫ్యాషన్ ప్రియులను కాపాడటానికి వచ్చిన అందమైన సాధనాలే ఈ ‘చెవి రింగులు’. ఇవి చిన్నవే కావచ్చు, కానీ వీటి ప్రభావం మాత్రం పెద్దగా ఉంటుంది. పెద్దవిగా ఉండే హూప్లతోపాటు, చిన్న గోల్డ్, వెండి రింగులు లేదా సన్నని ముత్యాలతో ఉండే స్టడ్స్ ఇవన్నీ ఆఫీస్ ఔట్‌ఫిట్‌కి బాగా మ్యాచ్ అవుతాయి. అయితే, ఇవి వేసుకునే ముందు మీ జుట్టు స్టయిల్ కూడా రింగుల రకానికి తగ్గట్లుండాలి. హెయిర్ బన్ అయితే గోల్డ్ హూప్ రింగులు అదిరిపోతాయి. జుట్టు అల్లుకుంటే చిన్న స్టడ్స్ సాఫ్ట్ లుక్ ఇస్తాయి. చీర, కుర్తీకి లైట్ వెండి చెవి రింగులు చాలా అందంగా కనిపిస్తాయి. ఇక ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు చిన్న గోల్డ్ రింగ్స్ సరిపోతాయి. డైలీ వేర్కి చక్కగా ఉపయోగపడే వీటి ఖరీదు తక్కువ, స్టయిల్‌కి మాత్రం హై క్లాస్. రోజూ కొత్తదనంతో కనిపించాలనుకునే వారికి ఇవి గొప్ప ఫ్యాషన్ ఫ్రెండ్స్ అవుతాయి! డ్రెస్ బ్రాండ్: జారాధర: రూ. 12,950జ్యూలరీ బ్రాండ్: కార్టియర్వాచ్ ధర:రూ. 21,70,000 -
ఉజ్జయినీ అమ్మవారి ఘటం..!
లష్కర్ బోనాల పండుగ అనగానే కొత్త కుండలో ప్రత్యేకంగా వండిన ప్రసాద నైవేద్యం.. డప్పుల దరువులు.. పోతురాజుల వీరంగాలు.. ఫలహారపు బండ్ల ఊరేగింపులు.. రంగం ద్వారా భవిష్యవాణి వినిపించడం.. ఎక్కువగా ఇవే గుర్తుకొస్తాయి. కానీ.. జాతరలో ప్రతి ఇంటికీ వెళ్లి భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఘటం అత్యంత కీలకమైనది. ఈ నెల 29న ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలుతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 29 నుంచి జులై 12 వరకూ అమ్మవారి ఘటం భక్తులకు దర్శనం కోసం సికింద్రాబాద్ పురవీధుల్లో ఉరేగిస్తారు. అమ్మవారి ఘటాన్ని పొడవైన వెదురు బద్దలతో నిలువెత్తు ఆకారంతో.. పూలతో అందంగా తీర్చిదిద్దుతారు. నడుమ అమ్మవారి విగ్రహాన్ని అమర్చి ఆకర్షణీయంగా రూపొందించేదే ఘటం. ఒంటినిండా పసుపు పూసుకున్న వ్యక్తులు ఘటాన్ని అధిరోహించి.. తలపై ఉన్న ఘటం కిందపడకుండా డప్పుల వాద్యాలకు, దరువులకు అనుగుణంగా విన్యాసాలతో నాట్యమాడతారు. సాధారణంగా కనికట్టు విద్యలు చేసే వారు ఇటువంటి వాటిని ప్రదర్శించినా.. సుమారు 60 కిలోల బరువుతో కూడిన ఘటాన్ని కేవలం పసుపు ముద్ద.. తలచుట్టకు మధ్యన పెట్టి పడకుండా చూడాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌లో 15కు పైగా ఆలయాలకు సంబంధించిన అమ్మవారి ఘటాలు ఈ రకంగా 13 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాయి.సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాల వేడుకలు జులై 13 ఆదివారం బోనాలు, 14న రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందు కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. లష్కర్ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ఎదుర్కోలు నుంచి జాతర ముగిసే వరకూ..ఆషాఢమాసం తొలి ఆదివారం ఈ నెల 29వ తేదీ ఆదివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉత్సవాల్లో పాల్గొంటుంది. అదే విధంగా సోమసుందరం వీధిలోని శ్రీ దేవి పోచమ్మ, కళాసిగూడలోని మాతా ముత్యాలమ్మ, శివాజినగర్‌లోని డొక్కలమ్మ, రెజిమెంటల్ బజార్‌లోని గండిమైసమ్మ, ఓరుగంటి ఎల్లమ్మ, సెకెండ్ బజార్‌లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, కుమ్మరిగూడలోని నల్లపోచమ్మ, ఆర్పీ రోడ్డులోని మావురాల పెద్దమ్మ వంటి అమ్మవారి ఘటాలు కూడా ఎదుర్కోలు ఉత్సవాల్లో వేర్వేరుగా పాల్గొంటాయి. ప్రధానంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటం బోట్స్‌క్లబ్ సమీపంలోని బుద్ధభవన్ ఎదురు వీధిలో ఉన్న మహంకాళమ్మ దేవాలయంలో రూపుదిద్దుకుంటుంది. ఆ తరువాత జులై 12 శనివారం రాత్రి వరకూ ఆయా బస్తీలు.. కాలనీల్లో ఊరేగుతూ భక్త జనుల పూజలు అందుకుంటాయి. 13 ఆదివారం బోనాల పండుగ రోజున ఉజ్జయిని మహాకాళి మినహా ఇతర ఘటాలు ఆనకట్ట ఉత్సవాల్లో పాల్గొంటాయి. 14వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం ముగిసిన తరువాత అమ్మవారి ఘటం వీడ్కోల ఉత్సవంలో పాల్గొంటుంది. దీంతో జాతర ముగుస్తుంది.ఘటం మొదలైంది ఇలా.. తొలినాళ్లలో ఘటం అనేది ఉండేది కాదు. ప్రధానంగా 1813లో సురిటి అప్పయ్య అనే మిలటరీ ఉద్యోగి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతంలో విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో నగరంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కలారా వ్యాధి తగ్గితే.. సికింద్రాబాద్‌లో ఆలయాన్ని కడతానని మొక్కుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లో ఆషాఢంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆషాఢమాసంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేందుకు అమ్మవారి ఘటాన్ని మొదలుపెట్టారు.ఘటం అధిరోహకుల వేషధారణ.. ఘటం అధిరోహకులు కూడా ఘటం మాధిరిగా ప్రత్యేకంగా తయారవుతారు. ముఖ్యంగా పసుపులో తడిపిన పంచె ధరించి.. ఒంటి నిండా పసుపు పులుముకుని కళ్లకు కాటు.. కాళ్లకు గజ్జెలు ధరించి అమ్మవారి ఘటాన్ని అధిరోహిస్తుంటారు. వేపాకులతో కూడిన చన్నీళ్ల సాకతో ఘటం అధిరోహకుల కాళ్లను భక్తులు కడిగి మొక్కుతారు. (చదవండి: Telangana Bonalu : తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..) -
భార్య..భర్త..ఓ మిడ్ వైఫ్..!
నగరంలో ఇటీవల సహజ (నేచురల్) డెలివరీకి ప్రాధాన్యతతో పాటు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ‘మిడ్ వైఫ్’ పేరిట ఓ ప్రాచీనమైన విధానమే తనదైన ఆధునిక రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. గర్భిణులకు మరింత సురక్షితమైన, మందుల రహితమైన, హాస్పిటల్ ఆధారిత, సిజేరియన్ డెలివరీలకు ప్రత్యామ్నాయంగా ఈ మిడ్ వైఫ్ సేవలు నగరంలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు అంటే మన అమ్మమ్మల కాలంలో మంత్రసాని పేరిట కాన్పులు చేసే మహిళలు ఉండేవారు. ఏ శిక్షణా లేకపోయినా వంశపారంపర్య వృత్తిగా వీరు అత్యంత చాకచక్యంగా ఇంటికి వచ్చి మరీ తమ సేవలు అందించేవారు. ఇప్పుడు దాదాపు అదే కాన్సెప్‌్టతో మిడ్ వైఫ్ గా తిరిగి ఆధునికులకు చేరువైంది. మిడ్ వైఫ్ అంటే ప్రత్యేక శిక్షణ పొందిన ప్రసూతి నిపుణురాలు అని పేర్కొనవచ్చు. వీరు గర్భిణులు, మహిళలకు గర్భధారణ నిర్ధారితమైన దగ్గర నుంచి సహజ ప్రసవం వరకూ వెన్నంటి ఉంటారు. అంతేకాదు వీరు ప్రసవానంతర కాలంలో సహాయం చేస్తారు. నేచురల్ బర్త్‌కు వీరు అత్యంత ప్రోత్సాహం ఇస్తారు. ప్రసవ సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణ, భావోద్వేగ సహాయం అవసరమైన మద్దతునూ అందిస్తారు. ప్రత్యేక ఆస్పత్రులు సైతం.. నగరంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు మిడ్ వైఫ్ సేవలు అందించే ప్రత్యేక ప్రసవ కేంద్రాలు సైతం ఏర్పాటవ్వడం విశేషం. గచి్చ»ౌలి, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి సంపన్న నివాస ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా నెలకొన్నాయి. కొన్ని ప్రసూతి కేంద్రాలు, డౌలా క్లినిక్స్, బర్తింగ్ సెంటర్లు ఇప్పుడు మిడ్ వైఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో బర్త్ విలేజ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్, హెల్తీ మదర్ బర్త్ సెంటర్, ది సాంక్టమ్ నేచురల్ బర్త్ సెంటర్. వంటివి కొన్ని కేంద్రాల్లో మిడ్ వైఫ్ లు గర్భిణులకు సరైన ఆహార మార్గదర్శనం, ప్రీ–నాటల్ కౌన్సిలింగ్, ప్రసవ వ్యాయామాలు, మెడిటేషన్ తరగతులు, ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. మిడ్ వైఫ్ విధానానికి కారణాలివే.. డాక్టర్ ఆధారిత హాస్పిటల్ ప్రసవాల్లో అధిక జోక్యం, అధిక మందుల వాడకం పట్ల విముఖత కలిగిన వారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సిజేరియన్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నవారు, సహజమైన, వ్యాధుల రహిత ప్రసవాన్ని ప్రసవానంతర సేవలు కోరుకునే వారు వీరిని ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ.. నగరానికి చెందిన ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2011లో దేశంలో మొట్టమొదటి మిడ్ వైఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మిడ్ వైఫ్ విధానాన్ని ప్రభుత్వాస్పత్రుల వరకూ విస్తరించే దిశగా పరిశీలన చేస్తోంది. ఇటీవల నేషనల్ మిడ్ వైఫ్ కోర్సులు సైతం ప్రారంభమయ్యాయి. దీని వల్ల కొత్తగా ట్రైనింగ్ పొందిన మిడ్ వైఫ్స్ ఈ రంగంలోకి వస్తున్నారు. ఏదేమైనా నేచురల్ డెలివరీల పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి వల్ల మిడ్ వైఫ్ విధానం నగరవాసులకు ఒక ఆరోగ్యకరమైన, భావోద్వేగపూరితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. సేవల ధరలు ఇలా.. ఈ మిడ్ వైఫ్ సేవలు అందుకోవాలనుకునే వారి కోసం ప్రాథమిక ప్యాకేజీ రూ.40,000 నుంచి రూ.70,000 వరకూ ఉన్నాయి. ఇందులో గర్భధారణ సమయంలో రెగ్యులర్ కన్సల్టేషన్, 8–10 విజిట్లు, ప్రీ నాటల్ కౌన్సిలింగ్, బర్త్ ప్లాన్ తయారీ, ప్రసవ సమయంలో మిడ్ వైఫ్ సపోర్ట్ (ఇన్–సెంటర్), పోస్ట్‌నాటల్ ఫాలో–అప్ (1 లేదా 2 విజిట్లు) వంటివి ఉంటాయి. అలాగే అడ్వాన్స్డ్ బర్తింగ్ సెంటర్ ప్యాకేజీ : రూ.80,000 నుంచి రూ.1,50,000 వరకూ ఛార్జ్ చేస్తారు. దీనిలో ఉమెన్ ఎడ్యుకేషన్ సెషన్స్ లామాజ్ / బెర్తింగ్ క్లాసెస్ వాటర్ బర్త్ ఎంప్షన్, ఇంటిగ్రేటెడ్ డౌలా (పోషక సహాయం) సపోర్ట్, బర్తింగ్ టబ్, సౌండ్ థెరపీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటాయి. అదే విధంగా హోం బర్త్ ప్యాకేజీ ఎంచుకుంటే రూ.1,20,000 – రూ.2,00,000 వరకూ ఖర్చు అవుతుంది. దీనిలో భాగంగా మిడ్ వైఫ్ + అసిస్టెంట్ బృందం ఇంటికి వస్తారు. మానిటరింగ్ ఎక్విప్మెంట్ అమరుస్తారు. అత్యవసర జాగ్రత్తల కోసం హాస్పిటల్ సపోర్ట్.. వంటివి ఉంటాయి. కొందరు మిడ్ వైఫ్స్ వ్యక్తిగతంగానూ సేవలు అందిస్తూ తమ ప్రతి విజిట్కూ రూ.2,000 నుంచి రూ.4,000 మధ్య ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్య బీమా సంస్థలు మిడ్ వైఫ్ సేవలను కవరేజ్ ఇవ్వడంలేదు. దీంతో కొన్ని బర్తింగ్ సెంటర్లు తమదైన పాలసీలను కూడా అందిస్తున్నాయి. ( చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..) -
ఆ ఊళ్లో నెమళ్ల బెడద..
నెమళ్లు చూడముచ్చటైన పక్షులు. ఆకాశంలో మబ్బులు ముసురుకున్నప్పుడు నెమళ్లు పురివిప్పి చేసే నాట్యం కనువిందైన దృశ్యం. సాధారణంగా పెద్దపెద్ద ఉద్యాన వనాలలోను, అడవుల్లోను కనిపించే నెమళ్లు ఊళ్లలోకి వచ్చేస్తేనో! ఆ బెడద మామూలుగా ఉండదంటున్నారు ఇంగ్లండ్‌లోని గల్వాల్ గ్రామస్థులు. ఇంగ్లండ్ నైరుతి ప్రాంతంలోని కార్న్‌వాల్ కౌంటీలో ఉన్న గల్వాల్ గ్రామానికి ఇటీవల కొంతకాలంగా నెమళ్లు పెద్ద బెడదగానే మారాయి. ‘ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయో ఈ నెమళ్లు– పెద్దసంఖ్యలో ఊళ్లోకి చేరుకున్నాయి. ఇవి యథేచ్ఛగా ఇళ్లలోకి చేరి, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఇళ్లన్నీ కంపు చేసేస్తున్నాయి. రోడ్ల మీద తాపీగా నడకలు సాగిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి’ అని గల్వాల్ గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. ‘నెమళ్లు చూడటానికి అందంగానే ఉంటాయి గాని, అవి ఎక్కడ పడితే అక్కడ వేసే రెట్టలను భరించడం మాత్రం చాలా కష్టం’ అని గల్వాల్ గ్రామస్థుడు డిలాన్ జాస్పర్ వాపోయారు. (చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..) -
హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుందంటే..
చాలామంది హార్ట్ ఫెయిల్యూర్‌నూ, హార్ట్ ఎటాక్నూ ఒకటే అనుకుంటారు. కానీ ఈ రెండూ వేర్వేరు. హార్ట్ అటాక్ అంటే తన ధమనుల ద్వారా గుండెకు రక్తం అందక గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదొక తక్షణ మెడికల్ ఎమర్జెన్సీ. తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ అడ్డంకిని స్టెంట్ వేయడం లేదా బైపాస్ వంటి సర్జరీ ద్వారా గుండె కండరానికి రక్త సరఫరాను పునరుద్ధరిస్తే ముప్పు తప్పుతుంది. అయితే హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె తన కార్యకలాపాలు సమర్థంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడం. ఇదొక దీర్ఘకాలిక సమస్య. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, దానికి కారణమయ్యే అంశాలు, హార్ట్ ఫెయిల్యూర్లో కనిపించే లక్షణాల వంటి అనేక సమస్యలను తెలిపే కథనమిది. హార్ట్ ఫెయిల్యూర్లో కండిషన్లో గుండె కండరం చాలా బలహీనంగా కావడంగానీ లేదా అదే కండరం చాలా బిగుతుగా (స్టిఫ్‌గా) మారిపోవడం గాని జరగవచ్చు. ఈ రెండింటిలో ఏది జరిగినప్పటికీ గుండె తన స్పందనలను కొనసాగించలేకపోవడం, దాంతో ఎప్పటిలాగా అన్ని అవయవాలకూ రక్తాన్ని సమర్థంగా పంప్ చేయలేకపోవడం జరగవచ్చు. పంపింగ్ పూర్తిగా జరగని ఫలితంగా రక్తం ఊపిరితిత్తులూ లేదా ఇతరత్రా అవయవాల్లోనే వెనకే ఉండిపోవచ్చు. దాంతో గుండె ఫెయిల్యూర్ బాధితుల్లో అనేక లక్షణాలు కనిపిస్తాయి.హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో కనిపించే లక్షణాలు ...ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం (ఉదాహరణకు నడుస్తున్నా లేదా మెట్లు ఎక్కుతున్నా విపరీతంగా ఆయాసం రావడం) తీవ్రమైన అలసట / విపరీతమైన నిస్సత్తువ కాళ్లలో, చీలమండ (యాంకిల్స్), పాదాల్లో వాపురావడం బాధితులు అదేపనిగా దగ్గుతూ ఉండటం లేదా ఊపిరి తీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు రావడందేహంలోని ద్రవాలు బయటకు పోలేకపోవడంతో బరువు పెరగడం దేనిపైనా దృష్టినిలపలేకపోవడం / ఏకాగ్రత కొరవడటం / చురుగ్గా ఉండలేకపోవడం గుండె స్పందనల్లో / గుండె లయలో మార్పులు రావడం. మన దేహంలోని ప్రతి కణానికి అనుక్షణం పోషకాలు అలాగే ఆక్సిజన్ సప్లై తప్పనిసరిగా అందుతూ ఉండాలి. రక్తం ద్వారా గుండె అలా పోషకాలనూ, ఆక్సిజన్‌నూ అందించలేకపోతే ఆ ప్రతికూల ప్రభావాన్ని ప్రతి కణమూ అనుభవిస్తుంది. సునాయాసంగా పూర్తయే పని కూడా చాలా కష్టమ్మీద చేయాల్సి వస్తుంది. కొందరిలో గుండె ఫెయిల్యూర్ దుష్ప్రభావాలు తక్షణం కనిపించవచ్చు. మరికొందరిలో క్రమక్రమంగా జరుగుతుండవచ్చు. లక్షణాలు కనిపించడానికి వారాలూ, నెలలూ పట్టవచ్చు.హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణాలు ఈ సమస్యకు చాలా కారణాలు ఉండవచ్చు. అనేక కారణాల వల్ల గుండె కండరం బలహీనం (వీక్‌గా) కావడం లేదా స్టిఫ్‌గా మారడం జరగవచ్చు. వాటిలో కొన్ని...కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ – అంటే గుండెకు రక్తాన్ని అందించే ధమనుల్లో కొన్ని మూసుకు΄ోవడం లేదా సన్నబారడం) అధిక రక్తపోటు (హై–బీపీ) ∙మధుమేహం (డయాబెటిస్) గుండె కవాటాల్లో సమస్యలు గతంలో గుండెపోటు రావడం విపరీతమైన మద్యం అలవాటు (క్రానిక్ ఆల్కహాలిజమ్)ఏవైనా ఇన్ఫెక్షన్లకు లోనుకావడం పోషకాలూ / విటమిన్ల లోపం పైన పేర్కొన్న లోపాల్లో ఏ కారణం చేతనైనా ఏదైనా లోపం ఏర్పడినప్పుడు గుండె చాలా వేగంగా స్పందిస్తూ ఆ లోపాన్ని తన వేగంతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే అది కేవలం తాత్కాలికంగా మాత్రమే జరిగే ప్రక్రియ. దీర్ఘకాలంలో ఆ లోటు భర్తీ కాకపోవడం వల్ల అది క్రమంగా వైఫల్యానికి దారితీస్తుంది. అలా మొదట్లో కొద్దిపాటిగా ఉన్న లక్షణాలు కాస్తా దీర్ఘకాలంలో ప్రస్ఫుటంగా కనిపించడం మొదలవుతుంది. ఆ తర్వాత పరిస్థితి చాలా సీరియస్‌గా మారుతుంది.గుండె వైఫల్యంతో సాధారణ జీవనం సాగించడమెలా...గుండె వైఫల్యమన్నది ఒక తీవ్రమైన జబ్బు. పైగా ఇది జీవితాంతం కొనసాగే సమస్య. దీనికి నిత్యం డాక్టర్ల పర్యవేక్షణ, వారు సూచించిన మందులతోపాటు వ్యక్తిగత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మార్పులను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలు అవసరం. ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ బాధితులు చాలావరకు సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అవి... గుండె తన సాధారణ కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు లక్షణాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవడం వీలైనంతగా ద్రవాహారాలను తగ్గించడం ఒత్తిడిని (స్ట్రెస్‌ను) తగ్గించుకోవడం బరువు పెరగకుండా చూసుకోవడం. ఎప్పటికప్పుడు బరువును పరీక్షించుకుంటూ ఉండటం పరిస్థితి తీవ్రమైన కండిషన్లలో వారికి అవసరమైన ఉపకరణాలను (ఇంప్లాంటబుల్ డివైసెస్) అమర్చుకోవడం. ఈ తరహా బాధితుల్లో ఇక గుండె మార్పిడి చికిత్స (హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చివరి ప్రత్యామ్నాయం. అది చాలా సంక్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. పైగా మార్పిడికి అవసరమైన గుండె అందుబాటులోకి రావడం చాలా అరుదు. అందుకే వీలైనంతగా మంచి జీవనశైలిని అనుసరిస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరూ విధిగా చేయాల్సిన పని. గత పదేళ్లలో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యకు చాలా ప్రభావవంతమైన మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. గుండె డాక్టర్ పర్యవేక్షణలో వాటిని వాడటం వల్ల మంచి ఫలితాల తోపాటు సాధారణ జీవితం గడిపేలాంటి అవకాశాలున్నాయి. ఇక కొందరు బాధితుల్లో గుండె స్పందనలు సరిగా జరిగేలా చేసేందుకు పేస్ మేకర్ వంటివి అమర్చాల్సిన ‘సీఆర్టీ’ వంటి మరికొన్ని చికిత్సలూ అవసరం పడవచ్చు.డాక్టర్ అమర్ నారాయణ్ పట్నాయక్, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: Anemia: రక్తం పంచే అమ్మకు బ్లడ్ తక్కువ..! ఎలా అధిగమించాలంటే..) -
రక్తం పంచే అమ్మకు బ్లడ్ తక్కువ..!
మహిళలను రక్తహీనత (అనీమియా) సమస్య ఒక పట్టాన వదలదు. అసలు నెలనెలా వచ్చే రుతుస్రావం సమస్యతో రక్తంపోతూ ఉండటం, బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో రక్తంపోవడం, వాళ్లకు వచ్చే యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలతో మహిళల్లో రక్తంపోవడం చాలా సాధారణం. మన కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా నిర్వహించే 5వ కుటుంబ ఆరోగ్య సర్వే (ఫిఫ్త్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే)లోనూ గర్భవతుల్లోని 52 శాతం కంటే ఎక్కువమందిలో తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లు అధికారికంగానే తేలింది. అంటే గర్భవతులందరిలో సగంమంది కంటే ఎక్కువే రక్తహీనతతో బాధపడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో మహిళల్లో రక్తహీనత (అనీమియా) సమస్య, దాన్ని అధిగమించడమెలా అనే అంశాలను తెలుసుకుందాం. సాధారణంగా రక్తహీనత అన్నది స్త్రీ, పురుషులిద్దరిలో కనిపించేదే అయినా మహిళల్లో మాత్రం చాలా ఎక్కువ. అందునా గర్భవతుల్లో 52 శాతానికి పైగా మహిళల్లో అనీమియా ఉండటం ఎలా ఉన్నా సాధారణ మహిళల్లోని దాదాపు 70 శాతం మందికి పైగా రక్తహీనత ఉంటుందనేది అనేక మంది డాక్టర్ల పరిశీలనల్లో తేలిన అంశం.రక్తహీనత (అనీమియా) అంటే... రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేక΄ోవడాన్ని రక్తహీనత (అనీమియా)గా పరిణిస్తారు. మన శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తంలోని ఎర్ర రక్తకణాల (ఆర్బీసీ) ద్వారానే పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. వాటి సంఖ్య తగ్గడంతో అన్ని అవయవాలకూ పోషకాలూ, ఆక్సిజన్ అందక΄ోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఈ హీమోగ్లోబినే అన్ని కణాలకూ ఆక్సిజన్ అందజేస్తుంటుంది. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో... హీమోగ్లోబిన్ పరిమాణమన్నది మగవారిలో 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు రక్తహీనతతో బాధపడుతున్నారని అర్థం.మహిళల్లో రక్తహీనతకు కారణాణాలివి... మహిళల్లో ప్రతినెలా వచ్చే రుతుస్రావం కారణంగా ప్రతి నెలా రక్తం పోతుంటుంది. ఇక మరికొందరిలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్రరక్తకణాలు తయారయ్యే లోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తంపోవడం, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి అంశాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి.రక్తహీనత లక్షణాలు : రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గి΄ోవడం వల్ల వాళ్లు పాలిపోయిన చర్మం, గోళ్ల కింద రక్తం లేని కారణంగా గోళ్లు తెల్లగా కనిపించడం, ఎర్రగా కనిపించాల్సిన కింది కనుపాప కింద తెల్లగా పాలిపోయినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనిమియా లక్షణాలను తెలుసుకోడానికి భౌతికంగా తొలి పరీక్షగా డాక్టర్లు వీటినే చూస్తారు. ఇవిగాక... ముఖం పాలిపోయినట్లుగా ఉండటం కొద్దిపాటి నడకకే ఆయాసం శ్వాస కష్టంగా తీసుకోవడం ∙తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, అలసట మగతగా ఉండటం చికాకు / చిరాకు / కోపం తలనొప్పి నిద్రపట్టకపోవడం పాదాలలో నీరు చేరడం ఆకలి తగ్గడం కాళ్లుచేతుల్లో తిమ్మిర్లతో అవి చల్లగా మారడం కొందరిలో ఛాతీనొప్పి త్వరగా భావోద్వేగాలకు గురికావడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు / చికిత్స : మాంసాహారులైతే ఐరన్ పుష్కలంగా లభించే కాలేయం వంటివి తీసుకోవాలి. ఇక శాకాహారులతోటు అందరూ ముదురాకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం. అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నవారు డాక్టర్ సలహా మీద ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొందరికి రక్తం ఇవ్వాల్సి రావచ్చు. ఇక టాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉన్నందున వాటిని డాక్టర్ల సూచన మేరకు, వారి పర్యవేక్షణలోనే వాడాలి. ఇతరత్రా సమస్యలు కనిపిస్తుంటే డాక్టర్లు వారికి సరిపడే మందుల్ని సూచిస్తారు. డాక్టర్ విమీ బింద్రా, సీనియర్ గైనకాలజిస్ట్ (చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..) -
తీవ్ర వ్యసనం
మొన్నటి మేలో కర్నాటకలోని ఉడిపిలో ఒక సంఘటన జరిగింది. రోడ్డు మీద తిరుగుతున్న ఒక పిచ్చివాణ్ణి ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సంరక్షించి, వైద్యం చేయించి, తిరిగి మామూలు మనిషిని చేశాడు. మెల్లగా ఆ కోలుకున్న వ్యక్తి తమిళుడని, సొంత ఊరు కుంభకోణం అని తెలిసింది. అతని మనుషులు వెతుక్కుంటూ వచ్చారు. ‘ఇతను ఆరునెలలుగా కనిపించకుండా పోయాడు. దానికి ముందు ఫోన్లో రీల్స్ చూస్తూ కుటుంబంతో మాట్లాడక, స్నానం చేయక, తిండి తినక అదే లోకంగా ఉండేవాడు. ఆ తర్వాత ఈ స్థితిలో దొరికాడు’ అని చెప్పి తీసుకెళ్లారు. రీల్స్‌ను వరుసపెట్టి చూడటానికి ‘డూమ్ స్క్రోలింగ్’ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఏ విధంగా ఆక్రమించగలదో ఇదొక ఉదాహరణ.ఇటీవలే గుజరాత్‌లోని వడోదరలో మరో ఘటన జరిగింది. అక్కడి ఒక కొడుకు తన భార్యతో కలిసి పోలీసుల సహాయం కోరుతూ ఫోన్ చేశాడు. దానికి కారణం ఆ ఇంట్లోని తల్లి రీల్స్‌లో పడి తిండి తినడం మానేసింది. కొడుకు, కోడలు డ్యూటీకి వెళుతుంటే ఆమెకు బోర్ కొట్టి రీల్స్ చూడటానికి అలవాటు పడిందట. ఆ రీల్స్‌లో కూడా ఒక ఇన్ఫ్లూయెన్సర్ పెట్టే రీల్స్ చూస్తుందట. వాటికింద కామెంట్స్ పెడుతుందట. ఆ కామెంట్స్‌కు ఆ ఇన్ఫ్లూయెన్సర్ రియాక్ట్ అయితే ఆమెకు సంతోషం. లేదంటే అప్సెట్ అయ్యి అన్నం తినదు. కొడుకు కోడలు ఆమె ఫోన్ నుంచి ఇన్‌స్టా యాప్‌ను తొలగించారు. దాంతో ఇంకా పెద్ద గొడవ జరిగి, ఆమె అన్నం తినడం మానేసింది. దాంతో ఇప్పుడా కొడుకు, కోడలు తల పట్టుకుని కూచుని ఉన్నారు.అసలు రీల్స్ అంటే ఏమిటి? కొన్ని సెకన్ల విన్యాసం. 2020లో మన దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాక, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పేరుతో 90 సెకన్ల నుంచి 3 నిమిషాల వీడియోస్‌ను ప్రవేశ పెట్టింది. వీటిద్వారా గుర్తింపు, పేరు, ఫాలోయెర్సు తద్వారా డబ్బు... ఇవన్నీ వచ్చేసరికి కేవలం రీల్స్ మీద ఆధారపడినవారు కోకొల్లలుగా పెరిగారు. వీరు రకరకాల విన్యాసాలతో నిత్యం వేలకొద్దీ రీల్స్ వదులుతుంటారు. అవి చూడటానికి ఎవరికైనా, ఎన్ని సంవత్సరాలైనా సరిపోవు. ఆ సంగతి గ్రహించి ఎప్పుడైనా సరదాగా చూసి ఫోన్ కట్టేయాలి తప్పితే వాటిలోనే కూరుకుపోతే మెదడు ఆ రీల్స్‌కు బానిసవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చేయి విరగ్గొట్టుకున్న అమ్మాయిఅహ్మదాబాద్లో నర్సింగ్ కోర్సులో చేరిన ఒక అమ్మాయి హాస్టల్లో బోరు కొడుతున్నదని రీల్స్ చూడటానికి అలవాటు పడింది. పరీక్షలు వచ్చాయి. రీల్స్ చూడాలంటే పరీక్షలు రాయకూడదని ఆ అమ్మాయి తన కుడి చేతిని బల్ల మీద పదేపదే బాది విరగ్గొట్టుకుంది. ఇలా ఉంటాయి రీల్స్ ఉత్పాతాలు.బి.పి. పెరుగుతుందిచైనాలోని హైబె మెడికల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం రీల్స్ వల్ల 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారిలో బి.పి. పెరుగుతుందని నిరూపణ అయ్యింది. రీల్స్‌లోని కంటెంట్ ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా కొనసాగుతూ మూడ్స్‌ను హెచ్చుతగ్గులు తెచ్చిపెడుతుండటం వల్ల ఇలా జరుగుతుంది. రాత్రివేళ గంటలు గంటలు రీల్స్ చూస్తూ నిద్ర పాడుచేసుకుని ఉద్యోగాల్లో కునికిపాట్లు పడుతున్నవారు వేలమంది ఉన్నారు. ఇక దేహం కదల్చకుండా ఉండటం వల్ల వస్తున్న శారీరక సమస్యలు ఎన్నో.టీవీ నయంరీల్స్ చూడటం కన్నా టీవీ చూడటం నయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీవీ చూస్తూ కనీసం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయొచ్చు. లేదా పుస్తకాల ర్యాక్ సర్దుకోవచ్చు. లేదా బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగడమో... ఏదో ఒక పని టీవీ చూస్తూ చేయొచ్చు. రీల్స్ చూడాలంటే ఇలా చేయడానికి చేతులు ఖాళీ ఉండవు. ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మరో చేత్తో స్క్రోలింగ్ చేస్తూ వెళ్లాలి. కాబట్టి శరీరం వేరే పని చేయలేదు.కాపురాలలో చిచ్చురీల్స్ చూడటం భార్యాభర్తల మధ్య చిచ్చు తెస్తోంది. నాలుగురోజుల క్రితం కర్నాటకలోని మంగళూరు సమీపంలో రీల్స్ చూస్తున్న భార్యను కట్టడి చేయలేక భర్త ఆమెను చంపేశాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక భార్య రీల్స్ చూడనివ్వడం లేదని, గిన్నెలు తోమమంటున్నాడని భర్త మీద కేసుపెట్టింది. వీటన్నింటికి విరుగుడు ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో ఉండటమే అంటున్నారు నిపుణులు. హస్తకళలు, పుస్తకాలు చదవడం, క్రీడలు వీటిలో సమయాన్ని వెచ్చించడం మేలంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని రీల్స్ బారిన పడకుండా చూడమంటున్నారు. -
వారు విడిపోయి వీరికి... 'ఒడి'పోయి
విడాకులు కేవలం ఇద్దరు పెద్దల మధ్యే కాదు, ఆ కుటుంబంలో ముఖ్యంగా ఐదారేళ్ల వయసు పిల్లలపైనా తీవ్ర భావోద్వేగాల గందరగోళాన్ని, ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తాయని, ఆయుష్షునూ తగ్గిస్తాయని నివేదికలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల ఐదారేళ్ల వయస్సులో విడిపోతే, ఆ పిల్లలకు ఆయుష్షు తగ్గే అవకాశాలు పెరుగుతాయంటోంది ఒక అధ్యయనం. ఈ పరిశోధనను మిడ్ అట్లాంటిక్‌లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రొఫెసర్ నోలన్ పోప్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మెర్సెడ్ నుండి ఆండ్రూ సి. జాన్స్ స్టన్, అమెరికా జనగణన బ్యూరోకి చెందిన మ్యాగీ ఆర్. జోన్స్ సంయుక్తంగా ఈ ఫలితాలను వివరించారు.జీవనశైలిలో తీవ్ర మార్పులుచిన్నవయస్సులో తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు జీవితాంతం అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్లో తక్కువ ఆదాయం, చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, జైలు శిక్షలు, త్వరగా మరణించే ప్రమాదాలు .. వంటివి ఉన్నాయి. ఇవన్నీ కుటుంబంలో విడాకుల కారణంగా ఏర్పడ్డ అగాథాల మూలంగా జరుగుతున్నాయని పరిశోధకులు వివరించారు. విడాకుల తర్వాత తల్లిదం డ్రులు వేరు వేరు చోట్ల నివసించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గిపోతుంది. ఒంటరిగా పిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. తరచూ నివాసం మారుతుంది. తక్కువ ఆర్థిక అవకాశాలు ఉన్న పేద ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ పిల్లల జీవితంలో సామాజిక, ఆర్థిక సవాళ్లకు దారితీస్తాయి. 1988 నుండి 1993 మధ్యకాలంలో జన్మించిన 50 లక్షల మందికి పైగా పిల్లలపై వారు గణాంకాలను విశ్లేషించారు. ఫెడరల్ ట్యాక్స్ రికార్డులు, సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, జనగణనా బ్యూరో డేటా ఆధారంగా వారు ఈ విశ్లేషణ చేశారు.వ్యాధుల పాలయ్యే ప్రమాదంకొందరు పిల్లలు తమ వల్లే తల్లిదండ్రులు విడిపోయారేమో అనే ఆలోచనను పెంచుకుంటారు. ఇది వారిలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలలో 16 శాతం అధిక స్థాయి సి–రియాక్టివ్ ప్రోటీన్ ఉందని అధ్యయనం. ఈ ప్రొటీన్ వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, టైప్– 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు లోన య్యే రిస్క్ ఎక్కువ ఉందని గుర్తించారు.మానసిక అనారోగ్యంపిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, సహకారం చూసి పెరుగుతారు. ఆ మద్దతు వారికి ధైర్యాన్నిస్తుంది. కానీ విడాకుల సమయంలో వారిలో భయాలు, అనిశ్చితి, ఒంటరితనం మొదలై మనోవేదన ఎక్కువవుతుంది. ఒక అధ్యయనంలో విడాకులు తీసుకున్న, విడిపోయిన లేదా మరణించిన తల్లిదండ్రులలో ఇద్దరు పిల్లలు కౌమారదశలో ఉంటే వారిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని తేలింది. విపరీతమైన భావోద్వేగాలుతిండి తినడంలో మార్పులు, నిద్రలో ఆటుపోట్లు, శరీర బలహీనత .. వంటి లక్షణాలు పిల్లల్లో బయటపడతాయి. ఇది వారి చదువు పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఏకాగ్రత లోపించటం, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, ఇంటి నుంచి వెళ్లిపోవడం.. వంటివీ కనిపించవచ్చు.సమాజంలో ప్రవర్తనకొన్ని సందర్భాల్లో పిల్లలు అతి శాంతంగా మారిపోతారు. లేదంటే మొండిగా ప్రవర్తించవచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు దెబ్బతింటాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు చూసిన పిల్లలు తమ భవిష్యత్తు సంబంధాలపై నమ్మకాన్ని కోల్పోతారు. విడాకులు అనివార్యమైతే, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందడుగు వేయాలి. భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా ప్రేమ, మద్దతు, మార్గదర్శకం పిల్లలకు ఇవ్వాలి. ఇద్దరిదీ సమాన బాధ్యతఐదారేళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రుల సమస్య ఏంటో అర్థం కాదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, దంపతులు తమ జీవితంలో సర్దుబాట్ల చేసుకోవాలి. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకొని, ధైర్యమివ్వాలి. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దరిలో ఎవరి దగ్గర ఉన్నా మరొకరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇవి పిల్లల భవిష్యత్తుకు పెద్ద అవరోధమని గ్రహించాలి. మారుతున్న కాలానికి తగినట్టు బంధాలను అర్థం చేసుకుంటూ సామాజికంగానూ బంధుమిత్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అండగా ఉండాలి. విడాకులకు ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉన్నారో, ఆ తర్వాత కూడా ఇద్దరూ పిల్లల పట్ల సమాన బాధ్యత తీసుకో వాలి. విడాకులకు ముందు మానసిక నిపుణుల సూచనలు అవసరం. – డా. సునీత, సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘సొంతిల్లా.. నో వే..!’ బోట్లో బతికేస్తా.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
‘కూడు, గూడు గుడ్డ’ ఇవి సామాన్య జీవితానికి కావల్సిన కనీస అవసరాలు. కానీ ప్రస్తుత సమాజంలో మధ్యతరగతి జీవికి సొంత ఇల్లు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అందులోనూ భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సొంతిల్లు కాదు గదా కనీసం అద్దె భారాన్ని భరించడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ పోస్ట్ వైరల్‌గా మారింది. మరో విధంగా చెప్పాలంటే తీవ్ర చర్చకు దారి తీసింది.మెట్రో నగరాల్లో ఒక చిన్న అపార్ట్ మెంట్ కొన్నాలన్నా లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది చాలా మంది మధ్యతరగతి కొనుగోలుదారుల ఆందళన. దీనిపైనే స్పందిస్తా.. సొంతిల్లు,లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ నా వల్ల కాదుగానీమన దేశంలో హౌస్‌బోట్‌లో జీవితాన్ని లాగించేయడం చట్టబద్ధమేనా? దయ చేసి ఎవరైనా చెప్పండి బ్రో అంటూ సోషల్‌మీడియాలో పెద్ద చర్చకే తెర లేపాడు. బెంగళూరు, చెన్నై లేదా హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనలేని,గృహ రుణం కోసం వయస్సు, ఆదాయ పరిమితులు సహకరించని వ్యక్తి ఒక చిన్న పడవను కొనుగోలు చేయాలా లేదా అద్దెకు తీసుకోవాలా అంటూ ఆవేదనగా ప్రశ్నించాడు. అందులో వంటగది, బాత్రూమ్ రెండు గదులు వంటి మినిమం సౌకర్యాలతో నివసించదగిన స్థలంగా మార్చాలా? ఏం చేయాలి? అంటూ పోస్ట్ చేశాడు.ఇండియాలో భారతదేశంలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ఏ నగరంలోనూ ఫ్లాట్ కొన లేను నాకు ఇప్పటికే వయస్సు మీద పడింది, కాబట్టి నేను EMIల కట్టేంత కాలమూ పని చేయలేను ఒక బోట్ కొనుక్కొని, నదులు, సముద్ర తీరంలో పార్క్ చేసుకుంటా.. వానొచ్చినా, వరదొచ్చినా పరవాలేదు మహా అయితే హౌస్ బోట్ ధర 15 నుండి 30 లక్షల వరకు ఉంటుంది. ’’ అంటూ రాసుకొచ్చాడు. సోషల్ మీడియా స్పందనదీనిపై నెటిజనలు విభిన్న రీతుల్లో స్పందించారు. ఇళ్లు చవకగా కొనే కొన్ని ఏరియాలు, సూచనలతో పాటు పడవలో ఉండకూడదని కొందరు అతని ఆలోచనకు బ్రేక్‌లు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కొనమని కొందరు సూచించారు. అంతేకాదు బోట్ జీవితం ఒకే కానీ... అడ్రస్ ప్రూఫ్, పర్మినెంట్ అడ్రస్, డెలివరీ అడ్రస్ ఇలాంటి వన్నీ ఉంటాయిగా అన్నారు. -
Anju టెర్రస్ గార్డెన్లో తోపు : 600కు పైగా గులాబీలు
మడిసన్నాక కాపింత కళాపోషనుండాల అన్నట్టు గట్టిగా అనుకోవాలే కానీ చారెడు మట్టినేల లేకున్నా కోరుకున్న పంట పండించవచ్చని నిరూపించింది కేరళకు చెందిన అంజు కార్తీక (Anju Karthika). తన ఇంటి మిద్దె తోటలో ఆమె 600 రకాల గులాబీలను విరబూయించి రోజాపూల ప్రేమికుల గుండెలను గులాబీ సౌరభాలతో నింపేసింది. కేరళలోని కయాంకుళానికి చెందిన యాభై రెండు సంవవత్సరాల అంజు కార్తీకకు చిన్నప్పటినుంచి పువ్వులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ గులాబీలంటే ప్రాణం. స్కూల్లో చదివేటప్పుడే ఆమెలో గులాబీలపైన ప్రేమ బీజం నాటుకుని మొలకెత్తింది. అది ఆమెతోపాటే పెరిగి పెద్దదై కొమ్మలు రెమ్మలుగా విస్తరించింది. ఆమెకు పూలంటే ఉన్న మక్కువ మట్టిగా... ఆమె కృషి, పట్టుదలలే నీరు, ఎరువులుగా మారి ఆమె కోరుకున్నన్ని రకాల గులాబీ బాలలయ్యాయి. కార్తీకకు పదవ తరగతి విద్యార్థినిగా ఉన్నప్పటినుంచే స్నేహితుల తోటల నుంచి గులాబీల అంట్లు తీసుకొచ్చి తన ఇంటిలో వాటిని పెంచే ప్రయత్నాలు చేసేది. తోటి వారందరూ ఆటపాటలలో బిజీగా ఉన్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా తన మొక్కల ప్రపంచంలో పడి వాటిని పెంచడంలో విసుగూ విరామం లేకుండా గంటలు గంటలు గడిపేది. తాను అంటుకట్టిన గులాబీ అందమైన మొగ్గ తొడిగినప్పుడు ఆమె గుండెల్లో ఆనందం ఉప్పొంగేది. గులాబీల పెంపకం పట్ల గల ఆమె అభిరుచి ఆమె టీనేజ్ దాటిన తరువాత వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. 2013లో ఆమె బ్రెజిల్, థాయిలాండ్‌లలో పెరిగే టేబుల్ గులాబీ రకాల గురించి తెలుసుకున్నటినుంచి మరింతగా వికసించింది. 15 రకాల గులాబీ మొక్కలను సేకరించి తన టెర్రస్‌పై రకరకాల కంటైనర్లలో పెంచడం ప్రారంభించింది. వాటి పోషణలో... సంరక్షణలో ఆమె కృషి ఫలించింది. ఈ వాతావరణంలో కూడా అక్కడి గులాబీ రకాలు అభివృద్ధి చెంది రోజుకో రకం మొక్క, పూటకో రకం పువ్వు అన్నట్టు విచ్చుకోనారంభించాయి. ఆమె సేకరించి పెంచుతున్న గులాబీల సౌరభాలు క్రమేణా కేరళ దాటి పొరుగు రాష్ట్రాలకు, అక్కడినుంచి విదేశాలకు కూడా చేరాయి. అలా ఒక ప్రయోగం ఫలించగానే మరో ప్రయోగం చేస్తూ వచ్చింది. చెన్నై, పూణెలలోని రకరకాల నర్సరీల నుంచి కొత్తరకాల గులాబీ అంట్లను తెప్పించేది. పరాగ సంపర్కాన్ని ఉపయోగించి ఆమె అంటుకట్టిన గులాబీ రకాలు మావిచిగురు, నారింజ, వంకాయ రంగు, ఊదా రంగు.. ఇంకా రకరకాల రంగులలో రూపాలలో ఊపిరి పోసుకుని వివిధ రకాల ఆకృతులలో విచ్చుకోసాగాయి. ఆమె తన ఇంటి మిద్దెనే ప్రయోగశాలగా మార్చుకుని చేసిన వినూత్న ప్రయోగాలు ఆమెకు ఆదాయ మార్గాలుగా కూడా మారాయి. చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు? ఫేస్బుక్లో ఆమె తాను పెంచుతున్న గులాబీ రకాలను అందమైన ఫొటోలు తీసి పోస్ట్ చేసేది. వాటిని చూసి మైమరచి పోయిన ఆమె స్నేహితులు, బంధువులు తమకు కావాలంటే తమకు కావాలంటూ ఆమెకు ఆర్డర్లు పంపసాగారు. అలా అందుకున్న ఆర్డర్ల ద్వారా ఆమె రోజుకు కొన్ని వేల రూపాయల ఆదాయాన్ని కళ్ల జూసేది. ప్రస్తుతం ఆమె మిద్దెతోటలో లేని గులాబీ రకం లేదంటే అతిశయోక్తి కాదు. ఏవిధమైన ఏజెంట్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ లేకుండానే ఆమె తన నోటిమాటలు, ఫేస్బుక్ సమూహాల ద్వారా అడిగిన వారికి లేదనకుండా గులాబీ అంట్లను పంపుతూ వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. చేయాలనే సంకల్పం, దానిని నెరవేర్చుకునేందుకు కావలసిన శ్రద్ధ, అంకిత భావం, పట్టుదల ఉంటే చాలు.. దేనినైనా సాధించి చూపవచ్చుననేందుకు నిదర్శనం అంజు కార్తీక గులాబీ తోట. ఇదీ చదవండి: రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు -
ఏడడుగులు తడబడి... విడివడి
మన దగ్గర ‘పెళ్లి పుస్తకం’ అమ్మాయి సహనం, సైలెన్స్.. అబ్బాయి ఆజ్ఞ, అధికారంతో రాసి ఉంది! కుటుంబ పరువు, ప్రతిష్ఠల మధ్య బైండ్ అయిపోయింది! అందుకే కలహాలు, కలతలున్నా ఆ కాపురం సాగిపోతూనే ఉండింది! కానీ దాన్నిప్పుడు అమ్మాయిలు ప్రేమ, కంపాటబిలిటీతో తిరగరాసేందుకు ప్రయత్నిస్తున్నారు. గౌరవం, భావోద్వేగాలతో బంధించాలనుకుంటున్నారు. అయితే ఆ ప్రయాణంలో విడాకుల అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాన్ని గమనిస్తున్న పెద్దలకు మన వివాహ వ్యవస్థ కూలిపోతున్నట్టనిపించవచ్చు! కానీ.. ఒక వ్యవస్థను పునర్నిర్మించడంలో అలాంటివి సాధారణమే అంటున్నారు సామాజిక విశ్లేషకులు. ఆ తడబాట్లు సర్దుకుని పెళ్లిపుస్తకంలో కొత్త పేజీలుగా మారుతాయని చెబుతున్నారు! సుచరిత బిజినెస్ ఎనలిస్ట్. పెళ్లయి రెండేళ్లవుతోంది. భర్త సాఫ్ట్వేర్. పెళ్లయిన వెంటనే యూకేలో మంచి జాబ్ ఆఫర్ వస్తే.. పెళ్లిని నిలబెట్టుకోవడం కోసం ఆ జాబ్ ఆఫర్‌ని వద్దనుకుంది. ఓ స్టార్టప్ ప్లాన్ చేసుకుని ఈ రెండేళ్లలో దాన్ని బాగా డెవలప్ చేసుకుని ఆంట్రప్రెన్యూర్‌గా స్థిరపడే దశకు చేరుకుంది. ఆ క్రమంలో పిల్లలనూ అప్పుడే వద్దనుకుంది. భర్త మాత్రం పిల్లలు కావాలనుకుంటున్నాడు. ఈ మధ్యే అతనికి అమెరికాలో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. సుచరితనూ తీసుకుని అమెరికా వెళ్లిపోతే పిల్లల కోసం కన్విన్స్ అవుతుందనుకుని ఆ జాబ్‌కు ఓకే చేసి ఇక్కడున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, సుచరిత ముందు తన ప్రపోజల్ పెట్టాడు. తను స్టార్టప్‌ను వదిలేసి వచ్చే సమస్యే లేదని స్పష్టం చేసింది. చర్చలు, వాదనలు జరిగాయి. ‘పెళ్లయిన కొత్తలోనే ఇప్పుడు నీకొచ్చిన జాబ్ ఆఫర్ కన్నా రెట్టింపు శాలరీతో మంచి ఆఫర్ నాకు వచ్చింది. కానీ మన పెళ్లిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ జాబ్‌ను వద్దనుకున్నాను. ఇప్పుడు నా స్టార్టప్ క్లిక్ అయ్యింది. ఇంత ఎఫర్ట్నీ తుంగలో తొక్కి నీతో రమ్మంటే రాలేను. కావాలంటే నువ్వు నా కంపెనీలో చేరు. ఇద్దరం కలిసి పనిచేద్దాం!’ అంది. ససేమిరా అన్నాడు. మన బంధానికన్నా నీకు ఆ స్టార్టప్పే ఎక్కువ? నీ కెరీర్ కోసం మదర్‌హుడ్‌ని కూడా పణంగా పెడతావా?’ అంటూ నిలదీశాడు. ఆ మాటలకు, ఆ ఆలోచనా ధోరణికి విస్తుపోయింది సుచరిత.‘నేనేం పిల్లలను వద్దనుకోవట్లేదు. నీ అమెరికా జాబ్ కోసం నా కెరీర్‌ను వదలను అంటున్నాను. నువ్వు ఇక్కడే ఉండు.. పిల్లల కోసమూ ప్లాన్ చేసుకుందాం’ అంది. రాజీకి రాలేదు అతను. అయితే విడాకులు కావాలంది సుచరిత. ఆమె నిర్ణయానికి అటు పెద్దలు, ఇటు పెద్దలు హతాశులయ్యారు. మూర్ఖత్వంతో కాపురాన్ని కూల్చుకుంటున్నావంటూ తిట్టారు. అయినా చలించలేదు సుచరిత. కూతురి తీరుకు ఏడుస్తున్న తల్లిని ‘నన్నెవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు నువ్వు అపార్థం చేసుకోవడమే పెయిన్‌గా ఉందమ్మా! బాగా చదువుకోవాలి, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి, కోట్ల ఆస్తి ఉన్న భర్త దొరికినా సరే.. నీకంటూ రూపాయి సంపాదించుకున్నప్పుడే నీకు ధైర్యం, గౌరవమని నువ్వు చెప్పిన మాటల్ని నువ్వే మరచిపోయావా? ఆ గోల్ కోసం నేను పడ్డ కష్టాన్ని నువ్వూ ఇగ్నోర్ చేయడమేంటమ్మా..’ అంటూ బాధపడింది. అమ్మకు అర్థమైంది, అలాగని కూతురిని పూర్తిగా సమర్థించలేకపోయింది.ఎందుకంటే.. ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని చిన్నప్పటి నుంచీ నూరిపోసిన ఆ తల్లి ఆడపిల్లకు కాపురం కూడా అంతే ముఖ్యం, అవసరమైతే అంతకన్నా ముఖ్యమనే సంప్రదాయ విలువలకు కండిషనింగ్ అయి ఉంది. ఆ భావజాలం కూతురి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి అడ్డం పడుతోంది. తన పెంపకం పట్ల అపరాధ భావాన్నీ కలిగిస్తోంది. ఆమే కాదు ఆడపిల్లల చదువును, ఉన్నతిని కాంక్షించి ఆ దిశగా వాళ్లను తీర్చిదిద్దిన చాలామంది తల్లిదండ్రులదీ అదే భావన. పెళ్లిని నిలుపుకోవడం కోసం చదువును, కెరీర్‌ను ఆడపిల్లలే పణంగా పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఎంతకాదన్నా మన దగ్గర పెళ్లి సఫరింగ్నే గ్లోరిఫై చేస్తోంది కాబట్టి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. బాధ పడుతున్నా.. హింసను ఎదుర్కొంటున్నా, మానసిక దూరం పెరుగుతున్నా, భావోద్వేగాలు నిర్లక్ష్యం అవుతున్నా ఆలుమగలు కలిసి ఉండాలనే నేర్పుతోంది కుటుంబం. కానీ..చదువు, లోకజ్ఞానం, సాధికారత ఇచ్చిన ధైర్యంతో అలాంటి కాపురంలో కొనసాగడం కన్నా విడాకులతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు సుచరితలాంటి అమ్మాయిలు. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేని పెళ్లిని పెళ్లిగానే చూడట్లేదు. విడాకులను పెద్దవాళ్లు పరువుప్రతిష్ఠలకు ముడిపెడతారు. ఆ భావన నుంచి బయటపడాలి. భరిస్తూ కలిసి బతకడంలో అర్థం లేదు. విడిపోయినా ఆత్మగౌరవంతో బతకడంలోనే ఆనందముందని గ్రహించాలని కోరుకుంటున్నారు. అందుకే ఏమైనా సరే సహనంతో సర్దుకుపోవాలంటూ పిల్లలను బలవంత పెట్టకూడదని మానసిక, న్యాయ నిపుణులూ చెబుతున్నారు. ఇది సంప్రదాయాన్ని మంటగలుపుతున్న మార్పు కాదు. పరిణామ క్రమమని అంటున్నారు సామాజిక విశ్లేషకులు. విడాకులకు కారణాలు.. మునుపటిలా ఆడవాళ్ల పని, మగవాళ్ల పనంటూ బాధ్యతలను జెండర్ కోణంలో చూడట్లేదు. ఇంటా, బయటా స్త్రీ, పురుషుల విధుల్లో మార్పులొచ్చాయి. మారిన ఈ విలువలను జీర్ణించుకోలేని కాపురాలు విడాకుల బాట పడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, బంధంలో భావోద్వేగాల సమన్వయం లోపించడం, నమ్మకం లేకపోవడం, అభద్రత, అస్తవ్యస్త పనివేళలు, మద్యం, ధూమపానం మొదలైనవీ విడాకులకు ప్రధాన కారణాలే అంటున్నాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, లక్నో వంటి నగరాల్లో విడాకుల దరఖాస్తులు మూడింతలయ్యాయి. పురుషాధిపత్య సమాజాలుగా పేరొందిన ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో విడాకుల సంఖ్య, వేరు పడిన సంసారాల సంఖ్యా తక్కువగా ఉన్నాయి.పెళ్లి, పిల్లలు,పేరెంటింగ్, విడాకులు, ఆందోళన వంటివన్నీ మనదాకా వస్తేగానీ తెలియవు. కాలం కలిసి వచ్చినప్పుడు అంతా బ్రహ్మాండంగా సాగుతూ మనంత తెలివిగల వాళ్లు లేరనిపిస్తుంది. కాలం ఎదురు తిరిగినప్పుడే అసలు సినిమా కనిపిస్తుంది.– కరీనా కపూర్భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మంచి, చెడు రెండిటికీ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. అనుబంధం బలపడుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఆ బంధంలోకి మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.మూడోవ్యక్తి దూరకూడదు. ఆ జంటే పరిష్కరించుకోవాలి.– విద్యా బాలన్ – సరస్వతి రమ -
వాల్నట్స్ షెల్స్‌తో వైట్ హెయిర్‌కి చెక్‌పెడదాం ఇలా..!
జుట్టు నెరవడం దగ్గర నుంచి, కాలిన గాయాలకు మన వంటింట్లో ఉపయోగించే వాటితోనే సులభంగా పరిష్కారం చూపొచ్చట. సహజసిద్ధమైన వాటితో మెరుగైన ఫలితమే గాక ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సమస్యలకు కిచెన్ టిప్స్ ఏంటో చూసేద్దామా..!. వాల్నట్స్ లోపల ఉన్న పప్పుని తీసుకుని షెల్స్‌ని పడేస్తుంటారు. కానీ వాల్నట్స్ షెల్స్ తెల్లజుట్టుని నల్లగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాల్నట్స్ షెల్స్‌ను మెత్తగా పొడిచేసుకోవాలి. ఆరు టేబుల్ స్పూన్ల పొడిని లీటరు నీటిలో వేసి అరగంటపాటు మరిగించాలి. మరిగిన నీటిని చల్లారాక వడగట్టాలి. ఈ నీటిని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టి మర్దన చేయాలి. రెండు గంటల తరువాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల మూడు నెలల్లో తెల్లజుట్టు నల్లగా... ఒత్తుగా మారుతుంది.నాలుక కాలినప్పుడు చల్లని పదార్థాలు తినడం తెలిసిందే. అయితే ఐస్‌క్రీమ్‌ను కొద్దికొద్దిగా చప్పరించడం వల్ల కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీనికోసం వెనిలా, మ్యాంగో, పిస్తా, గుల్ఖండ్ ఫ్లేవర్స్ ఉన్న ఐస్‌క్రీమ్‌లు బాగా పనిచేస్తాయి.పుదీనా ఆకుల్లో కొద్దిగా తేనె వేసి కచ్చపచ్చాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా చప్పరిస్తుంటే కాలిన నాలుకకు ఉపశమనం లభిస్తుంది. (చదవండి: Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?) -
Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?
షుగర్ (diabetes) అనేది దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. ఇక అంతే సంగతులు జీవితాంతం మనల్ని వీడిపోదు అనేది ఒకప్పటి మాట. లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఆహార నియమాలు, వ్యాయామంతో పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని అనేది ఇప్పటి మాట. అయితే డయాబెటిస్ రాకుండానే జాగ్రత్తపడాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనే అలసత్వం ప్రదర్శించకూడదు. అయితే ఎలాంటి ఆహారాలు తినాలి? ఎలాంటి ఆహారాలు తీనకూడదు అనే సందేహం చాలామందిని పట్టి పీడిస్తుంటుంది. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా షుగర్ ఉన్న వారు ఎగ్స్ (Eggs) తినొచ్చా, ఒకవేళ తింటే ఎలా తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.కోటడిగుడ్లలో బయోటిన్, పొటాషియం, యాంటి యాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ , కార్బొహైడ్రేట్స్ తక్కువగానూ ప్రోటీన్ ఎక్కువగానూ ఉంటుంది. ఈ రెండూ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. కాబట్టి గుడ్లును నిరభ్యంతరంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారికి ప్రోటీన్ అధిక మూలాన్ని అందిస్తుంది. కనుక చక్కగా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదు.గుడ్లలోని కొలెస్ట్రాల్ కంటెంట్ గురించి ఆందోళన అవసరం లేదని, అయితే మితంగా తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంటే వారానికి మూడు రోజుల పాటు రోజుకొకటి చొప్పున తినొచ్చు. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నవారు రెండు ఎగ్ వైట్స్ తింటే సరిపోతుంది.అలాగే, గుండె సమస్యలు, కిడ్నీ ,ఇతర సమస్యలున్న వారు ఎగ్స్ తినే విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.నోట్ : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. షుగర్‌లో ఉండే రకాలను బట్టి, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాబెటిస్తో బాధపడేవారు ఏం తినాలి అనేది ఆధారపడుంది. ఇలాంటి నిర్ణయాలు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. అయితే ఒత్తిడిలేని జీవితం, నీళ్లు తాగడం, నిద్ర, తాజా కాయగూరలు, పళ్లు, సిరిధాన్యాలతో చేసిన వంటలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం, రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవడం మధుమేహం రోగులకు చాలా అవసరం. -
పేరుకు తగ్గట్టే.. రిటైర్డ్ ఉద్యోగి ధర్మారావు దాతృత్వం
ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ సమయం లేక కొంతమంది.. ఆర్థిక స్తోమత లేక మరి కొంతమంది చేయలేని పరిస్థితి.. అలాంటివారు ఏమాత్రం అవకాశం దొరికినా తమ వంతుగా సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ధర్మారావు.. సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం తన వంతు సాయంగా సేవ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.. – మోతీనగర్ ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన బి.ధర్మారావు ప్రస్తుతం మూసాపేట డివిజన్ మోతీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగ విధుల నిమిత్తం 1996లో కృష్ణాజిల్లా నుంచి నగరానికి బదిలీ అయ్యారు. డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ జులైలో 2004లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం ఆయన సతీమణి దివంగత బి.హైమావతి కోరిక మేరకు 2004 నుంచి నేటి వరకూ నిరంతరాయంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాఠశాల ఫీజులు చెల్లిస్తున్నారు. ఆమె ఆలోచన నుంచే.. మేము చదువుకున్న సమయంలో పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడ్డాం. ఈ నేపథ్యంలో నా భార్య హైమావతి ఆలోచన నుంచే ఉద్యోగ విరమణ అనంతరం మా వంతు సాయం చేయాలని నిర్ణయించు కున్నాం. ఆమె మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం విద్యార్థులకు తోచిన విధంగా పరితోషికాన్ని సాయం చేస్తున్నా. అపార్టుమెంట్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ పిల్లలకు నోటు పుస్తకాలు అందజేస్తున్నా. రానున్న రోజుల్లో హైమావతి జ్ఞాపకార్థం మరిన్ని కార్యక్రమాలు చేపడతా. – ధర్మారావు, రిటైర్డ్ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ భార్య జ్ఞాపకార్థం.. ప్రస్తుతం చిన్నకుమారుని వద్ద నివాసం ఉంటున్న ధర్మారావుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. 2020లో ఆయన భార్య మరణానంతరం హైమావతి జ్ఞాపకార్థం.. 2021 నుంచి పుస్తకాలు, యూనీఫామ్ పంపిణీతో పాటు మూసాపేట డివిజన్లోని బబ్బుగూడ, యూసఫ్‌గూడ, వెంగళరావునగర్, ఇస్నాపూర్, శ్రీరామ్‌నగర్, రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలు, శ్రీరామ్ నగర్‌లోని ఉర్దూ మదరసాల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు రూ.12వేల చప్పున ఫీజులను చెల్లిస్తున్నారు. గత ఐదేళ్లుగా పదో తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన, 500కు పైబడి మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. -
Kareena Kapoor: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..!
బాలీవుడ్ నటి కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎవర్గ్రీన్ నటనతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటి ఆమె. ఇప్పటికి కుర్ర హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్‌గా ఉంటారామె. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మంచి జీవనశైలిని పాటిస్తారామె. తరుచుగా ఆమె ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేస్తుంటారు. తన వర్కౌట్ల నుంచి ఆరోగ్యకరమైన డైట్ వరకు ప్రతిదీ పంచుకుంటారామె. అయితే హీరో హీరోయిన్లు ఎంతలా స్ట్రిక్ట్‌గా ఫిట్నెస్కి ప్రాముఖ్యత ఇచ్చినా..కెరీర్ పరంగా కొన్ని త్యాగాలు చేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే పాత్ర డిమాండ్‌కి అనుగుణంగా వాళ్ల ఆకృతిని మార్చుకోక తప్పదు. ఆ క్రమంలో ఆరోగ్యానికి విరుద్ధమైన డైట్లను అనుసరించాల్సి ఉంటుంది. అలానే కరీనా కూడా ఓ మూవీ కోసం జీరో సైజ్ ఫిగర్ మెయింటైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం ఎలాంటి ఫుడ్ తీసుకునేదో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఏంటి పరాఠాలతో తగ్గడం అని షాక్‌కి గురవ్వుతారు. కానీ కరీనానే ఓ ఇంటర్వ్యూలో పరాఠా విత్ నెయ్యితోనే జీరో సైజ్ బరువుకి వచ్చానని చెప్పడం విశేషం. మరి అదెలాగో చూద్దామా..!.వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ కానీ వాళ్లకు కరీనా అనుసరించిన విధానం ఓ వరమనే చెప్పాలి. ఎందుకంటే పాపం నోరు కట్టేసుకుని ఫైబర్ కోసం రుచి పచి లేని ఫుడ్ తింటుంటారు. అయితే ఇలా కమ్మటి పరాఠాలు, నెయ్యి కలిపి హాయిగా తింటూనే బరువు తగ్గే విధానం తెలుసుకుంటే హమ్మయ్యా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మరీ ఆమె వీటితో సైజ్ జీరోకి ఎలా రాగలిగందంటే..2008 యాక్షన్-కామెడీ 'తాషన్'లో కరీనా కపూర్ జీరో సైజ్ ఫిగర్‌తో అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఆమె ఎప్పుడూ ఆకలితో అలమటించే డైట్లు ఫాలో కానని అంటోంది. ఎప్పుడూ పరాఠాలు తింటూనే ఉంటానంటోంది. అలా తింటూ..కూడా రోజంతా తీసకునే ఆహార క్రమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలని చెబుతోందామె. అయితే ఆమె ఆ మూవీ కోసం దాదాపు 68 కిలోల నుంచి 48 కిలోలు చేరుకునేందుకు అస్సలు ఆకలితో ఇబ్బందిపడే లేదట. (చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్ కూడా..)తన ఫిట్నెస్ టీమ్ పోషకాహార నిపుణుడు రుజుత దివేకర్, ట్రైనర్ నమ్రత పురోహిత్ల సాయంతో అద్భుతంగా బరువు తగ్గానని చెప్పారామె. అందుకోసం తాను సరైన మార్గాన్ని అవలంభించే మంచి శరీరాకృతిని పొందినట్లు తెలిపారామె. తాను అస్సలు తినకుండా ఉండలేనని అంటోంది. అయితే తాను సరైన మొత్తంలో కార్బోహైడ్రేట్లు తీసుకునేలా రుజుత దివేకర్ నెయ్యితో పరాఠాలు, కుంకుమ పువ్వు నీళ్లు తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. వాటి తోపాటు గుల్కండ్ అనే స్వీటు, గోరువెచ్చని పాలు తప్పనిసరిగా తీసుకునేదాన్ని అని అంటోంది. అయితే 2018లో మొదటి బిడ్డ ప్రసవానంతరం బరువు పెరిగానని, అయితే త్వరితగతిన బరువుని అదుపులోకి తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తాను జిమ్‌లో 55 నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉండలేనని అన్నారు. తాను ఎక్కువగా పవర్ యోగా, పైలట్స్ వర్కౌట్లతో బాడీని ఫిట్‌గా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ఇక్కడ కరీనా..తనకిష్టమైన ఆహారాన్ని వదులకోకుండానే బరువు తగ్గే ప్రయత్నం చేశారు. మైండ్‌ఫుల్‌నెస్‌గా ఇష్టమైన ఆహారాలు దూరం చేసుకోకుండా తగ్గడమే ఆరోగ్యదాయకమని చెప్పకనే చెప్పారామె. సో ఆమెలా ఒక క్రమ పద్ధతిలో నచ్చిన ఫుడ్ తీసుకుంటూనే తగ్గే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్‌లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..!) -
ది బెస్ట్ ఐస్ క్రీమ్‌లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..!
ఆన్లైన్ ఫుడ్ ర్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ది బెస్ట్ రెసీపీలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, రెస్టారెంట్లలు తదితర వాటిల జాబితా అందించనట్టుగానే ఈసారి అందరికి ఇష్టమైన చల్లటి హిమక్రీమ్ల జాబితాను కూడా విడుదల చేసింది. వాటిలో భారత్‌కి చెందిన ఐదు ప్రముఖ బ్రాండ్ల ఐస్‌క్రీమ్‌లు చోటు దక్కించుకోవడం విశేషం. మెత్తం వంద ది బెస్ట్ ఐస్‌క్రీమ్‌ల జాబితాను వెల్లడించగా అందులో ఐదు భారతీయ ఐస్‌క్రీమ్‌లకు స్థానం లభించింది. వాటిలో ముందుంజలో ఉన్నది ముంబైకి చెందిన కె. రుస్టమ్స్ & కో. బ్రాండ్‌కి చెందిన మ్యాంగో శాండ్విచ్ ఐస్‌క్రీమ్. దీన్ని సన్నని వేఫర్లలో ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్ శాండ్విచ్లకు గమ్యస్థానంగా నిలిచింది. ఇది అత్యంత పురాతన ఐసీక్రీమ్ దుకాణం. దీన్ని దాదాపు 1950లలో స్థాపించారు. అప్పటి నుంచి విభిన్న రుచుల ఐస్‌క్రీమ్‌లతో వినియోగదారులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మామిడి శాండ్విచ్ టేస్ట్ అట్లాస్ గుర్తింపుతో మరింత ప్రజాదరణను పొందనున్నది. ఇక రెండో స్థానంలో పబ్బాస్, మంగళూరు గడ్బాద్ ఐస్‌క్రీమ్ ఉంది. ఇది సాంప్రదాయ ఐస్ క్రీం రుచులకు ప్రసిద్ధి చెందింది. దీనిలో జెల్లీలు, పండ్లు మిళితం చేసిన గడ్బాద్ ఐస్ క్రీమ్ ఇది. దీన్ని స్థానికులు, పర్యాటకులు అత్యంత ఇష్టంగా తింటారట. మూడవ స్థానంలో సహజసిద్ధమైన కొబ్బరితో చేసిన ఐస్ క్రీమ్. ఈ బ్రాండ్ 1984లో స్థాపించారు. ఇప్పటి దీని ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఇక నాల్గవ స్థానంలో అప్సరస్ జామ ఐస్ క్రీమ్ దక్కించుకుంది. ఇది కూడా ముంబైలో స్థాపించబడిన బ్రాండ్. టేస్టీ అట్లాస్ కూడా ఈ జామా ఐస్‌క్రీం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇది జామ ముక్కల తోపాటు మసాల దినుసులతో తయారు చేసిన వెరైటీ ఐస్‌క్రీమ్. చివరి స్థానంలో కార్నర్ హౌస్, బెంగళూరు డెత్ బై చాక్లెట్ అని పిలిచే సిగ్నేచర్ ఐస్ క్రీమ్ ఉంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అత్యంత ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్ అట. ఇది పొరలు పొరలుగా ఉండి, పైన చెర్రీ కూడా ఉంటుందట. దీన్ని గుడ్డు సొన, చక్కెర కలయికతో తయారు చేస్తారు. అయితే ఆహారప్రియులు దీన్ని ఎక్కువగా చెస్ట్నట్ తేనెతో సేవిస్తారట. (చదవండి: విదేశీ వంటకాలకు కేరాఫ్‌గా భాగ్యనగరం..!) -
కుబేరుడి పెళ్లి సందడి షురూ : అంగరంగవైభవంగా మూడు రోజుల ముచ్చట
ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) పెళ్లి సందడి మొదలైంది. 61 ఏళ్ల టెక్ బిలియనీర్, 55 ఏళ్ల ప్రేయసి లారెన్ సాంచెజ్‌తో వెడ్ లాక్ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రాంభమైనాయి. గురువారం తమ మూడు రోజుల వివాహ వేడుకలు షురూ అయ్యాయి. ఈ వేడుకలకు కిమ్ చ ఖ్లో కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే , ఓర్లాండో బ్లూమ్ వంటి టాప్ మోస్ట్ గెస్ట్‌లతో వేదిక కళకళలాడింది. This is Jeff Bezos’s $500 million yacht. Republicans are cutting Americans’ healthcare to give him a tax cut so he can buy a bigger yacht. pic.twitter.com/SxTRaIxqpn— Piyush Mittal 🇺🇸🇺🇦🇬🇪🇨🇦🟧🌊🌈 (@piyushmittal) June 26, 2025 బెజోస్, సాంచెజ్ 16వ శతాబ్దపు గ్రాండ్ కెనాల్ పై ఉన్న విలాసవంతమైన అమన్ హోటల్ లో బస చేయగా, ప్రపంచంలోని పురాతన చలనచిత్రోత్సవానికి నిలయంగా ప్రసిద్ధి చెందిన శుక్రవారం వెనిస్ సరస్సులోని ఒక ద్వీపంలో ప్రముఖ అతిథులు హాజరయ్యే విలాసవంతమైన మరియు ప్రైవేట్ వేడుకలో వెనిస్,బెజోస్, సాంచెజ్‌తో వివాహం చేసుకోనున్నారు.శాన్ గియోవన్నీ ఎవాంజెలిస్టా అనే చిన్న ద్వీపంలో ఉన్న విల్లా బాస్లిని తోటలలో గురువారం అతిథులు విందారగించారు. వివాహ వేడుక శనివారం తుది పార్టీతో ముగుస్తుంది.మరోవైపు ఇటాలియన్ మీడియా ప్రకారం, ద్వీపంలోని ఒక పెద్ద బహిరంగ యాంఫిథియేటర్ లో వివాహం జరుగుతుంది. వేడుక తర్వాత, ఈ జంటకు ప్రముఖ ఒపెరా గాయని ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి సెరినేడ్ చేస్తారని సమాచారం. ఈ వివాహ వేడుకల కోసం సాంచెజ్ 27 విభిన్న దుస్తులను సిద్ధం చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. సగం మంది ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్లు వీటిని రూపొందించారట. అంతేకాదుతమ వేడుకల్లో భాగంగా, బెజోస్ ,సాంచెజ్ నగరానికి 3.5 మిలియన్లు డాలర్లు (దాదాపు 30కోట్లు) విరాళంగా ఇస్తున్నారని వెనెటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జైయా తెలిపారు. నటాషా పూనవాలా, ఇవాంకా ట్రంప్ సందడి లవ్ బర్డ్స్ పెళ్లి సందడికోసం వెనిస్ చేరుకున్నామంటూ ఇవాంకా ట్రంప్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలోపోస్ట్ చేసింది. భారతీయ దాతృత్వవేత్త , ఫ్యాషన్ ఐకాన్ నటాషా పూనవాలా ఈ వెడ్డింగ్ బాష్‌లో అద్భుతంగా కనిపించారు. ఆమె రూపానికి ఫ్యాన్స్మాత్రమే కాదు స్వయంగా వధువు సాంచెజ్ కూడాఫిదా అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను నటాషా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. విశిష్ట అతిథులుప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖ అతిథులతోపాటు, జోర్డాన్ క్వీన్ రానియా, NFL స్టార్ టామ్ బ్రాడీ, అమెరికన్ డిజైనర్ స్పెన్సర్ ఆంట్లే, గాయని అష, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉన్నారు. వీరిని చేరవేసేందుకు మెగా యాచ్‌లు ,వెనిస్లోని మార్కో పోలో విమానాశ్రయంలో కనీసం 95 ప్రైవేట్ విమానాలు ల్యాండింగ్ అనుమతిని అభ్యర్థించాయి.'నో స్పేస్ ఫర్ బెజోస్' ఆందోళనలుఅయితే, ఈ వేడుకపై పర్యావరణవేత్తలు స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నో స్పేస్ ఫర్ బెజోస్' (బెజోస్‌కు చోటు లేదు) అనే నినాదాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కాలువలు, సెంట్రల్ వెనిస్లోని పలు పర్యాటక ప్రాంతాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.కాగా గతంలో జర్నలిస్టు, యాంకర్‌గా పనిచేసిన లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్‌లు 2018 నుంచి డేటింగ్లో ఉన్నారు. 2019లో భార్య మెకంజీ స్కాట్‌తో బెజోస్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గతేడాది లారెన్ శాంచెజ్‌తో బెజోస్ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. -
విదేశీ వంటకాలకు కేరాఫ్‌గా భాగ్యనగరం..!
భాగ్యనగరం రుచికరమైన కాంటినెంటల్ వంటకాలకు నెలవన్న విషయం విదితమే. అయితే ప్రస్తుతం నగరంలో సియోల్, బ్యాంకాక్, టోక్యో వంటి ఆసియన్ దేశాలకు చెందిన వినూత్న రుచులకు కేంద్రంగా మారుతోంది. ఇందులో భాగంగా గన్రాక్తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో తమాషా పేరుతో ఆసియన్ వెజ్ కెఫేలు నగరంలోని ఫుడ్ లవర్స్‌కు సరికొత్త రుచులను అందిస్తున్నాయి. ఆసియా వంటకాలకు కొత్త దిశ చూపేలా ప్రారంభమైన తమాషా 100 శాతం శాకాహారి వంటకాలతో, ఓల్డ్ స్కూల్ రెట్రో లుక్‌తో, లైవ్ మ్యూజిక్‌తో, ఓపెన్ ఎయిర్‌లో, యాంటీ ఫొటోలు తీసుకునే స్పాట్లతో ఆకర్షిస్తున్నాయి.నగరవాసులకు ప్రతిదీ వింతే.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహారం విషయంలో కొత్త వెరైటీలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా నగరంలోని ఆహార ప్రియులు కొందరు, ఆహ్లాదం కోసం కొందరు రెగ్యులర్‌గా రెస్టారెంట్లు, కెఫేలు, హోటళ్లను సందర్శిస్తుంటారు. వీరిలో కొందరు ఆకట్టుకునే వాతావరణం కోసం.. అద్భుతమైన యాంబియన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు నిర్వాహకులు కూడా కొత్త తరహా యాంబియన్స్ కోసం అన్వేషిస్తుంటారు. ఇందులో భాగంగానే నగరంలో తమాషా డిషెస్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ సందర్శకులను, ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు వివిధ దేశాలకు చెందిన వెరైటీ వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతోంది.. ముఖ్యంగా శాకాహార వంటకాలకు ప్రాముఖ్యతను ఇస్తూ.. సియోల్, బ్యాంకాక్, టోక్యో దేశాల ఆహారాలను వండి వడ్డిస్తున్నారు. నోస్టాల్జిక్ అనుభూతి.. అయితే ఈ కెఫే విశిష్టత కేవలం ఆహారంలోనే కాదు –యాంబియన్స్లోనూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వింటేజ్ టీవీలు, బుక్‌షెల్ఫ్‌లు, గిటార్లు, బ్యాంబూ లైట్స్, ఆర్టిస్టిక్ కార్నర్లు.. ప్రతి మూల కూడా ఇన్‌స్టా మెంట్!, స్టేజిపై లైవ్ మ్యూజిక్ వింటూ, వెనక నోస్టాలజిక్ వీడియోలు చూసే అనుభవాన్ని విభిన్నమైన తరహాలో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఈ మధ్య కాలంలో ఆదరణ పొందుతున్న పికిల్ బాల్ కోర్ట్ కూడా ఉండటం విశేషం! ఇదొక భావోద్వేగం.. ఇది కేవలం కెఫే కాదు– ఒక భావోద్వేగం. మేము మళ్లీ భౌతికంగా అనుసంధానం కావడానికి అనువైన వాతావరణాన్ని ఆహారంతో ముడిపెట్టే ప్రదేశాన్ని సృష్టించాలనుకున్నాం. – ఏకె.సోలంకీ, తమాషా కో–ఫౌండర్ గ్రీన్ థాయ్ మొదలు జైన్ వరకు.. కోరియన్ చిల్లీ టోఫూ నుంచి జపనీస్ కాటేజ్ చీజ్ కాట్సు వరకు, గ్రీన్ థాయ్ కర్రీ నుంచి కిమ్చీ పిజ్జా వరకు – ప్రతి ఐటమ్లోనూ కొత్తదనం, ఆరోగ్యం, ఆసియన్ స్పైసీ టచ్ ఉండేలా చూస్తున్నారు. వెజ్జీ థిన్ క్రస్ట్ పిజ్జా, రోస్ కూలర్, క్యూకంబర్ ఫిజ్ వంటి పానీయాలు, థాయ్ మాంగో స్టికీ రైస్ వంటి డెజర్ట్స్‌తో వావ్ అనిపిస్తున్నాయి. జైన్ భోజనాన్ని కోరేవారికీ ప్రత్యేక ఐటమ్స్ సిద్ధంగా ఉన్నాయి. -
'అమేయ డబ్లి' పాన్ ఇండియా టూర్.
ప్రముఖ పాన్ ఇండియా సింగర్ అమేయ డబ్లి తన స్వర మాధుర్యంతో నగరంలో సందడి చేయనున్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంగీత కచేరీలు, ప్రదర్శనలు చేసిన అమేయ డబ్లి ఈ నెల 28న నగరంలోని శిల్పకళావేదికగా లైవ్ కాన్సర్ట్‌తో సంగీత ప్రియులను అలరించనున్నారు. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పాన్ ఇండియా కృష్ణా టూర్’లో భాగంగా హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని 11 నగరాల్లో ఈ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ మ్యూజికల్ టూర్ కృష్ణునిపై మాత్రమే సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల సన్నాహక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ‘సాక్షి’తో ముచ్చటించారు.. ఆ విశేషాలు.. టాలీవుడ్ స్టార్ రాణా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి మొదలు కపూర్ ఖండన్, రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, జిందాల్ కుటుంబం, ఇమామి గ్రూప్‌లోని అగర్వాల్ కుటుంబం, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వంటి లగ్జరీ వేడుకల్లో పాడిన డబ్లి మొదటి సారి నగరంలో సంగీత ప్రదర్శన చేపట్టడం విశేషం. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సంగీతం ఒక సాంత్వన, పాటలు ఒక సంతృప్తి..!! నా ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఈ సారి వినూత్నంగా కృష్ణుని ఇతివృత్తంతో ఈ పాన్ ఇండియా టూర్ చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా సామాజిక బాధ్యతగా నా సంపాదనలో 25 నుంచి 50 శాతం వరకూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాను. ఇందులో భాగంగానే ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ టూర్‌ను జైపూర్, జోద్పూర్, సూరత్, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. ప్రదర్శనలో 25 శాతం వారికే.. దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్మీ కోసం ప్రత్యేకంగా సంగీత ప్రదర్శనలిచ్చాను. అంతేకాకుండా నా ప్రతి ప్రదర్శనలో 25 శాతం సీట్లు ఆర్మీ వారి కోసం ఉచితంగా కేటాయిస్తాను.. ఈ ఆనవాయితి నగరంలోని ప్రదర్శనలో కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శన కోసం మొదటిసారి తెలుగు పాటను కూడా పాడబోతున్నా. అనాది నుంచి హైదరాబాద్‌కు సంగీతానికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి సంగీత ప్రియుల గురించి దేశవ్యాప్తంగా తెలుసు. 16 మంది ప్రముఖ సంగీత విద్వాంసులు, ఐదుగురు ప్రముఖ సింగర్లు.. మొత్తం నాతో పాటు 25 మంది భారీ బృందంతో ఈ ప్రతిష్టాత్మక కచేరీ హైదరాబాద్ నగరాన్ని సంగీత సాగరంలో ముంచెత్తనుంది. – సింగర్ అమేయ డబ్లి -
ఈ అందాల భామలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్..!
బాలీవుడ్‌ని సినిమాల గురించి మాత్రమే కాదు, నవతరం బ్యూటీలు చేస్తున్న బోల్డ్ ఫ్యాషన్ ప్రోగ్రెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ యువ నటీమణులు తమ సినిమా పాత్రలతోనే కాదు ఫ్యాషన్‌లో ఇంటర్నేషల్ స్టైల్‌ను కూడా నిర్దేశిస్తున్నారు .ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి లగ్జరీ బ్రాండ్లతో జత కట్టి, ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. ఖుషీ కపూర్ఖుషీ కపూర్ బాలీవుడ్ ఫ్యాషన్‌లో మరో వర్ధమాన తార. ఆమె ఫ్యాషన్‌లో చేసే ప్రయోగాలు విరివిగా మనకు కనిపిస్తుంటాయి. ఆమె తాజా ఎంపిక డియోర్ బార్బీకోర్ పింక్ కలర్ స్కర్ట్ సూట్. డ్రెస్సింగ్ సాధారణంగా ఉన్నప్పటికీ ఆమె దానిని సిగ్నేచర్ డియోర్ వైట్ పెర్ల్ నెక్లెస్, బ్లాక్ పెండెంట్, మినీ హ్యాండ్‌బ్యాగ్‌తో హైలైట్ చేసింది.అనన్య పాండేమిడి స్టైలింగ్‌పై అనన్య పాండే ఆలోచన ప్రపంచ ఫ్యాషన్ సెన్సిబిలిటీలపై ఆమెకున్న పట్టును ప్రదర్శిస్తుంది. లగ్జరీ బ్రాండ్ చానెల్ మ్యూజ్ స్కర్ట్, జాకెట్ రెండూ ఆమెను హై–ఫ్యాషన్‌తో ఆకట్టుకునేలా మార్చాయి. మెరిసే, స్ట్రాపీ హీల్స్‌తో లుక్‌ను పూర్తి చేసింది. మానుషి చిల్లర్మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ సోషల్ మీడియాలో యంగ్ వరల్డ్‌కి ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పవచ్చు. ఆమె ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్ అనుభవం తన డ్రెస్సింగ్ స్టైల్లోనూ ప్రతిబింబిస్తుంది. మిడి స్టైలింగ్‌తో అద్భుతమైన లుక్‌లో ఆకట్టుకుంటుంది. స్లీవ్‌లెస్ బ్లాక్ పెప్లం టాప్‌కి తెల్లటి మినీ స్కర్ట్‌తో జత చేసింది. ΄ాయింటెడ్ హీల్స్, స్టేట్మెంట్ బ్యాగ్‌తో లుక్‌ను పూర్తి చేస్తూ, లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్‌ను తల నుండి కాలి వరకు స్టైల్ చేసింది.జాన్వీ కపూర్జాన్వీ డ్రెస్సింగ్ స్టైల్ నిరంతరం చర్చనీయాంశంగా ఉంటోంది. ఆమె ఇటీవలి మియు మియు లుక్ చూస్తే మన స్కూల్ రోజులు గుర్తుకు వస్తాయి. జాన్వీ ఇటీవల కాన్స్‌లో పాల్గొనడానికి సోదరి రియా కపూర్ స్లీవ్‌లెస్ మ్యాచింగ్ వైట్ నిట్ టాప్‌తో జత చేసిన తెల్లని నిట్ మినీ స్కర్ట్‌తో స్టైలింగ్ చేసింది. బ్లూ కలర్ చెక్స్ షర్ట్‌తో లుక్‌ను లేయర్‌గా అలంకరించి, దానిపైన లాంగ్ స్లీవ్స్‌తో ఉన్న బ్రౌన్ కలర్ చెక్స్ జాకెట్‌తో మ్యాచ్ చేసింది. ఇది రిలాక్స్ వైబ్‌ను సృష్టిస్తుంది. తమ డ్రెస్సింగ్ స్టైల్‌తోనే కాన్ఫిడెన్స్‌ను చూపుతున్న ఈ తారలు నవతరానికి ఇంటర్నేషనల్ ఐకాన్స్‌గా మారుతున్నారు. -
ఏఐ మాయ: తల్లి ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం..!
తనను తల్లి హగ్ చేసుకున్న చిన్నప్పటి ఫోటోను ఏఐ వీడియో క్లిప్‌గా మార్చి షేర్ చేశాడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘రెడిట్’ కో–ఫౌండర్ ఎలెక్సిస్ ఒహానియన్. సోషల్ మీడియాలో ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా విమర్శలు కూడా వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’ అని కొద్దిమంది విమర్శించారు. దీనికి సంబంధించి ఒహానియన్ వివరణ ఇచ్చాడు. ‘ఇరవై సంవత్సరాల క్రితం అమ్మ నాకు దూరమైంది. నా దగ్గర అమ్మకు సంబంధించిన వీడియోలు లేవు. అందుకే ఈ ఏఐ వీడియో క్రియేట్ చేయాల్సి వచ్చింది. Damn, I wasn't ready for how this would feel. We didn't have a camcorder, so there's no video of me with my mom. I dropped one of my favorite photos of us in midjourney as 'starting frame for an AI video' and wow... This is how she hugged me. I've rewatched it 50 times. pic.twitter.com/n2jNwdCkxF— Alexis Ohanian 🗽 (@alexisohanian) June 22, 2025 (చదవండి: బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..)ఈ వీడియో క్లిప్‌ను 50 సార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒహానియన్. ఈ వీడియో క్లిప్‌కు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’లాంటి విమర్శలను పక్కన పెడితే, ఒక ఫోటోగ్రాఫ్‌ను జీవం ఉట్టిపడే వీడియోగా మార్చిన సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ‘భేష్’ అంటున్నారు. (చదవండి: మూత్రంతో మరీ ఇలానా..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
మ్యారేజీ ఎంట్రీకి ఏజ్ ఏంటి?
పెళ్లికి అర్హతను నిర్ణయించేది అబ్బాయికైతే కొలువు .. అమ్మాయికైతే వయసు! ఉద్యోగం వస్తే అబ్బాయి స్థిరపడినట్టు.. ఇరవై ఏళ్లు నిండితే అమ్మాయి పెళ్లితో స్థిరపడాలన్నట్టు! ఇవి పెళ్లికి సంబంధించిన సామాజిక ప్రమాణాలు.. సాంస్కృతిక కట్టుబాట్లూనూ! పెళ్లి వ్యక్తిగత నిర్ణయం. మానసిక పరిణతి, సంసిద్ధత, ఆర్థిక స్వాతంత్య్రమే దానికి అర్హతలు ఎవరికైనా అంటున్నారు నేటి తరం వనితలు! ఆ చర్చే నేటి కథనం..అనూష (పేరు మార్చాం)కు 30 ఏళ్లు. ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసింది. మంచి కంపెనీలోనే ఉద్యోగం. నచ్చిన కారు కొనుక్కుంది. దేశ, విదేశాలు తిరుగుతూ ప్రపంచాన్ని ఎక్స్΄్లోర్ చేస్తోంది. త్వరలోనే ఫ్లాట్ కొనుక్కోవాలనే ప్లాన్‌లోనూ ఉంది. తోటివాళ్లంతా అబ్బాయిలు సహా.. ఆమెను ఓ అచీవర్‌గా చూస్తుంటారు.. ఇన్స్పైర్ అవుతుంటారు. కానీ అనూష తల్లిదండ్రులే దిగులుపడుతూ ఉంటారు. 30 ఏళ్లు వచ్చినా పెళ్లిపేరు ఎత్తట్లేదని, అసలు పెళ్లి ఊసు ప్రస్తావించినా మండిపడుతోందని. బంధువుల పెళ్లిళ్లకు వెళితే ఆ తల్లిదండ్రులను ప్రశ్నలతో ముంచేస్తున్నారు అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరా? వయసు మీద పడుతుంటే అమ్మాయిలు లావైపోతారు, ముందుముందు సంతానం కష్టమవుతుంది, అసలు కలగకపోనూ వచ్చు– అంటూ లేని భయాలను సృష్టిస్తున్నారు. అదంతా అమ్మాయి మీద ఒత్తిడిగా మారుతోంది.. ‘నీ తోటి వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిపోతున్నారు.. నువ్వేమో ఇల్లు కొనాలి, దేశాలు తిరగాలని ఊరేగుతున్నావ్’ అంటూ! ఇది నసలా అనిపించడంతో అనూష.. అమ్మానాన్నల దగ్గరకు రావడమే మానేసింది. ఇక్కడ అనూష ఒక ఉదాహరణ మాత్రమే! అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న అమ్మాయిలు ప్రతి ఇంట్లో ఉంటున్నారు. జీవితంలో సెటిల్ అవడం అంటే అబ్బాయిలకు ఎలాంటి నిర్వచనం ఉందో అమ్మాయిలకూ అలాంటి నిర్వచనమే ఉండాలని కోరుకుంటున్నారు. ఉద్యోగం వచ్చాక కూడా అబ్బాయిలు ఆర్థికంగా స్థిరపడటానికి టైమ్ ఎలా ఇస్తున్నారో అమ్మాయిలకూ ఆ సడలింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు.నిజమే కదా.. చదువు విషయంలో అమ్మాయిలకు అవకాశాలిస్తూ.. బాగా చదివేలా ఇటు కుటుంబాలు, అటు ప్రభుత్వాలూ వాళ్లను ప్రోత్సహిస్తూ మంచి ప్రయత్నానికి నాంది పలికారు. ఇప్పుడా ప్రయత్నం ఫలితాలనిస్తోంది అన్ని రంగాల్లో ఆడవాళ్ల ఉనికి చూపుతూ! మొదలుపెట్టాక గమ్యం చేరాలి కదా! ఆ ప్రయాణంలోనే ఉన్నారు నేటి అమ్మాయిలు. వాళ్లనుకున్న గమ్యం లేదా అచీవ్మెంట్ను సాధించే వరకు వేచి చూడమంటున్నారు. ఆ టైమ్ ఇవ్వమంటున్నారు. పెళ్లిని తమ జీవితాలకు పరమావధిగా చూ పొద్దంటున్నారు.. దానికిమించిన ఆలోచనలు, కార్యాచరణతో ముందుకుసాగుతున్న వాళ్లను మూడుముళ్లతో ఆ పొద్దంటున్నారు. అలాగని వాళ్లు పెళ్లిని వ్యతిరేకించడం లేదు. పెళ్లికి వయసుతో ముడిపెట్టిన సాంస్కృతిక కట్టుబాటును సవాల్ చేస్తున్నారు. వాళ్లు పెళ్లికన్నా తమ ఉద్యోగోన్నతి, మానసిక, భావోద్వేగాల పరిణతి, ఆర్థిక స్వాతంత్య్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్లికి వయసు కన్నా మానసిక, ఆర్థిక సంసిద్ధతనే ప్రామాణికంగా చూస్తున్నారు.‘ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేసుకోవాలనేది ఒక మిత్. దాన్నొక కల్చరల్ ఎక్స్పెక్టేషన్లాగే భావిస్తున్నాం మ్యారేజ్ అనేది పర్సనల్ చాయిస్. ఎప్పుడు చేసుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయం. ఇంకా చె΄్పాలంటే పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం కానీ అదే జీవితం కాదు. అరే.. జీవితంలో సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచం చూడండి ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో.. దాంతో పోటీ పడాలి కదా!’ అంటోంది హైదరాబాద్‌కు చెందిన ఒక బిజినెస్ ఎనలిస్ట్.మరి బయోలాజికల్ క్లాక్ మాటేమిటి? ‘పిల్లలకేం అలాగే అంటారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు ఊరికే అన్నారా? పెళ్లి సరైన వయసులో అయితేనే సంతానం కలుగుతుంది. లేకపోతే కనపడ్డ చెట్టు, పుట్టలకు మొక్కినా పిల్లలు పుట్టరు’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ‘అన్యాయం.. ఇలాంటి ఒత్తిళ్లతో అమ్మాయిలను అగౌరవ పరచకూడదు. అమ్మాయి విలువను పెంచేది ఆమె అమ్మ అవడం ఒక్కటే కాదుకదా!’ అని నొచ్చుకుంటున్నారు స్త్రీ వాదులు, సామాజిక విశ్లేషకులు. ‘బయోలాజికల్ క్లాక్ అనేది ఇదివరకటి మాట. ఇది కూడా ఒకరకమైన కల్చరల్ ఎక్స్పెక్టేషనే. సైన్స్ చాలా డెవలప్ అయింది. ఎగ్ ఫ్రీజింగ్ బ్యాంక్‌లు, ఆంబ్రియో ప్రిజర్వింగ్ సెంటర్సే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు. అవీ వీలుకాకపోతే దత్తత చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇన్ని ప్రత్నామ్యాయాల మధ్య కూడా బయోలాజికల్ క్లాక్ గురించిన భయం, సుదీర్ఘ చర్చ అవసరమా?’ అంటున్నారు ఇంకొంతమంది అమ్మాయిలు. వీటన్నిటినీ అర్థం చేసుకోవాల్సింది కుటుంబాలే! అమ్మాయిలకూ చదువు, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని వాళ్ల ఆశలకు రెక్కలు తొడిగినప్పుడు ఎగిరే స్పేస్‌నూ ఇవ్వాలి. పెళ్లి విషయంలో వాళ్ల నిర్ణయాలను గౌరవించాలి. వాళ్ల ఆలోచనలను అంగీకరించి తదనుగుణంగా ఇంటి ‘లా’ను మార్చాలి అని చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఊహకందనంతగా సైన్స్ తద్వారా వైద్యరంగంలో మార్పులొస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఎగ్ ఫ్రీజింగ్. అమ్మాయిలు పొటెన్షియల్ ఏజ్‌లో అండాలను ప్రిజర్వ్ చేసుకోవడమన్నమాట. ఇది.. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉన్న విమెన్‌కి వరం లాంటిది. ఒకరకంగా చె΄్పాలంటే రి్ర పొడక్టివ్ చాయిస్‌ని మహిళలు తమ నియంత్రణలో ఉంచుకోవడమన్నమాట. పెళ్లి, పిల్లలతో కెరీర్‌కి బ్రేక్ పడకుండా నేటి అమ్మాయిలకు యూజ్‌ఫుల్‌గా ఉంటోందీ ప్రక్రియ. దీనివల్ల వయసు అయిపోతోంది పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉండొచ్చు వంటి భయాలకు చోటు లేదు. అంటే బయోలాజికల్ క్లాక్ ప్రెజర్ లేకుండా జీవితంలో వాళ్లనుకున్న లక్ష్యాల మీద మనసు పెట్టే వీలును కల్పిస్తుందిది. అంతేకాదు కెరీర్లో, పర్సనల్ చాయిసెస్‌లో జెండర్ ఈక్వాలిటీనీ సపోర్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రతికూల ప్రభావాలూ లేకపోలేదు. – డాక్టర్ ఆకుల దివ్య, ఎమ్‌డి, హైదరాబాద్ – సరస్వతి రమ -
అమ్మా,నాన్నా ప్రేమ కావాలి లేదంటే మానసిక ఒత్తిడితో అనర్థాలు
జిల్లాలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమ పిల్లలను విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప వంటి నగరాల్లోని కార్పొరేట్, రెసిడెన్షియల్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. అక్కడ హాస్టళ్లలో ఉండలేక చాలా మంది ఇంటి బాటపడుతున్నారు. మరి కొందరు తల్లిదండ్రులు బలవంతంగా అక్కడే ఉండమని నచ్చచెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఒంటరితనంతో నిత్యం మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎదురవుతున్నాయి. ‘అమ్మా, నాన్న నేను ఇంటిలో ఉండి చదువుకుంటాను. ఇంట్లో వాళ్లను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. చదువు పేరుతో నన్ను ఇంటి నుంచి దూరం చేయాలని చూడవద్దు. నాకు మీ ప్రేమానురాగాలు కావాలి. బాగా చదువుకుని టీచరై పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతాను’ ఓ కుమార్తె అభ్యర్థన. నువ్వు హాస్టల్లో ఉండి చదవాల్సిందే. మంచి మార్కులు, ర్యాంకులు సాధించి డాక్టర్ కావాలి. తల్లిదండ్రుల సమాధానం. ఇదీ నేడు కొందరు తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరు. పిల్లల ఆలోచన, వారి అభిరుచులకు భిన్నంగా స్పందిస్తున్న విధానం. దీంతో పిల్లలు ఒంటరిగా హాస్టళ్లలో ఉండలేకపోతున్నారు. కొందరు ఆత్మన్యూనతా భావంతో పెరిగి పెద్దవారై ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు.మదనపల్లె సిటీ: బాల్యం పిల్లలకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల ప్రేమానురాగాల మధ్య ఆడుతూ పాడుతూ, చిరునవ్వులు చిందిస్తూ బాల్యాన్ని ఆస్వాదించాలి. అప్పుడే బాల్యానికి సాకారం. ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం కుటుంబం నుంచి రావాలి. నేటి పోటీ ప్రపంచం, ప్రపంచీకరణ నేపథ్యంలో కొందరు తల్లిదండ్రులు పిల్లల బాల్యాన్ని హరిస్తూ యాంత్రిక జీవనానికి అలవాటు చేస్తున్నారు. బాల్యంలోని మధురానుభూతులకు దూరం చేస్తున్నారు. పిల్లలను మార్కులు, ర్యాంకులను తయారు చేసే యంత్రాలుగా చేస్తున్నారు. దీని కోసం వారి ఇంటి నుంచి దూరంగా కార్పొరేట్ పాఠశాలల్లో బలవంతంగా చేర్పిస్తున్నారు. పాఠశాల స్నేహితుల సాన్నిహిత్యం ఉన్నా అమ్మ పంచే ప్రేమకు ఏదీ సాటిరాదు. నాన్న చూపే ఆదరణ ఏవీ సరితూగవు. దీంతో పిల్లలు తమలో తాము సంఘర్షణ పడుతూ జీవితాన్ని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ మార్కులు, ర్యాంకులే కాకుండా వారి కోసం కాస్త సమయాన్ని కూడా కేటాయించి ప్రేమను పంచాలని పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని మనోవ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా అంటున్నారు. లేనిపక్షంలో పిల్లల్లో భావవ్యక్తీకరణ నైపుణ్యం తగ్గడంతో పాటు అభద్రతా భావం పెరుగుతుందని చెబుతున్నారు. కౌమార దశలోని పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమానురాగాలు లభించకపోతే వారిలో మానసిక రుగ్మతలు చోటు చేసుకుంటాయని వెల్లడిస్తున్నారు. ఆయా వయస్సులో వచ్చే శారీరక, మానసిక మార్పులను సరిచేయక, సరైన మార్గదర్శనం చేయకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని సూచిస్తున్నారు. కొందరు పిల్లలు తప్పటడుగులు వేసే ప్రమాదం కూడా లేకపోలేనది హెచ్చరిస్తున్నారు. మరికొందరైతే ఏ చిన్న సమస్య ఎదురైనా అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.కనుమరుగవుతున్నఉమ్మడి కుటుంబ వ్యవస్థగతంలో అవ్వా,తాతలు, అమ్మానాన్నలు, చిన్నాన్న, పెద్దనాన్న, వారి పిల్లలతో కూడిన ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కాలానుగుణంగా చోటు చేసుకుంటున్న మార్పులతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. నేటి కొందరు తల్లిదండ్రుల ఆలోచనా విధానంతో కనీసం కన్న బిడ్డలతో కూడిన సమిష్టి కుటుంబ వ్యవస్థ కూడా మాయమైపోతోంది. పిల్లలను వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి ఒంటరి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సమాజంలో అనుబంధం, ప్రేమ, వాత్సల్యం అనే పదాలకు అర్థాలు కూడా మరచిపోతున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ యాప్స్ బంద్, జీపే కూడా తీసేసా: సానియా మీర్జా సోదరి సంచలన పోస్ట్తల్లిదండ్రుల ధోరణి మారాలిఆధునిక జీవన విధానంలో అమ్మానాన్నల ఆలోచనా ధోరణి మారాలి. శారీరక, మానసిక పెరుగుదల వేగంగా జరిగే కౌ మార దశలో పిల్లలకు కుటుంబంలోని ప్రత్యక్షానుభవాలు ఎంతో అవసరం. ఈ దశలో పిల్లలు ఎదుర్కొనే సంఘర్షణలను అమ్మానాన్నలు మాత్రమే అర్థం చేసుకోగలరు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి.. ప్రేమానురాగాలు పంచాలి. –ఎస్.రెడ్డప్పరెడ్డి, అధ్యాపకులు, బాలికల జూనియర్ కాలేజీ, మదనపల్లెచదవండి: మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే! తల్లిదండ్రుల అనురాగం అవసరంబాల్యంలో చిన్నపిల్లలకు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు చాలా అవసరం. తల్లిదండ్రు లు ఎంత ఉద్యోగులైనా పిల్లల కోసం రోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండేలా చూడాలి. చదువంటే మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదనే విషయాన్ని గ్రహించాలి. పిల్లల అభిరుచి మేరకు వారిని ఎదగనివ్వాలి. వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి. - టీఎఎస్ఏ క్రిష్ణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, మదనపల్లెమానసిక ఒత్తిడితో అనర్థాలు..చిన్నప్పటి నుంచే పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైతే మానసిక ఒత్తిడి పెరిగి అనేక అనర్థాలకు దారి తీస్తాయి. ఆస్పత్రులకు వైద్య పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల్లో అనేక మంది మానసిక ఒత్తిడితో పాటు మనోవేదనకు గురైన వారే ఉంటున్నారు. ఇంటికి, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందున ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పోషక విలువలు కలిగిన ఆహారం అందకపోవడంతో వ్యాధులకు గురవుతున్నారు.– చాముండేశ్వరి, సైకాలజిస్టు, మదనపల్లె -
Urine Eye Wash: ప్లీజ్ అలా చెయ్యొద్దు..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల ఇన్‌స్టా రీల్స్ పిచ్చి మాములుగా లేదు కొందరికి. అందుకోసం వాళ్లు చేసే పిచ్చి చేష్టలకు అంతుపొంతు లేకుండాపోతోంది. అది సరైనదా? కాదా..? అన్నది అనవసరం. సోషల్ మీడియా క్రేజ్, ఆ కంటెంట్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయ్ అన్నదే ధ్యేయం. కానీ వీటిని స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి ఇబ్బందులు పడుతున్న అభాగ్యులెందరో ఉన్నారు. ప్రస్తుతం తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆ వీడియోని చూసి వైద్యులే కంగుతిన్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి అని హెచ్చరిస్తునన్నారు. అసలేం జరిగిందంటే.. పూణెకు చెందిన నుపుర్ పిట్టీ అనే మహిళ వైరల్ వీడియోలో తనను "మెడిసిన్-ఫ్రీ లైఫ్ కోచ్"గా పరిచయం చేసుకుంటూ "యూరిన్ ఐ వాష్ " గురించి వివరించింది. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధం అంటూ..మూత్రం కళ్లను శుభ్రం చేసుకుంటూ కనిపించింది వీడియోలో. మన మూత్రంతో ఇలా కళ్లను వాష్ చేసుకుంటే..డ్రైగా మారడం, ఎరుపెక్కడం వంటి కంటి సమస్యలు రావని ఆరోగ్య సలహాలు కూడా ఇచ్చేసింది. అయితే ఈ వీడియోపై వైద్య నిపుణులు తీవ్రంగా స్పందించడమే గాక మండిపట్టారు. ప్రజల ఆరోగ్యంతో ఇలా చెలగాటం ఆడటం మంచిద కాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రక్రియలు ప్రమాదకరమైనవని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. మూత్రంతో ఇలా అస్సలు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు కూడా.ఎందుకు మంచిది కాదంటే..నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రాన్ని తాగడం లేదా ఉపయోగించటం అనేది ఆరోగ్యానికి మంచిదని శాస్త్రీయంగా ఎక్కడ నిరూపితం కాలేదు. “యూరిన్ థెరపీ“కి సంబంధించి వైద్యపరమైన ఆధారాలు కూడా లేవు. మూత్రంలో చాలా తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నప్పటికీ ఏవిధమైన ఆరోగ్య ప్రయోజనాలను అందివ్వదు. అందులో శరీరానికి అవసరం లేని ద్రవం, శరీరంలోని వ్యర్థాలనను తొలగించిన ద్రవమే మూత్రం. మూత్రపిండాలు రక్తప్రవాహం నుంచి అదనపు నీటిని సెల్యులార్ వ్యర్థాలను బయటకు పంపించే ఉత్పత్తి ఇది. దీనిలో 90 శాతం నీరు ఉండగా, మిగిలిన భాగం అమ్మోనియా వంటి ఇతర లవణాలు ఉంటాయి. అంతేగాదు మూత్రపిండాల అనే రెండు కండరాల గొట్టలు ద్వారా మూత్రాశయానికి మూత్రాన్ని పంపుతాయి. మూత్రాశయం నిండినప్పుడు, నరాల చివరలు మెదడుకు బాత్రూమ్కి వెళ్లమని సంకేతమిస్తాయి. దాంతో మూత్రనాళం అనే చిన్నగొట్టం సాయంతో విసర్జిస్తాం. అదీగాక ఈ మూత్రనాళం కొన్ని రకాల బ్యాక్టీరియాలకు నిలయం.అందువల్ల మూత్రం శుభ్రమైనద కాదు. శరీరం వదిలించుకున్న ఈ వ్యర్థ ద్రవం తిరిగి శరీరంలోకి పంపిస్తే..హనికరమైన బ్యాక్టీరియాకు గురై లేనిపోని వ్యాధులు బారినపడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. Please don't put your urine inside your eyes. Urine is not sterile. Boomer aunties trying to be cool on Instagram is depressing...and terrifying.Source: https://t.co/SQ5cmpSOfY pic.twitter.com/qgryL9YHfI— TheLiverDoc (@theliverdr) June 25, 2025 (చదవండి: ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..) -
ధర్మ సందేహాలు: అయిదో తనమంటే..?
కొన్ని ఆచార వ్యవహారాలు నేటి యువతకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఒకవేళ ఇలా చేయకూడదని హిత భోద చేసినా..ఏంటిది అని చాదస్తం అన్నట్లుగా విసుక్కుంటారు. అయితే వాళ్లు చెప్పే వాటికి నిగూఢ అర్థాలతోపాటు సమాజ హితం కూడా ఉంది. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!. అయిదో తనమంటే ?ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకుండరాదు?ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీమీద కామం కలుగుతుంది. తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు కూడా ఆహ్వానమే. (చదవండి: సంబురాలు మొదలాయె..! తొలి బోనం ఎప్పుడంటే..) -
ఆ తప్పిదాలతో 116 కిలోల బరువు..కానీ 13 నెలల్లో ఏకంగా..!
వెయిట్ లాస్ జర్నీలలో చాలామంది తమ కిష్టమైన హాబీలతోనూ..ఇతరులను స్ఫూర్తిగా చేసుకుని తగ్గారు. కొందరూ ప్రోటీన్ డైట్ ఫాలో అయితే..మరికొందరు అనారోగ్య భయంతో బరువు తగ్గారు. కానీ ఈ న్యూట్రిషన్ కోచ్ తాను ఎందువల్ల బరువు పెరిగానో కారణాలను విశ్లేషించి ఆ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ బరువు తగ్గింది. పైగా తనలా ఎవ్వరూ ఆ తప్పులు చెయ్యొద్దని, దాని వల్ల కలిగే అనర్థాలేంటో వివరిస్తూ..ప్రేరణగా నిలిచింది. ఆమె కొన్ని నెల్లల్లోనే స్లిమ్‌గా మారి బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదని నిరూపించింది. ISS సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్ కోచ్ రక్షా భలవి ఒకప్పుడామె దాదాపు వంద కిలోలు పైనే బరువు ఉండేది. ఊబకాయం సమస్యతో చర్మం, జుట్టు, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం ఆమెకున్న జంక్‌ఫుడ్ వ్యనసం. దాదాపు ప్రతిరోజు చిప్స్, చాక్లెట్లు లేకుండా ఆమె రోజు ఉండేది కాదు. అలా ఆమె 116 కిలోలు బరువుతో ఇబ్బందులు పడింది. తన ఆకృతి కారణంగా ఎదుర్కొన్న బాడీ షేమింగ్లు, మరోవైపు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలతో బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యింది. ఎలాంటి క్రాష్డైట్లు జోలికిపోకుండా పోషకాహారం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. ముందుగా ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ.. తన బరువులో వస్తున్న మార్పులను గమనించింది. అలాగే తాను స్కూల్ డేస్‌లో మధ్యాహ్న భోజనానికి పరాఠాలు తినడంతో ఎలా తాను బరువు పెరిగింది అర్థం చేసుకుంది. దానిలో ఉండే అధిక కార్బ్, అధిక కొవ్వు గలిగిన ఆహారం బొడ్డు కొవ్వుకు కారణమవుతుందని తెలుసుకుంది. అందుకనే తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంది. సమతుల్య ఆహారాలకే పెద్దపీటవేసి..ఫైబర్ కోసం పండ్లు, ప్రోటీన్ కోసం గుడ్లు లేదా పనీర్, కార్బ్ల కోసం గోధుమ రోటీ లేదా బ్రెడ్ వంటివి తీసుకునేది. అలాగే తాను చదువుతున్నప్పుడూ బాగా ఒత్తిడికి గురయ్యేది. అందువల్ల తాను తెలియకుండా ఎలా ఎక్కువగా ఫుడ్ తీసుకుందో కూడా చెప్పుకొచ్చింది రక్ష. అలాగే అధిక ఉప్పు, చక్కెరతో ఉండే స్నాక్స్‌కి దూరంగా ఉండేది. వాటి బదులు మఖానా, తాజా పండ్లతో స్నాక్స్‌ని భర్తీ చేసింది. అలాగే రోజంతా శారీరక శ్రమ లేకుండా ఉండటాన్ని నివారించింది. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని.. ఆటలు లేదా వ్యాయామాలకు సమయం కేటాయిస్తూ..మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చూసుకునేది. చివరగా తాను చెడ్డ ఆహారపు అలవాట్ల వల్లే బరువు పెరుగుతున్నానని చాలా ఆలస్యంగా గ్రహించానని, తనలా మరెవ్వరూ చెయ్యొద్దని సూచిస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తి శాకాహారి. అలాగే తన డైట్‌ప్లాన్‌ని కూడా షేర్ చేసుకున్నారామె.(చదవండి: Nozempic Diet: 130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్‌చేస్తే..)ఆ కోచ్ ఏమి తీసుకునేదంటే..ఉదయం: చియా సీడ్ నీరువ్యాయామం చేయడానికి ముందు: 7 నానబెట్టిన బాదం, 10 గ్రా వేరుశెనగ వ్యాయామం తర్వాత: ప్రోటీన్ పౌడర్ పానీయం (1 స్కూప్), 1 గిన్నె మస్క్మెలోన్ భోజనం: స్టైర్-ఫ్రైడ్ క్యాప్సికమ్‌తో గిన్నె క్వినోవా టోఫురాత్రి భోజనం: 2 బేసన్ చీలాస్, 1 కప్పు పప్పు, 100 గ్రా క్యాబేజీ సబ్జీ, 1 ప్లేట్ దోసకాయ-క్యారెట్ సలాడ్, 30 గ్రా కాల్చిన సోయా ముక్కలు View this post on Instagram A post shared by Raksha Bhalavi | Nutrition & Weight Loss Coach (@fitwithraksha_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!) -
ఆ చెప్పులు మన వారసత్వ కళ..ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఏకంగా..!
మనవాళ్లు ఎప్పుడో కళాత్మకంగా రూపొందించినవి కొన్ని రకా ఫ్యాషన్ బ్రాండ్లు కాపీ కొట్టేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ధర నిర్ణయిస్తుంటే కళ్లప్పగించి చూస్తుంటాం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వ కళ అని గుర్తుకు రాదు. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అనగానే..డబ్బులు వెచ్చించేయడమే గానీ..అదేంటని నిశితంగా ఆలోచించేవారే కరువు. అందువల్లే కాబోలు ప్రముఖ లగ్జరీ బ్రాండ్లు మన ఆర్ట్‌ని సులభంగా కాపీ కొట్టేస్తున్నాయి. అచ్చం అలానే ఓ దిగ్గజ ఇటలీ ఫ్యాషన్ బ్రాండ్ ఎంత పనిచేసిందో వింటే విస్తుపోతారు.కొల్హాపూర్ లెదర్ చెప్పులు చాలా ప్రసిద్ధిగాంచినవి. ముఖ్యంగా పెద్దవాళ్ల హుందాతనం ఉట్టిపడేలా చేసేలా ఉంటాయి ఆ చెప్పులు. కొల్హాపురి ఫ్లాట్ చెప్పులుగా బాగా ఫేమస్. అయితే వాటిని ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రాడా సమ్మర్ 2026 56 రన్‌వే లుక్‌లలో అచ్చం మనలాంటి పాదరక్షలనే ప్రదర్శించింది. అచ్చం మన కొల్హాపురి చెప్పులు మాదిరిగా ఉన్నాయి. అయితే ఆ లగ్జరీబ్రాండ్ వాటి ధర ఏకంగా అక్షరాల రూ. 1.2 లక్షలుగా నిర్ణయించడం విశేషం. ఈ లగ్జరీ బ్రాండ్ మన వారసత్వానికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తానే డిజైన్ చేసినట్లుగా ఫోజులు కొడుతూ..అంత ఖరీదు నిర్ణయించడంతో సర్వత్రా ఆగ్రహాం వ్యక్తమైంది. నెట్టింట అందుకు సంబధించిన ఫోటోలను ఆ బ్రాండ్ వైరల్ చేయడంతో నెటిజన్లు ఇది "చప్పల్ చోరి" అంటూ తింటూపోస్తున్నారు. PRADA is selling Kolhapuri chappals for ₹1.2 lakh — a design stolen from the Chamar community of India, who’ve handcrafted them for generations. No credit. No acknowledgment. Just pure cultural theft dressed in luxury branding. Shameful. #CulturalTheft #Kolhapuri pic.twitter.com/l3ITZlGSEG— The Dalit Voice (@ambedkariteIND) June 25, 2025ఫ్యాషన్ సంస్కృతికి తప్పుడు అర్థాన్నిచ్చేలా చేసిందంటూ మండిపడుతున్నారు. కనీసం భారతీయ వారసత్వ కళను ప్రశంసిస్తూ..వాటిని ప్రదర్శించినా..మా కళ మళ్లీ పునరుజ్జీవనం చేసుకుంటుందని సంతోషించేవాళ్లం అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. కొల్హాపురి చెప్పుల చరిత్ర...12వ శతాబ్దానికి చెందిన వారసత్వ కళ. ఇది సాంప్రదాయకంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని చెప్పులు కుట్టేవారి చేతిల్లో రూపుదిద్దుకున్న కళ ఇది. ఈ కొల్హాపురి చెప్పులకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది మన భారతీయ వారసత్వంలో భాగం. ఆ కాలంలోనే మన పూర్వీకులు ధరించిన చెప్పులివి. వీటిని తయారు చేయడానికి ఆరువారాలపైనే పడుతుందట. వీటి ధర రూ. 500 నుంచి రూ. 700ల మధ్య ఉంటుందట. కాగా, దీనిపై ప్రముఖ కాలమిస్ట్ శోభా దే కూడా మండిపడ్డారు. ఈ బ్రాండ్లు మన భారతదేశాన్ని ఒక మార్కెట్‌గా చూస్తున్నాయని విమర్శించారు. ఒకరంగా ఇది చేతిపనుల నైపుణ్యాలన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే మన మూలాలను మర్చిపోకుండా గుర్తు చేసింది. ఫ్యాషన్ ట్రెండ్‌గా పరిచయం చేసిన ఈ చెప్పులు మన కళా వారసత్వానికి ప్రతీకలని గొంతెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. View this post on Instagram A post shared by Mahrukh Dar (@fashionjournalbym) (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్ : కానీ అంతలోనే!
జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం, బెంగళూరు తొక్కిసలాట, ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం.జూన్ 13న ఇంగ్లాండ్‌లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై 53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలెవరైనా ఊహిస్తారా? 40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు. ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోవడం మరింత విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు."నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్‌లో, నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నా. నా గేమ్ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్‌గా , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలను కుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.కాగా సంజయ్ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య బాలీవుడ్ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్దేవ్ కుమారిడితో పాటు, మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్ కపూర్ అంత్యక్రియలకు కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే. నోట్ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం. నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’ ఇదే కదా అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు. ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు సాగాల్సిందే. -
చినుకుల్లో హాయి..! జాగ్రత్తలు అవసరమోయి..
చిరుజల్లులలో ఏదైనా వేడి వేడి ఫుడ్ ఉంటే.. దానికి తోడు కమ్మటి వాసనతో హాట్ కాఫీ సిప్ చేస్తుంటే.. ఆ హాయి మరోలా ఉంటుంది. ఇలాంటి అనుభూతులు నగరవాసులకు ఎన్నెన్నో.. సిటీలో చినుకులు పడుతుంటే చాలు జనం ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లపై సందడి చేస్తుంటారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఆరోగ్యం, హైజీన్, డిజిటల్ టూల్స్ వంటి అంశాలను సైతం సమానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలాన్ని సురక్షితంగా, అందంగా అనుభవించడానికి కొన్ని లైఫ్‌స్టైల్ హ్యాక్స్, గాడ్జెట్స్, యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం అనేది సహజంగా ఆనందాన్ని కలిగించేది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని, గాడ్జెట్లను, ఇంటిని, ఫ్యాషన్‌ను సమానంగా వాడుకుంటే ఈ సీజన్‌ను ఎంతో ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మోడ్రన్ లైఫ్స్టైల్లో టెక్నాలజీ సహకారంతో వర్షాకాలాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం. ఈ వానల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు పొందే ఆనందానికి బలం అవుతాయి.వర్షాకాలం హెల్త్‌కేర్ టిప్స్.. వానల సమయంలో నీటి కాలుష్యం, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సీజన్లో ఇంట్లోనే వంట చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, తులసి టీ, అల్లం–పెప్పర్ సూప్ వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాషన్‌తో పాటు ఫంక్షనాలిటీ.. వర్షాకాలం అంటే మడమ తొక్కినట్లుగా బురద, తడిగా మారే దుస్తులు.. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటర్ రిపెలెంట్ ఫ్యాబ్రిక్స్, సిలికాన్ షూ కవర్స్, ఫోల్డబుల్ రైనిక్స్ లాంటి ఉత్పత్తులతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా తడిసిపోకుండా ఉండొచ్చు. ట్రెండీ అంబ్రెల్లాస్: యాక్టివ్ కలర్స్, ఓపెన్–క్లోజ్ మెకానిజంతో అందంగా ఉండే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్స్: టెక్ లవర్స్ కోసం వర్షంలో కూడా ల్యాప్‌టాప్, గ్యాడ్జెట్లు భద్రంగా తీసుకెళ్లేందుకు ఉపయోగకరం. వాటర్‌ప్రూఫ్ ఫోన్ కవర్లు: ముఖ్యంగా రోడ్ల మీద లేదా బైక్ ప్రయాణాల్లో తప్పనిసరి. హెల్త్ మానిటరింగ్ యాప్‌లు, గాడ్జెట్స్.. ఫిట్ బిట్, ఎమ్ఐ బ్యాండ్ వంటి వేరబుల్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ చేయవచ్చు. హెల్తీ ఫై మీ వంటి డైట్ యాప్‌లు మంచి ఆహార నియమాలు పాటించేందుకు దోహదపడుతున్నాయి. ప్రాక్టో, టాటా 1 ఎంజీ వంటి యాప్‌ల ద్వారా ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.టెక్నాలజీతో వర్షాన్ని అనుభవించండి.. వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందో ముందే తెలిసిపోతే బాగుంటుందనే మాట వాస్తవమే. ఈ విషయంలో కొన్ని యాప్స్‌తో పాటు ప్రయాణించవచ్చు. ఆక్యూ వెదర్, స్కైమెట్ వెదర్, లైవ్ రడార్తో వర్ష సూచన. గూగుల్ మ్యాప్స్, మై గేట్ల టెక్నాలజీతో ట్రాఫిక్ అప్డేట్స్, లోకేషన్ ఆధారిత అలర్ట్స్. స్పాటీ ఫై, పాకెట్ ఎఫ్ఎఫ్: వానలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూర్చుని విండో వెనుకగా జల్లులు చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్. వర్షంలో ఇంటిని కాపాడండి డోర్ మ్యాట్స్, షూ స్టాండ్స్: వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు.. డీహ్యూమిడిఫైయర్స్: గదుల్లో తడిగా మారే వాతావరణం, మబ్బును నివారించేందుకు ఉపయోగపడతాయి. ఆరోమా డిఫ్యూజర్లు: తడి వాసనను తొలగించి ఫ్రెష్‌నెస్ కలిగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.విందుగా మార్చే చిట్కాలు వీకెండ్ విత్ రైన్ థీమ్: ఇంట్లో ఫ్రెండ్స్‌తో టీవీకి దగ్గరగా బీన్స్ బ్యాగ్స్, మసాలా టీ, బజ్జీలు.. ఇదే అసలైన హ్యాపీనెస్. రెయిన్ ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ: వర్షపు నీటి బిందువులు, బల్కనీ పూల మధ్య సెల్ఫీలు.. సోషల్ మీడియాకు మరిచిపోలేని అనుభూతులు. రెయిన్ ఫ్రెండ్లీ రైడ్స్: వర్షంలో బైక్ రైడ్స్, సైక్లింగ్ ట్రిప్స్ వంటి గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా వర్షాన్ని మరింత ఆస్వాదించవచ్చు. (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
మత్తు వదిలితేనే భవిత!
ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలలో ‘మాదక ద్రవ్యాల తయారీ–అక్రమ రవాణా– క్రయవిక్రయాలు–వినియోగం’ అతి ముఖ్యమైనవి. వీటిని అరికట్టడానికి వివిధ దేశాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయినా, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మనకు మిక్కిలి హాని కలిగించే కొన్ని మత్తు పదా ర్థాలను మాదకద్రవ్యాలు (డ్రగ్స్) అని వ్యవహరిస్తారు. ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించి రహస్యంగా వినియోగదారులకు అందిస్తూ డబ్బు సంపాదించడం కొందరికి లాభసాటి వ్యాపారం అయ్యింది. కానీ వాటికి అలవాటుపడిన వారు మాత్రం ఆరోగ్యం కోల్పోయి బికారులవుతున్నారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ముందే మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల పిల్లలూ వాటికి ఆకర్షితులవుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు వీటిని ఆశ్రయిస్తున్నారు. కనుచూపు మేరలో మత్తు పదార్థాలు అందుబాటులోకి రావడం, పాశ్చాత్య పోకడలు, టీవీ, సోషల్ మీడియాల ప్రభావం వల్ల యువత వీటిబారిన పడుతున్నారు. పలు జాతీయ సర్వేల ప్రకారం... మత్తు పదార్థాలు సేవించేవారిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. శారీరక సమస్యలకు తీవ్రంగా గురవుతారు. ఒత్తిడికి, మానసిక సమస్యలకు గురవుతారు. భార్యల నుండి విడాకులు కోరుతున్నారు. నేరపూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. చాలామంది లైంగిక సామర్థ్యం కుంటుపడుతోంది. స్థూలకాయం లాంటి సమస్యలతోనూ బాధ పడుతున్నారు.– డా.బి. హర్షిణిఎమ్డీ (సైకియాట్రీ), మంగళూర్, కర్ణాటక (నేడు అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినం) -
22 వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆ అందాల రాణి..!
రాజులు, రాజ్యాలు అంతరించినా వారి వారసులు , వారి కధలు మాత్రం ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ది రాయల్స్ వంటి వెబ్ సిరీస్‌ల పుణ్యమా అని రాజవంశీకుల జీవితాలు మరింతగా వెలుగులోకి వస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా తాజాగా ఓ అందాల రాణి గురించిన కొన్ని విశేషాలు కూడా వెలుగు చూశాయి. కుప్పలు తెప్పలుగా ఆస్తి పాస్తులున్నా ఇంకా పెళ్లికాని రాజవంశీకురాలు గురించి వచ్చిన పలు కధనాలు వైరల్‌గా మారాయి. ఆమె పేరు శివరంజని రాజ్యే(Shivranjani Rajy). రాజస్థాన్‌కు చెందిన శివరంజని రాజ్యే జోధ్‌పూర్ రాజవంశీకురాలు. ఆమె కుటుంబానికి బ్రిటిష్ కాలంలోనే దేశ వ్యాప్తంగా అత్యంత గౌరవం లభించింది.ఖాతా నిండా డబ్బే డబ్బు...ఈరోజుల్లో సామాన్యులకు లక్ష రూపాయలే గగనంలా అనిపిస్తే, శివరంజని రాజ్యే ఖాతాలో మాత్రం ఓ అంచనా ప్రకారం రూ. 22,000 కోట్లు ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి. ఆమె తండ్రి గజ్‌సింగ్ జీ రాజ్‌మాతా కుమార్తె అయిన శివరంజని, ఉమైద్ భవన్ ప్యాలెస్ అనే మహా విలాసవంతమైన కోట కు సహ–యజమానిగా కొనసాగుతున్నారు. ఈ ప్యాలెస్ నుంచి శివరంజని రాజ్యేకు భారీగా ఆదాయం వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యక్తిగత నివాసాల్లో ఇది ఒకటి. ఈ ప్యాలెస్ అద్భుతమైన ఆర్కిటెక్చర్, అంతఃపురాలు, ఉద్యానవనాలు, కళాఖండాలతో ప్రసిద్ధి చెందింది. ఈ రాజభవనంలో మొత్తం 347 గదులు ఉన్నాయి. దేశంలోని అతి ఖరీదైన హోటల్స్ లో ఒకటిగా నిలిచే ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఓ భాగాన్ని తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంటే మిగిలిన భాగంలో రాజవంశీకులు నివసిస్తున్నారు.ఇంకా బ్రహ్మచారిణిగానే...ఆమె ఆధీనంలోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ఖరీదైన పెళ్లిళ్లకు అత్యంత నప్పే వేదికగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. విచిత్రంగా ఆమె మాత్రం 50ఏళ్లు వస్తున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆస్తి పాస్తులు, అందచందాలు ఉన్న అందాల రాణి పట్ల మనసు పడ్డవారు చాలామందే ఉన్నప్పటికీ కారణం తెలీదు గానీ ఎందుకో ఆమె వివాహం చేసుకోలేదు. అంతేకాదు దేశంలోని కొందరు రాజవంశీకుల్లా శివరంజని రాజకీయాల్లో గాని సినీ రంగంలో గాని ప్రవేశించకుండా, తన కుటుంబ పరంపరను, వారసత్వాన్ని కాపాడడం పైనే దృష్టి పెట్టారు. తన జీవితాన్ని సామాజిక సేవ, వంశ పారంపర్య సంపద పరిరక్షణలో నిమగ్నం చేశారు. జోధ్‌పూర్ లో అనేక కళా, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, యువతలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. సంపద ఉన్నా సంస్కృతీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యత నేటి యువతకు స్ఫూర్తిగా చెప్పొచ్చు.(చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!) -
Bonalu Festival 2025: సంబురాలు మొదలాయె..!
ఇంటి ఆడబిడ్డ బోనం ఎత్తగానే మోగిన డప్పు వాయిద్యాలు.. పోతరాజు విన్యాసాలు.. అమ్మా, కాపాడమ్మా.. అంటూ సాగే అడుగులన్నీ అమ్మవారి ఆలయం వైపుగా కదులుతుంటే.. దారులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళ కళలాడతాయి. ఆ కళ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించేంత సంబురంగా జరుగుతుంది తెలంగాణ బోనాల పండగ. తెలంగాణ ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆషాఢ మాసం మొదలవుతూనే ఆరంభం అవుతుంది. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ .. ఈ ఏడుగురు అమ్మ తల్లులు ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నారు. ఈ అమ్మతల్లుల ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబు అవుతాయి. నేటి నుంచి మొదలయ్యే ఈ వేడుకలో తెలంగాణ ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొంటారు. బెల్లం కలిపి వండిన అన్నాన్ని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకులతో అలంకరించిన మట్టి లేదా ఇత్తడి పాత్రలలో ఉంచుతారు. పైన పెట్టిన మూతలో దీపాన్ని ఉంచి, ఆ పాత్రను జాగ్రత్తగా తలపైన పెట్టుకుని, అమ్మవారి దేవాలయాలకు వెళతారు. ఈ పండుగలో భక్తి, కుటుంబ శ్రేయస్సు ప్రధానంగా కనిపిస్తాయి. బోనాలతోపాటు, పొట్టేళ్ళ, ఘటం ఊరేగింపు వంటి సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహిస్తారు. (చదవండి: బోనాల పండుగకు వేళాయె)హైదరాబాద్‌లో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ పండగ మొదలవుతుంది. ఈ రోజు(గురువారం జూన్ 26) నుంచి బోనాలు ప్రారంభకానున్నాయి. వెయ్యేళ్లకు పైగా ఈ ఆచారం ఉన్నట్టు, కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు జరిపినట్లు చారిత్రక కథనాలు. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, తరువాతి వారంలో సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంతోపాటు వివిధ ప్రాంతాలలో ఉన్న అమ్మవార్లకు వరసగా బోనం సమర్పించే ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. చివరి వారం రంగం, భవిష్యవాణిలతో ముగింపు కార్యక్రమం ఉంటుంది. జులై 21తో ముగిసే ఈ జాతర ఉత్సవాలు పిల్లలూ పెద్దలలో ఆనందోత్సహాలను నింపుతుంది. (చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!) -
Beauty Tip: మచ్చలేని నిగారింపు కోసం..!
ముఖంపై ఉండే మృతకణాలను ఇంట్లో దొరికే పదార్థాలతో సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం...అలోవెరా స్క్రబ్: మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్లో రెండు టీస్పూన్లు బియ్యప్పిండి, టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని చేసి పదినిమిషాలపాటు మర్దన చేసి ఆరాక కడిగేయాలి.వాల్నట్ స్క్రబ్: రెండు వాల్‌నట్స్‌ను తీసుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడిలో మూడు టీస్పూన్లు తేనె వేసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాలు ఆరాక నీటితో కడిగేయాలి. వాల్‌నట్స్‌లోని ఔషధ గుణాలు చర్మానికి పోషణ అందించడంతోపాటు, చర్మంపై ఉన్న జిడ్డుని తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతాయి.కాఫీ స్క్రబ్: నాలుగు టీస్పూన్ల కాఫీ పొడిలో రెండు టీస్పూన్ల బ్రౌన్ సుగర్, టీస్పూను తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు మర్ధన చేయాలి. ఆరాక నీటితో కడిగేయాలి. కాఫీ పొడిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని లోతుగా శుభ్ర పరిచి ఫ్రెష్‌గా ఉంచుతాయి. (చదవండి: Anti-Drug Day 2025: మత్తుపై 'దండెత్తారు'..!) -
మత్తుని చిత్తు చేసిన మహిళా యోధులు..!
మత్తును చిత్తు చేసిన మహిళా యోధులు ‘భూమాత అంత ఓపిక మహిళల సొంతం’ అంటారు. సహనానికి పర్యాయ పదంలా చెప్పే ‘మహిళ’ అవసరమైతే అపర కాళీ అవుతుంది.కేరళ నుంచి పంజాబ్ వరకు ఎన్నో ప్రాంతాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మహిళలు నడుం బిగించారు. సంఘాలుగా ఏర్పడిఎన్నో గ్రామాలను డ్రగ్స్ భూతం నుంచి విముక్తి చేశారు...ఛత్తీస్‌గఢ్‌లోని జూహ్లీ గ్రామంలో ఒకప్పుడు పరిస్థితి భయానకంగా ఉండేది. ఈ గ్రామంలో ఎంతోమంది మాదకద్రవ్యాలకు బానిస అయ్యారు. ఫలితంగా గ్రామంలో శాంతిభద్రతలు లోపించాయి. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియదు. మత్తులో పడి పని కూడా మానేసేవారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి గ్రామ మహిళలు నడుం బిగించారు.‘ఉమెన్ కమాండోస్’ పేరుతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల బారి నుంచి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ఈ గ్రూప్ సభ్యులు వీధి వీధిలో పెట్రోలింగ్ చేసేవారు. ‘మా అలవాటు మా ఇష్టం. మీకెందుకు?’ అని అడ్డంగా వాదించే మొండిఘటాలను కూడా దారిలోకి తెచ్చారు. ఇప్పుడు గ్రామంలో పూర్తిగా మార్పు వచ్చింది. మద్యం, మాదకద్రవ్యాల విష కోరల నుంచి బయటపడి ఆదర్శ గ్రామంగా మారింది జూహ్లీ. ఈ మార్పుకు కారణం...ఉమెన్ కమాండోస్. ‘ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్లలో కొందరు డ్రగ్స్ తీసుకునేవారు. ఆ దురలవాటు చివరికి యువత, పిల్లల్లోకి కూడా వచ్చింది. ఇలా చూస్తూ పోతే గ్రామం సర్వనాశనం అయి΄ోతుందని భయపడ్డాం. ఉమెన్ కమాండోస్ గ్రూప్‌గా ఏర్పడ్డాం. మార్పు సాధ్యం కాదు అనుకున్నచోట మార్పు తెచ్చాం’ అంటుంది ‘ఉమెన్ కమాండోస్’ గ్రూప్ సభ్యురాలు విష్ణుదేవి.‘మాదకద్రవ్యాల వాడకం వల్ల గృహహింస ఎక్కువ అయింది. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారింది. మేము ఉమెన్ కమాండోస్ పేరుతో ఒక గ్రూప్‌గా ఏర్పడినప్పుడు మార్పు తేవడం మీ వల్ల కాదు అన్నారు కొందరు. కచ్చితంగా అవుతుంది అని నిరూపించాలనుకున్నాం. నిరూపించాం’ అంటుంది రాజేశ్వరి మారవీ. శైలి(పేరు మార్చాం)కి సరదాగా డ్రగ్స్ అలవాటు మొదలైంది. చివరికి ఈ దురలవాటు తనను మృత్యువు అంచుల వరకు తీసుకువెళ్లింది. పంజాబ్‌లో శైలిలాంటి ఎంతోమంది మహిళలను డ్రగ్స్ మృత్యునీడ నుంచి బయటకు తీసుకువచ్చి కొత్త జీవితాన్ని ఇచ్చింది హెర్మిటేజ్ రిహాబ్ సెంటర్.మాదక ద్రవ్యాల బారిన పడిన మహిళలను కుటుంబ సభ్యులు ఈసడించడం, దూరం పెట్టడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యేది. పురుషుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండే రిహాబిలిటేషన్ సెంటర్లు మహిళలను చేర్చుకోవడానికి నిరాకరించేవి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెర్మిటేజ్ రిహాబ్ కేంద్రం మొదలైంది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఈ ఆల్–ఉమెన్ డ్రగ్ రిహాబ్ సెంటర్లో చేరుతుంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.మహిళలే కీలకంమరోవైపు చూస్తే...మాదకద్రవ్యాల వ్యతిరేకపోరాటంలో, మాదకద్రవ్యాల బారిన పడిన వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మహిళలను కీలక భాగస్వాములను చేస్తోంది పంజాబ్ ప్రభుత్వం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘మాదకద్రవ్యాల బారిన పడిన వాళ్లను అందులో నుంచి బయటికి తీసుకువచ్చే శక్తి మహిళలకు ఉంది’ అంటున్నారు పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి డా.బల్బీర్‌సింగ్.బెదిరింపులు వచ్చినా...డ్రగ్స్‌పై పోరాడుతున్న మహిళలకు డ్రగ్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. దాడులు జరిగాయి. అయినా వారు వెనక్కి తగ్గలేదు. మహిళా యోధుల పట్టుదల ముందు డ్రగ్ మాఫియా తోకముడిచింది.బాధ పడకూడదు... పోరాడాలిపంజాబ్లోని బఠిండా జిల్లాలోని దులేవాలా గ్రామంలో పదకొండు మంది మహిళలతో ఏర్పాటైన ‘ఆల్–ఉమెన్ యాంటీ–డ్రగ్ అవేర్నెస్ కమిటీ’ గ్రామంలోని డ్రగ్స్ భూతాన్ని తరిమేసింది. సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ షిందర్ పాల్ కౌర్ ఈ కమిటీకి నాయకత్వం వహించింది. ‘డ్రగ్స్ వల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతోమంది దారి తప్పి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నం ఫలించింది’ అంటుంది షిందర్ పాల్ కౌర్. (చదవండి: అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..) -
నా మొండి భర్తను మార్చగలరా!
నా భర్తకు 48 ఏళ్లు, రైల్వే ఉద్యోగి. చిన్నవయసు నుండే కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. అప్పటి నుండే మందుకు, స్మోకింగ్కి బానిస అయ్యారు. ఈ మధ్య గుండెకి ఆపరేషన్ కూడా అయింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాతి రోజే మళ్లీ మందు, సిగరెట్ మెదలుపెట్టారు. ఆఫీస్‌కి సరిగా వెళ్ళరు. మందులు వేసుకోరు. ఈయన పరిస్థితికి భయం వేసి హైదరాబాద్‌లో రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాము. కొన్నిరోజులు అవగానే అక్కడ తిండి తినకుండా గొడవ చేసి మారుతానని బతిమిలాడితే ఇంటికి తీస్కొచ్చేశాం. బయటకు రాగానే అన్నీ – మళ్ళీ మొదలు పెట్టారు. ఇలా కనీసం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. అసలు ఆయన మారతాడంటారా? సలహా ఇవ్వండి.– పద్మలత, కాజీపేట మీ భర్త ఆరోగ్యం గురించి మీరు పడే ఆందోళన, తపన అర్థం అవుతున్నాయి. ఇది ఆల్కహాల్‌కి బానిస అయిన చాలామంది పేషెంట్ల కుటుంబ సభ్యుల సమస్య కూడా. ఆల్కహాల్ అడిక్షన్కి వంశపారంపర్యం, వ్యక్తిత్వం, చుట్టూ ఉండే పరిస్థితులు, ఇతర మానసిక సమస్యలు... ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. మద్యం లేదా ఇతర, మత్తుపదార్థాలకు బానిస అయిన వారి మెదడు అనేకమైన మార్పులకి గురయి ఉంటుంది. వారిని ఆ అలవాటు నుండి బయట తీసుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక రిహాబిలిటేషన్ అనేది చాలా నిదానంగా చేసే చికిత్స. అందుకని ఆ వ్యక్తికి మారాలి అనే ఆలోచన లేనపుడు, ఆ ఆలోచన తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుంది. చికిత్సకి అసలు సహకరించరు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. వీరిలో మారాలనే ఆలోచన వచ్చేలా సి.బి.టి, మోటివేషన్ ఇంటర్వ్యూయింగ్ పద్ధతులు వాడతాము. ఒకసారి మోటివేషన్ వస్తే అపుడు మళ్ళీ మద్యం జోలికి పోకుండా ఉండడానికి ‘ప్రివెన్షన్ రిలాప్స్’ పద్ధతులు చెబుతారు. దీనితోపాటు వారి జీవన శైలిలో, స్నేహితుల విషయాలలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ తట్టుకోడానికి, కోపం తొందరపాటు తగ్గించుకునేలా కూడా థెరపీ ఇస్తారు. 30 సంవత్సరాల అలవాటుని 30 రోజుల్లో మార్చడం అసంభవం అని గుర్తుపెట్టుకోండి! ఈ సందర్భంలోనే మీరు ఓర్పుగా, నేర్పుగా సంయమనంతో ఉండాలి. అలాగే మీరు చేర్పించే రీహాబిలిటేషన్ సెంటర్లో సరైన శిక్షణ, అనుభవం కలిగిన మానసిక వైద్యులు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు, యోగ థెరపిస్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి. పేషెంట్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పూర్తి స్థాయిలో అందించండి. అతనిలో తప్పకుండా పరివర్తన వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com)(చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
మూడు ముళ్లెందుకు గుచ్చుకుంటున్నాయి?
‘మగాళ్లు, ఆడాళ్లు ఇద్దరూ సమానమే.. కానీ మగాళ్లు ఇంకొంచెం ఎక్కువ సమానం!’ ‘రాధాగోపాలం’ సినిమాలో డైలాగ్! ‘భార్యభర్తలిద్దరూ సమానమే అయితే భర్త ఇంకొంచెం ఎక్కువ సమానం’ అని సంసారంలో ఉన్న మాటను ఇప్పటి తరం అంటే అమ్మాయిలు అంగీకరించే పరిస్థితిలో లేరు! ఈ మాట వినపడగానే పెద్దలు, సంప్రదాయవాదులు అందుకే మనమూ పాశ్చాత్యుల్లా విడాకులకు తెగబడుతున్నాం అనేస్తారు ఘాటుగా!ఇంతకీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర విడాకుల సంఖ్య ఎంతో తెలుసా.. కేవలం ఒక్క శాతమే! అంతదానికే ఇంత ఘాటా? అంటే కుటుంబ వ్యవస్థకు పునాది వివాహ వ్యవస్థగా మన్ననలు అందుకుంటున్న దేశం కదా! అలాంటి సమాజంలో ప్రపంచంతో పోలిస్తే తక్కువే అయినా విడాకుల సంఖ్య పెరుగుతుండటం, అందుకు అనుమతులు వస్తుండటం ఆందోళన కలిగించే అంశమే కదా! ఈ నేపథ్యంలో మన పెళ్లి వ్యవస్థ బీటలు వారుతోందా? నివారోణాపాయం ఏంటి... వంటి అంశాల మీద నేటి నుంచి వరుస కథనాలు. ఈ రోజు.. పెళ్లి, అది ప్రమోట్ చేస్తున్న, డిమాండ్ చేస్తున్న అంశాలేంటో చూద్దాం! ఇదివరకు.. ఆడపిల్లకు ఉత్తరం చదివే అక్షరజ్ఞానం ఉంటే సరిపోతుందని అంతవరకే అనుమతించారు. తర్వాత ఆ ఆలోచన కాస్త మారి అమ్మాయి తన పిల్లలకు చదువు చెప్పుకునేంత జ్ఞానం సంపాదించాలని ఆ అనుమతిని కాస్త సడలించారు. ఇప్పుడు అమ్మాయిలు ప్రొఫెషనల్ డిగ్రీలు, పీహెచ్‌డీలూ చేసి, అబ్బాయిలు ఏయే రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో తమ ఉనికినీ చాటుకుంటున్నారు. అబ్బాయిలతో సమానంగా శ్రమించి సమాన వేతనాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సమానత్వ సాధనలో ఇది శుభపరిణామం. కానీ ఇదే పెళ్లిని బ్రేక్ చేస్తోందని సంప్రదాయ వాదుల భావన. ఎందుకంటే...అక్షరజ్ఞానం నుంచి ఆఫీస్‌లకు చేరుకునేదాకా ఆడవాళ్ల ప్రగతిని ఆంక్షలు, హద్దులతో అయినా అంగీకరించిన సమాజం కనీసం స్థాయిలో డొమెస్టిక్ లేబర్‌లో పురుషుల భాగస్వామ్యాన్ని అంగీకరించలేకపోతోంది. ఆ ప్రగతికి సమాన నిష్పత్తిలో డొమెస్టిక్ లేబర్‌లో పురుషుల పాత్ర పెరగలేదు. అంటే పెళ్లి ఆ బాధ్యతను పూర్తిగా ఇంకా స్త్రీల భుజాన్నే మోపుతోంది. భార్యాభర్తలు పేరెంట్స్‌గా మారినా భర్త మీద పెద్దగా భారం పడట్లేదు. తల్లయిన భార్యకు మాత్రం క్రమంగా విశ్రాంతి తగ్గిపోతోందని, పిల్లలు పుట్టగానే నిద్ర నుంచి కెరీర్ వరకు తల్లే త్యాగం చేయాల్సి వస్తోందని అధ్యయనాల సారం. పేరెంటింగ్ సమస్య కాదు. మ్యారేజ్‌లో పేరెంటింగ్‌ని కేవలం తల్లి బాధ్యతలా పరిగణించడమే సమస్య, ఆ మాటకొస్తే పెళ్లిలోని ప్రేమ, విధేయత, కమిట్మెంట్తో కూడా ప్రాబ్లం లేదు. పెళ్లి నిర్మాణమే అసలుప్రాబ్లం’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు. అందుకే సాధికారత సాధించిన యువతలు ఆర్థిక, సామాజిక భద్రతకో, ఓ ఇంటి వారవడం కోసమో పెళ్లి చేసుకునే స్థితిలో లేరు. పురుషులతోపాటు స్త్రీలకూ అంతేప్రాధాన్యం, గౌరవం ఇస్తూ భాగస్వామ్యానికి అసలైన నిర్వచనంగా ఉండే బంధాన్ని కోరుకుంటున్నారు. ఆ ఫ్రేమ్‌లో లేని పెళ్లిని త్యజించడానికి సిద్ధపడుతున్నారు. ఆనందం పంచలేని బంధానికి విడాకులనివ్వడానికీ వెనుకాడటం లేదు. సంప్రదాయం కన్నా మానసిక ఆరోగ్యం, భద్రతకేప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని కుటుంబం గ్రహించాలి. పిల్లల పెంపకం నుంచే జాగ్రత్త వహించాలి. చదువు విషయంలో అమ్మాయి, అబ్బాయి పట్ల చాలావరకు సమానత్వం చూపిస్తున్న తల్లిదండ్రులు ఇంటి పనుల విషయంలోనూ ఆ సమానత్వాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే అక్కడ అమ్మాయిలకు వెసులుబాటు దొరికితేనే వారి సాధికారతకు సార్థకత చేకూరుతుంది. ఇప్పటికిప్పుడు తల్లిదండ్రులు డొమెస్టిక్ లేబర్‌లోనూ అబ్బాయిలకు వాటా ఇస్తే భవిష్యత్ తరానికి అది నార్మలైజ్ అవుతుంది. సమాజంలో జరుగుతున్నదాన్ని అందరికీ ఆపాదించలేం. ఎవరి జీవితం వాళ్లది.. ఎవరి ఎక్స్‌పీరియెన్స్ వాళ్లది. పెళ్లి విషయంలోనూ అంతే! పెళ్లి కావాలనుకున్నా వద్దనుకున్నా అది వాళ్ల వ్యక్తిగత చాయిస్. అలాగే విడాకుల విషయంలోనూ అంతే! కలిసి ఉందామనుకున్నా, వద్దనుకున్నా ఆ జంట నిర్ణయం. అయితే ఆ చాయిస్‌కి కానీ, నిర్ణయాలకు కానీ సమాజంలో స్పేస్ ఉండాలి. – ఐశ్వర్య రాయ్ బచ్చన్‘నాకిప్పుడు 59 ఏళ్లు. శారీరకంగా, మానసికంగా నానా అవస్థలు పడుతూ సినిమాల్లో పనిచేస్తున్నాను. పెళ్లి పేరుతో నా జీవితంలోకి వచ్చిన భాగస్వామి ఏ కారణంతో విడిపోయినా భరణం కింద నా కష్టార్జితంలో సగానికి ఎసరుపెడుతుంది. యంగ్ ఏజ్‌లో పెళ్లయితే పర్లేదు.. అవతలి వాళ్లు మనోవర్తి కింద ఎంత డబ్బు తీసుకున్నా మళ్లీ సంపాదించుకోగలమనే నమ్మకం ఉంటుంది. కానీ ఈ వయసులో? అదంతా ఎక్కడ పెట్టుకోను? అందుకే ఇలా గడచిపోతోంది గడచిపోనివ్వండి’ – సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నటుడు– సరస్వతి రమ -
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) (ఐఎస్ఎస్) వైపుకు ఈ రోజే(బుధవారం జూన్ 25)చేరుకోనున్నారు. ఈ యాక్సియం స్పేస్ సంస్థ చేపడుతున్న యాక్సియం-4 (AX-4) మిషన్‌లో శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు. నాసా ప్రకటన ప్రకారం, ఈ ప్రయోగం ఈ రోజు మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, గురువారం సాయంత్రం 4:30కి వ్యోమనౌక ఐఎస్ఎస్తో డాకింగ్ కానుంది. మన భారతీయ వ్వోమగామి ఈ ప్రతిష్టాత్మక మిషన్‌లో భాగం కావడంతో యావత్తు దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈనేపథ్యంలో ఆయన కుటుంబ నేపథ్యం, లవ్‌స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఆయన బుధావారం మధ్యాహ్నం ఫాల్కన్ 9 రాకెట్ రాకెట్ లాంచ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అదులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ..తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. ఈ క్రమంలోనే వారి ప్రేమ కథ తెరపైకి వచ్చింది. కామ్నా దంత వైద్యురాలు. ఆమెతో శుభాంశుకి దశాబ్దాల ప్రేమ బంధం ఉంది. వారిద్దరు మొదట లక్నోలోని ప్రాథమిక పాఠశాలలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆయన తరగతి గదిలో అత్యంత సైలెంట్‌గా ఉండేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే సిగ్గరి. అలాంటి వ్యక్తి జాతీయ స్థాయిలో ప్రేరణగా నిలవడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. తమ విద్యా రంగాల దృష్ట్యా వేరైనా క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయినా మా మధ్య ప్రేమ అలానే స్వచ్ఛంగా ఉంది. బహుశా అదే మమల్ని పెళ్లి పీటల వరకు వచ్చేలా చేసి ఉండొచ్చు. శుభాంశు కెరీర్ పరంగా ఎన్నో ఎడబాటులను తట్టుకుని నిలిచిన అపూర్వ ప్రేమ మాది అని కామ్నా సగర్వంగా చెప్పారు. అయితే తమ కొడుకు తన తండ్రితో గడిపే క్షణాలను కోల్పోడం మాత్రం ఇప్పటికీ బాధగానే ఉంటుంది. ఎన్ని బాధ్యతలున్నా..అతడి ఫోకస్ అచంచలంగా ఉంటుదని కీర్తించారు. అంతేగాదు శుభాంశు దృఢ సంకల్పాన్ని మహాభారతంలోని అర్జునుడితో పోల్చారామె. ఆయన మంచి ఏకాగ్రతతో స్పష్టమైన వైఖరి ఉన్న వ్యక్తిత్వం గలవాడని చెబుతున్నారు కామ్నా. ఫైటర్ జెట్ల నుంచి అంతరిక్షం వరకు చేరుకున్న అతడి కెరీర్ నిజంగా చాలా గొప్పదన్నారు. నక్షత్రాలలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవాలనే ఆ కాంక్షతోనే ఈ స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పుకొచ్చారామె. ఆయన ఎల్లప్పుడూ "పరిస్థితి ఎంత సవాలుగా ఉన్నా, ఈత కొడుతూనే ఉండండి" అనే నినాదాన్ని గట్టిగా విశ్వసిస్తారని చెప్పుకొచ్చారు కామ్నా. కార్గిల్ యుద్ధంతో కెరీర్ యూటర్న్..శుభాంశు శుక్లా లక్నోలోని అలీగంజ్ క్యాంపస్‌లోని సిటీ మాంటిస్సోరి స్కూల్ (CMS) ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. కానీ 1998లో కార్గిల్ యుద్ధం సమయంలో కెరీర్ సడెన్‌గా మలుపు తిరిగింది. ఈ యుద్ధం అతనిలో దేశానికి సేవ చేయాలనే ప్రగాఢమైన కోరికను రేకెత్తించింది. దృఢ సంకల్పంతో తన కుటుంబానికి చెప్పకుండా UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షకు దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణులయ్యారు. అలా శుభాంశు 2005లో కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో విమాన శిక్షణ పొందాడు. చివరికి 2006లో అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్‌లోకి నియమితులయ్యారు. ఆయన బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. చాలా ఏళ్లుగా శుక్లా భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్, టెస్ట్ పైలట్‌గా సేవలందించారు. అదీగాక దాదాపు 2 వేల గంటల విమానయాన అనుభవంతో సాధించిన రికార్డు వివిధ రకాల విమానాలను అధిరోహించేలా చేసింది. ఆ కెరీర్ నేపథ్యమే 2019లో భారతదేశం ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ మిషన్ కోసం నాలుగు వ్యోమగాములలో ఒకరిగా అతని ఎంపికకు దారితీసింది. అప్పటి నుంచి ఆయన రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో, అలాగే బెంగళూరులోని భారతదేశ వ్యోమగామి శిక్షణా కేంద్రంలో కఠినమైన వ్యోమగామిగా శిక్షణ పొందారు.(చదవండి: ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్‌తో..) -
స్టీలు సామాన్లు కొత్తవాటిలా మెరవాలంటే..!
వంటింట్లో పనిచేసే ఇంతులకు తరుచుగా కొన్ని సమస్యలు ఎదురవ్వుతుంటాయి. వంటి సామాన్ల దగ్గర నుంచి డ్రెస్సింగ్ టేబుల్స్ వరకు అన్నింటిని పరిశుభ్రంగా ఉంచడం తలొనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అవి అందంగా మెరిపించడం ఓ పట్టాన సాధ్యం కాదు. ఏం చేయాలో పాలుపోక తెగ ఇబ్బంది పడుతుంటాం. అలాంటి వారికి ఈ సింపుల్ ఈ కిచెన్ టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో చూద్దామా..!.స్టీల్ పాత్రలు వెలిసిపోయి మూతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్‌పేస్టు ట్యూబ్‌ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీలు పాత్రకు రాసి టూత్ బ్రష్‌తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి అంతాపోయి కొత్తవాటిలా కనిపిస్తాయి. మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను సమపాళ్లల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్‌పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కప్పు బేకింగ్ సోడాని సింక్‌లో చల్లండి. వెంటనే అర కప్పు వెనిగర్ వేయండి. కొన్ని నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. ఈ కాంబినేషన్ మురికిని తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఆ తరువాత వేడి నీళ్లతో క్లీన్ చేయండి. సింక్ దుర్వాసన పూర్తిగా పోతుంది. (చదవండి: యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్ తప్పనిసరి..!) -
మలేరియా టీకా ధరలు తగ్గించిన భారత్ బయోటెక్!
ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా టీకా ధరలను ఈ వ్యాధి ప్రబలంగా ఉండే కొన్ని దేశాల్లో సగానికి తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్, జీఎస్‌కేలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో 2028 నుంచి మలేరియా నివారణ టీకాలు ఐదు డాలర్ల కంటే తక్కువ ధరకు లభిస్తాయని ఇరు సంస్థలు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు వ్యాక్సీన్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన ‘ద వ్యాక్సీన్ అలయన్స్’కు 2026- 2030 మధ్య సరఫరా చేసే టీకాలపై ఒక ఒప్పందం కుదిరిన సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. జీఎస్కే, పాథ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మలేరియా టీకా ఆర్టీఎస్.ఎస్‌ను మలేరియా నివారణకు ఉపయోగించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021లోనే అనుమతులిచ్చింది. అయితే ఉత్పత్తి మార్గాల్లో మెరుగుదల, సామర్థ్యం పెంపు, లాభాన్ని కనీస స్థాయిలో ఉంచడం వంటి కారణాల వల్ల టీకా ధర సగానికి తగ్గించడం వీలైందని భారత్ బయోటెక్, జీఎస్‌కేలు వివరించాయి. ‘‘వ్యాక్సీన్ అలయెన్స్‌కు టీకాల సరఫరా చేస్తామన్న ఒప్పందం కుదరడం వల్ల లక్షల మంది పిల్లలు, కుటుంబాలపై మలేరియా సమస్య తగ్గిపోతుంది. ఈ చర్య మాకు కేవలం వ్యాక్సీన్ అలయన్స్‌కు సహకరించడం మాత్రమే కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం’’ అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. జీఎస్కే సహకారంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా బాధిత బాలలు, వారికి అందుబాటులో ఉన్న టీకాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్నాం అని చెప్పారు. న్, పాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారం కూడా ఉంది.’’ అని అన్నారు. కాగా, ఘన, కీన్యా, మలవాయి వంటి దేశాల్లో ఇటీవలే సుమారు ఇరవై లక్షల మంది పిల్లలకు మలేరియా టీకా ఇవ్వడం వల్ల ఈ వ్యాది కారణంగా మరణించే వారి సంఖ్య 13 శాతం వరకూ పడిపోయిందని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 22 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. మలేరియా సమస్య ఎక్కువగా ఉన్న చోట్ల ఈ టీకాతోపాటు మలేరియా సీజన్లో తగిన మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని గణనీయంగా నివారించడం సాధ్యమైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.(చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్ పిచాయ్‌కి కలిగిన సందేహం) -
నలుగురితో కలిసే వ్యక్తా కాదా? ఇట్టే చెప్పేయొచ్చు ఇలా..!
ఒకే చిత్రాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కో దృష్టితో చూస్తాడట. అందరికి ఆ చిత్రం ఒకేలా అనిపించదు. చెప్పాలంటే అందరికీ ఒకటే ఎలా నచ్చదో అలానే మన దృష్టి కోణాల్లో కూడా చాలా భేదాలు ఉంటాయట. అవే మన భావోద్వేగ స్థితిని, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. శాస్త్రీయంగా ఇవి కచ్చితమైనవి అనేందుకు ఆధారాలు లేకపోయినా..కొన్ని అధ్యయనాల్లో ఆ ఫలితాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. పైగా ఇలాంటి ఫజిల్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందడమే కాకుండా ఆకర్షణీయంగానూ, ఉత్సుకతను రేకెత్తించేలా ఉంటాయి. అలాంటి ఒక చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది మీరు ఎలాంటి స్వభావం గలవారో ఇట్టే చెప్పేస్తుందట. మరీ ఆ చిత్రం చెప్పే చిత్తరువు స్వభావం ఏంటో చూద్దామా..!.ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మొట్టమొదటిసారిగా ఏం చూశారో చెప్పండి దాన్ని బట్టి అవతలి వారి స్వభావం ఈజీగా తెలుసుకోవచ్చు. View this post on Instagram A post shared by Recovery Trauma Ltd ♥️♥️♥️ (@recoverytraumaltd) మొదట జీబ్రాలు చూసినట్లయితే..మొదటగా జీబ్రాలనే చూస్తే..మీరు బహిర్ముఖుడని అర్థం. దీని అర్థం అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని. ప్రజలతో మమేకం కావడానికే ఇష్టపడతారు. అంతేగాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఉత్సాహంగా గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారని అర్థం. అలాగే నచ్చిన హబీలో ముందుకు సాగడం, పార్టీలు చేసుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, స్నేహితులను చేసుకోవడం, వారితో గడిపే స్వభావం కలవారని చెబుతుందట. మొదట సింహాన్ని చూసినట్లయితేఅలాంటి వారు అంతర్ముఖులని అర్థం. ప్రజలతో అంత తేలిగ్గా కలవరు. వాళ్లు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే కలిసి మెలుగుతారు. ఇంట్లోనే బంధువులు లేదా సన్నిహితులతో కలిసి సినిమాలు చూడటం, చదవడం, యోగా వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేస్తారు. ఈ వ్యక్తులు ఇతర వ్యక్తుల సహవాసాన్ని అంతగా కోరుకోరట.సరదాగా ఉండే ఈ దృశ్య పజిల్ మనకు అవతలి వ్యక్తుల స్వభావాన్ని ఇట్టే పసిగట్టేలా చేయడమే గాక అలాంటి వాళ్లతో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీక్కూడా ఏం కనిపిస్తుందో చెక్‌చేసుకోండి మరి..!.(చదవండి: ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్‌తో..) -
ఆపన్నులకు కానుక..అసలైన వేడుక..
అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో వేడుకలు నిర్వహించేందుకు అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. తొలి దశలో తమ పుట్టినరోజులను జరుపుకోడానికి వీటిని నగరవాసులు ఎక్కువగా ఎంచుకున్నప్పటికీ, అనంతర కాలంలో క్రమంగా పెళ్లిరోజు, ప్రమోషన్, రిటైర్మెంట్ ఇలా ప్రతి సందర్భాన్నీ వారితో పంచుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. ప్రత్యేక తేదీల నుంచి పండుగలు, నూతన సంవత్సరం వేడుకలు మొదలు.. అనేక రకాల వేడుకలు వీటికి జతకలిశాయి. బోలెడంత ఖర్చు పెట్టి పబ్స్, క్లబ్స్‌లో ఫ్రెండ్స్‌తో గడిపేకన్నా.. నిరుపేదల కడుపు నింపడమే మిన్న అని కొందరు అనుకుంటుంటే మరికొందరేమో.. అటు అన్నార్తులతోనూ, ఇటు బంధుమిత్రులతోనూ వేర్వేరుగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా వృద్ధాశ్రమాలు, అనాథశరణాయాలతోనే సరిపెట్టుకుంటున్నారు. తమకు తోచిన సాయాన్ని అందించడంతోపాటు వారికి అండగా నిలుస్తున్నారు. ఆద్యంతం.. ఆనందం.. ఈ తరహా వేడుకలు ట్రెండ్ నగరంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సాహకరంగా మారింది. ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమాలు, హోమ్స్‌లో ఉన్నవారితో కలిసి కేక్ కటింగ్, ఆటపాటలతో అలరించడం, విందు వినోదాలు, బహుమతులను పంచడంతో పాటు కొందరు ఆర్థిక సహకారం కూడా అందిస్తున్నారు. తద్వారా నిర్వహణ భారాన్ని కూడా పంచుకుంటున్నారు. కొందరు మరింత ముందుకెళ్లి ఆయా హోమ్స్‌లో ఉంటున్నవారిని సినిమాలకు, జూ పార్క్, సిటీ టూర్స్.. తదితరాలకు తీసుకెళుతూ వారికి మరచిపోలేని అనుభవాలను, వారు వ్యక్తిగతంగా పొందలేని ఆనందాన్ని, అనుభవాలను వారికి అందిస్తున్నారు. ఒంటరితనాన్ని దూరంచేస్తూ.. ఇలాంటి కార్యక్రమాలు తమకు ఎవరూ లేరనే ఆవేదనను ఆపన్నుల నుంచి తాత్కాలికంగానైనా దూరం చేస్తున్నాయి. ‘ఎంత డబ్బులు ఖర్చు చేశాం అనేదాని కన్నా ఎంత మందికి నిజమైన సంతోషాన్ని అందించగలిగాం? అనేదే ముఖ్యం. వారిలోని ఒంటరితనాన్ని దూరం చేసేందుకు.. నా పుట్టిన రోజును ప్రతిసారీ ఏదో ఒక వృద్ధాశ్రమంలో, ఆర్ఫన్ హోమ్స్‌లో జరుపుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాను’ అని చెప్పారు హైదరాబాద్ నగరానికి చెందిన మహిళా వ్యాపారవేత్త విభాజైన్. తనను చూసి తన స్నేహితులు మరికొంత మంది కూడా ఇదే బాట అనుసరిస్తున్నారంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మేము సైతం అంటున్న ఈవెంట్ ఆర్గనైజర్లు.. హైదరాబాద్ నగరవాసుల్లో ఈ తరహా వేడుకల నిర్వహణ పట్ల పెరుగుతున్న ఆసక్తి దీని కోసం ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజర్లు సైతం పుట్టుకురావడానికి దోహదం చేసింది. సంపన్న వ్యాపారుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటివి అనాథలు, నిరుపేదల నడుమ జరుపుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేయడం ద్వారా పలువురు ఈవెంట్ నిర్వాహకులు సిటీలో ఈ తరహా కార్యక్రమాలు ఊపందుకోడానికి కారణమవుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి వేడుకలకు సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన స్పందనను రాబట్టే పని సైతం వీరే నిర్వహిస్తుండడం విశేషం. ఏది ఏమైనా నగరంలో నిరుపేదలకు, అనాథలకు ఈ తరహా వేడుకలు ఎంతో ఉపయుక్తంగా మారాయనేది నిస్సందేహం.పండుగలు సైతం.. తొలుత ఆర్ఫన్ హోమ్స్, ఆశ్రమాల్లో సిటిజనులు పుట్టినరోజులే ఎక్కువగా జరుపుకునే వారు. అయితే ఆ ధోరణి మరింతగా పుంజుకుంటుండగా.. ప్రస్తుతం కాదేదీ సాయానికి అనర్హం అన్నట్టుగా మరికొన్ని ముఖ్యమైన సందర్భాలనూ వాటికి జతచేస్తున్నారు. ముఖ్యంగా వినాయకచవితి రోజునఅనాథ చిన్నారులతో కలిసి వినాయక ప్రతిమలు తయారు చేయడం వంటివి, అలాగే దీపావళి రోజున వృద్ధులు, చిన్నారులతో కలిసి టపాసులు కాల్చడం.. వంటివి చేస్తున్నారు. ఇలా సంప్రదాయ పండుగలు జరుపుకోవడం మొదలుకుని.. ఫ్రెండ్ షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, న్యూ ఇయర్ వంటి ఆధునిక పార్టీల వరకూ ఈ ట్రెండ్‌కు జతచేస్తున్నారు. ‘నా కన్నతల్లి నాకు దూరమైనప్పటి నుంచీ మాతృదినోత్సవం రోజున ఓ వృద్ధాశ్రమంలో ఎందరో కన్నతల్లులతో కలిసి గడపడం ఒక అలవాటుగా మార్చుకున్నాను. అది నాకెంతో సంతృప్తిని అందిస్తోంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన డిజైనర్ రజితారాజ్. (చదవండి: అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..)