పని ప్రదేశం..ఆరోగ్యానికి భారం కాకూడదంటే..! | World Day for Safety and Health at Work: Neck and Back Pain At Working | Sakshi
Sakshi News home page

పని ప్రదేశం..ఆరోగ్యానికి ముప్పుగా మారకూడదంటే

Apr 28 2026 6:29 PM | Updated on Apr 28 2026 6:38 PM

World Day for Safety and Health at Work: Neck and Back Pain At Working

ఇవాళ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యంకి సంబంధించిన దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ముఖ్యోద్దేశం పని ప్రదేశాలలో ప్రమాదాలు, వ్యాధులను నివారించి సురక్షితమైన ఆరోగ్య పని సంస్కృతిని ప్రోత్సహించడమే. దీన్ని ఉద్యోగుల శ్రేయస్సు కోసం 2003లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పనిప్రదేశాన్ని హెల్దీగా ఎలా మార్చుకోవాలో ఆరోగ్య నిపుణుల మాటల్లో తెలుసుకుందామా.

పనిప్రదేశంలో చాలామంది ఉద్యోగులు బ్యాక్‌పెయిన్‌, మెడనొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఫేస్‌ చేస్తుంటారు. అలాంటి వాళ్లు కూర్చోనే భంగిమపై అవగాహన ఏర్పరుచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

మానిటర్లను కంటి స్థాయిలో ఉంచడం, ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవడం, సాగదీయడం (స్ట్రెచింగ్) వంటివి చేయాలి.

మోచేతులు డెస్క్ స్థాయిలో ఉండేలా కుర్చీ ఎత్తును సర్దుబాటు చేయాలి. ఇది మెడ/భుజాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. "తల ముందుకు వంగిన" భంగిమను నివారించడానికి, పాదాలు నేలపై చదునుగా ఉండేలా.. స్క్రీన్‌లు కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.

వెన్నెముకను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకూడదు. దాంతోపాటు ప్రతి  30–60 నిమిషాలకు ఒకసారి కదలడం వంటివి చేయాలి. 

కండరాలపై స్థిరమైన భారాన్ని తగ్గించడానికి, నిలబడి పనిచేసే డెస్క్‌లను లేదా కన్వర్టర్‌లను ఉపయోగించడం, తరచుగా భంగిమలను మార్చుకోవడం వంటివి చేయాలి.

వీటన్నింటి తోపాటు చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిని వ్యాయామం లేదా వాకింగ్‌​ వంటి కదలికలు అవసరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

(చదవండి: వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement