సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్‌లో టాపర్‌గా! | Faizan's Story: Jharkhand Topper Defying Cerebral Palsy | Sakshi
Sakshi News home page

సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్‌లో టాపర్‌గా!

Apr 25 2026 10:35 AM | Updated on Apr 25 2026 10:47 AM

Faizan's Story: Jharkhand Topper Defying Cerebral Palsy

కొందరు ఎలాంటి శారీరక లోపం లేకుండా, సమస్త సౌకర్యాలు ఉండి విద్యలో పెద్దగా రాణించలేక చతికిలపడుతుంటారు. ట్యూషన్‌లని, స్పెషల్‌ క్లాస్‌లని చెప్పించినా.. కొందరికి వచ్చే మార్కులు అంతంత మాత్రమే. కానీ ఈ కుర్రాడు. సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..మొత్తం శరీరం తనకు సహకరించే పరిస్థితి లేకున్నా కూడా పదోతరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. పైగా తనకు ఈ పరిస్థితి లేకుంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాడిని అని చెబుతుండటం విశేషం. 

ఆ విద్యార్థే జార్ఖండ్‌లోని గొడ్డాకు చెందిన ఫైజాన్.  తీవ్రమైన సెరిబ్రల్ పాల్సీ ఉన్నప్పటికీ, 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93.8 శాతం మార్కులు సాధించి, దివ్యాంగుల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. శరీర కదలికల సవాళ్లను అధిగమించి, నోటితో పెన్ను పట్టుకుని రాసి ఇన్ని మార్కులు తెచ్చుకోవడం విశేషం. తన అనారోగ్య పరిస్థితి వల్లే ఇంతకు మించి సాధించలేకపోయానని, లేదంటే ఇంకా ఎక్కువ మార్కులే వచ్చేవని అంటున్నాడు. 

అంతేగాదు ఫైజాన్‌ చేతితో రాసే విధానానికి సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ ఫైజాన్‌ గురించి వివరించారు. ఇక ఫైజాన్‌ తాను కొన్ని పరీక్షల్లో బొమ్మలు గీయలేకపోయానని, ముఖ్యంగా రేఖచిత్రాలు నోటితో స్పష్టంగా గీయడంలో కాస్త తడబడ్డట్లు వెల్లడించాడు. కాగా, జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ (JAC) గురువారం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పరీక్ష ఫలితాలను ప్రకటించింది, మొత్తం ఉత్తీర్ణత శాతం 95.27గా నమోదైంది.

సెరిబ్రల్ పాల్సీ అంటే..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ ప్రకారం, సెరిబ్రల్ పాల్సీ అనేది శిశువుగా ఉన్నప్పుడు లేదా చిన్నతనంలోనే కనిపించే ఒక మెదడు రుగ్మత. ఇది శరీర కదలికలు, కండరాల సమన్వయంపై శాశ్వతంగా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి కదలికలను నియంత్రించే, శరీర భంగిమ సమతుల్యతను కాపాడే మెదడు సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తుంది.

 

(చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement