అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం ఆంటిలియాలో రిహానాకు ఆతిథ్యం ఇచ్చింది. తన బ్యూటీ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ ప్రారంభోత్సవం కోసం ఈ గాయని భారతదేశంలో ఉన్నారు. రిహానా ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీలతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆషా అంబానీ ఆకర్షణీయమైన ఎరుపు రంగు చానెల్ డ్రెస్‌లో తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఈ ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగు దుస్తులలో సున్నితమైన పూసల పనితో కూడిన పారదర్శకమైన పైపొర, నేల వరకు జారే ప్లీటెడ్ స్కర్ట్ ఉన్నాయి. ఈ డిజైనర్‌వేర్‌ని మాథ్యూ బ్లేజీ రూపొందించారు. చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 కౌచర్ షో నుంచి తీసుకున్న ఒక సరికొత్త డిజైనర్‌వేర్. ఈ దుస్తులలో నడుము వరకు పొడవున్న అంచు, పూర్తి పొడవు చేతులు, ఓపెన్ ఫ్రంట్, గుండ్రని మెడ, అంచులపై సున్నితమైన పూసల ఎంబ్రాయిడరీ, చేతులపై రఫుల్స్‌తో కూడిన ప్రకాశవంతమైన ఎరుపు రంగు షీర్ ష్రగ్ ఉంది.
అలాగే ఆమె రాశిచక్రం వృశ్చికం కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉండటం విశేషం. ఇషా ఈ జాకెట్‌ను దానికి సరిపోయే ఎరుపు రంగు డ్రెస్ పైన ధరించి సరొకొత్త స్టైలిష్ లుక్‌ని పరిచయం చేశారామె. అందుకు తగ్గట్టుగా ఇషా తన డ్రెస్ మెటీరియల్‌తోనే తయారు చేసిన బంగారు గొలుసు బ్యాగ్, బ్లాక అండ్ వైట్ మేరీ జేన్స్ స్లిప్పర్స్, సున్నితమైన వజ్రాలు పొదిగిన చెవిపోగులతో సహా, తల నుంచి కాలి వరకు షానెల్ యాక్సెసరీలతో స్టైల్ చేసింది.
ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా పాపిడి తీసిన వదులైన జుట్టు, ముదురు రంగు కనుబొమ్మలు, మస్కారా పూసిన కనురెప్పలు, మౌవ్ రంగు లిప్ షేడ్, బ్లష్ పూసిన బుగ్గలతో హీరోయిన్ రేంజ్‌లో తళుక్కుమన్నారామె. మరీ ఈ డ్రెస్ ఖరీదు వచ్చేసి రూ. 70 లక్షలు పైనే పలుకుతుందట.
(చదవండి: జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!)


