పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తోంది. దీనికారణంగా మహిళలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటుంటారు. సంతానోత్పత్తి వయసు ఉన్న ప్రతి ఐదుగురి అమ్మాయిల్లోఓ ఒకరు ఈ సమస్య బారినపడతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అని చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్యను చక్కటి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో చక్కదిద్దొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.
పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నమహిళలు తీసుకోవాల్సిన ఆహారాలు గురించి వెల్లడించారు. అవేంటంటే..వాటిలో గుడ్లు మంచి ఆహారమని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండుగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అవకాడోలు హార్మోన్ల నియంత్రణకు సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయట. అలాగే బెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, తీపి తినాలనే కోరికను నివారించేలా తక్కువ చక్కెర, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
చియా గింజలు మెరుగైన జీర్ణక్రియకు, మంచి ఫైబర్‌కు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే పెరుగు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక జీవక్రియకు మద్దతిస్తుందని అన్నారు. దీంతోపాటు ఈ సమస్యను తీవ్రతరం చేసే ఆహారాలకు దూరంగా ఉండేలా కేర్ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తరచుగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి.
అలాగే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెప్పారు. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని పరిమితం చేయాలని అన్నారు. ఆహారం తోపాటు చక్కటి జీవనశైలిని పాటించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ..సమతుల్య భోజనం చేసేలా స్థిరత్వాన్ని పాటించాలన్నారు. చిన్నచిన్నగా పాటిస్తే..మెత్తం ఆరోగ్యంలో పెద్ద మార్పులోను, మెరుగుదలను చూడగలమని అన్నారు.
డాక్టర్ ఆదర్శ గౌడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)
అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)
ICAR-నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్


