‘చెప్పు’కోదగ్గ వ్యక్తి | 65 year old man walks barefoot in extreme heat andhra pradesh | Sakshi
Sakshi News home page

‘చెప్పు’కోదగ్గ వ్యక్తి

May 6 2026 11:46 AM | Updated on May 6 2026 11:56 AM

65 year old man walks barefoot in extreme heat andhra pradesh

కర్నూలు జిల్లా: చెప్పుల్లేకుండా ఎండలో నడుస్తున్న ఈయన పేరు బోయ బెనకప్ప. హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన ఈయనకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు ఉంది. పొలానికి వెళ్లినా, వివిధ పనులకు వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా 65 ఏళ్ల వయస్సులోనూ ఇలాగే చేస్తున్నారు. సోమవారం చెప్పులు లేకుండా కాలినడకన తన గ్రామం నుంచి 6 కి.మీ. దూరంలో ఉండే హొళగుంద వచ్చారు. గతంలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న దర్శనానికి హొళగుంద నుంచి 200 కి.మీ. వరకు ఇలాగే కాలినడకన వెళ్లారు. కాళ్లకు బొబ్బలు అయినా బెదర లేదు. ఎండాకాలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో చెప్పుల్లేకుండా నడుస్తున్న ఇతనని చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement