మెట్‌ గాలాలో గోల్డ్‌ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్‌లో మొత్తం అమ్మ.. | Isha Ambani takes a gold saree gajra to the Met Gala 2026 | Sakshi
Sakshi News home page

Met Gala 2026: గోల్డ్‌ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్‌లో మొత్తం అమ్మ..

May 5 2026 3:35 PM | Updated on May 5 2026 3:50 PM

Isha Ambani takes a gold saree gajra to the Met Gala 2026

మెట్ గాలా 2026లో భారతీయ ఫ్యాషన్, కళలకు మద్దతు ఇవ్వాలనే తన వాదనను బలంగా వినిపించారు ఇషా అంబానీ. ఈ వేడుకలో ఆమె డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరలో చేతితో చిత్రించిన పిచ్వాయి ప్రేరేపిత నమునాలు ఉన్నాయి. 

కేవలం కళాకారుల కోసం మాత్రమే పనిచేసే రిలయన్స్‌ రిటైల్ బ్రాండ్‌ స్వదేశ్‌కు చెందని కళాకారులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు దారాలతో డిజైన్‌  చేశారు. ఆఖరికి బ్లౌజ్‌ కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌. ఎందుకంటే ఈ బ్లౌజ్‌ మొత్తం తన అమ్మ నీతా అంబానీ ఆభరణాలతో నిండి ఉందని వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది ఇషా. 

దాదాపు 1800 క్యారెట్ల వజ్రాల తోపాటు పచ్చలు, పోల్కీ, కుందన్‌లను ఈ వస్రం(బ్లౌజ్‌)లో పొదిగి దాని వారసత్వ రూపాన్ని సజీవంగా మార్చామని డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇషా అద్భుతమైన చీర, ఆభరణాల తోపాటు క్రోచెట్‌ బ్యాగ్‌లో సుబోధ్‌ గుప్తా రూపొందించిన మామిడి శిల్పాన్ని కూడా రెడ్‌కార్పెట్‌పైకి తీసుకువచ్చారామె. ఇది భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా చేతి కళకు నిదర్శనంగా నిలిచింది. 

సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఏడాది మెట్‌గాలా 2026 థీమ్‌ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'కు అనుగుణంగా ఉంది. అలాగే ఆమె తన జుట్టుని గజ్రా స్ఫూర్తితో రూపొందించిన కాగితం, రాగి ఇత్తడి కలయికతో రూపొందించిన ఆభరణంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిశారామె. దీన్ని బ్రూక్లిన్‌కు చెందిన సౌరబ్‌ గుప్తా అనే కళాకారుడు రూపొందించారు. 

ఈ వేడుకకు ముందు మే1 న్యూయార్క్‌ నగరంలో జరిగిన వేడుకలో భారతదేశాన్ని అక్షరాలా చిత్రించిన ఒక అద్భుతమైన బ్యాండేజ్ డ్రెస్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్‌ని 26 రకాల అంచులతో రూపొందించడం విశేషం. 

 

(చదవండి:  ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..)

 

Advertisement
 
Advertisement
Advertisement