భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..? | Health Tips: Watermelon Consumption Affects Post-Meal Bloating | Sakshi
Sakshi News home page

Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?

Apr 28 2026 4:05 PM | Updated on Apr 28 2026 4:33 PM

Health Tips: Watermelon Consumption Affects Post-Meal Bloating

ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న  ఘటన తీవ్ర ఆందోళన, అనుమానాలను రేకెత్తించింది. భోజనం తర్వాత సర్వసాధారణంగా పండ్లు తీసుకుంటాం. అలా.. సమ్మర్‌ ఫ్రూట్‌గా చెప్పే పుచ్చకాయను మాత్రం అలా తీసుకోకూడదా అంటే..పోషకాహార నిపుణులు ఔననే చెబుతున్నారు. అసలు దీన్ని ఎలా తినాలి?, ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది? వంటి విషయాలు గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.!.

పుచ్చకాయ పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. అయితే చాలామంది ఈ పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందంటూ ఫిర్యాదులు చేస్తుంటారు. ఎందుకిలా అంటే..

రీజన్‌ ఏంటంటే..
సర్వసాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే భారీ భోజనం తర్వాత ఎప్పుడైతే పుచ్చకాయ తింటారో ఆ క్షణమే ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా పుచ్చకాయ వినయోగం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అందువల్ల ఇలా వేసవిలోనే ఈ సమస్య తీవ్రమవుతుందా? లేక ప్రతిసారి ఇలానే జరుగుతుందా అంటే..

నిజనానికి వేసవిలో కడుపు ఉబ్బరం సర్వసాధారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అధిక వేడి కారణంగా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇబ్బంది పడుతుండటంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు. తత్ఫలితంగా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో అధిక నీటి శాతం ఉన్న పండ్లు, తినే భోజనం రెండూ సమతుల్యంగా ఉంటే ఈ సమస్య రాదని అంటున్నారు. 

అంతేగాదు మనం పుచ్చకాయలను తీసుకునే విధానం కారణంగానే ఈ కడుపు ఉబ్బరం లేదా గ్యాస్‌ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేగాదు అలాంటి సమయంలోనే జీర్ణవ్యస్థపై పుచ్చకాయ ప్రభావం చూపిస్తుంది. అదీగాక ఈ పుచ్చకాయలో అధికంగా ప్రక్టోజ్‌ ఉండటం వల్ల పెద్దప్రేగుల్లో ఇది పులిసి, గ్యాస్‌ ఉత్పత్తి అవ్వడానికి దారితీసి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటివి కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

అదీగాక మనం తినే భోజనంతో పోలిస్తే పుచ్చకాయ వంటి పండ్లు జీర్ణాశయం గుండా వేగంగా ప్రయాణిస్తాయట. ఎప్పుడైతే ఈ రెండిటిని కలిపి తీసుకుంటామో దాని ఫలితం ఈ పుచ్చకాయ ముక్కలు జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో పులియబెట్టడం, గ్యాస్ ఏర్పడటం వంటివి జరుగుతాయని అన్నారు. 

అందువల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు సాధారణంగా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవడమే మేలని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ సమస్యతో ఉన్నవారు కూడా భోజనం తిన్న వెంటనే లేదా పుచ్చకాయ తిన్న వెంటనే భోజనం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

ఎప్పుడు తింటే మంచిదంటే..
వైద్యులు మెరుగైన ఫలితాలు పొందాలంటే.. పుచ్చకాయను తీసుకునే సమయం కీలకమైనదని అంటున్నారు. అది తీసుకునే ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలమని అన్నారు. అంటే పూర్తి స్నాక్‌ ఐటెంగా లేక భోజనానికి చాలా సమయం ఉందనగా తీసుకోవడం మంచిదని అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసకోవాలని సూచిస్తున్నారు. 

అలాగే రాత్రి సమయంలో కూడా వద్దనే చెబుతున్నారు వైద్యులు. సరైన సమయం ఉదయం 11 నుంచి 3 గంటల లోపు భారీ బోజనం తీసుకోక మునుపు అయితే మంచిదని చెబుతున్నారు. రాత్రి ఏడు తర్వాత తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది, పైగా రాత్రి సమయంలో తేలకపాటి ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. 

ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకోవడం మంచిదనేది గుర్తురెగాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్‌' అన్న నానుడి గుర్తించుకుని ఏదైన మితంగా సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నం కావని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?)

 

Advertisement
 
Advertisement
Advertisement