Kumuram Bheem District Latest News
-
విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి
చింతలమానెపల్లి: మండలంలోని డబ్బా గ్రామంలో ఈ నెల 12న నిర్వహించనున్న కుమురంభీం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుల్కరి ఉమామహేశ్ కోరారు. శనివారం డబ్బా గ్రామంలో కార్యక్రమం నిర్వంచనున్న స్థలంలో కాంగ్రెస్, ఆది వాసీ నాయకులు ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విగ్రహావిష్కరణకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు పాల్వా యి హరీశ్‌బాబు, వెడ్మ బొజ్జు, కోవ లక్ష్మి, ఆదివాసీ నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి అధికసంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బెజ్జూర్ మండల కన్వీనర్ కొడప విశ్వేశ్వర్, యువజన విభాగం మండలాధ్యక్షుడు బండి మహేశ్, నా యకులు కొండు శంకర్, జునుగరి శేఖర్, విజయ్, కార్యక్రమ నిర్వహణ అధ్యక్షుడు నారాయణ, ఆదివాసీ నాయకులు కుంరం నందారాం, ఆత్రం బాబురావ్, కుంరం అశోక్, సురేశ్, కుడ్మెత సందీప్, మెస్రం శశికుమార్, అర్జున్ పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్‌పీలో లోడర్ ఆపరేటర్లకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివా రం సీహెచ్‌పీ ఎస్ఈ కోటయ్యను కలిసి వేతనాలు చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోడర్ ఆపరేటర్లకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కు టుంబాలను పోషించుకునేందుకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. క్రమం తప్పకుండా వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ వేతనాలతో పాటు సీఎంపీఎఫ్ వివరాలు తెలియజేయాలని సూచించారు. సీఎంపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తాలపై కార్మికులకు సమాచారం లేకపోవడంతో ఆందోళన గురవుతున్నారని తెలిపారు. ఆపరేటర్ల సమస్యలపై యాజమాన్యం స్పందించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆపరేటర్లు నారాయణ, రాజు, మహేందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
కౌటాల: గ్రామీణ యువత క్రీడల్లో రాణించా లని మాలీ సంఘం నాయకుడు మోర్లె పాండురంగ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని కన్నెపల్లి గ్రామ యువకులకు ఆయన వాలీబాల్, క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదవులో ముందుండాలని, క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నా రు. ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత నిత్యజీవితంలో క్రీడలను భాగం చేసుకోవా లని సూచించారు. గ్రామీణ యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. -
అట్టహాసంగా వాలీబాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, సీఐ శశిధర్‌రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమర్రి జీఎం దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గెలుపు, ఓటములను లెక్క చేయకుండా అకుంఠిత దీక్షతో సాధన చేస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. క్రీడల వల్ల చక్కటి క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని, సమాజంలో మంచి పౌరులను తయారు చేయడానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ క్రీడాకారులు బెల్లం శ్రీనివాస్, యాకూబ్, శివ, ఈశ్వరాచారీ, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
చేరువగా రైతు నేస్తం!
● ప్రస్తుతం జిల్లాలోని 15 రైతువేదికల్లోనే.. ● త్వరలో మరో 30 వేదికల్లో కార్యక్రమం ● ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ● ప్రభుత్వ ఉత్తర్వులు అందగానే అమలు ఆసిఫాబాద్‌అర్బన్: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు మండల కేంద్రంలోని రైతువేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు సాగుకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సంబంధిత శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో అదనంగా రెండు వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. కార్యక్రమ ఉద్దేశం ఏమంటే..పంటల సాగులో రైతులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతుల ద్వారా తరగతులు నిర్వహించి పంటల సాగు, మెలకువలు, యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ చర్యల గురించి రైతులకు వివరిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నూతన వ్యవసాయ సమాచారం చేరవేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుండడంతో రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో మండలానికి ఒక రైతువేదికను ఎంపిక చేయగా.. అదనంగా మరో రెండు క్లస్టర్లకు విస్తరించనున్నారు. జిల్లాలో ప్రతీ 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున 70 వ్యవసాయ క్లస్టర్లున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 15 రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తుండగా నూతనంగా మరో 30 వేదికల్లోనూ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ రైతువేదికల్లో..జిల్లాలో ప్రస్తుతం 15 రైతు వేదికల్లోనే రైతు నేస్తం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కెరమెరి, వాంకిడి, తిర్యా ణి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), రెబ్బెన, పెంచికల్పేట్, దహెగాం, కౌటాల, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్‌లోని రైతువేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్‌లో రైతునేస్తం నిర్వహిస్తున్న రైతువేదిక అదనంగా ఎంపిక చేసిన గ్రామాలివే..మండలం ఎంపికై న గ్రామాలు ఆసిఫాబాద్ చిర్రకుంట, రహపల్లి కెరమెరి సాంగ్వి, సుద్దాపూర్ జైనూర్ లెండిజల, ఊశేగాం వాంకిడి బంబారా, ఇందాని సిర్పూర్ (యూ) సిర్పూర్(యూయ), పంగిడి లింగాపూర్ కాంచన్‌పల్లి, లింగాపూర్ రెబ్బెన తక్కలపల్లి, నారాయణపూర్ తిర్యాణి గిన్నెదరి, మాణిక్యపూర్ కాగజ్‌నగర్ జంబూగ, దుర్గానగర్ సిర్పూర్(టి) చింతకుంట, వెంపల్లి బెజ్జూర్ కుకుడ, ఔట్సారంగపల్లి కౌటాల మొగడ్‌దగడ్, సాండ్గాంవ్ చింతలమానెపల్లి డబ్బా, రుద్రాపూర్ దహెగాం కుంచవెల్లి, గిరివెల్లి పెంచికల్పేట్ కమ్మర్గాం, చేడ్వాయిసద్వినియోగం చేసుకోవాలి రైతువేదికల ద్వారా నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పంటల సాగు పద్ధతులను తెలియజేస్తారు. రైతులతో నేరుగా చర్చించి సందేహాలను నివృత్తి చేస్తారు. అభ్యుదయ రైతుల అనుభవాలు చూపిస్తారు. దీంతో రైతుల్లో నమ్మకం పెరుగుతుంది. నూతనంగా ఎంపిక చేసిన రైతువేదికల్లో త్వరలో రైతు నేస్తం సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే రోజుల్లో రైతులకు మరింత మేలు జరుగుతుంది. – రావుల శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి -
బూరెపల్లిలో ప్రాణహిత ప్రాజెక్ట్ సర్వే
చింతలమానెపల్లి: మండలంలోని బూరెపల్లి గ్రామంలో ప్రాణహిత నదివద్ద ప్రాజెక్ట్ నిర్మాణ సర్వేను అధికారులు శనివారం ప్రారంభించా రు. రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారి కె.విఠల్‌రావు ప్రతిపాదన మేరకు జిల్లా నీటి పారుదలశాఖ అధికారులు బూరెపల్లి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణాని కి సంబంధించిన సర్వే నిర్వహించారు. ప్రాణ హిత నదికి ఆనుకుని ఉన్న బూరెపల్లి, కోర్సిని, గంగాపూర్ గ్రామాల పరిధిలోని వివరాలు సేకరించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకున్న నేపథ్యంలో రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారి విఠల్‌రావు ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్వేషణ చేపట్టి స్వచ్ఛందంగా ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించి నివేదికను నీటిపారుదల శాఖ రాష్ట్ర అధికారులకు అందించారు. ఈనేపథ్యంలో శాఖ అధికారులు సంబంధిత వివరాలు సేకరించాలని కాగజ్‌నగర్ డివిజన్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. సుమారు 10రోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు నీటి పారుదలశాఖ డీఈ వెంకటరమణ, ఏఈఈ రాజ్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో నీటి లభ్యత, నదిలో పునాదులకు అణువైన పరిస్థితులు, ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతం, మహారాష్ట్ర వైపు ప్రభావితమయ్యే ప్రాంతాలు తదితర వివరాలు సేకరించనున్నట్లు పేర్కొన్నారు. -
శిథిల భవనాల్లో కార్యాలయాలు
● ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ● కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్ చింతలమానెపల్లి: మండల అభివృద్ధి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధికి దూ రంగా ఉన్నాయి. అసౌకర్యాలు, శిథిల గోడల మధ్య కార్యకలాపాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్యాలయాలకు వచ్చే ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు, స్థానికుల డిమాండ్ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చింతలమానెపల్లి కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్‌లో సిర్పూర్ నియోజకవర్గంలో పెంచికల్పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి. చింతలమానెపల్లి మండలంలో 19 గ్రామపంచాయతీలున్నాయి. తాత్కాలిక భవనాల్లో మండల కార్యాలయాలు ఏర్పాటు చేసి మండల ప్రజలకు ఆయా శాఖల ద్వారా సేవలందించారు. తహసీల్దార్ కార్యాలయం మొదట అద్దెభవనంలో నిర్వహించి ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఒక పాఠశాల భవనానికి తరలించారు. పోలీస్‌స్టేషన్‌ను ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయగా అనంతరం శాశ్వత భవనాన్ని నిర్మించి అందులోకి మార్చారు. ఎంపీడీవో కార్యాలయాన్ని శిథిలావస్థలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఇదే భవనంలో ఎంపీపీ, ఉపాధిహామీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఎంఈవో కార్యాలయం స్థానిక దుబ్బగూడ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, ఇతర ఇంజినీరింగ్ శాఖలకు కార్యాలయాలు లేవు. శిథిల భవనాలుమండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనాలు శిథిలావస్థలో.. అసౌకర్యాలకు నిలయంగా మారాయి. మండల పరిషత్ కార్యాల య భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా అవి ఎలాంటి ఉపయోగంలోకి రాకుండా పోయా యి. గతేడాది వానాకాలంలో కార్యాలయం వరండా కూలిపోయింది. కూలిపోయిన సమయంలో స మీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వానాకాలంలో గదుల పైకప్పు నుంచి నీరు ఉరుస్తూ ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన భవనం పాఠశాల పైగదిలో ఉండడంతో కార్యాలయానికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ఉపయోగించే మెట్ల గోడ శిథిలావస్థలో ఉంది. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎలాంటి వసతులు లేక సిబ్బంది, కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి స్పందన లేదునూతన మండలాలను ఏర్పాటు చేసిన తర్వాత మండల కేంద్రాల్లో అన్ని వసతులతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. నివేదికలు అడగలేదని ఆయా శాఖల అధికా రులు చెబుతున్నారు. అన్ని వసతులతో కూడిన భవనాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘వికాసం’పై కసరత్తు
● జిల్లావ్యాప్తంగా 29,756 దరఖాస్తులు ● కొనసాగుతున్న ఇంటర్వ్యూ ప్రక్రియ ● నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలుబెజ్జూర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు రూ.4లక్షల వరకు ఆర్థికసా యం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌తో పాటు ఎంపీడీవో కార్యాలయంలో ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు గడువు గత నెల 14వ తేదీతో ముగిసింది. అయితే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ని రుద్యోగ యువత నుంచి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన లబ్ధిదారు ల ఎంపికకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధి కారులు ఆ దిశగా దృష్టి సారించారు. మండలాలవారీగా రుణ మంజూరు యూనిట్ల టార్గెట్లను ఖరా రు చేశారు. అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకు ఆదేశించింది. కొనసాగుతున్న ఇంటర్వ్యూలుజిల్లాలోని 15 మండలాల్లో రెండు రోజులుగా రాజీ వ్ యువ వికాసం పథకంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న యువతను బ్యాంక్ మేనేజర్, ఎంపీడీవో, ఎంపీవో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నారు. యువకులకు బాసటగా..రాష్ట్రంలో చదువుకున్న యువత భవిష్యత్ బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం పకడ్బందీగా అమలు చేస్తే యువతకు బాసటగా నిలవనుందని చెప్పవచ్చు. నిరుద్యోగ యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యు వ వికాసం ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలతో పకడ్బందీగా అమలు చేయడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు.మండలాలవారీగా దరఖాస్తులుమండలం దరఖాస్తుల సంఖ్య బెజ్జూర్ 1,788 ఆసిఫాబాద్ 2,238 ఆసిఫాబాద్ రూరల్ 802 చింతలమానెపల్లి 1,907 దహెగాం 1,500 జైనూర్ 1,860 కాగజ్‌నగర్‌టౌన్ 2,633 కాగజ్‌నగర్‌రూరల్ 2,853 కెరమెరి 1,761 కౌటాల 2,027 లింగాపూర్ 793 పెంచికల్పేట్ 1,072 రెబ్బెన 2,827 సిర్పూర్(టి) 1,616 సిర్పూర్(యు) 893 తిర్యాణి 1,478 వాంకిడి 1,074 -
భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి
మందమర్రిరూరల్: భూగర్భ గనులు, ఓపెన్ కాస్టు గనుల్లో విద్యుత్ భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలని సింగరేణి డీడీఎంఎస్(ఎలక్ట్రికల్) రాజీవ్ ఓం ప్రకాశ్‌వర్మ అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని కేకేఓసీ, కేకే 5 గనుల్లో నాలుగు రోజులపాటు సాధారణ తనిఖీలు నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ హాలులో ఎలక్ట్రికల్ సేఫ్టీ, సాంకేతిక ఇంటరాక్టివ్ సెషన్లో విద్యుత్ అపాయాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టీ రఘుకుమార్, ఎస్వోటు జీఎం విజయ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, ఏఎస్వో రవీందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, కేకే ఓసీపీవో మల్లయ్య, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఆర్మీకి మద్దతుగా ఆలయంలో పూజలు
ఆసిఫాబాద్‌అర్బన్: భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని జిల్లా కేంద్రంలోని కేశవనాథస్వామి ఆలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఒజ్జల నరేశ్ శర్మ, శిరీష్ శర్మ స్వామివారికి గణపతి పూజ, శ్రీదేవి భూదేవి సమేత కేశవనాథ స్వామివారికి పురుషసూక్త అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శత్రుదేశం పాకిస్తాన్‌పై మన రక్షణ బలగాలు చేపడుతున్న విరోచిత పోరాటానికి 140 కోట్లు ప్రజలు అండగా ఉండాలన్నారు. ఉగ్రవాదం అంతం కావాలని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ఇవ్వడం శుభ సూచకమన్నారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై.. జై జవాన్.. జై కిసాన్.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైరాగడె మనోజ్, సుగుణాకర్, ఖాండ్రె విశాల్, గంధం శ్రీనివాస్, రవికుమార్ జోషి, శంకర్రావ్, సురేష్‌చారి, సంతోష్‌కుమార్, మహిళలు పాల్గొన్నారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకే ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ వార్డు నంబర్– 1 ఎస్సీ కాలనీలో శుక్రవారం ఇందిర మ్మ ఇళ్ల జాబితాలోని దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించారు. ఆదాయం, కుటుంబ నేపథ్యం, రేషన్ కార్డు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే విచారించి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. జాబితాలో దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. మొక్కలు సంరక్షించాలిఆసిఫాబాద్రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొ క్కలను సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అడ గ్రామంలో ఏర్పా టు చేసిన నర్సరీని శుక్రవారం డీఆర్డీవో దత్తారా వుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సకాలంలో నీరందించాలన్నారు. పశువులు రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరు కావొద్దన్నారు. గర్భణులను అంబులెన్స్‌లో తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రమేశ్, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు. -
గ్రామసభలు బలోపేతం చేస్తాం
● డీపీవో భిక్షపతిగౌడ్ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో మెరుగైన పాలన కోసం గ్రామసభలు బలోపేతం చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. పరి పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం గ్రామ సభ పాత్ర, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలనను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం, స్వచ్ఛందంగా సమాచారం వెల్లడించడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహించడం, ఎన్నికై న ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సాధికారత, బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలు.. ఇతర అంశాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు సమాచార భాగస్వామిగా పంచాయతీ కార్యదర్శి పాత్ర, మహిళా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించేందుకు సాయం అందించే అంశాలపై చర్చించామన్నారు. కార్యక్రమంలో 35 మంది పంచాయతీ కార్యదర్శులు, రిసోర్స్పర్సన్లు మహేందర్‌రెడ్డి, సీహెచ్ రుషి, అధికారులు పాల్గొన్నారు. -
ఇక అన్నీ ప్రధాన కేంద్రాలే..
● మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్‌గ్రేడ్ ● మెయిన్ సెంటర్లుగా మార్పు ● జిల్లాలో పెరగనున్న ఆయాల పోస్టులు ● పీఎం జన్మన్ కింద పీవీటీజీ గ్రామాల్లో మరో 38 కేంద్రాలు వాంకిడి(ఆసిఫాబాద్): చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసింది. అందులో పనిచేస్తున్న వారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మేజర్ అంగన్వా డీ కేంద్రాలుగా గుర్తించాలని గత కొన్నేళ్లుగా ఆందో ళనలు చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇవ్వడంతో మినీ అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మినీ సెంటర్లలోని టీచర్లకు రూ.7500 వేతనం చెల్లిస్తుండగా ఇకపై ప్రధాన కేంద్రాల్లోని టీచర్లకు చెల్లిస్తున్న విధంగా రూ.13,650 చొప్పున అందించనున్నారు. 139 కేంద్రాలు అప్గ్రేడ్జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), జైనూర్, వాంకిడి మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 139 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా యి. గతంలో చిన్న కేంద్రాల్లో కేవలం టీచర్లను మాత్రమే నియమించారు. ఆయాలు లేకపోవడంతో టీచర్లే అన్ని పనులు చూసుకునేవారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించడంతోపాటు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేసి పెట్ట డం, రోజూవారీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, రిజిస్టర్లు నమోదు చేయడం తదితర పనులు వారికి భారంగా ఉండేవి. గ్రామంలోని ఇళ్లకు తిరుగుతూ పౌష్టికాహారం, తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా గుర్తించాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి జిల్లాలోని 139 మినీ కేంద్రాలు అప్‌గ్రేడ్ చేసింది. మేజర్ అంగన్వాడీలుగా మారడంతో ఆయాల పోస్టులు సైతం పెరగనున్నాయి. ప్రస్తుతం 126 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 397 ఆయా పోస్టులు ఖాళీ ఉండగా.. మరో 139 పోస్టులు అవసరం కానున్నాయి. ఇకపై అన్ని కేంద్రాలను ఒకే కేటగిరీలో గుర్తించనుండటంతో మినీ కేంద్రాల టీచర్లు సైతం రూ.13,650 వేతనం అందుకోనున్నారు. అద్దె భవనాల్లో నిర్వహణజిల్లాలోని అనేక కేంద్రాలు అద్దె, రెంట్ ఫ్రీ(స్కూల్ బిల్డింగ్స్)ల్లో కొనసాగుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణం, మౌలిక సదుపాలయాల కల్పనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు. 352 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా.. 326 కేంద్రాలు పాత స్కూల్ భవనాల్లో నిర్వహిస్తున్నారు. 296 కేంద్రాలకు ఎలాంటి భవనాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.కొత్తగా 38 కేంద్రాలుపీఎం జన్మన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని పీవీటీజీ గ్రామాల్లో 38 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత గ్రామాల్లో భవనాల నిర్మాణం చేపట్టేందుకు స్థలాలు గుర్తించాల్సి ఉంది. తదనంతరం ప్రత్యేక నిధులను కేటాయించి టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో పారదర్శకతతో పాటు అవినీతికి తావులేకుండా ప్రతీ టీచర్‌కు రూ. 20 వేలు విలువ చేసే ట్యాబ్‌లు అందజేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదు. పోరాట ఫలితంగానే.. ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం గుర్తించి జీతాలు పెంచింది. భవిష్యత్తులో వీళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. – బోగె ఉపేందర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి139 కేంద్రాలకు ప్రయోజనం జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 139 మినీ సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మినీ కేంద్రాలను అప్‌గ్రెడ్ చేయడంతో అన్నీ మేజర్ కేంద్రాలుగా మారాయి. వారికి వేతనాలు పెరగడంతో పాటు హెల్పర్ల సదుపాయం కలుగనుంది. జిల్లాలో 139 కేంద్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీ -
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆసిఫాబాద్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఈ నెల 12న అంతర్జాతీయ నర్సులు దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదన్నారు. స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శిబిరంలో 15 మంది పాల్గొనగా, 15 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సుల సూపరింటెండెంట్ ఇందుమతి, హెడ్ నర్సులు ఏసుకరణ, సఫియా, కుసుమ, స్టాఫ్ నర్సులు శ్రీదేవి, పద్మ, సృజన, సునీత, సుమిత్ర, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీడీ వ్యాధిగ్రస్తులపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఎన్సీడీ వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సీతారాం అన్నారు. ఎన్సీడీ వ్యాధిగ్రస్తులకు నిర్వహించే పరీక్షలు, వైద్యసేవలపై శుక్రవా రం జిల్లా కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బందికి ప్రోగ్రాం అధికారి వినోద్‌తో కలిసి అవగాహన క ల్పించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ బాధితులకు క్రమపద్ధతిలో వైద్యం అందించాలన్నారు. సికిల్‌సెల్ ప్రోగ్రాంలో భాగంగా గిరిజన గ్రామాల్లో స్క్రీనింగ్ నిర్వహించా లని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడాదుస్తులు పంపిణీ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపునకు హాజరైన విద్యార్థులకు శుక్రవారం డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్ క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేసవి సెలవుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఈ క్యాంపులు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్ హెచ్ఎం జంగు, పీడీ, పీఈటీలు లక్ష్మణ్, పాండు, అరవింద్, రవీందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: గంజాయి నిర్మూలనకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులకు వేయింగ్ మిషన్లు అందించా రు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలుగా మారినా, గంజాయి సరఫరా, విక్రయించినా వివరాలను 87126 70551, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. ఆసిఫాబాద్ సీఐ బుద్దె రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
అర్హుల పేర్లు మాత్రమే జాబితాలో ఉండాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితా లో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు పరిధిలో గల బజార్‌వాడీలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో దరఖాస్తుదారు సాహెరా బేగం ఇంటిని గురువారం స్వయంగా సందర్శించారు. దరఖాస్తుదారు కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు సొంతింటి స్థలం ఉండాలని, నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. లబ్ధిదారులు ఇంటిని సొంతంగా నిర్మించుకోవాలని, పనులు పూర్తయిన ప్రకారం నిధులు మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా పర్యవేక్షించాలని పరిశీలన అధికారి రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
హ్యాండ్‌బాల్ కోచ్‌గా సాయి
ఆసిఫాబాద్‌రూరల్: జాతీయస్థాయి సౌత్ జోన్ హ్యాండ్‌బాల్ పో టీలకు తెలంగాణ రాష్ట్ర జట్టు కోచ్‌గా జి.సాయి ఎంపికయ్యారని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉమ్మ డి జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు తమిళనాడులో జరిగే హెచ్ఎఫ్ఐ 40 సౌత్ జోన్ జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు సాయి కోచ్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కాగా, సాయి ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నారు. -
పేదలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: సీఎం సహాయనిధి చెక్కులను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో గురువారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదు
ఆసిఫాబాద్‌అర్బన్: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఆసిఫాబాద్ ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు హెచ్చరించా రు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దౌర్జన్యంపై గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఆసిఫాబాద్ ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. సాక్షి ఎడిటర్ నివాసంలో అనుమానితులు ఉన్నారనే నెపంతో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా చట్టవిరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో సో దాలు చేశారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుశాఖ భేషరతుగా జర్నలిస్టులు, సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాక్షి జిల్లా ప్రతినిధి రామ్మోహన్, రిపోర్టర్ వారణాసి శ్రీనివాస్‌రావ్, జర్నలిస్టులు దాసరి సురేశ్, వేణుగోపాల్, కృష్ణంరాజు, మీర్ సలీం, రాజు, బిక్కాజీ, ప్రకాశ్‌గౌడ్, సురేశ్, శ్రీధర్, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసన -
సాదాబైనామాలే అధికం
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పెంచికల్పేట్ మండలం లోడుపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్దల పోశం. లోడుపల్లి శివారులో ఎకరం భూమికి పాత పట్టా పాసుపుస్తకం ఉంది. నూతన పట్టా పాసు పుస్తకం కోసం ఇటీవల రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్నాడు. పెంచికల్పేట్(సిర్పూర్): భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పెంచికల్పేట్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి. భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. చేడ్వాయి, దరోగపల్లి, అగర్‌గూడ గ్రామాల్లో ఇప్పటివరకు మూడు రోజులపాటు సదస్సులు నిర్వహించారు. గురువారం వరకు 174 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా రు. దరఖాస్తుల వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఎక్కువగా సాదాబైనామాల సమస్యలతోనే ప్రజలు వస్తున్నారు. మూడు బృందాల ఏర్పాటుగ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం అధికారులతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో తహసీల్దార్‌తో పాటు ఆరుగురు సిబ్బందిని నియమించారు. తహసీల్దార్లు వెంకటేశ్వరరావు, కవిత, సురేశ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన సదస్సుల్లో చేడ్వాయి గ్రామంలో 95, జనకపూర్‌లో 66, అగర్‌గూడలో 13 దరఖాస్తులు స్వీకరించారు. రైతులు ఎక్కువగా లావుణి పట్టా దరఖాస్తులు, డిజిటల్ సైన్, సాదా బైనామాలు, విరాసత్, నూతన పట్టా పాసుపుస్తకం, విస్తీర్ణంలో మార్పులపై సమస్యలు విన్నవిస్తున్నారు.వ్యవసాయ భూమి విస్తీర్ణం 15,724 ఎకరాలు పైలట్ మండలంగా పెంచికల్పేట్ ఎంపిక ఈ నెల 19 వరకు గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు ఇప్పటివరకు 174 దరఖాస్తులు స్వీకరణ మండలం వివరాలు -
కవి సమ్మేళనంలో రాధాకృష్ణాచారి
ఆసిఫాబాద్‌అర్బన్: తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆసిఫాబాద్‌కు చెందిన కవుల సంఘం ప్రచార కార్యదర్శి రాధాకృష్ణాచారి కవితాగానం చేశారు. ప్రముఖ కవులతో ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇలికాల పురుషోత్తం, లక్ష్యసాధన సమితి చైర్మన్ ప్రజ్ఞారాజ్, తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్ తదితరులు రాధాకృష్ణాచారిని శాలువా లు, పూలమాలతో సత్కరించి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందించారు. ఆకసం ప్రతినిధులు శ్రీరాం సత్యనారాయణ, మాడుగుల నారాయణమూర్తి, సభ్యులు గుర్రాల వెంకటేశ్వర్లు, ధర్మపురి వెంకటేశ్వర్లు, తూమోజు సురేష్‌చారి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. -
రూ.పదివేలు ఇస్తేనే హాల్‌టికెట్!
● బీఈడీ కళాశాలలో ఫీజుల దోపిడీ ● కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బీఈడీ కళాశాల ఫీజుల దోపిడీకి పాల్పడుతోంది. శిక్షణ ఉపాధ్యాయులకు ఈ నెల 12 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా, అదనంగా రూ.10వేలు కడితేనే హాల్‌టికెట్ ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో కాలేజీ వద్ద ఆందోళన తెలిపారు. అటెండెన్స్ పేరుతో వసూళ్లు..జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కళాశాలలో రెండేళ్ల బీఈడీ కోర్సులో మొత్తం 200 మంది విద్యార్థులు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉండే పీజీ, యూజీ కళాశాలల నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ఎలాంటి ట్యూషన్, స్పెషల్ ఫీజులు తీసుకోవద్దు. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్లు, పరీక్షల హాల్‌టికెట్లు కళాశాల యాజమాన్యం తన వద్ద ఉంచుకోవద్దు. కానీ జిల్లాకేంద్రంలో బీఈడీ కాలేజీ యాజమాన్యం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సా ధారణంగా మేనేజ్మెంట్ కోటా కింద 20శాతం, కన్వీనర్ కోటా కింద 80శాతం సీట్లు భర్తీ చేయాలి. కానీ ప్రత్యేక అనుమతితో 70 మంది వరకు మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్ పొందారు. వీరికి యూనివర్సిటీ నిబంధన ప్రకారం రూ.78,000 ఫీజు ఉంది. కానీ విద్యార్థుల నుంచి అదనంగా రూ.10వేలు అటెండెన్స్ ఫీజు పేరుతో వసూలు చేస్తున్నారు. విద్యార్థులకు బెదిరింపులు..!కళాశాలలో గురువారం ప్రాక్టికల్ పరీక్షలు ముగియగా, ఈ నెల 12 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే 200 మంది రూ.10 వేల చొప్పున అదనంగా చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని, లేకుంటే ప్రాక్టికల్ చివరి పరీక్షకు గైర్హాజరైనట్లు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు అసభ్యకర రీతిలో సందేశాలు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు. గురువారం కళాశాలలో సిబ్బందిని ‘సాక్షి’ ప్రశ్నించగా యాజమాన్యం సూచించిన విధంగా ఫీజులు వసూలు చేస్తున్నామని, అంతకు మించి తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. -
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా
వాంకిడి(ఆసిఫాబాద్): దశాబ్దాలుగా నివా సం ఉంటున్న ఇళ్లకు ఇంటి పన్నులు ఇవ్వాలంటూ బుధవారం మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీవాసులు ఆందోళనకు దిగా రు. వంద మందికిపైగా మహిళలు, పురుషులు ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. వారు మాట్లాడుతూ లక్ష్మీనగర్ కాలనీలో తమకు కేటాయించిన స్థలాల్లోనే ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. అధికారులు, పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సీసీ రోడ్డు వేస్తున్నా ఇంటి పన్నులు ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. మండల ప్రత్యేక అధికారి రాథోడ్ బిక్కు దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రత్యేకాధికారి హామీ ఇచ్చారు. -
‘రైతులను పట్టించుకోని సర్కార్’
కౌటాల(సిర్పూర్): రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులను నట్టేటా ముంచిందని, రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని సాండ్గాంలో వర్షంతో దెబ్బతిన్న పంటలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు బోనస్, దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి రూ.40 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు పరిహారం అడుగుతారని ముందే నన్ను కోసినా రూపాయి లేదని సీఎం అంటున్నారని విమర్శించారు. ఆయన వెంట నాయకులు బండు పటేల్, రాజు, నవీన్, కార్తీక్, దిలీప్, రింకూ తదితరులు పాల్గొన్నారు. -
‘గ్రంథాలయాల్లోని సమస్యలు పరిష్కరిస్తాం’
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని రాష్ట్ర గ్రంథా లయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం ఎమ్మెల్సీ దండె విఠల్ ను కలిశారు. గ్రంథాలయాలు లేని మండల కేంద్రాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. అనంతరం రియాజ్‌ను శాలువాతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి తిర్యాణి(ఆసిఫాబాద్): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సంవిధాన్ బచావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను నిర్వీర్యం చేసే దిశగా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. దీనికి దీటుగా సమాధానం చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
● గతేడాది క్వింటాల్ మిరప పంటకు రూ.18వేలు ● ఈ ఏడాది రైతులకు దక్కని మద్దతు ధర ● అధిక రసాయనిక మందుల వినియోగమే కారణం.. ● సలహాలు అందించని అధికారులు
మిరప పంటతో రైతు చింతలమానెపల్లి(సిర్పూర్): ఈ ఏడాది మిరప రైతులకు నష్టాలే మిగిలాయి. బహిరంగ మార్కెట్లలో ధర భారీగా రేట్లు పతనం కావడంతో నష్టపాలయ్యారు. అప్పులు తీర్చేమార్గం కనిపించడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. గతేడాది మిరప పంటకు క్వింటాలుకు రూ.20వేల ధర ఉండగా.. ఒక్కో రైతుకు నాణ్యమైన పంట క్వింటాలుకు రూ.15వేల నుంచి రూ.18వేల ధర లభించింది. కానీ ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు గరిష్టంగా రూ.12వేలే పలుకుతోంది. జిల్లా రైతులకు నాగాపూర్, వరంగల్ మార్కెట్లలో రూ.8వేల నుంచి రూ.11వేల ధర వస్తోంది. మిరప పంట సాగుకు ఎకరాకు రూ.1.20 లక్షల వరకు ఖర్చవుతుండగా, ఎకరాకు కనిష్టంగా 9 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. ఈ లెక్కన రైతుకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. రూ.లక్షల్లో నష్టం మిగులుతోంది. మహారాష్ట్రకు తరలింపు.. జిల్లాలో ఏటా మిరప పంట రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్ల క్రితం కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 2100 ఎకరాలు ఉండగా.. ఈ ఏడాది ఒక్క కౌటాల మండలంలోనే సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేశారు. పత్తి, సోయా పంటలతో పోలిస్తే మిరపలో లాభాలు సా ధిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలో సుమారుగా 800 ఎకరాలు, బెజ్జూర్ మండలంలో 400 ఎకరాలు, పెంచికల్పేట్ మండలంలో 600 ఎకరాలు, దహెగాం మండలంలో 800 ఎకరాలు, సిర్పూర్(టి) మండలంలో సుమారుగా 2వేల ఎకరాల్లో సాగు చేసినట్లుగా అంచనా. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో జిల్లా రైతులు పంటను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. స్థానికంగా పండించే పంట నాణ్యతతో ఉన్నా నాగ్‌పూర్, ఇంగన్గాట్ తదితర ప్రాంతాల్లో అమ్ముకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌లో పంట కొనుగోలు చేస్తున్నా.. స్థాని కులు ఎక్కువగా మహారాష్ట్రకు వెళ్లేందుకే మొ గ్గు చూపుతున్నారు. అక్కడా దళారులు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అందని మద్దతు ధర.. మూడేళ్లుగా కౌటాల మండలం తాటిపల్లి రైతులు మిరప పంటను సాగు చేస్తూ లాభాలు గడించారు. వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి గ్రామస్తులను ప్రోత్సహించారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మిరప పంట కు వస్తున్న ఆదరణతో కౌటాలతోపాటు జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం పెరిగినా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం కొరవడింది. మద్దతు ధర కూడా లభించడం లేదు. వరంగల్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతాల్లో రైతులకు రూ.12,500 నుంచి రూ.14వేల వరకు ధర వచ్చింది. కానీ మన జిల్లా రైతులకు ఆరంభంలో రూ.12వేల ధర పలికినా వెంటనే ధర తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.9వేల నుంచి రూ.7వేలకు పడిపోయింది. ధర తగ్గుతూనే ఉండడం ఆందోళనకరంగా మారింది. డిసెంబర్ చివరివారం నుంచి ఏప్రిల్ వరకు విక్రయించారు. డిసెంబర్లో క్వింటాల్‌కు రూ.12,500 లభించగా ఏప్రిల్‌లో రూ.7,500కు ధర మాత్రమే దక్కింది. కారణాలు అనేకం.. జిల్లా రైతులు పండించిన మిరప పంటకు ధర దక్కకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నా యి. గతేడాది దిగుబడి గణనీయంగా వచ్చింది. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే చీడపీడలు ఆశించడంతో రసాయనిక మందుల వినియో గం పెరిగింది. వాతావరణం కూడా ఈ ఏడాది మారిపోయింది. పురుగుమందులు, రసాయనిక ఎరువుల వినియోగం రెట్టింపయింది. పండిన పంట నాణ్యత కోల్పోయింది. మిరప కాయ సైజు, రంగు, మెరుపు లేకపోవడంతో మార్కెట్లో ధర తగ్గింది. రంగు తగ్గిన కాయలు పెరిగి ధర దక్కలేదని అక్కడి హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మిరప పంట ఇతర ప్రాంతాల రైతుల సాగు పద్ధతులకు, మన జిల్లా రైతుల సాగు పద్ధతులకు తేడా కనిపించింది. స్థానికంగా రైతులకు పంటల సాగులో తగిన సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కాయ నాణ్యత లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేయడానికి కూడా అనుకూలంగా లేదు. తేమ ఎక్కువగా ఉండడం కూడా ధర తగ్గడానికి కారణమైంది. మెలకువలు అందించడంలో అధికారుల ప్రోత్సాహం కరువైందని ఆరోపిస్తున్నారు. -
క్రీడాభివృద్ధికి పూర్తి సహకారం
ఆసిఫాబాద్‌అర్బన్: క్రీడాభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన 38వ జాతీయ స్థాయి సీనియర్ నెట్‌బాల్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కీర్తన, దీప్తిలతో పాటు ఎస్జీఎఫ్ నేషనల్ జూనియర్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన సాయి దీక్ష, అర్చన, సంజనలను బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడలకు ప్రత్యేక కోటా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, డీవైఎస్వో రమాదేవి, నాయకులు నిసార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీఆర్టీల సమస్యలపై మంత్రి సానుకూలం’
ఆసిఫాబాద్‌రూరల్: సీఆర్టీల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర మంత్రి సీతక్క సానుకూలంగా సం్పదించారని టీడబ్ల్యూ సీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. హైదరాబాద్‌లో మంత్రిని జనవరి 3న కలిసి సమస్యలు ప్రస్తావించగా, బుధవారం గిరిజన సంక్షేమశాఖ సెక్రెటరీ శరద్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారని పేర్కొన్నారు. సీఆర్టీలు చనిపోతే తక్షణమే సహాయం కింద రూ.30 వేలు, 10 నెలల జీతానికి బదులుగా 12 నెలల జీతం, ఏటా ఆటోమెటిక్ రెన్యూవల్, గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారని తెలిపారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజేష్, నాయకులు పాల్గొన్నారు. -
● ‘ఆపరేషన్ సిందూర్’పై హర్షాతిరేకాలు ● కశ్మీర్ ఉగ్రదాడికి సరైన జవాబు ● భారత సైన్యాన్ని కొనియాడిన జిల్లా ప్రజలు
అనుక్షణం అప్రమత్తం సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్నాం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో విధులు నిర్వర్తిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాం. ఆర్మీ సరైన సమయంలో సరైన బదులిస్తోంది. – హరి మ్రిదా, గూర్ఖా రెజిమెంట్ భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయకులైన ప్రజలను కిరాతకంగా చంపిన ఉగ్రమూకలకు సరైన సమాధానం చెప్పినట్లైంది. భారత సైన్యం సాహసాన్ని జిల్లా ప్రజలు, రిటైర్డ్ జవాన్లు కొనియాడుతున్నారు. ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై జిల్లావాసులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. – ఆసిఫాబాద్‌అర్బన్/చింతలమానెపల్లి -
భూసమస్యల పరిష్కారానికే సదస్సులు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేపెంచికల్పేట్(సిర్పూర్): భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మండలంలోని దరోగపల్లి, చేడ్వాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను బుధవారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న పెంచికల్పేట్ మండలంలో ఈ నెల 20 వరకు మూడు ప్రత్యేక బృందాలతో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఎల్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ సౌకర్యాలు కల్పించాలని, గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తహసీల్దార్లు వెంకటేశ్వర్రావు, కవిత, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. -
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి 24 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో బుధవారం జిల్లాస్థాయి నెట్‌బాల్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోటీల్లో 60 మంది క్రీడాకారులు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 12 మంది బాలికలు, 12 బాలురు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని వెల్లడించారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో నియామకాలు, జీతాల పెంపు
రెబ్బెన(ఆసిఫాబాద్): త్వరలో గ్రంథాలయాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టడంతోపాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎండీ రియాజ్ తెలిపారు. మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవా రం తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న పుస్తకా లు, రోజువారీగా వస్తున్న పాఠకుల సంఖ్య, గ్రంథా లయంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నా రు. పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థులు, యువత లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తప్పనిసరిగా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. పాత స్టేషన్లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలిమండల కేంద్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాత పోలీస్ స్టేషన్ భవనంలో తాత్కాలికంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠకులు, విద్యార్థులు రాష్ట్ర చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. ప్రస్తుతం గ్రంథాలయం కొనసాగుతున్న భవనం ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. స్పందించిన ఆయన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లావుడ్య రమేశ్, నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్, మడ్డి శ్రీనివాస్‌గౌడ్, దుర్గం రాజేష్, దుర్గం అన్నాజీ, జహీర్‌బాబా, నాసిర్ ఉస్మానీ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషికౌటాల/సిర్పూర్(టి): జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు. కౌటాల, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను మంగళవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని గ్రంథాలయాలు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. కౌటాల, సిర్పూర్(టి) లైబ్రరీలకు నూతన భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎండీ రియాజ్ -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
దహెగాం(సిర్పూర్): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంతోపాటు లగ్గాం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వరి ధాన్యంలో తేమశాతం 17కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పంట విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. -
పేదలపై వడ్డీ మోత
● ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పులు ● అక్రమంగా అధిక వడ్డీ వసూలు ● ఇటీవల ఆసిఫాబాద్‌లో పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలువాంకిడి(ఆసిఫాబాద్): సామాన్య ప్రజలే లక్ష్యంగా జిల్లాలో కొందరు వ్యాపారులు అక్రమంగా వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే పేద, అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆస్తులు తనఖా పెట్టుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. రోజూ గడవడమే కష్టంగా ఉన్న నిరుపేదలు అరకొరగా ఉన్న ఆస్తులను కష్టాకాలంలో వ్యాపారుల చేతుల్లో పెట్టేస్తున్నారు. తీసుకున్న అసలుకు సరిసమానంగా వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లో బడా వ్యాపారులు వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత నెల 29న జిల్లా పోలీస్ యంత్రాంగం పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రైతులే అధికం..వడ్డీ వ్యాపారానికి పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు చిన్న, సన్నకారు రైతులే అధికంగా బలవుతున్నారు. ఏప్రిల్ నుంచే వ్యవసాయ క్షేత్రాల్లో వేసవి దుక్కులతో పనులు ప్రారంభమవుతాయి. రైతులు భూస్వాములు, వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. మండల కేంద్రాల్లోని ఎరువులు, విత్తన దుకాణ దా రులతోపాటు, ప్రైవేటు పత్తి కాంటా యాజమానులు రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నా రు. అవసరాలకు అప్పులు ఇస్తూ పంట దిగుబడి అనంతరం ముక్కు పిండి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టితో కలిగే నష్టాలతో బ్యాంకు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వారిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఏకకాలంలో దాడులుఆసిఫాబాద్ పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ఇటీవల ఏకకాలంలో దాడులు నిర్వహించడం కలకలం రేపింది. ముందస్తు సమాచా రంతో ఆసిఫాబాద్ సబ్ డివిజన్లో నలుగురు సీఐ లు, ఎనిమిది మంది ఎస్సైలు, మొత్తం 50 మంది పోలీస్ సిబ్బందిలో ప్రత్యేక ప్రణాళికతో సోదాలు ని ర్వహించారు. రూ.11 లక్షల నగదుతోపాటు బ్లాంక్ బ్యాంక్ చెక్కులు, రాయించుకున్న బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు సీజ్ చేశారు. ఆకస్మికంగా చేపట్టిన ఈ సోదాలతో జిల్లాలోని వడ్డీ వ్యాపారుల్లో కలవరం మొదలైంది. పట్టణ ప్రాంతాలతోపాటు మండలస్థాయి, గ్రామీణ ప్రాంతాల్లోనూ చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారాలపై నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు. అనుమతి లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. సామాన్యులతో పాటు అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదు. ఇటీవల 15 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించి పదిమందిపై కేసులు నమోదు చేశాం. బాధితుల ఫిర్యాదు చేస్తే దాడులు నిర్వహిస్తాం. – చిత్తరంజన్, ఏఎస్పీ అధిక వడ్డీలకు అప్పులు..జిల్లాలో వందకు రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ విధిస్తున్నారు. సామాన్యులు రుణాల కో సం బ్యాంకులకు వెళ్తే డాక్యుమెంట్లు, ఇతర ధ్రు వపత్రాల పేరుతో ఖాతాల్లో డబ్బులు జమ కా వాలంటే సమయం పడుతుంది. అన్నీ తెలిసిన వ్యక్తులు మాత్రమే బ్యాంకు రుణాలు పొందగలుగుతున్నారు. తొందరగా రుణాలు పొందాల నే పేదలు వడ్డీ వ్యాపారుల వద్ద బాండ్లు రాసి, లేదా ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. గతంలో పట్టణాల్లోనే ఉన్న వడ్డీ వ్యాపారం వ్యవస్థ క్రమంగా గ్రామాలకూ పాకింది. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉండే భూస్వాములు, దుకాణదారులు ఈ దందాపై కన్నేశారు. పేదల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. అధిక వడ్డీలు భారంగా మారుతుండటంతో అసలు చెల్లించలేకపోతున్నారు. ఏటా వడ్డీ కడుతూ అప్పుల్లో మునిగిపోతున్నారు. అప్పులు తీర్చలేకపోతే ముందుగానే రాయించుకున్న ఆస్తులు జప్తు చేసుకుంటున్నారు. బంగారం, భూములు తదితరాలు అత్యవసర సమయాల్లో కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా బాధితులు అప్పు తీసుకోవడమే తప్పుగా భావిస్తూ ఫిర్యాదులకు ముందుకు రావడంలేదు. -
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
పెంచికల్పేట్(సిర్పూర్): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు మండలంలోని చేడ్వాయి రైతువేదికలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పెంచికల్పేట్ మండలం చేడ్వాయిను పైలట్ గ్రామంగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు వెంకటేశ్వర్రావు, కవిత, సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన పాలిసెట్ శిక్షణ
ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ పట్టణంలోని డివిజ న్ రిసోర్స్ సెంటర్లో నిర్వహిస్తున్న ఉచిత పాలిసెట్ శిక్షణ శిబిరం మంగళవారంతో విజ యవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తగ్గించడానికి విద్యే అత్యుత్తమ ఆయుధమన్నారు. జిల్లాలో పేద విద్యార్థులు అధికంగా ఉన్నందున ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో ప్రభాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
జిల్లాలో పోక్సో కేసుల వివరాలు
బెజ్జూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13) ఏప్రిల్ 7న దహెగాం మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న మేనత్త ఇంటికి వచ్చింది. అదే రోజు వరుసకు మామ అయిన వ్యక్తి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నీరసంగా ఉండడంపై తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగిన విషయం తెలిసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 22న దహెగాం మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక(11) తల్లిదండ్రులు పనికోసం చేనుకు వెళ్లారు. బాలిక ఇంటి వద్ద తన చెల్లిని ఆడిస్తుండగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. కౌటాల(సిర్పూర్): జిల్లాలో బాలికలపై కామాంధుల దుశ్చర్యలు కలకలం రేపుతున్నాయి. పసిమొగ్గలపై పైశాచికత్వం రోజురోజుకూ పెట్రేగిపోతుంది. గంజాయి, మద్యం మత్తులో కామాంధులు వావివరసలు మర్చిపోతున్నారు. పిల్లలు అని కూడా చూడకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల వరుసగా జిల్లాలోని దహెగాం మండలంలో ఇద్దరు బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడిన ఘటనల్లో పోలీసులు పోక్సో కేసులు నమోదు చేశారు. పెరుగుతున్న అఘాయిత్యాలు..దేశంలో ఎన్ని చట్టాలున్నా.. పోలీసు భద్రత ఉన్నా బాలికలకు రక్షణకు కరువవుతోంది. జిల్లాలో మైనర్లపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. వీటిలో కొన్ని వెంటనే వెలుగులోకి వస్తుండగా.. మరికొన్ని ఇతర కేసుల విచారణ సమయంలో, లేక బాధితులు అనారోగ్యానికి గురైనప్పుడో వెలుగుచూస్తున్నాయి. పరువుపోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు ఘటనలను దాచిపెడుతున్నారు. నిందితులు తెలిసిన వారై ఉండటం, పోలీసుల దృష్టికి వెళ్తే.. బయటకు వచ్చాక మళ్లీ వేధిస్తారన్న భయంతో ఫిర్యాదు కూడా చేయడం లేదు. పోక్సో చట్టంపై మరింత అవగాహన కల్పించాల్సి ఉండగా, బాలికల రక్షణకు సర్కారు ఇంకొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. తల్లిదండ్రులు సైతం పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలని అధికారులు సూచిస్తున్నారు. యువకులే అధికం..మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్న కేసులో ఈ నెల 1న జిల్లా కోర్టు వంజిరిగూడ గ్రామానికి చెందిన చంద్రకాంత్ అనే నిందితుడికి పదేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. అలాగే మైనర్ బాలికను మోసం చేసిన పోక్సో కేసులో ఆసిఫాబాద్ మండలం పర్శనంబాల గ్రామానికి చెందిన గెట్కర్ శ్రీకాంత్‌కు జిల్లా కోర్టు ఏప్రిల్ 24న జీవిత ఖైదుతో పాటు రూ.60 వేల జరిమానా విధించింది. పోక్సో కేసుల్లో పోలీసులు, కోర్టులు కఠినంగా వ్యవహరిస్తున్నా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు లైంగిక దాడులు క్షణికావేశం, మద్యం మత్తులోనే జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇందులోనూ యువకులే ఎక్కువగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ, సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం ఇలాంటి ఘటనలపై ప్రభావం చూపుతోంది. తెలిసీతెలియని వయస్సులో పిల్లలు స్మార్ట్ఫోన్లలో అశ్లీల వెబ్సైట్లు, వీడియోలు చూస్తూ చెడుమార్గాన్ని అనుసరిస్తున్నారు. నేరాలకు పాల్ప డి జీవితం నాశనం చేసుకుంటున్నారు. పసిపిల్లలపై పైశాచికత్వం కఠిన శిక్షలున్నా కామాంధుల్లో మార్పు కరువు ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు చిన్నారులకు అండగా పోక్సో చట్టంపిల్లల బాధ్యత తల్లిదండ్రులదే.. పిల్లల బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. వారి కదలికలు, దినచర్యలో వారు ఏం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు. వారి స్నేహితుల వివరాలు తెలిసి ఉండాలి. సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించాలి. బాలిక రక్షణ చట్టాలపై కళా శాలలు, పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీం ఉంది. డయల్ 100కు కాల్ చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారు. – రామానుజం, డీఎస్పీ, కాగజ్‌నగర్ పట్టింపు అవసరం చాలా ఘటనల్లో తెలిసినవారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇందుకు దహెగాం ఘటనే నిదర్శనం. తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదలకుండా కనిపెట్టుకుని ఉండాలి. వారి ప్రవర్తనలో తేడాలు గమనిస్తే కారణాలు తెలుసుకోవాలి. పాఠశాల, కళాశాలకు పంపినప్పుడు అక్కడికి చేరుకున్నారో? లేదో విచారించుకోవాలి. ఎవరైనా ప్రేమగా మాట్లాడినా, ఆటలు ఆడినా.. చిన్నారులు వారి దగ్గరకు వెళ్తారు. అంద రూ మనవారే అనే భావనలో ఉంటారు. మంచితనం ముసుగులో కొంతమంది లైంగిక దా డులకు తెగబడుతున్నారు. బాలికలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి. ఇంట్లో మగ పిల్లలు ఉంటే వారికి మహిళలు, బాలికలను ఎలా గౌరవించాలో తెలియజేయాలి. తమ శరీరంలోని సున్నితమైన భాగా లను ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే ఎలా ప్రవర్తించాలో తెలపాలి. ఆడపిల్లలకు అవసరమైతే ఆత్మరక్షణకు కరాటే, కుంగ్‌ఫూ వంటివి నేర్పించాలి. పిల్లలతో రోజూ కొంత సమయం గడుపుతూ వారు చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చట్టాల గూర్చి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యం చేయాలి. 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే అత్యాచారాలు, వేధింపులపె పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. కనీసం మూడేళ్లకు తగ్గని జైలు శిక్ష, అత్యధికంగా జీవితఖైదు, అవసరమైతే జరిమానా కూడా విధిస్తారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని, అలాగే 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం సమ్మె నోటీసు అందించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా మారి 14 నెలలవుతున్నా మున్సిపల్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నారు. కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేతనాలు పెంచడంతోపాటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు తోట సమ్మయ్య, కార్యదర్శి మాట్ల రాజయ్య, నాయకులు దుర్గాప్రసాద్, వినోద్ ఉన్నారు. ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు మంగళవారం జిల్లా కేంద్రంలో డీటీడీవో రమాదేవి కి వినతిపత్రం అందించారు. డైలీవేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాంబాయి, పత్రుబాయి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: వేసవిలో ఉత్పన్నమయ్యే తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మిషన్ భగీరథ పథకం ఇంజినీర్లు, జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో తాగునీటి సరఫరాపై సమీ క్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ తాగునీటి సమస్యలపై దినపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై స్పందించి వెంట నే పరిష్కరించాలన్నారు. ప్రతీ మండలంలో బుధవారం తాగునీటి సమస్యలపై ఎంపీడీవో కార్యాలయాల్లో సమీక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని 147 హ్యాబిటేషన్ గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా నీటి ట్యాంకర్లు, బోర్‌వెల్స్ ద్వారా నీటిని అందించా లన్నారు. మిషన్ భగీరథ పైపులైన్లలో లీకేజీలకు యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టాలని సూ చించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి వృథా పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పంచా యతీ కార్యదర్శులు ప్రతిరోజూ తాగునీటి వివరాల ను అందించాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ ప్రత్యేకాధికారులు తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, డీఆర్డీవో దత్తారావు, డీపీఆర్వో సంపత్‌కుమార్, డీఎల్పీవో ఉమర్ హు స్సేన్, మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావు, మిషన్ భగీరథ ఈఈ సద్దిఖి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలిజిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల జాబితాలపై హౌసింగ్ కార్పొరేషన్ పీడీ, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బేస్మెంట్ వరకు పూర్తిచేసిన లబ్ధిదారులకు మొదటి విడత నిధులు అందించాలని ఆదేశించారు. ఇళ్లను 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని, సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. హౌసింగ్ శాఖలో నూతనంగా నలుగురు ఇంజినీర్లు ఒప్పంద పద్ధతిన వచ్చారని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించారు. అనర్హుల వివరాలు ఉంటే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పాకిస్తానీయులను దేశం నుంచి పంపించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను పంపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు మంగళవారం వినతిపత్రం అందించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం మాట్లాడుతూ ఇటీవల పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రవాదులు కశ్మీర్లో క్రూరమైన దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నారని తెలిపారు. భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్ దేశస్తులను కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి పంపించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర్రావు, మల్లికార్జున్, వెంకన్న తదితరులు ఉన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలిప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం మాట్లాడుతూ కెరమెరి, చింతలమానెపల్లి మండలాల్లో సరైన రోడ్లు, తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకటి, విజయ్, తుకారాం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి జేఏసీ కన్వీనర్ దివాకర్ అధ్యక్షతన సోమవా రం రౌండ్ టేబల్ సమావేశం నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చే యాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గు ర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించా లని, కొత్త అలవెన్స్ అమలు చేయాలని, రిటైర్డ్ ఉ ద్యోగులకు బకాయిలు చెల్లించాలన్నారు. మహాలక్ష్మి పథకం అమలులో జరిగే తప్పిదాలకు సిబ్బంది ని శిక్షించొద్దని, కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రస్తుతం కన్సాలిటేడెడ్ పే కింద పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై న మోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. సంస్థలోని మహిళా కండక్టర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం సమ్మెకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిడుగు శంకర్, డిపో అఽ ద్యక్షుడు అశోక్, నాయకులు ఆత్మకూరి చిరంజీవి, మోహన్‌బాబు, రఘులయ్య, శ్రీనివాస్, ప్రేంసింగ్, హరికృష్ణ, శోభన్‌బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన జా తీయ రహదారి పనుల్లో అక్కడక్కడ చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి. హైవే పక్కన ఉన్న సర్వీసు రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణం, లైనింగ్ వంటి పనులు పూర్తికాలేదు. వాటిని వెంటనే పూర్తిచేయాలి. రెబ్బెన మండలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో అడ్డంగా ఉన్న రైల్వేగేట్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. అటవీశాఖ అనుమతులు లేని కారణంగా జిల్లాలో మంజూరైన అనేక రోడ్లు ప్రారంభం కావడం లేదు. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో రోడ్ల పనులు చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేయాలి. – ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
మరిన్ని రహదారులు నిర్మించాలి
తెలంగాణ రాష్ట్రానికి పక్కన ఉన్న మహారాష్ట్రతో అనుసంధానిస్తూ మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అదే తరహాలో ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లాపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ -
దూరప్రయాణం తేలికై ంది
జిల్లా మీదుగా చేపట్టిన 363 జాతీయ రహదారితో ఈ ప్రాంత ప్రజలకు దూరప్రాంత ప్రయాణం కూడా ఎంతో తేలికై ంది. ఒకప్పుడు కాగజ్‌నగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లాలంటే రెండు గంటలు ప్రయాణించాల్సి వచ్చేది. జాతీయ రహదారిపై ఇప్పుడు కేవలం 30 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నాం. అలాగే హైదరాబాద్– మంచిర్యాల, మంచిర్యాల– బెల్లంపల్లి, బెల్లంపల్లి– గడ్చిరోలి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు చేపట్టాలి. మంచిర్యాల– హైదరాబాద్ రాష్ట్రీయ రహదారిని జాతీయ రహదారిగా మారిస్తేనే ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. – సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు -
సమ్మె నోటీసు అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: దేశవ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆశవర్కర్లు పాల్గొంటున్నట్లు సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని తెలిపారు. కోడ్లు అమలు చేస్తే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందన్నారు. సమ్మెలో ఆశవర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణమాచారి, ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప, నాయకులు నిర్మల, ద్రౌపది, శోభ, యశోద, సావిత్రి, సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో..ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన నోటీసును జేఏసీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పెరిక నగేశ్, శ్రీకాంత్, శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8గంటల పనిదినాన్ని అమలు చేయాలన్నారు. జీవో నంబర్ 51 సవరించాలని, మల్టీపర్సనల్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. జిల్లాలోని కార్మికులు సమ్మె విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. -
బీసీ మేల్కొలుపు రథయాత్ర ప్రారంభం
వాంకిడి(ఆసిఫాబాద్): బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘మేమెంతో మాకంత’ నినాదంతో సోమవారం మండల కేంద్రం నుంచి బీసీ మేల్కొలుపు రథ యాత్ర ప్రారంభించారు. అంతకుముందు మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో ప్రజాసంఘాలు, వివిధ కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కాని సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బీసీ లు అన్నిరంగాల్లో వెనుకడి ఉన్నారన్నారు. ప్రభుత్వాలు జనాభా ప్రతిపాదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సామాజిక ఉద్యమ పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ఆయన స్వగ్రామం వాంకిడి నుంచి బీసీ మేల్కొలుపు రథయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ రథయాత్ర అలంపూర్‌లో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. -
యూటీఎఫ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాలు ర ఉన్నత పాఠశాలలో సోమవారం యూటీఎ ఫ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టు నిర్వహించా రు. ముందుగా జిల్లా పరీక్షల నిర్వహణ అధి కారి టాలెంట్ టెస్టు ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడుతూ పీపుల్స్ ప్రొగ్రెసివ్ ట్రస్ట్ ద్వారా టాలెంట్ టెస్టు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు హాస్టల్ వసతితో కూడిన ఉచిత విద్యనందిస్తారని తెలిపారు. 87 మంది విద్యార్థులకు 81 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి కమలాకర్‌రెడ్డి, నాయకులు తిరుపతి, భరత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు ‘గడ్కరీ’
రెబ్బెన(ఆసిఫాబాద్): మంచిర్యాల జిల్లా నుంచి వాంకిడి వరకు రూ.3500 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల జాతీయ రహదారి ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం జిల్లాకు రానున్నారు. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు స్టేజ్– 1, స్టేజ్– 2లో భాగంగా నిర్మించిన ఎన్‌హెచ్– 363ను రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద కేంద్ర మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం, నేషనల్ హైవే అఽఽథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వాసవి జిన్నింగ్ మిల్లు వద్ద సభాస్థలితోపాటు కాగజ్‌నగర్ జిన్నింగ్ మిల్లు సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. నాగ్‌పూర్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా కేంద్రం మంత్రి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుని జాతీయ రహదారిని ప్రారంభించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించి తిరిగి చెగూర్లోని కన్హాశాంతి వనం సందర్శనకు వెళ్లనున్నారు. ఏర్పాట్లు పూర్తికేంద్రమంత్రి పర్యటన కోసం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాట్లు చేశారు. సభకు సుమారు 15 వేల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జపాన్ టెక్నాలజీతో కూడిన టెంటుతోపాటు ప్రజలకు భోజన, తాగునీటి వసతులు కల్పించనున్నారు. వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు. నాలుగు రోజులుగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు దగ్గరుండి ఏర్పాట్ల పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా నిత్యం పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీతో పాటు 9 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, సుమారు 300 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం కేటాయించారు. ఎక్స్‌రోడ్ వద్ద ఫ్లై ఓవర్‌కు రంగులు వేసి అందమైన బొమ్మలతో ముస్తాబు చేశారు. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలోని వాసవి జిన్నింగ్ మిల్లు ఆవరణలో ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్, వీఐపీ పార్కింగ్, హెలిప్యాడ్, ఇతర ప్రాంతాల వద్ద బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సైబర్‌క్రైమ్ డీఎస్పీ రమేశ్, రెబ్బెన సీఐ బుద్దే స్వామి, స్పెషల్ బ్రాంచి సీఐ రాణాప్రతాప్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. హాజరుకానున్న ప్రముఖులుజాతీయ రహదారి– 363 ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు అవుతుండగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌తోపాటు రాష్ట్ర మంత్రులు సీత క్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీలు దండె విఠల్, అంజిరెడ్డి, మల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పా ల్వాయి హరీశ్‌బాబు, వెడ్మ బొజ్జు పటేల్, పాయ ల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్, రామారావు పటేల్ హాజరు కానున్నారు. జాతీయ రహదారి– 363ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నగేశ్, అధికారులు షెడ్యూల్ ఇది..ఉదయం 8.45 గంటలకు నాగ్‌పూర్‌లోని ఇంటి నుంచి బయలుదేరి, 8.55గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్‌కు బయలుదేరుతారు. 10.15 గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద గల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30 నుంచి 11.30 గంటల వరకు నేషనల్ హైవే 363ను ప్రారంభించి జాతికి అంకితం చేసి, అనంతరం ప్రసంగిస్తారు. ఉదయం 11.45 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి చెగూర్లోని కన్హాశాంతి వన సందర్శనకు బయలుదేరుతారు. -
అర్హత పరీక్షకు స్పందన
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని డీఆర్సీ భవనంలో ఆదివారం నిర్వహించిన ఆర్జీ రా వు ట్రస్ట్ అర్హత పరీక్షకు స్పందన లభించింది. ఇంటర్మీడియెట్‌తోపాటు ఐఐటీ శిక్షణ, ఉచిత అడ్మిషన్ కోసం అర్హత పరీక్ష నిర్వహించగా 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ట్రస్ట్ కాలేజీ ఇన్చార్జి దినేశ్ మాట్లాడుతూ మొ దటి బ్యాచ్‌లో పది మంది విద్యార్థులు జాతీ యస్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల ఆర్థిక స్థితికి అనుగుణంగా వారికి రెండేళ్లపాటు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. జిల్లా సైన్స్ అధికా రి, కార్యక్రమ కోఆర్డినేటర్ మధుకర్, ఎంఈ వో ప్రభాకర్, ఉపాధ్యాయులు తిరుపతయ్య, మోహన్, శ్రీశైలం, త్రివేణి, రవికుమార్, వేణు, విష్ణు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వివరాలు
● జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆగని బాల్యవివాహాలు ● కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు ● గుట్టుచప్పుడు కాకుండా బాలికలకు పెళ్లిళ్లుపెంచికల్పేట్(సిర్పూర్): బాల్యవివాహాలు అరికట్టడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతు న్నా క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పక్కా సమాచారంతో అడపాదడపా అధికారులు అడ్డుకుంటున్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నా తల్లిదండ్రులు, సమాజం తీరులో మార్పు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు, నిరాక్షరాస్యత, తొందరగా పెళ్లి చేస్తే బాధ్యతలు తగ్గుతాయనే ఆలోచనతో కుటుంబ పెద్దలు బాలికలకు చదువుకునే వయస్సులోనే పెళ్లి చేస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో బాలికలకు 16 ఏళ్లలోపే పెళ్లి చేసి వారి బాల్యానికి మూడు ముళ్లు వేస్తున్నారు. జిల్లాలో 2019 నుంచి నేటి వరకు జిల్లా అధికారులు 153 బాల్యవివాహా లు అడ్డుకుని కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇటీవల రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామంలో బాల్యవివాహం చేస్తున్నారనే సమాచా రంతో అక్కడికి చేరుకున్న అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. బెజ్జూర్ మండలం బారెగూడ గ్రా మంలో కూడా బాల్యవివాహాన్ని అడ్డుకుని బాలల సంరక్షణ అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అవగాహన లోపంతో..బాల్యవివాహాలు ఎక్కువగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులతోపాటు దగ్గరి సంబంధాల పేరుతో తల్లిదండ్రులు వివాహం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పదో తరగతి పూర్తయిన బాలికలకు పెళ్లి చేసి బాల్యాన్ని బందీ చేస్తున్నారు. పెళ్లిళ్లు చేసే బాలికల సగటు వయస్సు 16 సంవత్సరాలు ఉంటే వీరిని 25 ఏళ్ల యువకులు వివాహం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం ద్వారా మైనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక ఎదుగుదల లేకపోవడం, రక్తహీనత, అనారోగ్య శిశువులు జన్మించడం, శిశుమరణాలు, జన్యుపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. చదువుకునే వ యస్సులో కుటుంబ బరువు, బాధ్యతలతో బాలికలు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.ఇటీవల బెజ్జూర్‌లో బాల్యవివాహం అడ్డుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్న అధికారులుసంవత్సరం అడ్డుకున్న బాల్యవివాహాలు 2019 38 2020 29 2021 24 2022 23 2023 18 2024 15 2025 06(నేటివరకు)పేరుకే కమిటీలు..బాల్యవివాహాలు నిరోధించడానికి ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. వీటిలో జిల్లాస్థాయిలో కలెక్టర్ బాల్యవివాహాల నిరోధక అధికారిగా వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, సీడీపీవో, మండల స్థాయిలో తహసీల్దార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, గ్రామస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు కమిటీలో ఉన్నా రు. గ్రామాల్లో పదుల సంఖ్యలో బాల్యవివాహాలు జరిగిన సమయంలో మాత్రమే అధికారుల దృష్టికి వస్తున్నాయి. వీటిని మాత్రమే అడ్డుకుంటున్నారు. అధికారుల దృష్టికి రాకుండా బాలికల బాల్యం మూడు ముళ్లలో చిక్కుకుపోతోంది. ఇప్పటికైనా బాల్యవివాహాలను అరికట్టడానికి క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కఠిన చట్టాలు ఉన్నా..బాల్య వివాహాలు అడ్డుకోవటానికి ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 2006 చట్టం ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే వరుడితోపాటు తల్లిదండ్రులు, పెళ్లికి హాజరైన బంధువులు, వివాహం చేసిన పురోహితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించేందుకు ఆస్కారం ఉంటుంది. మైనర్ బాలికను వివాహం చేసుకుని జీవనం సాగిస్తే వరుడు, అతడి తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులు, బంధువులపై పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. అవగాహన కల్పిస్తున్నాం బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గుర్తించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అయినా చాలాచోట్ల తల్లిదండ్రులు వివిధ కారణాలను చూపుతూ రహస్యంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. పక్కా సమాచారం ఉన్న వాటిని అడ్డుకుంటున్నాం. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలి. చట్టానికి విరుద్ధంగా బాల్య వివాహాలు జరిపిస్తే కేసులు నమోదు చేస్తాం. బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతిఒక్కరూ సహకరించాలి. – బి.మహేశ్, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజు భగీరథ మహర్షి జయంతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ మహర్షి గంగానదిని భూమికి తీసుకువచ్చేందుకు సంవత్సరాలపాటు తపస్సు చేశాడని చరిత్ర చెబుతుందని తెలిపారు. మహనీయు ల చరిత్ర, భారతదేశ విశిష్టతను భావితరాల కు అందించే విధంగా జయంతి, వర్ధంతి అధి కారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశా ఖ అధికారి సజీవన్, సింగిల్‌విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్, మాలి సంఘం నాయకులు శంకర్, అవుడపు ప్రణయ్, రుకుం ప్రహలాద్, అధికారులు పాల్గొన్నారు. -
‘నమో భారత్’కు మోక్షమెప్పుడో?
● సిర్పూర్ కాగజ్‌నగర్– హైదరాబాద్ మార్గంలో నడపాలంటున్న ప్రయాణికులు బెల్లంపల్లి: రైల్వే శాఖ ఆధునికీకరించిన నమో భారత్ ర్యాపిడ్ రైలుపై ప్రయాణికులు గొప్ప ఆశలు పెట్టుకున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య ఈ రైలును నడపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో తయారైన ఈ రైలు రాష్ట్ర రాజధానిని ముఖ్య నగరాలతో అనుసంధానం చేయడానికి రూపొందింది. ఆధునిక సౌకర్యాల సమాహారంనమో భారత్ ర్యాపిడ్ రైలు, గంటకు 130 కి.మీ. వే గంతో 300–350 కి.మీ. దూరం ప్రయాణించే సా మర్థ్యం కలిగి ఉంది. 12–16 ఏసీ చైర్‌కార్‌లతో, ఆటోమేటిక్ తలుపులు, ఆధునిక సౌచాలయాలు, చార్జింగ్ పోర్టులు, కవచ్ భద్రతా వ్యవస్థ వంటి సౌకర్యాలు ఈ రైలును ప్రత్యేకం చేస్తాయి. గుజరాత్, బిహా ర్లో ఇప్పటికే నడుస్తున్న ఈ రైలును తెలంగాణలో ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సిర్పూర్–హైదరాబాద్ మార్గంలో నడపాలని..సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య భాగ్యనగర్, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్ల మధ్య 7 గంటల వ్యవధి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంది. నమో భారత్ రైలును ఈ రెండింటి మధ్యలో భాగ్యనగర్ తర్వాత నడిపితే ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని ప్రయాణికులు సూచిస్తున్నారు. ఈ మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, జనగాం, భువనగిరి వంటి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించాలని కోరుతున్నారు. పుష్కరకాలంగా నిరీక్షణ..పుష్కర కాలంగా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైళ్లు తప్పా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో పట్టాలెక్కిన కొత్త రైలు లేదు. 90శాతం మూడో రైల్వేలైన్ పూర్తయినా, కొత్త రైళ్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, గోడం నగేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఈ రైలు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అన్ని ముఖ్య స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే, రైల్వే ఆదాయంతోపాటు ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది. -
హైవేపై ఆశలు
● ప్రతిపాదనల్లోనే బెల్లంపలి–గడ్చిరోలీ ఫోర్ లేన్ ● కేంద్ర మంత్రి ‘గడ్కరీ’ పర్యటనలో హామీ ఇస్తారా? ● ఆ రోడ్డు నిర్మిస్తే రెండు జిల్లాలకు ఉపయుక్తంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు, మహారాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన బెల్లంపల్లి గడ్చిరోలీ జాతీయ రహదారిని నిర్మించాలనే డి మాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ ప్రతిపాదిత రోడ్డు కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు లేకపోవడంతో ముందుకు కదలడం లేదు. ఇదే తీరుగా ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి–63పై గత కొన్నేళ్లుగా జాప్యం జరుగుతోంది. ఇక్కడ రెండు సార్లు అలైన్‌మెంటు మార్పులతోపాటు రైతులు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పీఎం ప్రాధాన్యత జాబితాలో చోటు దక్కడంతో మళ్లీ ముందుకు కదులుతోంది. తాజాగా కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో గడ్చిరోలీ వరకు నిర్మించబోయే ప్రాజెక్టుపై కదలిక వస్తుందని రెండు జిల్లాల వాసులు ఆశలు పెట్టుకున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న బెల్లంపల్లి, తాండూరు, రెబ్బెన, కాగజ్‌నగర్, కౌటాల మీదుగా ప్రాణహిత దాటి గడ్చిరోలీ వరకు ఈ రోడ్డు ప్రతిపాదన ఉంది. గతంలో ప్రాణహిత తీరం వెంబడి, కౌటాల నుంచి గోదావరి మీదుగా కొత్త హైవేతో భద్రాచలం వరకు హైవే నిర్మించాలని ప్రతిపాదించినా అటవీ, సాంకేతిక అనుమతుల జాప్యంతో ఆ ప్రాజెక్టునే పూర్తిగా పక్కకు పెట్టారు. ఈ క్రమంలో గడ్చిరోలీ హైవే త్వరితగతిన పూర్తయితే ఈ రెండు జిల్లాలు మహారాష్ట్రకు సులువుగా ప్రయాణం సాగించే అవకాశం ఉంది. పూర్తయిన ఏడాదికి ప్రారంభంకేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి జాతీయ రహదారి–363ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సోమవారం రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగే ప్రారంభోత్సవ వేడుకకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.3500కోట్లతో నిర్మించిన ఈ రోడ్డు గత ఏడాది క్రితమే పనులు పూర్తయి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు సమీపం నుంచి రెండు సెక్షన్లుగా మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు మొత్తం 94.60కి.మీ రోడ్డు నిర్మించారు. ప్యాకేజీ–1 తాండూరు మండలం రేపల్లెవాడ, అక్కడ నుంచి గోయగాం వరకు నిర్మించి మందమర్రి, వాంకిడి మండలం కమాన వద్ద టోల్గేట్లు ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నారు. ప్యాకేజీ–1 2020లో పనులు ప్రారంభం కాగా, ప్యాకేజీ–2 మాత్రం 2021లో మొదలయ్యాయి. కరోనా, వంతెనలు, ఇతర కారణాలతో జాప్యం జరిగింది. అయితే చివరకు పూర్తయింది.మందమర్రి మండలం పులిమడుగు వద్ద ఎన్‌హెచ్–363 ఫ్లై ఓవర్‌పై మరమ్మతులు నాణ్యతపై సందేహాలుజాతీయ రహదారి–363 నిర్మాణంలో నాణ్యతపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వెళ్లాయి. బెల్లంపల్లి కన్నాల క్రాస్ వద్ద, రెబ్బెన మండలం తక్కెళ్లపల్లి వద్ద వన్యప్రాణుల అండర్ పాస్, గోయగాం చివరన యానిమల్ ఓవర్‌పాస్ నిర్మాణంలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో భూ సేకరణ జరిగిన వరకు ఆధీనంలోకి తీసుకోకపోవడం, లైట్లు, మరమ్మతులు, నిర్వహణ లోపం కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రోడ్డు దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణదారు 15ఏళ్లు నిర్వహణ బాధ్యతలు చూడాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరో 14ఏళ్లు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఈ క్రమంలో భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు దెబ్బతినకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. -
మౌలిక వసతులు కల్పించాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి ఆస్పిరేషనల్ బ్లాక్‌లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందదిరంలో శనివారం తిర్యాణి ఆస్పిరేషన్ బ్లాక్‌లో 38 అంశాలపై జిల్లా శిశు సంక్షేమ, వైద్య, విద్య, పశుసంవర్ధక, వ్యవసాయ, టి ఫైబర్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల వివరాలు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. క్షయ, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలు అందించాలన్నారు. ప్రధా న మంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా పశువైద్యాధికారి సురేశ్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సీపీఐ మహాసభలు విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న సీపీఐ నాలుగో జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కలవేణ శంకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్యపర్చి ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక బడ్జెట్ ప్రభుత్వం యొక్క కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక ఎజెండాను ప్రతిబింబిస్తుందన్నారు. కార్పొరేట్లకు, బడా వ్యాపారులకు రాయితీలు కొనసాగిస్తూ ఆరోగ్యం, విద్య, గ్రామీణ ఉపాధిహామీ పథకం, సంక్షేమ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్రి సత్యనారాయణ, ఆత్మకూరి చిరంజీవి, తాళ్లపల్లి దివాకర్, తదితరులు పాల్గొన్నారు. -
‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్’
ఆసిఫాబాద్‌అర్బన్: ఎన్నికల ముందు అబద్ధపు హా మీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వి శ్వసించడం లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 90 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్ రామ్మోహన్‌రావ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, రెబ్బెన పీఏసీఎస్ చైర్మన్ కార్నాతం సంజ, తదితరులు పాల్గొన్నారు. అదనపు తరగతిగదుల నిర్మాణానికి భూమిపూజ ఆసిఫాబాద్‌అర్బన్: మండలంలోని వావుదం టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి శనివారం భూమిపూజ చేశారు. ఉట్నూర్ ఐటీడీఏ నిధుల నుంచి మంజూరైన రూ.13.50 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతోనే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాఠశాలకు సక్రమంగా వెళ్లి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ ఉప సర్పంచ్ లింబారావ్, ధర్మారావ్, సాలిక్రావ్, నాందేవ్, కిస్మత్రావ్, ఐటీడీఏ ఏఈ నిజామొద్దీన్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ సిబ్బంది వేతన వెతలు
కెరమెరి(ఆసిఫాబాద్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న క్షేత్రసహాయకులకు జనవరి నుంచి ఏపీవో, టీఏ, ఇతర సిబ్బందికి ఫిబ్రవరి నుంచి వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న వారికి సకాలంలో జీతాలు రాకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించేందుకు నిరంతరం పర్యవేక్షణతో పాటు కూలీలకు పని కల్పించేందుకు కృషి చేస్తుంటారు. కూలీలతో సమానంగా ఎండలో విధులు నిర్వహిస్తున్నా సకాలంలో వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐసీతో పాటు కొత్తగా స్పర్షీ అనే సాఫ్ట్‌వేర్‌ను తీసుకువస్తున్న కారణంగా మూడు నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. కొనసాగుతున్న నిరసనలుఏప్రిల్ 29 నుంచి ఉపాధి హామీ సిబ్బంది నిరసనలు ప్రారంభం అయ్యాయి. 29న జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. 30న జిల్లాలోని ఆయా మండలాల్లో ఎంపీడీవోలకు దరఖాస్తులు అందజేశారు. ఈ నెల 1, 2 తేదీల్లో పెన్‌డౌన్ చేపట్టారు. 3న శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. 5న ఉపాధి హామీ కూలీలు చేస్తున్న ప్రదేశాల్లో నిరసనలు చేపట్టనున్నారు. 6న ఉపాధి పనులను నిలిపివేస్తారు. కుటుంబ పోషణ భారంనాలుగు మాసాలుగా వేతనాలు అందక ఉపాధి హామీ సిబ్బందికి కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇంటిపోషణ, అద్దెలు, ఈఎంఐలు, పాఠశాల ఫీజులకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇటీవల పెన్‌డౌన్ చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు నిలిపివేస్తాం ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు చెల్లించకుంటే ప నులు నిలిపివేస్తాం. గత నెల 29 నుంచి వివిధ రకా లుగా నిరసనలు చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఈనెల 6 నుంచి పూర్తిస్థాయిలో పనులు నిలిపివేసేందుకు రాష్ట్ర సంఘం నిర్ణయించింది. – గోగు మల్లయ్య, ఈజీఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఉపాధి హామీ సిబ్బంది వివరాలుసిబ్బంది సంఖ్య ఏపీవో: 11 ఈసీ: 06 సీవో: 37 టీఏ: 74 పీఎం: 01 హెచ్ఆర్ఎం: 01 టీడీ: 01 ఎఫ్ఏ: 150 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్: 41 మొత్తం: 322 నాలుగు మాసాలుగా అందని జీతాలు భారమవుతున్న కుటుంబ పోషణ -
ఆలయాలకు మహర్దశ
● డీడీఎన్ పథకంలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం ● ఉమ్మడి జిల్లాలో 729 మంది అర్చకులుఆసిఫాబాద్అర్బన్: ప్రాచీన, నూతనంగా నిర్మించిన ఆలయాల్లో ప్రతీరోజు ధూపదీప నైవేద్యం కొనసాగాలన్న ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్సార్ ప్రభుత్వం 2007లో ధూపదీప నైవేద్యం పథకం ద్వారా అర్చకులను నియమించింది. నాటి నుంచి అనేక ఆలయాలు ఈ పథకం ద్వా రా వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ని రుద్యోగ అర్చకులకు ఉపాధి లభించింది. ప్రస్తుతం డీడీఎన్ పథకంలో పని చేస్తున్న అర్చకులకు ప్రతీనెల రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇందులో రూ.4వేలు ధూపదీప నైవేద్యాలకు, రూ.6 వేలు గౌరవ భృతి కింద చెల్లిస్తున్నారు. ఈ పథకంలో నూతనంగా చేరేందుకు ఈ నెల 24 వరకు దరఖాస్తులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు అర్హత, ఆసక్తి కలిగిన ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకు ఆల యం నిర్మించి కనీసం 15 సంవత్సరాలు అయి ఉండాలన్న ప్రాధమిక నిబంధన విధించారు. డీడీఎన్ పథకంలో చేరాలంటే మొదట ఆలయం దేవాదా య శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్న నిబంధన ఉంది. కానీ కొన్ని ఆలయాలకు రిజి స్ట్రేషన్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 2007లో ప్రారంభం2007లో పథకం రూపుదిద్దుకుంది. ప్రారంభంలో ధూపదీప నైవేద్యాల కోసం నెలకు. రూ.2,500ల చొప్పున చెల్లించేవారు. 2018లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. ఆ తర్వాత రూ. 10 వేలకు పెంచుతూ జీవో విడుదల చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో పథకం విజయవంతంగా కొనసాగుతోంది. చూసేందుకు చిన్నమొత్తంగా కనిపించినా.. పూజారులకు ఇస్తున్న గౌరవ భృతిని మాత్రం అన్ని ప్రభుత్వాలు ఆదరిస్తున్నాయి. డీడీఎన్ పథకంలో కొనసాగుతున్న అర్చకులకు ఉద్యోగ భద్రతో పాటు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 2022లో చివరిసారిగా..15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆలయాలు ఈ పథకానికి ప్రాధమిక అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022లో చివరిసారిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 725 ఆలయాలు పథకం ద్వారా నెలనెలా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నాయి. మూడేళ్లలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న ఆలయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా మరో 120 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వేతనాలు పెంచాలి ధూపదీప నైవేద్యం పథకంలో పనిచేస్తున్న అర్చకులకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలి. – ఒజ్జల శిరీష్‌శర్మ, డీడీఎన్స్కీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీడీఎన్ పథకంలో కొనసాగుతున్న ఆలయాలుజిల్లా ఫేజ్–1 ఫేజ్–2 ఫేజ్–3 మొత్తం ఆదిలాబాద్ 30 81 44 155 ఆసిఫాబాద్ 26 43 34 103 నిర్మల్ 49 113 111 273 మంచిర్యాల 51 91 56 198 మొత్తం 156 328 245 729 -
‘ఇందిరమ్మ’ జాబితాలో అనర్హులుండొద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకంలో అనర్హులు ఉండవద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఇందిరమ్మ ఇళ్ల జాబితా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబితా పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు. ఎలాంటి అవకతవకలున్నా సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 5 వరకు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలించి అర్హులకు మంజూరయ్యేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కేంద్ర మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు చేయాలి ఆసిఫాబాద్: జిల్లాలో సోమవారం తలపెట్టిన కేంద్ర మంత్రుల పర్యటనకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మీదుగా వెల్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి–363ను ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ, ఇతర మంత్రులతో కలిసి ప్రారంభిస్తారని, కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో హెలిప్యాడ్, బహిరంగ సభకు సంబంధించి ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
కేంద్ర మంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు
రెబ్బెన: మంచిర్యాల టూ మహారాష్ట్ర సరిహ ద్దు వరకు నిర్మించిన 363 జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో కుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఈనెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్న నేపధ్యంలో ప్రారంభో త్సవ ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ హెలిప్యాడ్ నుంచి మంత్రి సభాస్థలికి చేరుకునే వరకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సభకు హాజర య్యే ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్‌బాబు, ఏఎస్పీ ప్రభాకర్‌రావు, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్, నేషనల్ హైవే పీడీ అజయ్ మణికుమార్, ఈవెంట్ మేనేజర్ అనూప్, తదితరులు పాల్గొన్నారు. -
‘బెల్లంపల్లి’లో 78శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా ఏప్రిల్‌లో 78 శాతం ఉత్పత్తి సాధించిందని ఇన్చార్జి జనరల్ మేనేజర్ మచ్చగిరి నరేందర్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఏరియాకు 3.50 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 2.74 లక్షల టన్నులతో 78 శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. కై రిగూడ ఓసీపీ ద్వారా మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి కొనసాగుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు 35 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని యాజమాన్యం నిర్దేశించిందని పేర్కొన్నారు. ఓసీపీలో కొ న్ని రకాల పనులతో ఉత్పత్తి తగ్గిందన్నా రు. కైరిగూడ ఓసీపీలో మరో మూడేళ్లపా టు బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుందని, చివరి దశ పనులతో మొత్తంగా నాలుగేళ్ల పాటు కైరిగూడ ఓసీపీ కొనసాగుతుందని తెలిపారు. ఆ లోపు గోలేటి ఓసీపీ, మాదారం ఓసీపీలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్ కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పీవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఇన్చార్జి జీఎం నరేందర్ -
ఒకేసారి నెలరోజుల సరుకులు
● అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ● నేటి నుంచి సరుకుల పంపిణీకి అధికారుల కసరత్తు ఆసిఫాబాద్‌అర్బన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆయా కేంద్రాల ద్వారానే ప్రభుత్వం పాలు, గుడ్లు, బాలామృతం సరఫరా చేస్తోంది. అయితే ఈ నెల 1 నుంచి 31 వరకు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిలో నెలరోజుల సరుకులు ఒకేసారి అందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సంబంధిత ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 973 కేంద్రాలుజిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 973 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో గర్భిణులు 4,356 మంది, బాలింతలు 4,022 మంది, ఏడు నెలలలోపు చిన్నారులు 4,146 మంది, ఏడు నెలల నుంచి ఏడాదిలోపు వారు 4,549, ఏడాది నుంచి మూడేళ్ల లోపు వారు 15,872 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు 20,055 మంది ఉన్నారు. జిల్లా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 44,702 మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 296 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, 352 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. ఫ్రీ రెంట్ కింద 325 కేంద్రాలు నడుస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజూ ఒకరికి 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె, ఒక కోడిగుడ్డు అందిస్తున్నారు. బాలింతలు, గర్భిణులకు ఒక్కొక్కరికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 200 మిల్లీ లీటర్ పాలు, 16 గ్రాముల నూనె, ప్రతిరోజూ ఒక కోడిగుడ్డు ఇస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా శనివారం నుంచి నెల రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి అందించనున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర్వులు అందాయి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒకేసారి నెల రోజులకు సరిపడా సరుకులు అందించనున్నాం. ఇదివరకే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా అందాయి. లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి టీచర్ల ద్వారా సరుకులు తీసుకోవాలి. – భాస్కర్, జిల్లా సంక్షేమ అధికారి -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించే దిశగా పట్టుదలతో ముందుకెళ్లాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారి ఉత్తీర్ణత సాధించిన పదో తరగతి బ్యాచ్ వి ద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి స న్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందు కు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, నాయకులు రవీందర్, మల్లేశ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ బజార్ బంద్!
● గోలేటిటౌన్‌షిప్‌లో తెరుచుకోని సింగరేణి సూపర్‌బజార్ ● నిత్యావసర సరుకులకు కిరాణ దుకాణాలే ఆధారం ● ఇబ్బందులు పడుతున్న కార్మిక కుటుంబాలురెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు నాణ్యమైన సరుకులు బయటి మార్కె ట్ కంటే తక్కువ ధరకే అందించేందుకు సూపర్బ జార్లను ఏర్పాటు చేసింది. కార్మిక కుటుంబాల అవసరాలకు అనుగుణంగా సరుకులు అందించడంతో ప్రారంభంలో సూపర్బజార్లు విజయవంతంగా నడిచాయి. కాలక్రమంలో ఆసక్తి సన్నగిల్లడం, అవసరాలకు తగినట్లు సరుకులు అందుబాటులో లేకపోవడంతో అవి లక్ష్యానికి దూరమయ్యాయి. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి టౌన్షిప్లో ఉన్న సూపర్‌బజార్ సైతం మూతబడింది. కార్మిక కుటుంబాలు బయట మార్కెట్లో అధిక ధరలకు సరుకులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు మారినా..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ– కామర్స్ సంస్థలు సేవలు విస్తరించడంతో ఇంట్లో ఉండి కావాల్సిన వస్తువులు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి సంస్థ సూపర్బజార్లను పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేయలేకపోయింది. ఫలితంగా సూపర్బజార్లకు వచ్చే కార్మిక కుటుంబాల సంఖ్య తగ్గి ఆదరణ తగ్గిపోయింది. అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంచకపోవడం, సకాలంలో సరుకులు తెప్పించకపోవడంతో బయటి మార్కెట్‌కు వెళ్లేందుకు మొగ్గు చూపారు. కార్మిక కుటుంబాలకు అవసరమైన అన్నిరకాల వస్తువులను అందుబాటులో ఉంచి తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందించేలా ఏర్పాట్లు చేస్తే తిరిగి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. క్రెడిట్‌పై సరుకులుసింగరేణి సూపర్బజార్లలో కార్మికులు క్రెడిట్‌పై నిత్యావసరులు తీసుకువెళ్లే అవకాశాన్ని యాజమాన్యం కల్పించింది. నెలాఖరు సమయంలో కుటుంబాలు నిత్యావసరాలు తెచ్చుకునే వెసులుబాటుతో కొంతమేర ఇబ్బందులు తగ్గేవి. క్రెడిట్‌పై తీసుకున్న సరుకులకు సంబంధించిన నగదును కార్మికుడి వేతనం నుంచి కట్ చేసేవారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కుటుంబానికి సరుకులు లభిస్తాయనే ధీమా ఉండేది. కానీ సూపర్బజార్లు మూతపడటంతో నెలాఖరు సమయంలో కార్మిక కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. నిత్యావసరాలతోపాటు ఎలక్ట్రికల్ వస్తువులను సైతం సూపర్బజార్ల ద్వారా అందించేవారు. కాలక్రమేణా యాజమాన్యం సూపర్బజార్ల నిర్వహణను గాలికొదిలేయడం, అందుబాటులో సరుకులు ఉంచకపోవడం, సిబ్బంది అవినీతికి పాల్పడటం వంటి కారణాలు సూపర్బజార్లను మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి.మారుమూల ప్రాంతాల్లో అవసరంగోలేటిటౌన్షిప్ వంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు సింగరేణి సూపర్బజార్లు ఎంతో అవసరం. గోలేటి నుంచి బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మంచిర్యాల వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే కనీసం 20 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. పట్టణ ప్రాంతాల్లో డీమార్ట్, మోర్ మార్కెట్, రిలయన్స్ ఫ్రెష్ వంటి సూపర్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. మారుమూల ప్రాంతమైన గోలేటిలో అలాంటి మార్కెట్లు లేవు. కార్మిక కుటుంబాలు, పరిసర ప్రాంతాల ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల కోసం కిరాణషాపులపైనే ఆధారపడాల్సి వస్తోంది. స్థానికంగా సూపర్‌బజార్ ఉన్నప్పటికీ కొంతకాలంగా దానిని మూసివేసి ఉంచడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నిరకాల వస్తువులను అందుబాటులో ఉంచి తిరిగి సూపర్‌బజార్‌ను ప్రారంభించాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి. -
రయ్.. రయ్..!
● పగలు రోడ్లు.. రాత్రిళ్లు రేస్ ట్రాక్‌లు ● రేసింగ్, మందుబాబుల డేంజర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు ● జిల్లా కేంద్రంలో దడ పుట్టిస్తున్న బైకర్లుసాక్షి, ఆసిఫాబాద్: పగలు.. రాత్రి తేడా లేదు. ఖరీదైన బైకులు జిల్లా కేంద్రంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సాయంత్రం దాటితే చాలు ప్రధాన రహదారులు రేసు ట్రాకుల్లా మారుతున్నాయి. మంచిర్యాల– నాగ్‌పూర్ జాతీయ, పట్టణ రహదారులపై ప్రయాణం అంటేనే పట్టణ ప్రజలకు వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఖరీదైన కార్లు, బైకులతో దూసుకెళ్లడం.. ఒళ్లు తెలియనంతలా తప్పతాగి బండి నడపడం.. వెరసి ఎప్పుడు ఏవైపు నుంచి ఏ వాహనం ఢీకొడుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మందుబాబుల డ్రైవింగ్ పాదాచారుల ప్రాణాల మీదకొస్తోంది. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలతో కొంత నిలువరిస్తున్నా కొందరు మాత్రం అడ్డదారుల్లో రహదారుల మీదకు దూసుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 298 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నెలలో ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఓ యువకుడు వాంకిడి నుంచి ద్విచక్రవాహనంపై తప్పతాగి వేగంగా ఆసిఫాబాద్‌కు వస్తూ టోల్గేట్ సమీపంలో గొర్రెల మందను ఢీకొట్టగా ఎనిమిది గొర్రెలు చనిపోగా.. తీవ్రంగా గాయపడిన యువకుడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స అనంతరం అతడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. గత నెలలో బూర్గుడ జిన్నింగ్ మిల్లు వద్ద రాంగ్‌రూట్ వస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొనగా ఒకరికి గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నా నియంత్రించడం సాధ్యపడడం లేదు. రాంగ్‌రూట్.. డేంజర్ డ్రైవింగ్..కేస్లాపూర్ పెద్దవాగు బ్రిడ్జిపై రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న వాహనదారుల తీరుతోనూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించడం పోలీసులకు సాధ్యపడటం లేదు. ఆ వంతెనపై పోలీసులు ఎవరైనా విధుల్లో ఉన్నా వారి కళ్లుగప్పి వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం పరిపాటిగా మారింది. ద్విచక్ర వాహనాలకు తోడు ఆటోలు సైతం పదుల సంఖ్యలో నిత్యం ప్రయాణికులతో నిబంధనలకు విరుద్ధంగా రాంగ్రూట్లో బ్రిడ్జి దాటుతున్నాయి. ఇప్పటికై నా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.దడ పుట్టిస్తూ..జాతీయ రహదారిపై ఆకతాయిలు, పోకిరీలు స్టంట్లు వేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నా రు. ముఖ్యంగా రాత్రిపూట మరింత దారుణ పరి స్థితులు నెలకొంటున్నాయి. వారాంతాల్లో యువకులు బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తూ.. వేగంగా దూ సుకెళ్తూ అవతలి వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిందితుల్ని పట్టుకున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదుకే పోలీసులు పరిమితమవుతున్నారు. పోలీసులు వారాంతాల్లో తప్పనిసరిగా, మిగిలిన రోజుల్లో ఆకస్మికంగా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఇవీ నిర్ణీత సమయం వరకే ఉండటంతో ఆ తర్వాత మందుబాబులు చెలరేగిపోతున్నారు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదాలకు ఇదీ ఓ కారణంగా నిలుస్తోంది. -
పొదుపుగా విద్యుత్ వినియోగించాలి
కౌటాల(సిర్పూర్): వినియోగదారులు పొదుపుగా విద్యుత్ వినియోగించాలని ఆ శాఖ ఎస్ఈ శేషారా వు అన్నారు. విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని కార్యాలయంలో వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ ఆదా చేయాలని, ఇళ్లలో ఎల్ఈడీ బల్బులు వినియెగించాలని సూచించారు. నాణ్యమైన వైర్లు, స్విచ్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ ప్రమాదానికి గురైన వ్యక్తిని కర్ర, ప్లాస్టిక్ పరికరాలతో కా పాడాలని సూచించారు. విద్యుత్ చౌర్యానికి పాల్ప డితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది అ ప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈ వీరేశం, ఏడీఈ రాజేశ్వర్, శ్రీకాంత్, అంజల్‌కుమార్, ఫోర్‌మెన్ నర్సింగరావు పాల్గొన్నారు. అవగాహన కల్పిస్తున్న అధికారులు -
కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రెబ్బెన(ఆసిఫాబాద్): కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటనకు సంబంధించి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు పరిశీలించారు. రూ.3,500 కోట్లతో నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారిని ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభాస్థలి, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ సభకు హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. వాహనాల పార్కింగ్, భోజ నం, తాగునీటి వసతులు కల్పిచాలని సూచించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్‌రావు, ప్రాజెక్టు డైరెక్టర్ మణికుమార్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎస్సై చంద్రశేఖర్, డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ ఇమ్రాన్, ఈవెంట్ మేనేజర్ అనూప్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు షురూ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గురువారం నుంచి సమ్మర్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. సెలవులు సద్వినియోగం చేసుకునేలా ఇండోర్ గేమ్స్ క్యారమ్, చెస్, యోగా, డ్యాన్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు, పెయింటింగ్, కరాటే, సంగీతం వంటి అంశాలను ఉచితంగా నేర్పించనున్నారు. ఒక్కో పాఠశాలలకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నారు. ప్రతీ స్కూల్లో వందమందికి శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థుల అల్పాహారం కోసం రోజుకు రూ.15, మెటీరియల్ కోసం పాఠశాలకు రూ.10వేల చొప్పున, శిక్షకులకు రూ.3వేల చొప్పున అందించనున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రోజువారీగా శిక్షణకు సంబంధించిన ఫొటోలను ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలకు పంపించాలని డీఈవో యాదయ్య ఆదేశించారు. -
‘పది’పై ప్రణాళికేది?
● ఏటా దిగజారుతున్న ఫలితాలు ● వెనుకబడిపోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ● గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు నయం ● విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి దృష్టి సారిస్తే మేలు ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి పరీక్షలపై సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడంతో ఫలితాలు మరోసారి నిరాశ పరిచాయి. నాలుగేళ్లుగా రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం విద్యాశాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. 2021– 22 విద్యా సంవత్సరంలో జిల్లా 32వ స్థానంలో నిలవగా, మరుసటి ఏడాది కొంత మెరుగుపడి 30వ స్థానంలో నిలిచింది. గతేడాది 31వ స్థా నంలో నిలవగా, 2024– 25 విద్యా సంవత్సరంలో మళ్లీ 32వ స్థానానికి పడిపోయింది. జీవితంలో కీలకమైన పదో తరగతిలో ఫెయిల్ కావడంతో చాలా మంది విద్యార్థులు అక్కడితోనే ఆగిపోతున్నారు. మారుమూల పల్లెల్లో ఉత్తీర్ణత సాధించని ఆడపిల్ల లకు తల్లిదండ్రులు బాల్యవివాహాలు జరిపిస్తుండగా, బాలురు వ్యవసాయ, కూలీ పనులకు వెళ్తున్నా రు. ‘విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం’ అంటూ అధికారులు చెబుతున్న మాటలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ఫలితాలు ఇలా..జిల్లావ్యాపంగా మొత్తం 157 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మూడు ఎయిడెడ్ పాఠశాలల్లో 39 మంది 26 మంది(66 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 37 గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల్లో 1,182 మందికి 1090(92 శాతం), 15 కస్తూ రిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 496 మందికి 468 మంది(94 శాతం), 50 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో(లోకల్‌బాడీ) 2,129 మందికి 1,659 మంది(78 శాతం), ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో 277 మందికి 169మంది(61శాతం), రెండు మోడల్ స్కూళ్లలో 166 మందికి 157 మంది(95 శాతం), నాలుగు బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 275 మందికి 272 మంది(99 శాతం), మూడు మైనార్టీ గురుకులాల్లో 145 మందికి 131 మంది(92 శాతం), ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 230 మందికి 226 మంది(98 శాతం), మూడు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 496 మందికి 484 మంది(97 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లతో పోల్చితే ప్రభుత్వ, లోకల్‌బాడీ పాఠశాలల్లోనే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 41 ప్రైవేట్ సూళ్లు ఉండగా, 1066 మందికి 972 మంది పాసయ్యారు. తగ్గిన పర్యవేక్షణ..కొన్నేళ్లుగా జిల్లాకు రెగ్యులర్ విద్యాధికారిని నియమించడం లేదు. మంచిర్యాల డీఈవో యాదయ్య ప్రస్తుతం జిల్లా విద్యాధికారిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో విద్యాశాఖపై పర్యవేక్షణ తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. ఉపాధ్యాయులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరుకాకపోవడంతో వారికి విషయ పరిజ్ఞానం పెరగడం లేదు. ఈ కారణంతోనే వసతి, గురుకులాల్లోని విద్యార్థుల మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. పదో తరగతి విద్యార్థులకు జనవరి నుంచి కాకుండా ఆగస్టు నుంచి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి బోధి స్తే ఉపయోగం ఉంటుంది. 2025– 26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మెరుగైన ఫలితాల సాధనకు సమష్టి కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దృష్టి సారిస్తాం జిల్లాలో తక్కు వ ఉత్తీర్ణత శాతం నమో దు చేసిన పాఠశాలలపై ప్ర త్యేక దృష్టి సారిస్తాం. వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటాం. ఎక్కువ మంది పదో తరగతి విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టులోనే ఫెయిల్ అయ్యారు. గతేడాదితో పోల్చితే నాలుగు శాతం ఉత్తీర్ణత పెరిగినా జిల్లా 32వ స్థానంలో నిలిచింది. – యాదయ్య, ఇన్చార్జి డీఈవోఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్‌లోనే..పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి చతుర్విద ప్రక్రియలపై పట్టు సాధిస్తేనే లెక్కలు సులువుగా చేయవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే చతుర్విద ప్రక్రియలు, భాషా నైపుణ్యాలు పెంచడంపై దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
పెంచికల్పేట్(సిర్పూర్): వరిధాన్యం కొనుగో లు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అ ధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గొంట్లపేట్లో కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్బర్ట్, ఏపీఎం కొనయ్య, ఏఈవోలు శ్రీవిద్య, గౌసియాబేగం, బీజేపీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు చప్పిడే సత్యనారాయణ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని యువజన క్రీడాశాఖ అధికారి, డీటీడీవో రమాదేవి అన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ సమీపంలోని మోడల్ స్కూల్లో నెట్‌బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పది క్రీడాంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ పరిధిలో శిబిరానికి వెళ్లి క్రీడలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, శిక్షకుడు తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
5న జిల్లాకు కేంద్ర మంత్రి ‘గడ్కరీ’
● ఎంపీ గోడం నగేశ్రెబ్బెన(ఆసిఫాబాద్): జాతీయ రహదారి– 363 ప్రారంభోత్సవానికి ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జిల్లాకు రానున్నారని ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద గల వాసవీ జిన్నింగ్ మిల్లులో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల బీజేపీ నాయకులతో గురువారం ఎమ్మెల్యే హరీశ్‌బాబుతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించి జాతీయ రహదారిని కేంద్ర మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. సభాస్థలి వద్ద పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. రెండు జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆసిఫాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బొగ్గు గనులపై ఘనంగా కార్మిక దినోత్సవం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని బొగ్గు గనులు, ఇతర డిపార్టుమెంట్లలో గురువారం 139వ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకొన్నారు. కైరిగూడ ఓసీపీతోపాటు గోలేటి సీహెచ్‌పీ, ఏరియా స్టోర్స్, వర్క్‌షాప్, గోలేటి టౌన్‌షిప్‌లోని కేఎల్ మహేంద్రభవన్, తెలంగాణ భవన్ల వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మిక అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గోలేటి బస్టాండ్, రెబ్బెన మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాల యం, భవన్ నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయాల వద్ద ఎర్రజెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షు డు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, శేషు, కిరణ్‌బాబు, టీబీజీకేఎస్ ఏరి యా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు, ఏఐటీయూసీ రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం అక్షరాస్యత సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్: జిల్లాలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులతో నవభారత సాక్షరత కార్యక్రమంలో అక్షరాస్యత సాధనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఉల్లాస్ ఒకటని తెలిపారు. నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా పాఠశాలస్థాయిలో విద్యావకాశం కోల్పోయిన 15 సంవత్సరాలు, ఆ పైబడిన నిరక్షరాస్యులకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యత కీలకమన్నారు. జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలతో నిరంతరం విద్యనందించడమే పథకం లక్ష్యమని తెలిపారు. చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. వయోజనులకు విద్యనందించేందుకు స్వచ్ఛంద బోధకులు అవసరమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం, ఉన్నత పాఠశాల విద్య పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కళాశాలలో చేరే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బడీడు గల పిల్లలెవరూ బడి బయట ఉండకూడదన్నారు. అక్షర్యాస్యతలో జిల్లాను ముందు వరుసలో ఉంచేందుకు సమష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఇన్చార్జి డీఈవో యాదయ్య, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, విద్యాశాఖ అధికారులు ఉదయబాబు, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుకెరమెరి(ఆసిఫాబాద్): ఆనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. జూన్ 8న మృగశిరకార్తె ప్రవేశించనుండడంతో ఆదివాసీలు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన జంగుబాయికి పుణ్యక్షేత్రంలో విత్తన పూజకు శ్రీకారం చుట్టారు. అక్కడి గుహలోకి వెళ్లి దీపం వద్ద పూజలు చేస్తారు. రావుడ్, పోచమ్మ, మైసమ్మకు విత్తనాలు చూపించి మొక్కి అమ్మవార్లకు నైవేద్యం చూపిస్తారు. విత్తన పూజల అనంతరం తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దీన్ని గోండి భాషలో ‘మొహతుక్’అంటారు. అదేవిధంగా గిరి గ్రామాల్లో ఏటా జరిగే విత్తన పూజల ముందుగా జంగుబాయి అమ్మవారికి విత్తనాలు చూపెట్టాక పొలాల్లో నాటడంతో అధిక దిగుబడి వస్తాయని భక్తుల నమ్మకం. నేడు దీపోత్సవం జంగుబాయి సన్నిధిలో గురువారం దీపోత్సవం, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. వివిధ గ్రామాలకు చెందిన మోళంలు తరలివచ్చి పూజలు చేస్తాయి. దుక్కిలతో దున్ని విత్తనాలు వేసేందుకు తమ పొలాలను రైతులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలోనే ఆదివాసీలు అధికంగా ఉన్నారు. దేవతలకు విత్తనాలను చూపిస్తారు మే మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకిపేన్, అమ్మోరు, పోచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అదే రోజు రాత్రి 2.5 కిలోల జొన్నలతో గట్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ కార్యక్రమంతా మృగశిర మాసానికి కొద్ది రోజుల ముందుగా నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తన పూజ చేయాలన్న రోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడుతారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పేడతో అలుకు చల్లుతారు. పొలానికి వెళ్లాక జొన్నతో గట్కా తయారు చేసి కులదైవంతోపాటు నేల తల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామ పటేల్ ఇంటి ఎదుట మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్, మే మాసంలో విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో అన్ని విత్తనాలను కలిపి భీమల్ దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడ్తారు. ఆరోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో ఆ విత్తనాలను తమ పొలాల్లో చల్లుతారని పలువురు చెబుతున్నారు. దేవతలకు చూపించాకే.. పొలాల్లో విత్తనాలు నాటే కొన్నిరోజుల ముందు కుల దేవతలకు వాటిని చూపిస్తాం. ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను వండి ఆరగిస్తాం. నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆచారాలు పాటిస్తున్నాం ఆదివాసీలు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైన విత్తన(మొహతుక్) పూజలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. పూజలు చేయందే విత్తనాలు నాటం.– పుర్క బాపూరావు, జంగు బాయి ఉత్సవ కమిటీ, ప్రచార కార్యదర్శి -
ఉమెన్స్ హ్యాండ్‌బాల్ విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి 54వ సీనియర్ మహిళల తెలంగాణ హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. బుధవారం ఫైనల్మ్యాచ్లో ఈ జట్లు తలపడగా ఆదిలాబాద్ జట్టు 13, రంగారెడ్డి జిల్లా జట్టు 11 గోల్స్ వేసింది. మూడో స్థానంలో వరంగల్, నాలుగో స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయని, గెలిచిన జట్లకు నిర్వాహకులు షీల్డ్‌లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జట్టు కోసం 20 మందిని ఎంపిక చేసి వరంగల్‌లో కోచింగ్ ఇస్తామన్నారు. గుజరాత్‌లోని బూజ్లో ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ ఉమ్మడి 10 రాష్టాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పవన్‌కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కాంపెల్లి సమ్మయ్య, కోశాధికారి రమేశ్‌రెడ్డి, గ్రౌండ్ ఇన్చార్జి నస్పూరి తిరుపతి పాల్గొన్నారు. ● రన్నర్ప్గా రంగారెడ్డి జట్టు -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్‌రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్‌ను అభినందించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 96 శాతం ఫలితాలు సాధించినట్లు ఏసీఎంవో జగన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 108 పాఠశాలలు, అందులో 65 పాఠశాలలు వంద శాతం వచ్చాయని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ఐటీడీఏ పీవో సారథ్యంలో చేపట్టిన మిషన్ లక్ష్యం ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఏడాదిలో పదిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఐటీడీఏ పీవో పేర్కొన్నారు. -
మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియాలోని వర్క్‌షాప్‌లో బుధవారం మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించా రు. ఆ సంఘం గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో మేడే సందర్భంగా మహిళా ఉద్యోగులకు మొదటిసారిగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే గోలేటి సీహెచ్‌పీ, జీఎం కార్యాలయం, కై రిగూడ ఓసీపీల్లో పోటీలు నిర్వహించగా, అక్కడి మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. సింగరేణిలో పురుషులతో సమానంగా మహిళలు సత్తా చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అన్నిరంగాల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్‌బాబు, కైరిగూడ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..
కడెం:మండలంలోని బెల్లాల్ సమీపంలో గోదావరి, కడెం నది కలిసే ప్రాంతంలో 1200 ఏళ్ల క్రితం నాటి మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర కాలగర్భంలోకి కలిసిపోతుంది. ఆలయ గర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని, దేవతమూర్తుల విగ్రహాలను నాడు కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో స్తంభాలు పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పెద్దలు చెబుతున్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించకపోవడంతో అనాటి చరిత్రా క ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. విగ్రహాల త లభాగాలు లేకుండా పోగా, రాతిస్తంభాలు గోదా వరి ఒడ్డున కుప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం పురా తన ఆలయం ఉన్నచోట గ్రామానికి చెందిన వారు నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి చరిత్రని, శివ సాహిత్యం పొందడానికి ఆత్మహుతి చేసుకున్న వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్, రాజ్‌కుమార్ తెలిపారు. -
ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
బెల్లంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. గతనెల 25న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రారంభించిన ఆ టో రథయాత్ర బుధవారం బెల్లంపల్లికి చేరుకు ంది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్, నా యకులు, ఆటో డ్రైవర్లు రథయాత్ర కు స్వా గతం పలికారు. బజారుఏరియా పురవీఽ దుల మీదుగా రథయాత్ర, ఆటోలతో ర్యాలీ చేశారు. రథయాత్ర మే 27న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, ఈసందర్భంగా ఇందిరాపార్కులో ని ర్వహించే ఆటో ఆకలి కేకలు మహాసభకు ఆటో డ్రైవర్లు తరలిరావాలని కోరారు. -
బాల్యవివాహాలు జరిపిస్తే కేసులు
రెబ్బెన(ఆసిఫాబాద్): నిర్ణీత వయస్సు రాకుండా బాల్యవివాహాలు జరిపిస్తే కేసులు నమోదు చేస్తామని డీసీపీవో బూర్ల మహేశ్ హెచ్చరించారు. మండలంలోని నారాయణపూర్‌లో ఓ మైనర్ బాలికకు వివాహం జరిపిస్తున్నట్లు సమాచారం రావడంతో.. బుధవారం జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాల మేరకు గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను కౌన్సెలింగ్ నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు, పౌర సమాజం సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం– 2006 ప్రకారం రెండేళ్ల నాన్ బెయిలెబుల్ జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ ఝాన్సీరాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థుల సత్తా●
● ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో 93.8 శాతం ఉత్తీర్ణత ● 13 స్కూళ్లలో వందశాతం ఫలితాలు కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. జిల్లాలో మొత్తం 36 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు ఉండగా 13 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. 1,170 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,089 మంది పాసయ్యారు. మొత్తం 93.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 508 మంది బాలురకు 467 మంది, 662 మంది బాలికలకు 622 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 91 శాతం ఫలితాలు సాధించగా ఈసారి 93.8 శాతం సాధించి భేష్ అనిపించుకున్నారు. బంబారా, రొంపెల్లి, బాబాపూర్, కమ్మర్గాం, సోమిని, జైనూర్, మహాగాం, మోడి, అనార్పల్లి, మార్లవాయి, పోచంలొద్ది, కెరమెరి(హట్టి), రాంజీగూడ ఆశ్రమోన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించాయి. మిగిలిన 23 ఆశ్రమ పాఠశాలలు కూడా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించాయి. వందశాతం యాక్షన్ ప్లాన్ అమలు వందశాతం యాక్షన్ ప్లాన్ అమలు చేయడంతోపాటు ఉదయం 5 నుంచి 7 వరకు, సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. నిత్యం గ్రాండ్ టెస్టులు, ఒక్కో సబ్జెక్టుల్లో 30 స్లిప్ టెస్టులు, సీ, డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి రెమెడియల్ తరగతులు నిర్వహించడంతో ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని గిరిజన సంక్షేమశాఖ డీడీ పి.రమాదేవి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పుర్క ఉద్దవ్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరం వందశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలో సిరికొండ మండలం రాంపూర్‌కు బైక్‌లు, ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
ప్రారంభోత్సవం విజయవంతం చేయాలి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు రెబ్బెన(ఆసిఫాబాద్): మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన జాతీయ రహదారి ప్రారంభోత్సవం విజయవంతం చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద బుధవారం సభాస్థలి వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవా ణాను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్ర భుత్వం సుమారు రూ.3500 కోట్లతో నాలుగు వరుసలతో జాతీయ రహదారి నిర్మించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ చేతుల మీదుగా మే 5న కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద ఎన్‌హెచ్– 363 ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ రీజినల్ అధికారి శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ మణికుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఘనంగా బసవేశ్వర మహరాజ్ జయంతి ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో బసవేశ్వర మహరాజ్ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బసవేశ్వర మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్, లింగాయత్ సంక్షేమ సంఘం ప్రతినిధులు దీకొండ సతీశ్‌కుమార్, వాసుదేవన గిరీశ్‌కుమార్, భద్రయ్య, సభ్యులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతిబెల్లంపల్లి: బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన మారెపల్లి రవీందర్ రెడ్డి (56) శాంతిఖని సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం..భార్య, పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రవీందర్ రెడ్డి మంగళవారం రాత్రి భోజనం చేస్తూ కుర్చీలో కుప్పకూలిపోయాడు. బుధవారం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్సిల్ రావడంతో విషయాన్ని భర్తకు చెప్పడానికి భార్య మంజు పలుమార్లు ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో సహచర కార్మికుడికి ఫోన్ చేసి ఓసారి ఇంటికి వెళ్లి చూడాలంది. అతను వెళ్లి ఇంటి కిటికీ నుంచి చూడగా కుర్చీలో రవీందర్ రెడ్డి బిగుసుకుపోయి ఉన్నట్లు గుర్తించాడు. చుట్టుపక్క ఇళ్ల వారిని పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యులకు ఆయన సమాచారమిచ్చారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గేదెల మృతి కారకుడికి 9 నెలల జైలుఆసిఫాబాద్: విద్యుత్ తీగలు అమర్చి, నాలుగు గేదెల మృతికి కారణమైన తిర్యాణి మండలం చెలిమెల కొలాంగూడకు చెందిన టేకం కొండుకు 9 నెలల జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పుచెప్పారు. తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. తిర్యాణి నుంచి మాణిక్యాపూర్ వెళ్లే మార్గంలో గుట్టమేడి అటవీ ప్రాంతంలో జంతువులకోసం టేకం కొండు విద్యుత్ తీగలు అమర్చాడు. గ్రామానికి చెందిన కుర్రిసంగ భీమ్రావు, ఆత్రం భుజంగరావు, మడావి సోంబాయి, బొమ్మగోని విజయలకు చెందిన నాలుగు గేదెలు 2017 మే 31న మేతకు వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో అటవీప్రాంతంలో గాలించగా విద్యుత్ తీగలు తగిలి మృతిచెంది ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై బుద్దేస్వామి కేసు నమోదు చేశారు. రెబ్బెన సీఐ బుద్దేస్వామి, తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కోర్టులో సాక్షులు ప్రవేశపెట్టగా పీపీ జనన్మోహన్ రావు విచారించి నేరం రుజువుచేశారు. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు లైజనింగ్ అధికారి రాంసింగ్, కానిస్టేబుల్ వినోద్, పోలీసు అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అబినందించారు. -
సమ్మర్ క్యాంపులకు సై
● జిల్లాలో నేటి నుంచి 10 శిబిరాల్లో శిక్షణ ● ఈ నెల 31 వరకు నిర్వహణ ఆసిఫాబాద్‌రూరల్/ఆసిఫాబాద్‌అర్బన్: సమ్మర్ క్యాంపులకు సమయం ఆసన్నమైంది. యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. పది క్రీడాంశాల్లో గురువారం నుంచి నెలరోజులపాటు బాలబాలికలకు ఉచిత శిక్షణ అందించనున్నారు. మానసికోల్లాసం, దేహదారుఢ్యంపాటు స్నేహభావం పెంచేందుకు క్రీడలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పది కేంద్రాలు జిల్లాలోని మూడు మండలాల్లో పది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం పది క్రీడాంశాల్లో పది మంది శిక్షకులను ఎంపిక చేశారు. వారికి కేటాయించిన క్రీడల్లో ఈ నెల 1 నుంచి 31 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అవసరమైన క్రీడాసామగ్రి సైతం అందించనున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని జన్కాపూర్, రాజంపేట్, బూర్గుడ, తిర్యాణి మండలంలోని రొంపెల్లి, తిర్యాణి, రాళ్లకన్నెల్లి, కాగజ్‌నగర్‌లోని బురదగూడ, సారండి, వెంపల్లి, నజ్రుల్‌నగర్‌లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో క్రీడానైపుణ్యం పెంచేందుకు శిక్షణ శిబిరాలు దోహదపడనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఒక్కో కేంద్రంలో 40 మంది నుంచి 50 మంది విద్యార్థుల వరకు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. -
తాత్విక ధోరణితో సమున్నత జీవితం
● ’జీవితమే ఒకపుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమంలో సాహితీవేత్తలు ● జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్లపుస్తకాన్ని అనువదించిన జిల్లాకవి నిర్మల్‌ఖిల్లా: తాత్విక ధోరణి ద్వారానే సమున్నత జీవితం సిద్ధిస్తుందని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కావేరి ఫౌండేషన్ గ్రంథాలయంలో మంగళవారం రాత్రి ‘జీవితమే ఒక పుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనువాదకర్త కె.మచ్చేందర్..ప్రపంచ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల సమాహార గ్రంథం ‘ది బుక్ ఆఫ్ లైఫ్’అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, సాహితీవేత్తలు టి.సంపత్ కుమార్, నరసయ్య, రవీంద్రబాబు, తుమ్మల దేవరావు, కృష్ణంరాజు, మునిమడుగుల రాజారావు, ఆకుల సుదర్శన్, అంబటి నారాయణ, అనిత, నాగరంజని, నూకల విజయ్‌కుమార్, దీపక్, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జేఏసీ పోరాటాలకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు
రెబ్బెన(ఆసిఫాబాద్): కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపు కోసం జేఏసీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికుల జీతాల పెంపుపై మేడే రోజు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెరగకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు లేదా జీవో నంబర్ 22 ప్రకారం నెలకు రూ.25వేలు తగ్గకుండా అందేలా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారిక కార్మిక వేడుకల్లో సీఎం కాంట్రాక్టు కార్మికులకు తీపి కబురు చెప్పాలని అన్నారు. కార్మికుల జీతాల పెంపుతోపాటు ఈఎస్ఐ వైద్య సౌకర్యం, 2022 సెప్టెంబర్ 26న సెంట్రల్ లేబర్ అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందంలోని అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏరియా నాయకులు మారిన వెంకటేశ్, సెంట్రల్ కమిటీ నాయకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పదిలో మళ్లీ నిరాశ
● రాష్ట్రస్థాయిలో 32వ స్థానంలో జిల్లా ● 6,480 మంది విద్యార్థులకు 5,654 మంది పాస్ ● వందశాతం ఉత్తీర్ణత సాధించిన పలు పాఠశాలలు ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మళ్లీ నిరాశే ఎదురైంది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఇతర జిల్లాలతో పోల్చితే వెనుకబడిపోయింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 31వ స్థానంలో నిలవగా, 2024– 25 విద్యా సంవత్సరంలో జిల్లా 32వ స్థానానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు సక్రమంగా హాజరు కాకపోవడం, రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణమని తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతున్నా.. విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రానున్న విద్యా సంవత్సరంలోనైనా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. 5,654 మంది ఉత్తీర్ణత జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలలు ఉండగా, 6,480 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,654 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 3,035 మంది బాలురు పరీక్షలు రాయగా, 2,539 మంది(83.66 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 3,445 మంది బాలికలకు 3,115 మంది(90.42) పాసయ్యారు. సత్తా చాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ముందంజలో నిలిచారు. ఇక్కడ 99 మందికి 96 మంది ఉత్తీ ర్ణత నమోదు చేశారు. వర్షిత్ 600మార్కులకు 564 సాధించి టాపర్‌గా నిలవగా, సైయాద్ ఉమేజ నజ్ 561 మార్కులు సాధించారు. స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో 70 మందికి 96 మంది పాసయ్యారు. వరుణ్ 561 మార్కులు, కార్తీక్ 543 మార్కులు సాధించారు. జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో 69 మందికి 68 ఉత్తీర్ణులు కా గా, లిఖిత 556, అశ్విని 553 మార్కులతో స్కూల్ టాపర్లుగా నిలిచారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 73 మందికి 72 మంది ఉత్తీర్ణత సాధించగా, అక్కిరెడ్డి ఐశ్వర్య 553, మాయావతి 552, కీర్తన 540 మార్కులు పొందారు. బాలుర సాంఘిక సంక్షేమ గురుకులంలో 75 మందికి 73 ఉత్తీర్ణులు కాగా, వంశీ 560, రోహన్ 541 మార్కులు సాధించారు. ఆసిఫాబాద్ కేజీబీవీలో 42 మందికి 41 మంది, ఆసిఫాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో 102 మంది 84 మంది పాసయ్యారు. బాలికల ఉన్నత పాఠశాలలో సాత్విక 541, తేజశ్విని 522 మార్కులతో టాపర్లుగా నిలిచారు. బాలుర ఉన్నత పాఠశాలలో 94 మందికి 69 మంది, జన్కాపూర్ పాఠశాలలో 71 మందికి 59 మంది ఉత్తీర్ణులయ్యారు. మర్యాదాస్ 519, శంకర్ 511 మార్కులు సాధించారు. బూర్గుడ పాఠశాలలో 74 మందికి 55 మంది ఉత్తీర్ణులు కాగా, 487 మార్కులతో ఉమేష్, 476 మార్కులతో సాయివర్షిణి టాపర్లుగా నిలిచారు. ఇక్కడ వంద శాతం ఉత్తీర్ణత జిల్లాలోని పలు పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. కెరమెరి మండలంలోని మోడి కేజీబీవీలో 16 మంది 16 మంది, మోడి ఉన్నత పాఠశాలలో 9 మంది 9 మంది, గోయగాం ఉన్నత పాఠశాలలో 35 మందికి 35 మంది, జైనూర్ కేజీబీవీలో 35 మందికి 35 మంది, చింతలమానెపల్లి మండలం డబ్బా ఉన్నత పాఠశాలలో 12 మందికి 12 మంది, బాబాపూర్ ఉన్నత పాఠశాలలో ఆరుగురికి ఆరుగురు, రెబ్బెన మండలంలోని తుంగెడ ఉన్నత పాఠశాలలో 16 మందికి 16 మంది, వాంకిడి కేజీబీవీలో 38 మందికి 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.నాలుగేళ్లుగా పదో తరగతి ఫలితాలు ఇలా.. విద్యా సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో స్థానం 2021–22 7,007 5,605 79 32 2022– 23 6,670 5,061 75 30 2023– 24 6,393 5,325 83 31 2024– 25 6,480 5,654 87 32 -
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రావూరి శ్రీనివాస్‌తో కలిసి వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, విత్తన విక్రయ డీలర్లతో వానాకాలం సంసిద్ధత, నిషేధిత పత్తి విత్తనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మట్లాడుతూ వానాకాలం సీజన్లో జిల్లాలో 70 శాతం పత్తి సాగవుతుందని, రైతులకు కల్తీ, నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో ఆశలతో రైతులు పత్తి సాగు చేస్తారని, నకిలీ విత్తనాలు మొలకెత్తకపోతే ఆ కుటుంబం అప్పుల్లో కూరుకుపోతుందన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన, గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలు మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తనాలు, మందులు కృత్రిమ కొరత సృష్టించవద్దని, అధిక ధరలకు విక్రయించొద్దని సూచించారు. దుకాణాల యజమానులు విధిగా స్టాకు రిజిస్టర్, ధరల పట్టిక, రశీదు, రిజిస్టర్, ఈ– పాస్ మిషన్ నిర్వహించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి నకిలీ పత్తి విత్తనాల విక్రయాన్ని నియంత్రిస్తామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీఏ మనోహర్, అధికారులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి’
ఆసిఫాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్ట ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మా వోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డి మాండ్ చేశారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయకులైన ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండను ఖండించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందన్షా, నాయకులు భీమ్రావు, సుభాష్, కనక ప్రకాశ్, బాదిరావు, రామ్‌కిషన్ పాల్గొన్నారు. -
చిరు ధాన్యాలపై సాగుపై దృష్టి సారించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): రైతులు చిరుధాన్యాలపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని మొహింద గుడిపేట గ్రామంలో సోలార్ పంపు సెట్లతో సాగు చేస్తున్న చిరుధాన్యాల పంటను మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పండించే కూరగాయలను ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసి రైతులకు ధర గిట్టుబాటు అ య్యేలా చూస్తామన్నారు. మండలంలో త్వరలోనే ఐటీడీఏ ఆధ్వర్యంలో దాల్మిల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రా మంలో బావి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పీవో దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ జేఈ బద్రోద్దీన్, గ్రామ పటేల్ మడావి భీంరావు, ఆత్రం భీంరావు, రైతులు భుజంగరావు, జలపతిరావు, పైకు తదితరులు పాల్గొన్నారు. -
గొంతు తడిపేలా..!
● తాగునీటి సమస్యలపై పోలీసుశాఖ దృష్టి ● మారుమూల గ్రామాల్లో బోర్లు వేయిస్తున్న వైనం ● కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువసాక్షి, ఆసిఫాబాద్: పోలీసులపై ఉన్న ప్రతికూల అభి ప్రాయాలు తొలగించడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ ఇటీవల ‘సామాజిక’ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మారుమూల గ్రా మాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. వేసవి తీవ్రతతో నీటి వనరులు కనుమరుగవుతున్న నేపథ్యంలో బోర్లు వేయిస్తూ నీటి గోస తీరుస్తున్నారు. గతేడాది జూన్ 20న జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న డీవీ శ్రీనివాసరావు త్వరితగతినే జిల్లా పరిస్థితులపై ఆధ్వయనం చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తూనే పోలీ సుశాఖలో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకొచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల మన్ననలు చూరగొన్నారు. దేశంలోనే రెండో వెనుకబడిన జిల్లా అయిన కుమురంభీం ఆసిఫాబాద్‌లో మారుమూల తండాలు, గూడేల్లో నివసిస్తున్న గిరిజ నులకు వైద్యసేవలు అందించడం, వృద్ధులకు దు ప్పట్లు, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా అవగా హన కార్యక్రమాలు, వారికి క్రీడా పరికరాల పంపి ణీ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యంజిల్లావ్యాప్తంగా పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గతేడాది డిసెంబర్ 19న బెజ్జూర్ మండలం నాగవెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కి ట్లు పంపిణీ చేశారు. డిసెంబర్ 24న జైనూర్ మండ ల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివాసీ మ హిళలకు చేతన ఫౌండేషన్ సహకారంతో 35 కుట్టు మిషన్లు అందించారు. డిసెంబర్ 29న తిర్యాణి మండలం మంగీ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహణతోపాటు 500 మందికి దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను పంపిణీ చేశారు. ఈ ఏడాది మార్చి 12న జైనూర్‌లో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించారు. జిల్లాస్థాయిలో యువత కోసం కౌటాల పోలీసు స్టేషన్ వేదికగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా 64 టీంలు పాల్గొనడం విశేషం. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ పట్టణంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుంచి రోజూ సుమారు 500 మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు. ప్రతీ మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించారు.పోలీసుల బాధ్యత చట్టాలు అమలు చేయడమే కాకుండా ప్రజల భద్రత.. వారి జీవనాన్ని మెరుగుపరచడానికి పోలీసులు కృషి చేయాలి. అది తమ బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో తాగునీటి సమస్య ఉన్న కొన్ని గ్రామాలు నా దృష్టికి రావడంతో అక్కడ బోర్లు వేయించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల నీళ్లు పడకపోయినా.. మళ్లీ ప్రయత్నించేందుకు చర్యలు చేపట్టాం. కమ్యూనిటీ పోలీసింగ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సామాజిక సేవలో భాగంగా జిల్లాలో మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజల జీవన విధానాన్ని మెరుపర్చేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ దాహార్తిని తీరుస్తూ..తాగునీటి సమస్యలతో జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం కోయచిచ్చాల గ్రామంలో మంచినీటి సమస్యను పోలీసులు పరిష్కరించారు. సిర్పూర్(యూ) మండలం రుద్రకస గ్రామంలోనూ తాగునీటి సమస్యను గుర్తించి బోరు వేయించారు. -
పకడ్బందీగా నీట్ నిర్వహణ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో నీట్ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పా ఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రాన్ని మంగళవా రం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ మే 4న నిర్వహించే నీట్ కు జిల్లాలో 287 మంది హాజరవుతారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కల్పించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రశ్నపత్రాలను పూర్తి బందోబస్తుతో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరీక్ష సమన్వయకర్త లక్ష్మీనరసింహ, పర్వవేక్షకులు ఉదయ్‌బాబు, శశిధర్ పాల్గొన్నారు. -
సమ్మె విజయవంతం చేయాలి
పెంచికల్పేట్(సిర్పూర్): లేబర్ కోడ్ల రద్దు కోసం వచ్చే నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశాల క్రిష్ణమాచారి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కార్మికుల శ్రమ ను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు బీజే పీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోరా టాలతో సాధించుకున్న హక్కులు కాపాడుకోవాడానికి ప్రతీ కార్మికుడు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభు త్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవా లన్నారు. ఈ సమావేశంలో ఘనపురం శ్రీకాంత్, దిగిడే మల్లిక, పద్మ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం నిరసన
కౌటాల(సిర్పూర్): తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని మంగళవారం కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న చేతిపంపు వద్ద మహిళలు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 20 రోజులుగా ఎస్సీ కాలనీలోని చేతిపంపు పనిచేయడం లేదని, మిషన్ భగీరథ నీరు సైతం సక్రమంగా రావడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానికంగా బోర్లు ఉన్న వారిని నీళ్లు అడిగి తాగుతున్నామని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యలు తీర్చాలని కోరారు. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు
● పది మందిపై కేసు ● రూ.11లక్షలు, పలు డాక్యుమెంట్లు సీజ్ ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో అధిక వడ్డీ వసూలు చేస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్న పలువురి ఇళ్లపై ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పది మందిపై కేసు నమోదు చేసి, రూ.11 లక్షల నగదు సీజ్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సరైన అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సోదాల్లో నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
పెంచికల్పేట్(సిర్పూర్): తాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీలోని కోయచిచ్చాలలో మంగళవారం పర్యటించారు. మూడు చేతిపంపులు చెడిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్బర్ట్, ఎస్సై కొమురయ్య, ఆర్డబ్ల్యూ ఏఈ ఖదీర్, ఏపీవో సతీశ్, పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి దహెగాం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని దిగిడలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నర్సరీ పనులు, సీసీరోడ్ల నిర్మాణాలు, తాగునీటి వనరులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శించొ ద్దన్నారు. వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధం చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇనోస్, ఈజీఎస్ ఏపీవో కల్పన తదితరులు ఉన్నారు. -
రైస్ మిల్లర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాలతో కలిసి జిల్లా పౌరసరఫరాలు, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ప్ర తినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సన్న, దొడ్డు రకం వడ్లు 56,588 మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించా రు. లక్ష్యాలు పూర్తిచేయని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుని, మిల్లులు సీజ్ చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, మాయిశ్చర్ డ్రయర్ సదుపాయాలు కల్పించాలని, తేమశాతంపై అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తరలింపునకు 46 వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపా రు. పక్క రాష్ట్రం నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా వెంకట్రావ్ పేట, గూడెం, సిర్పూర్(టి)లో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రయం, రవాణా, వినియోగంపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలుభూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం– 2025 ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో మంగళవారం భూభారతి చట్టంపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందులో అప్పీలు వ్యవస్థ కీలకమన్నారు. తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులతో రైతుకు న్యాయం జరగకపోతే ఆర్డీవో, సబ్ కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడా న్యాయం జరగని పక్షంలో కలెక్టర్ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. విరాసత్ సమయంలో కుటుంబ సభ్యులందరికీ నోటీసులు జారీ చేస్తారన్నారు. జూన్ 2 తర్వాత ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ రోహిత్, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హైవేతో మారుమూల ప్రాంతాల అభివృద్ధి
● వచ్చే నెల 5న జిల్లాకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ● పాల్వాయి హరీశ్‌బాబు రెబ్బెన(ఆసిఫాబాద్): మంచిర్యాల టు మహారాష్ట్ర సరిహద్దు వరకు సుమారు రూ.3500 కోట్లతో నిర్మించిన హైవేతో మారుమూల ప్రాంతాలు అభివృద్ది చెందాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. జాతీయ రహదారి– 363ను ప్రారంభించేందుకు మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ జిల్లాకు రానున్నారని తెలిపారు. రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. సభాస్థలితోపాటు హెలిప్యాడ్ ప్రాంతాలను ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ అధికారులతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం మీదుగా నిర్మించిన జాతీయ రహదారితో జిల్లావాసులు హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మెరుగైన రోడ్డు సౌకర్యం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తోందని తెలిపారు. హైవే– 363 ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌తోపాటు ఎంపీ గోడం నగేశ్, స్థానిక శాసన సభ్యులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అధికారి మణికుమార్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న కల నెరవేర్చా..
● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగితే లక్ష్యసాధన సులువే ● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా మనోగతం ‘నన్ను కలెక్టర్‌గా చూడాలనేది మా నాన్న కల.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్‌గా తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందానిస్తోంది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. – కై లాస్‌నగర్ -
భూభారతిపై అవగాహన అవసరం
● కలెక్టర్ వెంకటేవ్ దోత్రేదహెగాం(సిర్పూర్): భూభారతి చట్టంపై ప్రతీ రైతుకు అవగాహన అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భూమి ఎంతో ముఖ్యమని, ఎలాంటి భూసమస్యలు ఉన్నా భూభారతి చట్టం ద్వారా పరిష్కారమవుతాయని అన్నారు. అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యల పరిష్కా రం కోసం ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. రికార్డుల్లో తప్పులు సరిచేయడానికి అవకాశం ఉందని, అప్పీలు వ్యవస్థ కూడా ఎంతో కీలకమన్నారు. భూమార్పిడిలో సర్వేయర్ రూపొందించిన నక్షను జతపర్చడం ద్వారా భవిష్యత్తులోనూ భూ వివాదాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. హామీ మేరకు చట్టం తెచ్చాంఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్‌ను తొలగించి నూతనంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్‌తో పేదలకు అన్యాయం జరగగా, సంపన్నులకు మాత్రమే లాభం చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రజ లకు భద్రత కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మండల ప్రత్యేకాధికారి సజీవన్, తహసీల్దార్ కవిత, ఏవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లం‘ఘనుల’పై ఫోకస్
● రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాహనదారులపై చర్యలు ● మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్ ● మళ్లీ అదే తప్పు చేస్తే మాత్రం జైలుకు పంపించేలా కేసులుసాక్షి, ఆసిఫాబాద్: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. అయితే ఇకపై నేరుగా జైలుకే అని హెచ్చరిస్తున్నారు జిల్లా పోలీసులు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కఠిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు రాంగ్ రూట్లో వెళ్లటమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. రాంగ్ రూట్ వెళ్తూ తొలిసారిగా పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారితో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిగే నష్టాలను తెలుపుతూ ఉన్న ఫ్లకార్డులను ప్రధాన కూడళ్లలో ప్రదర్శించేలా చిన్నపాటి శిక్షలు సైతం విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ తప్పు చేస్తే మాత్రం నేరుగా జైలుకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. 82 మంది కేసులు నమోదుజిల్లాలో కఠినమైన ట్రాఫిక్ చట్టాలు ఉన్నా చాలా మంది వాహనదారులు ఉల్లంఘిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఆసిఫాబాద్ పట్టణంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సబ్‌డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ చర్యలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తూ కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే కొందరు వాహనదారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పట్టణంలో వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 281సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 82 మందిపై ఆసిఫాబాద్ పట్టణ పోలీసులు 32 కేసులు నమోదు చేశారు. అందులో 77 బైకులు, రెండు ట్రాక్టర్లు, మూడు ఆటోలు ఉన్నాయి. ఫ్లకార్డులతో ప్రదర్శన... సోమవారం మధ్యాహ్నం పట్టణం నుంచి ముగ్గురు యువకులు క్లేసాపూర్ పెద్దవాగు బ్రిడ్జిపై రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఆ సమయంలో గోలేటి నుంచి పట్టణంలోకి వస్తున్న ఏఎస్పీ చిత్తరంజన్ వారి వాహనాన్ని ఆపి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం డ్రైవర్‌తోపాటు ఉన్న మరో ఇద్దరు యువకులకు రెండు గంటలపాటు పట్టణంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఫ్లకార్డులను ప్రదర్శించేలా శిక్ష విధించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిగే నష్టం ఏమిటనే సూక్తులతో ఉన్న ఫ్లకార్డులను వారు సాయంత్రం 6 గంటల నుంచి ప్రదర్శించారు. దీనిపై స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. అమ్మో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఇలాంటి కఠిన శిక్షలు పడుతాయా? అంటూ ఆందోళన చెందారు. అలాగే మూడో యువకుడు కనిపించడం లేదని చర్చించుకోవడం గమనార్హం. స్వచ్ఛందమే.. పనిష్మెంట్ కాదు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వారితో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించాం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారు తన భద్రత మాత్రమే కాకుండా ఇతర వాహనదారుల భద్రతకు కూడా బాధ్యత వహించాలి. సోమవారం రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులు స్వచ్ఛందగా ఇకపై తాము ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడమని చెప్పారు. పనిష్మెంట్లా కాకుండా ఇతరులకూ అవగాహన కల్పించేందుకు మాత్రమే ఫ్లకార్డులతో అంబేడ్కర్ కూడలిలో నిలబడ్డారు. – చిత్తరంజన్, ఏఎస్పీ, ఆసిఫాబాద్ సబ్‌డివిజన్ -
ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణఆసిఫాబాద్అర్బన్: జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంబీఏ చదివిన తాను వాహన ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద ఉంటున్నానని, జిల్లా కేంద్రంలో ఏదైనా కార్యాలయంలో ఉపాధి అవకాశం కల్పించాలని రవిచంద్ర కాలనీకి చెందిన పర్చకి శారద కోరారు. తెలంగాణ మైనార్టీ కళాశాలలో అధ్యాపకుడి ఉద్యోగానికి ఒప్పంద ప్రతిపాదికన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న తనకు మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని, న్యాయం చేయాలని కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన కోటేశ్ విన్నవించాడు. తన భర్త మరణించాడని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం సాండ్‌గాం గ్రామానికి చెందిన మీరాబాయి దరఖాస్తు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట శివారులోని పట్టా భూమిని ఆన్లైన్లో నమోదు చేసి, పట్టా పాసు పుస్తకం మంజూరు చేయాలని కుంరం లచ్చు అర్జీ అందించాడు. తన తండ్రి పేరుతో ఉన్న భూమిని కౌటాల మినీ స్టేడియం ఏర్పాటుకు తీసుకుని ఇప్పటివరకు పరిహారం అందించలేదని, న్యాయం చేయాలని కౌటాలకు చెందిన రాచకొండ అశోక్ కోరాడు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
విద్యుత్ లైన్ కోసం వినూత్న నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: తిర్యాణి మండలం గోవె న పంచాయతీ పరిధిలోని నాయకపుగూడకు విద్యుత్‌లైన్ వేసేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట సోమవారం వినూత్నంగా నోటిపై చేతులు పెట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు. 60 ఏళ్లుగా గ్రామానికి విద్యు త్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించినా పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అటవీ అధికారులు అనుమతులు మంజూరు చేసి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లయ్య, భీమయ్య, రాజం, మైసవ్వ, లస్మవ్వ, పోశవ్వ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధ క్రీడాకారులకు అభినందన
ఆసిఫాబాద్‌అర్బన్: నేషనల్ మాస్టర్స్ గేమ్స్– 2025లో పరుగు పందెంలో పతకాలు సాధించిన ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన వైరాగడె శకుంతల, ఆనంద్‌రావ్ దంపతులను జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు అభినందించారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో ఈ నెల 20 నుంచి 26 వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లో శకుంతల 50ప్లస్ ఏజ్ గ్రూపు మహిళా విభాగంలో 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో మొదటిస్థానం, ఆనంద్‌రావ్ 55 ప్లస్ ఏజ్గ్రూపు పురుషుల విభాగం రేస్ వాక్‌లో రెండోస్థానంలో నిలిచారు. ఏఎస్పీ మాట్లాడుతూ గెలవాలనే కోరికకు వయస్సు అడ్డురాదనే నిజాన్ని ఆనంద్‌రావ్ దంపతులు రుజువు చేశారన్నారు. యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. -
మూడేళ్లుగా నష్టాలే..
ఈ ఫొటోలోని రైతు పేరు నందూసింగ్. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఈయనకు పులికుంట శివారులో సుమారు 30 ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోటల పెంపకంలో దాదాపు 50 ఏళ్ల అనుభవం ఉంది. ఒకప్పుడు టన్నుల కొద్దీ దిగుబడి సాధించాడు. కానీ కొన్నేళ్లుగా ఆశించిన దిగుబడి సాధించలేకపోతున్నాడు. వాతావరణ మార్పులతో చెట్లకు పూత, కాత రావడం లేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తోటలో వందలాది చెట్లు ఉంటే అతికొద్ది చెట్లకు మాత్రమే కాయలు ఉన్నాయి. అవి కూడా గాలిదుమారానికి రాలిపోతున్నాయి.. ఇలా నందుసింగ్ మాత్రమే కాదు. జిల్లాలో మామిడి తోటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుది ఇంచుమించు ఇదే పరిస్థితి. రెబ్బెన(ఆసిఫాబాద్): మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు మూడేళ్లుగా కాలం కలిసిరావడం లేదు. జిల్లాలోని తేలికపాటి భూములు తోటల పెంపకానికి అనుకూలంగా ఉండటంతో గతంలో ఏటా ఆశించిన ఫలసాయం పొందేవారు. వాతావరణం సైతం అనుకూలించి మంచి దిగుబడి దక్కేది. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఖర్చు లే కుండా దిగుబడి అందించిన తోటల్లో ఇప్పుడు పె ట్టుబడి కూడా రావడం లేదు. మూడేళ్లుగా మామిడి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. వాతా వరణ మార్పుల ప్రభావం పూతకాతలపై పడింది. మరోవైపు పంట చేతికందే దశలో గాలిదుమారాలు, అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఆరంభం నుంచే ప్రతికూలంజిల్లాలోని రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), జైనూర్ మండలాల్లో ఉద్యావనశాఖ అధికారుల లెక్కల ప్రకారం 982 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. సాధారణంగా కాయలు తెంపే దశలో వచ్చే గాలిదుమారాలు, అకాల వర్షాలతో తోటలు దెబ్బతింటాయి. ఈ ఏడాది మాత్రం సీజన్ ప్రారంభం నుంచే వాతావరణం ప్రతికూలంగా మారింది. జనవరి, ఫిబ్రవరిలో ఈదురుగాలులతో పూత రాలి పిందెల సంఖ్య తగ్గింది. ఇప్పటికీ ఇదే తరహా వాతావరణం ఉండటంతో కాయలు రాలిపోతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఎకరం తోటలో సుమారు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి ఉన్న ప్రతికూల పరిస్థితులతో దిగుబడి నాలుగు టన్నులకు మించేలా కనిపించడం లేదు. 136 ఎకరాల్లో నష్టంసీజన్ ప్రారంభంలో పూతలు చూసి మురిసిపోయే రైతులకు ఆ సంతోషం చివరి వరకు ఉండడం లేదు. ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈదురుగాలులు కూడా తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని మామిడి తోటలు కోతదశకు చేరుకున్నాయి. కొన్ని రోజులుగా జిల్లా అంతటా వాతావరణం రోజుకో విధంగా మారుతోంది. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. సాయంత్రం ఆకాశం మేఘావృతమవుతూ బలమైన గాలులు వీస్తున్నాయి. గత నెలలో వడగండ్ల వానతో తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలుల ధాటికి చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. జిల్లాలో గాలులు, అకాల వర్షాలకు 136 ఎకరాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రభుత్వం పరిహారం అందిస్తుందా లేదా అనేది వేచిచూడాలి. సరైన దిగుబడి లేని మామిడి ఈ ఏడాది గాలిదుమారాలతో దెబ్బతింటున్న తోటలు జిల్లాలో 136 ఎకరాల్లో పంట నష్టంధర ఉన్నా.. మార్కెట్ ఏది?జిల్లాలో మామిడి తోటలు అధికంగానే ఉన్నా అందుబాటులో మార్కెంటింగ్ సౌకర్యం లేదు. స్థానిక రైతులు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్‌కు కాయలు తరలిస్తున్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని నాగ్‌పూర్‌కు తరలించేందుకు వాహనాల కిరాయి, లోడింగ్, అన్లోడింగ్ ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. మార్కెట్లో కమీషన్ కటింగ్ పేరుతో రైతులను మరింత దోచుకుంటున్నారు. గతేడాది ఈ సమయంలో నాణ్యమైన కాయలకు కిలోకు రూ.25 వరకు ధర పలకగా, ఈసారి ధర కాస్త ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం నాగ్‌పూర్, కరీంనగర్ మార్కెట్లలో కిలో కాయలకు రూ.60 నుంచి రూ.65 చెల్లిస్తున్నారు. దిగుబడి అంతంత మాత్రంగా ఉన్నా కాయలకు ధర ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరే చివరివరకు కొనసాగుతుందనే నమ్మకం లేదు. పది రోజుల క్రితం నుంచే కోతలు మొదలయ్యాయి. పూర్తిస్థాయిలో పూర్తయితే మార్కెట్‌కు టన్నుల కొద్ది కాయలు వచ్చి ధర తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నాణ్యమైన కాయలకు మాత్రమే రూ.60 నుంచి రూ.65 వరకు చెల్లిస్తూ.. రాలిన కాయలకు మాత్రం కిలోకు రూ.20 లోపే చెల్లిస్తున్నారు. సర్వే చేపట్టాం ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మామిడి తోటలకు అనుకూలంగా లేవు. సీజన్ మొదటి నుంచి వీస్తున్న ఈదురుగాలులు, గాలి దుమారాలతో పూత, కాత రాలిపోయింది. దానికి తోడు బలమైన గాలులకు కాయలు రాలిపోవడంతో పాటు కొమ్మలు, చెట్లు విరిగిపడి రైతులకు తీవ్రంగా నష్టాన్ని కలిగించాయి. మామిడి తోటలను పరిశీలించి సర్వే చేపట్టాం. జిల్లాలో 136 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం. – ఎంఏ నదీం, ఆసిఫాబాద్ డివిజన్ ఉద్యావన శాఖ అధికారి -
పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్‌అర్బన్: విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాల అండగా ఉంటామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ స భ్యులకు సోమవారం జిల్లా కేంద్రంలో రూ.8 లక్షల విలువైన భద్రత చెక్కు అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర బెని ఫిట్స్ అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రాణాప్రతాప్, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ శంకర్‌రెడ్డి, ఆర్ఐలు పెద్ద న్న, అంజన్న, నాగుల్ మీరా, ఏవో శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వర్మ పాల్గొన్నారు. -
‘పల్లెల అభివృద్ధే ధ్యేయం’
బెజ్జూర్: మారుమూల పల్లెల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నా రు. మండలంలోని కొర్తగూడలో సోమవారం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువ వికా సంతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీవర్ధన్, నాయకులు జగ్గాగౌడ్, విశ్వేశ్వర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కల్లాల్లోనే ధాన్యం
దహెగాం: మండల కేంద్రంలో ధాన్యం కుప్పలుఈ ఫొటోలోని రైతు పేరు డోకే మధుకర్. పెంచికల్పేట్ మండల కేంద్రానికి చెందిన ఈయన రెండెకరాల్లో వరి సాగు చేశాడు. కోతలు పూర్తికాగా, ధాన్యం పొలం వద్ద కల్లంలోనే ఆరబెడుతున్నాడు. అకాల వర్షం ముప్పు పొంచి ఉండటంతో ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నాడు. ఇలా.. జిల్లాలో చాలా మంది రైతులు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పెంచికల్పేట్(సిర్పూర్): జిల్లాలో వరికోతలు జో రందుకున్నాయి. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో కుప్పలు పోశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మరోవైపు శనివారం జిల్లావ్యాప్తంగా గాలిదుమారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో కల్లాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. 34 కొనుగోలు కేంద్రాలు..జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఉన్న మండలాల్లో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 19, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 15 కేంద్రాలు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం వరి ఏ గ్రేడు రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2300 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు రూ.1800 నుంచి రూ.2వేలకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. వర్షం పడే అవకాశం ఉండటంతో కుప్పలపై టార్పాలిన్లు కప్పుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. జిల్లాలో జోరుగా వరి కోతలు ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు కమ్ముకుంటున్న మబ్బులతో ఆందోళనలో అన్నదాతలుమూడెకరాల్లో సాగు చేశా మూడెకరాల్లో వరి పంట సాగు చేశాను. పది రోజుల క్రితం కోతలు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పొలం సమీపంలోనే ధాన్యం ఆరబెట్టి కాపలా ఉంటున్నాను. ప్రతిరోజూ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నాం. – ఇర్షాద్, రైతు, ఎల్లూర్ త్వరగా ప్రారంభించాలి పది రోజుల క్రితం కోతలు పూర్తిచేశాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వి క్రయించడానికి వేచి చూస్తున్నాం. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పంటను రక్షించుకో వడానికి ఇబ్బంది పడుతున్నాం. అధికారులు, ప్ర భుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి. – చప్పిడే సంజీవ్, కొత్తగూడ19 వేల ఎకరాల్లో సాగుప్రస్తుతం యాసంగి సీజన్లో ఆసిఫాబాద్, రెబ్బెన, పెంచికల్పేట్, కాగజ్‌నగర్, బెజ్జూర్ తదితర మండలాల్లో 19వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. వట్టివాగు, ఎల్లూర్ బొక్కివాగు, బోరుబావుల కింద సాగు ఎక్కువగా ఉంది. సీడ్ వరి(ఆడ, మగ) కోతలతోపాటు సాధారణ వరి కోతలు 15 రోజులుగా జోరుగా సాగుతున్నాయి. సీడ్ వరి ధాన్యం(ఆడ) ఆయా కంపెనీలే కొంటున్నాయి. సాధారణ రకం, సీడ్ మగ ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఎక్కువగా విక్రయిస్తారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెడుతున్నారు. -
సమాచారం తెలిసేదెలా..?
తిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎండను సైతం లెక్క చేయకుండా కూలీలు పనులకు వెళ్తున్నారు. అయితే జిల్లాలో ఉపాధి కూలీలకు పే స్లిప్‌ల పంపిణీ నిలిచిపోవడంతో వేతన వివరాలు తెలియడం లేదు. పనులకు వెళ్లేవారు చాలా మందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్మన్ రేగా యాప్‌పై అవగాహన లేకపోవడంతో వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది. మూడేళ్లుగా ఇదే తంతు..జిల్లావ్యాప్తంగా 1.23 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 2.43 లక్షల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో 91 వేల జాబ్‌కార్డులు యాక్టీవ్‌గా ఉండగా 1.70 లక్షల కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఒకటి, రెండు మండలాలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు. కూలీలకు మాత్రం వేతన స్లిప్‌లు ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితం వరకు సక్రమంగా అందించగా, వివిధ కారణాలతో పంపిణీ నిలిపివేశారు. ప్లే స్లిప్‌లో కూలీ పేరు, పని ప్రదేశం పేరు, ఎన్ని పని దినాలు చేశారు, రోజుకు కూలి ఎంత పడింది, చేసిన పని దినాలు ద్వారా వచ్చే వేతనం ఎంత, తదితర వివరాలు ఉంటాయి. వంద రోజులు పూర్తికావడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనే సమాచారం కూడా అందులో తెలియజేస్తారు. సదరు కూలీకి ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారో, ఎంత వేతనం వస్తుందో సృష్టంగా అర్థమయ్యేది. ప్రస్తుతం స్లిప్‌ల పంపిణీ చేయకపోవడంతో కూలీలకు వారానికి ఎంత పడుతుందో తెలియడం లేదు. వివరాలు స్పష్టంగా తెలిస్తే ఒక వారం తక్కువ పడినా.. మరోవారం నుంచి గరిష్ట వేతనం కోసం అధికంగా పని చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఉపాధిహామీ గరిష్ట వేతనం రూ.307 కాగా జిల్లాలో ప్రస్తుతం సగటు కూలి రూ.220 వరకు మాత్రమే ఉంది. యాప్‌పై అవగాహనేది..?ఉపాధిహమీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంబంధించి హాజరు, వేతన వివరాలు, మిగిలి ఉన్న పనిదినాలు వంటి వివరాలు ‘జన్మన్ రేగా‘ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లోనూ పొందుపరుస్తున్నారు. జిల్లాలో గిరిజనులతోపాటు సాధారణ ప్రజలకు అవగాహన లేదు. క్షేత్రస్థాయిలో ఈ యాప్‌పై ఈజీఎస్ అధికారులు, సిబ్బంది కూలీలకు సక్రమంగా అవగాహన కల్పించలేదు. అసలు ఈ యాప్ ఉన్నట్లు కూడా పది శాతం మంది కూలీలకు కూడా తెలియదు. ఎంత పడుతున్నాయో.. ఉపాధి పనులకు క్రమం తప్పకుండా వెళ్తుంటా. కానీ రోజుకు కూలీ ఎంత పడుతుందో తెలియడం లేదు. నాలుగైదు వారాలకు సంబంధించిన డబ్బులు పడ్డాక ఒకసారి పోస్టాఫీస్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నా. ప్రతీ వారం ఎంత కూలి పడుతున్నాయో అర్థం కావడం లేదు. – మల్రాజ్ శ్రీనివాస్, గోలేటి, మం.రెబ్బెన పే స్లిప్‌లు అందించాలి ఉపాధి పనులు చేస్తున్న కూలీలందరికీ ప్రతీ వారం తప్పనిసరిగా పే స్లిప్‌లు అందించాలి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం జన్మన్ రేగా యాప్ అందుబాటులోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో కూలీలకు అవగాహన కల్పించడం లేదు. – రాయిల్ల నర్సయ్య, జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాలో నిలిచిన ఉపాధి కూలీల పే స్లిప్‌ల పంపిణీ ‘జన్మన్ రేగా’ యాప్‌పైనా అవగాహన కరువు వివరాలు తెలియక ఇబ్బందులుకూలీలు నష్టపోయే అవకాశంసాధారణంగా ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన డబ్బులు పోస్టాఫీస్ లేదా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తున్నా రు. జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీస్ ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకన్నా ఎక్కువ వారాలకు సంబంధించిన మొత్తాలను ఒకేసారి జమ చేస్తుంటారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా నిరాక్ష్యరాసులు ఉన్నారు. వారికి ఖాతాల్లో ఎంత నగదు జమయ్యిందో తెలియడం లేదు. బీపీఎంలు నగదు విత్‌డ్రా సమయంలో గతంలో పలు అక్రమాలకు పాల్పడ్డారు. అమాయకులను మోసం చేశారు. ఒకవేళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినా ఏటీఎంలు లేక మినీ ఏటీఎంలను ఆశ్రయించాల్సిందే. వేతన వివరాలు తెలియకుంటే మినీ ఏటీఎం నిర్వాహకులు సైతం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. -
అదనపు కలెక్టర్ నివాసంలో షార్ట్ సర్క్యూట్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో గల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ నివాసంలో ఆదివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇంట్లోని ఏసీ నుంచి ఒక్కసారిగా పొగ, మంటలు వ్యాపించాయి. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని బీరువా, అందులోని పుస్తకాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఫర్నిచర్, మంచం కాలిపోయాయి. సుమారు రూ.4.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారి కార్తీక్ తెలిపారు. -
ప్రశాంతంగా ‘మోడల్’ పరీక్ష
ఆసిపాబాద్‌రూరల్: తెలంగాణ మోడల్ స్కూ ళ్లలో 6 నుంచి పదో తరగతి వరకు సీట్ల భర్తీ కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉదయం నిర్వహించిన పరీక్షకు 491 మంది విద్యార్థులకు 397 మంది హాజరు కాగా, 94 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన ఏడో తరగతి ప్రవేశ పరీక్షకు 167 మందికి 136 మంది, ఎనిమిదో తరగతికి 120 మందికి 95 మంది, తొమ్మిదో తరగతికి 85 మందికి 66 మంది, పదో తరగతికి 32 మందికి 22 మంది హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. -
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల గెలుపు కోసం సైనికు ల్లా పని చేయాలని, పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియా జ్ అహ్మద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన భారత్ సంవిధాన్ బచావో సభకు ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి హాజ రయ్యారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, పార్టీ అభివృద్ధి కోసం గ్రామ కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, పార్టీలో జరిగే ప్రతీ విష యం కార్యకర్తలలకు తెలియజేస్తామన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పా లనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. జిల్లావాసులకు ప్రాణాధారమైన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామ ని తెలిపారు. పెద్దపల్లి గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్ మాట్లాడుతూ కమిటీల్లో అవకాశం ఇచ్చిన నాయకులు సమావేశాలకు హాజరు కాకుంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాలు గురించి దిశానిర్దేశం చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ కార్యకర్తలు సంక్షేమ పథకాల్లో వాటా మాత్రమే అడుగుతున్నారని, వాటిని అందించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మాట్లాడుతూ మాట వినకుంటే అధికారులను సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలేశ్‌గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు వసంత్‌రావు, కాంగ్రెస్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ శ్యామ్, మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, మైనార్టీ నాయకుడు మునీర్ అహ్మద్, మండలాల అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు. ● రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్ -
ఒప్పందాలతోనే సరి.. అమలు ఏది మరి?
● స్ట్రక్చరల్ ఒప్పందాలకు కలగని మోక్షం ● ఉత్తర్వుల జారీలో సింగరేణి జాప్యం ● నష్టపోతున్న కార్మికులు ● గుర్తింపు సంఘం ఒత్తిడికి డిమాండ్శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్ట్రక్చరల్ సమావేశాలు చాలా కాలం తర్వాత ఫలప్రదమయ్యాయి. అనేక డిమాండ్లపై యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాల అమలులో జాప్యం కార్మికులను నిరాశకు గురి చేస్తోంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యంతో జరిపిన చర్చల్లో ఆమోదించిన డిమాండ్లు ఇప్పటికీ కాగితంపైనే ఉన్నాయి. సమావేశాల పునరుద్ధరణఐదేళ్లుగా నిలిచిన స్ట్రక్చరల్ సమావేశాలు 2024లో ఏఐటీయూసీ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 24న డైరెక్టర్ (పర్సనల్ అడ్మినిస్ట్రేషన్), మార్చి 6, 2025న సీఎండీ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఏఐటీయూసీ నాయకులు మెడికల్ అన్‌ఫిట్ కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు, సొంత ఇళ్ల కార్మికులకు క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ పునరుద్ధరణ వంటి డిమాండ్లను ప్రస్తావించారు. కమిటీల జాప్యంసొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై పన్ను మినహాయింపు, విజిలెన్స్ కేసుల పరిష్కారం వంటి డిమాండ్లపై కమిటీలు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే, కమిటీల ప్రక్రియలో జాప్యం నివారించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యజమాన్యం వెంటనే ఉత్తర్వులు జారీ చేసి, కమిటీల నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కార్మికులు కోరుతున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు కార్మిక సంక్షేమానికి ఆశాకిరణంగా నిలిచినప్పటికీ, ఒప్పందాల అమలులో జాప్యం కార్మికుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. యాజమాన్యం ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర్వుల కోసం యాజమాన్యంపై ఒత్తిడి.. కంపెనీ స్థాయిలో డైరెక్టర్ (పా), సీఎండీ లెవల్ స్ట్రక్షరల్ సమావేశంలో జరిగిన ఒప్పందాలపై యాజమాన్యం వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి. జాప్యం సరికాదు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం చాలా కాలంగా కార్మికవర్గం ఎదురుచూస్తుంది. ఉత్తర్వుల కోసం యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాం. – కొరిమి రాజ్‌కుమార్, ఏఐటీయూసీ కేంద్ర ప్రధాన కార్యదర్శిఒప్పందాల్లో జాప్యంయాజమాన్యం కొన్ని డిమాండ్లకు భేషరతుగా ఒప్పుకుంది. మరికొన్నింటిపై కమిటీలు ఏర్పా టు చేస్తామని చెప్పింది. ప్రమోషన్లలో సర్వీసు నిబంధనల మార్పు, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజె క్టు కోడ్ల విభజన, హైదరాబాద్‌లో సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, క్యాంటీన్ల స్వయం నిర్వహణ వంటి ఒప్పందాలు కుదిరాయి. మైనింగ్ స్టాఫ్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు అండర్ గ్రౌండ్లో మెడికల్ అన్‌ఫిట్ అయితే వారికి సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ డిమాండ్ పరిష్కారం కోసం వీరంతా ఎన్నో ఏళ్లు నుంచి చూస్తున్నారు. జేఎంవో, జేటీవో, జేఏవోలకు ప్రమోషన్‌కు సంబంధించిన అంశంలో ఏ1 గ్రేడ్‌లో ఐదు సంవత్సరాల సర్వీసు చేసి ఉంటేనే వారికి ఎగ్జిక్యూటీ వ్గా పదోన్నతి కల్పిస్తుండగా దాన్ని మార్చుతూ ఏ గ్రేడ్‌లోనే ఐదేళ్లు సర్వీసు ఉన్న కూడా ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పందమైంది. కాని దీనికి కూడా ఉత్తర్వులు రాలేదు. డిస్మిస్ కార్మికులందరికీ ఐదేళ్ల కాలంలో కనీసం ఒక సంవత్సరం 100 మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగం కల్పిండానికి యాజమాన్యం ఒప్పుకుంది. ఈ ఒప్పందాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది. -
గాలిదుమారం.. ఆగమాగం
● నేలకొరిగిన వరి, విద్యుత్ స్తంభాలు ● అంధకారంలో గ్రామాలు దహెగాం/పెంచికల్పేట్/ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం గాలిదుమారం బీభత్సం సృష్టించింది. దీనికితోడు చిరుజల్లులు పడటంతో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. అర్ధరాత్రి కావడంతో రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పలేకపోయారు. దహెగాం మండల కేంద్రం సమీపంలో వరి పంట గాలికి నేలవాలింది. ఐనం గ్రామంలో నాలుగు స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు కరెంటు లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులకు పెంచికల్పేట్, సలుగుపల్లి ప్రధాన రహదారిపై లోడుపల్లి వద్ద భారీ వృక్షం నేలకూలింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెంచికల్పేట్ మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలో గడిపారు. అకాల వర్షం, ఈదురుగాలులకు ఆసిఫాబాద్ మండలంలో కొమ్ముగూడ, గొల్లగూడ, ఈదులవాడ గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అధికారులు తక్షణమే స్పందించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు రాలగా, వరిపైరు నేలవాలింది. షార్ట్ సర్క్యూట్‌తో నిరుపేద ఇల్లు దగ్ధంలింగాపూర్: మండలంలోని మా మిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం తెలంగ్రావ్కు చెందిన ఇల్లు శని వారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగ్రావ్ తల్లి, భార్య, ఒక కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మంట లు చెలరేగాయి. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బయటకు పరుగులు తీశారు. చుట్టపక్కల ఉన్న వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా.. గాలి తీవ్రతకు అదుపులోకి రాలేదు. ఇంట్లోని బట్టలు, బియ్యం, జొన్నతో పాటు రూ.40వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, మూ.30 వేల సామగ్రి మంటల్లో కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. విష యం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు ఇంటిని పరిశీలించారు. కలెక్టర్‌కు వివరాలు సమర్పించి, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఆర్టీసీ యాప్‌లపై ప్రచారం
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ యాప్‌ల ద్వారా అందిస్తున్న అత్యాధునిక సేవలను ప్రజల్లోకి తీసుకవెళ్లడంలో భాగంగా డిపో మేనేజర్ కేవీ రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్‌కు క్యూఆర్ కోడ్ కలిగిన స్కానర్ కీచైన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆధునిక సౌకర్యాలను ప్రయాణికులు పూర్తిగా వినియోగించుకోవాలని సూ చించారు. ఆర్టీసీ యాప్‌లతో ప్రయాణికులకు సేవలు సులభతరమైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఫైర్‌స్టేషన్, ఎస్‌హెచ్‌వో కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్ కీచైన్లు అందజేశారు. -
సామ్, మామ్ పిల్లలను గుర్తించాలి
వాంకిడి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బ రువు చూసి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి సామ్, మామ్ పిల్లల నివేదికలు అందజేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆడెపు భాస్కర్ సూచించారు. శని వారం మండలంలోని బంబార రైతువేదికలో అంగన్వాడీ టీచర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామ్, మామ్ ద్వారా బలహీన పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లల ఆ రోగ్య పరిస్థితిని మెరుగుపరిచి రోజువారీ వివరాలను పోషణ్ ట్రాకర్‌లో నమోదు చేయాలని తెలిపారు. పి ల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలందించాలని పేర్కొన్నారు. పౌష్టికాహారం అందేలా నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ గో పాలకృష్ణ, సూపర్వైజర్లు భారతి, కుమారి, లత, బ్లాక్ కోఆర్డినేటర్ తౌఫిక్, బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ డోంగ్రి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ దండె విఠల్ ● ఆలయంలో పూజలు తిర్యాణి: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గీత కా ర్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ జెన్సీ ప్రాంతాల్లో లైసెన్స్‌లు లేకుండా ఇబ్బందులు పడుతున్న గీత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపా రు. ఎల్లమ్మ గుడి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటా యించి ప్రహరీ, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గౌడ కులస్తులు ఎమ్మెల్సీని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జిల్లా నాయకుడు జువ్వాజి అనిల్‌గౌడ్, మోకు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్‌గౌడ్, ప్రచార కార్యదర్శి మార్క శంకర్‌గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిత్తారి సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై స్పందించాలి
వాంకిడి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఫిర్యాదులు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రి కార్డులు తనిఖీ చేశారు. ఎస్సై, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమస్యలు తె లుసుకున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగా హన కల్పించి సీసీ కెమెరాలు అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల ని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆ వరణలో మొక్కలు నాటారు. సీఐ సత్యనారా యణ, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు. -
పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులు కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులకు సూచించారు. శనివా రం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. నీట్‌ను లోటుపాట్లు లేకుండా పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తి ఏర్పా ట్లు చేయాలని, భద్రత చర్యలు చేపట్టాలని తెలిపా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. మే 4న మధ్యాహ్నం 2నుంచి సా యంత్రం 5గంటల వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు 287 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో ఏఎస్సీ ప్రభాకర్‌రావు, పరీక్షల సమన్వయకర్త లక్షీనరసింహ, పర్వవేక్షకులు ఉదయ్‌బాబు, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఆసిఫాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధి లో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాని కి లబ్ధిదారుల ఎంపిక పాదర్శకంగా ఉండాలని సూ చించారు. పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తదితరులున్నారు. ఇంటి నిర్మాణ పనుల పరిశీలనవాంకిడి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వాంకిడి గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్ఆర్ఎస్ స్థలాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యదర్శి శివకుమార్ సూచనలు చేశారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ గ్రామపంచాయతీ జైత్పూర్ గ్రామాన్ని సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీపీవో భిక్షపతి, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, వివిధ శాఖల అధికారులున్నారు. -
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● చట్టంపై అవగాహన సదస్సు తిర్యాణి: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి–2025 రెవెన్యూ చట్టం ద్వారా భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ దండె విఠల్, ఆర్డీవో రాజేశ్వర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చట్టంలోని అప్పీల్ వ్యవస్థ ద్వారా రైతులెవరైనా అన్యాయానికి గురైనప్పుడు న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికీ చాలావరకు భూమి హద్దుల గొడవలున్నాయని పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి భూభారతి సర్వే ఉపయోగపడనుందని తెలిపారు. జూన్ 2 తర్వాత ప్రతీ గ్రామంలో భూసమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమాదేవి, తహసీల్దార్ సూర్యప్రకాశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఏవో వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో..రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్సీ దండె విఠల్, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హాజరై మాట్లాడారు. భూమి కొనుగోలు, విరాసిత్, వారసత్వ భూ మి మార్పిడిలో సర్వేయర్ రూపొందించిన కమతం నక్షా జతపర్చడం మూలంగా భవిష్యత్‌లో భూము ల హద్దులు, ఇతర వివాదాలకు తావుండదని పే ర్కొన్నారు. జూన్ 2 తర్వాత ప్రతీ గ్రామానికి గ్రామపాలన అధికారులు వస్తారని తెలిపారు. అన్ని గ్రా మాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతిపై మరింత అవగాహన కల్పించి రైతుల నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నా రు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ.. ధరణిలోని లోపాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం భూభా రతి చట్టం తెచ్చిందని చెప్పారు. ధరణి కారణంగా స్వయంగా తానే ఇబ్బందులకు గురైనట్లు గుర్తు చే శారు. డీపీవో భిక్షపతి, తహసీల్దార్ రామ్మోహన్రా వు, ఎంపీడీవో శంకరమ్మ, ఏవో దిలీప్, ట్రాన్స్పో ర్ట్స్ నాన్ ఎక్స్ అఫీషియల్ సభ్యుడు లావుడ్య రమేశ్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లె ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలి
రెబ్బెన: గోలేటిలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, క్లీనర్లకు సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని ఏఐటీయూసీ బె ల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోల్ ట్రాన్స్పో ర్టు కార్మికులు విధులు బహిష్కరించి రాస్తారోకో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం, యూనియన్ మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతినెలా 15లోగా వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశా రు. కోల్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ గోలేటి బ్రాంచి అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు తిరుపతి, సంతోష్, చందర్లాల్, సతీశ్ పాల్గొన్నారు. -
నామినేషన్ పద్ధతిలో బొగ్గుబ్లాకులు అప్పగించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రంలోని బొగ్గు బ్లా కులను నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం విజయ భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చే యాలని, మెడికల్ కార్డులు అందించాలన్నా రు. కార్మిక కాలనీలకు రక్షిత మంచినీటి సరాఫరా చేయడంతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నాయకులు మంగీలాల్, వెంకటేశం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రమేశ్, సమ్మయ్య, ఓదెలు పాల్గొన్నారు. -
బోధన నైపుణ్యాలపై శిక్షణ
● వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ● ఇప్పటికే రిసోర్స్పర్సన్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపికకెరమెరి(ఆసిఫాబాద్): ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు రిసోర్స్పర్సన్ల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించడంపై కొంతమంది టీచర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. వెనుకబడుతున్న విద్యార్థులుజిల్లాలో 730 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2,225 మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో చాలామంది చదవడం, రాయడం కూడా రావడం లేదని, చతుర్విద ప్రక్రియలు చేయడం లేదని విద్యాశాఖ అధి కారులు గుర్తించారు. కనీస సామార్థ్యాలు సాధించడంలో వెనుబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సర్వేల ఆధారంగా ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్నడూ లేని విధంగా టీచర్లకు శిక్షణ అందించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యత పెంచుకునే విధంగా అవగాహన కల్పించనున్నారు. ఐసీటీ టూల్స్, ఏఐ విద్య, అకాడమిక్ పరంగా వచ్చే విద్యా సంవత్సరం వచ్చే మార్పులు, తదితర విషయాల గురించి వివరించునున్నారు. ఈ నెల 30 వరకు మండల, జిల్లా పరిధిలోని రిసోర్స్పర్సన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ జాబితాను ఎస్సీఈర్టీకి పంపించనున్నారు. నిరాసక్తత..ఇటీవల మండలాల నుంచి రిసోర్స్ పర్సన్లను నామినేట్ చేయాలని ఉన్నతాధికారులు మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. అయితే అందుకు నిరాసక్తత చూపుతున్నారు. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి గడుపుదామనే సమయంలో శిక్షణ నిర్వహించడం సరికాదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల రిసోర్స్పర్సన్లు దరఖాస్తు చేయలేదని సమాచారం. చేసేదేమీ లేక ఎంఈవోలే కొందరిని నామినేట్ చేస్తున్నారు. లోటు పూడ్చేలా..కరోనా మహమ్మారి మిగిల్చిన అభ్యసన లోటును పూడ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వివిధ బోధన పద్ధతులు ఉపయోగిస్తున్నప్పటికీ ప్రాథమిక స్థాయిలో చదవడం, సొంతంగా రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో కొంతమంది విద్యార్థులు వెనకబడి ఉన్నారు. ఉన్నతస్థాయిలో విద్యార్థులు కూడా విషయాలను అర్థం చేసుకుని సొంతంగా రాయలేకపోవతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రతీ టీచర్ శిక్షణకు హాజరు కావాలి మండల స్థాయిలో టీచర్లకు వేసవిలో నిర్వహించే శిక్షణకు ప్రతీ టీచర్ హాజరు కావాలి. రానున్న విద్యా సంవత్సరం నుంచి వచ్చే మార్పులు, నూతన బోధన పద్ధతుల గురించి వివరిస్తారు. బోధన సామర్థ్యాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. శిక్షణకు సద్వినియోగం చేసుకోవాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్ ఎంపిక ఇలా..రిసోర్స్పర్సన్ల్ ఎంపిక బాధ్యత కలెక్టర్ ఆధ్వర్యంలో డీఈవోలు డైట్ అధ్యాపకులు, బీఎడ్ అధ్యాపకులు, ఇతర అధికారులకు అప్పగించారు. ఇంటర్వూ, డెమోలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ప్రతీ మండలం నుంచి ఒక్కో సబ్జెక్టుల్లో ఇద్దరు చొప్పున జిల్లా పరిధిలో స్కూల్ అసిస్టెంట్లను రిపోర్స్పర్సన్లుగా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వేసవి మే నెలలో జిల్లాలోని ఉపాధ్యాయులకు వీరు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. డీఆర్పీలకు రాష్ట్రస్థాయిలో శిక్షణ నిర్వహించనున్నారు. వీరు ఎంఆర్పీలకు జిల్లాస్థాయిలో, ఎంఆర్పీలు మండలస్థాయిలో ఐదురోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తారు. -
భూభారతితో రైతులకు మేలు
పెంచికల్పేట్/కౌటాల: కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పెంచికల్పేట్, కౌటాలలోని రైతువేదికల్లో శుక్రవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్‌తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, నూతనంగా వచ్చిన భూభారతి చట్టంతో ఆ సమస్యలు తొలగిపోతాయన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నుంచి ప్రతీ గ్రామంలో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు భూమితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందన్నారు. పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో సర్వే నిర్వహించి హద్దులు గుర్తించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధిహామీ పని ప్రదేశాల్లో టెంటు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, ఏడీ మనోహర్, ఈఈ ప్రభాకర్, తహసీల్దార్లు వెంకటేశ్వర్రావు, పుష్పలత, ఎంపీడీవోలు అల్బర్ట్, రమేశ్, ఏవోలు మనీషా, ప్రేమలత, ఎస్సై కొమురయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం’
వాంకిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని సమేల గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద రూ.13 లక్షలతో మంజూరైన సీసీరోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చు ట్టిందన్నారు. పేదలకు ఇళ్లు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, నిరుద్యోగులకు ఆర్థిక తోడ్పా టు అందిస్తుందన్నారు. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పే ర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్నులె నారాయణ, యూత్ అ ధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు జీవన్, నాగభూషన్, సంతోష్, తిరుపతి పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు అరికట్టాలి
ఆసిఫాబాద్‌అర్బన్: బాల్య వివాహాలు అరికట్టాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక కనుంగో అ న్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను ఢిల్లీ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా బాల ల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్‌కు పలు సూచనలు చేశారు. జాతీయ బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడు తూ జిల్లాలో ఎక్కడా బాల్యవివాహాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నా రు. ఎవరినీ ఉపేక్షించకుండా మొదట జుడిషయల్ ఇంజెక్షన్ ఆర్డర్స్ జారీ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. బాల్య వివాహాల ముక్త్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనలు జరగకుండా పనిచేయాలని ఆదేశించారు. బాల్య వివాహాలతో జరిగే నష్టాలను గ్రామాల్లో వివరించాలని సూచించారు. -
సమగ్ర వివరాలు నమోదు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రధాన మంత్రి గతిశక్తి పోర్టల్‌లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం గతిశక్తి వివరాల నమోదుపై గురువారం విద్య, వైద్యం, శిశు సంక్షేమం, రహదారులు, తాగునీటి శాఖల అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలల వివరాలు, జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ర హదారులు, తాగునీటి వనరుల వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. తద్వారా సౌకర్యాలు లేని గ్రామాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ జిల్లాస్థాయి అధికారికి లాగిన్ ఐడీ ఉండాలని, పోర్టల్‌లో 70 మంత్రిత్వ శాఖల వివరాలు ఉంటాయన్నారు. వివరాల నమోదులో శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, ఇన్చార్జి డీఈవో ఉదయ్‌బాబు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్‌వో సీతారాం, పంచాయతీరాజ్ ఇంజినీర్లు ప్రభాకర్, కృష్ణ, ఈ డిస్ట్రిక్ మేనేజర్ గౌతమ్‌కుమార్, పీఎం జన్మన్ సమన్వయకర్త మణివేలు తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాదుల చర్యలు అమానుషం
ఆసిఫాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం స మీపంలో జరిగిన ఉగ్రవాదుల దాడులు అ మానుషమని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చే కూరాలని గురువారం న్యాయవాదులు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చంద్రకుమార్, కార్యదర్శి చరణ్, న్యాయవాదులు టి.సురేశ్, జగన్మోహన్రావు, శ్యాంకుమార్, సతీశ్‌బాబు, విద్యాసాగర్, అంజలి, గణపతి, గణేశ్, అరవింద్ పాల్గొన్నారు. -
నిర్మల్‌లోనే నాణ్యమైన విద్య
● ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డినిర్మల్టౌన్: హైదరాబాద్ విద్యాసంస్థలకు దీటుగా నిర్మల్‌లోనే ఆల్ఫోర్స్ విద్యాసంస్థ నాణ్యమైన విద్య అందిస్తుందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గురువారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆల్ఫోర్స్లో విద్యతో పాటు విలువలను అందిస్తామన్నారు. టాపర్స్ వీరే.. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్స్‌గా నర్వాడే కృష్ణవేణి 468/470, జోషి ప్రసూన శ్రీ 468/470, పడిగెల కీర్తిశ్రీ కి 468/470, బాలుర విభాగంలో బోనాల శ్రీ చరణ్ 467/470, వడకపూర్ అఖిల్ 467/470, కార్తికేయన్ 467/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో సామ ఫిర్దోస్ 438/440, జోహా మహావీష్ 438/440, నబిలా తహరీమ్ 438/440 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాలలో కవల్ ప్రీత్‌కౌర్ 995/100, సుమయ కణం 994/100, జాదవ్ నవ్యశ్రీ 993/1000 మార్కులు సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఘనంగా సామూహిక వివాహ వేడుకలు
● ఏకమైన నాలుగు జంటలుఇంద్రవెల్లి: మండలంలోని అంజీ గ్రామపంచాయతీ పరిధి మామిడిగూడలో గురువారం ఆంద్ సమాజ్ ఆధ్వర్యంలో పరమాహంస సద్గురు పూలాజీబాబా సంస్థాన్ వద్ద సామూహిక వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో అదే గ్రామానికి చెందిన నాలుగు జంటలు ఏకమయ్యాయి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, పట్నాపూర్ శ్రీ సద్గురు పరమాహంస పూలాజీబాబా ధ్యాన్ మందిర్ వ్యవస్థాపకుడు కేశవ్ ఇంగ్లేతో పాటు ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐటీడీఏ పీవీటీసీ ఏపీవో మెస్రం మనోహర్, ఆదివాసీ పెద్దలు డాకురే రాందాస్, కరాడే మారుతి, మెస్రం శేఖర్‌బాబు తదితరులు ఉన్నారు. -
అప్పీల్ వ్యవస్థ చాలా కీలకం
కెరమెరి(ఆసిఫాబాద్): భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ చాలా కీలకమైందని, రైతులకు ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని కెస్లాగూడ రైతువేదికలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే కలెక్టర్, ఆర్డీవో, సీసీఎల్ స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారిని గ్రామ అధికారి, సర్వేయర్లుగా నియమిస్తామని అన్నారు. రైతులకు న్యాయం చేస్తాంఅనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. ధరణి పోర్టల్‌తో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగేవని, ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవన్నారు. సాదాబైనామాల ప్రకారం కొనుగోలు చేసిన భూములకు సైతం పరిష్కారం లభిస్తుందన్నారు. చట్టంలోని అంశాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఎంపీడీవో అంజద్‌పాషా, కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, రైతులు పాల్గొన్నారు. ప్రతీ రైతుకు భూభారతి చట్టంపై అవగాహన ఉండాలి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
● భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య ● సోదరుడికి ఫోన్ చేయడమే శాపమైందా..? ● విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యుల ఆందోళన ● అదనపు కలెక్టర్, పోలీసుల జోక్యంతో విరమణమంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మిప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్‌వాచ్‌మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మిప్రసన్న మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది.. ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మిప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్‌కు వాచ్మెన్ మహేశ్ సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్‌కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్‌పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మిప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిలింగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న జాముల్ధారలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులతో సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదా రులకు త్వరగా రుణాలు మంజూరు చేయాలని ఏపీఎం తిరుపతికి సూచించారు. అలాగే గ్రామంలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు సిద్దిక్, రాకేశ్, డీఈఈ నరేశ్, ఎంపీడీవో రాంచందర్, ఏఈలు అరవింద్, కృష్ణతేజ, ఏపీవో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలిఆసిఫాబాద్: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(యూ) మండల కేంద్రంలోని పంప్‌హౌజ్‌ను గురువారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేయాలన్నారు. పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
‘తార’ సేవలు భేష్
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఘనంగా పోలీసు జాగిలం అంత్యక్రియలుఆదిలాబాద్టౌన్: పోలీసు శాఖకు జాగిలం తార అందించిన సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 2013 బ్యాచ్‌లో పోలీసు వ్యవస్థలోకి వచ్చిన తార జిల్లాలో పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పోలీసు జాగిలం తార మృతిచెందడంతో గురువారం పోలీసు కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పాల్గొని తారకు శాలువా, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వీఐపీలు జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంగా భద్రత విషయంలో తనిఖీలు నిర్వహించడంలో తార సేవలు ఎంతగానో దోహద పడ్డాయని గుర్తు చేశారు. పోలీసు జాగిలాలకు సకల సదుపాయాలు కల్పించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ జాగిలానికి కూలర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, మురళి, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది రమేశ్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊపిరాడక 20 మేకలు మృతి
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): భోరజ్ మండలం సిర్సన్న గ్రామంలో గురువారం 20 మేకలు ఊపిరాడక మృతిచెందాయి. గ్రామంలోని ఆత్రం యాదవ్, గెడాం వికాస్‌లు తమ మేకలను మేపడానికి గ్రామంలోని వైకుంఠధా మం ప్రాంతానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సి ఉండగా, వాటిని వైకుంఠధామంలోని స్నానాల గదిలో ఉంచి తలుపులు వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్లి చూసేసరికి ఊపిరాడక 20 మేకలు మృతిచెందాయి. రేకులు ఉండటం, తలుపులు వేసి ఉండడంతో ఎండ తీవ్ర త తట్టుకోలేక, ఊపిరాడక మృతిచెందాయని తె లుస్తోంది. వీటి విలువ దాదాపు రూ.2లక్ష ల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరి హా రం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జొన్న పంట దగ్ధంఆదిలాబాద్టౌన్(జైనథ్): సాత్నాల మండలంలోని మేడిగూడకు చెందిన కళ్లెం రాంరెడ్డి అనే రైతుకు చెందిన రెండెకరాల జొన్న పంట దగ్ధమైంది. గురువారం చేనుకు ఆనుకొని ఉన్న పక్క చేను రైతు గట్లపై ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు జొన్న పంటకు నిప్పంటుకుంది. దీంతో పంట పూర్తిగా కాలిబూడిదైంది. పంట చేనులో ఉన్న 50 పైపులు కూడా మంటలో కాలిపోయినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో గదిని పరిశీ లించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎ త్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నా రు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తి మృతినర్సాపూర్(జి): డొంగుర్గాం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతిచెందాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధనే విజయ్(51) ఈనెల 11న జంగిపల్లి చిన్నయ్య వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ఫార్మర్ దగ్గర మోటార్ పైపులను చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బుధవారం డిశ్చార్జి చేయగా డొంగుర్గాం గ్రామానికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విజయ్ తమ్ముడు వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లింగాపూర్‌లో దొంగతనం
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుగిల్ల బుచ్చన్న కొడుకు దుబాయ్ వెళ్లగా కోడలు సరిత అత్తమామలతో కలి సి ఉంటుంది. బుధవారం సరిత తల్లిగారింటికి వెళ్లగా బుచ్చన్న గదికి తాళం వేసి పక్క గదిలో నిద్రించాడు. తె ల ్లవారుజాము చూసేసరికి గది తాళం, బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో గదిని పరిశీలించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. -
పెళ్లి నుంచి వస్తూ తిరిగిరాని లోకాలకు..
జన్నారం: బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఫిజియో థెరఫిస్టును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఎస్సై రాజవర్దన్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్‌కు చెందిన ఉరిమెత జంగుబాబు (30) జన్నారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియో థెరఫిస్టుగా పని చేస్తున్నాడు. గురువారం బంధువుల పెళ్లికి కలమడుగుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో కొమ్ముగూడెం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరిపడ్డాడు. జంగుబాబు అక్కడికక్కడే మృతి చెందగా స్కూటిపై ఉన్న ఇందన్పల్లి గ్రామానికి చెందిన వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడకు చేరుకు ని వంశీని జన్నారం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేటకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర
● సీఎస్ఐ చర్చి ఆవరణలో మహోత్సవం ● పెద్ద ఎత్తున తరలిరానున్న క్రైస్తవులు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిలక్సెట్టిపేట: ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరను సీఎస్ఐ చర్చి ఆవరణలో ఈ నెల 25, 26న నిర్వహించనున్నారు. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1920లో నిర్మాణం.. ఏటా ఏప్రిల్ 25, 26వ తేదీల్లో సీఎస్ఐ చర్చిలో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్దచర్చిగా పేరొందిన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి జిల్లాలోని చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. లక్సెట్టిపేట పట్టణ సమీపంలో సుమారు 100 ఎకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సీఎస్ఐ చర్చిని ఆంగ్లేయులు నిర్మించారు. 1920లో ఇక్కడికి వచ్చిన ఇంగ్లాండ్ దేశస్తుడు రెవ సీజీ అర్లి దొర నిర్మాణం ప్రారంభించాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, దగ్గరలోని గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్లు తెప్పించాడు. సమీప బొట్లకుంటలోని నీటిని నిర్మాణానికి ఉపయోగించారు. మహారాష్ట్ర శిల్పకళాకారులు ఆకర్షణీయంగా నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. నిర్మాణం పనులు సాగుతుండగా వేసవి కాలంలో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై అర్లి దొర తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణాన్ని పరిశీలించి పూర్తి చేయించాడు. అనంతరం ఇక్కడకు మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ చర్చిని సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించాడు. ఘనంగా ఏర్పాట్లు.. జాతర ఏర్పాట్లను సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు ఫాధర్ డేవిడ్‌పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటిస్తూ సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజాభజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీగా చర్చి వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడుతారు. 26న ఉదయం నుంచి చర్చిలో ప్రత్యేక కీర్తనలు పాడుతూ పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు. -
వడదెబ్బతో యువకుడు మృతి
నిర్మల్‌టౌన్: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బ్రహ్మపూరి కాలనీకి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడు సోఫిబేగ్ (25) గత రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం ఇంట్లో మృతి చెందాడు. కాగా సోఫిబేగ్ మూడు నెలల క్రితం దుబాయ్ నుంచి నిర్మల్‌కు వచ్చాడు. మేకల కాపరి..ముధోల్: మండలంలోని మచ్కల్ గ్రామానికి చెందిన షెల్కే లింగురాం(58) అనే మేకల కాపరి వడదెబ్బతో మృతి చెందాడు. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగురాం మేకలు కాస్తూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే బుధవారం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద పెద్ద కుమారుడు గంగాధర్‌తో కలిసి మేకలను మేపుతున్నాడు. ఈక్రమంలో మిట్ట మ ధ్యాహ్నం ఒక్కసారిగా లింగురాం కుప్పకూలి పోయాడు. గంగాధర్ చెట్టు నీడకు తీసుకెళ్లేందు కు ప్రయత్నించగా లింగురాం స్పందించలేదు. వెంటనే గ్రామంలోకి వెళ్లి కుటుంబసభ్యుల కు, గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చే సరికి లింగురాం మృతి చెంది ఉన్నాడు. లింగురాంకు భార్య లక్ష్మి, కుమారులు గంగాధర్, శ్రావణ్, కుమార్తె పూజ ఉన్నారు. బెల్లం, పటిక పట్టివేతతాండూర్: జాతీయ రహదారి మీదుగా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా గురువారం ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటికి చెందిన దుర్గం రాజ్‌కుమార్, దాగం సంజు, అజ్మీరా చందు అనే వ్యక్తులు బెల్లం, పటిక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఐబీ తాండూర్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎకై ్సజ్ అధికారులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన యువతి..
ఖానాపూర్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లి దండ్రులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. ప్రోబేషనరీ ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా కొన్ని రోజులు వేచి ఉండాలని తెలిపారు. మనస్తాపానికి గురైన స్వప్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి దేవురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
వాంకిడి: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఒక మహిళ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బంబార గ్రామానికి చెందిన నాగుల విలాస్, నాగుల ఉమా (48) దంపతులు బుధవారం కాగజ్‌నగర్ మండలం నవేగాంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో సాయంత్రం జాతీయ రహదారిపై బంబార గ్రామ సమీపంలోని యూటర్న్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చుని ఉన్న ఉమా రోడ్డు డివైడర్‌పై పడగా తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో మహా రాష్ట్రలోని చంద్రపూర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో నాగుల విలాస్‌కు గాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదివాసీ వంటలకు డిమాండ్
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ● ఉట్నూర్‌లో ఇప్పపువ్వు పండుగ కార్యక్రమంఉట్నూర్రూరల్: ఆదివాసీ సాంప్రదాయ వంటలకు ఎంతో డిమాండ్ ఉందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో 8వ ఇప్పపువ్వు పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్లు పాల్గొన్నారు. మహిళలు ఇప్పపువ్వులతో తయారు చేసిన వంటకాలు ప్రదర్శించారు. ఆదివాసీ మహిళలు ఆదివాసీ పద్దతులు, సాంప్రదాయ వంటకాలపై అధికారులకు వివరించి తినిపించారు. అధికారులు మాట్లాడుతూ ఇప్పపువ్వు లడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు. ఈ లడ్డూలు ఉట్నూర్ ఎక్స్‌రోడ్డులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 12 మంది గిరిజన మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వుల లడ్డూలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, దుర్గు పటేల్, సహకార మిత్ర సంస్థ మేనేజర్ విఠల్, పేసా కోఆర్డినేటర్ వసంత్‌రావు, రాయి సెంటర్ల్ల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: పోక్సో కేసుల విచారణ వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతతో ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు పారదర్శకంగా దర్యాప్తు చేసి, కోర్టులో దాఖలు చేయాలన్నా రు. సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలి సి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీ సింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, బియ్యం రవాణా, పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలని సూచించారు. తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారితోపాటు, గ్రూప్ అడ్మిన్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆసిఫాబాద్ సీఐ రవీందర్, ఎస్సై అంజన్న, కానిస్టేబుల్ సాగర్, తిరుపతికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఉగ్రదాడి మృతులకు పోలీసుల సంతాపంఆసిఫాబాద్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
మండుటెండల్లో జాగ్రత్తలే రక్ష
● కార్మికులు, కూలీలు, ప్రజలకు అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ● వడదెబ్బ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌వో సీతారాం కౌటాల: జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు పట్టణాలు, పల్లెల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 15 మండలాలు అలర్ట్ జోన్లో ఉండగా.. తిర్యాణి మండలం వార్నింగ్ జోన్‌కు సమీపంలో ఉంది. ఎండల్లో రక్షణ చర్యలు తీసుకోకుండా తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కెరమెరి మండలం జోడేఘాట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీ(కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్) కనక కాశీరాం(41) బుధవారం వడదెబ్బతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు మండుటెండల్లో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) సీతారాం సూచించారు. ఉదయం, సాయంత్రం మాత్రమే బయటికి వెళ్లి పనులు చేసుకోవాలని సూచించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురువారం ‘సాక్షి’కి వివరించారు. వేసవిలో ఆరోగ్య రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?డీఎంహెచ్‌వో : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగా యి. ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల మధ్య ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉపాధిహామీ కూలీలు, రైతులు ఉదయం 10 గంటలలోపే పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. ఎండలో తిరగాల్సి వస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్, లేదా ఇంట్లో నిమ్మరసం, ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. సీజనల్‌గా లభించే పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, బత్తాయి, ద్రాక్ష, పైనాపిల్ వంటి పండ్ల రసాలు, అంబలి, మజ్జిగ తాగాలి. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..?డీఎంహెచ్‌వో: వడదెబ్బ ఎవరికైనా తగలవచ్చు. శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై అధిక ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. తల తిరగడం, వాంతులు, విరేచనాలు, దాహంగా ఉండడం, శ్వాసక్రియ పెరుగుదల, చెమటలు రాకపోవడం, కడుపు నొప్పి, బీపీ తగ్గడం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ గురైనట్లు గుర్తించాలి. వెంటనే స్థానిక ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక ఏంటి..?డీఎంహెచ్‌వో: ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వడదెబ్బపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అత్యవసర పనిపై వెళ్తే తలకు టోపీలు, తెల్లని రుమాలు ధరించి, శుద్ధమైన తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశవర్కర్ల వద్ద, ఉపాధిహామీ, ఆర్టీసీ డిపోల్లో కార్మికుల కోసం 55 వేలకు పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాం. మరో 60 వేల వరకు ప్యాకెట్లు నిల్వ ఉన్నాయి. వేసవిలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. వైద్యులు, మందుల కొరత ఉందా..?డీఎంహెచ్‌వో: గతంలో పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాం. జిల్లా కేంద్రంలో మందుల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడంతో వేగంగా మందులను పీహెచ్‌సీలకు సరఫరా చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీల్లో 22 మంది, యూపీహెచ్‌సీల్లో 44 మంది వైద్యులకు 18 మంది పనిచేస్తున్నారు. కొరత ఉన్నచోట కొత్తగా వైద్యులను నియమించాల ని ప్రభుత్వానికి నివేదించాం. ఆయుష్ వైద్యు ల సేవలను వినియోగించుకుంటూ పీహెచ్‌సీల్లో సేవలందిస్తున్నాం. వేసవిలో ఎలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది..?డీఎంహెచ్‌వో: వేసవిలో విరేచనాలు, డయేరియా, కామెర్లు, తట్టు, గవద బిల్లల సమస్యలు తలెత్తుతాయి. ఎండలు ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలు, వేపుడు, జంక్‌ఫుడ్ మాంసాహా రం, మద్యం ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తలెత్తే ప్రమాదముంది. పిల్లలను శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి. వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవాలి. వైద్య సిబ్బంది, ప్రజలకు మీరిచ్చే సలహాలు..?డీహెంహెచ్‌వో: జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జిల్లా నుంచి పీహెచ్సీ వరకు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాం. ఎప్పటికప్పుడు కలెక్టర్‌తో కలిసి వైద్య సిబ్బందితో సమీక్షలు జరుపుతున్నాం. పంచాయతీశాఖ, ఈజీఎస్, పోలీస్‌శాఖ, వైద్యశాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించాం. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించాం. ప్రజలు శుభకార్యాలు, విహార యాత్రలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లో)ప్రాంతం బుధ గురు తిర్యాణి 44.9 44.8 ఎల్కపల్లి 44.8 44.8 కెరమెరి 44.8 45.0 వంకులం 44.7 44.8 సిర్పూర్(టి) 44.6 44.4 ఆసిఫాబాద్ 44.6 44.9 లోనవెల్లి 44.5 44.1 -
ఎల్సీకి సాంకేతికత!
● విద్యుత్ ప్రమాదాల నివారణకు యాప్ ● ఇక ఆన్లైన్లో విద్యుత్ లైన్ క్లియరెన్స్ ● అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్పీడీసీఎల్ ● యాప్‌పై అధికారులు, ఉద్యోగులకు శిక్షణ పూర్తిమంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యుత్ విని యోగదారులకు మరింతగా మెరుగైన, నాణ్య మైన సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభిస్తోంది. ఇందులో భాగంగా విద్యుల్ లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్‌కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలతో పాటు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎల్సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ)తీసుకోవడానికి ఎన్పీడీసీఎల్ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకున్న ఉద్యోగికి, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు మాత్రమే తెలి సేది. కానీ యాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో ఎల్సీపై అందరి పర్యవేక్షణ కొనసాగుతుంది. అమలు ఇలా.. ఎల్సీ తీసుకోవాలనుకునే లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఏఈకి విన్నవించుకుంటే ఏఈ పరిశీలించి ఫీడర్లో ఎల్సీ ఇవ్వడానికి వీలు ఉందా లేదా అని పరిశీలించి అనుమతి ఇస్తారు. ఏఈ అనుమతి మేరకు లైన్మెన్, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా యాప్‌లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ పనులు బాధ్యతగా జరుగుతాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా యాప్ తగు సూచనలు ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్‌లు పెట్టుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా వంటి జాగ్రత్తలు యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడరింగ్ ఉందా..? ఈ ఫీడర్‌కు వేరే ఫీడర్‌తో అనుసంధానం ఉందా..? వంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా..? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవచ్చా..? అని సంయమనం చేసుకుని సిబ్బంది పనులు పూర్తి చేస్తారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పని కాగానే సంబంధిత లైన్మెన్ యాప్‌లో ఆ సమాచారాన్ని పొందుపరచి విద్యు త్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.అనవసర ఎల్సీలకు చెక్ విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంతో పాటు భద్రతా ప్రమాణాలు పెంచడానికి ఎన్పీడీసీఎల్ ఎల్సీ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. యాప్‌తో ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది. ఏ లైన్‌పై పనులు జరుగుతున్నాయో కూడా సులభంగా తెలుస్తోంది. మొత్తంగా అనవసర ఎల్సీలు తగ్గుతాయి. యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాలు, మానవ తప్పిదాలు, విద్యుత్ ప్రమాదాల నివారించవచ్చు. – గంగాధర్, ఎస్ఈ, మంచిర్యాల