
పొదుపుగా విద్యుత్ వినియోగించాలి
కౌటాల(సిర్పూర్): వినియోగదారులు పొదుపుగా విద్యుత్ వినియోగించాలని ఆ శాఖ ఎస్‌ఈ శేషారా వు అన్నారు. విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని కార్యాలయంలో వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ ఆదా చేయాలని, ఇళ్లలో ఎల్‌ఈడీ బల్బులు వినియెగించాలని సూచించారు. నాణ్యమైన వైర్లు, స్విచ్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ ప్రమాదానికి గురైన వ్యక్తిని కర్ర, ప్లాస్టిక్ పరికరాలతో కా పాడాలని సూచించారు. విద్యుత్ చౌర్యానికి పాల్ప డితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది అ ప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈ వీరేశం, ఏడీఈ రాజేశ్వర్, శ్రీకాంత్, అంజల్‌కుమార్, ఫోర్‌మెన్ నర్సింగరావు పాల్గొన్నారు.
అవగాహన కల్పిస్తున్న అధికారులు