బాక్సింగ్‌తో ఆత్మస్థైర్యం
కాగజ్‌నగర్‌టౌన్: బాక్సింగ్‌తో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. బాక్సింగ్ డే సందర్భంగా శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా సమీపంలో గల నేషనల్ ఫిట్‌నెస్ జిమ్, శివ బాక్సింగ్ క్లబ్‌లను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ, సహనం, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. యువత ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని సూచించారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నివాస్ బాక్సింగ్ క్రీడను యువతకు ఇష్టంగా నేర్పుతున్నాడని ప్రశంసించారు. అనంతరం శిక్షణ పొందుతున్న బాక్సర్లను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు రమాకాంత్ యాదవ్, జాకీర్, శ్రావణ్ గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


