ఘనంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో శుక్రవా రం భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆవి ర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బద్రి సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఏర్పడిన ఈ పార్టీ ప్రజల సమస్యల పరిష్కా రం కోసం అలుపెరుగని పోరాటాలు చేసింద ని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించింద ని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్‌గౌడ్, నాయకులు పిడుగు శంకర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


