డ్రైవర్‌పై కేసు ఎత్తివేయాలని నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ డ్రైవర్‌పై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డిపో గేటు ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ మాట్లాడుతూ రెబ్బెన మండలం దేవులగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం బాధాకరమన్నారు. ఈ విషయంలో డిపో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. డ్రైవర్ రామారావుకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రఫిక్, తాహెర్, రాజు, హరినివాస్, బాలు, విలాస్ పాల్గొన్నారు.


