సీపీఐ మహాసభలు విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న సీపీఐ నాలుగో జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కలవేణ శంకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్యపర్చి ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక బడ్జెట్ ప్రభుత్వం యొక్క కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక ఎజెండాను ప్రతిబింబిస్తుందన్నారు. కార్పొరేట్లకు, బడా వ్యాపారులకు రాయితీలు కొనసాగిస్తూ ఆరోగ్యం, విద్య, గ్రామీణ ఉపాధిహామీ పథకం, సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్రి సత్యనారాయణ, ఆత్మకూరి చిరంజీవి, తాళ్లపల్లి దివాకర్, తదితరులు పాల్గొన్నారు.


