‘పెండింగ్ వేతనాలు చెల్లించేవరకు పోరాటం’
కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మి కుల పెండింగ్ వేతనాలు చెల్లించేవరకు పోరా టం చేస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కా ర్యదర్శి వెలిశాల కృష్ణమాచారి స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం మూడోరోజుకు చేరింది. దీక్ష శిబిరాన్ని కృష్ణమాచారి సందర్శించి మాట్లాడారు. అధికారులు జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించాలన్నారు. మున్సి పల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, నాయకులు మల్లేశ్, లక్ష్మి, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.


