మహాపూజకు రావాలని మంత్రి సీతక్కకు ఆహ్వానం
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలంలోని మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన జంగుబాయి అమ్మవారి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే మహాపూజకు హాజరుకావాలని మంత్రి సీతక్కను బుధవారం డీసీసీ అధ్యక్షురా లు ఆత్రం సుగుణ ఆహ్వానించారు. ములుగు జిల్లా మేడారంలో జంగుబాయి దేవస్థాన్ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈ నెల 30న అధికారికంగా మహాపూజ, దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి తప్పనిసరిగా హాజరవుతానని మాటిచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సలాం శ్యాంరావు, కమిటీ ప్రతినిధులు మరప బాజీరావు, కొడప జాకు, పుర్క బాపూరావు, మరప కోసు తదితరులు ఉన్నారు.


