హ్యాపీ క్రిస్మస్
మరిన్ని కథనాలు 8లోu
కాగజ్‌నగర్‌టౌన్: క్రిస్మస్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా చర్చీలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. ప్రాంగణాల్లో హ్యాపీ క్రిస్మస్ తోరణాలు, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫాతిమా చర్చి, కాపువాడలోని పెంతేకోస్టల్ చర్చి, టీచర్స్ కాలనీలోని మమ్రే బ్రదన్ చర్చీలు గురువారం జరిగే వేడుకలకు ముస్తాబయ్యాయి. పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌నగర్‌లో నిజాం కాలం నుంచే సీఎస్‌ఐ ఆధ్వర్యంలో చర్చీలు ఏర్పాటు చేశారు. మొదట సర్‌సిల్క్ ప్రాంతంలోని ఫాతిమా కాన్వెంట్ సమీపంలో కృపాలయ, ఎస్పీఎం యాజమాన్యం ఆధ్వర్యంలో బాలభారతి సమీపంలో ఎస్పీఎం చ ర్చి ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ 2004లో బస్టాండ్ సమీపంలో సీఎస్‌ఐ చర్చిని నిర్మించారు. క్రైస్తవులు దీనిని దైవమందిరంగా భావించి వివా హ శుభకార్యాలు నిర్వహిస్తుంటారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతోపాటు నాటిక ప్రదర్శనలు, పిల్లల నృత్యాలు, కీర్తనలు చేపట్టనున్నా రు. ఉదయం నుంచి రాత్రివరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.


