శబరిమలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్‌అర్బన్: అయ్యప్ప స్వామి మాల ధరించి భక్తిశ్రద్ధలతో మండల దీక్ష పూర్తిచేసుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి దంపతులు బుధవారం శబరిమలకు బయలుదేరి వెళ్లా రు. ఆలయ అర్చకుడు నగేశ్, గురుస్వాములు సూర్యభాస్కర శర్మ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే దంపతులకు ఇరుముడులు ధరింపజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. మార్గమధ్యలో మంచిర్యాల జిల్లాలోని మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.


