ఏరియాలో సీసీవో పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఏరియాలో సీసీవో పర్యటన

Dec 25 2025 8:25 AM | Updated on Dec 25 2025 8:25 AM

ఏరియా

ఏరియాలో సీసీవో పర్యటన

రెబ్బెన(ఆసిఫాబాద్‌): బెల్లంపల్లి ఏరియాలో బుధవారం కోల్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ ఓఎస్‌డీ, కేజీఎం ఏ.కృష్ణమోహన్‌రావు పర్యటించారు. ఏరియా అధికారులు ఆయనకు గోలేటిలోని జీఎం కార్యాలయంలో స్వాగతం పలికారు. డోర్లి ఓసీపీ– 2 ప్రాజెక్టు అధికారి ఎన్‌.ఉమాకాంత్‌, ఇతర అధికారులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఏరియాలో జరుగుతున్న గనుల కార్యకలాపాలు డోర్లి ఓసీపీ– 2 మైన్‌ క్లోజర్‌ యాక్టివిటీ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డోర్లి ఓసీపీ– 2 ను సందర్శించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్‌ క్వాలిటీ జీఎం వీరభద్రరావు, డీజీఎం ఉజ్వల్‌కుమార్‌ బెహారా, డీజీఎం సివిల్‌ ఎస్‌కే మదీనా బాషా, క్వాలిటీ అడిషనల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌, పర్సనల్‌ హెచ్‌వోడీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్‌ అడిషనల్‌

స్టాండింగ్‌ కౌన్సిల్‌గా రాజేశ్‌

రెబ్బెన(ఆసిఫాబాద్‌): మండలంలోని గోలేటికి చెందిన న్యాయవాది జుమ్మిడి రాజేశ్‌ సెంట్రల్‌ అడిషనల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదించేందుకు రాజేశ్‌ను నియమించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రాజేశ్‌ మాట్లాడుతూ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

ఏరియాలో సీసీవో పర్యటన1
1/1

ఏరియాలో సీసీవో పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement