
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా
వాంకిడి(ఆసిఫాబాద్): దశాబ్దాలుగా నివా సం ఉంటున్న ఇళ్లకు ఇంటి పన్నులు ఇవ్వాలంటూ బుధవారం మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీవాసులు ఆందోళనకు దిగా రు. వంద మందికిపైగా మహిళలు, పురుషులు ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. వారు మాట్లాడుతూ లక్ష్మీనగర్ కాలనీలో తమకు కేటాయించిన స్థలాల్లోనే ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. అధికారులు, పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సీసీ రోడ్డు వేస్తున్నా ఇంటి పన్నులు ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. మండల ప్రత్యేక అధికారి రాథోడ్ బిక్కు దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రత్యేకాధికారి హామీ ఇచ్చారు.