
పట్టణ పేదలకు ‘ఉపాధి’ పనులు కల్పించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): పట్టణ ప్రాంత పేదల కు ఉపాధిహామీ పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీ నర్ ముంజం ఆనంద్‌కుమార్ అన్నారు. మండలంలోని రాంపూర్‌లో మంగళవారం ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కూ లీల వేతన బకాయిలు వెంటనే విడుదల చే యాలని, కూలీలకు రోజుకు రూ.600, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 30న కలెక్టరేట్ ముట్టడి కార్య క్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కూలీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం, శ్రావణి, కూలీలు పాల్గొన్నారు.