
‘సిర్పూర్’ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
కాగజ్‌నగర్‌టౌన్: అసెంబ్లీలో ప్రజల సమస్యలు లేవనెత్తి, సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. ప ట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో తన పై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యాఖ్యలు చేశారని అన్నారు. పదేళ్లపాటు 10 నుంచి 20 కిలోల ధాన్యం కటింగ్ చేయించి అక్రమంగా సంపాదించారని, సిర్పూర్ పేపరు మిల్లును వాడుకుని కార్మికులను నట్టేట ముంచారని, గుర్తింపు సంఘం ఎన్నికల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. కొండపల్లిలో రెండు వేల ఎకరాలు, డబ్బా గ్రామంలో రెండు వేల ఎకరాల చొప్పున వేల ఎకరాల్లో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటారని, దీనికి బాధ్యత ఆనాడు అధికారంలో ఉన్న కోనేరు కోనప్ప ది కాదా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజె క్టు నిర్మిస్తామని స్పష్టం చేశారు. కోనప్ప అసలు ఏ పార్టీలో ఉన్నాడో... ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలే ని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని సహించలేక ఆయన అసహనానికి గురవుతున్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శివ, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, అసెంబ్లీ కన్వీ నర్ గొల్లపల్లి వీరభద్రచారి, మాజీ జెడ్పీటీసీ నీరటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మనోహర్ గౌడ్, తిరుపతి, కుమారస్వామి, తిరుపతి, సదానందం తదితరులు పాల్గొన్నారు.