
అసంపూర్తిగా ‘అప్పపల్లి’
పునాది దశలోనే అప్పపల్లి వంతెన
ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి వాగుపై 2024 ఏప్రిల్‌లో రూ.1.86 కోట్లతో వంతెన పనులు ప్రారంభించారు. పునాది దశలోనే నిలిచి ఏడాది గడుస్తున్నా మళ్లీ ప్రారంభించలేదు. వర్షాలకు అప్పపల్లి, ఆర్‌ఆర్ కాలనీవాసుల ఇబ్బందులు పడుతున్నారు. అంకుసాపూర్‌కు వెళ్లే దారిలోని వాగుపై వంతెన ఎత్తు తక్కువ ఉండటంతో వరద వంతెన పైనుంచి పారుతోంది. సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. గతేడాది వంతెన తెగిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 2023లో అదే గ్రామానికి చెందిన బాలుడు వాగులో పడిపోవడంతో అతడిని రక్షించే క్రమంలో మరో వ్యక్తి మృతి చెందాడు.