ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని సబ్ రిజిస్ట్రార్ అప్పారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. ప్రతిరోజూ 48 స్లాట్ బుకింగ్‌లకు అవకాశం ఉందని తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 24 స్లాట్లు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు 24 స్లాట్లు ఉంటాయని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి.. త్వ రలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం చేస్తామన్నారు. వేలిముద్రతోపాటు ఈ– సిగ్నేచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలి పారు. స్లాట్ బుకింగ్ లేనివారికి సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల మధ్య రోజుకు 5 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తామని వివరించారు. https://registration.telanga na.gov.in ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.


