అర్హులను ఎంపిక చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులైన వారిని ఎంపిక చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రూ.50వేల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంజూరు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. రాజీవ్ యువ వికాసం పథకంలో రూ.50వేల లోపు విలువైన యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితా రూపొందిస్తున్నామన్నారు. జూన్ 2న సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ కేంద్రాల్లో మంజూరు పత్రాలు అందిస్తామని వివరించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, మైనార్టీశాఖ జిల్లా అధికారి నదీమ్, డీటీడీవో రమాదేవి, అదనపు డీఆర్‌డీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కౌటాలలో ఉద్రిక్తత
కౌటాల(సిర్పూర్): ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టుపై ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మా జీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో బుధవారం కౌటాలలో ఉద్రిక్తత నెలకొంది. తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నది వద్ద బహిరంగ చర్చ కో సం జెడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అ నుచరులతో కలిసి వెళ్తుండగా కౌటాలలో పోలీసులు అడ్డుకున్నారు. రైతులను ఎమ్మె ల్యే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మరోవైపు బీజేపీ మండల నాయకులు ప్రాణహిత నదిని సందర్శించారు. 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న కోనేరు కోనప్ప ప్రాణహిత ప్రాజెక్టు తరలివెళ్తున్నా ప ట్టించుకోలేదని మండిపడ్డారు. కోనప్ప అనుచరులు సైతం ప్రాణహిత నదిని సందర్శించారు. పంటలకు సాగునీరు అందించేందుకు కోనప్ప ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు.


