నల్లబ్యాడ్జీలతో కార్మికుల నిరసన
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఆవిర్భావ వే డుకలు సాదాసీదాగా నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంగళవారం బెల్లంపల్లి ఏ రియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలి పారు. వారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా, ప రోక్షంగా లక్షలాది మందికి అన్నం పెడుతున్న సింగరేణి ఆవిర్భావ వేడుకలను కుదించడం సరికాదని అన్నారు.
వేడుకలకు ఏఐటీయూసీ దూరం
గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంతో పాటు గనులు, డిపార్టుమెంట్లలో నిర్వహించి న ఆవిర్భావ వేడుకలను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బహిష్కరించింది. ఖైరిగూర ఓసీపీ వద్ద ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో సింగరేణి పనిచేస్తూ లాభాలను వృథా చేస్తోందని ఆరో పించారు. వేడుకలకు కార్మికులు, వారి కుటుంబాలను దూరం చేయడం సరికాదన్నారు. ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేషశయనరావు, రాజేష్, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.


