బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి, మాదారం ఓసీపీల ఏర్పాటుతో బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం రానుందని ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో మంగళవారం సింగరేణి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా సింగరేణి తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం సింగరేణి పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సింగరేణిలో బెల్లంపల్లి ఏరియాకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. బొగ్గు తవ్వకాలు మొదట బొగ్గుట్టలో ప్రారంభం కాగా, తర్వాత బెల్లంపల్లి లోనే మొదలయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పు డు ఏరియాలో రోజుకు 4వేల టన్నులు సాధించడమే గొప్పగా ఉండేదని, నేడు రోజుకు 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుతున్నామని వె ల్లడించారు. కాలక్రమేణా ఒక్కో గని మూసివేతకు గురవుతూ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ సమయంలోనే యాజమాన్యం గో లేటి, ఎంవీకే ఓసీపీ ఏర్పాటుకు పూనుకుందన్నారు. గోలేటి ఓసీపీని ముందుగా ప్రారంభించుకునేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలి పారు. అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీ ద్వారానే ఉత్పత్తి సాగుతోందని తెలిపారు.
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
యాజమాన్యం నిర్ణయం మేరకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే వ్యయాలను తగ్గించి లా భాలను పెంచుకోవాలన్నారు. గోలేటిలోని ఉద్యో గ కుటుంబాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని బోర్లు వేశామని తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు అందరూ పాటుపడాలని కోరారు. అనంతరం ఏరియాలో ఉత్తమ ఉద్యోగులు, అధికారులను సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో పీవో నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, డీజీఎంలు ఉజ్వల్‌కుమార్, ఎస్‌కే మదీ నాబాషా, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ అధికారిగా ఎంపికై న కోటయ్యను సన్మానిస్తున్న జీఎం విజయ భాస్కర్‌రెడ్డి
సింగరేణి తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న జీఎం విజయ భాస్కర్‌రెడ్డి
బెల్లంపల్లి ఏరియాకు పూర్వవైభవం


