‘సీఆర్‌టీల సమస్యలపై మంత్రి సానుకూలం’
ఆసిఫాబాద్‌రూరల్: సీఆర్‌టీల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర మంత్రి సీతక్క సానుకూలంగా సం్పదించారని టీడబ్ల్యూ సీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. హైదరాబాద్‌లో మంత్రిని జనవరి 3న కలిసి సమస్యలు ప్రస్తావించగా, బుధవారం గిరిజన సంక్షేమశాఖ సెక్రెటరీ శరద్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారని పేర్కొన్నారు. సీఆర్‌టీలు చనిపోతే తక్షణమే సహాయం కింద రూ.30 వేలు, 10 నెలల జీతానికి బదులుగా 12 నెలల జీతం, ఏటా ఆటోమెటిక్ రెన్యూవల్, గ్రీన్ చానల్ ద్వారా ప్రతినెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారని తెలిపారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజేష్, నాయకులు పాల్గొన్నారు.


