కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండె విఠల్ కోరారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలన్నారు. ప్రతీ కార్యకర్త గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, పరిశీలకులు రియాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, నాయకులు సిడాం గణపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల సంక్షేమం
కెరమెరి(జైనూర్): కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం జరుగుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శనివారం జైనూర్ మండలంలోని జంగాంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అనసూయబాయి, తదితరులు పాల్గొన్నారు.


