6వ రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె
కాగజ్‌నగర్‌టౌన్: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. బీఆర్‌ఎస్ నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తోందన్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మిన్హాజ్, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, మల్లేశ్, లక్ష్మి, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.


