రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Dec 28 2025 7:32 AM | Updated on Dec 28 2025 7:32 AM

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు డీఎస్‌వో షేకు తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌ఎం లింబరావు, పీడీ మీనారెడ్డి, కోచ్‌లు అరవింద్‌, విద్యాసాగర్‌ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు మౌనిక, మహేశ్వరి, అక్షిత, గంగూబా యి, అంజలి, తుకుబాయి, అర్తి ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నారాయణపేట జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అండర్‌ 14 ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement