
గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: గంజాయి నిర్మూలనకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులకు వేయింగ్ మిషన్లు అందించా రు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలుగా మారినా, గంజాయి సరఫరా, విక్రయించినా వివరాలను 87126 70551, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. ఆసిఫాబాద్ సీఐ బుద్దె రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.