
టీకాలతో వ్యాధులు దూరం
ఆసిఫాబాద్‌రూరల్: సకాలంలో టీకాలు వేసుకోవడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. ఆసిఫాబాద్ మండలం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంకుసాపూర్ గ్రామంలో బుధవారం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఈ నెల 28లోగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. అవసరం ఉన్న ప్రతిఒక్కరికి టీకాలు వేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సంపత్, పారా మెడికల్ అధికారి శ్యాంలాల్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.