
పెండింగ్ సమస్యలకు సత్వర పరిష్కారం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో నెలకొన్న పెండింగ్ సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గం చూపిస్తామని జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ నాయకులతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి జీఎం కమిటీ సభ్యులతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారంపై చర్చించారు. గోలేటి టౌన్‌షిప్‌కు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని, గోలేటి నుంచి ఎక్స్‌రోడ్ వరకు లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. గోలేటి సీహెచ్‌పీ, ఏరియా వర్క్‌షాప్‌లో మ్యాన్ పవర్ కొరతను పరిష్కరించేందుకు జనరల్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. గోలేటి డిస్పెన్సరీలో కూల్‌వాటర్ సౌకర్యం కల్పించాలని, మాదారం టౌన్‌షిప్‌కు రెండో షిఫ్టులో ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతామని జీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కై రిగూడ ప్రాజెక్టు అధికారి నరేందర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, డీవైజీఎం సివిల్ ఎస్‌కే మదీనా బాషా, అకౌంట్స్ అధికారి రవికుమార్, సీహెచ్‌పీ ఎస్‌ఈ కోటయ్య, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, జీఎం కమిటీ సభ్యులు శేషశయనరావు, రాజేష్, మారిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.