
‘సప్లిమెంటరీ’కి సర్వం సిద్ధం
● నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ● జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2,292 మంది విద్యార్థులు హాజరు కానుండగా, జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 1,487 మంది పరీక్షలు రాయనుండగా, ఇందులో జనరల్ విద్యార్థులు 1,348 మంది, ఒకేషనల్ 139 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 805 మంది పరీక్షలు రాయనుండగా, ఇందులో జనరల్ విద్యార్థులు 709 మంది, ఒకేషనల్‌లో 96 మంది ఉన్నారు.
కేంద్రాలు ఇవే..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియిర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూల్, కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసుంధర జూనియర్ కళాశాలతోపాటు జైనూర్, కెరమెరి, కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే పరీక్షలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. ఫస్టియిర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏడు కేంద్రాల్లో 75 మంది ఇన్విజిలేటర్లు, ఏడుగురు సీఎస్‌లు, ఏడుగురు డీవోలు, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను నియమించారు. అలాగే కలెక్టర్, అదనపు కలెక్టర్ కూడా పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.
నిర్భయంగా పరీక్షలు రాయాలి
సప్లిమెంటరీ పరీక్షలకు 2,295 మంది హాజరు కా నున్నారు. నిర్వహణ కోసం అన్నిఏర్పాటు పూర్తి చేశాం. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నా యి. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి.
– కళ్యాణి, డీఐఈవో

‘సప్లిమెంటరీ’కి సర్వం సిద్ధం