
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో బాల్య వివాహాల ని ర్మూలనకు చర్యలు తీసుకోవాలని జువైనల్ జస్టిస్ బోర్డు చైర్‌పర్సన్ అనంతలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో నాల్స చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చి ల్డ్రన్ స్కీం– 2024పై బుధవారం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ యువరాజతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు బాల్య వివాహ నిషేధ చట్టం– 2006 సెక్షన్ 13 ప్రకారం ఇక నుంచి జూనియర్ సివిల్ జడ్జి ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేయాలని ఆదేశించారు. బాలల హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలకు ఉపేక్షించొద్దన్నారు. హక్కుల రక్షణకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీపీవో మహేశ్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.