
‘బెల్లంపల్లి’లో 78శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా ఏప్రిల్‌లో 78 శాతం ఉత్పత్తి సాధించిందని ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ మచ్చగిరి నరేందర్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఏరియాకు 3.50 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 2.74 లక్షల టన్నులతో 78 శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. కై రిగూడ ఓసీపీ ద్వారా మాత్రమే ప్రస్తుతం ఉత్పత్తి కొనసాగుతోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు 35 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని యాజమాన్యం నిర్దేశించిందని పేర్కొన్నారు. ఓసీపీలో కొ న్ని రకాల పనులతో ఉత్పత్తి తగ్గిందన్నా రు. కైరిగూడ ఓసీపీలో మరో మూడేళ్లపా టు బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుందని, చివరి దశ పనులతో మొత్తంగా నాలుగేళ్ల పాటు కైరిగూడ ఓసీపీ కొనసాగుతుందని తెలిపారు. ఆ లోపు గోలేటి ఓసీపీ, మాదారం ఓసీపీలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్ కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పీవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌చార్జి జీఎం నరేందర్