
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
పెంచికల్‌పేట్(సిర్పూర్): భూభారతి రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు మండలంలోని చేడ్వాయి రైతువేదికలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పెంచికల్‌పేట్ మండలం చేడ్వాయిను పైలట్ గ్రామంగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు వెంకటేశ్వర్‌రావు, కవిత, సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.