
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలి..
కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోయిన నేపథ్యంలో ప్రాణహిత నీటిని వినియోగించుకోవడానికి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణమే పరిష్కారం. ప్రాణహిత నదిపై గతంలో ప్రతిపాదించిన మేరకు ప్రాజెక్టు నిర్మించాలి. జిల్లాలోని వ్యవసాయ భూములకు, ఇతర అవసరాలకు నీటిని అందించవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తాం. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే