
పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగనున్న గ్రామ పాలన అధికారి పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరిగే గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నోడల్ అధికారి ఆధ్వర్యంలో పూ ర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలు, 9.20 గంటల వరకు ప్రశ్నపత్రాలు తరలించాలని తెలిపారు. పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్ చేసి జేఎన్‌టీయూహెచ్‌కు తరలించాలని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సాంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌డీవో లోకేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.