విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలి
చింతలమానెపల్లి: మండలంలోని డబ్బా గ్రామంలో ఈ నెల 12న నిర్వహించనున్న కుమురంభీం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుల్కరి ఉమామహేశ్ కోరారు. శనివారం డబ్బా గ్రామంలో కార్యక్రమం నిర్వంచనున్న స్థలంలో కాంగ్రెస్, ఆది వాసీ నాయకులు ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విగ్రహావిష్కరణకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు పాల్వా యి హరీశ్‌బాబు, వెడ్మ బొజ్జు, కోవ లక్ష్మి, ఆదివాసీ నాయకులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి అధికసంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బెజ్జూర్ మండల కన్వీనర్ కొడప విశ్వేశ్వర్, యువజన విభాగం మండలాధ్యక్షుడు బండి మహేశ్, నా యకులు కొండు శంకర్, జునుగరి శేఖర్, విజయ్, కార్యక్రమ నిర్వహణ అధ్యక్షుడు నారాయణ, ఆదివాసీ నాయకులు కుంరం నందారాం, ఆత్రం బాబురావ్, కుంరం అశోక్, సురేశ్, కుడ్మెత సందీప్, మెస్రం శశికుమార్, అర్జున్ పాల్గొన్నారు.


