అసంపూర్తిగా వంతెనలు
దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గ్రామాలను అనుసంధానించే వంతెనల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రజలు వాగులు, ఒర్రెలు ప్రమాదకరంగా దాటాల్సిన పరిస్థితి. ఆసిఫాబాద్ మండలం గుండి బ్రిడ్జి, అప్పపల్లి కల్వర్టు, కెరమెరి మండలం అనార్‌పల్లి, లక్మాపూర్ వంతెనలు, కాగజ్‌నగర్, వాంకిడి మధ్య కనర్‌గాం వంతెన ఏళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. హ్యామ్ విధానంలో భాగంగా జిల్లాలో 140.16 కిలోమీటర్ల నిడివితో 30 రహదారులు మంజూరయ్యాయి. ఇవి పూర్తయితే కొంతమేర రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
చేపల చెరువులుగా
జలాశయాలు
పంట పొలాలకు సాగు నీరందించేందుకు జిల్లాలో నిర్మించిన కుమురంభీం, వట్టివాగు, అమ్మలమడుగు, ఎన్టీఆర్‌సాగర్ ప్రాజెక్టులు కేవలం చేపల చెరువులు, తాగునీటి సరఫరా కేంద్రాలుగా మారాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. రైతులు ఏటా ఆరుతడి పంటలకే పరిమితం అవుతున్నారు.
అసంపూర్తిగా వంతెనలు


